సాక్షి, హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు.. పుట్‌పాత్‌పైన నిద్రిస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. దీంతో, వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు.. దుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయిఏత, ప్రమాదం జరిగిన తర్వాత వాహనం వదిలి పారిపోయిన కారులోని వ్యక్తులు పారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment