పుష్ప రాజ్‌ వసూళ్ల సునామీ.. రెండు వారాల్లోనే ఆ మార్క్ దాటేశాడు! | Allu Arjun Pushpa 2 The Rule Collections In Just Two Weeks | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule Collections: బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్‌ సునామీ.. రెండు వారాల్లో ఎన్ని కోట్లంటే?

Published Thu, Dec 19 2024 7:34 PM | Last Updated on Thu, Dec 19 2024 7:54 PM

Allu Arjun Pushpa 2 The Rule Collections In Just Two Weeks

అల్లు అర్జున్‌- సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్‌ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ చేరుకున్న పుష్ప-2 కలెక్షన్ల మాస్ జాతర ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నార్త్‌లో ఏకంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు పుష్పరాజ్.

ఇప్పటికీ పుష్ప-2 రిలీజై రెండు వారాలు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ అధికారికంగా పుష్ప-2 వసూళ్లను రివీల్ చేశారు. ఈ మూవీ విడుదలైన 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల మార్క్‌ను దాటేసింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత వేగంగా 1500 కోట్ల వసూళ్ల సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement