Liger IMDB Rating Is Shocking For Vijay Deverakonda And His Fans - Sakshi
Sakshi News home page

Liger IMDB Rating: 'లాల్‌సింగ్‌ చడ్డా'తో పోలిస్తే 'లైగర్‌' పరిస్థితి ఇంత దారుణమా?

Published Sat, Aug 27 2022 3:27 PM | Last Updated on Sat, Aug 27 2022 4:17 PM

Liger IMDB Rating Is Shocking For Vijay Deverakonda And His Fans - Sakshi

విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ఇండియా చిత్రం 'లైగర్‌'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైందనే చెప్పొచ్చు.

విడుదలైన రోజు నుంచి నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న లైగర్‌ చిత్రానికి ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ(ఐఎండీబీ)అత్యల్ప రేటింగ్‌ను ఇచ్చింది.10కి కేవలం 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇక  ఈ రేటింగ్ ఇటీవల లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ చిత్రాల కంటే తక్కువ అని తెలుస్తోంది.చదవండి: లైగర్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!.. ఎప్పుడంటే

అమీర్‌ ఖాన్‌ కెరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచిన లాల్‌ సింగ్‌ చడ్డాకు  ఐఎండీబీ రేటింగ్ 5 ఇవ్వగా.. లైగర్‌కు మాత్రం 1.7 ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రానికి 4.6, దొబారా 2.9. రణ్‌బీర్ కపూర్ 4.9తో పోలిస్తే లైగర్‌కు మాత్రం అత్యంత దారుణంగా 1.7రేటింగ్‌ ఇచ్చారు. ఇక ఈ వీకెండ్‌ రోజుల్లో కలెక్షన్స్‌ అనుకున్నట్టుగా రాబట్టకపోతే మూవీ డిజాస్టర్‌ టాక్‌ను మూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. చదవండి: 'తలకిందులైంది.. లైగర్‌ రిజల్ట్‌ చూసి విజయ్‌ ఏం చేశాడో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement