Moodys
-
పదేళ్లలో రూ.60 లక్షల కోట్ల పెట్టుబడులు
భారత్ తన ప్రతిష్టాత్మకమైన సున్నా కర్బన ఉద్గారాల స్థితి (తటస్థం)ని 2070 నాటికి చేరుకోవాలంటే.. వచ్చే పదేళ్లలో 700 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (రూ.60 లక్షల కోట్లు) విద్యుత్ రంగం(Power Sector)లో చేయాల్సి వస్తుందని మూడిస్ రేటింగ్స్ తెలిపింది. పునరుత్పాదక ఇంధనాలు, అణు ఇంధనం, విద్యుత్ ప్రసారం, పంపిణీ, ఇంధన స్టోరేజీ వసతుల కోసం ఈ మొత్తం వెచ్చించాల్సి వస్తుందని వివరించింది.దేశంలో కర్బన ఉద్గారాల విడుదలలో 37 శాతం విద్యుత్ రంగం నుంచే ఉంటోందని మూడిస్ పేర్కొంది. 2026 నుంచి 2051 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏటా జీడీపీలో 1.5–2 శాతం మేర పెట్టుబడులను (వచ్చే పదేళ్లు ఏటా 2 శాతం) ఈ రంగంలో చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. 2034–35 వరకు ఏటా రూ.4.5–6.4 లక్షల కోట్ల చొప్పున, ఆ తర్వాత 2026–51 మధ్యకాలంలో ఏటా రూ.6–9 లక్షల కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని వెల్లడించింది. ఈ స్థాయిలో పెట్టుబడులను ప్రభుత్వం, ప్రైవేటు రంగం, దేశ, విదేశీ మూలధనం రూపంలో సమకూర్చుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటికీ అధిక శాతం విద్యుత్ బొగ్గు ఆధారితమే ఉన్నందున, ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయని అభిప్రాయపడింది. వచ్చే పదేళ్ల పాటు బలమైన ఆర్థిక వృద్ధి అన్నది బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి విస్తరణను సూచిస్తోందని, ఇది కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యానికి ప్రతికూలంగా మారొచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌లో 20,000 నియామకాలు!తలసరి వినియోగం మూడో వంతేభారత ఆర్థిక వ్యవస్థ ఏటా 6.5 శాతం చొప్పున వచ్చే పదేళ్ల పాటు వృద్ధిని నమోదు చేస్తుందని, దీంతో ఏటా విద్యుత్ డిమండ్ 6 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక పెరుగుదలను చూస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ‘భారత్‌లో తలసరి విద్యుత్ వినియోగం (2021–22లో 1,255 కిలోవాట్ హవర్) ప్రపంచ వినియోగంలో మూడింత ఒక వంతుగానే ఉంది. ఆర్థిక వృద్ధితోపాటు, జీవన ప్రమాణాల మెరుగుదల నేపథ్యంలో రానున్న కాలంలో వినియోగం మరింత పెరగనుంది. వచ్చే పదేళ్లలో 450 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం డిమాండ్‌ను తీర్చలేదు. ఈ కాలంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని మరో 35 శాతం పెంచుకోవాల్సి రావచ్చు. 1.7–1.8 రెట్లు పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 2034–35 నాటికి 2–2.2 రెట్లు పెరగాలి. 2023–24 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ తయారీ 23.5 శాతంగా ఉంటే, 2034–35 నాటికి 45–50 శాతానికి చేర్చాలి’అని మూడిస్ వివరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లే విషయంలో ప్రైవేటు రంగం ఎంతో కీలకమంటూ, విదేశీ నిధులు అంతరాన్ని భర్తీ చేయగలవని పేర్కొంది. -
బీమా పరిశ్రమకు ధీమా
భారత జీడీపీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడిస్(Moody's) అంచనా వేసింది. 2025–26లో 6.6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ బలమైన విస్తరణతో బీమా రంగం ప్రయోజనం పొందనున్నట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance)కు పెరుగుతున్న డిమాండ్‌తో బీమా కంపెనీలు ప్రీమియంలో స్థిరమైన వృద్ధిని చూడనున్నాయని వివరించింది. అధిక ప్రీమియం ఆదాయం, పెరుగుతున్న ప్రీమియం ధరలు, ప్రభుత్వ సంస్కరణలతో బీమా రంగం లాభదాయకత మెరుగుపడనున్నట్టు అంచనా వేసింది.‘భారత ప్రైవేటు బీమా కంపెనీలు తమ వినియోగదారుల బేస్‌ను పటిష్టం చేసుకోవడం కొనసాగనుంది. కాకపోతే అండర్‌రైటింగ్ ఎక్స్పోజర్, నియంత్రణపరమైన మార్పులతో వాటి క్యాపిటల్ అడెక్వెసీపై ఒత్తిళ్లు కొనసాగనున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25లో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ముందటి సంవత్సరంలో వృద్ధి 8.2 శాతం కంటే కొంత తక్కువ. భారత తలసరి ఆదాయం–కొనుగోలు శక్తి సమానత్వం సైతం వృద్ధి చెందుతోంది. 11 శాతం వృద్ధితో 2024 మార్చి నాటికి ఇది 10,233 డాలర్లకు చేరింది’ అని మూడిస్ పేర్కొంది. భారత జాతీయ గణాంక కార్యాలయం (NSO) 2024–25 సంవత్సరానికి జీడీపీ 6.4 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనా కంటే మూడిస్ అంచనాలు బలంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుభారీ అవకాశాలు..అధిక సగటు ఆదాయం, వినియోగదారుల రిస్క్ ధోరణి బీమాకు, ముఖ్యంగా ఆరోగ్య బీమాకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు మూడిస్ పేర్కొంది. 2024 మొదటి ఎనిమిది నెలల్లో బీమా ప్రీమియం ఆదాయం 16 శాతం పెరిగినట్టు తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రీమియంలో 8 శాతం వృద్ధిని అధిగమించినట్టు వివరించింది. ‘భారత్‌లో బీమా విస్తరణ రేటు (జీడీపీలో బీమా ప్రీమియంల వాటా) 2024 మార్చి నాటికి 3.7 శాతంగానే ఉంది. యూకే 9.7 శాతం, యూఎస్ 11.9 శాతంతో పోల్చి చూస్తే చాలా తక్కువ. అందుకే భారత బీమా రంగం బలమైన విస్తరణకు పుష్కల అవకాశాలున్నాయి’ అని పేర్కొంది. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 7.2 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ 2024లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణ రిస్క్‌లు ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్నే కొనసాగించేందుకు (2024 చివరి వరకు) దారితీయవచ్చని తెలిపింది.తగినన్ని ఆహార నిల్వలు, పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయని, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం (4 శాతం) దిశగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి అయిన 6.21 శాతానికి చేరడం తెలిసిందే. ‘‘పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఎదురయ్యే ద్రవ్యోల్బణం రిస్క్, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ద్రవ్య విధానాన్ని సడలించే విషయంలో ఆర్బీఐ అప్రమత్తతను తెలియజేస్తోంది’’అని మూడీస్ పేర్కొంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్ఈ ఏడాదికి చివరి ఎంపీసీ సమావేశం డిసెంబర్ 7–9 తేదీల మధ్య జరగనుంది. గృహ వినియోగం పెరగనుందని చెబుతూ.. పండుగల సీజన్లో కొనుగోళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడాన్ని మూడీస్ తన నివేదికలో ప్రస్తావించింది. సామర్థ్య వినియోగం పెరుగుతుండడం, వ్యాపార సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తోందని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుండడం ప్రైవేటు పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. -
8 శాతానికి వృద్ధి అంచనా పెంపు: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి (2023 నవంబర్ నాటి) వృద్ధి అంచనాలను 6.6% నుంచి 8 శాతానికి పెంచుతున్నట్లు రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. పటిష్ట దేశీయ వినియోగం, మూలధన వ్యయా లు తమ అంచనాల పెంపునకు కారణంగా పేర్కొంది. జీ20 దేశాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు వివరించింది. వచ్చే ఏడాది 6.8 శాతమే: క్రిసిల్ కాగా, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే రానున్న ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6.8 శాతంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనావేసింది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యలోటు కట్టడికి చర్యలు వంటి అంశాలు వృద్ధి స్పీడ్‌కు బ్రేకులు వేస్తాయని విశ్లేíÙంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును క్రిసిల్ 7.6 శాతంగా అంచనావేస్తోంది. -
అధిక రేటింగ్ కంపెనీ బోర్డుల్లో మహిళలు
న్యూఢిల్లీ: అధిక రేటింగ్ కలిగిన కంపెనీలు.. బోర్డు సభ్యులుగా మహిళలను ఎంపిక చేసుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇన్వెస్టర్ సరీ్వస్ తాజాగా పేర్కొంది. తక్కువస్థాయి రేటింగ్ కలిగిన కంపెనీలతో పోలిస్తే వీటిలో బోర్డు సభ్యులుగా స్త్రీలకు అధికంగా చోటు కలి్పస్తున్నట్లు తెలియజేసింది. సంస్థ రేటింగ్ ఇచి్చన 3,138 కంపెనీలను విశ్లేషించినట్లు వెల్లడించింది. విశ్లేషణ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్(బీఏఏ, అంతకంటే అధిక రేటింగ్) కలిగిన కంపెనీల బోర్డు సీట్లలో సగటున 29 శాతం మంది మహిళలకు చోటు లభించింది. 2023తో పోలిస్తే 1 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక స్పెక్యులేటివ్ గ్రేడ్(బీఏ, అంతకంటే తక్కువ రేటింగ్) కంపెనీలలో సగటున 24 % బోర్డు సీట్లను మహిళలు పొందారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య యథాతథమే. అభివృద్ధిచెందిన ఆర్థిక వ్యవస్థల్లో బోర్డు సభ్యుల లింగభేదం, క్రెడిట్ రేటింగ్స్ మధ్య పరస్పర సంబంధమున్నప్పటికీ వర్ధమాన మార్కెట్లలో ఇది లేనట్లు మూడీస్ పేర్కొంది. విశ్లేషణకు పరిగణనలోకి తీసుకున్న కంపెనీలలో 24 ఏఏఏ, 146 ఏఏ, 728 ఏ, 1165 బీఏఏ, 582 బీఏ, 394 బీ, 90 సీఏఏ, 9 సీఏ రేటింగ్ కలిగినవి ఉన్నట్లు వెల్లడించింది. -
కొనసాగిన బుల్ రికార్డులు
ముంబై: పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.., స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ సోమవారమూ కొనసాగింది. ఆకర్షణీయ స్థూల ఆర్థిక డేటా నమోదు కారణంగా అంతర్జాతీ య రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. మూడీస్ అప్‌గ్రేడ్ రేటింగ్‌తో బ్యాంకింగ్, ఇంధన, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్ద తు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 243 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 66 పాయింట్ల లాభంతో 73,872 వద్ద ముగిసింది. ఒక దశలో 184 పాయింట్లు బలపడి 73,990 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 22,441 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 27 పాయింట్లు లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ముగింపు స్థాయిలు సరికొత్త రికార్డుతో పాటు వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.564 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,543 కోట్ల షేర్లు కొన్నారు. ► డిజిట్ ఐపీవోకు గ్రీన్ సిగ్నల్ ► డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ఇష్యూ కింద రూ. 1,250 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 10.94 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. పబ్లిక్ ఇష్యూకి బ్లాక్‌బక్ లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్‌బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్‌బక్ వినియోగించుకోనుంది. బ్లాక్‌బక్‌ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి. -
2024 వృద్ధి 6.8 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ 2024 క్యాలెండర్ ఇయర్ వృద్ధి అంచనాను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను 6.8 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ‘‘అంచనాల కంటే బలమైన’’ ఆర్థిక గణాంకాలు తమ తాజా అంచనా పెంపునకు కారణంగా పేర్కొంది. జీ20 దేశాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించింది. 2025లో దేశ వృద్ధి రేటును 6.4 శాతంగా రేటింగ్ దిగ్గజం పేర్కొంది. 2023లో దేశ ఎకానమీ ఊహించినదానికన్నా అధికంగా మంచి పురోగతిని సాధించినట్లు తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, పటిష్ట తయారీ కార్యకలాపాలు 2023లో భారత్ బలమైన వృద్ధి ఫలితాలకు దోహదపడ్డాయని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. -
బీమా రంగంలో మరిన్ని విలీనాలు, కొనుగోళ్లు
న్యూఢిల్లీ: బీమా రంగం నుంచి రానున్న కాలంలో మరికొన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ కావొచ్చని, విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు చోటు చేసుకుంటాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ అంచనా వేసింది. 2022–23లో బీమా రంగంలో రూ.1,930 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ మెరుగైన వృద్ధి అవకాశాలు బీమా కంపెనీల నిధుల సమీకరణకు మద్దతునిస్తోందని, దీంతో బలహీన అండర్ రైటింగ్ లాభదాయకతను అవి అధిగమించగలుగుతున్నాయని తెలిపింది. 2022–23లో బీమా రంగం చెల్లించిన మూలధనం రూ.75,300 కోట్లకు పెరిగిందని, 2021–22 నాటికి ఇది రూ.73,400 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2.6 శాతం వృద్ధి చెందింది. ఇదే తరహాలో మరిన్ని విలీనాలు, కొనుగోళ్లు, ఐపీవోలు వస్తాయని అంచనా వేస్తున్నట్టు, దీంతో భారత బీమా రంగం క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యత మెరుగుపడుతుందని తెలిపింది. విదేశీ బీమా సంస్థలు భారత బీమా మార్కెట్లో తమ పెట్టుబడులను కొనసాగిస్తాయని, ఇప్పటికే భారత కంపెనీలతో ఉన్న జాయింట్ వెంచర్లలో వాటా పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తాయని అంచనా వేసింది. విదేశీ బీమా సంస్థల భాగస్వామ్యంతో క్యాపిటల్ అడెక్వెసీ, ఆర్థిక సౌలభ్యం, పరిపాలనా ప్రమాణాల పరంగా ప్రయోజనాలు లభిస్తాయని వివరించింది. భారత బీమా సంస్థల్లో విదేశీ బీమా కంపెనీలు వాటాలు పెంచుకోవడం మార్కెట్‌కు క్రెడిట్ పాజిటివ్‌గా పేర్కొంది. మొత్తం మీద 2022–23లో బీమా రంగం లాభదాయకత సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్‌లు పెరిగిపోతుండడంతో సాధారణ బీమా రంగం ఫలితాలు ప్రతికూలంగానే ఉన్నట్టు తెలిపింది. స్థిరమైన ధరల పెరుగుదలతో ఈ రంగం అండర్‌రైటింగ్ పనితీరు, లాభదాయకత గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా వేసింది. -
2024 గ్లోబల్ బ్యాంకింగ్‌పై నెగటివ్ అవుట్‌లుక్: మూడీస్
న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాల వల్ల పలు దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దీనివల్ల 2024కి సంబంధించి ప్రపంచ బ్యాంకుల అవుట్‌లుక్ ప్రతికూలంగా (నెగటివ్) ఉందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్స్) వ్యయాలు తగ్గే అవకాశాలు, దేశ చక్కటి వృద్ధి రేటు వల్ల భారత్ బ్యాంకుల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ అంచనావేయడం గమనార్హం. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ భారత్ బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకుని నిలబడుతుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. ‘‘లిక్విడిటీ తగ్గడం (ద్రవ్య లభ్యత), రుణ చెల్లింపుల నాణ్యత పడిపోవడం వల్ల ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల అసెట్ నాణ్యత దెబ్బతింటుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ నివేదికలో పేర్కొంది. కఠినమైన ద్రవ్య విధానాల వల్ల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు క్షీణిస్తాయని అభిప్రాయపడింది. ప్రధాన కేంద్ర బ్యాంకులు రేట్లు తగ్గించడం ప్రారంభించినప్పటికీ, కఠిన ద్రవ్య పరిస్థితులే 2024లో కొనసాగుతాయని, ఇది ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పర్యావరణ సవాళ్లు ఆందోళనకు గురిచేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యయాలు తగ్గడం, బలహీన ఎగుమతులు, ప్రాపర్టీ మార్కెట్ దిద్దుబాటు కారణంగా చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు చైనా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడే వీలుందని అంచనావేసింది. -
2023లో వృద్ధి 6.7 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: 2023లో భారత్ 6.7 శాతం వృద్ధి రేటును సాధిస్తుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని రేటింగ్ దిగ్గజం– మూడీస్ తన గ్లోబల్ మాక్రో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024–25లో పేర్కొంది. దేశీయ డిమాండ్ పటిష్టత దీనికి ప్రధాన కారణమని తెలిపింది. 2024లో 6.1 శాతం, 2026లో 6.3 శాతం భారత్ పురోగమిస్తున్న అభిప్రాయాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. కాగా, జీ–20 ఎమర్జింగ్ మార్కెట్ల వృద్ధి 2023లో 4.4 శాతం, 2024లో 3.7 శాతం, 2025లో 3.8 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనావేసింది. అధిక వడ్డీరేట్ల కారణంగా 2024లో ప్రపంచ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ అనిశ్చితి ప్రభావం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది. కాగా, ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్ వృద్ధి రేటును మూడీస్ 6.1 శాతంగా అంచనావేస్తున్న సంగతి తెలిసిందే. పటిష్టంగా ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు, పెరుగుతున్న ఆటో విక్రయాలు, వినియోగదారుల ఆశావాదం, రెండంకెల క్రెడిట్ వృద్ధి ఎకానమీకి సానుకూల అంశాలుగా పేర్కొంది. -
ఆధార్ సురక్షితమేనా.. ఇంతకీ కేంద్రం ఏం చెబుతోంది?
గ్లోబుల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఆధార్ కార్డుపై చేసిన వ్యాఖ్యల్ని కేంద్రం ఖండించింది. ఆధార్ బయోమెట్రిక్ టెక్నాలజీ విధానంతో ప్రజల భద్రత, గోప్యతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయాన్ని తప్పు బట్టింది. మూడీస్ ఆరోపణలపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సైతం స్పందించింది. ఆధారాలు లేకుండా మూడీస్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ప్రపంచంలోనే ఆధార్ అంత్యంత నమ్మకమైన డిజిటల్ ఐడీ’ అని తెలిపింది. కాబట్టే భారతీయులు 100 బిలియన్ల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించారని, దీన్ని బట్టి ఆధార్‌పై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో అర్ధమవుతుందని మూడీస్‌కు సూచించింది. అంతర్జాతీయ సంస్థలు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకులు ఆధార్ విధానాన్ని ప్రశంసించిన అంశాన్ని ఈ సందర్భంగా యూఐడీఏఐ గుర్తు చేసింది. ప్రపంచంలో పలు దేశాలు సైతం ఆధార్ తరహాలో తమ దేశంలో డిజిటల్ ఐడీ వ్యవస్థను అమలు చేసేలా తమను సంప్రదించినట్లు చెప్పింది. ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ అథెంటికేషన్ వంటి బయోమెట్రిక్ టెక్నాలజీలు కాంటాక్ట్‌లెస్ అని గుర్తించడంలో మూడీస్ విఫలమైందని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, ఆధార్ భద్రత విషయంలో మొబైల్ ఓటీపీ వంటి సెక్యూరిటీ అంశాలపై ప్రస్తావించడం లేదని, ఇప్పటి వరకు ఎలాంటి ఆధార్ డేటాబేస్ ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది కేంద్రం. -
ప్రభుత్వాధికారులతో మూడీస్ భేటీ.. భారత్ రేటింగ్ అప్‌గ్రేడ్‌పై ఆశలు!
న్యూఢిల్లీ: త్వరలో భారత సార్వభౌమ రేటింగ్‌ను సమీక్షించనున్న నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలాంశాలను ప్రభుత్వ అధికారులు వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతుండటం, విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ డాలర్లకు చేరుతుండటం, సంస్కరణల అమలు తీరుతెన్నులు తదితర అంశాల గురించి తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక గురించి మూడీస్ ప్రతినిధులు చర్చించారు. మొత్తం మీద మూడీస్ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారని, రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందని సమావేశం అనంతరం ఒక అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శాఖలన్నింటి నుంచి, అలాగే నీతి ఆయోగ్ నుంచి అధికారులు ఇందులో పాల్గొన్నారు. మూడీస్ ప్రస్తుతం భారత్‌కు.. పెట్టుబడులకు అత్యంత కనిష్ట స్థాయి అయిన బీఏఏ3 సార్వభౌమ రేటింగ్ కొనసాగిస్తోంది. దీన్ని అప్‌గ్రేడ్ చేస్తే ఇన్వెస్టర్లకు భారత్‌లో రిస్కులు తక్కువగా ఉంటాయన్న సంకేతం వెడుతుంది. తద్వారా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను సమకూర్చుకునే అవకాశం లభిస్తుంది. -
భారత్‌లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే?
ముంబై: దేశంలో నిరుద్యోగం మే నెలలో తగ్గుముఖం పట్టింది. 7.7 శాతానికి తగ్గినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేటు పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఉపాధి లేమి 8.5 శాతంగా ఉండడం గమనించొచ్చు. ఏప్రిల్ నెలతో పోలిస్తే కార్మికుల భాగస్వామ్య రేటు మే నెలలో 1.1 శాతం తగ్గి 39.6 శాతంగా ఉన్నట్టు సీఎంఐఈ పేర్కొంది. ఏప్రిల్ నెలలో పెద్ద ఎత్తున పనుల్లోకి చేరడంతో మే నెలలో కార్మికుల భాగస్వామ్య రేటు తగ్గుతుందని అంచనా వేసిందేనని తెలిపింది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం) దీనివల్ల మే నెలలో ఉపాధి కోసం అన్వేషించే వారి సంఖ్య తగ్గినట్టు వివరించింది. ఫలితంగా కార్మిక శక్తి 453.5 మిలియన్ల నుంచి 441.9 మిలియన్లకు తగ్గిందని సీఎంఐఈ ప్రకటించింది. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. పట్టణాల్లో పనిచేసే కార్మికులు 4.5 మిలియన్లు తగ్గారు. ఏప్రిల్ నెలలో పట్టణాల్లో పనిచేసే కార్మికులు 147 మిలియన్లుగా ఉంటే, మే నెలలో 142.5 మిలియన్లకు తగ్గారు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) పట్టణాల్లో ఉద్యోగుల సంఖ్యతోపాటు, నిరుద్యోగుల సంఖ్య కూడా తగ్గినట్టు యూఎంఐఈ వెల్లడించింది. పట్టణాల్లో కార్మిక శక్తి 129.5 మిలియన్లుగా ఉంటే, 13 మిలియన్లు నిరుద్యోగులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే మాదిరి ఉద్యోగం, నిరుద్యోగం రేటు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు 299.4 మిలియన్లుగా మే నెలలో ఉన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 306.5 మిలియన్లుగా ఉంది. మరిన్ని బిజినెస్ వార్తలు, సక్సెస్ స్టోరీస్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
జూన్ త్రైమాసికంలో వృద్ధి 6.3 శాతంలోపే..: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 6 నుంచి 6.3 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ అంచనావేసింది. ప్రభుత్వానికి అంచనాలకన్నా తక్కువ ఆదాయాలు నమోదయ్యే అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత వారం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వేసిన 8 శాతం అంచనాలకన్నా తాజా మూడీస్ అంచనా ఎంతో దిగువన ఉండడం గమనార్హం. 2022–23 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో నమోదయిన 6.1 శాతానికి దాదాపు సరిసమానంగా ఉండడం మరో విశేషం. వ్యవస్థలో అధిక వడ్డీరేట్లు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని కూడా మూడీస్ అభిప్రాయపడింది. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 6.1 శాతం, 6.3 శాతాలుగా నమదవుతాయని మూడీస్ అంచనా. మూడీస్ భారత్‌కు ప్రస్తుతం ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది. ఇది అత్యంత దిగువ ఇన్వెస్ట్మెంట్ స్థాయి. చెత్త రేటింగ్కన్నా ఒక అంచె ఎక్కువ. మరో రెండు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్ ఇస్తున్నాయి. -
రుణ నాణ్యతపై అదానీ గ్రూప్ ఎఫెక్ట్ ఉండదు: ఫిచ్, మూడీస్
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ వివాదం నేపథ్యంలో రేటింగ్ దిగ్గజాలు కీలక వ్యాఖ్యలు చేశాయి అదానీ గ్రూపునకు బ్యాంకుల రుణాలు వాటి ‘రుణ నాణ్యతపై’ ప్రభావితం చూపే భారీ స్థాయిలో లేవని గ్లోబల్ రేటింగ్ దిగ్గజాలు- ఫిచ్, మూడీస్ పేర్కొన్నాయి. అవసరమైతే వాటికి ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి మూలధన మద్దతు అందే అవకాశం ఉందని కూడా విశ్లేషించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అదానీ గ్రూప్‌కు ఎక్కువ రుణాలు ఇచ్చినప్పటికీ, అవి ఆయా బ్యాంకుల మొత్తం రుణాలలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయని మూడీస్ పేర్కొంది. ‘‘భారతీయ బ్యాంకుల కార్పొరేట్ రుణాల మొత్తం నాణ్యత స్థిరంగా ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలలో చిన్న స్థాయి కార్పొరేట్లు నష్టపోయాయి. ఇది కొన్ని బ్యాంకుల కార్పొరేట్ రుణ పుస్తకాలలో భారీ వృద్ధిని నిలువరించింది’’ అని మూడీస్ విశ్లేషించింది. ఏదైనా అవసరమైతే అసాధారణ రీతిలో బ్యాంకింగ్‌కు ప్రభుత్వ మూలధన మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది. అదానీ గ్రూప్‌కు దేశ దిగ్గజ బ్యాంక్ రుణాలు రూ.27,000 కోట్లు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాటా రూ.7,000 కోట్లు. ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ మొత్తం రుణాల్లో అదానీ గ్రూప్ రుణ వాటా 0.94 శాతం. దేశ మౌలిక రంగం పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూప్‌కు కష్టాలు కొనసాగితే, మధ్య కాలికంగా అది దేశ ఆర్థిక వృద్ధిపై నామమాత్రపు ప్రభావమే చూపుతుందని ఫిచ్ అంచనావేస్తోంది. భారత్ ఆర్థిక వృద్ధి ధోరణి పటిష్టంగా ఉందని కూడా పేర్కొంది. -
చమురు ధరలు తగ్గడం ఓఎంసీలకు అనుకూలం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద బలహీన ఆర్థిక ఫలితాలనే నమోదు చేస్తాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ.. విక్రయ ధరలను చాలా కాలంగా నిలిపి ఉంచడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్థిక మందగమనం ఆందోళనలతో చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడం వల్ల మూడు ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల బాట పడతాయని అంచనా వేసింది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నష్టాలు వచ్చినందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు బలహీనంగానే ఉంటాయి. చమురు విక్రయ ధరలపై పరిమితి పెట్టినందున మొదటి ఆరు నెలల్లో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి రేట్లను సవరించలేదు’’అని మూడీస్ పేర్కొంది. ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి చమురు విక్రయ ధరలను సవరించకుండా, అవే ధరలను కొనసాగిస్తుండడం గమనార్హం. 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి ధరలను సవరించకపోవడం వల్ల, మొదటి ఆరు నెలలకు రూ.21,000 నష్టాలను ప్రకటించాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా.. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం వీటి నష్టాలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. ఇవి ముడి చమురును డాలర్ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయని మూడీస్ తెలిపింది. లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే చమురు ధరలు తగ్గినందున, కొనుగోళ్ల వ్య యాలు తగ్గి లాభదాయక వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడుతుందని మూడీస్ అంచనా వేసింది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేయడం ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కలిసొస్తుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ కంటే రష్యా చమురు త క్కువ ధరకు వస్తుండడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ వచ్చే 12నెలల్లో చమురు ధరలు అస్థిరతల మధ్యే చలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రతరమైనా లేక చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, అదే జరిగితే ఆయిల్ కంపెనీల లాభాలు పరిమితం కావొచ్చని పేర్కొంది. రుణ పరిస్థితుల్లో మెరుగు.. ‘‘లాభాలు పెరిగితే రుణ భారం తగ్గుతుంది. మూ లధన అవసరాలకు నిధుల వెసులుబాటు లభిస్తుంది. 2022 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య నష్టాలను అదనపు రుణాలు తీసుకుని ఇవి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో వాటి రుణ భారం పెరిగింది’’అని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పే ర్కొంది. పెరిగే ధరలకు అనుగుణంగా మూలధన అవసరాలు కూడా పెరుగుతాయని, ఫలితంగా కంపెనీల రుణ కొలమానాలు బలహీనంగా ఉంటా యని పేర్కొంది. నియంత్రణపరమైన అనిశ్చితి కూ డా వాటి రుణ నాణ్యతను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘‘భారత్‌లో చమురు ధరల పరంగా స్ప ష్టత లోపించింది. రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలకు ఇది క్రెడిట్ నెగెటివ్. చమురు ధరలపై నియంత్రణలతో కంపెనీల నష్టాలు కొనసాగుతా యి. వాటిని ప్రభుత్వం సకాలంలో సర్దుబాటు చే యకపోతే వాటి క్రెడిట్ నాణ్యత కూడా బలహీనపడుతుంది’’ ఈని మూడిస్ నివేదిక హెచ్చరించింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు దృష్ట్యా ఈ కంపెనీల తుది రేటింగ్‌ల్లో ఏ మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. రేట్లపై స్వేచ్ఛ లభిస్తేనే.. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ విక్రయ రేట్లను సవరించుకునే స్వేచ్ఛ కల్పించినప్పుడే వాటి మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని మూడీస్ తెలిపింది. అయితే ఇది 2024 సాధారణ ఎన్నికల తర్వాతే సాధ్యపడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇటీవల అంతర్జాతీయంగా రేట్లు తగ్గడం కంపెనీలకు సానుకూలిస్తుందని పేర్కొంది. ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగతే వచ్చే కొన్ని నెలల్లో కంపెనీల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ తెలిపింది. ‘‘2022–23లో సెప్టెంబర్ 30 నాటికి సగటున చమురు ధర బ్యారెల్ 105 డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి డిసెంబర్ 31 నాటికి 16 శాతం తగ్గి బ్యారెల్ 89 డాలర్లకు దిగొచ్చింది’’ అని పేర్కొంది. -
భారత్ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ స్పష్టం చేసింది. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయని, రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయని వివరించింది. ఆయా అంశాలు ఊహించినదానికన్నా వేగంగా సానుకూలతను సంతరించుకుంటున్నట్లు వివరించింది. ఆయా అంశాలు దేశంపై రేటింగ్‌కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ’సావరిన్ డీప్ డైవ్’ పేరుతో మూడీస్ నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ డి గుజ్మాన్ మాట్లాడుతూ, ♦ భారతదేశానికి మూడీస్ ‘బీఏఏ3’ సార్వభౌమ రేటింగ్ ఇస్తోంది. అధిక రుణ భారం ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ ఎకానమీ బలహీనతలను అధిక ఆర్థిక వృద్ధి పటిష్టత సమతౌల్యం చేస్తుంది. భారత్ కార్పొరేట్ వ్యవస్థ కూడా ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ప్రతిబింబిస్తోంది. ♦ 2022 చివరి నాటికి భారత్ రుణ నిష్పత్తి (దేశ స్థూలదేశీయోత్పత్తి– జీడీపీలో) 84 శాతంగా ఉంటుందన్నది అంచనా. పలు వర్థమాన దేశాలకన్నా ఇది ఎక్కువ. ♦ వచ్చే ఏడాది భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీ–20 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మేము భావిస్తున్నాము. అయితే కుటుంబాలు, వ్యాపార సంస్థలు తక్కువ కొనుగోలు శక్తి సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తుతం కీలక సవాలుగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం భారతదేశ వృద్ధికి ప్రతికూల ప్రమాదాలను సృష్టిస్తోంది. ♦ భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం జరిగింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. ♦ 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. ♦ బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయి. ♦ 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుంది. 2023లో జీ-20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణించే అవకాశం ఉంది. ♦ మెరుగైన పన్ను వసూళ్ల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2022-23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ♦ మూడీస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్‌గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్‌కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. రూపాయిపై ఆందోళన అక్కర్లేదు.. భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదని భావిస్తున్నాం. రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.05నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన దోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. -
ఎన్హెచ్ఏఐ రేటింగ్స్ ఉపసంహరణ: మూడిస్
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు చెందిన బీఏఏ3 ఇష్యూయర్ రేటింగ్, బీఏఏ3 సీనియర్ అన్సెక్యూర్డ్ మీడియం టర్మ్ నోట్ ప్రోగ్రామ్ రేటింగ్లను ఉపసంహరించుకున్నట్టు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ప్రకటించింది. సొంత వ్యాపార కారణాలే ఇందుకు దారితీసినట్టు తెలిపింది.రేటింగ్లను ఉపసంహరించుకోవడానికి ముందు ఎన్హెచ్ఏఐకు సంబంధించి స్టెబుల్ రేటింగ్‌ను మూడిస్ కొనసాగించడం గమనార్హం. -
జీడీపీ బౌన్స్‌బ్యాక్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రికవరీ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితమయ్యింది. నిజానికి క్షీణత ‘సింగిల్ డిజిట్’కు పరిమితమవుతుందని పలు విశ్లేషణలు వచ్చినప్పటికీ, ఇంత తక్కువగా నమోదవుతుందని అంచనావేయలేదు. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. తయారీ, వ్యవసాయం, విద్యుత్, గ్యాస్ రంగాలు ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీకి చేయూతను ఇచ్చాయి. వినియోగ డిమాండ్ మెరుగుపడితే రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింత ఊపునందుకునే అవకాశం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. వివిధ రంగాలు చూస్తే...: తయారీ: జూన్ నుంచీ కఠిన లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఊపందుకుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15% వాటా ఉన్న తయారీ రంగం 0.6% వృద్ధి నమోదుచేసుకోవడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఈ విభా గం 39% క్షీణించింది. ► వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15% వాటా ఉన్న వ్యవసాయం 3.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► విద్యుత్, గ్యాస్: 4.4% వృద్ధిని సాధించాయి. ► ఫైనాన్షియల్, రియల్టీ సేవలు: ఈ విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. 8.1 శాతం మైనస్ నమోదయ్యింది. ► ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ విభాగాలు సైతం 15.6 శాతం నష్టాల్లోనే (క్షీణత) ఉన్నాయి. ► నిర్మాణం: ఆర్థిక వ్యవస్థలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఈ రంగం క్షీణత 8.6 శాతం. అయితే క్యూ1లో భారీగా ఇది 50% క్షీణించింది. ► ప్రభుత్వ వ్యయాలు: ఆందోళనకరంగానే ఉన్న ప్రభుత్వ వ్యయాలు మరో అంశం. ప్రభుత్వ వ్య యాలు సెప్టెంబర్ క్వార్టర్లో 12% క్షీణించింది. క్షీణత ఇలా...: జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటన ప్రకారం, 2020–21 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.33.14 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ 35.84 లక్షల కోట్లు. అంటే విలువలో ఎటువంటి వృద్ధిలేకపోగా 7.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. సాంకేతికంగా మాంద్యమే... ఒక ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణ రేటును నమోదుచేస్తే, ఆ పరిస్థితిని మాంద్యంగా పరిగణిస్తారు. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో భారత్ వరుస క్షీణ రేటును నమోచేసిన నేపథ్యంలో దేశం సాంకేతికంగా మాంద్యంలోకి జారిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. మొదటి ఆరు నెలల కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 15.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. అయితే ఎకానమీ ‘వీ’ నమూనా వృద్ధి నమోదుచేసుకుంటుందని ఆర్థిక నిపుణులు భరోసాతో ఉండడమే ఊరట. దేశంలో క్రమంగా వినియోగ డిమాండ్ పుంజుకుంటోంది. ఆటో మొబైల్ పరిశ్రమ బాగుంది, నాన్–డ్యూరబుల్ రంగం మెరుగుపడుతోంది. రైలు రవాణా పెరుగుతోంది. వచ్చే ఏడాది తొలి నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ వృద్ధికి ఊతం ఇచ్చేవి కావడం గమనార్హం. అయితే సెకండ్‌వేవ్ కేసుల భయాలూ ఉన్నాయి. ఇది రానున్న రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థను ప్రతికూలతలోకి నెడతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దానికన్నా (4% వద్ద నిర్దేశం) అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం. వృద్ధి బాటలో చైనా దూకుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిన నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. 2020తో తొలి ఆరు నెలల కాలం (జనవరి–జూన్) చూసుకుంటే 1.6 శాతం క్షీణతలో ఉన్న చైనా, మూడు త్రైమాసికాలు కలిపితే 0.7 శాతం పురోగతిలో ఉంది. అక్టోబర్‌లో మౌలికం 2.5 శాతం క్షీణత మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి అక్టోబర్‌లో 2.5 శాతం మేర క్షీణించింది. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ఉత్పత్తి పడిపోవడం ఇందుకు కారణం. మౌలిక రంగం క్షీణించడం ఇది వరుసగా ఎనిమిదో నెల. మార్చి నుంచి ఇది క్షీణ బాటలోనే ఉంది. 2019 అక్టోబర్‌లో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి 5.5 శాతం క్షీణత నమోదు చేసింది. బొగ్గు, ఎరువులు, సిమెంట్, విద్యుదుత్పత్తి సానుకూల వృద్ధి కనపర్చగా, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో చూస్తే మౌలికం 13% క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 0.3% వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా .. అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 11.6%, సిమెంట్ (2.8%), విద్యుత్ (10.5%) వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు క్రూడాయిల్ 6.2 శాతం, సహజ వాయువు 8.6%, రిఫైనరీ ఉత్పత్తులు 17 శాతం, ఉక్కు 2.7 శాతం మేర ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. 1950–51నుంచి భారత్ జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. అబ్బురపరుస్తున్నాయ్... ఆర్థిక రికవరీ అబ్బుర పరుస్తోంది. ప్రత్యేకించి తయారీ రంగం సానుకూలతలోకి రావడం హర్షణీయం. వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొంటోందని ఈ అంశం సూచిస్తోంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రోత్సాహకరం మహమ్మారి ప్రేరిత అంశాలు, గత త్రైమాసికం తీవ్ర నిరాశాకర ఫలితాల నేపథ్యంలో వెలువడిన తాజా గణాంకాలు కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత ఆందోళన కూడా ఉంది. ఆర్థిక క్షీణత మహమ్మారి వల్లే. ఈ సవాలు ఇంకా కొనసాగుతోంది. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ద్వితీయార్ధంలో ‘వృద్ధి’కి అవకాశం ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు, సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో (అక్టోబర్–మార్చి) దేశం వృద్ధి బాటకు వస్తుందన్న విశ్వాసం కనబడుతోంది. 2021–22లో వృద్ధి రెండంకెల్లో నమోదు అవుతుందని భావిస్తున్నాం. అక్టోబర్‌లో భారీగా పెరిగిన వినియోగ డిమాండ్ ఆశావహ పరిస్థితులను సృష్టిస్తోంది. అయితే సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనడమే ప్రస్తుతం కీలకాంశం. – ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ విశ్వాసాన్ని పెంచుతున్నాయ్ తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితులను క్రమంగా సడలిస్తున్న నేపథ్యం ఇది. ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక వ్యవస్థ సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయి. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. వినియోగ డిమాండ్ మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ తయారీలో విజయం అంచనాలకు మించి సానుకూల ఫలితం రావడం హర్షణీయం. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ బాటలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా తయారీ రంగంలో సానుకూలత మంచి పరిణామం. ప్రోత్సాహకరమైనది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల ఫలితమిది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ముందుముందు మంచికాలం ఫలితాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. తాజా ఫలితాలను చూస్తుంటే, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనూ మంచి ఫలితాలు వెలువడతాయన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు పురోగతి బాటన పయనిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం మెరుగుపడుతోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
2020-21లో వృద్ధిరేటు సున్నా శాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో దేశీయ వృద్ది రేటు గణనీయంగా పతనం కానుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్సీస్ శుక్రవారం ప్రకటించింది. నెగెటివ్ నుంచి భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను సున్నాకు తగ్గించేసింది. కోవిడ్-19 కల్లోలం, లాక్ డౌన్ కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎటువంటి వృద్ధిని కనబరచదని వెల్లడించింది. అయితే 2022లో ఇది 6.6 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఆర్థిక లోటు జీడీపీ లో 5.5 శాతానికి పెరుగుతుందని మూడీస్ విశ్లేషకులు శుక్రవారం తెలిపారు. బడ్జెట్ అంచనా ప్రకారం 3.5 శాతం మాత్రమే. గత నెల చివరిలో, మూడీస్ తన క్యాలెండర్ సంవత్సరం 2020 జీడీపీ వృద్ధి అంచనాను 0.2 శాతానికి తగ్గించిన సంగతి విదితమే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడి, మందగించిన ఉద్యోగ కల్పన, బ్యాంకింగేతర రంగాల్లో నెలకొన్న మూల ధన సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. జీడీపీ తిరిగి అత్యధికస్థాయికి కి పుంజుకోక పోతే బడ్జెట్ లోటును తగ్గించడంలో, రుణ భారం పెరగకుండా నిరోధించడంలో ప్రభుత్వం కీలక సవాళ్లను ఎదుర్కొంటుందని మూడీస్ తెలిపింది. వృద్ధి క్షీణత, ప్రభుత్వ ఆదాయ ఉత్పత్తి, కరోనావైరస్-సంబంధిత ఆర్థిక ఉద్దీపన చర్యలతో ప్రభుత్వ డెట్ రేషియోలకు దారితీస్తుందనీ, రాబోయే కొన్నేళ్లలో జీడీపీలో 81 శాతానికి పెరుగుతుందని భావిస్తు న్నామని పేర్కొంది. కాగా గత నవంబరులో ఆర్థిక వ్యవస్థ అవుట్ లుక్ ను ‘నెగటివ్’కి చేర్చిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. (ఎస్బీఐ ఉద్యోగికి కరోనా: కార్యాలయం మూసివేత) -
2020లో భారత్ వృద్ధి 5.3 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 2020లో 5.3 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ.. మూడీస్ తాజాగా అంచనావేసింది. ఫిబ్రవరిలో వేసిన 5.4 శాతం అంచనాలను 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర కుదించింది. అంచనాల కుదింపునకు కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రభావాన్ని కారణంగా చూపడం గమనార్హం. 2020 భారత్ వృద్ధి అంచనాలను మూడీస్ తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తొలుత 6.6 శాతం అంచనాలను ఫిబ్రవరిలో 5.4 శాతానికి కుదించడం జరిగింది. తాజాగా దీనిని 5.3 శాతానికి తగ్గించింది. 2020లో భారత్ జీడీపీ 5.3 శాతం. 2018లో ఈ రేటు 7.4 శాతంగా ఉంది. తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ 2021లో వృద్ధి రేటు కాస్త పుంజుకుని 5.8 శాతంగా నమోదు కావచ్చు. ♦ కరోనా వైరస్ వల్ల దేశీయంగా డిమాండ్ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. వస్తు సేవల సరఫరా చైన్లలో అంతర్జాతీయంగా తీవ్ర విఘాతం ఏర్పడ్డం దీనికి కారణం. ♦ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కరోనా ప్రభావంతో అంతర్జాతీయ మందగమన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు మందగమన ధోరణులను ఎదుర్కొనడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్న అంశాలను వేచిచూడాల్సి ఉంది. ♦ ఇక అతి తక్కువ స్థాయి చమురు ధరల విషయానికి వస్తే, చమురు ఎగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించకపోవచ్చు. అయితే దిగుమతి దేశాలకు వాణిజ్య లోటుకు సంబంధించి ఇది ఊరటనిస్తుంది. కోవిడ్ నష్టం... క్రూడ్ లాభం! కాగా, కోవిడ్–19 వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టాన్ని తక్కువ స్థాయి క్రూడ్ ధర ‘తగిన భారీ స్థాయిలోనే’ సర్దుబాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మంగళవారం పేర్కొన్నారు. 2020–21లో ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్దీపన చర్యలు వృద్ధికి కొంత మేర ఊపునిస్తాయని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. -
2020లో భారత్ వృద్ధి 5.4 శాతమే..: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి 2020 అంచనాలకు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ కోత పెట్టింది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు కేవలం 5.4 శాతమే ఉంటుందని పేర్కొంది. ఇంతక్రితం 2019 నవంబర్‌లో వేసిన అంచనా ప్రకారం ఈ రేటు 6.6%. ఆర్థిక రికవరీ అంచనాలకన్నా నెమ్మదిగా ఉందని తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఇక 2021లో భారత్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలకూ మూడీస్ కోత పెట్టింది. ఈ రేటును 6.7% నుంచి 6.6 శాతానికి కుదించింది. క్యాలెండర్ ఇయర్ ప్రాతిపదకన వేసిన ఈ అంచనాల ప్రకారం– 2019లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 5%. అంతర్జాతీయ అంశాలకన్నా దేశీయ అంశాలే భారత్ వృద్ధిపై కొంత అధిక ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అవుట్‌లుక్ పేర్కొంది. దేశీయ డిమాండ్ పెంపు, బ్యాంకింగ్ మందగమనం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆర్థిక వృద్ధి మెరుగుపడ్డానికి ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆర్థిక ఉద్దీపనలకు 2020 బడ్జెట్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని వివరించింది. -
2019 భారత్ వృద్ధి 5.6 శాతమే!: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ 2019 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం తగ్గించింది. కేవలం 5.6 శాతమే వృద్ధి నమోదవుతుందని తాజా అంచనాల్లో పేర్కొంది. 2018లో భారత్ వృద్ధి 7.4 శాతం. వ్యవస్థలో వినియోగ డిమాండ్ పేలవంగా ఉందనీ, డిమాండ్ పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలు ఇవ్వకపోవడం తమ తాజా అంచనాలకు కారణమని మూడీస్ పేర్కొంది. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తంగా భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను అక్టోబర్ 10వ తేదీన మూడీస్ 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది. భారత్ అవుట్‌లుక్‌ను కూడా గతవారం ‘స్టేబుల్’ నుంచి ‘నెగెటివ్’కు తగ్గించింది. -
బీపీసీఎల్‌కు ‘డౌన్‌గ్రేడ్’ ముప్పు!
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రైవేటీకరించిన పక్షంలో రేటింగ్‌ను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. ప్రస్తుతం సార్వభౌమ రేటింగ్ స్థాయిలో ఉన్న ట్రిపుల్ బి మైనస్ స్థాయిని బీఏ1 స్థాయికి తగ్గించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రైవేటీకరణతో బీపీసీఎల్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధం తెగిపోయి.. బాండ్ల ఉపసంహరణ కోసం ఒత్తిడి పెరుగుతుందని, ఇది కంపెనీ రుణపరపతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ తెలిపింది. కొనుగోలు చేసే సంస్థ ప్రభుత్వ రంగంలోనిదా లేక ప్రైవేట్ కంపెనీయా అన్న దానిపై బీపీసీఎల్ క్రెడిట్ రేటింగ్స్ ఆధారపడి ఉంటాయని మూడీస్ వెల్లడించింది. బీపీసీఎల్‌లో ఉన్న మొత్తం 53.29 శాతం ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సెప్టెంబర్ 30న జరిగిన సమావేశంలో కార్యదర్శుల బృందం ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. ప్రస్తుత షేరు ధరల ప్రకారం బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విలువ సుమారు రూ. 57,500 కోట్లకు పైగా ఉంటుంది. సెప్టెంబర్ 30 నాటి గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ బాండ్లకు సంబంధించి బీపీసీఎల్ 1.7 బిలియన్ డాలర్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. కంపెనీ ద్రవ్య పరిస్థితి ఇప్పటికే బాగా లేదు. ఇలాంటప్పుడు విదేశీ కరెన్సీ బాండ్లను తిరిగి చెల్లించాల్సి వస్తే బీపీసీఎల్‌కు రీఫైనాన్సింగ్‌పరమైన రిస్కులు గణనీయంగా ఉంటాయని అంచనా. 2019 మార్చి ఆఖరు నాటికి బీపీసీఎల్ దగ్గర రూ. 5,300 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉండగా.. వచ్చే 15 నెలల్లో రూ. 10,900 కోట్ల మేర రుణాలను చెల్లించాల్సి రానుంది. -
ఎయిర్‌టెల్‌కు రేటింగ్ షాక్
సాక్షి, ముంబై : టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో కుదేలైన దేశీ మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు రేటింగ్ షాక్ తగిలింది. క్యూ3 లాభాల్లో భారీ క్షీణతను నమోదు చేసిన ఎయిర్‌టెల్‌కు తొలిసారిగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ డౌన్ గ్రేడ్ రేటింగ్‌ను ఇచ్చింది. దీంతో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ఒకదశలో ఎయిర్ టెల్ షేరు 4 శాతం పతనమైంది. గ్లోబల్ దిగ్గజం మూడీస్ ఎయిర్టెల్ క్యాష్‌ఫ్లోపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో జంక్ స్టేటస్ ఇచ్చింది. ఇన్వెస్టర్ సర్వీసెస్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌కు సవరించింది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ బీఏఏ3 నుంచి బీఏ1కు సవరించింది. నాన్ ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ బీఏ1 ఇవ్వడం ద్వారా సంస్థ ఔట్‌లుక్‌ను ప్రతికూలంగా ప్రకటించింది. -
ఎయిర్‌టెల్‌కు రేటింగ్ షాక్
సాక్షి, ముంబై: టెలికాం కంపెనీలకు రేటింగ్ షాక్ తగిలింది. ప్రధానంగా టెలికా మేజర్ భారతి ఎయిర్‌టెల్‌కు డౌన్ రేటింగ్ దెబ్బ పడింది. బాండ్ రేటింగ్‌లో అతి తక్కువ రేటింగ్ ఇవ్వడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎయిర్టెల్ కౌంటర్ దాదాపు 5 శాతానికిపైగా పతనమైంది. మూడీస్ ఎయిర్‌టెల్‌కు బీఏఏఏ3 ర్యాంకింగ్ఇచ్చింది. లాభాలు, క్యాష్ ఫ్లో బలహీనంగా ఉండనుందని మూడీస్ అంచనా వేసింది. తమ సమీక్షలో ఎయిర్టెల్ లాభదాయకత, ప్రత్యేకంగా భారతీయ మొబైల్ సేవల లాభాలు క్షీణత, అధిక రుణభారం, తరుగుతున్న మూలధన నిధుల కారణంగా ఈ అంచనాకు వచ్చినట్టు మూడీ వైస్ ప్రెసిడెంట్ , సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అన్నాలిసా డిచియారా చెప్పారు కాగా వరుసగా పదవ త్రైమాసికంలో కూడా ఎయిర్టెల్ లాభాలు దారుణంగి పడిపోయాయి. 2018 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్టెల్ లాభాలు 65.4 శాతం క్షీణించింరూ. 119 కోట్లనుసాధించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 343 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం ఆదాయం రూ .20,422 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .21,777 కోట్ల కంటే 6.2 శాతం తక్కువ. -
సమీప కాలంలో టెలికంకు సమస్యలే
ముంబై: దేశీయ టెలికం రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సమీప కాలంలోనూ ఉపశమనం ఉండబోదని, స్థిరీకరణ వల్ల ప్రయోజనాలు దీర్ఘకాలంలోనే ఉంటాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా వేసింది. టెలికం రంగంలో స్థిరీకరణతో ధరల పరంగా మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఇది దీర్ఘకాలానికి సానుకూలమని పేర్కొంది. రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో టెలికం మార్కెట్లోకి ప్రవేశించడంతో... అప్పటికే ఈ రంగంలో ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్కామ్పై తీవ్ర ఒత్తిళ్లు పడ్డాయి. దీంతో స్థిరీకరణ, ఆస్తుల విక్రయాలు, ఉద్యోగాల నష్టం, దివాలా పరిస్థితులూ నెలకొన్నాయి. ఇవన్నీ మూడీస్ తన నివేదికలో గుర్తు చేసింది. ఆదాయం, లాభాలు క్షీణించి, రుణాలు పెరిగిపోవడంతో... వొడాఫోన్, ఐడియాల మధ్య... టెలినార్, ఎయిర్టెల్, టాటా డొకోమోల విలీనాలు చోటు చేసుకున్న విషయం విదితమే. రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్ సేవలు నిలిపివేశాయి. ఎయిర్టెల్ అయితే తన చరిత్రలో తొలిసారి దేశీయ కార్యకలాపాలపై జూన్ క్వార్టర్లో నష్టాలను ప్రకటించింది. సమీప కాలంలో టెలికంలో 60,000 ఉద్యోగాలు తగ్గుతాయని మూడీస్ అంచనా వేసింది. ‘‘మూడు నుంచి నాలుగు సంస్థలతోపాటు ధరల పరంగా మరింత సహేతుక పరిస్థితులు దీర్ఘకాలంలో సాధ్యమవుతాయి. కానీ, సమీప కాలంలో సగటు కస్టమర్‌పై వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరిగేందుకు అవకాశాల్లేవు’’ అని మూడీస్ తేల్చి చెప్పింది. టెలికం కంపెనీల లాభాల మెరుగుదలకు ఏఆర్పీయూ వృద్ధి చాలా కీలకం. జియో సైతం సెప్టెంబర్ క్వార్టర్లో ఏఆర్పీయూ క్షీణతను ఎదుర్కోవడం గమనార్హం. ఎయిర్‌టెల్‌కు దేశీయంగా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆఫ్రికా కార్యకలాపాలు చేదోడుగా నిలుస్తాయని మూడీస్ పేర్కొంది. -
దేశీ బ్యాంకుల లాభం.. అంతంతే!
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. మూలధనంపరంగా చూసినా దేశీ బ్యాంకులు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. అయితే, అసెట్ క్వాలిటీ స్థిరపడే కొద్దీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితి మెరుగుపడొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. ‘కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒత్తిళ్ల కారణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ బలహీనంగా ఉంది. అయితే, బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వమిచ్చే అదనపు మూలధనంతో వాటి క్యాపిటల్ నిష్పత్తులు మెరుగుపడగలవు‘ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వివరించింది. మార్కెట్లో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు అధికంగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత దెబ్బతింటోందని పేర్కొంది. మరోవైపు, బ్రెజిల్, దక్షిణాఫ్రికా బ్యాంకులు అసెట్స్‌పై అత్యధిక రాబడులు నమోదు చేస్తున్నాయని వివరించింది. బ్రిక్స్ కూటమిలో భారత్ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ‘చైనా బ్యాంకుల కోవలోనే భారత బ్యాంకులు కూడా ప్రొవిజనింగ్‌కు ముందు లాభదాయకంగా ఉంటున్నప్పటికీ.. వ్యవస్థలో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు భారీగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అసెట్స్‌పై రాబడులు నెగటివ్‌గా ఉంటున్నాయి. మొండిబాకీలకు భారీ కేటాయింపులు జరపాల్సి వస్తుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో కూడా లాభదాయకతపై ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఆ తర్వాత అసెట్ క్వాలిటీ స్థిరపడ్డాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారతీయ బ్యాంకుల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది‘ అని మూడీస్ నివేదిక పేర్కొంది. మొండిబాకీల్లో రెండో స్థానం.. మొండిబాకీల విషయంలో బ్రిక్స్ కూటమిలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు మూడీస్ వెల్లడించింది. 2017 ఆఖరు నాటికి నిరర్ధక రుణాల నిష్పత్తి (ఎన్పీఎల్) రష్యన్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారతీయ బ్యాంకుల మొండిబాకీల నిష్పత్తి కూడా 2017 ఆఖరు దాకా రెండంకెల స్థాయిలోనే ఉన్నప్పటికీ, వాటిని గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిందని మూడీస్ వివరించింది. స్థూలఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, కార్పొరేట్లు తమ ఖాతాలు మొండిబాకీలుగా మారకుండా ప్రయత్నాలు చేస్తుండటం తదితర అంశాల కారణంగా రాబోయే 12–18 నెలల్లో కొత్త ఎన్‌పీఎల్‌ల సంఖ్య ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని పేర్కొంది. అలాగే మొండిపద్దుల పరిష్కార చర్యల ఫలితంగా ఎన్పీఎల్ నిష్పత్తి కూడా క్రమంగా తగ్గొచ్చని వివరించింది. 25,000 కోట్ల సమీకరణ! ♦ ఎస్బీఐ ప్రణాళిక ♦ ఇందులో బాండ్ల ద్వారా రూ.5,000 కోట్లు ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19) రూ.25,000 కోట్లు సమీకరించడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో రూ.5,000 కోట్లు బాండ్ల (బాసెల్ 3 టైర్ టూ బాండ్స్) ద్వారా సమీకరించాలన్నది ప్రణాళిక. క్యాపిటల్ అడిక్వెసీ (మూలధన) నిబంధనల ప్రమాణాలకు దీటుగా ఈ నిధులను సమీకరించనున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ తెలిపింది. తమ ఈ రెండు ప్రతిపాదనలకు ఇప్పటికే బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు కూడా ఎస్బీఐ వెల్లడించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం... ♦ పబ్లిక్ ఆఫర్ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా దేశీయ లేదా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూపాయిలు లేదా డాలర్లలో రూ.5,000 కోట్ల వరకూ బ్యాంక్ నిధులు సమీకరించనుంది. ♦ ఇక రూ.20,000 కోట్ల ఈక్విటీ క్యాపిటల్ సమీకరణ రెండవ అంశం. ఎఫ్‌పీఓ, క్యూఐపీ, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, రైట్స్ ఇష్యూ లేదా ఇతర విధానాలు లేదా పైన పేర్కొన్న అన్ని విధానాల ద్వారా తగిన సమయంలో రూ.20,000 కోట్లను మార్కెట్ ద్వారా ఎస్బీఐ సమీకరిస్తుంది. సిండికేట్ బ్యాంక్‌కు రూ.728 కోట్లు.... ప్రభుత్వ రంగంలోని సిండికేట్ బ్యాంక్ ప్రభుత్వం నుంచి రూ.728 కోట్ల తాజా మూలధనం పొందింది. ఈ మేరకు బ్యాంక్ సోమవారం ఒక ప్రకటన చేసింది. షేర్ల ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈ నిధులు పొందినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. త్వరలో సెంట్రల్బ్యాంక్కూ... సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ మార్గంలో షేర్లు కేటాయించి రూ.2,354 కోట్లు పొందనుంది. నవంబర్ 13న జరిగిన అసాధారణ వాటాదారుల సమావేశంలో ఈ ఆమోదం పొందనున్నట్లు బ్యాంక్ గతవారం పేర్కొంది. రూ.2.1 లక్షల కోట్లలో భాగమే! 2017–18, 2018–19లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా రూ.2.1 లక్షల కోట్లను సమకూర్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 20 ప్రభుత్వ బ్యాంకులు 2017–18లో రూ.88,139 కోట్లను పొందాయి. 2018–19లో రూ.65,000 కోట్లు పొందనున్నాయి. ప్రణాళికలో భాగంగా రూ. రూ.58,000 కోట్లను మార్కెట్ ద్వారా బ్యాంకులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలైలో ఐదు బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పొందనున్న మూలధనంలో భాగంగా రూ.11,336 కోట్లను పొందాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(రూ.2,816కోట్లు), అలహాబాద్ బ్యాంక్ (రూ.1,790 కోట్లు), ఆంధ్రాబ్యాంక్(రూ.2,019 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (రూ.2,157 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ.2,555 కోట్లు) ఉన్నాయి. -
భారత్ రేటింగ్‌కు ప్రతికూలం!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల కోత ప్రభుత్వ ఆదాయాలకు గండి కొడుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇది భారత్‌కు ‘క్రెడిట్ నెగటివ్’ అని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్య లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో 3.3 శాతంగా ఉండాలన్న కేంద్ర బడ్జెట్ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, ఇది 3.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా (2018–19 జీడీపీ విలువలో 3.3 శాతం) ఉండాలని బడ్జెట్ నిర్దేశించింది. అయితే మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్టు) ఈ లోటు రూ.5.91 లక్షల కోట్లుగా ఉంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.1.5 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.10,500 కోట్ల మేర కేంద్రం ఆదాయాలకు గండికొడుతుందని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాలపై మూడీస్ తాజా ప్రకటనలో వెలువరించిన ముఖ్యాంశాలివీ... ♦ తమ ప్రైసింగ్‌లో లీటరుకు రూపాయి తగ్గించుకోవాలన్న ఆదేశాలు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కె టింగ్ కంపెనీలకు (ఓఎంసీ) ప్రతికూలమైనవే. ♦ జీడీపీలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 3.4 శాతం ఉంటుందని భావిస్తున్నాం. కేంద్ర–రాష్ట్రాలు రెండూ కలిపితే ఈ లోటు జీడీపీలో 6.3 శాతంగా ఉండే వీలుంది. ప్రభుత్వ మూలధన వ్యయాల కోతకూ ఆయా పరిస్థితులు దారితీయవచ్చు. ♦ అయితే ఫ్యూయెల్ ఎక్సైజ్ కోత జీడీపీ వృద్ధి రేటుపై మాత్రం స్వల్ప ప్రభావమే చూపుతుంది. ♦ ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్ జీడీపీ వృద్ధి 2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 7.3 శాతం, 7.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ♦ గ్లోబల్ ఫైనాన్షియల్ పరిస్థితుల ప్రతికూలత, అధిక చమురు ధరలు, దేశీయ క్రెడిట్ పరిస్థితుల్లో క్లిష్టత భారత్‌కు తక్షణ సవాళ్లు. ♦ భారత సావరిన్ రేటింగ్‌ను 13 యేళ్ల తరువాత మొట్టమొదటిసారి మూడీస్ గత ఏడాది పెంచింది. దీనితో ఈ రేటు ‘బీఏఏ2’కు చేరింది. వృద్ధి అవకాశాలు బాగుండటం, ఆర్థిక, వ్యవస్థీకృత విభాగాల్లో సంస్కరణల కొనసాగింపు రేటింగ్ పెంపునకు కారణమని వివరించింది. -
రేట్ల తగ్గింపు ప్రతికూలమే
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 2.50 మేర తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం తెలిపింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగంలోని మూడు సంస్థల (ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) మొత్తం ఎబిటా మార్జిన్లు రూ.6,500 కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని వివరించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో వాటి ఎబిటాలో దాదాపు 9 శాతం. 2018 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఎబిటా రూ. 69,200 కోట్లు. అయితే, ప్రతికూల ప్రభావాలు ఎలా ఉన్నా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు అధిక ఎబిటానే నమోదు చేసే అవకాశం ఉందని నివేదికలో మూడీస్ పేర్కొంది. అమ్మకాల పరిమాణం పెరగడం, రిఫైనింగ్ మార్జిన్లు స్థిరంగా ఉండటం, రూపాయి మారకం విలువ క్షీణత ఇందుకు దోహదపడగలవని వివరించింది. అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు భారీగా పెరగడం, దేశీ కరెన్సీ విలువ పడిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు సైతం గణనీయంగానే పెరిగాయి. అయితే, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 2.50 మేర తగ్గిస్తున్నట్లు అక్టోబర్ 4న కేంద్రం ప్రకటించింది. లీటరుకు ఎక్సైజ్ సుంకాన్ని రూ. 1.50 తగ్గించిన కేంద్రం.. మరో రూ. 1 మేర రేటు తగ్గింపు భారాన్ని భరించాల్సిందిగా చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దేశీయంగా రిటైల్ ఇంధన అమ్మకాల్లో 95 శాతం మార్కెట్ వాటా ఉన్న ఓఎంసీల రుణపరపతికి ఈ నిర్ణయం ప్రతికూలమని మూడీస్ పేర్కొంది. పెరిగిన ముడిచమురు రేట్ల భారాన్ని కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో బదలాయించకపోవడం వల్ల వాటి ఆదాయాలు దెబ్బతింటాయని వివరించింది. -
ఆ బ్యాంక్‌ల గవర్నెన్స్ మెరుగుపడుతుంది..
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదన ఆయా బ్యాంకులకు సానుకూల అంశమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. దీనితో వాటి గవర్నెన్స్, సమర్ధత మెరుగుపడగలదని సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్) అల్కా అన్బరసు తెలిపారు. విలీన బ్యాంక్‌కు రుణాల పరంగా 6.8 శాతం మార్కెట్ వాటా ఉంటుందని, తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో మూడో అతి పెద్ద బ్యాంక్‌గా మారగలదని వివరించారు. కొత్త సంస్థకు ప్రభుత్వం నుంచి మూలధనపరమైన తోడ్పాటు తప్పనిసరిగా అవసరమవుతుందని అమె తెలిపారు. అసెట్ క్వాలిటీ, మూలధనం, లాభదాయకత తదితర విషయాల్లో దేనా బ్యాంక్‌తో పోలిస్తే బీవోబీ, విజయా బ్యాంక్‌లు మెరుగ్గా ఉన్నాయని వివరించారు. రుణ వృద్ధికి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వ రంగంలోని ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దాదాపు రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో .. ఈ విలీన సంస్థ దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్‌గా నిలవనుంది. ఏప్రిల్ 1 నుంచి ఏర్పాటు.. విలీనానంతరం ఏర్పాటయ్యే కొత్త సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్దేశిత గడువులోగా విలీనంపై మూడు బ్యాంకులు కసరత్తు చేయాల్సి ఉంటుందని, 2018–19 ఆఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని వివరించాయి. మొత్తం మీద 2019 ఏప్రిల్ 1 నుంచి విలీన సంస్థ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని పేర్కొన్నాయి. మూడు బ్యాంకుల బోర్డులు ఈ నెలలోనే సమావేశం కానున్నాయని, ఆ తర్వాత విలీన సీక్మ్ రూపకల్పన జరుగుతుందని సంబంధిత వర్గాలు వివరించాయి. షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటర్ నుంచి అవసరమయ్యే మూలధనం తదితర వివరాలన్నీ ఇందులో ఉండనున్నాయి. యూనియన్ల వ్యతిరేకత..: కాగా, మూడు బ్యాంకుల విలీన ప్రతిపాదనను బ్యాంక్ ఉద్యోగుల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించాయి. బడా కార్పొరేట్ల మొండిబాకీలు, వాటి రికవరీ పైనుంచి దృష్టి మళ్లించేందుకే దీన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించాయి. విలీనాలతోనే బ్యాంకులు పటిష్టంగా, సమర్ధంగా మారతాయనడానికి నిదర్శనాలేమీ లేవని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం వ్యాఖ్యానించారు. ఎస్బీఐలో మిగతా అనుబంధ బ్యాంకులను విలీనం చేయడం వల్ల అద్భుతాలేమీ జరిగిపోలేదని పేర్కొన్నారు. పైపెచ్చు ప్రతికూలతలూ ఏర్పడ్డాయన్నారు. ఎస్బీఐ 200 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా నష్టాలు ప్రకటించిందన్నారు. మరోవైపు బ్యాంకుల విలీనంతో ప్రయోజనం, వాటి ఉద్యోగుల భవిష్యత్ ఏమిటన్న దానిపై స్పష్టత లేదని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్విని రాణా వ్యాఖ్యానించారు. -
రూపాయి పతనం కంపెనీలకు ‘క్రెడిట్ నెగటివ్’
న్యూఢిల్లీ: రూపాయి అదే పనిగా విలువను కోల్పోతుండటంతో... రూపాయల్లో ఆదాయం గడిస్తూ, అదే సమయంలో డాలర్ల రూపంలో రుణాలను తీసుకున్న కంపెనీలకు ‘క్రెడిట్ నెగటివ్’(రుణాల పరంగా ప్రతికూల స్థితి) అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. ఈ ఏడాది రూపాయి ఇంత వరకు డాలర్‌తో 13 శాతం క్షీణించింది. ‘‘అయితే, చాలా వరకు అధిక రేటింగ్ కలిగిన భారత కార్పొరేట్ కంపెనీలు రూపాయి మరో 10 శాతం (ఈ నెల 6 నాటి రూ.72.11 ఆధారంగా) పడిపోయే అంచనాల ఆధారంగా హెడ్జింగ్ వంటి రక్షణాత్మక చర్యలను తీసుకున్నాయి’’ అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అన్నాలిసా డిచియారా తెలిపారు. మూడిస్ నుంచి అధిక ఈల్డ్, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఉన్న 24 భారత కంపెనీలు అమెరికా డాలర్ల రూపంలో కాంట్రాక్టులను కలిగి ఉండటంతో రూపాయి పతన ప్రభావం నుంచి సహజంగానే రక్షణ ఉంటుందని మూడీస్ తెలిపింది. వర్ధమాన కరెన్సీలకు మారకం రిస్క్: నోమురా వర్థమాన దేశాలకు కరెన్సీ రిస్క్ ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, ఈజిప్ట్, టర్కీ, ఉక్రెయిన్ కరెన్సీలకు మారకం సంక్షోభం ఉందని, వీటి స్కోరు 100కు పైగా ఉన్నట్టు పేర్కొంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో విధానాలు సాధారణంగా మారడం, వాణిజ్య రక్షణాత్మక ధోరణులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ను తిరిగి మదింపు వేసుకుంటున్నారని నోమురా వర్ధమాన మార్కెట్ల ఇండెక్స్ ‘డామోక్లెస్’ తెలిపింది. 100కు పైగా స్కోరు ఉంటే రానున్న 12 నెలల్లో ఆయా దేశాల కరెన్సీలకు మారకం సంక్షోభం పొంచి ఉందని అర్థం. 150కు పైగా స్కోరు ఉంటే ఏ సమయంలోనైనా మారకం సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని సంకేతం. ఈ సూచీ ప్రకారం శ్రీలంక స్కోరు 175 కాగా, దక్షిణాఫ్రికా 143, అర్జెంటీనా 140, పాకిస్తాన్ 136, ఈజిప్ట్ 111, టర్కీ 104, ఉక్రెయిన్ 100 స్కోరుతో ఉన్నాయి. భారత్ స్కోరు 25..: భారత్‌కు సంబంధించి డామోక్లెస్ స్కోరు 25గా ఉండటం గమనార్హం. ‘‘భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2018లో మోస్తరు స్థాయిలో (2012లో 9.7 శాతం నుంచి 2018లో 4.5 శాతానికి) ఉంటుంది. కరెంటు ఖాతా లోటు జీడీపీలో గతంలో 5 శాతంగా ఉండగా 2018లో 2.5 శాతంగా ఉంటుంది. ఆర్బీఐ వద్ద సమృద్ధిగా విదేశీ మారకం నిల్వలు ఉన్నాయి. దీంతో డామోక్లెస్ స్కోరు జూలై–సెప్టెంబర్ త్రైమాసికి 25 శాతానికి తగ్గింది’’ అని నోమురా వివరించింది. -
జియోపై భారీగా ఖర్చు
ముంబై : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించుకోబోతుందట. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో రిలయన్స్ జియోపై భారీగా మరో 23 బిలియన్ డాలర్లను(రూ.1,46,841 కోట్లు) వెచ్చించనున్నట్టు మూడీస్ అంచనావేస్తోంది. వైర్లెస్ సర్వీసులకు మించి తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటుందని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఇప్పటికే 31 బిలియన్ డాలర్లను(రూ.1,97,916 కోట్లు) వెచ్చించింది. 21016లో మార్కెట్లోకి ప్రవేశించాక.. ఇతర టెల్కోలకు షాకిస్తూ పలు సంచలనాలనే సృష్టించింది. ప్రస్తుతం మార్కెట్లో దేశీయ నాలుగో టెలికాం ఆపరేటర్‌గా ఉంది. అయితే మూడీస్ అంచనాలపై కంపెనీ వెంటనే స్పందించలేదు. రేపు(శుక్రవారం) రిలయన్స్ ఇండస్ట్రీస్ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతుంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో పెట్టే మూలధన వ్యయాలు, ఫైబర్-టూ-హోమ్, డిజిటల్ టీవీ, మొబైల్ ఫోన్ సర్వీసులను మెరుగుపరిచే బిజినెస్‌లపై వెచ్చించనుందని సింగపూర్‌కు చెందిన మూడీస్ విశ్లేషకుడు వికాస్ హలాన్ చెప్పారు. మరికొంత నగదును నాలుగో తరానికి చెందిన ఫీచర్ ఫోన్లపై, సంబంధిత నెట్వర్క్ ఖర్చులపై పెట్టనుందని పేర్కొన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు షాకిస్తూ.. జియో ప్రతి నెలా కొత్త సబ్స్క్రైబర్లను విపరీతంగా యాడ్ చేసుకుంటోంది. 2016లో టెలికాం మార్కెట్లోకి ప్రవేశించిన బిలీనియర్ ముఖేష్ అంబానీ, అన్ని కాల్ సర్వీసులు జీవిత కాలం ఉచితమంటూ తీవ్ర ధరల యుద్ధానికి తెరతీశారు. డేటా సర్వీసులను కూడా కొన్ని నెలల పాటు ఉచితంగా అందించారు. అంతేకాక గతేడాది జూలైలో తీసుకొచ్చిన ఫీచర్ ఫోన్‌తో మరోసారి టెల్కోలకు హడలెత్తించారు. -
మూడీస్ దారిలో వెళ్లని ఎస్ అండ్ పీ!
న్యూఢిల్లీ: మూడీస్ సంస్థ రేటింగ్ పెంచటంతో మంచి జోష్ మీదున్న ప్రభుత్వ వర్గాలను... మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం భారత్‌కు ఇస్తున్న రేటు ‘బీబీబీ–మైనస్‌ను’ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ఇదే విధంగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ‘స్టేబుల్ అవుట్‌లుక్’ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది. పటిష్ట వృద్ధి ధోరణి రెండేళ్లు కొనసాగుతుందని కూడా ఎస్ అండ్ పీ అంచనావేసింది. అతి తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వానికున్న భారీ రుణం ప్రాతిపదికన యథాతథ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సూచించింది. ఎస్అండ్పీ ప్రకటన చెబుతోంది ఇదీ. ► భారత్ కరెంట్ అకౌంట్, ద్రవ్యోలోటు పరిస్థితులు అంచనాలకు అనుగుణంగా కొనసాగవచ్చు ► ద్రవ్యపరమైన విశ్వసనీయత మెరుగుపడుతోంది. ► దేశంలో తక్కువ తలసరి ఆదాయం ఉంది. ప్రభుత్వంపై భారీ అంతర్జాతీయ రుణ భారమూ ఉంది. అయితే ఇక్కడ భారత్‌లో పటిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ ఉంది. ఈ అంశాలు విధానపరమైన పటిష్టతను పెంపొందిస్తాయి. ఇవన్నీ ప్రస్తుత రేటింగ్‌కు పూర్తి మద్దతుగా ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రతికూలాంశాలు ఉన్నప్పటికీ, తరువాత పేర్కొన్న సానుకూల అంశాలు ఆర్థిక వ్యవస్థకు తగిన సమతౌల్యతను అందిస్తూ, వృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నాం. ► 2007 వరకూ ఎస్అండ్పీ భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్’గా ఉండేది. ఇది అతి దిగువ స్థాయి గ్రేడ్. ఈ రేటింగ్‌కు ఎస్అండ్పీ 2007 జనవరిలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను చేర్చింది. 2009లో అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చిన సంస్థ, మళ్లీ 2010లో స్టేబుల్ హోదా ఇచ్చింది. 2012లో మళ్లీ నెగటివ్ అవుట్‌లుక్‌కు మార్చిన ఎస్అండ్పీ... మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టాక మళ్లీ ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇచ్చింది. ఇదే రేటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ► ప్రభుత్వ వర్గాల నిరాశ: ఎస్అండ్పీ తాజా నిర్ణయంపై ప్రభుత్వ వర్గాలు నిరాశ వ్యక్తం చేశాయి. ఇది తగిన నిర్ణయం కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే వచ్చే ఏడాది రేటింగ్ అప్‌గ్రేడ్ అవుతుందన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యక్తం చేశారు. -
ఈ ఏడాది బడ్జెట్ లోటు పెరుగుతుంది
న్యూఢిల్లీ: తక్కువ పన్ను రేట్లు, అధిక వ్యయాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18)లో బడ్జెట్‌లోటు పెరుగుతుందని రేటింగ్ సంస్థ మూడీస్ స్పష్టం చేసింది. అయితే, పన్ను పరిధిని విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు నిధులను సమర్థవంతంగా వినియోగించడం వల్ల రానున్న సంవత్సరాల్లో లోటు తగ్గుతుందని అభిప్రాయపడింది. ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తాము భావిస్తున్నట్టు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ విలియం ఫోస్టర్ చెప్పారు. దీనికితోడు వృద్ధి రేటు రుణ భారం తగ్గించేందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు. దేశ సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచుతూ రెండు రోజుల క్రితమే మూడీస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యం మరింత క్షీణిస్తే రేటింగ్ తగ్గించే ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని ఫోస్టర్ అన్నారు. అయితే, భారత్ పట్ల స్థిరమైన దృక్పథం ప్రకటించడంతో కనుచూపు మేరలో రేటింగ్‌లో మార్పు ఉండదనే సంకేతంగా పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు వృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తుందని, రుణ భారం మధ్యకాలానికి దిగొస్తుందన్న అంచనాలతోనే రేటింగ్‌ను పెంచడం జరిగిందని ఫోస్టర్ చెప్పారు. eదేశ జీడీపీలో రుణ రేషియో 68.6%గా ఉండగా, 2023 నాటికి దీన్ని 60%కి తగ్గించుకోవాలని ప్రభుత్వం నియమించిన ఓ ప్యానెల్ సూచించిన విషయం గమనార్హం. ‘ప్రభుత్వ బడ్జెట్ లోటు గత రెండు సంవత్సరాల్లో ఉన్నట్టుగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.5 శాతంగా ఉంటుందని మా అంచనా. బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొన్న ఆదాయ అంచనాలు తగ్గి, అదే సమయంలో ప్రభుత్వ వ్యయాలు అధికమైతే అది లోటును ఇంకా పెంచుతుంది. అయితే, పన్ను పరిధి పెంచేందుకు, వ్యయాల్లో సమర్థతకు తీసుకున్న చర్యలు లోటును తగ్గించేందుకు తోడ్పడతాయి’ అని ఫోస్టర్ తెలిపారు. -
అంతర్జాతీయ అంశాలు కీలకం
కంపెనీల క్యూ2 ఫలితాల వెల్లడి దాదాపు పూర్తికావడంతో ఇక ఇప్పుడు మన మార్కెట్‌పై అంతర్జాతీయ అంశాల ప్రభావం ఉంటుందని నిపుణులంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు... తదితర అంశాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. మొత్తం మీద ఈ వారం స్టాక్ సూచీలు సానుకూలంగానే కదులుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేటింగ్ అప్‌గ్రేడ్‌తో మరిన్ని నిధులు... అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు... ఈ వారం గమనించదగ్గ కీలకాంశాల్లో ఒకటని హెడ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ) వి.కె.శర్మ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఫెడ్ అభిప్రాయాలు, వడ్డీరేట్లపై అంచనాలు తదితర అంశాలు ఈ సమావేశ వివరాల ద్వారా వెల్లడయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ సానుకూలంగానే ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. భారత సావరిన్ రేటింగ్‌ను మూడీస్ సంస్థ అప్‌గ్రేడ్ చేయడంతో మార్కెట్ గమనం మారినట్లుగా అనిపిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ రేటింగ్ అప్‌గ్రేడ్ కారణంగా మార్కెట్లోకి మరిన్ని నిధులు వస్తాయని పేర్కొన్నారు.. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్ వెల్లడి కారణంగా మార్కెట్లో ఒకింత ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కంపెనీల ఫలితాల సీజన్ దాదాపు పూర్తి కావడంతో మన మార్కెట్‌గమనం..విదేశీ సంకేతాలపై ఆధారపడి ఉంటుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, నేడు(సోమవారం) జపాన్ వాణిజ్య గణాంకాలు, మంగళవారం(ఈ నెల 21న) అమెరికా ఇళ్ల విక్రయ గణాంకాలు వస్తాయి. ఇక బుధవారం (ఈ నెల 22న) అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు, ముడి చమురు నిల్వలు, మన్నికైన వస్తువుల ఆర్డర్లు, నిరుద్యోగ గణాంకాలు వెలువడుతాయి. ఈ నెల 23న (గురువారం) యూరోపియన్ కేంద్ర బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశ వివరాలు, యూరప్ తయారీ, సేవల రంగాల పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) గణాంకాలు వస్తాయి. థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా గురువారం (ఈ నెల 23న)అమెరికా, జపాన్ మార్కెట్లకు సెలవు. ఇక శుక్రవారం రోజు జపాన్ తయారీ రంగ, అమెరికా తయారీ, సేవల రంగ పీఎంఐ గణాంకాలు వస్తాయి. దాదాపు 13 సంవత్సరాల తర్వాత భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ సంస్థ గత శుక్రవారం అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక, సంస్థాగత సంస్కరణలు కొనసాగుతుండటంతో వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని మూడీస్ సంస్థ వ్యాఖ్యానించింది. సూచీ షేర్లలో మార్పుచేర్పులు.. సెన్సెక్స్ షేర్లలో కొత్తగా ఇండస్ఇండ్ బ్యాంక్, యస్‌బ్యాంక్‌లను చేర్చనున్నారు. ఫార్మా షేర్లు–లుపిన్, సిప్లాల స్థానంలో ఈ షేర్లను చేరుస్తున్నారు. ఈ మార్పులు వచ్చే నెల 18 నుంచి అమల్లోకి వస్తాయి. మరోవైపు బీఎస్ఈ 100 సూచీలో ఫెడరల్ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, వక్రంగీ, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్లను చేర్చనున్నారు. రూ.14 వేల కోట్ల మేర విదేశీ ఈక్విటీ పెట్టుబడులు.. మన స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు మళ్లీ జోరందుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లో రూ.14,328 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ బ్యాంక్‌ల మూలధన నిధుల ప్రణాళిక, రూపాయి నిలకడ, అంతర్జాతీయంగా సెంటిమెంట్ మెరుగుపడడం దీనికి కారణాలని నిపుణులంటున్నారు. గత నెలలో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులు రూ.3,000 కోట్లు. అంతకు ముందు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్ నుంచి రూ.24,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటివరకూ డెట్‌మార్కెట్ నుంచి రూ.1,287 కోట్ల మేర పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో రూ.51,756 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.1.45 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌చేశారు. -
గతవారం బిజినెస్
ఆటోమొబైల్స్ ♦ ‘మోటరోలా’ తాజాగా ‘మోటో ఎక్స్4’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 20,999. ♦ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ తన ఎస్యూవీ ‘స్కార్పియో’లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9.97 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ♦ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా తన పాపులర్ ఎస్యూవీ ’ఎఫ్పేస్’ అసెంబుల్‌ను స్థానికంగానే ప్రారంభించింది. పుణే ప్లాంటులో దీన్ని తయారు చేస్తోంది. దీని ధర రూ.60.02 లక్షలు. ♦ చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ’ఇన్ఫినిక్స్ మొబైల్’ తాజాగా తన ’జీరో’ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్పోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. జీరో–5, జీరో–5 ప్రో అనే ఈ రెండు ఫోన్ల ధర వరుసగా రూ.17,999గా, రూ.19,999గా ఉంది. ♦ చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ’జియోనీ’ తాజాగా ’ఎం7 పవర్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.16,999. భారత్ రేటింగ్ పెంచిన మూడీస్ భారత్ చేపడుతున్న సంస్కరణలను అమెరికా రేటింగ్స్ సంస్థ మూడీస్ ఎట్టకేలకు గుర్తించింది. భారత సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచుతూ మోదీ సర్కారుకు ఊరట కల్పించింది. భారత్ విషయంలో తన దృక్పథాన్ని సానుకూలం నుంచి స్థిరత్వానికి సవరించింది. వన్నె తగ్గుతున్న గోల్డ్ ఈటీఎఫ్‌లు గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) ప్రాభవం తగ్గుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– అక్టోబర్ మధ్య కాలంలో వీటి నుంచి ఇన్వెస్టర్లు రూ.422 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. గతేడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.519 కోట్లు. శాంసంగ్= షావోమి? చైనా స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ ’షావోమి’.. దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ సంస్థ శాంసంగ్‌కు తను ఏమాత్రం తక్కువ కాదనే రీతిలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వాటాను సాధిం చింది. ఈ ఏడాది క్యూ3లో శాంసంగ్‌తో పాటు అగ్రస్థానాన్ని పంచుకుంది. 23.5% మార్కెట్ వాటాను సంపాదించుకుంది. ధర.. దడ... ఇంధనం, ఆహార పదార్ధాల రేట్లు పెరగడంతో అక్టోబర్‌లో టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) ఆరు నెలల గరిష్టానికి ఎగిసి 3.59 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్‌లో ఇది 2.60 శాతంగా ఉండగా, గతేడాది అక్టోబర్‌లో 1.27 శాతంగానే నమోదయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 3.85 శాతం స్థాయి అనంతరం ఆరు నెలల తర్వాత అక్టోబర్‌లో నమోదైనదే అత్యధికం కావడం గమనార్హం. 41 చమురు క్షేత్రాలకు ఓఎన్జీసీ, కెయిర్న్ బిడ్లు చమురు, గ్యాస్ క్షేత్రాల వేలంలో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా సంస్థలు అత్యధిక క్షేత్రాలకు బిడ్లు వేశాయి. ఓఏఎల్ విధానం కింద తొలిసారిగా నిర్వహించిన వేలంలో ఓఎన్జీసీ 41 క్షేత్రాలకు, వేదాంత గ్రూప్‌లో భాగమైన కెయిర్న్ ఇండియా 15 క్షేత్రాలకు బిడ్లు దాఖ లు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగానికి చెందిన మరో సంస్థ ఆయిల్ ఇండియా, ప్రైవేట్ సంస్థ హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కూడా ఈ వేలంలో పాల్గొన్నాయి. అక్టోబర్‌లో ఎగుమతులు డౌన్ జీఎస్టీ అమలు అనంతరం ఎగుమతిదారులకు లిక్విడిటీపరమైన సమస్యల నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత ఎగుమతులు క్షీణించాయి. అక్టోబర్‌లో 1.12% మేర తగ్గాయి. గతేడాది అక్టోబర్‌లో 23.36 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈసారి గత నెలలో 23.09 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. చివరిగా 2016 ఆగస్టులో ఎగుమతులు క్షీణించాయి. ఇక గత నెల దిగుమతులు 7.6 % వృద్ధితో 34.5 బిలియన్ డాలర్ల నుంచి 37.11 బిలియన్ డాలర్లకు చేరాయి. మిలియనీర్లు 2,45,000 మంది... భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 2,45,000 దాటింది. దేశంలోని మొత్తం కుటుంబాల సంపద విలువ 5 ట్రిలియన్ డాలర్లుగా ఉ న్నట్లు అంతర్జాతీయ ఆర్థికసేవల సంస్థ క్రెడిట్ సూసీ పేర్కొంది. ఫండ్ బిజినెస్‌లోకి ఫెడరల్ బ్యాంక్! ఫెడరల్ బ్యాంక్ తాజాగా మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) వ్యాపా రంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. తన పూర్తి అనుబంధ ఎన్బీఎఫ్సీ విభాగం ’ఫెడ్‌ఫినా’లో 26% వాటా విక్రయించి సబ్సిడరీ ఏర్పాటుకు నిధులను సమీకరించే ప్రక్రియలో నిమగ్నమయింది. డీల్స్.. ♦ టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు దేశీయంగా తమ తమ టవర్ల వ్యాపారాలను ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విక్రయించాలని నిర్ణయించాయి. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,850 కోట్లు. ఈ ఒప్పందాల కింద వొడాఫోన్ ఇండియాకి రూ.3,850 కోట్లు, ఐడియాకి రూ.4,000 కోట్లు లభిస్తాయి. ♦ రుణభారాన్ని తగ్గించుకునేందుకు భారతీ ఎయిర్టెల్ తమ అను బంధ సంస్థ భారతి ఇన్ఫ్రాటెల్లో 8.3 కోట్ల షేర్లను మార్కెట్లో విక్రయించింది. తద్వారా రూ.3,325 కోట్లు సమీకరించింది. ♦ సింగపూర్ లిస్టెడ్ సంస్థ ఆర్‌హెచ్‌టీ హెల్త్ ట్రస్ట్‌కు (ఆర్‌హెచ్‌టీ) చెందిన వ్యాపార విభాగాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ రూ. 4,650 కోట్లుగా ఉంటుందని వెల్లడించింది. ♦ బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్... తాజాగా ఇండస్ టవర్స్‌లో వాటాలను విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోంది. పూర్తిగా లేదా పాక్షికంగా వాటాలను విక్రయించేందుకు ఉన్న వ్యూహాలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో వెల్లడించారు. ♦ ఇన్పోసిస్ తన ఉద్యోగులకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు అంతర్జాతీయ ఆన్లైన్ శిక్షణా సంస్థ ఉడాసిటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ♦ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ త్వరలో భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను (ఈవీ) ప్రవేశపెట్టే దిశగా కసరత్తు మొదలెట్టింది. దీనికోసం టొయోటాతో చేతులు కలిపింది. 2020 నాటికల్లా భారత్‌లో ఈవీలను ప్రవేశపెట్టడంలో పరస్పరం సహకరించుకునేందుకు రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ♦ టెలికం సర్వీసులకు సంబంధించి వేగవంతమైన 5జీ టెక్నాలజీపై కసరత్తు చేసేందుకు భారతి ఎయిర్టెల్ తాజాగా స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్తో చేతులు కలిపింది. -
జీడీపీకి జీఎస్టీ జోష్!
♦ వృద్ధి రేటు పుంజుకుంటుంది... ♦ పన్ను ఆదాయాలు పెరుగుతాయ్... ♦ సార్వభౌమ రేటింగ్‌కు సానుకూలం... ♦ క్రెడిట్ రేటింగ్ దిగ్గజం మూడీస్ అభిప్రాయం న్యూఢిల్లీ: కొత్తగా అమల్లోకి వచ్చిన అతిపెద్ద పన్నుల సంస్కరణ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)... రానున్న కాలంలో భారత్ సార్వభౌమ పరపతి రేటింగ్ పెరుగుదలకు సానుకూలమైన అంశమని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ పేర్కొంది. జీఎస్టీతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పుంజుకుంటుందని... ప్రభుత్వానికి పన్ను ఆదాయాలు పెరుగుతాయని తెలిపింది. ‘మధ్యకాలానికి చూస్తే... జీఎస్టీ వల్ల ఉత్పాదకపరంగా భారీ ప్రయోజనాలు జతవుతాయి. దీనివల్ల వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులు(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సాకారం కావడం ద్వారా... అధిక జీడీపీకి దోహదం చేస్తుంది. అంతేకాదు.. ఏకీకృత మార్కెట్‌తో విదేశీ పెట్టుబడులు కూడా జోరందుకుంటాయి. విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా భారత్‌ఉన్న స్థానం మరింత మెరుగవుతుంది’ అని మూడీస్ వైస్‌ప్రెసిడెంట్(సావరీన్ రిస్క్ గ్రూప్) విలియమ్ ఫోస్టర్ పేర్కొన్నారు. పన్నుల వసూలు యంత్రాంగం, వ్యవస్థ మెరుగవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ‘భారత్ సావరీన్ రేటింగ్‌కు ఇప్పటివరకూ పన్నుల ఆదాయ పరిధి తక్కువగా ఉండటమే అడ్డంకిగా ఉంటోంది. జీఎస్టీ అమలు కారణంగా రేటింగ్ పెంపునకు సానుకూల పరిస్థితులు నెలకొంటాయి’ అని ఫోస్టర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మూడీస్ భారత్‌కు ‘బీఏఏ3’(పాజిటివ్ అవుట్‌లుక్– అంటే భవిష్యత్తులో పెంపునకు అవకాశం) రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అయితే, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌కు సంబంధించి ఇదే అత్యంత తక్కువ స్థాయి రేటింగ్. ఇంతకంటే తగ్గితే జంక్ స్థాయికి పడిపోయినట్లే. వ్యయాలు తగ్గుతాయి... జీఎస్టీ వ్యవస్థలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో పన్ను ప్రోత్సాహకాలు ఇస్తుండటం వల్ల మొత్తమీద పన్ను చెల్లింపులు పెరిగే అవకాశం ఉందని మూడీస్ వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఉమ్మడి ఐటీ మౌలిక సదుపాయాల వినియోగం పెరగడం, సులభమైన పన్ను రేట్ల కారణంగా నిర్వహణ వ్యయాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. వ్యాట్, ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను ఇతరత్రా పరోక్ష పన్నులన్నింటినీ కలిపి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. భారత్ పోటీతత్వాన్ని పెంచుతుంది: కార్పొరేట్ ఇండియా మన పారిశ్రామిక రంగం పోటీతత్వాన్ని మరింత పెంచేందుకు జీఎస్టీ దోహదం చేస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అభిప్రాయపడింది. అదేవిధంగా ఎగుమతులకు ప్రోత్సాహకాలు లభించడంతోపాటు పన్నుల పరిధి కూడా విçస్తృతం కానుందని పేర్కొంది. ‘అత్యంత కీలకమైన, గేమ్ చేంజింగ్ సంస్కరణగా చెబుతున్న జీఎస్టీ జమానాలోకి మనం అడుగుపెట్టాం. ఇంతపెద్ద దేశంలో ఇలాంటి గొప్ప సంస్కరణను సాకారం చేయడం ద్వారా ప్రపంచానికి మన సత్తా చూపగలిగాం. రానున్న రోజుల్లో జీఎస్టీ వల్ల వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొత్త వ్యాపారాల ఏర్పాటు కూడా పుంజుకుంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుంది. పన్ను మీద పన్నుకు అడ్డుకట్ట పడుతుంది. వ్యాపారస్తులంతా తమకు దక్కే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తారని భావిస్తున్నాం. వెరసి ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడంలో జీఎస్టీ తోడ్పాటునందిస్తుంది’ అని సీఐఐ ప్రెసిడెంట్ శోభన కామినేని పేర్కొన్నారు. జీఎస్టీని అమలుచేయడంలో పరిశ్రమ సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లలో రిటైల్ ధరల పెరుగుదల అత్యంత కనిష్టానికి చేరిందని.. ద్రవ్యోల్బణం కోణంలో.. జీఎస్టీ అమలుకు ఇది సరైన తరుణమని అసోచామ్ వ్యాఖ్యానించింది. ‘ప్రారంభంలో జీఎస్టీ అమల్లో కొన్ని ఇబ్బందులు ఉండటం సహజం. అయితే, స్థూలంగా చూస్తే జీఎస్టీకి ఆర్థిక వ్యవస్థ సిద్ధంగా ఉంది. వినిమయ డిమాండ్ మందకొడిగా ఉన్న నేపథ్యంలో జీఎస్టీ ప్రయోజనాలను పరిశ్రమ మొత్తం వినియోగదారులకు బదలాయించాలి. ఉత్పాదకత పెంపు, సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంపై పారిశ్రామిక రంగం దృష్టిపెట్టాలి’ అని అసోచామ్ పేర్కొంది. -
‘డర్టీ డజన్’పై చర్యలు... బ్యాంకింగ్‌కు మంచిదే
♦ రుణ నాణ్యత మెరుగుపడుతుంది... ♦ మూడీస్ విశ్లేషణ న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో రుణ ఎగవేతలకు పాల్పడిన 12 కంపెనీలపై దివాలా కోడ్ కింద చర్యలు చేపట్టడం బ్యాంకింగ్‌కు క్రెడిట్ పాజిటివ్ అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సోమవారం పేర్కొంది. దీనివల్ల బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుపడుతుందనీ విశ్లేషించింది. మొత్తం బ్యాంకింగ్ మొండిబకాయిల్లో (ఎన్పీఏ) ఈ 12 కంపెనీల వాటా దాదాపు 25 శాతం. ఈ అకౌంట్లకు సంబంధించి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించడానికి ఆర్బీఐ గత వారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఈ కేసుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 డిఫాల్టర్స్ ఎవరనేది అధికారికంగా పేర్లు వెల్లడించనప్పటికీ, వీటిలో ఎస్సాస్ స్టీల్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, జేపీ ఇన్ఫ్రా, ల్యాంకో ఇన్ఫ్రా, మోనెత్ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఆమ్టెక్ ఆటో, ఎరా ఇన్ఫ్రా ఉన్నట్టు సమాచారం. 12 డిఫాల్టర్లపై ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ కింద చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్బీఐ జాబితాను పంపింది. తాజా పరిణామాలు బ్యాంకింగ్ రుణ నాణ్యతకు దారితీయడమే కాకుండా, చిన్న మొండిబకాయిల సమ స్య పరిష్కారానికి కూడా వీలుకల్పిస్తాయని మూడీస్ వివరించారు. లాభదాయకతపై ఎఫెక్ట్... మొండిబకాయిలకు సంబంధించి అధిక నిధులు కేటాయించాల్సి న పరిస్థితి (ప్రొవిజనింగ్స్) ఉత్పన్నమయితే మాత్రం ఇది వచ్చే ఏడాదిలో బ్యాంకుల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ అంచనా వేసింది. అంతేకాకుండా బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం మరింత తాజా మూలధనం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొంది. 2019 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.95,000 కోట్ల తాజా మూలధనం అవసరమవుతుందని మూడీస్ అభిప్రాయపడింది. ఈ పరిమాణం ప్రభుత్వం కేటాయించిన రూ.20,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇంద్రధనస్సు ప్రణాళిక కింద 2015 నుంచీ నాలుగేళ్లలో బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల రుణ నాణ్యత గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోందని పేర్కొన్న మూడీస్, అయితే ఇటీవల త్రైమాసికాల్లో ఈ క్షీణత స్పీడ్ కొంత తగ్గిందని వివరించింది. 2016–17 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు రూ. 1 లక్ష కోట్ల పైగా పెరిగి రూ. 6.06 లక్షల కోట్లకు ఎగిశాయి. ‘డర్టీ డజన్’ షేర్లు డౌన్ న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియను ప్రారంభించడానికి ఆర్బీఐ రూపొందించిన జాబితాలో వున్నాయని భావిస్తున్న 12 కంపెనీల్లో కొన్ని షేర్లు సోమవారం 20 శాతం వరకూ క్రాష్ అయ్యాయి. పతనమైన షేర్లలో ఆమ్టెక్ ఆటో, భూషణ్ స్టీల్, ల్యాంకో ఇన్ఫ్రా, మోన్నెట్ ఇస్పాత్, ఆలోక్ ఇండస్ట్రీస్ వున్నాయి. ఆమ్టెక్ ఆటో 19.97 శాతం క్షీణించి రూ. 23.45 వద్ద ముగియగా, ల్యాంకో ఇన్ఫ్రా 20 శాతం పతనమై రూ. 1.90 వద్ద క్లోజయ్యింది. భూషణ్ స్టీల్ 16 శాతం తగ్గుదలతో రూ. 59 వద్ద ముగిసింది. మోన్నెట్ ఇస్పాత్ 12.37 శాతం క్షీణతతో రూ. 30.10 వద్ద, అలోక్ ఇండస్ట్రీస్ 11.61 శాతం తగ్గుదలతో 2.36 వద్ద ముగిసాయి. ఈ జాబితాలో పేరుందని భావిస్తున్న మరో కంపెనీ ఎలక్ట్రోస్టీల్ 4.94 శాతం నష్టపోయింది. ఎన్పీఏల ప్రగతిపై పీఎంఓ సమీక్ష న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్పీఏ)ల సమస్యపై ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. భారీ రుణ ఎగవేతదారులపై ఆర్బీఐ చర్యలకు దిగిన నేపథ్యంలో వీటికి సంబంధించిన ప్రగతిపై తాజా భేటీ జరగడం గమనార్హం. ప్రధాన మంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి పీకే మిశ్రా సమీక్ష నిర్వహించారని.... పెరిగిపోతున్న ఎన్పీఏలకు కళ్లెం వేసేందుకు పలు రకాల చర్యలపై ఈ సందర్భంగా చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్, తదితర వ్యవస్థల సన్నద్ధతపైనా చర్చ జరిగినట్టు పేర్కొన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు రూ.8 లక్షల కోట్లకు చేరగా, అందులో రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకులవే ఉన్నాయి. వీటి పరిష్కారంలో భాగంగా సుమారు రూ.2.5 లక్షల కోట్లు ఎగవేసిన 12 సంస్థలపై ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాలని ఆర్బీఐ అంతర్గత సలహా కమిటీ గత వారం బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే. ఐబీబీఐ ముందుకు ఇంకా రాలేదు... ఆర్బీఐ గుర్తించిన 12 కేసులు తమ ముందుకు రావాల్సి ఉందని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ (ఐబీబీఐ) చైర్మన్ ఎంఎస్ సాహూ తెలిపారు. బ్యాంకులు ముందుగా ఎన్సీఎల్టీ వద్ద కేసులు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఐబీసీని అమలు చేసే సంస్థే ఐబీబీఐ. ఎన్సీఎల్టీ మరిన్ని కేసులను డీల్ చేసేవిధంగా సామర్థ్యాన్ని పెంచాలని సాహూ అభిప్రాయపడ్డారు. 12 కేసుల్లో విచారణ కౌంటర్ సివిల్ వ్యాజ్యాల కారణంగా ఆలస్యమవుతుందని తాను భావించడం లేదన్నారు. -
క్విప్ ఇష్యూతో ఎస్బీఐకి లాభమే
మూడీస్ అంచనా న్యూఢిల్లీ: ఎస్బీఐ ఇటీవల అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు (క్విప్) ద్వారా రూ.15,000 కోట్లను సమీకరించడం బ్యాంకు పరపతికి సానుకూలమని అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థ మూడీస్ తెలిపింది. రుణాల వృద్ధికి ఈ నిధులు తోడ్పడతాయని వివరించింది. అంతేకాదు, ప్రభుత్వంపై ఆధారపడడాన్ని కూడా ఇది తగ్గిస్తుందని పేర్కొంది. ప్రభుత్వం నుంచి కూడా నిధుల సాయం అందితే బ్యాంకు మూలధనం మరింత బలోపేతం అవుతుందని నివేదికలో వెల్లడించింది. బాసెల్–3 నిబంధనల మేరకు మూలధన అవసరాలు 2018 మార్చి నాటికి 7.8 శాతం, 2019 మార్చి నాటికి 8.6 శాతం అవసరం కాగా, తాజా నిధుల సమీకరణ అందుకు సాయపడుతుందని నోమురా పేర్కొంది. -
మరోసారి కుప్పకూలిన ఆర్ కామ్
రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు మరో సారి కుప్పకూలాయి. రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, మూడీస్ మంగళవారం మళ్లీ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించడంతో బుధవారం కంపెనీ షేర్లకు భారీగా దెబ్బకొట్టింది. నేటి ట్రేడింగ్ లో 4 శాతం పైగా పడిపోయిన ఆర్ కామ్ షేర్లు, కనిష్టంగా రూ.19 వద్ద నమోదయ్యాయి. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో కంపెనీ రూ.948 కోట్ల నష్టాలను ప్రకటించిన దగ్గర్నుంచి ఆర్ కామ్ 24 శాతం మేర పడిపోయింది. అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు ఆర్ కామ్ కోలుకోలేని నష్టాలను ఎదుర్కొంటోంది. ముందటి ఆర్థిక సంవత్సరంలో 79 కోట్ల లాభాలను ఆర్ కామ్ నమోదుచేయగా.. ముగిసిన ఈ ఏడాదిలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. రుణభారం నుంచి గట్టెక్కడానికి బ్యాంకర్లు తమకు ఏడు నెలల సమయమిచ్చారని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ చెప్పడంతో, ఆర్ కామ్ షేర్లు సోమవారం ట్రేడింగ్ లో 4.6 శాతం మేర లాభపడ్డాయి. కానీ పెరుగుతున్న రుణాలపై మళ్లీ ఆందోళనలు రేకెత్తడంతో సోమవారం వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. మంగళవారం రోజు ఫిచ్, మూడీస్ లు మరోసారి కంపెనీ రేటింగ్ ను డౌన్ గ్రేడింగ్ చేశాయి. ఫిచ్ ఈ సంస్థను కనిష్ట కేటగిరిలోకి డౌన్ గ్రేడ్ చేయగా.. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు రెండో కనిష్ట కేటగిరీలోకి డౌన్ గ్రేడ్ చేసింది. కంపెనీ అవుట్ లుక్ నెగిటివ్ గా ఉందంటూ మూడీస్ తన ప్రకటనలో పేర్కొంది. వారం క్రితమే మూడీస్ ఆర్ కామ్ రేటింగ్ ను బీ2 నుంచి సీఏఏ1 కు తగ్గించింది. ఫిచ్, మూడీస్ మాత్రమే కాక, ఐక్రా, కేర్ లు కూడా కంపెనీ రేటింగ్స్ ను సవరించాయి. ఈ ఏడాది మార్చి 31 వరకు ఆర్ కామ్ నికర రుణం రూ.45వేల కోట్లకు పెరిగింది. -
ఇలాంటివి చాలా చూశాం!
‘ఎన్పీఏ’ తాజా నిబంధనలపై మూడీస్ వ్యాఖ్య వసూళ్లకు సుదీర్ఘ సమయం పట్టేస్తుందని వెల్లడి ముంబై: మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఉద్దేశించి తాజాగా ప్రతిపాదించిన చర్యల్లో కొత్తదనమేమీ లేదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వ్యాఖ్యానించింది. ఇవన్నీ కూడా గతంలో చూసినవేనని పేర్కొంది. మూలధనాన్ని సమీకరించుకోవడంలో బ్యాంకులకు ఎదురవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకోలేదని... ఫలితంగా మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తుందని మూడీస్ ఒక నివేదికలో తెలిపింది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన మూలధనం లేక వాస్తవ స్థాయిలో నికర నిరర్ధక ఆస్తులను (ఎన్పీఏ) రైటాఫ్ చేయలేక సతమతమవుతున్నాయి. కొత్త నిబంధనలు ఈ అంశంపై దృష్టి సారించలేదు. దీంతో ఎన్పీఏల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుంది‘ అని వివరించింది. అయితే, నిరర్ధక ఆస్తుల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు ఈ చర్యలు దోహదపడగలవని, రుణపరపతి పరంగా సానుకూలమైనవని పేర్కొంది. మొండి బాకీలను బ్యాంకులు తమంతట తాము రాబట్టుకోలేని పక్షంలో తగు చర్యల గురించి ఆదేశించేలా రిజర్వ్ బ్యాంక్‌కు అధికారాలు లభించేలా బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టాలను సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడీస్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు రూ. 6 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో 70 శాతం పైగా... అంటే రూ.4.2 లక్షల కోట్లవరకూ 40–50 పెద్ద ఖాతాల వద్దే ఇరుక్కుపోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన చర్యల ప్రకారం.. బ్యాంకులు వీటిపై దృష్టి సారించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిల్ లించ్ పేర్కొంది. -
మరికొంతకాలం ఎన్బీఎఫ్సీలపై ‘నోట్ల రద్దు’ ఎఫెక్ట్: మూడీస్
ముంబై: దేశంలో నోట్ల రద్దు ప్రభావం నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై మరికొంత కాలం కొనసాగుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ– మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ విశ్లేషకులు అల్కా అంబరసు పేర్కొన్నారు. ముఖ్యంగా వాహన విభాగం, ఆస్తుల తనఖా వంటి విభాగాల్లో వసూళ్లపై మరికొన్ని త్రైమాసికాలు ప్రతికూలత పడుతుందని విశ్లేషించారు. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేశారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా రిటైల్ రుణం విషయంలో తన వాటాను ఎన్బీఎఫ్సీ పెంచుకుంటోందని, ఇదే ధోరణి కొనసాగే వీలుందని నివేదికలో మూడీస్ వివరించింది. -
ద్రవ్య లోటు కట్టడికి.. రుణభారం అడ్డంకి: మూడీస్
న్యూఢిల్లీ: నిరంతరం కొనసాగుతున్న విధాన సంస్కరణలతో రుణభారం తగ్గుతుందన్న సానుకూల అంచనాల కారణంగానే భారత్‌కి పాజిటివ్ అవుట్‌లుక్ ఇచ్చినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. అయితే, భారీస్థాయిలో పెరిగిపోయిన ప్రభుత్వ రుణభారం కారణంగా ద్రవ్యలోటును తక్షణం తగ్గించుకోవడానికి అవకాశం లేదని పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే స్థూలదేశీయోత్పత్తి, ప్రభుత్వ రుణ భార నిష్పత్తి చాలా అధికంగా 68.6 శాతం స్థాయిలో ఉందని మూడీస్ పేర్కొంది. దీనికి తోడు మొత్తం వ్యయాల్లో జీతభత్యాల వాటా 50% మేర ఉండటం, ఇటీవలి వేతన సవరణ సిఫార్సుల అమలు తదితర అంశాల నేపథ్యంలో ద్రవ్య విధానాలపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మూడీస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతంగా ఉన్న ద్రవ్య లోటును ఈసారి 3.5 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. -
భారత్ వృద్ధిరేటుకు ఐఎంఎఫ్ కోత
7.6% నుంచి 6.6%కి తగ్గింపు • నోట్ల రద్దు్ద కారణమని విశ్లేషణ • ద్రవ్యలోటు కట్టుతప్పుతుందన్న మూడీస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా • క్యాడ్ పెరుగుతుందన్న నోముర వాషింగ్టన్, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, ఫిబ్రవరి 1 వార్షిక బడ్జెట్ నేపథ్యంలో భారత్ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాలపై అంచనాలు వెలువడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా వినియోగం తగ్గుతుందని, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015–16) వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతంగా ఉంది. ప్రపంచబ్యాంక్ కూడా వృద్ధి అంచనాను 7.6 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ఇక భారీ వృద్ధి, వ్యయాలు లక్ష్యంగా ఉండడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ద్రవ్యలోటు లక్ష్యం నుంచి కేంద్రం పక్కకు తప్పుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్, ఆర్థిక సేవల దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ అంచనా వేశాయి. నోట్ల రద్దు వల్ల కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరిగే అవకాశం ఉందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా అభిప్రాయపడుతోంది. వివరాలు.., ప్రపంచవృద్ధి 3.1 శాతం: ఐఎంఎఫ్ 2016లో పలు ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న తాత్కాలిక మందగమన ధోరణి 2017, 2018లో తిరిగి పుంజుకునే వీలుంది. 2016లో ప్రపంచ వృద్ధి 3.1 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2017,18 సంవత్సరాల్లో ఈ రేటు వరుసగా 3.4 శాతం, 3.6 శాతాలుగా ఉండొచ్చు. అయితే 2016కు సంబంధించి చైనా వృద్ధి రేటు అంచనాలను స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగే వీలుంది. అయితే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రం భారత్ కొనసాగుతుంది. 2018లో భారత్ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటే, చైనా వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుంది. వాణిజ్య అంశాలకు సంబంధించి రక్షణాత్మక విధానాలు కొంత ఒత్తిడులను సృష్టించే వీలుంది. ద్రవ్యలోటు 3.5 శాతం: బీఓఎఫ్ఏఎల్: కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు బాట తప్పే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే 3.5 శాతం (రూ.5.33 లక్షల కోట్లు) దాటకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే వచ్చే ఏడాది ఈ రేటు 3 శాతానికి తగ్గాలన్నది ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణా చట్టం చెబుతున్న విషయం. అయితే దీనికి భిన్నంగా ద్రవ్యలోటును రానున్న బడ్జెట్లో కూడా 3.5 శాతంగానే కొనసాగించే వీలుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనావేస్తోంది. మూడీస్దీ అదే మాట... ఇక మూడీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం 3.5 శాతం ద్రవ్యలక్ష్యాన్ని సాధించే వీలుందని మూడీస్ పేర్కొంది. అయితే మౌలిక రంగాల వ్యయం అధికమయ్యే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది ద్రవ్యలోటును3 శాతానికి కట్టడిచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తన తాజా నివేదికలో వివరించింది. క్యాడ్ 1.3 శాతం: నోముర: 2017 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్ అకౌంట్ లోటు 1.3 శాతంగా ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా అంచానా వేసింది. ఇదిలాఉండగా, భారత్ వినియోగదారులు పూర్తిస్థాయిలో ఆశావహ ధోరణితో ఉన్నట్లు మాస్టర్‌కార్డ్ ఇండెక్స్ ఆఫ్ కన్సూమర్ కాన్ఫెడెన్స్ (హెచ్2 2016)నివేదిక తెలిపింది. -
మూడీస్ తో భారత్ లాలూచీ..!
దేశ ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి గురించి రేటింగ్స్ ఇచ్చే దిగ్గజ సంస్ధ మూడీస్ పై విమర్శలు గుప్పించిన భారత్.. ఆ సంస్ధతో లాలూచీ పెట్టుకోవడానికి ప్రయత్నించిందా?. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక పురోభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అందుకు కారణం భారతీయ బ్యాంకులేనని పలుమార్లు మూడీస్ పేర్కొంది. మూడీస్ వ్యాఖ్యలపై స్పందించిన భారత్.. సంస్ధ రేటింగ్స్ ఇచ్చే విధానంలో ఉన్న తప్పుల కారణంగానే భారత్ ఆర్ధికంగా వృద్ధి చెందుతోందన్న విషయాన్ని మూడీస్ గుర్తించలేకపోతోందని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ లో మూడీస్ కు లేఖ రాసిన ఆర్ధికశాఖ క్రమంగా భారత్ లో క్రమంగా తగ్గుతున్న అప్పుల భారాన్ని సంస్ధ గుర్తించడం లేదని ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కానీ అందుకు విభిన్నంగా స్పందించిన మూడీస్.. ప్రఖ్యాత మీడియా సంస్ధ రూటర్స్ షోలో భారత్ కు భారీగా అప్పులున్నాయని, దేశ జాతీయ బ్యాంకులు సులువుగా స్ధిమితాన్ని కోల్పోతాయని మళ్లీ పేర్కొంది. దీంతో మూడీస్ రేటింగ్స్ పై భారత్ మరోసారి అసహనం వ్యక్తం చేసింది. భారతీయ బ్యాంకులు 136 బిలియన్ డాలర్ల లోన్లను ఇచ్చాయని అదే వారి కొంపముంచే అవకాశం ఉందని మూడీస్ చెప్పింది. అయితే, ఈ విషయంపై మూడీస్, భారత ఆర్ధికశాఖలు ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఓ రేటింగ్ సంస్ధకు భారత ఆర్ధిక శాఖ లేఖ రాయడంపై ఆర్ధిక శాఖ మాజీ అధికారి అరవింద్ మయారం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేటింగ్ సంస్ధలపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశమే లేదని చెప్పారు. అప్పుల బాధలు గత రెండేళ్లుగా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధికవ్యవస్ధల్లో భారత్ మొదటి స్ధానంలో ఉంది. అయితే, ఒక్కసారిగా పెరిగిన వృద్ధి రేటు ప్రభుత్వ రెవెన్యూను పెంచుకునేలా చేసింది. భారత్ వృద్ధి కదలికలను క్షుణ్ణంగా పరిశీలించిన మూడీస్ భారత్ కు బీఏఏ3 రేటింగ్ ను ఇచ్చింది. అప్పుల బాధలు పడే దేశాలకు ఇచ్చే రేటింగులలో బీఏఏ3 ఆఖరిది. తమ సంస్ధ ఇచ్చిన రేటింగ్ లపై చర్చించేందుకు ఆర్ధిక శాఖ కార్యాలయానికి వచ్చిన మూడీస్ ప్రతినిధితో ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తో సమావేశమయ్యారు. సమావేశం మొత్తం మూడీస్ రేటింగ్స్ గురించి ఇరువురు పెద్ద ఎత్తున చర్చించినట్లు సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి చెప్పారు. సమావేశం ముగిసిన అనంతరం భారత్ రేటింగ్స్ లో ముందుకు పోవడానికి మరికొద్ది సంవత్సరాలు పడుతుందని సదరు మూడీస్ ప్రతినిథి మీడియాతో పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏ ప్రాతిపదికన ఓ దేశానికి రేటింగ్స్ ఇస్తారో మూడీస్ భారత అధికారులకు వివరించింది. లాలూచీ అప్పుల బాధలు కలిగిన దేశంగా భారత్ కు రేటింగ్ ఇవ్వడంపై మరోసారి భారత్ మూడీస్ ప్రతినధికి ఈ మెయిల్ చేసింది. జపాన్, పోర్చుగల్ లాంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధ పరిమాణం కంటే రెండు, మూడు రెట్లు అధికంగా అప్పులు కలిగి ఉన్నా మంచి రేటింగ్స్ ఇవ్వడంపై ప్రశ్నించింది. 2004 తర్వాత భారత అప్పులు క్రమంగా తగ్గుతూ వస్తున్నా ఆ విషయం మాత్రం రేటింగ్స్ లో ఎందుకు కనిపించడంలేదని వాదించింది. భారత్ కు సంబంధించి మూడీస్ తన పద్దతిని మార్చుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన మూడీస్ భారత్ కేవలం అప్పులు కలిగివుండటం మాత్రమే కాకుండా, అప్పులు ఇచ్చే స్ధితిలో కూడా వెనుకబడి ఉందని సమాధానంగా పంపింది. మూడీస్ ఈ మెయిల్ కు స్పందనగా ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ మూడీస్ కు ఆరు పేజీల లేఖను రాశారు. భారత ఆర్ధిక వ్యవస్ధ గురించిన కొన్ని కీలక అంశాలను అందులో ప్రస్తావించారు. భారత్ కు మూడీస్ ఇస్తున్న రేటింగ్ లు ప్రస్తుత పరిస్ధితికి అద్దం పట్టేలా ఉండాలని కోరారు. -
ఆర్థిక వ్యవస్థకు దెబ్బ!
• వృద్ధి దిగజారుతుంది... వినియోగం తగ్గుతుంది • జీడీపీ మందగమనం దీర్ఘకాలంలో సానుకూలం • పన్ను ఆదాయాలు పెరుగుతారుు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు • రేటింగ్ ఏజెన్సీలు... మూడీస్, ఎస్అండ్పీ విశ్లేషణ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు చర్య స్వల్ప కాలంలో ఆర్థిక రంగ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుందని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. ఫలితంగా వృద్ధి రేటు బలహీన పడుతుందని స్పష్టం చేసింది. అరుుతే, దీర్ఘకాలంలో సానుకూలమని, పన్ను వసూళ్లు పెరుగుతాయని మూడిస్తోపాటు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స సంస్థలు వెల్లడించారుు. నగదు కొరత ‘‘మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో 86 శాతం కరెన్సీ వెనక్కి వెళ్లిపోతుంది. అదే సమయంలో పాత నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణలపై పరిమితుల వల్ల వ్యక్తులు, వ్యాపార సంస్థలకు కొన్ని నెలల పాటు నగదు కొరత ఏర్పడుతుంది. బయటకు వెల్లడించని నగదు రూపంలో వ్యక్తుల సంపదకు నష్టం కలుగుతుంది. తమ ఆదాయానికి మూలాలను తెలియజేయడం ఇష్టం లేని వారు నగదును బ్యాంకుల్లో డిపాజిట్లు చేయకపోవచ్చు. భారత్‌లో వినియోగం ఎక్కువగా నగదు లావాదేవీల రూపంలోనే ఉంది. నగదు లావాదేవీల నుంచి డిజిటల్ చెల్లింపులకు మళ్లడం అనేది నిదానంగా జరగాల్సి ఉంది’’ అని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకులపై రెండు రకాల ప్రభావం ‘‘నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థలో భాగమైన అన్ని రంగాలపై అధికంగానే ప్రభావం చూపిస్తుంది. బ్యాంకులు మాత్రం లబ్ధి పొందుతారుు. డిజిటల్ పేమెంట్లు పెరగడం వల్ల వాటికి మధ్యవర్తులుగా వ్యవహరించే బ్యాంకులకు లాభదాయకం. డిపాజిట్లు 1-2 శాతం పెరగడం వల్ల లెండింగ్ రేట్లు తగ్గుతారుు. ఇది కూడా బ్యాంకులకు సానుకూలమే. కానీ, రుణాలు తిరిగి చెల్లించడంపై స్వల్ప కాలంలో ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తులపై రుణాలు, వాణిజ్య వాహనాల రుణాలు, మైక్రోఫైనాన్స రుణాలపై ఈ ప్రభావం ఉంటుంది. దీంతో స్వల్ప కాలానికి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆస్తుల నాణ్యత దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే గణనీయమైన ప్రభావమే చూపుతుంది’’ అని మూడీస్ వివరించింది. కొన్ని త్రైమాసికాలపాటు... నోట్ల రద్దు ప్రభావం జీడీపీ వృద్ధి రేటుపై కొన్ని త్రైమాసికాల పాటు ఉంటుంది. ప్రభుత్వ చర్యల వల్ల స్వల్ప కాలంలో జీడీపీ వృద్ధి రేటు, ఆదాయాలపైనా ప్రభావం ఉంటుంది. వినియోగం తగ్గిపోరుు, జీడీపీ వృద్ధి రేటు మందగిస్తుంది. మధ్య, దీర్ఘకాలానికి చూసుకుంటే... బ్యాంకుల్లో రద్దరుున నోట్ల జమల ద్వారా ఆదాయ వెల్లడి కారణంగా పన్ను ఆదాయాలు పెరుగుతారుు. ప్రభుత్వ మూలధన వ్యయ కార్యక్రమానికి, ద్రవ్య స్థిరీకరణకు ఇది తోడ్పడుతుంది’’ అని మూడీస్ తన నివేదికలో విశ్లేషించింది. వ్యాపారాలకు కష్టం నోట్ల రద్దును అమలు చేయడం కూడా ఓ సవాలు. ఇది కూడా వృద్ధి రేటుపై ప్రభావితం చూపేదే. కార్పొరేట్ల విక్రయాలు, నగదు ప్రవాహం తగ్గడం వల్ల ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటారు. వీరిలో రిటైల్ విక్రయాల్లో ఉన్న వారిపై మరింత ప్రభావం పడుతుంది. మధ్య కాలానికి నగదు లభ్యత ఎంత త్వరగా అందివస్తుందన్న దాని ఆధారంగా కార్పొరేట్లపై పడే ప్రభావం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం డిజిటల్ చెల్లిం పులు పెంచే ఉద్దేశంతో బ్యాంకుల్లోకి వచ్చిన నగదు అంతే మొత్తం తిరిగి వ్యవస్థలోకి వెళ్లకుండా అడ్డుకుం టుంది. ఈ చర్యలతో భారత్‌లో వ్యాపార నిర్వహణ వాతావరణం మెరుగుపడుతుంది. కానీ, ఆర్థిక రంగంపై ప్రతికూలత మరికొంత కాలం పాటు కొనసాగుతుంది. బ్యాంకులకు సవాలు: ఎస్అండ్పీ నోట్ల రద్దు నిర్ణయం వల్ల భారత్‌లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత దెబ్బతింటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స తన నివేదికలో స్పష్టం చేసింది. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడం లాభదాయకమే అరుునా అవి దీర్ఘకాలం పాటు అలాగే నిలిచి ఉండవని పేర్కొంది. ‘‘నోట్ల రద్దు స్వల్ప కాలంలో అప్పులిచ్చే సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కార్పొరేట్ల ప్రొఫైల్ రుణ చరిత్ర బలహీన పడడం వల్ల బ్యాంకులు ఎదుర్కొనే సవాళ్లు పెరిగిపోతారుు. దేశీయంగా పారిశ్రామిక కార్యకలాపాల కుంగుబాటు, కమోడిటీల ధరలు తక్కువగా ఉండడం, ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వంటి చర్యల ఫలితంగా కంపెనీల పరపతి నాణ్యత గత కొన్నేళ్లలో బాగా దెబ్బతిన్నది. మెటల్ రంగంలో 34.4 శాతం, మౌలిక రంగంలో 17 శాతం రుణాలు ఒత్తిడిలో ఉన్నారుు. అరుునప్పటికీ భారత్‌లోని ఆర్థిక సంస్థలు తమ రేటింగ్‌ను నిలబెట్టుకుంటారుు. ఆర్థిక సవాళ్లు పెరిగినప్పటికీ బ్యాంకింగ్ రంగం గ్రూప్ 5లోనే ఉంటుంది. మార్చి నాటికి తలసరి జీడీపీ 1,703 డాలర్లుగా ఉంటుంది. నిర్వహణ పరంగా సమర్థవంతమైన బ్యాంకులు, అధిక లాభదాయకతను కలిగి ఉన్నవి డిజిటల్ బ్యాంకింగ్‌పై దృష్టి సారించడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకుంటారుు. నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా వృద్ధి రేటు తగ్గినా, దీర్ఘకాలానికి మంచి కలిగించే చర్యే. విధానాల రూపకల్పన మెరుగుపడడం వల్ల బలమైన ఆర్థిక, ద్రవ్య పనితీరుకు తోడ్పడుతుంది’’ అని ఎస్అండ్పీ తెలిపింది. -
6% పెరగనున్న పెట్రోలియం వినియోగం!
2017-18పై మూడీస్ అంచనా న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం వినియోగం వచ్చే ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్- 2018 మార్చి) 6 శాతం పెరుగుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. చైనాలో ఈ రేటు 3 శాతమే ఉంటుందని కూడా తన తాజా నివేదికలో పేర్కొంది. -
సంస్కరణలను పట్టించుకోకపోవడం సరికాదు
మూడీస్ రేటింగ్ విధానాన్ని తప్పుబట్టిన కేంద్రం న్యూఢిల్లీ: రేటింగ్ విషయంలో మూడీస్ అనుసరిస్తున్న పరిశోధనా పద్దతి తగిన విధంగా లేదని కేంద్ర ఆర్థికశాఖ గురువారం పేర్కొంది. కేంద్రం ప్రారంభించిన సంస్కరణలను మూడీస్ పట్టించుకోవడం లేదని, వాటి ఫలితాల కోసం వేచిచూడాల్సి ఉంటుందన్న ఆ సంస్థ అభిప్రాయం తగదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ గురువారం పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి స్వేచ్ఛగా ఒక అంచనాకు రేటింగ్ ఏజెన్సీలు రావచ్చని ఆయన అంటూనే... అయితే మూడీస్ రేటింగ్ పరిశోధనా విధానం సరికాదన్నదే తమ అభిప్రాయమని వివరించారు. దేశంలో సంస్కరణల అమలు తీరును సందేహించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని పేర్కొన్నారు. గత పలు సంవత్సరాలుగా ప్రత్యేకించి రెండేళ్లుగా సంస్కరణలు ఎటువంటి అడ్డంకులూ లేకుండా కొనసాగుతున్నాయని వివరించారు. ‘అలాంటి పరిస్థితుల్లో వీటికి వెయిటేజ్ ఇప్పుడు ఏమీ ఇవ్వబోమని మీరు (మూడీస్) చెప్పడం సరికాదు’ అని ఆయన అన్నారు. -
సంస్కరణలు చూడండి... రేటింగ్ పెంచండి..!
మూడీస్‌కు ఆర్థిక (శాఖ) వివరాలు న్యూఢిల్లీ: భారత్‌లో వివిధ సంస్కరణలు చేపట్టడం జరిగిందనీ, దేశాన్ని వ్యాపార సానుకూలంగా మార్చుతున్నామని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్‌కు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. తద్వారా రేటింగ్ పెంచడానికి తగిన అన్ని అవకాశాలూ ఉన్నాయని వివరించింది. అయితే బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల పరిస్థితిపై అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మూడీస్ పేర్కొంది. రేటింగ్ పెంపునకు సంబంధించి ఆర్థికశాఖ సీనియర్ అధికారులు, మూడీస్ ప్రతినిధుల మధ్య బుధవారం కీలక సంప్రతింపులు జరిగాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్, ఆ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ పాజిటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది -
సంస్కరణలు బాగుంటే రేటింగ్ అప్‌గ్రేడ్
మూడీస్ సంకేతాలు... • ఒకటి రెండేళ్లలో నిర్ణయం ఉంటుందని వెల్లడి • ప్రైవేటు పెట్టుబడులు మందగమనం, • ఎన్పీఏలు స్పీడ్ బ్రేకర్లన్న అభిప్రాయం • నేడు ఆర్థిక శాఖ అధికారులతో భేటీ న్యూఢిల్లీ: సంస్కరణలు తగిన విధంగా అమలు జరుగుతున్నాయని భావిస్తే- ఒకటి, రెండు సంవత్సరాల్లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ పెంచుతుందని ఆ సంస్థ సావరిన్ గ్రూప్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ మారియో డిరాన్ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడుల్లో మందగమనం, బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య, సంస్కరణల నెమ్మది ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ స్పీడ్ బ్రేకరని వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ పాజిటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది. ‘అధమ’ స్థాయికి ఇది ఒక అంచె ఎక్కువ. భారత్ రేటింగ్‌కు సంబంధించి సెప్టెంబర్ 21న మూడీస్ ప్రతినిధులు, ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నత స్థాయి అధికారుల మధ్య సమావేశం వార్తల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఆర్థిక వ్యవస్థపై మూడీస్-ఇక్రా సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా మారియో ఇంకా ఏం చెప్పారంటే.. ⇒ ద్రవ్యలోటు, స్థిరత్వం దిశలో వేగవంతమైన చర్యలు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే రుణ నిష్పత్తి తగ్గింపు, మౌలిక రంగం పురోగతికి చర్యలు, రుతుపవన ఒడిదుడుకుల సవాళ్ల తుది ఫలితానికి లోబడి రేటింగ్ అప్‌గ్రేడ్ ఉంటుంది. అంతా సానుకూలంగా ఉంటే, 12 నుంచి 18 కాలంలో రేటింగ్ పెంపు అవకాశం ఉంది. ⇒ సంస్కరణల అమలు తీరు బాగుందనే భావిస్తున్నాం. అయితే ప్రైవేటు పెట్టుబడులు బలహీనతే సమస్యగా ఉంది. ⇒ పెండింగ్ సంస్కరణల్లో ముఖ్యంగా ఆరున్నాయి. భూ సమీకరణ బిల్లు, కార్మిక చట్టాల సంస్కరణ, మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి ప్రయోజనాలు తగిన విధంగా అమలు, పన్ను వ్యవస్థ అలాగే ప్రభుత్వ బ్యాంకింగ్‌లో సంస్కరణలు ఈ ఎజెండాలో కీలకమైనవి. ⇒ ఎన్పీఏలు, ప్రైవేటు పెట్టుబడుల్లో మందగమనానికి తోడు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, దేశంలో పలు సంస్కరణల్లో ఏకాభిప్రాయ సాధన ప్రతికూలాంశాల్లో ఉన్నాయి. ⇒ ఇన్వెస్టర్, కార్పొరేట్ స్థాయిల్లో విశ్వాసం మరింత బలపడాలి. తద్వారా వ్యాపార వాతావరణం మెరుగుపడాలి. ⇒ జీఎస్టీ బిల్లు పార్లమెంటులో ఆమోదం, దివాలా కోడ్, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం కట్టడి దిశలో ద్రవ్య, పరపతి విధాన చర్యలు క్రెడిట్ పాజిటివ్ కోణంలో కీలకాంశాలు. విధానపరమైన అంశాల్లో పారదర్శకత, విశ్వసనీయత, అవినీతి నిరోధానికి చర్యలు ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాగత పటిష్టతకు దోహదపడుతున్న చర్యల్లో కొన్ని. భారత్ బ్యాంకింగ్ బెటర్: బీఐఎస్ బ్యాంకింగ్ సవాళ్లకు సంబంధించి చైనాకన్నా భారత్ పరిస్థితులు బాగున్నాయని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. ఆయా అంశాలకు సంబంధించి ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చినా భారత్ పరిస్థితి బాగుందని పేర్కొంది. 40 ఆర్థిక వ్యవస్థల డేటాను పరిశీలించి బీఐఎల్ రూపొందించిన డేటా ప్రకారం- 2016 మొదటి త్రైమాసికంలో భారత్ క్రెడిట్-జీడీపీ నిష్పత్తి మిగిలిన దేశాలతో పోల్చితే తక్కువగా - 2.9 శాతంగా ఉంది. బ్రిక్ దేశాలలో ఇదే బెటర్. 2015 చివరి త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఇది 3 శాతం. చైనా విషయంలో ఈ రేటు భారీగా 28.4 శాతం నుంచి 30.1 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే విషయంగా వివరించింది. బ్రెజిల్-రష్యాల విషయంలో వరుసగా ఈ రేటు 4.6 శాతం, 3.7 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఎఫ్‌పీఐల పన్ను ఆందోళనలను పరిశీలిస్తాం: ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) పన్నుల విషయంలో లేవనెత్తిన కొన్ని ఆందోళలను పరిష్కరించడంపై దృష్టిపెడతామని ఆర్థిక శాఖ హామీనిచ్చింది. అదేవిధంగా భారత్‌లోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా సంస్థలు ఇచ్చిన సూచనలను కూడా పరిశీలిస్తామని పేర్కొంది. సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి దిగ్గజాలతో సహా మొత్తం 35 ఎఫ్‌పీఐలకు చెందిన ప్రతినిధులు మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో దాదాపు మూడు గంటల పాటు సమావేశంలో పాల్గొన్నారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ మూలాలు, ప్రస్తుత పటిష్టస్థాయిపై ఎఫ్‌పీఐల్లో ఎలాంటి సందేహాలు లేవు. మన మార్కెట్లో మరిన్ని అవకాశాల కోసం ఈ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. భవిష్యత్తు అత్యంత ఆశావహంగా కనిపిస్తోంది’ అని భేటీ తర్వాత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వ్యాపారాలకు అత్యంత సానుకూల దేశంగా భారత్‌ను నిలబెట్టడమే ఈ చర్యల ప్రధానోద్దేశమని ఆయన వివరించారు. -
అన్నీ మంచి ఆర్థిక శకునములే..!
భారత్‌పై అంతర్జాతీయ క్రెడిట్, ఫైనాన్షియల్ దిగ్గజ సంస్థల అంచనాలు న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై భరోసాను కల్పించే అంచనాలను అంతర్జాతీయ క్రెడిట్, ఫైనాన్షియల్ దిగ్గజ సంస్థలు వెలువరించాయి. వచ్చే కొద్ది సంవత్సరాలూ 8 శాతం వృద్ధి రేటు ఖాయమని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ తన ‘ఏపీఏసీ ఎకనమిక్ స్నాప్సార్ట్స్-సెప్టెంబర్ 2016’ నివేదికలో పేర్కొంది. ఇక బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గుతున్నట్లు మూడీస్ అభిప్రాయపడింది. ఆర్థిక సేవల ప్రపంచ దిగ్గజ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తన తాజా నివేదికలో భారత్ క్రమ వృద్ధి బాటలో ఉందని వివరించింది. ఆయా సంస్థల అభిప్రాయాలు క్లుప్తంగా... సంస్కరణల అమలు బలం: ఎస్ అండ్ పీ భారత్‌కు పటిష్ట దేశీయ వినియోగం పెద్ద బలం. రానున్న కొద్ది సంవత్సరాలు 8% వృద్ధి సాధిస్తుందని అంచనావేస్తున్నాం. ముఖ్యంగా భారత్ చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణలు కూడా వృద్ధి పథానికి బలం చేకూర్చుతున్నాయి. ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఇక్కడ కీలకమైనది. ఇక ద్రవ్యోల్బణంపై ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ధరల ఒడిదుడుకులు ఉండే ఇతర వస్తువుల విషయంలో ఆర్బీఐ అప్రమత్తత అవసరం. కాగా, 2016-17కు సంబంధించి ఆర్బీఐ వృద్ధి రేటు అంచనా 7.6%. క్రమ వృద్ధి: మోర్గాన్ స్టాన్లీ భారత్‌సహా పలు వర్థమాన దేశాల్లో క్రమ వృద్ధి నమోదవుతుంది. ఈ ఏడాది వర్థమాన దేశాల వృద్ధి రేటు 4 % కాగా వచ్చే ఏడాది ఆయా దేశాల వృద్ధి రేటు 4.7%గా ఉంటుందని భావిస్తున్నాం. వృద్ధి విషయంలో ప్రస్తుత స్థాయిల నుంచి భారత్, ఇండోనేషియాలు మరింత పురోగతి సాధించవచ్చు. అయితే చైనా, కొరియాల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. బ్యాంకింగ్ బెటర్: మూడీస్ బ్యాంకింగ్ మొండిబకాయిల తీవ్రత తగ్గుతోంది. వచ్చే 12 నెలల నుంచి 18 నెలల మధ్య బ్యాంకింగ్ అవుట్‌లుక్ స్థిరపడవచ్చు. ఇటీవలి రుణ నాణ్యత గుర్తింపు (ఏక్యూఆర్), తగిన ప్రొవిజనింగ్ కేటాయింపులు కీలకమైనవి. 11 బ్యాంకుల అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉంది. మున్ముందు నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం)లు స్థిరపడే వీలుంది. అయితే రానున్న మూడేళ్లలో భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం అవసరం ఉంటుంది. రేటింగ్ (ప్రస్తుతం చెత్త శ్రేణికి ఒక అంచె ఎగువన ‘బీఏఏ3’) పెంపునకు సంబంధించి సెప్టెంబర్ 21న మూడీస్ ప్రతినిధులు, ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నత స్థాయి అధికారుల మధ్య సమావేశం వార్తల నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. -
జీఎంఆర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ రేటింగ్‌లో కోత
దీనికిచ్చే రుణాలకు రిస్కుంది: మూడీస్ న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్... మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ కన్సార్షియం సారథ్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (డీఐఏఎల్) క్రెడిట్ రేటింగ్‌ను తగ్గిస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిధుల లభ్యత విషయంలో ఆందోళనకర పరిస్థితుల కారణంగా .. రేటింగ్‌ను ‘బీఏ2’ నుంచి ‘బీఏ1’కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. రుణాలకు సంబంధించి గణనీయమైన రిస్కు ఉన్నట్టుగా ‘బీఏ’ సూచిస్తుంది. ‘‘ఈ కంపెనీకి నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోగలిగే సామర్థ్యం తగ్గింది. ఈ సామర్థ్యానికి సంబంధించి ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతోందనేది తాజా డౌన్‌గ్రేడ్ సూచిస్తుంది’’ అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ త్యాగి తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) ఇటీవల ఇచ్చిన టారిఫ్ ఆర్డరు కారణంగా 2018 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక ఏరోనాటికల్ ఆదాయాలు సుమారు రూ. 2,000 కోట్ల మేర (దాదాపు 70 శాతం) తగ్గవచ్చని మూడీస్ పేర్కొంది. ఇది కంపెనీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అభిప్రాయపడింది. ఇక రాబోయే 3-5 ఏళ్లలో ప్రతిపాదిత విస్తరణ ప్రణాళికలతో ఆర్థికపర మైన ఒత్తిడి మరింతగా పెరగవచ్చని తెలిపింది. ఇలా విస్తరణ ప్రణాళికలు, నియంత్రణ వ్యవస్థపరమైన అనిశ్చితి తదితర అంశాల మూలంగా సమీప భవిష్యత్‌లో రేటింగ్ పెరిగే అవకాశాలు లేవని పేర్కొంది.. ప్రస్తుతానికి తగిన ంత లిక్విడిటీ ఉన్నందున స్థిరమైన అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు మూడీస్ వివరించింది. జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ), జర్మనీకి చెందిన ఫ్రాపోర్ట్ కలిసి డీఐఏఎల్ను జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. -
బలంగా భారత వృద్ధి అవకాశాలు
♦ వచ్చే రెండేళ్లపాటు వృద్ధి 7.5% ♦ భారత్ సౌర్వభౌమ రేటింగ్ బీఏఏ3గా కొనసాగింపు న్యూఢిల్లీ: సంస్కరణల కొనసాగింపుతో భారత వృద్ధి అవకాశాలు స్వల్పకాలానికి బలంగానే ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. కానీ, కొండలా పేరుకుపోతున్న మొండి బకాయిలే సమస్యాత్మకమని పేర్కొంది. వచ్చే రెండేళ్లపాటు వృద్ధి రేటు 7.5% స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 గానే కొనసాగించింది. ఈ రేటు అధిక స్థాయిలో ఉంటే రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని అర్థం. దీంతో ఆ దేశం పెట్టుబడులకు అనుకూలమనే సందేశం వెళుతుంది. రుణాల ఎగవేతను అరికట్టేందుకు దివాళా చట్టాన్ని తీసుకురావడం, జీఎస్టీ అమలు చివరి దశలో ఉండడం సానుకూలాంశాలుగా మూడీస్ తెలిపింది. బ్యాంకులు మొండి బకాయిలను గుర్తిస్తూ ఉండడంతో నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) ఇక ముందూ పెరుగుతాయని, ఈ పరిస్థితులు ముఖ్యం గా ప్రభుత్వ రంగ బ్యాంకులకు మందగమనంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.70వేల కోట్ల మూల దనం కంటే అధికంగానే నిధులు అవసరం అవుతాయని తాము అంచనా వేస్తున్నట్లు మూడీస్ తన నివేదికలో వెల్లడించింది. నివేదికలోని అంశాలు... ⇒ సంస్కరణలను కొనసాగించడం వల్ల వ్యాపార వాతావరణం మెరుగవుతుంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయిలో కొనసాగడం వల్ల భారత్ బలమైన వృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది. కానీ, బ్యాంకింగ్ రంగంలో సవాళ్లు పెరగడం భారత పరపతి నాణ్యతపై ప్రభావం చూపుతాయి. వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక, సంస్థాగత సంస్కరణల దిశగా విధాన నిర్ణేతల చర్యలు సత్ఫలితాలు ఇస్తే రేటింగ్ అప్‌గ్రేడ్ చేస్తాం. ⇒ బ్యాంకింగ్ రంగానికి మొండి బకాయిల సమస్య ఏర్పడడానికి వృద్ధి మందగించడం, ప్రాజెక్టుల అమలు నిదానించడం, ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేయడమే కారణాలు. గత 12 నెలల్లో 39 లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 96% పెరిగి 2015 జూన్ నుంచి 2016 జూన్ నాటికి రూ.6.3 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ⇒ మొండి బకాయిల గుర్తింపు, దివాళా చట్టంపై దృష్టి పెట్టడం భారత సార్వభౌమ రుణ అర్హతను పెంచుతుంది. -
రాజన్ పాలసీల అనుకరణే ఉత్తమం
ద్రవ్యోల్బణం కట్టడి అంశంపై మూడీస్ సూచన న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణ అదుపుదలకు రఘురామ్ రాజన్ పాటించిన పాలసీలను అనుకరించటం ఉత్తమమని మూడీస్ తెలిపింది. రాజన్ అవలంభించిన కఠిన ద్రవ్య విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొంది. అందుకే ఆర్బీఐ రాజన్ పాలసీలను అనుసరిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఆర్బీఐ ద్రవ్య విధానాలు దేశ సావరిన్ రేటింగ్‌ను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ప్రస్తుతం మూడీస్ భారత్‌కు పాజిటివ్ ఔట్‌లుక్‌తో కూడిన ‘బీఏఏ3’ రేటింగ్‌ను ఇచ్చింది. దేశంలో గడచిన రెండేళ్లలో ద్రవ్యోల్బణం పరిమిత స్థాయిలకి పడింద ని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణ అంచనాలకు అనుగుణంగా ఆర్బీఐ పాటించిన ద్రవ్య విధానాలే ఇందుకు కారణమని వివరించింది. నిర్దేశిత ద్రవ్యోల్బణ లక్ష్యాలను చేరుకోవాలంటే ఇది వరక టి పాలసీల అనుసరణే సరైన మార్గమని పేర్కొంది. ‘అధిక వడ్డీ రేట్లు కొనసాగిస్తున్నారు.. వృద్ధికి అడ్డుపడుతున్నారు.. వంటి పలు విమర్శలు రాజన్‌ను చుట్టుముట్టాయి. వీటిని ఆయన కనిష్ట స్థాయి ద్రవ్యోల్బణంతో సమర్థంగా ఎదుర్కొన్నారు’ అని వివరించింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ ఆధారిత ద్రవ్య విధానమే ఉత్తమమని పేర్కొంది. కాగా అక్టోబర్ 4న జరగనున్న రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధాన పాలసీలో ఆర్బీఐ గవర్నర్‌కు బదులు మానిటరీ పాలసీ కమిటీ కీలక వడ్డీ రేట్లను నిర్ణయించనున్నది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. ముగ్గురు ఆర్బీఐకి చెందిన వారుంటే (గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్), మిగతా వారిని కేంద్రం నియమిస్తుంది. -
ఆర్బీఐ రాజన్ పాలసీలనే కొనసాగించాలి: మూడీస్
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం కట్టడికి గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న పాలసీలనే, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొనసాగించాలని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సూచించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకురావడానికి రాజన్ తీసుకున్న కఠినతరమైన విధానాలు సత్ఫలితాలను చూపించాయని వెల్లడించింది. అదే మాదిరి విధానాలను రాజన్ పదవీ విరమణ అనంతరం కూడా ఆర్బీఐ కొనసాగిస్తే మంచిదని తెలిపింది. విశ్వసనీయత, ద్రవ్య విధాన పాలసీ అంశాలు భారత సార్వభౌమ రేటింగ్స్‌పై ప్రభావితం చూపుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సావరీన్ రిస్క్ గ్రూపు మేరి డిరోన్ తెలిపారు. పాజిటివ్ అవుట్‌లుక్‌తో భారత్‌కు బీఏఏ3 రేటింగ్ ఇచ్చింది. గత రెండేళ్లుగా భారత ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, విశ్వసనీయతమైన ద్రవ్య విధానం వల్లనే ఇది సాధ్యమైందని డిరోన్ కొనియాడారు. ఇవే పాలసీలను రాజన్ తదనాంతరం ఆర్బీఐ కొనసాగిస్తుందని నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ టార్గెట్‌ను సాధిస్తుందని డిరోన్ భావిస్తున్నారు. కాగా ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేయబోతున్నారు. వడ్డీరేట్లు అధికంగా ఉంచి, ఆర్థికవృద్ధికి ఆటంకంగా మారారని ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్నారు. 2021 వరకు ద్రవ్యోల్బణం టార్గెట్ 4 శాతంగా ప్లస్ లేదా మైనస్ 2 శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించి నమోదుచేయమని, 4 శాతాన్ని ద్రవ్బోల్బణ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తన ప్రసంగంలో వెల్లడించారు. -
ద్రవ్యోల్బణం లక్ష్యాలు భారత్‌కు సానుకూలం
రేటింగ్ కోణంలో మూడీస్ అంచనా న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్లూ ‘ప్లస్ 2 అండ్ మైనస్ 2తో’ నాలుగు శాతంగా ఉండాలన్న కేంద్రం లక్ష్యం భారత్‌కు క్రెడిట్ పాజిటివ్ అంశమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డారీ డిరోన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే గరిష్ట పరిమితి 6 కాగా, తగ్గితే కనిష్ట పరిమితి 2 శాతంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల నిర్ధేశించిన సంగతి తెలిసిందే. డిపాజిట్లపై ఇటీవల తగ్గించిన వడ్డీరేట్లు, వాస్తవ రిటర్న్స్ వంటి అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సంవత్సరం ఆరంభంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడానికి ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య అవగాహన కుదరటం తెలిసిందే. -
భారత వృద్ధికి ఎన్నో సవాళ్లు: మూడీస్
♦ అధిక స్థాయిలో కార్పొరేట్ రుణాలు ♦ మొండిబకాయిల పెరుగుదలతో రుణాల లభ్యతపై ప్రభావం ♦ దీర్ఘకాలంలో భారత్ మెరుగ్గా రాణించే అవకాశముందని వెల్లడి న్యూఢిల్లీ: రానున్న సంవత్సరాల్లో భారత వృద్ధి రేటుకు ఎన్నో సవాళ్లు పొంచి ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. రాజకీయ వైరంతో సంస్కరణలకు అడ్డుపడే ధోరణితో కీలక బిల్లులు నిలిచిపోవడాన్ని అసాధారణ స్థితిగా పేర్కొంది. అంతర్జాతీయంగా గిరాకీ మందగించడం, కార్పొరేట్ రుణాలు అధిక స్థాయిలో ఉండడం, రుణాల లభ్యత తగ్గడం వృద్ధి రేటుకు సవాళ్లుగా పేర్కొంది. ఇవే రానున్న కొన్ని త్రైమాసికాలపాటు పెట్టుబడులకు విఘాతం కలిగిస్తాయని తెలిపింది. అంతేకాదు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ దేశీయంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు 2016లో మార్కెట్ సెంటిమెంట్‌ను ఒత్తిడికి గురిచేయవచ్చంటూ ‘ఇన్సైడ్ ఇండియా’ నివేదికలో మూడీస్ పేర్కొంది. అయితే, నిర్దేశించుకున్న సంస్కరణలను క్రమంగా అమలు చేయడం, వ్యాపార పరిస్థితులు మెరుగుపడడం, మౌలిక వసతులు, ఉత్పాదకత పెరుగుదల వల్ల మధ్యకాలానికి భారత్ రాణిస్తుందని భావిస్తున్నట్టు మూడీస్ తెలిపింది. ‘పలు కార్పొరేట్ సంస్థలు అధిక స్థాయిలో తీసు కున్న రుణాల ప్రభావం వృద్ధిరేటుపై గణనీయంగా ఉంటుంది. రుణాల గిరాకీపై కూడా ప్రభావం చూపుతుంది. బ్యాంకింగ్ రంగంలో నిరర్ధక ఆస్తులు రుణాల లభ్యతకు విఘాతం. దిగువ స్థాయిలో నామమాత్రపు వృద్ధిరేటు కొనసాగడం ప్రభుత్వ రాబడులను ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి సంస్కరణలు చేపట్టేందుకు... ఇంటా, బయట ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రభుత్వం ముందున్న అవకాశాలు పరిమితం. రానున్న రెండు సంవత్సరాల్లో భారత జీడీపీ 7.5 శాతం వృద్ధి చెందుతున్న మా అంచనాలను ఈ పరిణామాలు ప్రభావితం చేస్తాయి’ అని మూడీస్ పేర్కొంది. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకోవడం వల్ల భారత్‌పై ప్రభావం నామమాత్రమేనని, భారత్ నుంచి ఈయూకు దిగుమతులు కేవలం 0.4 శాతంగానే ఉన్నాయని, ఇవి జీడీపీలో 1.7 శాతమని వివరించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను భారీగా పెంచడం వల్ల ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదని అభిప్రాయపడింది. -
బ్యాంకుల ఏకీకరణతోసమస్యలు: మూడీస్
♦ సొంతంగా ఆర్థిక బలం లేదు ♦ దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభావం ♦ ప్రభుత్వ సహకారంతోనే విలీనం సాధ్యం న్యూఢిల్లీ: ప్రస్తుత బలహీన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను ఏకీకరణ ద్వారా కుదించాలన్న ప్రయత్నాలు పలు సమస్యలకు దారి తీయనున్నట్టు రేటింగ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. ఫలితంగా దీర్ఘకాలిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. 2012 నుంచి భారతీయ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని... ఆస్తుల నాణ్యత పరంగా చూస్తే చాలా వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) బ్యాలన్స్ షీట్ల క్షీణత సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. దీంతో సొంత ఆర్థిక వనరుల పరంగా చూస్తే ఏ బ్యాంకుకీ విలీన ప్రక్రియ చేపట్టేంత ఆర్థిక సామర్థ్యం లేదని పేర్కొంది. ఈ మేరకు మూడీస్ ‘భారత్‌లో బ్యాంకులు: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకరణతో సవాళ్లు’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ప్రభుత్వ సహకారంతోనే..: ప్రస్తుతం ఉన్న 27 పీఎస్‌బీలను విలీనాల ద్వారా 8 నుంచి 10కి కుదించాలన్నది ప్రభుత్వ ధ్యేయంగా మూడీస్ తెలిపింది. ప్రభుత్వం నుంచి గణనీయ స్థాయిలో సహకారం లభించకుంటే ఏకీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందకుండా పోతాయని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ విశ్లేషకుడు అల్కా అన్బరసు పేర్కొన్నారు. ‘క్రెడిట్ పరంగా చూస్తే ఏకీకరణ ప్రక్రియ బ్యాంకుల కొనుగోలు శక్తిని పటిష్ట పరుస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఈ రంగంలో పర్యవేక్షణ, కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగుపడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలకు ఏకీకరణ వల్ల ఎదురయ్యే సవాళ్లు విఘాతంగా మారతాయని విశ్లేషించింది. ‘ఇప్పటికే మొండి బకాయిల కారణంగా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు బుక్ విలువ కంటే తక్కువకు ట్రేడ్ అవుతున్నాయి. దీంతో విలీనాలకు అవసరమైన అదనపు నిధుల సాయాన్ని పొందే అవకాశాలను పరిమితం చేస్తుంది’ అని మూడీస్ వెల్లడించింది. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మూలధన నిధుల రూపంలో సహకారం అవసరం అవుతుందని అభిప్రాయపడింది. ఉద్యోగుల వైపు నుంచి సమస్యలు బ్యాంకుల ఉద్యోగుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకానుండడం కూడా ఏకీకరణకు ప్రధాన సవాలుగా పేర్కొంది. దీనివల్ల ఏకీకరణ ప్రయత్నాలకు విఘాతం కలిగుతుందని... ఒకవేళ విలీనం చేసినా వేతనాల మధ్య తేడాలను పూడ్చేందుకు, ఇతర ప్రయోజనాల రూపంలో ఖర్చులు పెరిగిపోతాయని తెలిపింది. -
భారత్ రేటింగ్‌కు సానుకూల చర్య
♦ ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణపై మూడీస్ ♦ ఉత్పాదకత, వృద్ధి జోరు పెరుగుతాయ్ న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించడం సార్వభౌమ రేటింగ్‌కు సానుకూల చర్య అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది. ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించడం సంస్కరణల జోరును కొనసాగించడాన్ని సూచిస్తోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. గత వారం ప్రభుత్వం పౌర విమానయానం, రిటైల్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్... తదితర 9 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రస్తుత ప్రభుత్వం సరళీకరించడం ఇది రెండోసారి. ఎఫ్‌డీఐల సరళీకరణ ఉత్పాదకత జోరును పెంచుతుందని, రానున్న 3-5 ఏళ్లలో ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తుందంటున్న ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ⇒ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు మందగించిన తరుణంలో భారత్ విదేశీ రుణ అవసరాలను తీర్చడానికి ఈ ఎఫ్‌డీఐలు తోడ్పడుతాయి. అధిక ఎఫ్‌డీఐలు భారత్ విదేశీ ఆర్థిక అవసరాలను కొంత మేర తగ్గిస్తాయి. ⇒ అయితే ఒక్క అధిక ఎఫ్‌డీఐల వల్లనే అధిక వృద్ధి, ఉత్పాదకత సాధ్యం కాదు. ⇒ భారత్ మొత్తం ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎఫ్‌డీఐల ప్రస్తుత వాటా 10 శాతం కంటే తక్కువగానే ఉంది. దేశీయ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదు. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం భారత్ పెట్టుబడుల్లో వృద్ధి 3.9 శాతం మాత్రమే. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డ్ స్థాయిలో, 3,600 కోట్ల డాలర్లు వచ్చాయి. అంతక్రితం మూడేళ్లలో సగటున 2,420 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలే వచ్చాయి. -
భారత్ రేటింగ్‌పై ఎన్పీఏల ప్రభావం: మూడీస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య భారత్ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ పేర్కొంది. మొండి బకాయిల సమస్య పరిష్కారంలో ప్రభుత్వం నుంచి తగిన చొరవలు అవసరమని అభిప్రాయపడింది. మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ కష్టమవుతున్న తరుణంలో బడ్జెట్ కేటాయింపులకన్నా అధికంగా... భారీ మూలధన కల్పన విషయంలో ప్రభుత్వం నుంచే తగిన చర్యలు అవసరమని అభిప్రాయపడింది. వచ్చే నాలుగేళ్లలో బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2015 ఏప్రిల్‌లో మూడీస్ భారత్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే రేటింగ్‌ను ‘బీఏఏ3’గానే ఉంచింది. ‘చెత్త’స్థాయికి ఇది ఒక మెట్టు అధికం. -
బ్యాంకింగ్ కు మరింత మూలధనం సమకూర్చాలి
ప్రభుత్వానికి మూడీస్ సూచన న్యూఢిల్లీ: మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నందున, కేంద్రమే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) తగిన మూలధనం సమకూర్చాలని రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్) అల్కా అంబరసు పేర్కొన్నారు. మూలధనం సమకూర్చే విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకోకపోతే- బ్యాంకింగ్ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. ఆయన అభిప్రాయాల్లో మరికొన్నింటిని చూస్తే... బకాయిలు రాబట్టుకోవడంలో బ్యాంకింగ్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బ్యాలెన్స్ షీట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. డిసెంబర్ నాటికి మొండిబకాయిల పరిణామం రూ.3.7 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా అసెట్ క్వాలిటీ సమీక్షలు, తగిన ప్రొవిజనింగ్ కేటాయింపులు బ్యాంకింగ్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. -
'మేకిన్ ఇండియా' గ్రాండ్ సక్సెస్: మూడీస్
ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా' గ్రాండ్ సక్సెస్ అయ్యిందట. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వెల్లువెత్తుతున్నాయట. భారతదేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం 2016లో గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. 2004 నుంచి పోలిస్తే ఈ ఏడాది కరెంట్ అకౌంట్ లోటు కంటే ఎఫ్‌డీఐ ప్రవాహాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీనివల్ల భారత్ మళ్లీ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని మూడీస్ తెలిపింది. వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సరళీకరణ విధానాలు, మేకిన్ ఇండియా విజయవంతం కావడం లాంటివి ఎక్కువ నిధుల ప్రవాహానికి తోడ్పడాయని మూడీస్ పేర్కొంది. 2016 జనవరిలో నికర విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని, 12 నెలల కాలంలో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఇప్పటివరకు వచ్చాయని చెప్పింది. కరెంట్ ఖాతా లోటును విదేశీ పెట్టుబడులు పూరిస్తున్నాయని మూడీస్ తెలిపింది. -
ప్రతికూల రుతుపవనాలెదురైతే ప్రమాదమే
న్యూఢిల్లీ : మంగళవారం ఆర్బీయై ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వడ్డీరేట్లను పావుశాతం తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న నిర్ణయంతో ప్రతికూల రుతుపవనాల కాలంలో ధరల పెరుగుదలకు దారితీస్తుందని మూడీ హెచ్చరిస్తోంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వినియోగదారుల ధరల సూచీ 5 శాతం లోపు ఉండటం ఈ రేట్ల తగ్గింపుకు దారితీసిందని రాజన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ మోస్తరు వృద్ధి, గ్లోబల్ కమోడిటీ ధరలు తక్కువగా ఉండటం, పరిశ్రమల్లో విడి పరికరాల సామర్థ్యం ప్రస్తుతం ధరల పెరుగుదలను నిరోధిస్తున్నాయని మూడీ పేర్కొంది. ఒకవేళ ప్రతికూల రుతుపవనాల పరిస్థితి ఏర్పడి ఆహార ధరలు పెరిగితే, రూపాయి విలువ పడిపోతుందని మూడీ హెచ్చరించింది. -
25 డాలర్లకు తగ్గనున్న చమురు
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు, గ్యాస్ ధరలు పలు సంవత్సరాలపాటు ప్రస్తుత కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గినా.. ఒకవేళ ఇరాన్ నుంచి ఉత్పత్తి మెరుగ్గా ఉంటే బ్యారెల్ ధర 25 డాలర్లకు కూడా పతనం కావొచ్చని వివరించింది. 2014 జూన్‌లో చమురు ధరల పతనం ప్రారంభమై ఇటీవలే దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇప్పటికే మార్కెట్లో పేరుకుపోయిన చమురు, గ్యాస్ నిల్వల వినియోగం నెమ్మదిగా జరుగుతున్నందున .. రేట్లు మరికొన్నాళ్ల పాటు కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ వివరించింది. 2016లో చమురు ధరలు బ్యారెల్‌కు 33 డాలర్ల స్థాయిలోనే ఉండొచ్చని, వచ్చే ఏడాది 38 డాలర్లకు, అటుపైన 2018లో 43 డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. ఇక ఈ ఏడాది అమెరికా హెన్రీ హబ్ సహజ వాయువు (గ్యాస్) రేటు యూనిట్‌కు (ఎంబీటీయూ) సగటున 2.25 డాలర్లుగా ఉండొచ్చని, వచ్చే ఏడాది 2.50 డాలర్లకు, 2018లో 2.75 డాలర్లకు చేరొచ్చని మూడీస్ పేర్కొంది. ఇలా కాకుండా చమురు, గ్యాస్ రేట్లకు కొన్ని ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయని మూడీస్ తెలిపింది. ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి సరఫరాలు తగ్గినా.. ఇరాన్ నుంచి పెరిగితే చమురు రేటు 25 డాలర్లకు, గ్యాస్ ధర యూనిట్‌కు 1.75 డాలర్లకు పడిపోవచ్చని వివరించింది. అమెరికా, చైనా, భారత్ సహా ప్రధాన వినియోగ దేశాల్లో డిమాండ్ కన్నా మించి ప్రస్తుతం ఉత్పత్తి, సరఫరా ఉంటోందని మూడీస్ పేర్కొంది. చమురు రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఉత్పత్తి దేశాల వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కనీసం 0.8% మేర మందగించవచ్చని, అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. -
భారత్ కు ద్రవ్యలోటు గండం!
♦ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయం ♦ బడ్జెట్ నేపథ్యంలో కీలక విశ్లేషణ న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 29న పార్లమెంటులో తన రెండవ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో... రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మంగళవారం ఆర్థిక వ్యవస్థపై కీలక విశ్లేషణ చేసింది. ద్రవ్యలోటు వంటి భారత్ ముఖ్య ఆర్థిక అంశాలు బలహీనంగా ఉన్నాయన్నది ఇందులో ప్రధానమైంది. జైట్లీ బడ్జెట్ ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడినా... సమీప కాలానికి ఆయా అంశాల బలహీన ధోరణే ప్రస్ఫుటమవుతున్నట్లు తాజా నివేదికలో వ్యాఖ్యానించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.... ♦ వృద్ధి 7 శాతంపైగా ఉన్నా... గ్రామీణ డిమాండ్, కార్పొరేట్ లాభాలు మందగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ పన్ను ఆదాయంపై ఇవి ప్రభావం చూపుతాయి. భవిష్యత్తులో ఆదాయాలకు సైతం ఈ అంశాలే కీలకం. ♦ {పభుత్వ ద్రవ్య స్థిరీకరణ విధానాలు ఎలా ఉన్నాయన్నది రానున్న బడ్జెట్లో కీలకాంశం. గడచిన ఐదేళ్లుగా ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యం... స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం) తగ్గుతూ వస్తోంది. ఇది ప్రభుత్వ రుణ నిష్పత్తుల స్థిరీకరణకూ దోహదపడింది. ద్రవ్య స్థిరీకరణ లేకుండా ముందుకుపోవడం మంచిది కాదు. ఇదే జరిగితే భారత్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇతర సహ దేశాలకన్నా బలహీనపడుతుంది. వేతన బిల్లు పెరగడం, వృద్ధికి సంబంధించి తప్పని వ్యయాల భారం ద్రవ్యలోటు లక్ష్యాన్ని ఒత్తిడికి గురుచేస్తోంది. ♦ కార్పొరేట్ లాభాలు తగ్గడం, వినియోగంలో వృద్ధి మందగమనం వంటి అంశాల వల్ల ద్రవ్యలోటుకు సంబంధించి బలహీన వాతావ రణం కొనసాగే అవకాశం ఉంది. బడ్జెట్ కూడా ఈ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తే... పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ♦ సబ్సిడీలకు సంబంధించి... ఇంధన సబ్సిడీ భారాలు తగ్గినా, ఆహార సబ్సిడీలు ఇంకా భారంగానే ఉన్నాయి. ♦ {దవ్యలోటు పరిస్థితుల మెరుగుదలకు వ్యవస్థాపరమైన అంశాలూ అడ్డంకులుగా ఉన్నాయి. దాదాపు 1,700 డాలర్ల వరకూ ఉన్న తలసరి ఆదాయ అంశాలు... ప్రభుత్వ పన్ను బేస్ పెంపు ప్రతిపాదనలకు అడ్డం తగులుతున్నాయి. సబ్సిడీలు, అభివృద్ధికి వ్యయాలు కూడా ఆయా అంశాలు విఘాతం కలిగిస్తున్నాయి. ♦ భారత్ ప్రభుత్వ ఆదాయంలో ఐదవ వంతు వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. అధిక రుణ భారం ఫలితమిది. 2016లో జీడీపీలో 63.8%గా రుణ భారం ఉంటుందని భావిస్తున్నాం. 2005లో ఇది 83.1 శాతంగా ఉంది. ఎన్టీపీసీ రేటింగ్‌కు ఢోకా లేదు... భారత్‌లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీ ఎన్టీపీసీలో ప్రభుత్వం 5% వాటా విక్రయించినప్పటికీ ఈ సంస్థకు తాను ఇస్తున్న ‘బీఏఏ3’ రేటింగ్‌లో ఎటువంటి ఢోకా ఉండబోదని మూడీస్ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థలో ఈ రంగానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతకు అనుగుణంగా రేటింగ్ కొనసాగుతుందని తెలిపింది. ప్రభుత్వ మెజారిటీ వాటా కొనసాగుతుందని భావిస్తున్నామని, దీని వల్ల ఎన్టీపీసీ సావరిన్ మద్దతుకు ఎటువంటి ఢోకా ఉండదన్నది తమ అభిప్రాయమని మూడీస్ సీనియర్ విశ్లేషకుడు అభిషేక్ త్యాగీ పేర్కొన్నారు. ద్రవ్యలోటు లక్ష్యం 3.7%కి పెంపు!: డీబీఎస్ వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రస్తుత 3.5% నుంచి 3.7%కి (స్థూల దేశీయోత్పత్తితో పోల్చి) పెంచే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డీబీఎస్ విశ్లేషించింది. వేతన పెంపు, వ్యయాల ఒత్తిడులు, బ్యాం కింగ్‌లో తాజా పెట్టుబడుల అవసరాలు వంటివి తమ అంచనాకు కారణమని పేర్కొంది. వస్తు సేవల పన్ను, దివాలా చట్టం, రియల్టీ బిల్లు వంటి కీలక అంశాలకు పార్లమెంటులో ప్రతిపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదన్నది తమ అభిప్రాయమని పేర్కొంది. ఏప్రిల్-మే నెలల్లో ఐదు కీలక రాష్ట్రాల ఎన్నికలు, సంస్కరణల ఎజెండాలను మార్కెట్లు జాగ్రత్తగా పరిశీలిస్తాయని కూడా విశ్లేషించింది. -
2016... 2017ల్లో వృద్ధి 7.5 శాతం!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2016, 2017 సంవత్సరాల్లో 7.5 శాతం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేసింది. పపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మూడీస్ గురువారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. ‘‘బ్యాంకుల మొండిబకాయిలు, కార్పొరేట్ రుణ భారాలు పెరుగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిని ద్రవ్యోల్బణం సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను విసరవచ్చు. అయితే వినియోగ వ్యయాలు పటిష్టంగా ఉండడం దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూలం. ప్రభుత్వ ఆదాయా-వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటును వచ్చే ఏడాది జీడీపీలో 3.5 శాతానికి కట్టడి చేయడానికి ప్రభుత్వం తన వ్యయాల్ని తగ్గించుకునే అవకాశముంది’’ అని సంస్థ విశ్లేషించింది. ద్రవ్యలోటు సవాలే...గోల్డ్‌మన్,హెచ్ఎస్బీసీ ద్రవ్యలోటు లక్ష్య సాధన అనుమానమేనని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. 2016-17లో ఈ లక్ష్యాన్ని 3.9 శాతానికి పెంచే వీలుందని వివరించింది. జీడీపీ వృద్ధి గాను గ్రామీణ డిమాండ్‌ను మెరుగుపరచడం, ఉద్యోగుల వేతన బిల్లు పెంపు వంటి అంశాలు తన అంచనాలకు కారణంగా చూపింది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.5 శాతం నుంచి 3.8 శాతానికి పెంచే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు. వేతన బిల్లు అమలు వంటి విషయాల్లో ప్రభుత్వంపై వ్యయాల ఒత్తిళ్లు దీనికి కారణమని వివరించింది. వృద్ధి 7.4 శాతం: ఓఈసీడీ 2016-17లో భారత్ వృద్ధి 7.4 శాతంగా ఉండవచ్చని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్) అంచనావేసింది. మూడు నెలల క్రితం అంచనా 7.3 శాతం కాగా దీనిని తాజాగా సంస్థ సవరించి పెంచింది. సంవత్సరాల పరంగా చూస్తే 2016లో 7.4 శాతం, 2017లో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. చైనా వృద్ధి రేట్లను ఈ రెండేళ్లలో వరుసగా 6.5 శాతం, 6.2 శాతంగా పేర్కొంది. -
ఆసియా కంపెనీలకు గడ్డుకాలమే!
♦ 2016పై మూడీస్ నివేదిక ♦ చైనా మందగమనంపై ఆందోళన న్యూఢిల్లీ: ఆసియా కంపెనీలకు 2016 సవాళ్లను విసరనుందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ రిసెర్చ్ అనలిస్ట్ రాహుల్ ఘోష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా మందగమనం, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యాంశాలు... ఆసియా వ్యాప్తంగా పలు దేశాల్లో 2016లో వృద్ధి మందగించడమో లేక స్థిరంగా ఉండడమో జరుగుతుంది. మూలధనం లభ్యతలో ఒడిదుడుకుల కారణంగా కార్పొరేట్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. బలహీన ఆర్థిక వృద్ధి రేటు, కమోడిటీ ధరల పతనం వంటి అంశాలు పలు దేశాల్లో విదేశీ కరెన్సీ ఒడిదుడుకులు, తద్వారా క్రెడిట్ రిస్క్‌కు దారితీయవచ్చు. 6.5 శాతం ఎగువన వృద్ధి రేటును నిలబెట్టడం, సంస్కరణల అమలు, ఆర్థిక సమతౌల్యత, ద్రవ్య స్థిరత్వం వంటి అంశాలు చైనాకు సవాళ్లు. ఆయా అంశాలు ఆసియా మొత్తం ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. 2015 తరహాలోనే 2016లో కూడా కార్పొరేట్ క్రెడిట్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. ఆయా అంశాలు మరింత రేటింగ్ ఒత్తిళ్లకు, డిఫాల్ట్స్కు దారితీయవచ్చు. ప్రత్యేకించి స్పెక్యులేటివ్ గ్రేడ్ కంపెనీలపై ఆయా అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. తగిన ద్రవ్య పరపతి విధానాలు, స్థానిక బాండ్ మార్కెట్స్, బ్యాంకింగ్‌లో పటిష్ట నిధుల పరిస్థితులు, రీఫైనాన్సింగ్ అవసరాలను నిర్వహించగలిగిన సత్తా వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థలకు కొంత మేలు చేస్తాయి. ఆసియా బ్యాంకుల విషయానికి వస్తే... రుణ నాణ్యత, లాభాలు క్షీణించనున్నాయి. వృద్ధి మందగమనం వల్ల బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య తీవ్రం కావచ్చు. -
భారత్ పరపతి హోదా యథాతథం: మూడీస్
న్యూఢిల్లీ: ద్రవ్యలోటు లక్ష్య సాధన తడబాటు ప్రభావం భారత్ పరపతి హోదాపై (క్రెడిట్ ప్రొఫైల్) ఉండబోదని మూడీస్ పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగించడం సహా ఇతర అంతర్జాతీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తక్కువ ద్రవ్యలోటు లక్ష్యాలను, ద్రవ్య స్థిరీకరణను కొనసాగిస్తుందని అభిప్రాయపడింది. 2016-17లో 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధనలో కార్పొరేట్ లాభాలు, ప్రభుత్వ రాబడి పెరుగుదల వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ ఎండీ అత్సి శేత్ తెలిపారు. ద్రవ్యలోటు స్థిరీకరణ అనేది ఒక ప్రక్రియ అని, అది ఏ ఒక్క అంశంపై ఆధారపడబోదని చెప్పారు. ఒక ఏడాదితో పోలిస్తే మరొక ఏడాదిలో భారత ప్రభుత్వం తక్కువ ద్రవ్యలోటునే లక్ష్యంగా నిర్దేశించుకుంటుందని అంచనా వేశారు. ప్రభుత్వపు సంస్కరణల జాప్యాల ప్రభావం భారత్ క్రెడిట్ ప్రొఫైల్ అంచనాలపై ఉండదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ద్రవ్యలోటు స్థిరీకరణ కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తోందని, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అది భవిష్యత్తులో అలాగే కొనసాగుతుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో ద్రవ్యలోటును 3.9 శాతానికి, 2016-17లో 3.5 శాతానికి లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐఎంఎఫ్.. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను 3.6 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. -
భారత్ రేటింగ్‌పై లోటు ప్రభావం ఉండదు: మూడీస్
న్యూఢిల్లీ: భారత స్వల్పకాలిక రేటింగ్స్‌పై ద్రవ్య లోటు గణాంకాల స్వల్ప పెరుగుదల, తగ్గుదల ప్రభావాలు పెద్దగా ఉండబోవని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. భారత ద్రవ్య పరిస్థితి ఇప్పటికే బలహీనంగా ఉందని, లోటు కట్టడి లక్ష్యాలు సాధించినా కూడా పరిస్థితి అలాగే ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాల ప్రభావమనేది రేటింగ్‌పై ఎక్కువగా ఉండబోదని మూడీస్ అసోసియేట్ ఎండీ అత్సి సేఠ్ వివరించారు. ప్రస్తుతం మూడీస్ భారత్‌కు సానుకూల అంచనాలతో ‘బీఏఏ3’ రేటింగ్ ఇచ్చింది. తామిచ్చే రేటింగ్ వృద్ధి ఆధారంగానే ఉంటుందని, విధానాల్లో మార్పులను బట్టి ఉండదని సేఠ్ తెలిపారు. అందుకే, 2002-03 నుంచి 2007-08 మధ్య కాలంలో ద్రవ్య లోటు ఏకంగా 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గినప్పటికీ తాము రేటింగ్‌ను పెంచలేదని ఆమె పేర్కొన్నారు. వచ్చే ఏడాది వృద్ధి 7.7 శాతం.. భారత్ వృద్ధి ధోరణికి కార్పొరేట్ ఫలితాలు, ద్రవ్యోల్బణమే కీలకమని మూడీస్ దేశీయ అనుబంధ విభాగం ఐసీఆర్ఏ రేటింగ్స్ పేర్కొంది. అయినా... 2016లో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2015-16లో భారత్‌లో 7.2%, 2016-17లో 7.7% వృద్ధి ఉంటుందని అంచనావేసింది. -
మీ నేతలను కట్టడి చేయండి.. లేకుంటే..
* అంతర్జాతీయంగా విశ్వసనీయత కోల్పోతారు * ప్రధాని మోదీకి మూడీస్ హెచ్చరిక న్యూఢిల్లీ: గొడ్డు మాంసం తదితర వివాదాలతో వైషమ్యాలు చెలరేగుతున్న నేపథ్యంలో అధికారిక బీజేపీ నేతలను కట్టడి చేయడం శ్రేయస్కరమని ప్రధాని నరేంద్ర మోదీకి కన్సల్టెన్సీ సంస్థ మూడీస్ సూచించింది. లేని పక్షంలో ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను విశ్వసనీయత కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేకపోవడంతో కీలక సంస్కరణలు విపక్షాలు మోకాలడ్డుతున్నాయనుకున్నా.. సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి చేటు చేస్తున్నాయని మూడీస్ అనలిటిక్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఉద్రిక్తతలు మరింత పెరిగిన పక్షంలో రాజ్యసభలో విపక్షాల నుంచి వ్యతిరేకతా పెరుగుతుందని, ఆర్థిక విధానాలపై చర్చలు పక్కదారి పట్టే అవకాశం ఉందని వివరించింది. కాబట్టి, మోదీ తన పార్టీ నేతలను అదుపులో ఉంచాలని లేదా.. దేశీయంగాను, అంతర్జాతీయంగాను విశ్వసనీయత కోల్పోయే రిస్కును ఎదుర్కొనక తప్పదని మూడీస్ హెచ్చరించింది. భారత్‌లో ఇటీవలి రాజకీయ వివాదాలపై మూడీస్ వంటి అంతర్జాతీయ సంస్థ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి. మూడీస్ అనలిటిక్స్ అనేది మూడీస్ కార్పొరేషన్లో ఎకనమిక్ రీసెర్చ్, అనాలిసిస్ విభాగం. తమ వ్యాఖ్యలు స్వతంత్రమైనవేనని, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్‌కి వీటికి సంబంధం లేదని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది. మోదీ సారథ్యానికి బిహార్ ఎన్నికల పరీక్ష.. బిహార్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మోదీ సారథ్యానికి చాలా కీలకమైనవని మూడీస్ తెలిపింది. బిహార్‌లో బీజేపీ విజయం సాధించగలిగితే ఎగువ సభలో పార్టీకి కొంత మెజారిటీ దక్కించుకునేందుకు తోడ్పాటు లభించగలదని పేర్కొంది నివేదికలో మరిన్ని అంశాలు.. * తక్కువ వడ్డీ రేట్లు స్వల్పకాలికంగా ఎకానమీకి తోడ్పాటునిచ్చినా.. దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాలను సాధించాలంటే సంస్కరణల అమలు తప్పనిసరి. * 2015లో ఆర్బీఐ కీలక పాలసీ రేట్లు ఇక మార్చకపోవచ్చు. వచ్చే ఏడాది ప్రారంభంలో స్వల్పంగా తగ్గించవచ్చు. * ఆర్బీఐ దగ్గర విదేశీ మారక నిల్వలు పుష్కలంగా ఉన్నందున.. ఒకవేళ అమెరికా వడ్డీ రేట్లు పెంచినా, రూపాయిపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. -
ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యాకే రేటింగ్ పెంపు: మూడీస్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ఇతరత్రా ఆర్థికపరమైన అంశాలు మెరుగుపడితేనే రేటింగ్ పెంపునకు భవిష్యత్తులో అవకాశం ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొం ది. భారత్ పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రధానంగా స్థిరమైన పన్నుల వ్యవస్థ, వ్యాపారాలకు సానుకూల వాతావరణం వంటి చర్యలు చాలా అవసరమని సూచించింది. ‘రేటింగ్ అవుట్‌లుక్ అనేది అంచనాల ఆధారంగా ఉంటుంది. అప్‌గ్రేడ్ విషయానికొస్తే.. అంచనాలు వాస్తవ రూపం దాల్చాయన్న విశ్వాసం కుదరాలి. ఇది స్థూల ఆర్థిక పరిస్థితుల్లో ప్రతిబింబించాలి కూడా’ అని మూడీస్ సావరీన్ రేటింగ్ ఎనలిస్ట్ అత్సి సేథ్ వ్యాఖ్యానించారు. ఇటీవలే భారత్ రేటింగ్(ప్రస్తుతం బీఏఏ 3) అవుట్‌లుక్‌ను స్థిరం నుంచి సానుకూలం(పాజిటివ్)కు మూడీస్ పెంచడం తెలిసిందే. బీఏఏ 3 అనేది జంక్ గ్రేడ్(పెట్టుబడులకు ఏమాత్రం అనుకూలం కాని స్థాయి)కు ఒక అంచెపైన మాత్రమే ఉన్నట్లు లెక్క. -
2015లో వృద్ధి 7.5 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2015లో 7.5 శాతం ఉంటుందని రేటింగ్ సంస్థ మూడీస్ అంచనావేసింది. 2014లో ఈ రేటు 7.2 శాతం. వడ్డీరేట్ల తగ్గింపు వల్ల వ్యవస్థలో ప్రైవేటు రంగం పెట్టుబడి పెరుగుతుందని విశ్లేషించింది. జనవరి-మార్చి మధ్య జీడీపీ వృద్ధి 7.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మున్ముందు క్వార్టర్లలో ఈ రేటు మరింత పురోగమించడానికే తగిన అవకాశాలు ఉన్నాయని తన తాజా నివేదికలో తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు చైనాకన్నా అధికంగా 7.5 శాతంగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకులు అంచనా వేయడం తెలిసిందే. -
భారత్ రేటింగ్ ‘స్థిరం’: మూడీస్
ముంబై: భారత్ సార్వభౌమ పరపతి రేటింగ్‌కు ఇప్పుడున్న స్థిరమైన అంచనాను (స్టేబుల్ అవుట్‌లుక్) కొనసాగిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ దిగ్గజం మూడీస్ బుధవారం ప్రకటించింది. ‘బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్)’ రేటింగ్‌లో మార్పులేవీ లేవని పేర్కొంది. ప్రధానంగా మెరుగైన ప్రైవేటు పొదుపు రేటు, భారీ, విభిన్న రంగాలతో కూడిన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు మూడీస్ విశ్లేషకుడు (సావరీన్ క్రెడిట్) అత్సి సేథ్ పేర్కొన్నారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చని తాజా నోట్లో ఆయన అంచనా వేశారు. అదే విధంగా సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2016 మార్చిచివరినాటికి 6.5 శాతానికి పెరగవచ్చని (ఈ ఏడాది మార్చి నాటికి అంచనా 4.6 శాతం) అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ అతితక్కువ స్థాయి తలసరి ఆదాయాలు, బలహీన మౌలిక సదుపాయాలను చూస్తే.. భవిష్యత్తులో వృద్ధికి మరింత ఆస్కారం ఉందని సేథ్ పేర్కొన్నారు. స్టేబుల్ అవుట్‌లుక్ అంటే రానున్న కాలంలో రేటింగ్ పెంపునకు(అప్‌గ్రేడ్) ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లే లెక్క. -
ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం.. భారత్ రేటింగ్‌కు సానుకూలం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రధాన లక్ష్యంగా... కేంద్రం-సెంట్రల్ బ్యాంక్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (ఫ్రేమ్‌వర్క్) భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సానుకూలమని అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్ సంస్థ మూడీస్ గురువారం ప్రకటించింది. దీనివల్ల ఆర్బీఐ పరపతి విధాన అస్త్రాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సైతం వీలవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ విశ్లేషకులు షరీన్ మహ్మదీ పేర్కొన్నారు. కేంద్రం-ఆర్బీఐ మధ్య అవగాహన ప్రకారం ఏర్పడిన కొత్త ‘ద్రవ్యోల్బణం లక్ష్యం’ యంత్రాంగం ప్రకారం, 2016 జనవరి నాటికి రిజర్వ్ బ్యాంక్ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉండేలా చూడాలి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడి చర్యలను ఆర్బీఐ తీసుకోవాలి. -
చిన్న షేర్లు ముద్దు
కొత్త ప్రభుత్వం ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడుతుందన్న అంచనాలు మార్కెట్లలో ఊపందుకున్నాయి. సంస్కరణల జోరు పెరుగుతుందన్న ఆశలు ఇందుకు జత కలిశాయి. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సిమెంట్, మైనింగ్, బ్యాంకింగ్ తదితర రంగాలకు జవసత్వాలు కల్పించే బాటలో పటిష్ట విధాన నిర్ణయాలుంటాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో ఇన్ఫ్రా, పవర్ రంగాల షేర్లు కొనుగోళ్ల వెల్లువతో రేసు గుర్రాల్లా దూసుకెళ్లాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ 6% జంప్‌చేయగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ సైతం 4% ఎగసింది. ట్రేడైన షేర్లలో 2,154 లాభపడితే, 698 నష్టపోయాయి. రాష్ట్ర కంపెనీల హవా... చిన్న షేర్లలో జేపీ పవర్ 30%పైగా దూసుకెళ్లగా, రాష్ర్ట కంపెనీల షేర్లు జీవీకే పవర్, కేఎస్కే ఎనర్జీ, ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా, ల్యాంకో ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రా 20% స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో ఇతర మిడ్ క్యాప్స్ జేకే లక్ష్మీ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా, ఇండియాబుల్స్ పవర్, సుజ్లాన్ ఎనర్జీ, జేకే సిమెంట్, హెచ్‌సీసీ, బీఈఎంఎల్, జేపీ ఇన్ఫ్రా, పుంజ్‌లాయిడ్, గేట్‌వే డిస్ట్రిపార్క్స్, సింటెక్స్, బీఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్, బీజీఆర్ ఎనర్జీ, ఓరియంట్ సిమెంట్, ఇండియా సిమెంట్, కల్పతరు పవర్, ఇండియన్ బ్యాంక్, వోల్టాస్, జేపీ అసోసియేట్స్, ఎన్సీసీ, శ్రేఈ ఇన్ఫ్రా, క్రాంప్టన్ గ్రీవ్స్, దేనా బ్యాంక్, స్టెరిలైట్ టెక్, ఐఆర్బీ ఇన్ఫ్రా, సద్భావ్ ఇంజినీరింగ్, జిందాల్ సా తదితరాలు 20-12% మధ్య పురోగమించాయంటే వీటికి ఏ స్థాయిలో డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు! మార్కెట్ల దూకుడుకు అనుగుణంగా రిటైల్ ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులకు ఉపక్రమిస్తుండటంతో బ్రోకింగ్ షేర్లు మోతీలాల్ ఓస్వాల్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సైతం 20% జంప్ చేయడం విశేషం! -
మూడో ఫ్రంట్ వస్తే మూడినట్లే: మూడీస్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మూడవ ఫ్రంట్ అధికారంలోకి వస్తే, పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేస్తోంది. ఆర్థిక రికవరీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఉమ్మడి ఆర్థిక సంస్కరణల ఎజెండా లేకుండా చిన్న, ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటయ్యే సంకీర్ణం వల్ల ఆర్థిక వ్యవస్థ పలు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ ఘోష్ పేర్కొన్నారు. వృద్ధికి వచ్చే ఎన్నికలు కీలకం: స్టాన్‌చార్ట్ కాగా భారత్ వృద్ధి తీరుకు రానున్న ఎన్నికలు కీలకమని స్టాండెర్డ్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతం వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి మెరుగుపడుతుందని కూడా విశ్లేషించింది. -
వృద్ధి అవకాశాలు బలహీనం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉన్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ మంగళవారం పేర్కొంది. అయితే వచ్చే ఏడాది రికవరీకి కొంత అవకాశం ఉందని తన తాజా నివేదికలో తెలిపింది. క్లిష్టంగా ఉన్న పన్నులు, నిబంధనల అంశాలు, బలహీన మౌలికరంగం, బలహీన కేంద్ర ప్రభుత్వం వంటి అంశాలు ఆర్థికరంగానికి సంబంధించి ‘విశ్వాసం, డిమాండ్’పై ప్రస్తుతం ప్రభావితం చూపుతున్నట్లు పేర్కొంది. మే ఎన్నికల తర్వాత పాలనాపరంగా కొంత పురోగతికి అవకాశం ఉందని అభిప్రాయపడింది. అధిక ద్రవ్యోల్బణ నేపథ్యంలో రెపోరేటు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని కూడా మూడీస్ అంచనావేసింది. -
బ్యాంకింగ్‌పై ఇంకా ప్రతికూలమే: మూడీస్
ముంబై: వృద్ధి అంచనాలు, అసెట్ క్వాలిటీపై ఆందోళన నేపథ్యంలో భారత బ్యాంకింగ్ రంగానికి ప్రతికూల అంచనాలను కొనసాగించాలని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నిర్ణయించింది. ఆర్థికవృద్ధి బలహీనంగా ఉంటుం దని, ఇచ్చిన రుణాలు రాబట్టుకోవడం మరింత కష్టతరంగా మారొచ్చని, ఇందుకు కేటాయింపులు పెంచాల్సిరావడం వల్ల బ్యాంకుల లాభదాయకత క్షీణించగలదని ఈ నెగటివ్ అవుట్‌లుక్ సూచిస్తుం దని మూడీస్ పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు 70% పైగా వాటా ఉండే ప్రభుత్వరంగ బ్యాంకులపైనే (పీఎస్బీ) ఈ నెగటివ్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్రా రంగానికి అత్యధికంగా రుణాలిచ్చే పీఎస్‌బీల నిరర్థక ఆస్తుల పరిమాణం గణనీయంగా పెరిగిపోతుందని మూడీస్ పేర్కొంది. మరోవైపు, ప్రైవేట్‌రంగ బ్యాంకులు మెరుగైన మార్జిన్లతో పటిష్టమైన స్థానంలో ఉన్నాయని తెలిపింది. 2011 నవంబర్ నుంచి భారత బ్యాంకింగ్ రంగంపై మూడీస్ ప్రతికూల అంచనాలను కొనసాగిస్తోంది. -
భారత్ ఆర్థిక వ్యవస్థపై మూడీస్
ముంబై: భారత్ ఆర్ధిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించడమన్నది ఇక గతమేనని రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. 2015 ద్వితీయార్థానికి దేశం 6.5 శాతం వృద్ధి రేటు సాధన సామర్థ్యానికి చేరుకోగలదని గురువారం వెలువరించిన తన తాజా నివేదికలో పేర్కొంది. భారత్ వృద్ధి రేటు ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరిపోయినట్లేనని, ఇంతకంటే దిగువకు పడిపోదని భావిస్తున్నామని కూడా పేర్కొంది. ఇక్కడ నుంచి ఇక రికవరీ బాట పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అయితే నాల్గవ క్వార్టర్ నుంచీ పెట్టుబడులు పెరగాల్సి ఉంటుందని మూడీస్ ఆర్థికవేత్త గ్లాన్ లివీన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.