బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్‌గా పుష్ప-2 వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లతో దూసుకెళ్తోన్న పుష్పరాజ్.. ఏకంగా ఆస్ట్రేలియాలో కలెక్షన్ల వర్షం కురిపించాడు. దాదాపు 4 మిలియన్ డాలర్ల వసూళ్ల రాబట్టినట్లు పుష్ప టీమ్ పోస్టర్‌ను షేర్ చేసింది.
ఈ వసూళ్లతో ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 ఘనత సాధించింది. గతంలో ఏ సినిమా సాధించని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ఇండియాలో మాత్రమే కాదు.. పుష్పరాజ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉందని అర్థమవుతోంది. ఈ వసూళ్లు చూస్తుంటే ఈ సినిమాలో పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అనే డైలాగ్‌ను మరిపిస్తోంది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా పుష్ప-2 వసూళ్లు రాబట్టింది. ఇదే ఊపు కొనసాగితే మరో కొద్ది రోజుల్లోనే రెండు వేల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని పుష్ప సీక్వెల్‌గా తెరకెక్కించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
పుష్పకు వీరాభిమాని డేవిడ్ వార్నర్..
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ అంటే వార్నర్‌కు పిచ్చి అభిమానం. ఆయన సినిమాలో మేనరిజం, డైలాగ్స్‌ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు వార్నర్. చాలాసార్లు బన్నీ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ వీడియోలు కూడా చేశారు.
THE HIGHEST GROSSING INDIAN FILM IN AUSTRALIA in 2024 ❤🔥#Pushpa2TheRule hits A$ 4 MILLION gross and going strong at the Australian Box Office 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/gYxgLbrzrv— Pushpa (@PushpaMovie) December 18, 2024
Comments
Please login to add a commentAdd a comment