బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.
కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోనూ అత్యధిక వసూళ్లు తొలి ఇండియన్ మూవీగా ఘనత సాధించింది. అటు యూఎస్‌లోనూ తిరుగులేని కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు.
#Pushpa2 creates a new RECORD in 100 Years of BOLLYWOOD HISTORY 🔥🔥🔥#Pushpa2TheRule becomes the BIGGEST HINDI NETT of ALL TIME in just 15 days 💥💥💥 #HargizJhukegaNahin pic.twitter.com/uLmeZ0yoYJ
— Pushpa (@PushpaMovie) December 20, 2024
The NUMBER ONE BLOCKBUSTER in the HISTORY OF HINDI CINEMA 🔥🔥#Pushpa2TheRule collects 632.50 CRORES NETT in Hindi - THE HIGHEST EVER FOR ANY HINDI FILM ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa pic.twitter.com/LWJa7W2JxT— Pushpa (@PushpaMovie) December 20, 2024
Comments
Please login to add a commentAdd a comment