
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి ఒక బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లోని సిటీ సెంట్రల్ వైపు నుంచి రోడ్డునెంబర్–10 వైపు వెళ్తున్న బెంజ్ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ట్రాఫిక్ పోలీసుల సాయంతో కారు నడుపుతున్న నజీర్ అనే వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించలేదని తేలింది. ప్రమాద సమయంలో కారు యజమానితో పాటు ఆయన భార్య కారులోనే ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మద్యం మత్తులో ఒక మహిళ ఈ ప్రమాదానికి పాల్పడినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు ఎవరు నడుపుతున్నారనేది తేలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment