హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy Rain Started Hyderabad On Monday Evening Photo videos | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

Published Mon, Sep 23 2024 7:12 PM | Last Updated on Mon, Sep 23 2024 8:17 PM

Heavy Rain Started Hyderabad On Monday Evening Photo videos

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌. కూకట్‌పల్లి, నిజాంపేట్‌, జేఎన్టీయూ, మూసాపేట్‌లో భారీ వర్షం కురుస్తోంది. కోఠి, వనస్థలిపురం, ఎల్బీనగర్‌లో కుండపోత వాన పడుతోంది.  తార్నాక, ఓయూ క్యాంపస్‌, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, కోఠి, చాంద్రయణగుట్ట, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. 

నగరంలో కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement