సాక్షి, ముంబై : టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో కుదేలైన దేశీ మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు రేటింగ్ షాక్ తగిలింది. క్యూ3 లాభాల్లో భారీ క్షీణతను నమోదు చేసిన ఎయిర్‌టెల్‌కు తొలిసారిగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ డౌన్ గ్రేడ్ రేటింగ్‌ను ఇచ్చింది. దీంతో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ఒకదశలో ఎయిర్ టెల్ షేరు 4 శాతం పతనమైంది.
గ్లోబల్ దిగ్గజం మూడీస్ ఎయిర్‌టెల్ క్యాష్‌ఫ్లోపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో జంక్ స్టేటస్ ఇచ్చింది. ఇన్వెస్టర్ సర్వీసెస్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌కు సవరించింది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ బీఏఏ3 నుంచి బీఏ1కు సవరించింది. నాన్ ఇన్వెస్ట్‌మెంట్ రేటింగ్ బీఏ1 ఇవ్వడం ద్వారా సంస్థ ఔట్‌లుక్‌ను ప్రతికూలంగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment