Aha Released Balakrishna's Unstoppable Talk Show Promo - Sakshi
Sakshi News home page

Balakrishna: సినిమా రేంజ్‌లో బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ ప్రోమో

Published Wed, Oct 27 2021 6:14 PM | Last Updated on Wed, Oct 27 2021 9:19 PM

AHA Released Balakrishna Latest Show Unstoppable Promo - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున బాటలోనే నందమూరి బాలకృష్ణ ఓ టాక్‌ షోని హోస్ట్‌ చే​స్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో రానున్న ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ ప్రోమో సినిమా టీజర్‌ కొంచెం కూడా తగ్గకుండా..  బాలయ్యని రేంజ్‌ని ఎలివేట్‌ చేసేలా ఉంది.

ఆ ప్రోమోలో బాలకృష్ణ ఎంతో స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు.  ‘నీకు చిత్త శుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు.. నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్‌ ఉండదు.. సరదాలో స్టాప్‌ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. ఒన్స్‌ ఐ స్టెప్‌ ఇన్‌.. దెబ్బకు థింకింగ్‌ మారిపోవాల’ బాలయ్య బాబు చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ప్రోమోతో ఆయన చేయబోయే షో మీద ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయేలా ఉన్నాయి. ఈ షో నవంబర్‌ 4 నుంచి ఆహాలో ప్రసారం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement