ప్రతికూల రుతుపవనాలెదురైతే ప్రమాదమే | Inflation could rise on bad monsoon, currency decline: Moody's | Sakshi
Sakshi News home page

ప్రతికూల రుతుపవనాలెదురైతే ప్రమాదమే

Published Tue, Apr 5 2016 3:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

Inflation could rise on bad monsoon, currency decline: Moody's

న్యూఢిల్లీ : మంగళవారం ఆర్బీయై  ప్రకటించిన  ద్వైమాసిక ద్రవ్యపరపతి  విధానంపై  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వడ్డీరేట్లను పావుశాతం తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న నిర్ణయంతో   ప్రతికూల రుతుపవనాల కాలంలో ధరల పెరుగుదలకు దారితీస్తుందని మూడీ హెచ్చరిస్తోంది.  ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వినియోగదారుల ధరల సూచీ 5 శాతం లోపు ఉండటం ఈ రేట్ల తగ్గింపుకు దారితీసిందని రాజన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఓ మోస్తరు వృద్ధి, గ్లోబల్  కమోడిటీ ధరలు తక్కువగా ఉండటం, పరిశ్రమల్లో విడి పరికరాల సామర్థ్యం ప్రస్తుతం ధరల పెరుగుదలను నిరోధిస్తున్నాయని మూడీ పేర్కొంది. ఒకవేళ ప్రతికూల రుతుపవనాల పరిస్థితి ఏర్పడి ఆహార ధరలు పెరిగితే, రూపాయి విలువ పడిపోతుందని మూడీ హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement