
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నటుడు బాలకృష్ణ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది.
వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్-1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో ఉన్న కారు.. బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే, కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక, సదరు కారు.. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment