sold a girl
-
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్‌ఫోన్‌కు అతుక్కుపోయేలా చేసే టిక్‌టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్‌టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్‌టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్‌లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్‌లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్‌లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్కకు పిల్లలు పుట్టరని చెల్లెలు నిర్వాకం.. పసికందు అమ్మమ్మకు విషయం తెలియడంతో..
సాక్షి హైదరాబాద్: మూడురోజుల ఆడ శిశువును విక్రయించిన తల్లిదండ్రులను, కొనుగోలు చేసిన అక్కాచెల్లెలిని, ఆశావర్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఆలూరుకు చెందిన దుర్గాప్రియ, శ్రీనివాస్ దంపతులు కమలానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం దుర్గాప్రియకు కూతురు జన్మించింది.అయితే దుర్గాప్రియ, ఆమె భర్త శ్రీనివాస్‌లు బాలనగర్‌కు చెందిన కవితకు రూ.80 వేలకు విక్రయించేందుకు ఆశావర్కర్ బాషమ్మ ద్వారా ఒప్పందం కుదుర్చుకుని విక్రయించారు. తన సోదరి ధనమ్మకు పిల్లలు పుట్టరని తేలడంతో అక్క కవిత ఈ కొనుగోలు చేసింది. విషయం తెలుసుకున్న దుర్గాప్రియ తల్లి బాలగోని రాజేశ్వరీ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్న సీఐ సత్యనారాయణ విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని చిన్నారిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పజెప్పారు. శిశువును విక్రయించిన తల్లిదండ్రులు దుర్గాప్రియ, శ్రీనివాస్, ఆశావర్కర్ బాషమ్మ, కొనుగోలు చేసిన కవిత,ఆమె సోదరి ధనమ్మలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. (చదవండి: భర్త వేధింపులు.. స్కిన్ ఎలర్జీ తగ్గిస్తానని స్టెరాయిడ్స్ ఇచ్చి) -
కూతురిని అమ్మేశాడు
సాక్షి, హైదరాబాద్: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతుర్ని రూ.3 లక్షలకు అమ్మేశాడు. ఆమెను కొని.. పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు నగరంలో మకాం పెట్టాడు. మరోపక్క బాలిక మిస్సింగ్‌పై రాజస్తాన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైంది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం నగరానికి వచ్చి.. బాలికను గుర్తించడానికి యాచకుల వేషంలో రెండ్రోజుల పాటు మాటు వేసింది. చివరికి చిన్నారి ఆచూకీ కనుగొని రాజస్తాన్‌కు తరలించింది. బాలిక ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా గుర్తించారు. మేనమామ వద్ద దించి వస్తానని.. రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లా సివాన ప్రాంతానికి చెందిన రాజురామ్ మద్యం మత్తులో గత జూన్ 22న తన కుమార్తె (13)ను తీసుకుని ఇంట్లోంచి బయల్దేరాడు. ఆమెను మేనమాన రామ్‌లాల్ వద్ద దించి వస్తానని ఇంట్లో చెప్పాడు. మద్యానికి అవసరమైన డబ్బు కోసం కుమార్తెను అమ్మేయాలని ముందే పథకం వేసిన ఇతగాడు సివాన ప్రాంతానికే చెందిన గోపారామ్ మాలీ సాయం తీసుకున్నాడు. వీరిద్దరూ సన్వాలా రామ్ దాస్పా అనే వ్యక్తితో కలిసి చిన్నారిని బర్మేర్ ప్రాంతానికి చెందిన భరత్‌కుమార్ (32)కు రూ.3 లక్షలకు అమ్మేశారు. తన సోదరుడైన మోహన్‌లాల్ సహకారంతో భరత్ ఆ చిన్నారిని పెళ్లి