Nandamoori balakrishna
-
'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం
‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్ టికెట్‌ను బాలకృష్ణకు అందించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్‌గారి అసోసియేషన్‌తో నేను చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శిరీష్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్టైనర్ అండ్ ఓ ఇన్‌డెప్త్ డిస్కషన్ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్లో మా జోష్ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్. ‘‘శిరీష్‌గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్ శశి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్, ‘గీతాఆర్ట్స్’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాధవ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టైటిల్‌కి వేళాయె!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి ‘అన్నగారు’, ‘వీరసింహారెడ్డి’, ‘రెడ్డిగారు’, ‘జై బాలయ్య’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 21న ప్రకటించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. మరి.. తెరపైకి వచ్చిన టైటిల్స్‌లో ఏదైనా ఒకటి ఫిక్స్ అవుతుందా? లేక కొత్త టైటిల్ ఖరారు చేస్తారా? అనే విషయం తెలియాలంటే ఈ నెల 21 వరకు వేచి చూడాలి. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, చంద్రికా రవి(స్పెషల్ నంబరు) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం:తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి. -
బాలయ్య బీభత్సం.. అన్‌స్టాపబుల్ ‘షో’ సరికొత్త రికార్డు
గతంలో వెండితెరపై కనిపించి అలరించిన తారలు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా టెలివిజన్‌లోనూ హోస్ట్‌లుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ జాబితాలో కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, జూ. ఎన్టీఆర్, నాని ఇప్పటికే హోస్ట్‌లుగా వ్యవహరించి టెలివిజన్‌లోనూ తగ్గేదేలే అనిపించారు. అయితే ఈ జాబితాలోకి నందమూరి బాలకృష్ట వస్తాడని ఎవరూ ఊహించి ఉండరూ. ప్రస్తుతం ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్‌షోకు ఊహించని రెస్సాన్స్ వస్తోంది. దీంతో వెండితెరపై మాత్రమే కాదు ఏ తెరపైన అయినా బాలయ్య అడుగు పెడితే రికార్డులు మోత మోగాల్సిందేనని నిరూపించారు. (చదవండి: Balayya: 'దొరికితే దవడ పగిలిపోద్దీ'.. అంటూ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య) ఇప్పటి వరకు తెలుగులో చాలా టాక్షాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షా సాధించినంత విజయాన్ని మాత్రం ఏ షో సాధించలేకపోయాయి. ఎందుకంటే.. నిన్నటి వరకు వెండితెరపై మాత్రమే ప్రేక్షకులను అలరించిన బాలయ్య తొలిసారి హాస్ట్‌గా వ్యవహరిస్తూ తారలను ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. ఈ షో చూసిన కొందరు వింటేజ్ బాలయ్యని చూస్తున్నామని నెట్టింట కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి హిట్ టాక్‌తో ఏ మాత్రం బ్రేకులు లేకుండా దూసుకుపోతుంది. తాజాగా ఈ షో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీ.. టాప్ 10 రియాలిటీ షోల్లో ఒకటిగా నిలిచి రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఉన్న రియాలిటీ షోలలో ఒక తెలుగు రియాలిటీ షోగా బాలయ్య షో నిలిచింది. పలువురు స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 7 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇంకొక మూడు ఎపిసోడ్లు పూర్తయితే.. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుంటుందని సమాచారం. -
సినిమా రేంజ్లో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బాటలోనే నందమూరి బాలకృష్ణ ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో రానున్న ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ ప్రోమో సినిమా టీజర్ కొంచెం కూడా తగ్గకుండా.. బాలయ్యని రేంజ్‌ని ఎలివేట్ చేసేలా ఉంది. ఆ ప్రోమోలో బాలకృష్ణ ఎంతో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ‘నీకు చిత్త శుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు.. నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. ఒన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాల’ బాలయ్య బాబు చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ప్రోమోతో ఆయన చేయబోయే షో మీద ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయేలా ఉన్నాయి. ఈ షో నవంబర్ 4 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. -
