
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు చెందిన బీఏఏ3 ఇష్యూయర్ రేటింగ్, బీఏఏ3 సీనియర్ అన్‌సెక్యూర్డ్ మీడియం టర్మ్ నోట్ ప్రోగ్రామ్ రేటింగ్‌లను ఉపసంహరించుకున్నట్టు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ప్రకటించింది. సొంత వ్యాపార కారణాలే ఇందుకు దారితీసినట్టు తెలిపింది.రేటింగ్‌లను ఉపసంహరించుకోవడానికి ముందు ఎన్‌హెచ్‌ఏఐకు సంబంధించి స్టెబుల్ రేటింగ్‌ను మూడిస్ కొనసాగించడం గమనార్హం.