
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తియినప్పటికీ వసూళ్ల రాబట్టడంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. తొలి రోజు నుంచి రికార్డుల సునామీ సృష్టిస్తోన్న పుష్పరాజ్.. మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీలో మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
బాలీవుడ్‌లో రికార్డ్ స్థాయి వసూళ్లు..
సుకుమార్- బన్నీ కాంబోలో పుష్ప-2 హిందీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఈ వసూళ్లు కేవలం 31 రోజుల్లోనే పుష్ప-2 సాధించింది. ఈ కలెక్షన్లతో రూ.800 కోట్ల అరుదైన క్లబ్‌లో చేరింది. ఇప్పటికే హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. 28 రోజుల్లో దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది.
ఓవర్‍సీస్‌లోనూ హవా..
ఓవర్‌సీస్‌లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోనూ, నేపాల్ పుష్ప-2 కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్స్ చేసిన మూవీగానూ ఘనతను సొంతం చేసుకుంది.
కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..
ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది.
వివాదంలో పుష్పరాజ్..
అయితే ఈ మూవీ విడుదలకు ముందు రోజు విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన అల్లు అర్జున్‌ను కూడా అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల నాంపల్లి కోర్టు సైతం బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఆస్పత్రిలో మహిళ కుమారుడు..
సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ కుమారుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పుష్ప నిర్మాతలు, అల్లు అరవింద్ ఆ బాలుడిని పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల సాయం ప్రకటించారు. ఇప్పటికే వారి ఫ్యామిలీకి చెక్కులు కూడా అందజేశారు.
Brand #Pushpa inagurates 𝟖𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄 CLUB in Hindi ❤🔥#Pushpa2TheRule has a RECORD BREAKING COLLECTION in Hindi with 𝟖𝟎𝟔 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐍𝐄𝐓𝐓 in 31 days 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun… pic.twitter.com/bRAgO99ygp— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2025