ఫోన్ విసిరేసిన బాలకృష్ణ : వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్ : చిత్ర విచిత్ర వ్యాఖ్యలు, వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ట మరోసారి తన ప్రకోపాన్ని ప్రదర్శించారు. సందర్బం ఏదైనా, సమయం ఏదైనా తనకు కోపం వస్తే నేనింతే అంటూ బాలయ్య బాబు రియాక్ట్ అయిన తీరు ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక సినిమా పోస్టర్ రిలీజ్ ఫంక్షన్లో బాలకృష్ణ కోపంతో సెల్ ఫోన్ విసిరేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “'సెహరి” సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచింగ్‌కు నందమూరి బాలకృష్ణ ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ పోస్టర్ రిలీజ్‌కు బాలకృష్ణ సన్నద్దమవుతున్నారు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. అంతే.. జేబులో నుంచి ఫోన్ తీసి పరిశీలించిన బాలయ్య, నెంబర్ చూసి మరీ ఫోన్‌ను అలా గాల్లోకి క్యాచ్ విసిరారు. అలా ఆయన స్టేజిపై నుంచే ఫోన్ విసిరేయటంతో సినిమా యూనిట్ సభ్యులు అంతా ఒక్క క్షణం బిక్క చచ్చిపోయారు. దీంతో నెటిజన్లు వ్యంగ్య కామెంట్లు, మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కోపదారి మనిషికి ఆ సమయంలో ఎవరబ్బా ఫోన్ చేసింది.. ఖచ్చితంగా ఎవరో బాలయ్య బాబుకు కోపం తెప్పించే వ్యక్తి ఫోన్ చేసి ఉంటారంటూ సోషల్ మీడియాలోకామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా సినిమాని ప్రేమించండి.. సినిమా అనేది ఒక ప్యాషన్.. సినిమా అంటే పిచ్చి ఉండకూడదు.. అంటూ చిత్రయూనిట్‌కు బాలయ్య ఇచ్చిన సలహాపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనాకి వ్యాక్సిన్ ఇంకా రాలేదు.. ఇకముందు రాదు కూడా.. దాని సంగతి నాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. (గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్) View this post on Instagram A post shared by Punch Siksha (@punchsiksha) View this post on Instagram A post shared by hakunamatata3 (@hakunamatataaa_3) -
బ్యాగులో పాత కరెన్సీతో బాలకృష్ణ సతీమణి
తిరుపతి ఎయిర్‌పోర్టులో గుర్తింపు రికార్డులున్నాయని ధ్రువీకరణ రేణిగుంట: సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందరాదేవి బ్యాగులో రూ.10లక్షలు బయటపడటం కాస్సేపు కలకలం రేపింది. తిరుమల సందర్శనకు ఆమె హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగారు. చెక్ఔట్ సందర్భంలో ఎయిర్‌బోర్టు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఆమె బ్యాగ్‌లో నగదు కట్టలు గుర్తించినట్లు విమానాశ్రయం సిబ్బంది తెలిపారు. ఆ రూ.10లక్షలు పాతనోట్లకు ఆమె ఐటీ రికార్డులు చూపడంతో, సక్రమంగా ఉన్నట్లు వారు చెప్పారు. ఈ విషయమై ఎయిర్‌పోర్టు డెరైక్టర్ పుల్లాకు సమాచారం ఇచ్చాక, ఆమెను నగదుతోపాటు పంపించినట్లు వెల్లడించారు. తర్వాత ఆమె కుటుంబసభ్యులతో కలసి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లినట్లు తెలిసింది. అయితే ప్రయాణంలో అంత నగదు కూడా ఎందుకు తీసుకువెళ్తున్నారనే అంశం చర్చనీయాంశమైంది. -
విజయాలు లేని సమయంలో ఒక వెలుగునిచ్చింది..!
‘‘లెజెండ్’ ఎవరనే విషయంలో కొంతమంది కొట్టుకుని ఆ పదాన్ని పాపులర్ చేశారు. అసలైన ‘లెజెండ్’ ఎవరో ఈ సినిమాలో చూపించాం. నా దృష్టిలో నిజమైన ‘లెజెండ్’ మా నాన్నగారు ఎన్టీ రామారావుగారే’’ అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘విజయాలు లేని సమయంలో పరిశ్రమకు ఈ సినిమా ఒక వెలుగునిచ్చింది’’ అని చెప్పారు. పబ్లకూ క్లబ్‌లకూ తిరగను! దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ- ‘‘నా కెరీర్లో అతితక్కువ సమయంలో రీరికార్డింగ్ చేసిన సినిమా ఇది. 13 రోజులు రాత్రింబవళ్లూ కష్టపడ్డాను’’ అని చెప్పారు. ఆ తరువాత బోయపాటి మాట్లాడుతూ- ‘‘దేవి 13 రోజుల్లో రీరికార్డింగ్ పూర్తి చేసిన మాట నిజమే. అన్ని రోజులూ నేను అతన్ని వెంటాడి నిద్రపోనివ్వకుండా చేయించు కున్నాను. ఫైనల్ మిక్సింగ్ కూడా దగ్గరుండి తనతోనే చేయించుకున్నాను...’’ అని ఇంకేదో చెప్పబోతుండగా దేవిశ్రీప్రసాద్ మైక్ అందుకొని ఆ వ్యాఖ్యలకు పాజిటివ్‌గానే స్పందిస్తున్నానని చెబుతూనే ఘాటుగా మాట్లాడారు. ‘‘నా బాధ్యతను ఎవ్వరూ గుర్తుచేయనవసరం లేదు. నాకు తెలిసింది సంగీతమే. పిండుకోవడానికి నేనేమన్నా ఆవునా? గేదెనా? నేను పబ్లకూ క్లబ్‌లకూ తిరగను. సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫైనల్ మిక్సింగ్‌కి నేను ఉండననడం కరెక్టుకాదు. ఆ 13 రోజుల్లో ఆయన వున్నది మూడు రోజులు మాత్రమే. ఆ మూడు రోజులు కూడా ల్యాప్‌ట్యాప్‌లో ఇంగ్లీషు సినిమాలు చూస్తూ గడిపారు. ఎవరి క్రెడిట్ వాళ్లకు దక్కాల్సిందే అని నమ్మే వ్యక్తిని నేను. అంతే తప్ప ఎవరిని విమర్శించడానికి ఇది చెప్పడం లేదు’’ అని దేవి స్పందించారు. ఆ తరువాత బోయపాటి మాట్లాడుతూ- ‘‘నేను కూడా అదే చెప్పాలనుకున్నా. ఈలోగా తను తొందరపడి మైక్ లాక్కున్నాడు. దేవి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు’’ అని చెప్పారు.