బ్యాగులో పాత కరెన్సీతో బాలకృష్ణ సతీమణి | nandamoori vasudhara cought with old currency | Sakshi
Sakshi News home page

బ్యాగులో పాత కరెన్సీతో బాలకృష్ణ సతీమణి

Published Sun, Dec 4 2016 3:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

బ్యాగులో పాత కరెన్సీతో బాలకృష్ణ సతీమణి

బ్యాగులో పాత కరెన్సీతో బాలకృష్ణ సతీమణి

తిరుపతి ఎయిర్‌పోర్టులో గుర్తింపు
రికార్డులున్నాయని ధ్రువీకరణ

రేణిగుంట: సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందరాదేవి బ్యాగులో  రూ.10లక్షలు బయటపడటం కాస్సేపు కలకలం రేపింది. తిరుమల సందర్శనకు ఆమె హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగారు. చెక్‌ఔట్ సందర్భంలో ఎయిర్‌బోర్టు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఆమె బ్యాగ్‌లో నగదు కట్టలు గుర్తించినట్లు విమానాశ్రయం సిబ్బంది తెలిపారు.


ఆ రూ.10లక్షలు పాతనోట్లకు ఆమె ఐటీ రికార్డులు చూపడంతో, సక్రమంగా ఉన్నట్లు వారు చెప్పారు. ఈ విషయమై ఎయిర్‌పోర్టు డెరైక్టర్ పుల్లాకు సమాచారం ఇచ్చాక, ఆమెను నగదుతోపాటు పంపించినట్లు వెల్లడించారు. తర్వాత ఆమె కుటుంబసభ్యులతో కలసి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లినట్లు తెలిసింది. అయితే ప్రయాణంలో అంత నగదు కూడా ఎందుకు తీసుకువెళ్తున్నారనే అంశం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement