బాలయ్య డాకు మహారాజ్‌.. తొలి రోజు ఎన్ని కోట్లంటే? | Nandamuri Balakrishna Latest Movie Daaku Maharaaj box office Day 1 | Sakshi
Sakshi News home page

Daaku Maharaaj Collections: బాలయ్య డాకు మహారాజ్‌.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?

Jan 13 2025 12:20 PM | Updated on Jan 13 2025 12:51 PM

Nandamuri Balakrishna Latest Movie Daaku Maharaaj box office Day 1

బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే సక్సెస్ టాక్ రావడంతో అందరి దృష్టి కలెక్షన్లపై పడింది.

డాకు మహారాజ్‌ మొదటి రోజు వసూళ్ల పరంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్‌ స్థానం దక్కించుకుంది. 

యూఎస్‌లో అరుదైన రికార్డ్..

బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టింది.  మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.డాకు మహారాజ్‌ ట్రైలర్‌ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

ఆకట్టుకుంటున్న బాలయ్య డైలాగ్స్

బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకుంటున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్‌‌ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.  'సింహం న‌క్క‌ల‌ మీద‌ కొస్తే వార్ అవ్వ‌దు'.. 'వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చ‌చ్చేవాడు కాదు’.. లాంటి డైలాగ్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్‌, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.

దేశీయంగా నెట్ వసూళ్లు ఎంతంటే?

ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ.22.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాత్రలో అభిమానులను అలరించింది. 

డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ..

డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో ‍అలరించిన ముద్దుగుమ్మ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

సాంగ్‌పై విమర్శలు..

డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement