Siddhu Jonnalagadda DJ Tillu Movie New Record In Aha OTT, Deets Inside - Sakshi
Sakshi News home page

DJ Tillu Movie: ఓటీటీలో 'ఆహా' అనిపిస్తున్న 'డీజె టిల్లు'.. రెండు రోజుల్లోనే

Published Sun, Mar 6 2022 9:07 PM | Last Updated on Mon, Mar 7 2022 10:51 AM

Siddhu Jonnalagadda Starrer DJ Tillu Movie New Record In Aha OTT - Sakshi

Siddhu Jonnalagadda Starrer DJ Tillu Movie New Record In Aha OTT: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డీజె టిల్లు’. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 12 ఏళ్లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల అభిమానం పొందాడు హీరో సిద్ధు. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలైంది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లుగాడు ప్రేక్షకులకు బాగా నచ్చాడు. ఈ సినిమాను ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల చేశారు మేకర్స్​. అక్కడ కూడా తన సత్తా చాటుతూ 'అట్లుంటది మనతోని' అంటూ దుమ్మురేపుతున్నాడు.

ఆహాలో విడుదలైన 48 గంటల్లోనే 100 మిలియన్​ స్ట్రీమింగ్​ నిమిషాలను పూర్తి చేసుకున్నాడు డీజె టిల్లు. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా ఆహా ప్రకటించింది. దీంతో మేకర్స్​ తెగ సంతోషిస్తున్నారు. హీరోహీరోయిన్ల నటనతోపాటు శ్రీచరణ్​ పాకాల పాటలు, తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాను బంపర్​ హిట్​గా మార్చాయని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు ఇచ్చిన ఈ విజయంతో దీనికి సీక్వెల్​ తెరకెక్కించే ప్లాన్​లో ఉన్నారట నిర్మాతలు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement