rating
-
అర్జున్‌ది అరుదైన ఘనత
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ఎలో రేటింగ్స్‌లో తెలంగాణ స్టార్ చెస్ ప్లేయర్, గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2800 పాయింట్ల మైలురాయిని అందుకోవడం అరుదైన ఘనత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘2800 ఎలో రేటింగ్ మైలురాయిని చేరుకున్న అర్జున్‌కు అభినందనలు. ఇది అసాధారణ ఘనత. మొక్కవోని పట్టుదల, నిలకడైన ప్రదర్శనతోనే ఇది సాధ్యమవుతుంది. జాతి గర్వపడే క్షణాలివి. వ్యక్తిగతంగానూ గొప్ప స్థాయికి చేరావు. మరెంతో మంది యువత చెస్ ఆడేందుకు, ఈ క్రీడను ఎంచుకొని ప్రపంచ వేదికలపై రాణించేందుకు స్ఫూర్తిగా నిలిచావు. భవిష్యత్తులోనూ ఇదేరకంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో మూడు రోజుల క్రితం అర్జున్ 2800 ఎలో రేటింగ్స్‌ను అందుకున్నాడు. భారత్‌లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, ఓవరాల్‌గా 16వ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ఆదివారం యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ముగిశాక అర్జున్ లైవ్ రేటింగ్ 2800 లోనికి వచ్చింది. ప్రస్తుతం అతని లైవ్ రేటింగ్ 2798కు చేరింది. యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో అర్జున్ ప్రాతినిధ్యం వహించిన అల్కాలాయిడ్ క్లబ్ ఓపెన్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. -
వొడాఫోన్‌కు గోల్డ్‌మన్ శాక్స్ షాక్
న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా రానున్న 3–4 ఏళ్ల కాలంలో తగ్గుతూనే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా అభిప్రాయపడింది. వొడాఫోన్ ఐడియా ఇటీవల చేపట్టిన మూలధన సమీకరణ సానుకూల అంశమే అయినప్పటికీ మార్కెట్ వాటా కోల్పోవడాన్ని అరికట్టబోదని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. రానున్న 3–4 ఏళ్లలో 300 బేసిస్ పాయింట్ల(3 శాతం)మేర మార్కెట్ వాటాకు కోత పడనున్నట్లు అంచనా వేసింది. ఈ సందర్భంగా పెట్టుబడి వ్యయాలు, ఆదాయ మార్కెట్ వాటా మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ప్రస్తావించింది. వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ప్రత్యర్ధి కంపెనీలు 50 శాతం అధికంగా పెట్టుబడులను వెచి్చస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల నిధులను సమీకరించడం ఈ టెలికం కంపెనీకి సానుకూల అంశమేనని, అయితే మార్కెట్ వాటా బలహీనపడటాన్ని నివారించలేదని విదేశీ బ్రోకింగ్ సంస్థ వ్యాఖ్యానించింది. వెరసి సానుకూల ధోరణితో చూస్తే షేరు అంచనా విలువను రూ. 19గా పేర్కొంది. ప్రస్తుత రేటు(గురువారం ముగింపు)తో పోలిస్తే 26 శాతం అధికమైనప్పటికీ బేస్కేసుగా చేసిన మదింపుతో చూస్తే మాత్రం 83 శాతం పతనంకావచ్చని తెలియజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి వొడాఫోన్‌కు సర్దుబాటుచేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్) స్పెక్ట్రమ్ సంబంధ చెల్లింపులు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది. వీటిలో కొంతమేర బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి అవకాశమున్న విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఫ్రీక్యా‹Ùఫ్లో స్థితికి చేరేందుకు ఏఆర్పీయూ రూ. 200–270కు జంప్చేయవలసి ఉన్నట్లు అంచనా వేసింది. సమీపకాలంలో ఇది జరిగేందుకు అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. టారిఫ్‌ల పెంపు, పెట్టుబడుల సమీకరణ నేపథ్యంలోనూ 2025 మార్చికల్లా నికర రుణభారం– నిర్వహణ లాభం(ఇబిటా) నిష్పత్తి మెరుగుపడకపోవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 11.5% పతనమై రూ. 13.36 వద్ద ముగిసింది. -
ప్రత్తిపాడు సర్కిల్ అ‘ధర’హో
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ‘త్రీ స్టార్’ రేటింగ్ అదిరిపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వేలం వేసి మరీ పోస్టులు ఖాయం చేశారు. ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓ సర్కిల్ పోస్టు అర కోటికి ఖరారు కాగా.., ఇప్పుడు ప్రత్తిపాడు సర్కిల్ రూ. 30 లక్షలకు బేరం కుదిరినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో ప్రత్తిపాడు సర్కిల్ హాట్ సీటు. ఈ సర్కిల్ కోసం కొందరు ‘త్రీ స్టార్’లు ఓ నాయకుడి చుట్టూ నెల రోజులుగా తిరగ్గా.. గురువారం పోస్టు భర్తీ అయ్యింది. ప్రత్తిపాడుతో పాటు తుని, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో త్రీ స్టార్ రేటింగ్ అదిరిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి చూడలేదని పోలీసులే విస్తుబోతున్నారు.సర్వం షాడో ఎమ్మెల్యేనే..ఇటీవలి ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి అన్నీ తానై వ్యవహరించి, ఇప్పుడు ఎమ్మెల్యేకు షాడోగా వ్యవహరిస్తున్న నాయకుడే పోలీసు బదిలీలు అన్నింటినీ ఫైనల్ చేస్తున్నారు. ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఒక సర్కిల్ పోస్టును రూ.అర కోటికి ఖాయం చేశారు. ఈ పోస్టు కోసం ఇద్దరు ముగ్గురి మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. చివరకు తన సర్వీసులో ఎక్కువ కాలం కాకినాడలోనే పనిచేసిన ఓ ‘త్రీ స్టార్’ అడిగినంతా ఇచ్చుకుని పోస్టు ఎగరేసుకుని పోయారు. ఇప్పుడు ప్రత్తిపాడుకు రూ. 10 లక్షల నుంచి మొదలై రూ.30 లక్షలకు ఖరారైంది. అందుకే అంత ధర!నాలుగు స్టేషన్లు ఉన్న ప్రత్తిపాడు సర్కిల్ అధికారులకు ఆయిల్ మాఫియా నుంచి నెల నెలా రూ.లక్షల్లో రాబడి వస్తుంది. మిగతా ఆదాయమూ పెద్దగానే ఉంటుంది. గతంలో ఈ ప్రాంతంలో ఎస్ఐగా పనిచేస్తూ కల్తీ ఆయిల్ వ్యవహారంలో రూ.లక్షలు లంచం తీసుకొని ట్యాంకర్‌ను వదిలేసి, సస్పెండైన ఓ పోలీసు అధికారి, గుప్త నిధుల వ్యవహారంలో దొంగ సొమ్మునే దోచేసి చివరకు అసలు నిందితుడు పట్టుబడడంతో 2020లో సస్పెండైన మరో అధికారి కూడా ప్రత్తిపాడు కోసం ప్రయత్నించారు. ఇక కాకినాడ సిటీ నియోజకవర్గంలో మూడు, రూరల్‌లో రెండు, పెద్దాపురం నియోజకవర్గంలో ఒక సర్కిల్ పోస్టుకు ఒక్కో దానికి రూ.20 లక్షలు పైనే బేరం పెట్టినట్లు సమాచారం. -
మన డిస్కంలు ‘ఏ’ గ్రేడ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో ఏపీలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్రానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. డిస్కంల పనితీరును అంచనా వేసి, వినియోగదారులకు తమ డిస్కం అందిస్తున్న సేవల నాణ్యత గురించి తెలియజేసేందుకు ఆర్ఈసీ అధ్యయనం చేపట్టింది. ‘కన్స్యూమర్ సర్విస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్ 2022–23’ పేరుతో ఆ నివేదికను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఏపీలో 1.92 కోట్ల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు డిస్కంలకు ఏ–గ్రేడ్ లభించింది. దేశంలోని 62 డిస్కంలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం చేసినట్లు ఆర్ఈసీ పేర్కొంది. అధ్యయనంలో భాగంగా డిస్కంలను జనరల్, అర్బన్, ప్రత్యేక వర్గంగా విభజించారు. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి, వారు చెప్పిన దాని ప్రకారం స్కోర్ ఇచ్చారు. ఆ స్కోర్ ఆధారంగా ‘ఏ+, ఏ, బి+, బి, సి+, సి, డి+, డి’ అంటూ 7 విభాగాల్లో వినియోగదారుల సేవా రేటింగ్లను కేటాయించారు. ఈ 3వ ఎడిషన్‌లో కేవలం 4 డిస్కంలు మాత్రమే ‘ఏ+’ గ్రేడ్ సాధించాయి. ‘ఏ’ గ్రేడ్‌లో ఏపీతోపాటు 8 రాష్ట్రాల డిస్కంలకు స్థానం లభించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. ‘రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగానే వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ దేశంలో అత్యుత్తమంగా నిలవగలుగుతున్నాం. ప్రభుత్వ ఆర్థక సాయంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. వాటి ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచుకుని నష్టాలు తగ్గించుకుంటున్నాం’. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ ఆదర్శంగా నిలుస్తున్నాం ‘డిస్కంలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటోంది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించడంలో రాజీపడకుండా దేశంలో మరెక్కడా లేనంతగా రైతులకు విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. దీనికి రా>నున్న 30 ఏళ్ల వరకూ ఎలాంటి అవాంతరాలు రాకుండా సెకీతో 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.’ – ఐ.పృథ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
కేప్‌టౌన్ పిచ్‌పై ‘అసంతృప్తి’
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరిగిన కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదు సెషన్లలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో వాడిన పిచ్ సంతృప్తికరంగా లేదని అభిప్రాయ పడింది. ఈ టెస్టుకు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ తన నివేదికను ఐసీసీకి అందించారు. దీని ప్రకారం న్యూలాండ్స్ పిచ్‌కు ఒక డీ మెరిట్ రేటింగ్ ఇచ్చారు. -
‘రేటింగ్’ పేరుతో చీటింగ్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారని, గూగుల్ మ్యాప్‌లోని ప్రాంతాలకు రేటింగ్ ఇవ్వాలంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు. ఇందుకోసం ఏకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఐటీ) నుంచి పంపుతున్నట్టుగా నకిలీ ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. వారు పంపే లింక్‌లపై క్లిక్ చేసి అందులో వచ్చే గూగుల్ మ్యాప్‌లో వారు చెప్పిన ప్రాంతానికి రేటింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒక్కో రేటింగ్‌కు రూ.150 ఇస్తామని, ఇలా రోజుకు కనీసం రూ.5 వేల వరకు సంపాదించవచ్చని ఊదరగొడుతున్నారు. ఎవరైనా ఇది నిజమని నమ్మితే ఒకటి, రెండుసార్లు డబ్బులు పంపి..ఎదుటి వ్యక్తికి నమ్మకం కుదిరిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నా రు. బ్యాంకు ఖాతాల వివరాలు..ఆధార్, పాన్‌కార్డు వివరాలు సేకరించడం..లింక్‌లో ఓటీపీ నమోదు చేయాలని చెబుతూ ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే తరహాలో కొన్ని నెలల క్రితం సోమాజిగూడకు చెందిన ఒక యువకుడు గూగుల్ మ్యాపింగ్ రేటింగ్ స్కాంలో చిక్కి రూ.74 వేలు పోగొట్టుకున్నాడని తెలిపారు. -
జవాన్ సినిమాకు రేటింగ్ ఇస్తే డబ్బులొస్తాయని మెసేజ్..
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండకు చెందిన ఓ గృహిణి వాట్సాప్‌కు ‘జవాన్’ సినిమాకు రేటింగ్ ఇస్తే డబ్బులొస్తాయని మెసేజ్ వచ్చింది. ఆశ్చర్యపోతూనే..నేరస్తులు పంపిన నాలుగైదు సినిమాలకు రేటింగ్, రివ్యూలు ఇచ్చేసరికి ఆమె పేరుతో ఉన్న ప్రత్యేక వాలెట్లో రూ.20 వేలు జమ అయ్యాయి. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించానని తెలిస్తే తన భర్త మెచ్చుకుంటాడని భావించింది. ఈసారికి నేరస్తుల నుంచి ఒకేసారి పది సినిమాలకు రేటింగ్ లింక్‌లు పంపించాలంటే కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని ఆమెకు సందేశం వచ్చింది. దీంతో వాళ్ల మాటలను నమ్మి రూ.2 లక్షలు బదిలీ చేసింది. సినిమాలకు రేటింగ్ ఇచ్చినా ఆమెకు ఎలాంటి డబ్బులు రాలేదు. కమీషన్ రావాలంటే రూ.50 వేలు చార్జీ అవుతుందని కేటుగాళ్ల సూచన మేరకు అవి కూడా పంపించింది. అంతే అప్పట్నుంచి సైబర్ నేరస్తులు సైలెంటైపోయారు. ఆఖరికి వ్యాలెట్‌లో ఉన్న రూ.20 వేలు డ్రా చేసుకునే అవకాశం కూడా లేకపోయే సరికి తాను మోసపోయానని గ్రహించింది. ..ఇదీ సైబర్ నేరస్తుల రేటింగ్ వలకు చిక్కి విలవిల్లాడిన ఓ గృహిణి ఉదంతం. ఈమె ఒక్కరే కాదు సైబర్ నేరస్తుల సినిమా రేటింగ్ వలకు చాలా మంది నగరవాసులు చిక్కుతున్నారు. గృహిణిలు, నిరుద్యోగులు, యువతను లక్ష్యంగా చేసుకొని కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఆశే నేరస్తుల పెట్టుబడి.. ‘మేము పంపించే సినిమాలకు రేటింగ్‌లు, రివ్యూలు ఇస్తే చాలు..ఇంట్లో కూర్చొని రోజుకు రూ.వేలల్లో సంపాదించవచ్చు’ ఈ ప్రకటన చూస్తే ఎవరికై నా ఆశ కలుగుతుంది. ఇదే నేరస్తుల పెట్టుబడి. ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రాం, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో ఈ తరహా ప్రకటనలు, పోస్టులు పెడుతూ ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జేబులు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తున్నారు. మనం ప్రమేయం లేకుండా వాట్సాప్, టెలిగ్రాం, ఇన్‌స్ట్రాగామ్ గ్రూప్‌లలో చేరకూడదని సూచిస్తున్నారు. మోసం ఎలా చేస్తారంటే... తాము సూచించిన సినిమాలకు రేటింగ్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలలో సందేశాలు పంపిస్తారు. రేటింగ్ ఇవ్వాల్సిన తీరు, కమీషన్ ఎలా చెల్లిస్తారు? ఎన్ని రోజుల్లో ఎంత సంపాదన వస్తుందో వివరంగా ఉంటుంది. ఈ లింకును క్లిక్ చేయగానే ఆటోమెటిక్‌గా సైబర్ నేరగాళ్లు ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రాం గ్రూప్‌లలో చేరతారు. ముందుగా కొన్ని సినిమాల పేర్లను పంపించి వాటికి రివ్యూ ఇవ్వగానే ప్రత్యేక వాలెట్లో కొంత డబ్బు జమ చేస్తారు. మనకు నమ్మకం కుదిరేవరకూ మనం డబ్బు డ్రా చేసే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఎక్కువ సినిమాలకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఇస్తామంటూ డబ్బు వసూలు చేస్తారు. ఆ తర్వాత వారితో లింక్ కట్ అవుతుంది. చదవండి: నాలుగేళ్లుగా సినిమాలకు దూరం.. వంద కోట్ల ప్రాజెక్ట్ వచ్చినా నో చెప్పిన నటుడు! -
'భారత్ ఎన్సీఏపీ'లో 5 స్టార్ రేటింగ్ రావాలంటే.. ఈ స్కోర్ తప్పనిసరి!
రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవలే న్యూ భారత్ ఎన్సీఏపీ (Bharat NCAP) నిబంధనలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నియమాలు 2023 అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానున్నాయి. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ అనేది దాదాపు గ్లోబల్ ఎన్సీఏపీ టెస్ట్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇందులో కొన్ని వ్యత్యాసాలను గమనించవచ్చు. గ్లోబల్ ఎన్సీఏపీ కింద, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో వాహనం గరిష్టంగా 34 పాయింట్లు స్కోర్ చేయగలదు. కానీ భారత్ ఎన్సీఏపీ కింద 32 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. రెండు టెస్టింగ్ ప్రోటోకాల్‌లు ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కోసం ఒక్కొక్కటి 16 పాయింట్లను అందిస్తాయి. భారత్ ఎన్సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ పొందాలంటే ఎంత స్కోర్ చేయాలి? ఎంత స్కోర్ చేస్తే 1 స్టార్ రేటింగ్ లభిస్తుందనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రెంట్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు! ఒక కారు భారత్ ఎన్సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకోవాలంటే.. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 41 పాయింట్లు స్కోర్ చేయాల్సి ఉంటుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 22 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 35 పాయింట్లు స్కోర్ చేస్తే 4 స్టార్ రేటింగ్ లభిస్తుంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 16 పాయింట్లు సాధిస్తే 3 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో వరుసగా 10, 4 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 18, 9 పాయింట్లు స్కోర్ చేస్తే 2 స్టార్ రేటింగ్ & 1 స్టార్ రేటింగ్ లభిస్తుంది. -
గ్రీన్ ఎనర్జీకి స్టార్ రేటింగ్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ విని యోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే వినియోగ దారు లకు ‘గ్రీన్ స్టార్స్’ ఇవ్వనున్నారు. పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత నిబంధనలు 2022 కు మొదటి సవరణను(రెగ్యులేషన్ 6 ఆఫ్ 2023) ను ఏపీఈఆర్సీ ప్రతిపాదించింది. గ్రీన్ ఎనర్జీ కోసం వార్షిక ప్రాతి పదికన గ్రీన్ స్టార్స్ రేటింగ్ సర్టిఫికెట్లను ఇవ్వాలని సూచించింది. దీని ప్రకారం ఏటా పునరు త్పాదక విద్యుత్‌ను 100% వినియోగిస్తే 5 స్టార్స్, 75% వాడితే 4 స్టార్స్, 50% కొంటే 3 గ్రీన్ స్టార్స్ లభించనున్నాయి. నెల మొత్తం వినియోగం ఆధారంగా అటువంటి ఆకుపచ్చ నక్షత్రాలు వారి నెలవారీ బిల్లులలో కూడా సూచిస్తారు. ప్రతినెలా డిజిటల్ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. దీనిపై అభిప్రాయాలను వెల్లడించాల్సింగా డిస్కంలను కమిషన్ కోరింది. విద్యుత్ చట్టం, 2003 ప్రకారం..2024–25 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియో గదారులు ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేదీకి 3 నెలల ముందు డిస్కంలకు తమ అభ్యర్థ నలను సమర్పించాలని ఏపీఈఆర్సీ చెప్పింది. -
అడ్డదారులు తొక్కితే నిషేధమే!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్) ప్రవేశాల్లో అడ్డదారులు తొక్కే మెడికల్ కాలేజీలపై నిషేధం విధిస్తామని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించింది. తప్పుడు పద్దతుల్లో ఇచ్చే మొదటి సీటుకు రూ.కోటి, రెండో సీటుకు రూ.2 కోట్లు జరిమానా విధిస్తామని.. మరోసారి తప్పు చేస్తే తదుపరి ఏడాది సంబంధిత మెడికల్ కాలేజీని నిషేధిస్తామని స్పష్టం చేసింది. మెడికల్ అడ్మిషన్లు తదితర అంశాలపై గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. బ్లాక్ చేసి అమ్ముకుంటూ.. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్న ఉదంతాలు ఎన్నో బయటపడుతున్నాయి. ముఖ్యంగా బీ కేటగిరీ సీట్లను ఎన్నారై సీట్లుగా మార్చుకోవడం, తప్పుడు అర్హతలున్నా సీట్లు ఇవ్వడం, అడ్మిషన్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సీట్లు కేటాయించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. దీనితో అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇక నుంచి మెడికల్ కాలేజీలకు రేటింగ్ వైద్య కాలేజీల ఏర్పాటు, కొత్త కోర్సుల అనుమతి కోసం ఎన్ఎంసీ నిబంధనలను విడుదల చేసింది. వీటి అమలుకు ‘మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (మార్బ్)’ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. మార్బ్ నుంచి లిఖితపూర్వక అనుమతులు లేకుండా కొత్తగా వైద్య కాలేజీలు ఏర్పాటు చేయడానికిగానీ, కొత్త కోర్సులు ప్రారంభించడానికిగానీ వీల్లేదు. ఎంబీబీఎస్, పీజీ కోర్సుల కోసం కొత్త కాలేజీల ఏర్పాటుకు ఈ సంస్థ దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి సంస్థలు, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఏర్పాటైన కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్బ్ అన్ని కోణాల్లో పరిశీలించి అనుమతి ఇస్తుంది. మార్బ్ అనుమతి లేకుండా ఇప్పటికే తరగతులు నిర్వహిస్తున్న ఏ మెడికల్ కాలేజీలో కూడా సీట్లు పెంచడానికి వీల్లేదు. మార్బ్ థర్డ్ పార్టీ సంస్థల సాయంతో మెడికల్ కాలేజీల పనితీరును పరిశీలించి రేటింగ్ ఇస్తుంది. ఇక ప్రతీ మెడికల్ కాలేజీ వార్షిక నివేదికను సంబంధిత బోర్డులకు అందజేయాలి. గుర్తింపు పొందిన వైద్య అర్హత ఉంటేనే.. గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండా ఏ వ్యక్తి కూడా మెడికల్ ప్రాక్టీస్ చేయకూడదని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ఇందుకోసం ‘మెడికల్ ప్రాక్టీషనర్ల నమోదు, మెడిసిన్ నిబంధనల ప్రాక్టీస్ లైసెన్స్– 2023’ను విడుదల చేసింది. మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్సు కోసం నేషనల్ మెడికల్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. విదేశాల్లో వైద్యవిద్య చదివినవారు జాతీయ స్థాయిలో సంబంధిత పరీక్ష పాస్ కావాలి. రాష్ట్ర వైద్య మండలిలో దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, అది జాతీయ వైద్య రిజిస్టర్లోనూ, రాష్ట్ర వైద్య రిజిస్టర్లో కూడా కనిపిస్తుంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్కు జారీచేసిన మెడిసిన్ ప్రాక్టీస్ లైసెన్స్ ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అత్యున్నత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వైద్య విద్య ఉండాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. అందుకోసం ‘గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్–2023’ను విడుదల చేసింది. విద్యార్థి కి ఉన్నతమైన, నాణ్యమైన ఎంబీబీఎస్ లేదా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యను అందించడానికి తగిన ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. -
బిల్డర్లకు రేటింగ్! రియల్టీలో విభజన రేఖ స్పష్టంగా ఉండాలి
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లలో మంచి, చెడు మధ్య విభజన రేఖ ఉండాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అభిప్రాయపడ్డారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం కస్టమర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, బ్యాంకుల నుంచి పొందడానికి వీలుంటుందన్నారు. సీఐఐ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. రియల్ ఎస్టేట్‌లో ముఖ్యంగా ఇళ్ల ప్రాజెక్టులు ఎక్కువ శాతం కస్టమర్ల నిధులపైనే ఆధారపడి ఉంటున్నాయంటూ, ఈ విధానం మారాల్సి ఉందన్నారు. బిల్డర్ల గత పనితీరును మదించి రేటింగ్ ఇచ్చే విధంగా విశ్వసనీయమైన కార్యాచరణ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం కావడానికి నగదు పరమైన సమస్యలు ఒక ప్రధాన కారణమన్నారు. చిన్న వర్తకులకు చెల్లింపులు చేసేందుకు కాంట్రాక్టులు కొన్ని నెలల సమయం తీసుకుంటున్నారనని పేర్కొంటూ.. చిన్న వర్తకులకు నేరుగా చెల్లింపులు చేసే వ్యవస్థను తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కేవలం కొన్ని చెత్త ప్రాజెక్టులు, కొందరు చెడు రుణ గ్రహీతల ఉండడం వల్ల పరిశ్రమ మొత్తం రుణాల పరంగా ప్రతికూలతలను చూస్తోంది. ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
భారత్ ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో చక్కటి వృద్ధి బాటన పయనిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) తాజా ప్రకటనలో పేర్కొంది. పటిష్ట ఆర్థిక ఫండమెంటల్స్ (మూలాధారాలు) ఇందుకు దోహదపడతాయని వివరించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ’ సావరిన్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) ఎస్అండ్పీ తాజా ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ♦ఎస్అండ్పీ ఇస్తున్న ‘స్టేబుల్ అవుట్‌లుక్’ భారత్ పటిష్ట ఎకానమీని, ఆదాయ వృద్ధిని ప్రతిబింబిస్తోంది. బలహీన ఫైనాన్షియల్ అంశాల వల్ల ప్రతికూలతలు ఏర్పడకుండా పటిష్ట ఎకానమీ, ఆదాయాలు భరోసాను ఇస్తున్నాయి. ♦ దీర్ఘకాలిక, ‘ఏ–3’ షార్ట్–టర్మ్ ఫారెన్, లోకల్ కరెన్సీలకు ‘బీబీబీ’ సావరిన్ క్రెడిట్ రేటింగ్ కొనసాగిస్తున్నాం. ♦సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును కనబరుస్తోంది. రాబోయే రెండు లేదా మూడు సంవత్సరాలలో వృద్ధిని బలపరిచేందుకు భారత్ పటిష్ట ఫండమెంటల్స్ దోహదపడతాయని అంచనావేస్తున్నాం. ♦ ప్రభుత్వ–ఆదాయాలు వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, రుణ భారాల వంటి అంశాలను స్థిరీకరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, ఇవి మరికొంత కాలం అధికంగానే కొనసాగే వీలుంది. పెట్టుబడులకు కీలకం... భారత్ సావరిన్ రేటింగ్ విషయంలో యథాతథ వైఖరిని అవలంభిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ ఈ నెల ప్రారంభంలో చేసిన ప్రకటన నేపథ్యంలోనే ఎస్అండ్పీ తాజా ప్రకటనలో వెలువడింది. చక్కటి వృద్ధి తీరు, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని నిలబడ్డం వంటి అంశాల నేపథ్యంలో రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’గా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. అయితే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల విషయంలో పరిస్థితి బలహీనంగా ఉందని కూడా హెచ్చరించింది. తాజాగా ఎస్అండ్పీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు ఎస్అండ్పీ ‘బీబీబీ’ సావరిన్ రేటింగ్, అలాగే ఫిచ్ ఇస్తున్న ‘బీబీబీ మైనస్’ రేటింగ్‌లు రెండూ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. చెత్త రేటింగ్‌కు ఒక అంచె అధికం. మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-మూడీ స్ కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్‌ను ఇస్తోంది. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) అంతర్జాతీయంగా దేశంలోకి పెట్టుబడులు రావడానికి ఆయా సంస్థలు ఇచ్చే రేటింగ్స్ కీలకం. రేటింగ్ పెంపునకు కేంద్ర అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రతిస్పందన రావడం లేదు. దీనితో భారత్‌కు సంబంధించి రేటింగ్ వచ్చే విషయంలో హేతుబద్దత కనబడ్డంలేదన్న విమర్శలూ తలెత్తుతున్నాయి. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) ఎకానమీపై ఐక్యరాజ్యసమితి విశ్వాసం భారత్ ఆర్థిక వ్యవస్థపై ఐక్యరాజ్యసమితి పూర్తి విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. 2023లో 5.8 శాతం, 2024లో 6.7 శాతం వృద్ధిని దేశం నమోదుచేసుకుంటుందని ‘ఆర్థిక పరిస్థితులు-అవకాశాలు’ శీర్షికన రూపొందించిన ఒక తాజా నివేదికలో తెలిపింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని నివేదికలో అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ వృద్ధికి దోహదపడే ప్రధాన అంశంగా వివరించింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో భారత్ ఎకానమీ ప్రకాశవంతంగా కొనసాగుతోందని ప్రశంసించింది. 2023లో భారత్‌లో ద్రవ్యోల్బణం సగటును 5.5%గా ఉంటుందని అభిప్రాయపడుతూ తగ్గుతున్న అంతర్జాతీయ కమోడిటీ ధరలు, కరెన్సీ క్షీణత నెమ్మదించడం ఇందుకు కారణంగా ఉంటాయని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2023లో 2.3%, 2024లో 2.5% వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది. మరింత బిజినెస్ సమాచారం కోసం చదవండి : సాక్షి బిజినెస్ -
దేశంలోనే అట్టడుగున మన డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి రేటింగ్, ర్యాంకింగ్స్‌లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మరోసారి దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచాయి. దేశంలోని 51 డిస్కంలలో టీఎస్ఎన్పి డీసీఎల్ 47వ ర్యాంకు, టీఎస్ఎస్పీడీసీఎల్ 43వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాయి. ఈ మేరకు డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్ నివేదికను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెరుగైన రేటింగ్, ర్యాంకింగ్ కలిగి ఉంటేనే డిస్కంలకు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించనున్నాయి. ఈ మేరకు కేంద్రం లంకె పెట్టడంతో ఈ రేటింగ్స్ కీలకంగా మారాయి. రాష్ట్ర డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. డీ–గ్రేడ్‌కి అడుగు దూరంలో ... డిస్కంల ఆర్థిక సుస్థిరతకు 75, పనితీరు సమర్థతకు 13, బయటి నుంచి ప్రభుత్వం/ఈఆర్సీల మద్దతుకు 12 కలిపి మొత్తం 100 స్కోరుకిగాను ఆయా డిస్కంలు సాధించిన స్కోరు ఆధారంగా వాటికి.. ఏ+, ఏ, బీ, బీ–, సీ, సీ–, డీ అనే గ్రేడులను కేటాయించింది. కీలక అంశాల్లో డిస్కంల వైఫల్యాలకు నెగెటివ్ స్కోర్‌ను సైతం కేటాయించింది. ఎస్పీడీసీఎల్ 10.8 స్కోరు సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను, ఎన్‌పి డీసీఎల్ 6.6 స్కోరును సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను పొందింది. చిట్టచివరి స్థానమైన ‘డీ గ్రేడ్’లో మేఘాలయ డిస్కం మాత్రమే నిలిచింది. దేశం మొత్తం బకాయిల్లో 15% మనవే... జెన్కో, ట్రాన్స్‌కోలకు దేశంలోని అన్ని డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు 2021–22 నాటికి రూ.2.81 లక్షల కోట్లకు ఎగబాకినట్టు కేంద్రం పేర్కొంది. అందులో ఎస్పీడీసీఎల్ వాటా ఏకంగా 10.3 శాతం కాగా, ఎన్పీడీసీఎల్ వాటా 4.3 శాతం కావడం గమనార్హం. జెన్కోల నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 45 రోజుల్లోగా చెల్లించాల్సి ఉండగా ఎస్పీడీసీఎల్ 375 రోజులు, ఎన్పీడీసీఎల్ 356 రోజుల కిందటి నాటి బిల్లులను బకాయిపడ్డాయి. అంటే మన డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిల చెల్లింపులకు కనీసం ఏడాది సమయాన్ని తీసుకుంటున్నాయి. -
సేఫెస్ట్ కార్ల జాబితాలో ఆ రెండు కార్లు
భారతీయ మార్కెట్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ వంటి వాటితో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న కార్లను సెలక్ట్ చేసుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులలో అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన కార్లు చాలానే ఉన్నప్పటికీ తాజాగా ఈ జాబితాలో మరో రెండు కార్లు చేరాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. దేశీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండూ గ్లోబల్ ఎన్‌సిఏపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుని సురక్షితమైన కార్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. GNCAP కొత్త టెస్టింగ్ ప్రోటోకాల్ క్రింద 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి మిడ్ సైజ్ సెడాన్లు ఈ స్లావియా & వర్టస్ కావడం గమనార్హం. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) స్లావియా, వర్టస్ రెండూ కూడా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో మొత్తం 34 పాయింట్లకు గానూ 29.71 పాయింట్లు సాధించాయి. అదే సమయంలో చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో 49 పాయింట్లకు 42 పాయింట్లు పొంది మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. కొత్త గ్లోబల్ NCAP టెస్టింగ్ ప్రోటోకాల్స్ ప్రకారం.. అడల్ట్ ఆక్యుపెంట్ & చైల్డ్ ఆక్యుపెంట్ టెస్ట్‌లలో మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పెడిస్ట్రియన్ ప్రొటక్షన్ (పాదచారుల రక్షణ), సీట్ బెల్ట్ రిమైండర్ వంటి వాటిలో కూడా ఉత్తమ స్కోరింగ్ పొందినప్పుడే ఆ వాహనానికి 5 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అన్ని పరీక్షల్లో మంచి స్కోరింగ్ సాధించిన స్లావియా, వర్టస్ రెండూ అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరటం నిజంగా హర్షించదగ్గ విషయం. -
వారిని అస్సలు పట్టించుకోని అమెజాన్ ఫ్లెక్స్, ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ
న్యూఢిల్లీ: కాంట్రాక్టు ఉద్యోగులకు (గిగ్ వర్కర్లు/తాత్కాలిక పనివారు) న్యాయమైన, పారదర్శక పని పరిస్థితులు కల్పించడంలో ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ, అమెజాన్ ఫ్లెక్స్ సున్నా స్థానంలో నిలిచాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఫెయిర్‌వర్క్ ఇండియా ఈ రేటింగ్‌లు ఇచ్చింది. అంతర్జాతీయంగా డిజిటల్ టెక్నాలజీ కంపెనీల్లో పని పరిస్థితులపై ఫెయిర్‌వర్క్ రేటింగ్‌లు ఇస్తుంటుంది. ఈ సంస్థ ‘ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ 2022’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. న్యాయమైన వేతన చెల్లింపులు, పని పరిస్థితులు, న్యాయమైన ఒప్పందాలు, పారదర్శక నిర్వహణ, న్యాయమైన ప్రాతినిధ్యం అంశాల ఆధారంగా రేటింగ్‌లు కేటాయిస్తుంది. 10 పాయింట్లకు గాను అమెజాన్ ఫ్లెక్స్, డంజో, ఓలా, ఫార్మ్ఈజీ, ఊబర్ కు సున్నా పాయింట్లు వచ్చినట్టు ఈ నివేదిక వెల్లడించింది. నివేదికలో భాగంగా 12 ప్లాట్‌ఫామ్‌లకు ఫెయిర్‌వర్క్ రేటింగ్‌లు ఇవ్వగా, ఈ ఏడాది ఒక్క ప్లాట్‌ఫామ్ కూడా 10కి 10 పాయింట్లు సంపాదించలేకపోయింది. అర్బన్ కంపెనీ అత్యధికంగా 10 పాయింట్లకు గాను 7 పాయింట్లు సొంతం చేసుకుంది. బిగ్ బాస్కెట్ కు 6, ఫ్లిప్‌కార్ట్‌కు 5, స్విగ్గీకి 5, జొమాటోకు 4, జెప్టోకు 2, పోర్టర్‌కు ఒక పాయింట్ లభించింది. ‘‘చట్టం దృష్టిలో గిగ్ వర్కర్లు అంటే స్వతంత్ర కాంట్రాక్టర్లు. అంటే కార్మిక హక్కులను వారు పొందలేరు. అసంఘటిత రంగం ఉద్యోగులు, నిరుద్యోగుల మాదిరే వీరు కూడా. గంటల వారీ కనీస వేతనం అందించడం వారి పని పరిస్థితులు మెరుగుపడే విషయంలో మొదటి మెట్టు’’అని ఫెయిర్‌వర్క్ అని కంపెనీల పని పరిస్థితులను అధ్యయనం చేసిన ప్రొఫెసర్ బాలాజీ పార్థసారథి తెలిపారు. -
షాకింగ్.. 'లైగర్' చెత్త రికార్డ్.. రేటింగ్‌లో మరీ ఇంత తక్కువా?
విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ఇండియా చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైందనే చెప్పొచ్చు. విడుదలైన రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న లైగర్ చిత్రానికి ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ(ఐఎండీబీ)అత్యల్ప రేటింగ్‌ను ఇచ్చింది.10కి కేవలం 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇక ఈ రేటింగ్ ఇటీవల లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ చిత్రాల కంటే తక్కువ అని తెలుస్తోంది.చదవండి: లైగర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!.. ఎప్పుడంటే అమీర్ ఖాన్ కెరీర్లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచిన లాల్ సింగ్ చడ్డాకు ఐఎండీబీ రేటింగ్ 5 ఇవ్వగా.. లైగర్‌కు మాత్రం 1.7 ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రానికి 4.6, దొబారా 2.9. రణ్‌బీర్ కపూర్ 4.9తో పోలిస్తే లైగర్‌కు మాత్రం అత్యంత దారుణంగా 1.7రేటింగ్ ఇచ్చారు. ఇక ఈ వీకెండ్ రోజుల్లో కలెక్షన్స్ అనుకున్నట్టుగా రాబట్టకపోతే మూవీ డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. చదవండి: 'తలకిందులైంది.. లైగర్ రిజల్ట్ చూసి విజయ్ ఏం చేశాడో తెలుసా? -
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్: వారం/నెలవారీ సిప్ ఏది బెటర్?
ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఓ మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా? – రాజ్‌దీప్ సింగ్ ముందుగా ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్‌ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. అందుకుని ముందు మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి ఎందుకు వైదొలుగుతున్నదీ సూక్ష్మంగా విశ్లేషించుకోవాలన్నది నా సూచన. ఆ తర్వాతే ఒకే విడతగానా లేదంటే ఎస్‌డబ్ల్యూపీ రూపంలోనా అన్న అంశానికి రావాలి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని సిస్టమ్యాటిక్‌గా వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ విధంగా పన్ను ఆదా అవుతుంది. సిప్ రూపంలోఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం/నెలవారీ సిప్‌లలో ఏది బెటర్? – అమర్ సహాని వీక్లీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. దీనివల్ల నెలలో నాలుగు సార్లు పెట్టుబడులు పెట్టుకున్నట్టు అవుతుంది. దీని కారణంగా మీ ఖాతాలో లావాదేవీల సంఖ్య చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందికరమే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ అమలు చేయాలి? అని ఒకసారి ప్రశ్నించుకోండి. దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే ఇన్వెస్టర్లకు సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
AP: భారతి సిమెంట్‌కు 5 స్టార్ రేటింగ్
-
AP: భారతి సిమెంట్‌కు 5 స్టార్ రేటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి భారతి సిమెంట్ సంస్థకు మరో గౌరవం దక్కింది. తాజాగా ఫైవ్ స్టార్ రేటింగ్ జాతీయ అవార్డు ప్రకటించింది కేంద్రం. గనుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గానూ భారతి సిమెంట్‌కు ఈ అవార్డును అందజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2021-22 గనుల నిర్వహణలో 5 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది కేంద్రం. ఈ ఏడాది వెయ్యికి పైగా గనులు పోటీ పడగా.. అందులో ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకున్నవి కేవలం 40 మాత్రమే కావడం విశేషం. -
క్రాష్ టెస్ట్‌తో వాహనాలకు రేటింగ్
న్యూఢిల్లీ: ఏ కారు ప్రయాణానికి భరోసా ఇస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కార్ల యజమానులు 10 శాతం మంది కూడా ఉండరు. స్టార్ రేటింగ్ గురించి తెలిసింది తక్కువే. ఇక మీదట క్రాష్ టెస్టుల్లో కార్లు చూపించే భద్రతా సామర్థ్యాలకు అనుగుణంగా వాటికి స్టార్ రేటింగ్‌ను ఇచ్చే ‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్’(భారత్–ఎన్సీఏపీ)కు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌పై సంతకం చేసినట్టు ప్రకటించారు. స్టార్ రేటింగ్‌ల ఆధారంగా వినియోగదారులు సురక్షితమైన కార్లను ఎంపిక చేసుకునే వీలుంటుందని మంత్రి చెప్పారు. సురక్షిత వాహనాలను తయారు చేసే దిశగా ఓఈఎం తయారీదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ఈ విధానం ప్రోత్సహిస్తుందన్నారు. ఇప్పటివరకు మన దేశంలో తయారవుతున్న కార్లు గ్లోబల్ ఎన్సీఏపీ రేటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశ రహదారులు, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రామాణిక క్రాష్ టెస్టింగ్ విధానం మనకు లేదు. ఇక మీదట రేటింగ్ కోసం గ్లోబల్ ఎన్సీఏపీపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని మంత్రి గడ్కరీ చెప్పారు. భారత కార్లకు స్టార్ రేటింగ్ ప్రయాణికుల భద్రత కోసమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లకు మన కార్లను ఎగుమతి చేసుకునేందుకూ ఉపయోగపడుతుందన్నారు. ‘భారత్–ఎన్సీఏపీ పరీక్షా ప్రొటోకాల్ అంతర్జాతీయ ఎన్సీఏపీ ప్రొటోకాల్‌కు అనుగుణంగానే, భారత్ నిబంధనల పరిధిలో ఉంటుంది. భారత్‌కు చెందిన సొంత టెస్టింగ్ సదుపాయాల్లో ఓఈఎంలు (తయారీ కంపెనీలు) వాటి వాహనాలను పరీక్షించుకునేందుకు అనుమతించనున్నాం’’అని గడ్కరీ చెప్పారు. క్రాష్ టెస్ట్ అంటే..? వాహనంలో ప్రయాణించే వారికి భద్రత పాళ్లు ఏ మేరకో క్రాష్ టెస్ట్‌లో తేలిపోతుంది. భిన్న రకాల క్రాష్ టెస్ట్‌లు జరుగుతుతాయి. ముందు భాగం, పక్క భాగం, వెనుక భాగం, రోడ్డుపై నుంచి అదుపు తప్పి పక్కకు పోవడం, పెడెస్ట్రెయిన్ సేఫ్టీ టెస్ట్ (నడిచి వెళ్లేవారికి భద్రత) ఇలా పలు పరీక్షలు నిర్వహిస్తారు. రెండు కార్లు ఢీకొనడం లేదంటే ఒక కారు ఒక అవరోధాన్ని డీకొనడం ద్వారా నష్టాన్ని, భద్రతను అంచనా వేస్తారు. మారుతి సుజుకీ ఎస్ ప్రెస్సో, కియా సెల్టోస్, హ్యుందాయ్ ఐ10 నియోస్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో బలహీన పనితీరు చూపించిన వాటిల్లో కొన్ని. ఇప్పటి వరకు ఈ విధానం తప్పనిసరేమీ కాదు. స్వచ్ఛందంగా అమలవుతున్నదే. భారత్ ఎన్సీఏపీలోనూ ఇది స్వచ్ఛందంగానే ఉండనుందని తెలుస్తోంది. భద్రతా సదుపాయాలు కార్లు ఏబీఎస్, ఈఎస్పీ, ఎయిర్‌బ్యాగులు, పవర్ విండోలు, డెడ్ పెడల్స్, పెరీమీటర్ అలార్మ్ తదితర ఫీచర్లతో వస్తున్నాయి. ఇవన్నీ భద్రతా ఫీచర్లే. సాధారణంగా భద్రత రెండు రకాలు. ముందస్తు భద్రత, ప్రమాదం జరిగిన వెంటనే భద్రత. ఇందులో ఏబీఎస్, ఈఎస్పీ, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, ఏఐ ఆధారిత బ్రేకింగ్ ఇవన్నీ ముందస్తు భద్రతకు సంబంధించినవి. ఇవన్నీ కారు తయారీ వ్యయాన్ని పెంచేవి. అందుకనే వ్యయాలను పరిమితం చేసేందుకు బేసిక్ మోడళ్లలో కంపెనీలు వీటిలో కొన్నింటికే చోటు కల్పిస్తున్నాయి. ఎయిర్ బ్యాగులు, బలమైన చాసిస్, ఆటోమేటిక్ ఎస్‌వోఎస్ ఇతర సదుపాయాలు ప్రమాదం తర్వాత భద్రతకు సంబంధించినవి. ప్రయాణికుల కార్లలో సీటు బెల్ట్ తప్పకుండా ఉండాలి. వేగం పరిమితి మించితే అప్రమత్తం చేసే అలర్ట్ ఫీచర్ ఉండాలి. రివర్స్ గేర్ సెన్సార్ ఉండాలి. ఏబీఎస్, ఎయిర్ బ్యాగులు ఇవన్నీ తప్పనిసరే. కానీ, ఎయిర్‌బ్యాగుల నిబంధన ఇంకా అన్ని వాహనాలకు అమల్లోకి రాలేదు. -
కామంతో కళ్లు మూసుకుపోతే.. 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: రెక్కీ (వెబ్ సిరీస్) నటీనటులు: శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా, ధన్యా బాలకృష్ణ, తోటపల్లి మధు, శరణ్య ప్రదీప్ తదితరులు నిర్మాత: శ్రీరామ్ కొలిశెట్టి కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ సంగీతం: శ్రీరామ్ మద్దూరి సినిమాటోగ్రఫీ: రామ్ కె. మహేష్ విడుదల తేది: జూన్ 17, 2022 (జీ5) ఇటీవలే 'గాలివాన' వెబ్ సిరీస్‌తో అలరించిన జీ5 తాజాగా 'రెక్కీ' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్ నోరోన్హా, సమ్మెట గాంధీ నటించిన ఈ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. 1992లో తాడిపత్రిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు డైరెక్టర్ కృష్ణ తెలిపారు. 7 ఎపిసోడ్లుగా వచ్చిన 'రెక్కీ' వెబ్ సిరీస్ జీ5లో జూన్ 17న విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తాడిపత్రికి వరదరాజులు ('ఆడు కాలమ్' నరేన్) మున్సిపల్ ఛైర్మన్. అదే పట్టణంలో రంగ నాయకులు (రామరాజు) మాజీ మున్సిపల్ ఛైర్మన్. వీరిద్దరి మధ్య రాజకీయ పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు గురవుతాడు. తర్వాత 6 నెలలకు వరదరాజులు కుమారుడు చలపతి (శివ బాలాజీ) కూడా చంపబడతాడు. ఈ హత్యలు చేసింది ఎవరు ? ఎవరు ప్లాన్ చేశారు ? వాటి వెనుక ఉన్నది ఎవరు ? వారిని ఎస్సై లెనిన్ (శ్రీరామ్) కనిపెట్టాడా ? అతను తెలుసుకున్న నిజాలు ఏంటీ ? ఈ రెండు హత్యలతో వారి ఇంట్లోని ఆడవాళ్లు ఏం నిర్ణయించుకున్నారు ? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'రెక్కీ' వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ఒక మహిళ వల్ల కురుక్షేత్రమే జరిగిందని చెప్పుకుంటాం. అలాంటి వనితపై వ్యామోహం పెరిగితె ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలియజేశారు. కథ చూస్తే రాజకీయ నేపథ్యమున్నట్లు అనిపించినా కామ వాంఛ, మహిళా పాత్రను ప్రధానంగా చూపించారు. అనుకున్న కథ ప్రకారం ఆద్యంతం ఆసక్తికరంగా ఆవిష్కరించారు డైరెక్టర్ పోలూరు కృష్ణ. అధికారం, రాజకీయం కథలతో అనేక సిరీస్‌లు ఇదివరకు వచ్చాయి. కానీ వీటికి కాస్త భిన్నంగా కామ వాంఛను జోడించి సక్సెస్ అయ్యారు దర్శకుడు. బంధాలు, అక్రమ సంబంధాల గురించి చక్కగా చూపించారు. సిరీస్‌లో వచ్చే మలుపులు ఊహించని విధంగా చాలా బాగా ఆకట్టుకున్నాయి. అలాగే మహిళళ పాత్రలను బలంగా చూపించారు. కానీ అక్కడక్కడ కొంతమేర అడల్ట్ సన్నివేశాలు ఉన్నాయి. ఎవరెలా చేశారంటే? సిరీస్ ప్రారంభం నుంచి చివరి వరకు నటీనటుల నటన అద్భుతంగా ఉంది. ఆద్యంతం వారి నటనతో సిరీస్‌ను రక్తి కట్టించారు. శ్రీరామ్, శివ బాలాజీ, ఆడు కాలమ్ నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా పాత్రలు హైలెట్‌గా నిలిచాయి. శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ పాత్రలు చివర్లో ఆకట్టుకుంటాయి. అలాగే మరో కీలక పాత్రలో నటించిన తోటపల్లి మధు పూర్తి న్యాయం చేశారు. ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే 1990వ దశకంలోని వాతావరణాన్ని బాగా చూపించారు. రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సంగీత దర్శకుడు శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది. 'రెక్కీ' వెబ్ సిరీస్‌కు ఈ బీజీఎం ప్రాణం పోసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే మిమ్మల్ని కదలనివ్వకుండా థ్రిల్‌కు గురిచేసే వెబ్ సిరీస్ 'రెక్కీ'. -సంజు (సాక్షి వెబ్ డెస్క్) -
బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. సత్యదేవ్ 'గాడ్సే' రివ్యూ
టైటిల్: గాడ్సే నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, నోయెల్ తదితరులు స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్ సంగీతం: శాండీ అద్దంకి నిర్మాత: సి. కల్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: జూన్ 17, 2022 విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్ మాస్టర్' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటించింది. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మించిన 'గాడ్సే' శుక్రవారం అంటే జూన్ 17న విడుదల అయింది. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాలు కథాంశంగా తెరకెక్కిన 'గాడ్సే' ప్రేక్షకులను ఏ విధంగా అలరించాడో రివ్యూలో చూద్దాం. కథ: పోలీసు అధికారులు, మంత్రులు, బినామీలతోపాటు కొందరు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఆందోళనకు గురవుతారని, ఇతర సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వం రహస్యంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒక పోలీసు బృందాన్ని ఆదేశిస్తుంది. ఆ టీమ్‌లో ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఉంటుంది. వీళ్లందరని రాష్ట్రానికి వచ్చిన వ్యాపారవేత్త విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది. వారందరినీ విశ్వనాథ్ రామచంద్ర ఎందుకు కిడ్నాప్ చేశాడు ? అతను ఏం చెప్పాలనుకున్నాడు ? బిజినెస్‌మేన్ కిడ్నాపర్ గాడ్సేగా ఎందుకు మారాడు? అనే తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ: రాజకీయ నాయకులు చేసే అవినీతి, డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, వేలమంది గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు వంటి విషయాలను సినిమాలో చూపించారు దర్శకుడు. సినిమా కాన్సెప్ట్ నిజానికి బాగుంది. కానీ ఆ కథను వెండితెరపై ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్లే అని చెప్పుకోవచ్చు. కిడ్నాప్ ఎందుకు చేశారో చెప్పేది కొంతవరకు బాగున్నా తర్వాత ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అంతా ఎక్స్పెక్టెడ్ సీన్లతో బోరింగ్‌గా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పొచ్చు. కానీ చివరిలో వచ్చే క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సత్యదేవ్ చెప్పే ఒక్కో డైలాగ్ అందరనీ ఆలోచింపజేసేలా ఉంటాయి. ఎవరెలా చేశారంటే ? సత్యదేవ్ ఇప్పటికే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన నటన ఇంటెన్సివ్‌గా ఉండి అందరినీ కట్టిపడేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన ఒంటిచేత్తో నడిపించాడు. ఆయన చెప్పే ఒక్కో డైలాగ్ క్లాప్ కొట్టించేలా ఉంది. ఇక పోలీసు అధికారి పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి చక్కగా నటించింది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. పోలీసు పాత్రకు తగిన ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఇక షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, జియా ఖాన్, పృథ్వీరాజ్, నోయెల్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాగబాబు, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేర నటించారు. చివరిగా చెప్పాలంటే మరోసారి వృథా అయిన సత్యదేవ్ యాక్టింగ్ కోసం తప్పకుండా చూడొచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు..
Top 10 Best Telugu Web Series As Per IMDB Rating: కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్కు సరైన వేదికలుగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విభిన్నమైన కథలతో మూవీ లవర్స్‌కు ఎంతో చేరువయ్యాయి. ఓటీటీల్లో స్ట్రీమ్ అయిన చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లంటే పెట్టింది పేరుగా బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్ సిరీస్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ సీన్ మారింది. వెబ్ సిరీస్‌లు తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. తెరకెక్కించడమే కాకుండా తెలుగు నేటివిటికి తగినట్లుగా మలిచి మంచి హిట్ కూడా అందుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి ఓటింగ్ తీసుకుని వాటికి రేటింగ్ నిర్ణయిస్తుంది ఐఎమ్‌డీబీ వెబ్సైట్. ఈ రకంగా ఐఎమ్‌డీబీ రేటింగ్‌ను బట్టి ప్రేక్షకులను మెచ్చిన టాప్ 10 తెలుగు వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. 1. లూజర్-8.8 రేటింగ్ (జీ5) 2. కుడి ఎడమైతే-8.4 రేటింగ్ (ఆహా) 3. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ-8.4 రేటింగ్ (జీ5) 4. కొత్త పోరడు-8.3 రేటింగ్ (ఆహా) 5. తరగతి గది దాటి-8 రేటింగ్ (ఆహా) 6. గాడ్ ఆఫ్ ధర్మపురి-7.8 రేటింగ్ (జీ5) 7. పరంపర-7.6 రేటింగ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 8. మస్తీస్-7.2 రేటింగ్ (ఆహా) 9. చదరంగం-7.1 రేటింగ్ (జీ5) 10. బ్యూటీ అండ్ ది బేకర్-7 రేటింగ్ (ఆహా) చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. -
ఆస్కార్... ఆశ్చర్యం
కోవిడ్ కారణంగా గత రెండు అస్కార్ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఊహించినంత ఉత్సాహం కనబడలేదు. పైగా ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ రేటింగ్ కూడా పడిపోయింది. వీటికి తోడు ఈసారి ఆస్కార్ అవార్డుల్లోని 8 విభాగాలకు ముందుగానే అవార్డులు ఇచ్చి, ఆ ఫుటేజీని లైవ్ టెలికాస్ట్ రోజు ప్రదర్శించాలని ఆస్కార్ నిర్వాహకులు ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. రేటింగ్‌ను పెంచడం, విమర్శలను తగ్గించుకోవడం కోసం ఆస్కార్ నిర్వాహకులు కొన్ని సర్ప్రైజ్లను ప్లాన్ చేశారట. ఇందులో భాగంగా క్లాసిక్ చిత్రాలను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘జేమ్స్‌బాండ్’ సిరీస్‌లోని తొలి సినిమా ‘డాక్టర్ నో’ (1962) విడుదలై 60 సంవత్సరాలు కావస్తోంది. అలాగే మరో హాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ (1972) చిత్రం యాభై సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ 94వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఈ రెండు చిత్రాలను సెలబ్రేట్ చేసే విధంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు ఆస్కార్ నిర్వాహకుల్లో ఒకరైన విల్ పాకర్ పేర్కొన్నారు. ఈ సర్ప్రైజెస్ ఏంటి? అనేవి మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. ఈ నెల 27న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. -
బాలయ్య బీభత్సం.. అన్‌స్టాపబుల్ ‘షో’ సరికొత్త రికార్డు
గతంలో వెండితెరపై కనిపించి అలరించిన తారలు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా టెలివిజన్‌లోనూ హోస్ట్‌లుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ జాబితాలో కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, జూ. ఎన్టీఆర్, నాని ఇప్పటికే హోస్ట్‌లుగా వ్యవహరించి టెలివిజన్‌లోనూ తగ్గేదేలే అనిపించారు. అయితే ఈ జాబితాలోకి నందమూరి బాలకృష్ట వస్తాడని ఎవరూ ఊహించి ఉండరూ. ప్రస్తుతం ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్‌షోకు ఊహించని రెస్సాన్స్ వస్తోంది. దీంతో వెండితెరపై మాత్రమే కాదు ఏ తెరపైన అయినా బాలయ్య అడుగు పెడితే రికార్డులు మోత మోగాల్సిందేనని నిరూపించారు. (చదవండి: Balayya: 'దొరికితే దవడ పగిలిపోద్దీ'.. అంటూ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య) ఇప్పటి వరకు తెలుగులో చాలా టాక్షాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షా సాధించినంత విజయాన్ని మాత్రం ఏ షో సాధించలేకపోయాయి. ఎందుకంటే.. నిన్నటి వరకు వెండితెరపై మాత్రమే ప్రేక్షకులను అలరించిన బాలయ్య తొలిసారి హాస్ట్‌గా వ్యవహరిస్తూ తారలను ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. ఈ షో చూసిన కొందరు వింటేజ్ బాలయ్యని చూస్తున్నామని నెట్టింట కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి హిట్ టాక్‌తో ఏ మాత్రం బ్రేకులు లేకుండా దూసుకుపోతుంది. తాజాగా ఈ షో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీ.. టాప్ 10 రియాలిటీ షోల్లో ఒకటిగా నిలిచి రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఉన్న రియాలిటీ షోలలో ఒక తెలుగు రియాలిటీ షోగా బాలయ్య షో నిలిచింది. పలువురు స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 7 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇంకొక మూడు ఎపిసోడ్లు పూర్తయితే.. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుంటుందని సమాచారం. -
‘స్కామ్ 1992’ నా కెరీర్‌ను మలుపు తిప్పింది: ప్రతీక్ గాంధీ
స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఎండీబీ రేటింగ్స్‌లో పదికి గాను 9.6 రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచి మోస్ట్ పాపులర్ షోగా నిలచింది. తాజాగా దీనిపై ప్రతీక్ గాంధీ స్పందించాడు. ‘ఇది చాలా సంతోషకరమైన విషయం. ఓ టీమ్‌గా మా కళపై ఉన్న నమ్మకం మరింత బలోపేతమైంది. అలాంటి అరుదైన జాబితాలో ఇండియా నుంచి మా ‘స్కామ్ 1992’ మాత్రమే నిలవడం ఇది నిజంగా అరుదైన ఘనత. స్కామ్ 1992 నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇప్పుడు ఎంతో మంది దర్శక నిర్మాత నుంచి నాకు అవకాశాలు వస్తున్నాయి’ అంటు ఆనందం వ్యక్తం చేశాడు. కాగా డైరెక్టర్ హన్సల్ మెహతా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ దేశంలో ఆల్‌టైమ్ మోస్ట్ పాపులర్ షోగా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో సోనీలివ్‌లో వచ్చిన ఈ సిరీస్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఐఎండీబీ రేటింగ్స్‌లో పదికి గాను 9.6 రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచి ఆల్‌టైం రికార్డును సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని ఆల్‌టైమ్ పాపులర్ షోలలో కూడా స్కామ్ 1992 ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోని 250 అత్యుత్తమ టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో దీనికి స్థానం దక్కింది. దీనితో పాటు ‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్, బ్రేకింగ్ బ్యాడ్, ద వైర్, చెర్నోబిల్’ లు ఉన్నాయి. చదవండి: స్కామ్ 1992కు అరుదైన గౌరవం -
స్కామ్ 1992కు అరుదైన గౌరవం
ఇండియన్ వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’ అరుదైన గౌరవం దక్కించుకుంది. హర్షద్ మెహతా బయోపిక్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఐఎండీబీ ఆల్‌టైం ఫేవరెట్ వెబ్ సిరీస్‌లలో నెంబర్ వన్ పొజిషన్లో నిలిచింది. ఈ అరుదైన ఫీట్‌పై సోనీ ఎల్ఐవీ సిరీస్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. మొత్తం 163 సిరీస్‌లు పోటీపడగా.. ఇండియా నుంచి కేవలం స్కామ్ 1992 మాత్రమే ఈ లిస్ట్‌లో నిలిచింది. ఓట్ల లెక్కింపుతో స్కామ్ 1992కి అగ్రస్థానం దక్కింది. హన్షల్ మెహతా డైరెక్ట్ చేసిన ‘స్కాం 1992: హర్షద్ మెహతా స్టోరీ’ ప్రపంచంలో మోస్ట్ వాచ్డ్ సిరీస్‌గానూ గుర్తింపు దక్కించుకుంది. గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ లీడ్ రోల్ చేసిన ఈ వెబ్ సిరీస్.. రింగ్ టోన్ ద్వారానూ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఓటింగ్ పర్సంటేజ్ ద్వారా స్కాం 1992కి టాప్ పొజిషన్ రావడం గొప్ప విషయం కాదనేది కొందరి మాట. ఆ లెక్కన తర్వాతి ప్లేసులో నిలిచిన నెట్‌ఫ్లిక్స్ బ్రేకింగ్ బ్యాడ్ సిసలైన విన్నర్ అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
ఈ కార్లు.. భద్రతకు భరోసా
ఆధునిక యుగంలో కాలంతో పోటీ పడుతూ అటు ఇటు పరుగులు పెడుతున్నాం. అయితే క్రమంలో రహదారి భద్రతను చాలా మంది గాలికొదిలేస్తున్నారు. దీంతో మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షల మంది చనిపోతున్నారు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2019లో 4,37,396 రోడ్డు యాక్సిడెంట్స్ జరిగాయి. వీటిలో 1.54 వేల మంది చనిపోగా.. మరో 4.39 మంది తీవ్రగాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వెబ్‌డెస్క్: ఇండియాలో కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ధనవంతులకే సొంతమైన కారు సౌకర్యం ఇప్పుడిప్పుడే సామాన్యుల చెంతకు వస్తోంది. చాలా మంది కారు కొనేప్పుడు డిజైన్, మైలేజీ, ఇంజన్ సామర్థ్యం తదితర అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. కానీ వీటన్నింటినీ మించి ముఖ్యమైన అంశం భద్రత. లక్షలు పోసి వెచ్చించే ఆ కారు ప్రమాదం జరిగినప్పుడు మనకు ఎంత వరకు భద్రత అందిస్తుందనేది ప్రధానం. ఎన్సీపీఏ రేటింగ్ బ్రిటన్‌కి చెందిన జీరో ఆర్గనైజేషన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం (NCPA) పేరుతో ప్రపంచ వ్యాప్తంగా కార్ల భద్రతపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసి రేటింగ్స్ ఇస్తోంది. తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన జాబితాలో మంచి రేటింగ్స్ సాధించిన కార్ల వివరాలు మీ కోసం టాటా ఆల్ట్రోజ్ హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఏకైక కారు టాటా ఆల్ట్రోజ్. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపే వ్యక్తి తల, మెడ, ఛాతి, మోకాళ్లుకు కచ్చితమైన భద్రత అందిస్తోంది. స్టాండర్డ్ వెర్షన్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ లభిస్తున్నాయి. మోడల్స్‌ని బట్టి ఎయిర్ బ్యాగ్స్ పెరుగుతాయి. ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు సీట్ బెల్డ్ రిమైండర్, ఏబీఎస్, ఈబీడీ బ్రేక్ సిస్టమ్స్, కార్నర్ స్టెబులిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఎన్సీపీఏ సంస్థ ఆల్ట్రోజ్‌కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. టాటా ఆల్ట్రోజ్ ధరలు రూ. 5.8 లక్షల నుంచి 9.56 లక్షల వరకు ఉంది. టాటా నెక్సాన్ పూర్తిగా ఇండియన్ మేడ్‌గా తయారై ఎన్సీపీఏ నుంచి 5 స్టార్ రేటింగ్ సాధించిన కారుగా టాటా నెక్సాన్ నిలిచింది. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో భద్రత విషయంలో 5 స్టార్ నెక్సాన్‌కి దక్కాయి. కారులో ముందు వరుసలో కూర్చునే ఇద్దరు వ్యక్తుల తల, మెడ, ఛాతి, మోకాళ్లకు రక్షణ కల్పిస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీలతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబులిటీ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, రోల్ ఓవర్ మైగ్రేషన్లు ఈ కారులో ఉన్నాయి. టాటా నెక్సాన్ కారు రూ. 7.2 లక్షల నుంచి 12.96 లక్షల వరకు లభిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఎన్సీపీఏ నుంచి సేఫర్ కార్ అవార్డు దక్కించుకున్న ఘనత మహీంద్రా ఎక్స్‌యూవీ 300కే దక్కింది. స్టాండర్డ్ వెర్షన్లలలో రెండు ఎయిర్‌బ్యాగ్స్ లభించగా.. హై ఎండ్ మోడల్స్‌లో సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా పొందు పరిచింది మహీంద్రా. ప్రమాదం జరిగినప్పుడు పెద్దలతో పాటు చిన్న పిల్లలకు కూడా ఇంచుమించు ఒకే రకమైన భద్రత, రక్షణ కల్పించడం ఎక్స్‌యూవీ 300 ప్రత్యేకత. ఈ అంశంలోనే మిగిత కార్ల కంటే ఎంతో ముందుంది ఈ మోడల్. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారు మార్కెట్లో 7.96 లక్షల నుంచి 11.47 లక్షల వరకు లభిస్తోంది. మారుతి సుజూకి విటారా బ్రెజా మైలేజీ విషయంలో మిగిలిన కార్లను వెనక్కి తోసే మారుతి భద్రత విషయంలో ఎప్పుడు వెనుకడుగే అన్నట్టుగా ఉండేది. దీంతో విటారా బ్రెజాలో భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంది మారుతి. దీంతో ఎన్సీపీఏలో 4 స్టార్ రేటింగ్ సాధించింది బ్రెజా కారు. మార్కెట్లో బ్రెజా ధర రూ. 7.52 లక్షల నుంచి రూ.11.26 లక్షల వరకు లభిస్తోంది. రెనాల్ట్ ట్రైబర్ ఎన్సీపీఏ నుంచి లేటెస్ట్గా 4 స్టార్ రేటింగ్ సాధించింది రెనాల్ట్ ట్రైబర్. మల్టీ పర్సస్ వెహికల్ సెగ్మెంట్లో ఉన్న రెనాల్ట్‌లో పెద్దలతో పాటు పిల్లల భద్రత విషయంలో మెరుగైన రేటింగ్స్ సాధించింది.అడల్ట్ భద్రత విషయంలో 4 రేటింగ్, పిల్లల భద్రత విషయంలో 3 స్టార్ రేటింగ్స్ సొంతం చేసుకుంది. రెనాల్ట్ ట్రైబర్ మోడల్స్ ధర మార్కెట్లో రూ. 5.3 లక్షల నుంచి 7.65 లక్షల వరకు ఉన్నాయి. వోక్స్ వ్యాగన్ పోలో వోక్స్ వ్యాగన్ పోలోకి ప్యాసింజర్స్ భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్‌ని ఇచ్చింది ఎన్సీపీఏ. ముందు వరుసలో కూర్చున్న వారికి తల, మెడలకు పూర్తి స్థాయి భద్రత ఇవ్వడంతో పాటు ఛాతికి సైతం ప్రమాద తీవ్రత తగ్గేలా జాగ్రత్తలు పాటించింది వోక్స్ సంస్థ. వోక్స్ వ్యాగన్ పోలో మోడళ్లు రూ. 6.17 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ధరల్లో లభిస్తున్నాయి. మహీంద్రా థార్ స్పోర్ట్ప్ యూటిలిటీ వెహికలసెగ్మెంట్లో థార్‌కి ప్రత్యేక స్థానం. గతేడాది 4 స్టార్ రేటింగ్ సాధించిన థార్‌కి ఈసారి కూడా అదే రేటింగ్‌కి ఇచ్చింది ఎన్సీపీఏ. ఈ ఐకానిక్ ఎస్యూవీ మోడల్ ధరలు రూ. 12.11 లక్షల నంఉచి రూ 12.81 వరకు ఉంది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాగ్ సెగ్మెంట్ కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న టాటా టియాగో సంస్థ భద్రత విషయంలో మెరుగైంది. పెద్దలకు 4 స్టార్, పిల్లలకు 3 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది గ్లోబల్ ఎన్సీపీఏ సంస్థ. స్టాండర్డ్ వెర్షన్లో రెండు ఎయిర్‌బ్యాగులు అందించే ఈ మోడల్ ఈ మోడల్ ధరలు రూ. 5 లక్షల నుంచి రూ. 6.96 లక్షల వరకు ఉంది. టాటా టిగోర్ టాటా టియాగో తరహాలోనే టిగోర్ సైతం పెద్దల విషయంలో 4 స్టార్, పిల్లల విషయంలో 3 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ మోడల్ ధరలు ధరలు రూ. 5.6 లక్షల నుంచి రూ. 7.74 లక్షల వరకు ఉంది. మహీంద్రా మొరాజో మల్టీపర్పస్ యూటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో ఇప్పటికే ప్రజల ఆధరణ దక్కించుకున్న మహీంద్రా మోరాజో భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్ సాధించింది. మార్కెట్లో మొరాజో మెడల్స్ రూ. 12.03 లక్షల నుంచి రూ. 14.04 లక్షల రేంజ్లో లభిస్తోంది. -
‘షాదీ ముబారక్’ సరికొత్త రికార్డు
గత శుక్రవారం(మార్చి 5) రిలీజ్ అయిన షాదీ ముబారక్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.1 రేటింగ్ తో టాప్ పోజీషన్ లో నిలిచింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా కి ప్రేక్షకులు ఆదరణ లభించింది. బుల్లితెరమీద స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సాగర్ వెండితెర పై కూడా ఈ సారి బలమైన కంటెంట్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఏ సినిమా కయినా కంటెంట్ బేస్ చేసుకొని రేటింగ్ ని అందించే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ( ఐ ఎమ్ డి బి) షాదీ ముబారక్ కు 9.1 రేటింగ్ ని అందించడం పై యూనిట్ హార్షం వ్యక్తం చేసింది. పెళ్ళి కోసం ఇండియాకి వచ్చిన ఎన్నారై కి పెళ్ళి చూపుల్లో ఎదురైన అనుభవాలను సునిశిత హాస్యంతో మలిచారు దర్శకుడు పద్మశ్రీ. సీరియస్ పాత్రల నుండి ఒక పక్కింటి కుర్రాడు పాత్రకి సాగర్ మారిన తీరు పై ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి చిత్రం తోనే తెలుగులో చాలా మంచి పేరును తెచ్చుకుంది దృశ్య . ఈ అమ్మాయి చలాకీ తనం తెరమీద మరో సాయిపల్లవిని గుర్తు చేసింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో జంట మద్య కెమిస్ట్రీ కుదిరితేనే ఆ కథ లో ప్రేక్షకులు ఇన్వాల్వ్ కాగలరు. సున్నిపెంట మాధవ్, తుపాకుల సత్యభామ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ లవ్ లో పడతారు. సిట్యువేషనల్ గా వచ్చే కామెడీ తో ఫ్యామిలీ మొత్తం చూసి ఆస్వాదించతగిన విధంగా రూపొందించడంతో ‘‘ షాదీ ముబారక్’’ ఆల్ టైం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారింది. తమ కంటెంట్ కి టాప్ రేటింగ్ దక్కడం చిత్ర యూనిట్ కి కొత్త ఉత్సాహం అందించింది. సాగర్ షాదీ ముబారక్ ఇచ్చిన కిక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో రాబోతున్నాడు. -
చెత్త సినిమా, 1 స్టార్ రేటింగే ఎక్కువ!
స్టార్ డైరెక్టర్ మహేశ్ భట్ నిర్మించిన, ఆయన కూతురు, హీరోయిన్ అలియా భట్ నటించిన తాజా చిత్రం "సడక్ 2". ఈ సినిమా ట్రైలర్ ప్రపంచంలోనే అత్యధిక డిస్‌లైకులు తెచ్చుకున్న రెండో యూట్యూబ్ వీడియోగా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. చూస్తుంటే ఇప్పుడు సినిమా కూడా రికార్డులు కొట్టేటట్లు కనిపిస్తోంది. ఆగస్టు 28న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పరమ చెత్తగా ఉందంటూ 35 వేలకు పైగా ప్రేక్షకులు ఐఎండీబీలో 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇంకా ఎంతోమంది ఇదే రేటింగ్ ఇస్తూనే ఉన్నారు. దీంతో ఐఎండీబీలో అత్యంత హీనమైన రేటింగ్ దక్కించుకున్న చిత్రంగా సడక్ మొదటి స్థానంలో నిలిచింది. 1.3 స్టార్ రేటింగ్‌తో టర్కీ సినిమా రెండో స్థానంలో ఉంది. (చదవండి: ప్రపంచ రికార్డు కొట్టేసిన సడక్ 2) కాగా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి బాలీవుడ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయనకు సరైన గుర్తింపు, అవకాశాలు ఇవ్వలేదంటూ సుశాంత్ అభిమానులు స్టార్ సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. నెపోటిజమ్ మహారాణి అంటూ అలియా భట్‌ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె నటించిన 'సడక్ 2' ట్రైలర్ విడుదల అవగా దానికి డిస్‌లైక్‌లు కొడుతూ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. తాజాగా సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలవడంతో మరోసారి రేటింగ్స్‌తో తమ ప్రతాపాన్ని చూపించారు. 'సినిమా దరిద్రంగా ఉంది', 'ఒక్క స్టార్ ఇవ్వడమే ఎక్కువ', 'నటన అస్సలు బాగోలేదు', 'ఫస్టాఫే బోర్ కొట్టేసింది' అంటూ నెటిజన్లు ఒకటికి మించి రేటింగ్ ఇవ్వడం లేదు. (చదవండి: ఇద్దరు ముద్దుగుమ్మల డాన్స్.. అదుర్స్) -
5 స్టార్ జస్ట్ మిస్!
సాక్షి, విశాఖపట్నం: చెత్త రహిత నగరాల జాబితాలో కేవలం 16 పాయింట్ల తేడాతో విశాఖ నగరం 5 స్టార్ రేటింగ్ కోల్పోయింది. సవరించిన గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్స్ జాబితాలో సింగిల్ స్టార్ నుంచి త్రీస్టార్ రేటింగ్ సాధించిన విశాఖ నగరం.. తృటిలో 5 స్టార్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. మొత్తం మూడు విభాగాల్లో కలిపి 225 పాయింట్లు రావాల్సి ఉండగా.. విశాఖ నగరం 209 పాయింట్లకే పరిమితమైంది. దీంతో త్రీస్టార్ రేటింగ్‌కే పరిమితమైపోయింది. మాండేటరీ విభాగంలో 85 పాయింట్లకు గాను 84, ఎసెన్షియల్‌లో 80కి 70, డిజైరబుల్ విభాగంలో 60 పాయింట్లు రావాల్సి ఉండగా 55 పాయింట్లు విశాఖ నగరానికి దక్కాయి. దీంతో 5 స్టార్ రేటింగ్ రానప్పటికీ 3 స్టార్ సాధించిన నగరాల జాబితాలో విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 72 నగరాలు 3 స్టార్ సాధించగా.. విశాఖ మొదటి స్థానంలో, తిరుపతి, విజయవాడ నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తిరుపతి నగరానికి విశాఖ కంటే 4 పాయింట్లు ఎక్కువ వచ్చినప్పటికీ.. కీలక విభాగాల్లో జీవీఎంసీ మెరుగైన స్థానంలో నిలవడంతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కొన్ని విభాగాల్లో 50 పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్ ర్యాంకింగ్ కోల్పోయినట్లు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, అదనపు కమిషనర్ వి.సన్యాసిరావు, సీఎంహెచ్వో డా.కేఎల్ఎస్జీ శాస్త్రి తెలిపారు. గ్రీవెన్స్ పరిష్కారం, ప్లాస్టిక్ నిషేధం, కాల్వల స్రీ్కనింగ్, తడిచెత్త ప్రాసెసింగ్, డంప్‌సైట్ రెమిడియేషన్ పద్ధతుల్లో 50 చొప్పున పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్ రేటింగ్ సాధించుకోవడంలో విఫలమయ్యామని కమిషనర్ వివరించారు. అయితే తొలి జాబితాలో సింగిల్ స్టార్‌కు పరిమితమైన సమయంలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ విభాగంలో సున్నా మార్కులు వేశారని.. తాజాగా సవరించిన మార్కుల జాబితాలో 100 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది కచ్చితంగా 5 స్టార్ రేటింగ్ సాధిస్తామని సృజన దీమా వ్యక్తం చేశారు. -
భారత్‌కు ఇంకాస్త మంచి రేటింగ్ ఇవ్వొచ్చు
న్యూఢిల్లీ: భారత్‌కు మరింత మంచి రేటింగ్ ఇవ్వవచ్చని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్‌లోటు, రుణ భారం వంటి పలు భారత ఆర్థిక ప్రాథమిక అంశాలు రేటింగ్ పెంపునకు తగిన విధమైన పటిష్టతతో ఉన్నాయని గురువారం విలేకరులతో అన్నారు. జూన్ ప్రారంభంలోనే భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ (సావరిన్ రేటింగ్) రేటింగ్ ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’ కి మూడీస్ తగించడం, ఇక బుధవారం మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఎస్అండ్పీ భారత్ రేటింగ్‌ను ‘బీబీబీ–’గానే (రెండు సంస్థల రేటింగ్– ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి జంక్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ) కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం వంటి అంశాలు సీఈఏ ప్రకటన నేపథ్యం. రేటింగ్‌ల విషయంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నిర్ణయాల తర్వాత ఇందుకు సంబంధించి ప్రభుత్వంలో కీలక అధికార స్థాయి నుంచి వచ్చిన స్పందన ఇది. సుబ్రమణ్యన్ అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► రుణ పునః చెల్లింపులకు సంబంధించి భారత్ సామర్థ్యం ఎంతో పటిష్టంగా ఉంది. ► భారత్ ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలను అందిస్తాయని సూచిస్తాయని రేటింగ్ సంస్థలు, భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ అధిక వృద్ధి బాటకు మళ్లుతుందని అంచనాలు వేస్తున్న సంగతి గమనార్హం. ► భారత్ ‘ఠి’ (వీ షేప్డ్– వేగవంతమైన ఆర్థిక రికవరీకి సంకేతం) నమూనా రికవరీ సాధిస్తుందనడంలో సందేహం లేదు. స్పానిష్ ఫ్లూ తరువాత ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ► ఆర్థిక వ్యవస్థలో రికవరీపై ఈ ఏడాది వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది రెండవ భాగం నుంచైనా రికవరీ ఉంటుందా? లేదా వచ్చే ఏడాదే ఇక ఇది సాధ్యమవుతుందా? అన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. ► అయితే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తగిన అన్ని చర్యలూ తీసుకోవడంపై ఆర్థిక వ్యవస్థ కసరత్తు చేస్తోంది. అలాగే ద్రవ్యలోటు కట్టడికీ ప్రయత్నిస్తుంది. ► ప్రైవేటైజేషన్ విధానం విషయంలో బ్యాంకింగ్ వ్యూహాత్మక రంగంగా ఉంది. ► మొండిబకాయిల పరిష్కారానికి ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు అంతగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. -
ఊపిరి పీల్చుకున్న టిక్‌టాక్
న్యూఢిల్లీ: ప్రపంచానికి కరోనా దెబ్బ తాకితే, టిక్‌టాక్‌కు క్యారిమీనటి దెబ్బ తగిలింది. దీంతో టాప్ రేటింగ్‌లో దూసుకుపోయిన టిక్‌టాక్ 1 స్టార్ రేటింగ్‌కు పడిపోయింది. ఇక టిక్‌టాక్‌కు రోజులు చెల్లిపోయాయి, ఇప్పుడో, అప్పుడో యాప్ కూడా కనిపించకుండా పోతుందని ఎంతో మంది అనుకుంటూ వచ్చారు. అయితే ఈ తతంగాన్ని అంతటినీ నిశితంగా పరిశీలిస్తోన్న గూగుల్ దారుణమైన రేటింగ్ ఇచ్చిన ఎనిమిది మిలియన్ల నెగెటివ్ రివ్యూలపై వేటు వేసింది. దీంతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్లేస్టోర్‌లో టిక్‌టాక్ 4.4 స్టార్ రేటింగ్‌తో తిరిగి యథాస్థితికి చేరుకుంది. ఊహించని పరిణామానికి యూట్యూబ్ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఈ గొడవలో గూగుల్ మధ్యలో ఎందుకొచ్చిందంటే.. అందరూ ఈ యాప్‌కు రేటింగ్, రివ్యూలు ఇస్తోంది గూగుల్ ప్లే స్టోర్‌లోనే. కాగా టిక్‌టాక్‌కు నెగెటివ్‌గా ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన చాలామంది తమ రివ్యూల్లో దానికి గల అసలు కారణాన్ని వెల్లడించలేదు. (యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్: గెలుపెవరిది?) పైగా ఆ యాప్‌కు సంబంధం లేకుండా ఇష్టారీతిన సమీక్షలు ఇచ్చారు. దీంతో వీటన్నింటిపై దృష్టి సారించిన గూగుల్ అసంబద్ధంగా ఉన్న రివ్యూలనన్నింటినీ తొలగించాలని నిర్ణయించుకుంది. సుమారు ఎనిమిది మిలియన్ల రివ్యూలను తీసివేసినట్లు తెలుస్తోంది. రివ్యూల దుర్వినియోగాన్ని తగ్గించేందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు గూగుల్ తన చర్యను సమర్థించుకుంది. కాగా యూట్యూబ్, టిక్‌టాక్‌ల మధ్య ఓమోస్తరు యుద్ధమే నడిచిన విషయం తెలిసిందే. భారతీయ యూట్యూబ్ అభిమానులు టిక్‌టాక్‌ను దేశంలో బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు. అంతిమంగా దారుణ రేటింగ్స్‌తో టిక్‌టాక్ క్రేజ్ అమాంతం పడిపోయింది. (ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ) -
దెబ్బకు టిక్‌టాక్‌కు దిమ్మతిరిగిపోయింది
టిక్‌టాక్‌కు ఊహించని దెబ్బ పడింది. ఇప్పటివరకూ టాప్ రేటింగ్‌తో, దుమ్ము దులిపే డౌన్‌లోన్లతో దూసుకుపోయిన టిక్‌టాక్‌కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ప్లేస్టోర్‌లో టిక్‌టాక్ యాప్ రేటింగ్ ఇప్పుడు రెండుకు పడిపోయింది. ఇంత దారుణమైన రేటింగ్‌ను టిక్‌టాక్ కలలో కూడా ఊహించి ఉండదు. మరి అలాంటి పాపులర్ యాప్‌కు ఇప్పుడెందుకీ పరిస్థితులు దాపురిచించాయో తెలుసుకుందాం... ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ప్రధాన అంశం "యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్". నెట్టింట ఈ ఫైట్ హోరాహోరీగా సాగుతున్నప్పటికీ యూట్యూబ్‌దే పైచేయి అవుతున్నట్లు తెలుస్తోంది. దానికి టిక్‌టాక్ రేటింగే పెద్ద ఉదాహరణ. ఎల్విష్ యాదవ్ అనే యూట్యూబర్ టిక్‌టాక్ యూజర్లను చెత్తతో పోలుస్తూ ఓ వీడియో చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన అమీర్ సిద్ధిఖీ అనే టిక్‌టాక్ యూజర్.. యూట్యూబర్లకు ఏదీ చేత కాదంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇది విన్నాక యూట్యూబర్లు ఊరుకుంటారా? టిక్‌టాకర్లను అన్ని కోణాల్లోనూ చెడుగుడు ఆడేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ యూట్యూబర్ క్యారీమినటీ. అతను మే 8న "యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్" పేరిట అప్లోడ్ చేసిన రోస్టింగ్ వీడియోకు వచ్చిన లైకులు, కామెంట్లు, వ్యూస్ ప్రతీది రికార్డే. (వ్యూయర్లు పడి చస్తారు... ఆ తొక్కలో ఎక్స్‌ప్రెషన్‌కి) అయితే ఏమైందో ఏమో కానీ, ఎన్నో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న వీడియో మే 14 నుంచి యూట్యూబ్‌లో కనిపించకుండా పోయింది. ఊహించని పరిణామంతో క్యారీమినటి కళ్లలో నీళ్లు తిరిగాయి. అది చూసిన అతని భారత యూట్యూబ్ అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. అతని బాధకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. క్యారీమినటి వీడియో డిలీట్ చేయడానికి కారణమైన టిక్‌టాక్‌ను ఊరుకునేది లేదని సోషల్ మీడియాలో మంగమ్మ శఫథం చేశారు. ఈ మేరకు టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేసుకుని చీప్ రేటింగ్(1.0) ఇచ్చి డిలీట్ చేయాలని ఓ ఉద్యమమే నడిపారు. దీంతో 4.6తో టాప్‌లో ఉన్న టిక్‌టాక్ రేటింగ్ ఇప్పుడు రెండుకు దిగజారిపోయింది. రానున్న రోజుల్లో ఇది మరింత పాతాళానికి పడిపోయే అవకాశమూ లేకపోలేదు. ఈ దెబ్బకు కోమాలోకి పోయినట్లున్న టిక్‌టాక్ ఈ విపత్తు నుంచి ఎలా కోలుకుంటుందో, ఎలా ఎదుర్కోనుందో చూడాలి. (యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్: గెలుపెవరిది?) -
బడ్జెట్ ప్రసంగం.. నాకేదీ గుర్తు లేదు!
న్యూఢిల్లీ : బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం వ్యంగంగా స్పందించారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు రేటింగ్ ఇవ్వమని విలేకర్లు అడగ్గా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. మీరు బడ్జెట్‌కు 1 నుంచి 10 వరకు ఎంత రేటింగ్ ఇస్తారన్న ప్రశ్నకు.. 1,0.. ఈ రెండు నెంబర్లలో ఏదైనా తీసుకోవచ్చంటూ సమాధానమిచ్చారు. అనంతరం బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ..160 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో తనకు ఏదీ గుర్తు లేదని అన్నారు. దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, గత ఆరు త్రైమాసికాలలో వృద్ధి రేటు క్షీణించిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇంత సుధీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని తాను వినలేదంటూ ఎద్దేవా చేశారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
వొడాఫోన్ ఐడియాకు ఏజీఆర్,రేటింగ్ షాక్
సాక్షి, ముంబై: సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) పై ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు టెల్కోలను భారీగా ప్రభావితం చేస్తోంది. మరోవైపు రేటింగ్ సంస్థల రేటింగ్‌లు ఆయా సంస్థల షేర్లను నష్టాల్లోకి నెడుతున్నాయి. తాజాగా కేర్ సంస్థ వొడాఫోన్ ఐడియాకు డౌన్ గ్రేడింగ్ రేటింగ్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింత బలహీనపర్చింది. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో వొడాఫోన్ ఐడియా షేర్లు 9 శాతానికిపైగా కుప్పకూలాయి. బీఎస్ఈలో రూ.3.48 వద్ద 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఎన్ఎస్ఇలో 9.2 శాతం క్షీణించి రూ .3.45కు చేరుకుంది. అటు భారతి ఎయిర్టెల్ షేర్ కూడా స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. కేజీ రేటింగ్స్ దీర్ఘకాలిక బ్యాంక్ సౌకర్యాలు, నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లపై రేటింగ్‌ను తగ్గించిందని వోడాఫోన్ ఐడియా బుధవారం తెలిపింది. టెలికాం విభాగం (డాట్) ప్రారంభ లెక్కల ప్రకారం, వోడాఫోన్ ఐడియా సుమారు రూ .40వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా, భారతి ఎయిర్టెల్ సుమారు రూ. 42 వేల కోట్ల (లైసెన్స్ ఫీజు , స్పెక్ట్రం వినియోగ ఛార్జీలతో సహా)ను కేంద్రానికి చెల్లించాల్సి వుంది. కాగా గురువారం దేశీయ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ కొత్త రికార్డు సృష్టించింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 280 పాయింట్లు లాభపడి 40312 పాయింట్ల స్థాయిని అధిగమించి ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది. -
సెంట్రల్‌బ్యాంక్, ఐఓబీ రేటింగ్ పెంపు
ముంబై: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ డిపాజిట్స్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ రేటింగ్ బీఏ3గా ఉంటే దీనిని బీఏ2కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు కేంద్రం తగిన తాజా మూలధనం సమకూర్చుతుండడం తమ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు కారణమని మూడీస్ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్‌లకు ఉన్న బీఏఏ3/పీ–3 రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కూడా మూడీస్ వివరించింది. గత నెల్లో కేంద్రం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,200 కోట్ల తాజా మూలధనాన్ని అందించింది. ఇందులో సెంట్రల్ బ్యాంక్‌కు రూ. 2,560 కోట్లు లభించగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.3,810 కోట్లు సమకూరాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.4,640 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు రూ. 4,110 కోట్లు లభించాయి. 2018 డిసెంబర్ నుంచి జనవరి 2019 మధ్య ఐఓబీకికి రూ.6,690 కోట్ల తాజా మూలధనం లభించింది. -
ఎయిర్‌టెల్‌కు రేటింగ్ షాక్
సాక్షి, ముంబై : టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో కుదేలైన దేశీ మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు రేటింగ్ షాక్ తగిలింది. క్యూ3 లాభాల్లో భారీ క్షీణతను నమోదు చేసిన ఎయిర్‌టెల్‌కు తొలిసారిగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ డౌన్ గ్రేడ్ రేటింగ్‌ను ఇచ్చింది. దీంతో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ఒకదశలో ఎయిర్ టెల్ షేరు 4 శాతం పతనమైంది. గ్లోబల్ దిగ్గజం మూడీస్ ఎయిర్టెల్ క్యాష్‌ఫ్లోపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో జంక్ స్టేటస్ ఇచ్చింది. ఇన్వెస్టర్ సర్వీసెస్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌కు సవరించింది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ బీఏఏ3 నుంచి బీఏ1కు సవరించింది. నాన్ ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ బీఏ1 ఇవ్వడం ద్వారా సంస్థ ఔట్‌లుక్‌ను ప్రతికూలంగా ప్రకటించింది. -
పెట్టుబడికి రేటింగ్ చూస్తారా?
సినిమా చూసేముందు ఆ సినిమాకు రేటింగ్ ఎంతనేది చూస్తారు కొందరు! కొందరైతే రెస్టారెంట్లకు వెళ్లేటపుడు కూడా దాని రేటింగ్, దానిపై ఇతరుల రివ్యూలు చూస్తారు! ఇలాంటి చిన్న చిన్న విషయాలకే రేటింగ్‌లు, రివ్యూలు చూసినపుడు... మరి మనం కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటపుడు ఇలాంటివి చూడొద్దా..? అసలు ఆ పెట్టుబడిలో రిస్కు ఎంత? రాబడి ఎంత? దాని గురించి, దాన్ని జారీ చేస్తున్నవారు చెప్పే మాటల్లో నిజమెంత? ఇవన్నీ చెప్పేది రేటింగ్ ఏజెన్సీలే. అన్ని అంశాలూ చూసి... వాటిలో పెట్టుబడి పెట్టవచ్చో, లేదో అవే చెబుతాయి. అంటే... అవి ఇచ్చే రేటింగ్‌ను బట్టి పెట్టుబడి పెట్టాలో, పెట్టకూడదో మనమే నిర్ణయం తీసుకోవచ్చు. నిజానికి అందరూ కాకున్నా చాలా మంది మాత్రం పెట్టుబడులు పెట్టే ముందు సదరు ఆర్థిక సాధనానికి ఏ రేటింగ్ ఉందన్నది చూస్తారు. కాకపోతే, వీరిలో కూడా అత్యధికులు ఏ అంశాల ఆధారంగా రేటింగ్ సంస్థలు ఓ సాధనానికి రేటింగ్ ఇస్తాయనేది పట్టించుకోరు. ఫైనాన్షియల్ కంపెనీల ఉత్పత్తులకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు పలు రకాల రేటింగ్‌లు ఇస్తుంటాయి. ఆయా కంపెనీల రిస్క్ అంశాలను మదింపు చేసిన అనంతరం ఆయా కంపెనీల బాండ్లు, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలు లేదా డెట్ ఇనుస్ట్రుమెంట్ల రేటింగ్‌తో పాటు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెస్తాయి. దీంతో ఇవి తమకు నప్పుతాయా, లేదా అన్నది ఇన్వెస్టర్లు సులభంగా అర్థం చేసుకోవచ్చు. రేటింగ్ అంశాల్లోకి సెబీ ఇటీవలే లిక్విడిటీని కూడా జోడించింది. దీంతో కంపెనీ నగదు బ్యాలన్స్, లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ (సత్వరం నగదుగా మార్చుకునే పెట్టుబడులు), లిక్విడిటీ కవరేజీ రేషియో, గడువు తీరే రుణాలకు చేయాల్సిన చెల్లింపులకు సరిపడా నగదు ప్రవాహాల వివరాలను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇన్వెస్టర్లు తాము ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు ఉపకరించేవే. ఓ కంపెనీ ప్రొఫైల్‌ను విశ్లేషించే విషయంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఫైనాన్షియల్ రిస్క్ ఓ కంపెనీ నగదు ప్రవాహాల అందుబాటు, నిలకడ, రుణాలను సమయానుకూలంగా చెల్లించేయడం వంటి అంశాలు ఫైనాన్షియల్ రిస్క్‌లో భాగం. ఇందులో భాగంగా కంపెనీ వ్యాపార బలా, బలాలను అంచనా వేయడం జరుగుతుంది. ఈ బలాల ఆధారంగా ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేస్తాయి. ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యంగా ఉంటే, నిధుల లభ్యత ఉంటే, సంబంధిత కంపెనీ ఆర్థిక సాధనంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది సంకేతం. వ్యాపార రిస్క్ నగదుకు కొరత ఏర్పడిన సందర్భాల్లో... ఓ కంపెనీ బలాన్ని అర్థం చేసుకునేందుకు ఆ కంపెనీ నగదు ప్రవాహాల నిలకడ, స్థిరత్వం అన్న అంశాలు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. ‘‘కంపెనీ వ్యాపార మూలాలను విశ్లేషించడం, నిర్వహణ సామర్థ్యాలు, ఆ రంగంలో కంపెనీ స్థానం, సంబంధిత రంగానికి ఉన్న సానుకూలతలను విశ్లేషించడం జరుగుతుంది. ఆ రంగం తీవ్రమైన పతనంలో ఉంటే లేదా కంపెనీ ఫండమెంటల్స్‌లో లేదా మార్కెట్ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటే రేటింగ్‌పై ప్రతిఫలిస్తాయి’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. యాజమాన్య రిస్క్ యాజమాన్య పరంగా రిస్క్ అంశాలను కూడా రేటింగ్ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకుంటాయి. యాజమాన్యం అనుసరించే విధానాలు, వ్యాపారంలో తీసుకునే రిస్క్, వ్యూహాలను పరిశీలిస్తాయి. అలాగే, కంపెనీని నడిపించే యాజమాన్యానికి ఉన్న అనుభవం, ట్రాక్‌రికార్డ్ (గత చరిత్ర)ను కూడా చూస్తాయి. యాజమాన్యం అధిక రిస్క్ తీసుకునే తరహా అయితే... రుణాలు ఎక్కువగా తీసుకోవడం లేదా ప్రస్తుత కార్యకలాపాలను మించి ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతుంది. దీంతో రేటింగ్ ఏజెన్సీలు వీటిని సానుకూలంగా చూడవు. అందుకే కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ సెక్యూరిటీలు, డిబెంచర్లు, డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టే ముందు యాజమాన్య రిస్క్‌ను తప్పకుండా చూడాలి. ప్రాజెక్టు రిస్క్ ఓ కంపెనీ కొత్త ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నవారు, ఆ ప్రాజెక్టు తుది రూపం, అందులో ఉన్న లాభాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ (ఐడీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయడం ఇటువంటిదే. ఈ తరహా వాటిల్లో పెట్టుబడికి రిస్క్ చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. ఓ కంపెనీ కొత్త ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు నిధులు సమీకరించడం సాధారణమే అవుతుంది. అందుకే, ఓ కంపెనీ నూతన ప్రాజెక్టులకు సంబంధించిన రిస్క్‌ను కూడా రేటింగ్ సంస్థలు చూసి రేటింగ్ ఇస్తుంటాయి. ఎగవేత అవకాశాలు అన్నింటికంటే ముఖ్యమైనది ఓ కంపెనీ డిఫాల్ట్ రిస్క్. ఎందుకంటే ఇది కంపెనీ ప్రొఫైల్‌పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఈ విభాగంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. రుణదాతలు, ఆర్థిక సంస్థలు, ఇన్వెస్టర్లకు ఈ డిఫాల్ట్ రిస్క్ ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందుకే ఓ కంపెనీ ఆర్థిక సాధనంలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీకి అప్పటికే ఉన్న రుణ భారం, ఆ కంపెనీ పెట్టుబడులు వంటివి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సలహాలు అవసరం. ఏ రేటింగ్ అయితే బెటర్? క్రెడిట్ రేటింగ్ తగ్గితే...? క్రెడిట్ రేటింగ్ అన్నది ఓ ఆర్థిక సాధనానికి ఉన్న క్రెడిట్ రిస్క్‌ను తెలియజేస్తుంది. కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేసే వారికి క్రెడిట్ రేటింగ్ చాలా ముఖ్యమైన పారామీటర్. కంపెనీల ఐపీవోలకు కూడా ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారంలోనే ఇక్రా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ), దీర్ఘకాలిక రుణాల రేటింగ్లను తగ్గించిన విషయం తెలిసిందే. చాలా వరకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎన్సీడీలు, డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్ల రాబడులను ఈ పరిణామం దెబ్బతీసే అంశమే. అయితే, ఓ కంపెనీ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఆమ్టెక్ ఆటో రేటింగ్‌ను కూడా ఇదే విధంగా రేటింగ్ ఏజెన్సీలు తగ్గించడం జరిగింది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన జేపీ మోర్గాన్ మ్యూచువల్ ఫండ్ చేదు ఫలితాలను చవిచూసింది. 2017లో ఐడీబీఐ బ్యాంకు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రేటింగ్లను కూడా తగ్గించడంతో ఆ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. క్రెడిట్ రేటింగ్ అంటే...? ఓ కంపెనీ వ్యాపారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి, వ్యాపార పరమైన రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో యాజమాన్యం క్వాలిటీ, సామర్థ్యాన్ని రేటింగ్ ఏజెన్సీలు మదింపు వేసి దాన్ని తెలియజేస్తూ ఇచ్చేదే క్రెడిట్ రేటింగ్. కేర్ రేటింగ్స్, క్రిసిల్, ఇక్రా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఏజెన్సీలు ఈ సేవలు అందిస్తుంటాయి. రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం అంటే అర్థం... డిపాజిట్లు, ఎన్సీడీల రూపంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం సంబంధిత కంపెనీకి సన్నగిల్లినట్టు. ఇదే జరిగితే రుణదాతలు తాజాగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. అలాగే, ప్రస్తుత రుణాల రీఫైనాన్స్‌కు కూడా ఒప్పుకోని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఏ రేటింగ్ కూడా స్థిరంగా ఉంటుందని చెప్పలేం. నెగటివ్ నుంచి పాజిటివ్‌కు, పాజిటివ్ నుంచి నెగటివ్‌కు కూడా మారిపోవచ్చు. సాధారణంగా ఏఏఏ లేదా ఏఏ రేటింగ్ అనేవి అధిక రేటింగ్ సూచికలు. ఈ రేటింగ్ ఉన్న వాటికే పరిమితం కావడం కాస్తంత భద్రతతో కూడినది. ఇంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటే కచ్చితంగా మరింత రిస్క్‌ను స్వీకరిస్తున్నట్టుగానే భావించాలి. మీరు పెట్టుబడి పెట్టిన డిపాజిట్ రేటింగ్ తగ్గించడం జరిగితే, పెనాల్టీ చెల్లించి అయినా ముందుగానే వైదొలగడం సురక్షితం. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారు రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేస్తే ఆయా ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఎన్ఏవీలు క్షీణించే పరిస్థితి ఏర్పడుతుంది. ఓ పథకం ఎంత మేర పెట్టుబడులను కలిగి ఉందన్న దానిపై ఈ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఎక్స్పోజర్ కలిగి ఉంటే ఈ నష్టం మరింత అధికంగా ఉంటుంది. ఆగస్ట్ చివరి నాటి గణాంకాల ప్రకారం 40 డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు బాండ్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. వీటి పెట్టుబడులు 0.2–10 శాతం మధ్య ఉన్నాయి. ఈ గ్రూపు బాండ్ల రేటింగ్‌ను తగ్గించడంతో డెట్ ఫండ్స్ ఎన్ఏవీల విలువలు 0.05 నుంచి 2 శాతం వరకు ప్రభావితం అవుతాయని అంచనా. అసలు ఈ రేటింగ్ ఏం చెబుతుంది? ఏ రేటింగ్ ఉంటే మన పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది? ఏ రేటింగ్ ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది? ఇందులో డెట్ సాధనాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈక్విటీ సాధనాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకసారి చూద్దాం... దీర్ఘకాలిక డెట్ సాధనాలకైతే... ► ఏఏఏ చెల్లింపు బాధ్యతలను సకాలంలో నిర్వహించడంలో అత్యధిక భద్రతను ఈ రేటింగ్ తెలియజేస్తుంది. దీన్లో పెట్టుబడులకు అతి తక్కువ రిస్క్ ఉన్నట్లు లెక్క. ► ఏఏ ఈ రేటింగ్ కలిగిన సాధనాలు కూడా అధిక భధ్రతకు చిహ్నమే. ఇది కూడా తక్కువ రిస్క్‌నే సూచిస్తుంది. ► ఏ సకాలంలో చెల్లింపులు చేసే విషయంలో తగినంత భద్రత ఉందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది. మిగిలిన రెండు సాధనాల కంటే ఇందులో భద్రత కొంచెం తక్కువ. ► బీబీబీ తీసుకున్న డిపాజిట్లు, రుణాల తిరిగి చెల్లింపుల విషయంలో మోస్తరు భద్రతే ఉన్నట్టు ఈ రేటింగ్ అర్థం. మోస్తరు రిస్క్ ఉంటుంది. ► బీబీ తీసుకున్న వాటిని తిరిగి చెల్లించే విషయంలో మోస్తరు డిఫాల్ట్ రిస్క్ ఉంటుందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది. ► బీ ఇది అధిక రిస్క్‌కు సూచిక. డిఫాల్ట్ రిస్క్ అధికంగా ఉంటుంది. ► సీ ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే డిఫాల్ట్‌కు అత్యధిక అవకాశాలుంటాయి. అంటే రిస్క్ చాలా ఎక్కువ. ► డీ డిఫాల్ట్ అయ్యేందుకు, త్వరలోనే డిఫాల్ట్ అవనున్నట్టు ఈ రేటింగ్ తెలియజేస్తుంది. షార్ట్ టర్మ్ డెట్ సాధనాలకు రేటింగ్ ► ఏ1 క్రెడిట్ రిస్క్ చాలా తక్కువగా ఉందని తెలియజేస్తుంది. అంటే పెట్టుబడులకు అధిక భద్రతకు చిహ్నం. సకాలంలో చెల్లింపులు చేసేందుకు అధిక సామర్థ్యం ఉందని తెలియజేసేది. ► ఏ2 తక్కువ క్రెడిట్ రిస్క్‌కు సూచిక. ఇందులో పెట్టుబడులకూ అధిక భద్రత ఉంటుందని భావించొచ్చు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ► ఏ3 మోస్తరు స్థాయి భద్రతే ఉంటుంది. మిగిలిన రెండింటితో పోలిస్తే ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో పెట్టుబడులకు రిస్క్ కాస్త ఎక్కువ ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. ► ఏ4 భద్రత నామమాత్రంగా ఉంటుందన్న దానికి ఈ రేటింగ్ నిదర్శనం. సకాలంలో చేసే చెల్లింపులకు గ్యారంటీ ఉండదు. అధిక రిస్క్ ఉన్న గ్రేడ్‌గానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ► డీ ఈ రేటింగ్ కలిగిన సాధనంలో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే డిఫాల్ట్ లేదా డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. -
ఎయిర్‌టెల్‌కు రేటింగ్ షాక్
సాక్షి, ముంబై: టెలికాం కంపెనీలకు రేటింగ్ షాక్ తగిలింది. ప్రధానంగా టెలికా మేజర్ భారతి ఎయిర్‌టెల్‌కు డౌన్ రేటింగ్ దెబ్బ పడింది. బాండ్ రేటింగ్‌లో అతి తక్కువ రేటింగ్ ఇవ్వడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎయిర్టెల్ కౌంటర్ దాదాపు 5 శాతానికిపైగా పతనమైంది. మూడీస్ ఎయిర్‌టెల్‌కు బీఏఏఏ3 ర్యాంకింగ్ఇచ్చింది. లాభాలు, క్యాష్ ఫ్లో బలహీనంగా ఉండనుందని మూడీస్ అంచనా వేసింది. తమ సమీక్షలో ఎయిర్టెల్ లాభదాయకత, ప్రత్యేకంగా భారతీయ మొబైల్ సేవల లాభాలు క్షీణత, అధిక రుణభారం, తరుగుతున్న మూలధన నిధుల కారణంగా ఈ అంచనాకు వచ్చినట్టు మూడీ వైస్ ప్రెసిడెంట్ , సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అన్నాలిసా డిచియారా చెప్పారు కాగా వరుసగా పదవ త్రైమాసికంలో కూడా ఎయిర్టెల్ లాభాలు దారుణంగి పడిపోయాయి. 2018 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్టెల్ లాభాలు 65.4 శాతం క్షీణించింరూ. 119 కోట్లనుసాధించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 343 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం ఆదాయం రూ .20,422 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .21,777 కోట్ల కంటే 6.2 శాతం తక్కువ. -
విద్యార్థులకు రుణాలివ్వాలంటే భయం
సాక్షి, న్యూఢిల్లీ : రుణాలు తీసుకున్న విద్యార్థులు తిరిగి వాటిని చెల్లించక పోవడంతో భారతీయ బ్యాంకులు వారికి రుణాలు ఇవ్వాలంటే భయపడుతున్నాయి. దాంతో విద్యార్థులకు రుణాలిస్తున్న శాతం రోజు రోజుకు గణనీయంగా పడిపోతోంది. 2015 నుంచి 2017 సంవత్సరాల మధ్య విద్యార్థులకు రుణాలు మంజూరు చేయడం ఏకంగా 17 శాతం నుంచి రెండు శాతానికి పడిపోయింది. విద్యార్థులు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించక పోవడమే కారణమని ‘ది రీసర్చ్ అండ్ రేటింగ్ ఏజెన్సీ–కేర్ రేటింగ్స్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. విద్యార్థులు తీసుకున్న రుణాల్లో 2015 నుంచి 2017 సంవత్సరాల మధ్య నిరర్థక ఆస్తులు 5.7 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగాయి. అంటే, 2017, మార్చి నెల నాటికి నిరర్థక ఆస్తులు 5,192 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2016, డిసెంబర్ నెల నాటికి దేశంలోని విద్యార్థులకు బ్యాంకులు మొత్తం 72,336 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాయి. వాటిలో 95 శాతం రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకులే అందజేశాయి. మొండి బకాయిల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కాకుండా డిగ్రీ విద్యార్థులు తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రుణాల్లో కూడా మూడవ పార్టీ, కొలాటరల్ గ్యారెంటీ అవసరం లేకుండా నాలుగు లక్షల రూపాయలలోపు తీసుకున్న రుణాలే ఎక్కువ. తల్లిదండ్రులు, విద్యార్థులు సంయుక్తంగా చెల్లించాల్సిన రుణాలకన్నా విద్యార్థులు చెల్లించాల్సిన రుణాల్లోనే ఎక్కువ మొండి బకాయిలు ఉన్నారు. ఇక ప్రాంతాల వారిగా ఈ మొండి బకాయిలను చెల్లించని వారు ఎంతంటే దక్షిణాదిలో 56 శాతం మంది విద్యార్థులుండగా, ఉత్తరాదిలో 44 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. దక్షిణాదిలోనూ కేరళ, తమిళనాడులోనే మొండి బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మొండి బకాయిల శాతం పది శాతం ఉండగా, దేశవ్యాప్తంగా సగటున 7.67 శాతం ఉంది. బ్యాంకులు విద్యార్థులకు రుణాలు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు విద్యార్థులకు రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఆ సంస్థలు 2017, మార్చి నెల నాటికి 5000 కోట్ల రూపాయలను విద్యార్థులకు రుణంగా అందజేశాయి. రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు చేసిన పొరపాట్లను ఈ సంస్థలు చేయడం లేదు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ సైస్స్ కోర్సులు చేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొలాటరల్ లేదా మూడవ పార్టీ గ్యారెంటీ అవసరం లేని రుణాలను మంజూరు చేయడం లేదు. ఉద్యోగాలు లేక , రాక, వచ్చిన తక్కువ జీతాలను ఆఫర్ చేయడం వల్ల తాము రుణాలను చెల్లించలేక పోతున్నామని మొండి బకాయిల విద్యార్థులు వాపోతున్నారు. నీరవ్ మోదీ లాంటి వాళ్లు వేల, వేల కోట్ల రూపాయలను చెల్లించక పోయినా పట్టించుకోరుగానీ, తాము పది, పాతిక లక్షల రూపాయలను చెల్లించకపోతనే బ్యాంకులు లబోదిబోమంటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మైండ్‌స్పేస్‌కు ఐజీబీసీ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కే రహేజా కార్ప్‌కు చెందిన మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ కమర్షియల్ బిజినెస్ పార్క్‌కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు దక్కింది. నగరంలో గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్ దక్కించుకున్న తొలి వాణిజ్య ప్రాంగణమిదే. దేశ వ్యాప్తంగా అయితే 11వ ప్రాపర్టీ. ‘‘ప్రాంగణ ప్రణాళిక, నీరు, ఇంధన సామర్థ్యం, పర్యావరణం, నాణ్యత, ఆవిష్కరణలు ఇతరత్రా అంశాలపై 54 పాయింట్లను దక్కించుకుందని’’ కే రహేజా కార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షబ్బీర్ కాంచ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. మైండ్‌స్పేస్‌లో 3,500 చెట్లు.. మైండ్ స్పేస్ ప్రాంతం 110 ఎకరాల్లో ఉంది. ఇందులో 21 శాతం స్థలం ల్యాండ్ స్కేప్ కోసం కేటాయించారు. మొత్తం 3,500 చెట్లున్నాయి. కోటి చ.అ. బిల్టప్ ఏరియాలోని వాణిజ్య ప్రాంతంలో 21 వాణిజ్య భవనాలు, 80 వేలకు పైగా నివాసితులున్నారు. 100 శాతం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మురుగు నీటి శుద్ధి కేంద్రం, ఆన్సైట్లో 1.47 మెగావాట్లు, ఆఫ్‌సైట్‌లో 2 మెగావాట్ల సౌర విద్యుత్ ఏర్పాట్లు వంటివి ఉన్నాయి. 45.50 మి.చ.అ.ల్లో గ్రీన్ ప్రాజెక్ట్‌లు.. ఇప్పటికే కే రహేజా కార్ప్ దేశంలోని పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో 45.50 మిలియన్ చ.అ.ల్లో యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) అందించే లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ (ఎల్ఈఈడీ), ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు పొందిన నివాస, వాణిజ్య, ఆతిథ్య భవనాలను నిర్మించింది. వీటిల్లో 29 కమర్షియల్ ప్రాజెక్ట్‌లు ఎల్ఈఈడీ గోల్డ్ రేటింగ్ పొందగా.. 6 ప్రాజెక్ట్‌లు ప్రీ–సర్టిఫికెట్ పొందాయి. ఐజీబీసీ నుంచి 7 నివాస ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందగా.. 4 ప్రాజెక్ట్‌లు ప్రీ–సర్టిఫికెట్ పొందాయి. -
ఏపీ యూత్ పవర్.. పడిపోయిన బీజేపీ రేటింగ్
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర యువత, నెట్‌జన్లు సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విభజన సమయంలో పార్లమెంట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు తమ ఆవేదన వ్యక్తం చేయడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తమక ప్రత్యేక హోదా కావాలంటూనే కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఫేస్బుక్ పేజీని లక్ష్యంగా చేసుకొని తమ ఆవేదనని నిరసన రూపంలో తెలియచేస్తున్నారు. బీజేపీ ఫేస్బుక్ పేజీపై రేటింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాలంటూ బీజీపీ పేస్బుక్ పేజీకీ తక్కువ రేటింగ్ ఇస్తున్నారు. దీంతో బీజేపీ పేజీలో రేటింగ్ ఆప్షన్‌ను డిజేబుల్ చేశారు. దీంతో పేజీ రేటింగ్ ఒక్కసారిగా 1.1కి పడిపోయింది. ఈ పేజీకీ దాదాపు 35 వేలకు పైగా 1పాయింట్ రేటింగ్ ఇచ్చారు. గతంలో 17వేల మందికి పైగా 5స్టార్ రేటింగ్ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ యువత కాంపెయిన్‌తో కేవలం రెండు రోజుల్లోనే ఒక్కసారిగా బీజేపీ పేజీ రేటింగ్ 1.1కి పడిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధానికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం గురించి తెలిసేలా యువత, నెట్‌జన్లు ట్రెండింగ్ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక హాష్ ట్యాగ్‌లను రూపొందించి ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు పెడుతున్నారు. -
ట్రంప్ పరిపాలనకు ఊహించిన రేటింగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై భారీ ఎత్తున అసమ్మతి వెల్లువెత్తింది. పదవి చేపట్టిన తొలినాళ్లలో ఆయనకు లభించిన మద్దతు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రఖ్యాత సర్వే సంస్థ ‘రాస్మెస్సన్ రిపోర్ట్స్’.. ట్రంప్ తొలి ఏడాది పాలనపై నిర్వహించిన ఓటింగ్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ట్రంప్ మొదటి ఏడాది పనితీరుకు 53 శాతం అసమ్మతి రాగా, కేవలం 46 శాతం మాత్రమే ఆమోదం లభించింది. తన ఏడాది పాలనలో వీసా, వర్క్ పర్మిట్ల కోతలు మొదలు ఇస్లామిక్ దేశాలపై ఆంక్షలు, కొరియాతో యుద్ధ సన్నాహాలు లాంటి సంచలన నిర్ణయాలెన్నో ట్రంప్ తీసుకున్న సంగతి తెలిసిందే. 2017 జనవరి 20న ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పుడు 56 శాతంగా ఉన్న అప్రూవల్ రేటింగ్.. క్రమంగా తగ్గుతూ ఆగస్టు నాటికి కనిష్టంగా 38 శాతానికి చేరింది. డిసెంబర్ 28 నాటికి ట్రంప్ పెర్మార్మెన్స్ అప్రూవల్ రేటింగ్ 46శాతంగా ఉందని రాస్మెన్సన్ సర్వేలో వెల్లడైంది. అమెరికా అధ్యక్ష సమకాలీన చరిత్రలో ఇంత తక్కువ రేటింగ్ పొందింది ట్రంప్ ఒక్కరేనని ‘డెయిలీ మెయిల్’ పేర్కొంది. చైనా, కొరియాలపై మండిపాటు : కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాకు ఇప్పటికే లెక్కలేనన్ని హెచ్చరికలు చేసిన అమెరికా తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ సమాజం అభ్యర్థనను పక్కనపెట్టి మరీ ఉత్తరకొరియాకు ఆయిల్ సరఫరా చేస్తోన్న చైనాపై ట్రంప్ మండిపడ్డారు. ‘‘చైనా ఇంకా ఉత్తరకొరియాకు ఆయిల్ సరఫరా చేస్తుండటం బాధాకరం. ఇలాంటి చర్యలు.. స్నేహపూర్వక పరిష్కారాలకు విఘాతం కలిగిస్తాయి’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. -
మెరుగుపడనున్న కంపెనీల రేటింగ్
ముంబై: భారత కంపెనీల క్రెడిట్ రేటింగ్ వచ్చే ఏడాది మెరుగుపడే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ,మూడీస్ తెలిపింది. జీఎస్టీ సంబంధిత సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయని, దీంతో కంపెనీల పరపతి రేటింగ్ మెరుగుపడుతుందని మూడీస్ పేర్కొంది. కంపెనీల స్థూల లాభం 5–6 శాతం వృద్ధి ! వచ్చే ఏడాది జీడీపీ 7.6 శాతంగా ఉండనున్నదని, ఫలితంగా అమ్మకాలు పుంజుకుంటాయని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఎనలిస్ట్ కౌస్తుభ్ చౌబల్ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగుపడటం, కమోడిటీ ధరలు తగిన స్థాయిలోనే ఉండటం, వంటి కారణాల వల్ల 12–18 నెలల కాలంలో భారత కంపెనీల స్ఠూల లాభం 5–6 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆయిల్, రియల్టీ, వాహన, వాహన విడిభాగాలు, ఐటీ సర్వీసుల కంపెనీలకు నిలకడ అవుట్‌లుక్‌ను ఇస్తున్నామని తెలిపారు. తీవ్రమైన పోటీ కారణంగా ఆదాయం, మార్జిన్లపై ఒత్తిడి నెలకొంటుందని, అందుకని టెలికం కంపెనీలకు మాత్రం ‘ప్రతికూలం’ అవుట్‌లుక్‌ను ఇస్తున్నామని పేర్కొన్నారు. రుణ పరిస్థితులు మెరుగుపడతాయ్.. వచ్చే ఏడాది పలు కంపెనీలు తమ రుణ పునర్వ్యవస్థీకరణ అవసరాలను సులభంగానే నిర్వహించుకోగలవని చౌబల్ వివరించారు. జీఎస్టీ పన్ను రేట్లలో మరింతగా సరళీకరణ, ఇతర సంస్థాగత సంస్కరణలు, తదితర అంశాల కారణంగా కంపెనీల నిర్వహణ లాభం పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో కంపెనీల రుణ పరిస్థితులు మెరుగుపడతాయని వివరించారు. ఆస్తుల వేల్యూయేషన్లు మెరుగుపడటం కూడా కొన్ని కంపెనీల రుణ పరిస్థితులు మెరుగుపడటటనికి దారితీస్తుందని పేర్కొన్నారు. అయితే వృద్ధి 6 శాతం కంటే తక్కువగా ఉండటం, కమోడిటీ ధరలు తగ్గడం వంటి ప్రతికూలతలు చోటు చేసుకుంటే మాత్రం కంపెనీల స్థూల లాభాల్లో వృద్ధి తక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
బ్యాంకుల రేటింగ్‌కు సానుకూలం: ఫిచ్
ముంబై: బ్యాంకులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక– బ్యాంకుల రేటింగ్‌కు సానుకూల అంశమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. బ్యాంకుల మూలధన అవసరాలను నెరవేర్చడంలో తాజా ప్రణాళిక ఎంతో కీలకమైనదని నివేదిక వివరించింది. అంతర్జాతీయ బ్యాంకింగ్ బాసెల్–3 ప్రమాణాలకు అనుగుణంగా భారత్ బ్యాంకింగ్‌కు 2019 మార్చికి 65 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని గత నెల్లో ఫిచ్ అంచనావేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యలోటుపై ఎఫెక్ట్... రీక్యాపిటలైజేషన్ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తే, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) ద్రవ్యలోటు లక్ష్యంపై ప్రభావితం చూపే వీలుందని ఫిచ్ అంచనా వేసింది. ప్రభుత్వానికి వచ్చీ–పోయే ఆదాయం మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.2 శాతం ఉండాలన్న లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే జరిగితే వేరే రంగంలో వ్యయ కోతలు జరిగే వీలుందని సైతం నిర్దేశించింది. -
ఉత్తమమైన కస్టమర్ సర్వీసులు..
12 బ్యాంకులే పాస్.. ముంబై: దేశంలోని 51 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నాయి. ఇవి ‘హై’ రేటింగ్‌ను పొందాయి. ఈ 12 బ్యాంకుల్లో కేవలం ఒకే ఒక ప్రభుత్వ బ్యాంక్ ‘ఐడీబీఐ’ స్థానం పొందింది. మిగతావన్నీ ప్రైవేట్, విదేశీ బ్యాంకులే. బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) తాజాగా వార్షిక కోడ్ కాంప్లియెన్స్ రేటింగ్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ‘హై’ రేటింగ్ పొందిన బ్యాంకుల్లో ఆర్బీఎల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, సిటీ బ్యాంక్‌లు ఉన్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ స్కోర్ మిగతా అన్నింటికన్నా ఎక్కువగా 95గా నమోదయ్యింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకులు స్కోర్ సగటున 77గా ఉంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కోర్ 78గా నమోదయ్యింది. ఇది కొంత విచారింపదగిన అంశం. కాగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ ఈ బీసీఎస్‌బీఐ. మంచి బ్యాంకింగ్ విధానాలను ప్రోత్సహించడం, పారదర్శకత పెంపొందించడం, కార్యాచరణ ప్రమాణాల మెరుగుదల వంటి పలు అంశాల సాధనే బీసీఎస్‌బీఐ ప్రధాన లక్ష్యం. -
‘క్యాండిడేట్స్’కు అర్హతే లక్ష్యం
♦ గ్రాండ్‌ప్రి’లతో మంచి అవకాశం ♦ ఇది నా కెరీర్లో అత్యుత్తమ దశ ♦ ‘సాక్షి’తో గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ భారత చెస్ చరిత్రలో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటి ఆటకు మరింత గుర్తింపు తెచ్చిన ఆటగాడు పెంటేల హరికృష్ణ. సుదీర్ఘ కాలంగా నిలకడగా విజయాలు సాధిస్తున్న ఈ తెలుగు ఆటగాడి కెరీర్ ఇటీవల మరింత ఊపందుకుంది. కొద్ది మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు మాత్రమే అందుకోగలిగిన 2770 రేటింగ్‌కు ఇటీవలే హరికృష్ణ చేరుకోవడం పెద్ద విశేషం. ప్రస్తుతం ఆటపరంగా తన అత్యుత్తమ దశలో ఉన్నానని హరి చెబుతున్నాడు. తన ప్రదర్శన, భవిష్యత్తు టోర్నీలు తదితర అంశాలపై ‘సాక్షి’ క్రీడా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వూ్య విశేషాలు అతని మాటల్లోనే... 2770 రేటింగ్ సాధించడంపై... ప్రస్తుత అంతర్జాతీయ చెస్ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే 2770 రేటింగ్‌ను అరుదైన ఘనతగా చెప్పవచ్చు. దీనిని సాధించడం ద్వారా తక్కువ మందికే చోటున్న ‘ఎలైట్’ గ్రూప్‌కి చేరుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ రేటింగ్ కారణంగా ఎప్పుడో ఒకసారి టాప్ ప్లేయర్‌తో తలపడటం కాకుండా ఇక తరచుగా అగ్రస్థాయి టోర్నీలలో నేను వారిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అక్కడ మంచి విజయాలు లభిస్తే దానికి దక్కే గుర్తింపు, విలువ చాలా ఎక్కువ. ఇటీవలి ప్రదర్శనపై... ఒక్క మాటలో చెప్పాలంటే నా కెరీర్లో ఇది అత్యుత్తమ దశ. రేటింగ్‌తో పాటు వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి అడుగు పెట్టాను. గత రెండేళ్లుగా నేను పడిన శ్రమకు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. చైనా టోర్నీలో రెండో స్థానంలో నిలవగా, ఒలింపియాడ్‌లో నాలుగో స్థానంతో త్రుటిలో పతకం చేజారింది. 2016 నుంచి ఓపెన్, లీగ్ టోర్నీలను చాలా వరకు తగ్గించి ప్రధాన టోర్నమెంట్లపై దృష్టి పెట్టాను. టాటా స్టీల్ టోర్నీలో కొన్ని సార్లు విజయావకాశాలు లభించినా వాటిని ఉపయోగించుకోలేకపోవడంతో తుది ఫలితం గొప్పగా లేదు. వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్తో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం చెప్పుకోదగ్గ అంశం. ఒక్క రోజే అయినా... ఆనంద్‌ను కూడా ర్యాంకుల్లో అధిగమించగలగడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది! భారత్‌లో చెస్ పురోగతిపై... దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా వేగంగా భారత చెస్ ఎదుగుతోంది. గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య పెరగడం ఒక్కటే కాదు, ఆటగాళ్ల పరిజ్ఞానం కూడా చాలా పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవడం వల్ల ఆట వ్యూహాల్లో కూడా కొత్త తరహాలో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే దీని వల్ల పోటీ కూడా పెరిగింది. ఓవరాల్‌గా సాధిస్తున్న విజయాలను బట్టి చూస్తే చాలా మెరుగైందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. తదుపరి లక్ష్యాలపై... 2017 నా కెరీర్లో కీలక సంవత్సరం కానుంది. వచ్చే నెలలో చైనా, అజర్బైజాన్లలో రెండు పెద్ద టోర్నమెంట్లు ఉన్నాయి. అంతకంటే ప్రధానమైనవి ఈ ఏడాది జరిగే మూడు గ్రాండ్‌ప్రి టోర్నీలు. ఈ మూడు టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే లేదా సెప్టెంబర్‌లో జార్జియాలో జరిగే ప్రపంచకప్‌లోనైనా ఫైనల్ చేరితే క్యాండిడేట్స్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధిస్తాను. ప్రస్తుతం నా లక్ష్యం అదే. ప్రపంచంలోని టాప్–8 ఆటగాళ్లు మాత్రమే తలపడే క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొనడం అన్నింటికంటే ముఖ్యం. ఆ టోర్నీ విజేతకు వరల్డ్ చాంపియన్‌ను ఢీకొట్టే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం నా సన్నాహకాలు, ఫామ్ చాలా బాగున్నాయని, సరైన దిశలోనే వెళుతున్నానని నమ్ముతున్నా. గతంలో నాలో ఉన్న ఓపెనింగ్ లోపాలను ఇప్పటికే సరిదిద్దుకున్నా. నా ముగ్గురు సహాయకులు (సెకండ్స్) రాబోయే టోర్నీల సన్నద్ధతలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ టోర్నీలలో పాల్గొనకపోవడంపై... నేను ఆఖరిసారిగా భారత్‌లో 2004లో ఆడాను. దురదృష్టవశాత్తూ మన దేశంలో పెద్ద స్థాయి టోర్నీల నిర్వహణ విషయంలో ఫెడరేషన్ చొరవ తీసుకోవడం లేదు. ఆదరణ ఉండదు, స్పాన్సర్లు రారు అనడంలో వాస్తవం లేదు. ఇటీవల క్రికెటేతర క్రీడలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో చెస్‌ను కూడా అనుసరించేవారు బాగా పెరిగారు. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. నిజానికి ఫెడరేషన్లో వేల సంఖ్యలో ఉన్న రిజిస్టర్డ్ ఆటగాళ్లు సదరు టోర్నీని అనుసరించినా అది సక్సెస్ అయినట్లే! ఇక నేను, ఆనంద్‌లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనకపోవడానికి తగినంత పోటీ లేకపోవడమే కారణం. మా రేటింగ్‌కు కాస్త అటూ ఇటుగా ఉన్న ఆటగాళ్లతో పర్వాలేదు గానీ మరీ తక్కువ స్థాయి ఆటగాళ్లతో తలపడితే మాకు ప్రయోజనంకంటే నష్టమే ఎక్కువ. గతంలో మన దేశంలో పలుసార్లు జరిగిన నిర్వహణా లోపాలు కూడా మమ్మల్ని ఆడకుండా నిరోధిస్తున్నాయి. -
భారత్‌కు మంచి రేటింగ్ ఇవ్వవచ్చు: ఓఈసీడీ
న్యూఢిల్లీ: రేటింగ్‌ను పెంచడానికి అనువైన పరిస్థితులు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉన్నట్లు ఆర్థిక విశ్లేషణా సంస్థ– ఓఈసీడీ పేర్కొంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో భారత్‌పై ఓఈసీడీ ఆర్థిక సర్వే నివేదిక ఒకటి విడుదలైంది. భారత్ ఆర్థిక సలహాదారు శక్తికాంత్ దాస్, ఓఈసీడీ సెక్రటరీ జనరల్ యాజిల్ గురియా తదితర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల వరకూ భారీ తనఖాలతో మునిగిఉన్న బ్యాంకులకు ‘ఏఏఏ’ గ్రేడింగ్‌లు ఇచ్చేసిన రేటింగ్ సంస్థలు... అత్యంత జాగరూకతతో ఇప్పుడు వ్యవహరిస్తున్నాయని అన్నారు. భారత్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.3 శాతం నమోదవుతుందని, 2018–19లో ఈ రేటు 7.7 శాతానికి పెరుగుతుందని ఓఈసీడీ అంచనావేస్తోంది. -
‘అప్పు’డే రేటింగ్ పెంచలేం!
అప్‌గ్రేడ్ చేయడానికి భారీ ప్రభుత్వ రుణమే అడ్డంకి... • బడ్జెట్లో ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి • ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణకు తాజా బడ్జెట్లో మోదీ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసిందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) వ్యాఖ్యానించింది. అయితే, కొండంత ప్రభుత్వ రుణ భారం, బలహీనంగా ఉన్న పన్ను ఆదాయాలు... రేటింగ్ పెంపుదలకు అడ్డంకిగా నిలుస్తున్నాయని పేర్కొంది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ప్రవేశపెట్టిన బడ్టెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018–19కి ఈ లోటును 3 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016–17)లో ద్రవ్యలోటు 3.5%గా ఉండొచ్చని అంచనా. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్య లోటుగా పరిగణిస్తారు. ‘ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరుచుకునే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను బడ్జెట్ కళ్లకుకట్టింది. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కారణంగా సమీపకాలంలో వృద్ధి రేటు దెబ్బతింటున్నప్పటికీ భారత్ ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రాముఖ్యం ఇస్తోంది’ అని ఎస్అండ్పీ పేర్కొంది. జీడీపీలో 68.5 శాతానికి రుణభారం... భారత ప్రభుత్వ రుణ భారం ప్రస్తుతం జీడీపీతో పోలిస్తే 68.5 శాతంగా ఉంది. 2016 సెప్టెంబర్ చివరినాటికి విదేశీ రుణ భారం 484.3 బిలియన్ డాలర్లు (రూ.32.93 లక్షల కోట్లు.. జీడీపీలో 24 శాతం). దీనికి అంతర్గత రుణాలు కలిపితే 68.5 శాతంగా లెక్కతేలుతుంది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) సమీక్ష కమిటీ నివేదిక ప్రకారం 2023 నాటికి జీడీపీలో రుణ భారాన్ని 60 శాతానికి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని బడ్జెట్లో జైట్లీ ప్రస్తావించారు. కాగా, ఆర్థిక, విధానపరమైన సంస్కరణలు గణనీయంగా మెరుగుపడిన పక్షంలో రుణ భారం 60 శాతం దిగువకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ఎస్అండ్పీ తెలిపింది. ఇది భారత్ సార్వభౌమ రేటింగ్ పెరిగేందుకు రానున్న కాలంలో సానుకూలాంశంగా నిలుస్తుందని కూడా వెల్లడించింది. అయితే, ప్రస్తుతానికైతే అధిక రుణ భారం, బలహీన పన్ను ఆదాయాలు రేటింగ్ పెంచేందుకు కీలకమైన అడ్డంకులని స్పష్టం చేసింది. ఎస్అండ్పీ ప్రస్తుతం భారత్‌కు ‘బీబీబీ మైనస్’ రేటింగ్(స్థిర అవుట్‌లుక్‌తో) ను కొనసాగిస్తోంది. ఇది జంక్ గ్రేడ్‌కు(పెట్టుబడులకు అత్యంత కనిష్టస్థాయి గ్రేడ్) ఒక్క అంచె మాత్రమే ఎక్కువ. ఈ ఏడాది(2017)లో భారత్ రేటింగ్‌ను పెంచే ప్రసక్తే లేదని 2016 నవంబర్‌లో తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. జీడీపీలో రుణ భారాన్ని 60 శాతం దిగువకు తీసుకువచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. అదేవిధంగా మధ్యకాలానికి ద్రవ్యలోటు చెప్పుకోదగిన స్థాయిలో తగ్గేవిధంగా ప్రభుత్వ పన్ను ఆదాయాలేవీ పెరుగుతాయని భావించడం లేదని పేర్కొంది. బ్యాంకులకు రూ.10 వేల కోట్లేనా? ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు మూలధనం కిందం ఈ బడ్జెట్లో రూ.10 వేల కోట్లను మాత్రమే కేటాయించడంపై ఎస్అండ్పీ పెదవి విరిచింది. ఇది ఏమాత్రం సరిపోదని.. దీనివల్ల బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం విషయంలో(బ్యాలెన్స్ షీట్ల క్లీన్అప్) జాప్యం జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా లోటును బ్యాంకులు బీమా కంపెనీలు.. ఇతర ప్రభుత్వ సంస్థలు లేదంటే క్యాపిటల్ మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సిందేనని ఎస్అండ్పీ సీనియర్ డైరెక్టర్(ఆర్థిక సంస్థల రేటింగ్స్ విభాగం) గీతా చుగ్ పేర్కొన్నారు. అవసరమైతే మరిన్ని మూలధన నిధులను ఇస్తామంటూ ఆర్థిక మంత్రి జైట్లీ హామీనివ్వడం కాస్త ఊరటనిచ్చే విషయమని ఆమె చెప్పారు. కాగా, కొన్ని బ్యాంకులు అత్యంత బలహీనంగా ఉన్నాయని.. టేకోవర్ లక్ష్యాలుగా మారే అవకాశం ఉందని చుగ్ హెచ్చరించారు. బాసెల్–3 నిబంధనల ప్రకారం 2019 చివరినాటికి దేశీ బ్యాంకింగ్ రంగానికి రూ.2.5 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయనేది ఎస్అండ్పీ అంచనా. కాగా, 2015లో మోదీ సర్కారు ప్రకటించిన ‘ఇంద్రధనుష్’ కార్యాచరణ కింద నాలుగేళ్లలో పీఎస్బీలకు రూ.70,000 కోట్ల మూలధనం ఇవ్వాలనేది ప్రణాళిక. దీనిలో భాగంగా గడిచిన తొలి రెండేళ్లలో(2015–16, 16–17) రూ.25 వేల కోట్ల చొప్పున కేంద్రం కేటాయించింది. -
సంస్కరణలు చూడండి... రేటింగ్ పెంచండి..!
మూడీస్‌కు ఆర్థిక (శాఖ) వివరాలు న్యూఢిల్లీ: భారత్‌లో వివిధ సంస్కరణలు చేపట్టడం జరిగిందనీ, దేశాన్ని వ్యాపార సానుకూలంగా మార్చుతున్నామని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్‌కు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. తద్వారా రేటింగ్ పెంచడానికి తగిన అన్ని అవకాశాలూ ఉన్నాయని వివరించింది. అయితే బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల పరిస్థితిపై అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మూడీస్ పేర్కొంది. రేటింగ్ పెంపునకు సంబంధించి ఆర్థికశాఖ సీనియర్ అధికారులు, మూడీస్ ప్రతినిధుల మధ్య బుధవారం కీలక సంప్రతింపులు జరిగాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్, ఆ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ పాజిటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది -
ద్రవ్యోల్బణం లక్ష్యాలు భారత్‌కు సానుకూలం
రేటింగ్ కోణంలో మూడీస్ అంచనా న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్లూ ‘ప్లస్ 2 అండ్ మైనస్ 2తో’ నాలుగు శాతంగా ఉండాలన్న కేంద్రం లక్ష్యం భారత్‌కు క్రెడిట్ పాజిటివ్ అంశమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డారీ డిరోన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే గరిష్ట పరిమితి 6 కాగా, తగ్గితే కనిష్ట పరిమితి 2 శాతంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల నిర్ధేశించిన సంగతి తెలిసిందే. డిపాజిట్లపై ఇటీవల తగ్గించిన వడ్డీరేట్లు, వాస్తవ రిటర్న్స్ వంటి అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సంవత్సరం ఆరంభంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడానికి ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య అవగాహన కుదరటం తెలిసిందే. -
ఆర్థిక మార్కెట్ల నియంత్రణలో భారత్‌కు టాప్ రేటింగ్
జెనీవా: ఆర్థిక మార్కెట్లను సమర్ధంగా నియంత్రించే అంశంలో భారత్‌కు అత్యుత్తమ రేటింగ్ లభించింది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ).. చైనా, అమెరికా నియంత్రణ సంస్థల కన్నా మెరుగ్గా రేటింగ్స్ దక్కించుకున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్స్ (ఐవోఎస్‌సీవో), బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) కలిసి వీటిని నిర్ణయించాయి. ఇందులోని మొత్తం 8 ప్రమాణాల్లోను గరిష్ట స్కోరు అయిన 4ని భారత్ సహా ఆరు దేశాలు మాత్రమే దక్కించుకోగలిగాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాలు ఉన్నాయి. -
టీచర్ల పనితీరుకు రేటింగ్
నిజామాబాద్ అర్బన్: విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా సరికొత్త పథకాన్ని రూపొందించింది. ఇక నుంచి ఉపాధ్యాయుల పనితీరుకు రేటింగ్ నమోదు చేయనున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు నమోదు చేసే రేటింగ్ వివరాలను ఆన్లైన్లోనే పొందుపరచనున్నారు. పాఠశాల వివరాలు, విద్యార్థుల స్థాయి, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పని తీరును పరిశీలిస్తారు. నైపుణ్యాలను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇదే నెలలో ప్రారంభించనున్నారు. ఇదివరకే విద్యాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఫార్మాట్‌ను ప్రధానోపాధ్యాయులకు అందించారు. ఇదీ పరిస్థితి జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 263 ప్రాథమికోన్నత పాఠశాలలు, 478 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు 10 వేల మంది ఉపాధ్యాయు లు పనిచేస్తున్నారు. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్వశిక్ష అభియాన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల స్థాయి నుంచి ప్రధానోపాధ్యాల వరకు వారి సామర్థ్యాలు, పనితీరును మూడు నెలకోకసారి అంచనా వేసేందుకు మానిటరింగ్ టూల్స్‌ను రూపొందించారు. దీని ఆధారంగా పాఠశాల, విద్యార్థి ప్రమాణాలతోపాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును ఆన్లైన్లో ఉంచుతారు. వీటిని పరిశీలిస్తారు స్కూల్ మానిటరింగ్ కింద పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ పిల్లల చదువులు, పాఠ్యేతర అంశాలు, వినూత్న పథకాలు, గ్రంథాలయ వినియోగం తదితర వివరాలను నమో దు చేస్తారు. విద్యార్థి ప్రతిభ కింద సబ్జెక్టులవారీగా గ్రేడింగ్ నమోదు చేస్తారు. అలాగే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల ప్రతిభను నమోదు చేస్తారు. ఇందులో ఏ డు అంశాలు ఉంటాయి. ఒక్కో అంశానికి గరిష్టంగా నాలుగు రేటింగ్ పాయింట్లు ఉంటాయి. మొదట ఉపాధ్యాయులు తమకు తామే రేటింగ్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీటిని ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షక అధికారులు పరిశీలించి వారి రేటింగ్ ఇస్తారు. జూన్ నుంచి ఆగస్టు వరకు మొదటి క్వార్టర్, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు రెండవ క్వార్టర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మూడవ క్వార్టర్, మార్చి నుంచి మే వరకు నాల్గవ క్వార్టర్లో రేటింగ్ నమోదు చేస్తారు. గ తంలో ఉపాధ్యాయుల పనితీరుపై ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు రహస్య నివేదిక పంపేవారు. కొన్నేళ్ల నుంచి ఇది అమలు కావడం లేదు. రేటింగ్ విధానం తో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ పనితీరును బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా తగిన సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విద్యాబోధనలో మార్పులు, చేర్పులు చేసుకొని టీచర్లు తమ ప్రతిభను కూ డా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ప్రధానోపాధ్యాయులకు ఫార్మాట్ పంపాం ఉపాధ్యాయుల ప్రతిభను తెలుసుకునేందుకు ఓ ఫార్మాట్‌ను రూపొందించాం. దానిని ఇదివరకే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశాం. దాని ఆధా రంగా ఉపాధ్యాయుల ప్రతిభ నమోదు చేస్తాం. ఈ ప్రక్రియను సర్వశిక్ష అభియాన్ ద్వారా నిర్వహిస్తాం. -
అధిక రాబడులు పొందేదిలా..
ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి వదిలేయడం కాకుండా మధ్యమధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. ఫండ్ దిశ మార్చుకున్నా, లేదా నిరంతరంగా సరైన పనితీరు కనబర్చకున్నా వ్యూహాన్ని మార్చుకోవాలి. సాధారణంగా ఫండ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో దాదాపు ఒకే రకమైన సమస్యలు కనిపిస్తుంటాయి. వీటిని గానీ అర్థం చేసుకుని సరిచేసుకోగలిగితే మెరుగైన రాబడులు అందుకోవచ్చు. ఒకే ఫండ్ కాకుండా వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో.. ఒకదాని తర్వాత మరొకటిగా ఇన్వెస్ట్ చేస్తూ వెడతారు. తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే ముప్పై-నలభై ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో పోగుపడతాయి. చివరికి ఏదీ సరైన రాబడి ఇవ్వకుండా పోతుంది. డైవర్సిఫికేషన్ మంచిదే కానీ.. మరీ అతిగా కూడా చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఫండ్ పనితీరు రేటింగ్ కూడా ముఖ్యమే. అయితే, ఏ ఫండ్ కూడా నిరంతరం టాప్ రేటింగ్‌లతో ఉండదు. పైగా మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త థీమ్స్‌పై క్రేజ్ ఉంటుంది. కనుక, టాప్ రేటింగ్‌లు, కొత్త థీమ్స్ ఫండ్స్ అంటూ వాటి వెనుక వెడితే మళ్లీ యథాప్రకారం ఫండ్స్ పోగుపడటం తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే, టాప్ అని కాకుండా స్థిరంగా మెరుగైన పనితీరు కనపరుస్తున్న వాటితో కొనసాగడం మంచిది. సదరు సంస్థ ఇన్వెస్టింగ్ తీరు, ఫండ్ పరిమాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, స్వల్పకాలికంగా అవ సరాల కోసం డెట్ సాధనాల్లోనూ, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, ఇవి రెండూ వివిధ దిశల్లో వెడుతుంటాయి కనుక.. కొన్నాళ్లు పోయాక మీ లక్ష్యాలకు భిన్నంగా పోర్ట్‌ఫోలియో స్వరూపం మారవచ్చు. ఉదాహరణకు.. షేర్లలో పెట్టుబడులు ఎక్కువయ్యి రిస్కు పెరగడమో లేదా తక్కువయ్యి రావాల్సిన లాభాలను కోల్పోవడమో జరిగే అవకాశం ఉంది. కనుక, ఎప్పటికప్పుడు పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను సవరించుకుంటూ వెడితే రాబడులు మెరుగ్గా ఉంటాయి. -
భారత్‌కు ఫిచ్ వార్నింగ్
ముంబై: ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యాన్ని భారత్ అందుకోలేకపోతే రేటింగ్‌ను తగ్గిస్తామని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ సోమవారం హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ప్రభుత్వ వ్యయం నియంత్రణకు అవకాశాలు తక్కువని ఫిచ్ అభిప్రాయపడుతోంది. అర్థిక గణాంకాలు ఆశావహంగా లేవని, ద్రవ్యలోటు లక్ష్యసాధనలో విఫలమైతే ప్రతికూల రేటింగ్ తప్పదని పేర్కొంది. ద్రవ్య నిర్వహణ చాలా సవాళ్లతో కూడుకున్నదని ఫిచ్ విశ్లేషకులు ఆర్ట్ వూ పేర్కొన్నారు. ద్రవ్యలోటు పరిస్థితులు మరింత దిగజారితే రేటింగ్‌ను తగ్గిస్తామని గత ఏడాది అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు హెచ్చరించిననప్పుడు భారత్ వ్యయ నియంత్రణకు గట్టి చర్యలే తీసుకుంది. 5.2 శాతానికి ఎగబాకే ద్రవ్యలోటు ఈ చర్యల కారణంగా 4.89 శాతానికి తగ్గింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.8 శాతం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూపాయి భారీగా పతనమవుతుండడం, ప్రభుత్వ వ్యయం పెరుగుతుండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించగలమని ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తోంది. రూపాయి పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్న పెరిగిపోతున్న కరెంట్ అకౌంట్ లోటును పేర్కొనవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో 8,780 కోట్ల డాలర్లుగా ఉన్న కరెంట్ అకౌంట్ లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7,500 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. కరెంట్ అకౌంట్ లోటు గత రెండు ఆర్థిక సంవత్సరాల కంటే తగ్గొచ్చని ఫిచ్ ఏషియా-పసిఫిక్ సావరిన్స్ హెడ్ అండ్రూ కోల్హన్ చెప్పారు. అయితే రూపాయి పతనాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతమున్న 27,800 కోట్ల డాలర్ల నుంచి 23,000 కోట్ల డాలర్లకు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.