ప్రియాంక(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: భర్తతో గొడవ పడి ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన ఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ప్రియాంక(35), శామ్యూల్ దంపతులు. వీరికి రిచల్ శరణ్(6), అభిషేక్‌పాల్(3) సంతానం. ప్రియాంక ఇటీవల భర్తతో గొడవపడి పాతబస్తీ లలితాబాగ్‌లో నివాసముండే సోదరి ప్రసన్న కుమారి ఇంటికి ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లింది.
9వ తేదీన సాయంత్రం ఇద్దరు పిల్లలతో కలిసి బయటకి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment