బన్నీ- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన పుష్పరాజ్.. మరో అరుదైన ఘనతను సాధించాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ దూసుకెళ్తున్నాడు. తాజాగా పుష్ప-2 మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
నేపాల్‌లో విడుదలైన 20 రోజుల్లోనే రూ.24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో నేపాల్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా నేపాల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఘనతను సొంతం చేసుకుంది. నేపాల్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్-3లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.
కాగా.. ఈనెల 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 రిలీజైంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. తొలిరోజే రూ.294 కోట్లతో మొదలైన ప్రభంజనం కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్కును చేరుకుంది. తాజాగా విడుదలైన కలెక్షన్స్ చూస్తే 21 రోజుల్లోనే రూ.1700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇదో జోరు కొనసాగితే త్వరలోనే రూ.2000 వేల కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
#Pushpa2TheRule is now the HIGHEST GROSSING FOREIGN FILM EVER IN NEPAL with a gross of 24.75 CRORES in 20 days 💥💥
It is one of the biggest blockbusters at the Nepal Box Office and is among the TOP 3 GROSSERS OF ALL TIME ❤️🔥
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/c6DD3mlPSm— Pushpa (@PushpaMovie) December 26, 2024
Comments
Please login to add a commentAdd a comment