బాలయ్య బీభత్సం.. అన్‌స్టాపబుల్‌ ‘షో’ సరికొత్త రికార్డు | Nbk Aha Unstoppable Reality Show Creates India Record Imdb Rating | Sakshi
Sakshi News home page

Unstoppable With Nbk Show Record Imdb Rating: తగ్గేదెలే.. అన్‌స్టాపబుల్‌ ‘షో’ సరికొత్త రికార్డు

Published Thu, Jan 6 2022 6:15 PM | Last Updated on Fri, Jan 7 2022 6:03 AM

Nbk Aha Unstoppable Reality Show Creates India Record Imdb Rating - Sakshi

గతంలో వెండితెరపై కనిపించి అలరించిన తారలు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా టెలివిజన్‌లోనూ హోస్ట్‌లుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ జాబితాలో కింగ్‌ నాగార్జున, మెగాస్టార్‌ చిరంజీవి, జూ. ఎన్టీఆర్‌, నాని ఇప్పటికే హోస్ట్‌లుగా వ్యవహరించి టెలివిజన్‌లోనూ తగ్గేదేలే అనిపించారు. అయితే ఈ జాబితాలోకి నందమూరి బాలకృష్ట వస్తాడని ఎవరూ ఊహించి ఉండరూ. ప్రస్తుతం ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌‌ విత్‌ ఎన్‌బీకే’ టాక్‌షోకు ఊహించని రెస్సాన్స్‌ వస్తోంది. దీంతో వెండితెరపై మాత్రమే కాదు ఏ తెరపైన అయినా బాలయ్య అడుగు పెడితే రికార్డులు మోత మోగాల్సిందేనని నిరూపించారు. (చదవండి: Balayya: 'దొరికితే దవడ పగిలిపోద్దీ'.. అంటూ వార్నింగ్‌ ఇచ్చిన బాలయ్య)

ఇప్పటి వరకు తెలుగులో చాలా టాక్‌షాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే టాక్‌ షా సాధించినంత విజయాన్ని మాత్రం ఏ షో సాధించలేకపోయాయి. ఎందుకంటే.. నిన్నటి వరకు వెండితెరపై మాత్రమే ప్రేక్షకులను అలరించిన బాలయ్య తొలిసారి హాస్ట్‌గా వ్యవహరిస్తూ తారలను ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. ఈ షో చూసిన కొందరు వింటేజ్‌ బాలయ్యని చూస్తున్నామని నెట్టింట కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఈ షో మొదటి ఎపిసోడ్‌ నుంచి హిట్‌ టాక్‌తో ఏ మాత్రం బ్రేకులు లేకుండా దూసుకుపోతుంది. తాజాగా ఈ షో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.

  ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీ.. టాప్ 10 రియాలిటీ షోల్లో ఒకటిగా నిలిచి రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఉన్న రియాలిటీ షోలలో ఒక తెలుగు రియాలిటీ షోగా బాలయ్య షో నిలిచింది. పలువురు స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 7 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇంకొక మూడు ఎపిసోడ్లు పూర్తయితే.. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుంటుందని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement