ఇటీవల థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఐకాన్ స్టార్ మూవీ తొలిరోజే ఏకంగా రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు రాని రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మూడు రోజుల్లోనే రూ.621 కోట్ల కలెక్షన్స్‌తో పుష్పరాజ్ దూసుకెళ్తున్నాడు.
నార్త్‌లో వసూళ్ల ఊచకోత..
ఇక హిందీ విషయానికొస్తే మొదటి రోజే అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డ్ సాధించింది. మొదటి రోజే ఏకంగా రూ.72 కోట్ల వసూళ్ల షారూఖ్ ఖాన్ సినిమాను వెనక్కి నెట్టేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్లతో తన రికార్డ్‌ను తానే తిరగరాశాడు. ఇక నాలుగోరోజు ఆదివారం కావడంతో అన్ని రికార్డులు బద్దలయ్యాయి. ఏకంగా రూ.86 కోట్ల నెట్ వసూళ్లతో ప్రభంజనం సృష్టించాడు పుష్పరాజ్. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.291 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. హిందీలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇప్పటికే జవాన్, పఠాన్, యానిమల్, గదర్- 2 సినిమాలను అధిగమించింది. డిసెంబర్ 5న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే పలు రికార్డులను బద్దలు కొట్టింది.
పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులు
అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్:
పుష్ప 2 హిందీ వర్షన్ భారతదేశంలో రూ. 72 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. దీంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల వసూళ్లను రాబట్టిన షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని అధిగమించింది.
అత్యధిక నాన్-హాలిడే ఓపెనింగ్: నాన్ హాలీడే గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓ ప్రత్యేక మైలురాయిని సాధించింది.
అత్యధిక నాన్-ఫెస్టివల్ ఓపెనింగ్: ఈ మూవీ విడుదల సమయంలో ఎలాంటి పండుగ లేకపోయినా ఆల్‌టైమ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలిగింది.
హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్: హిందీ వెర్షన్‌లో భాగంగా ఇండియాలో కేవలం నాల్గో రోజు(ఒక్క రోజు) రూ. 86 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
అత్యంత వేగంగా రూ.250 కోట్లు: భారతదేశంలో అత్యంత వేగంగా రూ.250 కోట్ల మార్కును అధిగమించిన హిందీ వర్షన్ చిత్రంగా పుష్ప- 2 నిలిచింది. డిసెంబర్ 8 (ఆదివారం) నాడు ఈ మైలురాయిని సాధించింది.
అత్యధిక వీకెండ్ ఒపెనింగ్: పుష్ప 2 హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 291 కోట్ల నెట్ వసూళ్లు ఆర్జించింది.
A HISTORIC SINGLE DAY in Hindi ❤️🔥#Pushpa2TheRule collects a Nett of 86 CRORES on Day 4 - creating an all time record of the HIGHEST Hindi collection in a single day 🔥
The Wildfire Blockbuster also becomes the fastest Hindi film to reach 291 CRORES NETT in just 4 days 💥💥… pic.twitter.com/Jarw91cHNk— Pushpa (@PushpaMovie) December 9, 2024
Comments
Please login to add a commentAdd a comment