చేసుకున్నాడు. ఆర్థికంగా స్థితిమంతుడైన భరత్.. బాలికతో కలిసి హైదరాబాద్ నగర శివార్లలోని ఆదిభట్ల పోలీసుస్టేషన్ పరిధి తుర్కయాంజాల్‌లో ఉన్న పరిచయస్తుడి వద్ద ఆశ్రయం పొందాడు. నిలదీసి అడిగితే.. నిజం చెప్పాడు జూన్ 26న బాలిక మేనమామ రామ్‌లాల్ సివానలోని సోదరి వద్దకు వచ్చాడు. చిన్నారి గురించి వాకబు చేయగా, తనకేం తెలియదని చెప్పాడు. దీంతో అనుమానించిన కుటుంబసభ్యులు రాజురామ్ను నిలదీశారు. కుమార్తెను రూ.3 లక్షలకు బర్మేర్‌కు చెందిన వ్యక్తికి అమ్మేశానని, ఇందుకు గోపారామ్ సహకరించాడని చెప్పాడు. దీంతో బాలిక మేనమామ రామ్‌లాల్ ఫిర్యాదుతో జూన్ 30న సివాన ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో రామ్‌లాల్ రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. చిన్నారిని తండ్రే విక్రయించాడని, దాదాపు మూడురెట్ల వయసున్న వ్యక్తితో పెళ్లి చేశాడని తెలిసినా పోలీసులు పట్టనట్లు వ్యవహరించడాన్ని తప్పుపట్టింది. బాలిక కోసం గాలింపు మొదలైందిలా.. సివాన పోలీసుస్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) దౌడ్ ఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం (సిట్) కేసు దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక ఆధారాలతో జూలై చివరి వారంలో చిన్నారి తండ్రి రాజురామ్, దళారిగా వ్యవహరించిన గోపారామ్ను అరెస్టు చేశారు. విచారణలో సన్వాలా రామ్ దాస్పా పేరు బయటికొచ్చింది. అతడిని విచారించగా, బర్మేర్‌కు చెందిన భరత్‌కుమార్‌కు చిన్నారిని అమ్మేశామని, అతడు పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. దీంతో సివాన పోలీసులు భరత్, మోహన్‌లాల్ కోసం గాలింపు ప్రారంభించారు. చాటింగ్ చేయబోతే.. జాడ దొరికింది పోలీసులు గాలిస్తున్నారని తెలిసి భరత్‌కుమార్, మోహన్‌లాల్ తమ సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. రెండుసార్లు హైదరాబాద్ వచ్చిన సివాన పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో గాలించి వెనుదిరిగారు. వారం క్రితం వాట్సాప్‌లో చాటింగ్ చేయడానికి భరత్‌కుమార్ తన సెల్‌ఫోన్ ఆన్ చేశాడు. ఫలితంగా అతడి ఆచూకీ తుర్కయాంజాల్‌లో ఉన్నట్లు సివాన పోలీసులు గుర్తించారు. వెంటనే హెడ్–కానిస్టేబుల్ సేతాన్ సింగ్, మరో కానిస్టేబుల్ సిటీకి వచ్చారు. తమ కదలికలు బయటపడితే భరత్‌కుమార్.. బాలికను తీసుకుని పారిపోతాడని అనుమానించారు. దీంతో యాచకుల వేషంలో రెండురోజుల పాటు తుర్కయాంజాల్ ప్రాంతంలో గాలించారు. చివరకు మంగళవారం బాలికను కనిపెట్టి రెస్క్యూ చేయడంతో పాటు భరత్‌కుమార్, మోహన్‌లాల్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. -
బాలికను విక్రయించిన ముఠా అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలం నాగల్‌గొందికి చెందిన గిరిజన బాలికను రాజస్థాన్‌లో విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక బంధువైన బాయక్క, వాంకిడి మండలానికి చెందిన మధ్యవర్తులు నాందేవ్, భీమేష్, అర్జున్‌లతో కలిసి రాజస్థాన్‌కు చెందిన హరిశంకర్‌తో లక్షా 5వేలకు బేరం కుదర్చుకుంది. బాలికను మాయమాటలతో నమ్మించి రాజస్థాన్‌కు పంపించింది. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్ వెళ్లి బాలికను తీసుకొచ్చారు. బాలికను విచారించిన తర్వాత బాయక్కతో పాటు మధ్యవర్తుల్ని అరెస్టు చేశారు.