
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్‌లో ఫుడ్‌పాయిజన్ ఘటన కలకలం రేపింది. నందినగర్‌లో వారాంతపు సంతలో రోడ్డుపై అమ్మే మోమోలు తిని పలువురికి ఫుడ్‌పాయిజన్ అయింది. మోమోలు తిన్న సింగాడికుంటకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది.
ఇదే ఘటనలో 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. మోమోల బాధితుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మోమోలు పాయిజన్ అవడంపై బాధితులు సోమవారం(అక్టోబర్ 28) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment