
అల్లు అర్జున్ పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డ్‌ను పుష్పరాజ్ క్రియేట్ చేశాడు. తొలిరోజే రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది పుష్ప-2. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.
(ఇది చదవండి: అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ)
అయితే పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన పది రోజుల్లోనే నార్త్‌లో రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది. ఇప్పటికే హిందీలో తొలిరోజు రూ.74 కోట్లతో మొదలైన పుష్పరాజ్ ఊచకోత ఇంకా కొనసాగుతోంది. తాజాగా టెన్ డేస్‌లో రూ.507 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
#Pushpa2TheRule breaches another record-breaking milestone ❤️🔥
Crosses 500 CRORES NETT in Hindi in just 10 days - THE FASTEST FILM IN HINDI to do so 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/CwpYUbf2o7— Pushpa (@PushpaMovie) December 15, 2024