తగ్గిన పుష్పరాజ్ కలెక్షన్స్‌.. 22 రోజుల్లో ఎన్ని కో‍ట్లంటే? | Allu Arjun Sukumar Movie Pushpa 2 Collections In Just 22 Days | Sakshi
Sakshi News home page

Allu Arjun: పుష్ప-2 కలెక్షన్స్.. ఆ మార్క్ చేరుకోవడం కష్టమే!

Published Fri, Dec 27 2024 3:57 PM | Last Updated on Fri, Dec 27 2024 5:01 PM

Allu Arjun Sukumar Movie Pushpa 2 Collections In Just 22 Days

అల్లు అర్జున్‌- సుకుమార్‌ మాస్ యాక్షన్‌ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ‍ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. హిందీలో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని రికార్డ్ స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పుష్పమానియా కొనసాగుతోంది.

తాజాగా పుష్పరాజ్ మరో రికార్డ్ సృష్టించాడు. ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే రూ.1719 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో  ఇండియన్ సినీ చరిత్రలో ‍అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించినప్పటికీ.. తాజా వసూళ్లు చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం కాస్తా కష్టంగానే అనిపిస్తోంది.

కాగా.. 2021లో వచ్చిన పుష్ప పార్ట్‌-1 చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ పార్ట్-3 కూడా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌ పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement