Moodys rating
-
అదానీకి మూడీస్ షాక్.. 4 కంపెనీలకు నెగిటివ్ రేటింగ్
న్యూఢిల్లీ: ఇటీవల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌లోని 4 కంపెనీల రేటింగ్‌లో మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తాజాగా కోత పెట్టింది. స్థిరత్వం(స్టేబుల్) నుంచి రేటింగ్‌ను ప్రతికూలం(నెగిటివ్)కు దిగువముఖంగా సవరిస్తున్నట్లు మూడీస్ వెల్లడించింది. ఈ జాబితాలో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్–1, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లను పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీల ఈక్విటీ విలువలు మార్కెట్లో ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా పతనమైన నేపథ్యంలో తాజా సవరణలు చేపట్టినట్లు వివరించింది. అదానీ గ్రూప్‌లో కార్పొరేట్ పాలన సక్రమంగా లేదంటూ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిన తదుపరి గ్రూప్ విలువ 100 బిలియన్ డాలర్లను కోల్పోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 4 కంపెనీలకు రేటింగ్‌ను ప్రతికూలానికి సవరించినప్పటికీ మరో 8 కంపెనీలకు ‘స్థిరత్వం’ను కొనసాగించినట్లు మూడీస్ తెలియజేసింది. స్టేబుల్ రేటింగ్‌ను కొనసాగిస్తున్న కంపెనీలలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ఇంటర్నేషనల్ కంటెయినర్ టెర్మినల్, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్–2, అదానీ ట్రాన్స్మిషన్ రెస్ట్రిక్టెడ్ గ్రూప్–1 ఉన్నట్లు వెల్లడించింది. (ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్‌తో పోటీలో ఆదానీ కొత్త ప్లాన్!) -
భారత్ వృద్ధి రేటు అంచనాకు మూడీస్ రెండవ కోత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణమని పేర్కొంది. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్ 2023–24 నివేదికలో మూడీస్ పేర్కొంది. 2024లోనే వెలుగు రేఖలు... 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని అవుట్‌లుక్ పేర్కొంది. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయని మూడీస్ అంచనావేసింది. 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని పేర్కొంటూ, 2023లో జీ–20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణిస్తుందని తెలిపింది. క్రితం 2.1 శాతం క్షీణ అంచనాలు తగ్గడం కొంత ఊరట. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థి క, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి న మోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. -
ఎన్హెచ్ఏఐ రేటింగ్స్ ఉపసంహరణ: మూడిస్
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు చెందిన బీఏఏ3 ఇష్యూయర్ రేటింగ్, బీఏఏ3 సీనియర్ అన్సెక్యూర్డ్ మీడియం టర్మ్ నోట్ ప్రోగ్రామ్ రేటింగ్లను ఉపసంహరించుకున్నట్టు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ప్రకటించింది. సొంత వ్యాపార కారణాలే ఇందుకు దారితీసినట్టు తెలిపింది.రేటింగ్లను ఉపసంహరించుకోవడానికి ముందు ఎన్హెచ్ఏఐకు సంబంధించి స్టెబుల్ రేటింగ్‌ను మూడిస్ కొనసాగించడం గమనార్హం. -
రష్యాలో పెట్టుబడులు ‘చెత్తే’!
న్యూఢిల్లీ: రష్యా సావరిన్ రేటింగ్‌ను అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మూడీస్, ఫిచ్ జంక్ గ్రేడ్‌కు తగ్గించాయి. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాల తీవ్ర ఆంక్షలు రేటింగ్ కోతకు దారితీశాయి. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు ఒక దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆ దేశానికి సంబంధించి మూడీస్, ఫిచ్, ఎస్అండ్పీ వంటి సంస్థల రేటింగ్ ఏమిటన్నది పరిశీలిస్తాయి. మూడీస్, ఫిచ్ తాజా నిర్ణయం పుతిన్ ప్రభుత్వం రుణ వ్యయాలను భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి. రుణాలు చెల్లించలేని (డిఫాల్ట్ రిస్క్) పరిస్థితి ఉత్పన్నం కావచ్చని జంక్ కేటగిరీ సూచిస్తుంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ రష్యా లాంగ్ టర్మ్ ఇష్యూయెర్ అండ్ సీనియర్ అన్సెక్యూర్డ్ (లోకల్–అండ్ ఫారిన్ కరెన్సీ) డెట్ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీ3’కి తగ్గించింది. ‘‘రష్యన్ ఫెడరేషన్ సెంట్రల్ బ్యాంక్ (సీబీఆర్)సహా కొన్ని పెద్ద ఆర్థిక సంస్థలపై పశ్చిమ దేశాలు విధించిన తీవ్రమైన ఆంక్షల కారణంగా రష్యా రేటింగ్‌లపై సమీక్ష నిర్వహించడం జరిగింది. పరిస్థితి తీవ్రతను బట్టి రేటింగ్‌ను మరింత డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిచ్ దేశ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘బీ’కి కుదించింది. దేశాన్ని ‘రేటింగ్ వాచ్ నెగెటివ్’ జాబితాలో పెట్టింది. ‘‘అంతర్జాతీయ ఆంక్షల తీవ్రత ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలను పెంచింది. రష్యా క్రెడిట్ ఫండమెంటల్స్‌కు భారీ నష్టాన్ని తాజా పరిస్థితులు సూచిస్తున్నాయి. ప్రభుత్వ రుణ చెల్లింపుల పరిస్థితులను దెబ్బతీస్తున్నాయి’’ అని బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫిచ్ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. పలు దేశాల ఆంక్షలు, రూబుల్ పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ఫైనాన్షియల్ వ్యవస్థలకు సంబంధించి విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ బ్యాంక్ డిపాజిట్లు (అధికంగా డాలర్ల రూపంలో ఉండే) భారీ ఉపసంహరణలకు పరిస్థితి దారితీస్తుందని వివరించింది. మొత్తం డిపాజిట్లలో వీటి వాటా 25 శాతమని (దాదాపు 200 బిలియన్ డాలర్లు) పేర్కొంది. ఇవి బయటకు వెళ్లిపోతే వ్యవస్థ స్థిరత్వానికి విఘాతం ఏర్పడుతుందని, రూబుల్ ద్రవ్య లభ్యత, స్థిరత్వాలకు సంబంధించి బ్యాంకులకు సహకరించడంలో రష్యన్ ఫెడరేషన్ సెంట్రల్ బ్యాంక్ విఫలమవుతుందని హెచ్చరించింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న (క్రితం అంచనాలు 1.6%) జీడీపీ వృద్ధితీరుకు తాజా పరిణామాలు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. రష్యా ఎగుమతుల్లో 55% డాలర్ల రూపంలో ఉంటే, 29% యూరోలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తాజా పరిణామాలు రష్యా ట్రేడ్ చెల్లింపులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. 2021లో రష్యా ఎగుమతుల్లో 44% (దాదాపు 241 బిలియన్ డాలర్లు) ఇంధన రంగం వెయిటేజ్ కాగా, ఉక్రెయిన్‌పై దాడి, పర్యవసానాల నేపథ్యంలో వాణిజ్య భాగస్వామ్య దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటాయని కూడా ఫిచ్ పేర్కొనడం గమనార్హం. -
భారత్ కార్పొరేట్ అవుట్‌లుక్... పాజిటివ్
న్యూఢిల్లీ: భారత్ కంపెనీల అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో నెలకొన్న పటిష్ట డిమాండ్, విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ ఇందుకు దోహదపడుతున్న అంశాలని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వివరించింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, అధిక ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు వినియోగం పెరుగుతుండడం కూడా కంపెనీల సానుకూల అవుట్‌లుక్‌కు కారణమని పేర్కొంది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.3 శాతం ఉంటుందని అంచనా. ఆ తర్వాత 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ► స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణకు వీలుగా భారత కంపెనీలకు క్రెడిట్ ఫండమెంటల్స్ సానుకూలంగా ఉన్నాయి. పటిష్ట వినియోగదారుల డిమాండ్, అధిక కమోడిటీ ధరల కారణంగా రేటెడ్ కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ► వ్యాక్సినేషన్ విస్తృతి, స్థిరమైన వినియోగదారుల విశ్వాసం, తక్కువ వడ్డీ రేట్లు, అధిక ప్రభుత్వ వ్యయం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సానుకూల క్రెడిట్ ఫండమెంటల్స్ బలాన్ని అందిస్తున్నాయి. ► ఆయా అంశాలు భారతదేశ వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలలో స్థిరమైన పునరుద్ధరణకు దోహదపడుతున్నాయి. ఆంక్షల సడలింపు తర్వాత వినియోగదారుల డిమాండ్, వ్యయం, తయారీ కార్యకలాపాలు కోలుకుంటున్నాయి. అధిక కమోడిటీ ధరలతోసహా ఈ పోకడలు రాబోయే 12–18 నెలల్లో రేటెడ్ కంపెనీల స్థూల ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిని పెంచుతాయి. ► మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఉక్కు, సిమెంట్ డిమాండ్లను పెంచుతుంది. మరోవైపు పెరుగుతున్న వినియోగం, దేశీయ తయారీ పురోగతికి కేంద్రం తోడ్పాడు, నిధుల లభ్యత సజావుగా ఉండడానికి చర్యలు కొత్త పెట్టుబడులకు తగిన పరిస్థితులను సృష్టిస్తాయి. మూడవవేవ్ వస్తే మాత్రం కష్టమే... ఎకానమీకి మూడవ వేవ్ సవాళ్లూ ఉన్నాయి. ఇదే జరిగితే తాజా లాక్డౌన్ల ప్రకటనలు జరుగుతాయి. ఇది వినియోగ సెంటిమెంట్ పతనానికి దారితీస్తుంది. ఇలాంటి వాతావరణం ఆర్థిక క్రియాశీలతను, వినియోగ డిమాండ్‌ను పడగొడుతుంది. కంపెనీల స్ళూల ఆదాయాలూ పడిపోతాయి. కరోనా మూడవ వేవ్ పరిస్థితుల్లో– స్థూల ఆదాయాలు వచ్చే 12 నుంచి 18 నెలల్లో 15 నుంచి 20 శాతం పతనం అయ్యే వీలుంది. దీనికితోడు ప్రభుత్వ వ్యయంలో జాప్యం, పారిశ్రామిక ఉత్పత్తిని తగ్గించే తరహాలో చోటుచేసుకునే ఇంధన కొరత, ధరా భారం, డిమాండ్ పెంపునకు వస్తువుల ధరలను తగ్గించడం వంటి అంశాలు కంపెనీల ఆదాయాలను తగ్గిస్తాయి. ద్రవ్యోల్బణం సవాళ్లు... ప్రస్తుతం దేశ తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. నిధుల సమీకరణ వ్యయాలను తగ్గిస్తున్నాయి. డిమాండ్ పెరిగేకొద్దీ కొత్త మూలధన పెట్టుబడికి మద్దతు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం కనిపిస్తోంది. ఇది వడ్డీ రేటల్లో ఊహించిన దానికంటే వేగవంతమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ఇలాంటి ధోరణి వ్యాపార పెట్టుబడులపై అధిక భారాన్ని మోపుతుంది. -
సావరిన్ రేటింగ్ పెంచండి..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ప్రతినిధులతో సెపె్టంబర్ 28న భారత్ ఆర్థికశాఖ అధికారులు సమావేశంకానున్నారు. దేశ సావరిన్ రేటింగ్ పెంపు చేయాలని ఈ సందర్భంగా మూడీస్ ప్రతినిధులకు భారత్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నుంచి ఎకానమీ వేగంగా రికవరీ చెందుతోందని మూడీస్ ప్రతినిధులకు వివరించే అవకాశం ఉంది. సంస్కరణలను, రికవరీ వేగవంతానికి ఆయా సంస్కరణలు ఇస్తున్న తోడ్పాటు వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చే వీలుంది. దేశం 2021–22 బడ్జెట్ తీరు, ద్రవ్యలోటు, రుణ పరిస్థితులు కూడా సమావేశంలో చోటుచేసుకోనున్నాయి. ప్రతియేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. వచ్చే వారం సమావేశం కూడా ఈ తరహాలో జరుగుతున్నదేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది నెలల క్రితం మరో రేటింగ్ దిగ్గజం– ఫిచ్‌తో కూడా ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం ‘బీఏఏ3’ రేటింగ్... 13 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. ‘బీఏఏ3’ జంక్ (చెత్త) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. రేటింగ్ దిగ్గజ సంస్థలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తున్నాయి. భారత్ దీనిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను పెట్టుబడిదారులు తీసుకుంటారు. -
‘మోదీ సత్తా తెలిపిన మూడీస్’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థను సత్వర వృద్ధి దిశగా నడిపిస్తామని సీఐఐ 125వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొంటే ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం నీరుగార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్ధను ప్రధాని నరేంద్ర మోదీ నడినిస్తున్న తీరు తీసికట్టుగా ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పెదవివిరిచిందని రాహుల్ ప్రస్తావించారు. పేదలకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి సాయం లేకపోవడంతో మున్ముందు విపత్కర పరిస్ధితులు నెలకొంటాయని రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. చదవండి : ఆ బాలికపై దాడి అమానుషం : రాహుల్ -
వచ్చే ఏడాదీ వడ్డీరేట్లు పైపైకే!
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఏడాదీ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ మంగళవారం పేర్కొంది. దేశం 2019లో వృద్ధి బాటనే పయనించినా, ఆర్థికంగా కొంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనక తప్పదని విశ్లేషించింది. కఠిన ఆర్థిక ద్రవ్య విధానాల బాటన దేశం కొనసాగుతుందని పేర్కొన్న మూడీస్, రాజకీయ ఇబ్బదులు, ఆర్థిక, ద్రవ్య సంస్కరణలపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ‘2018–19 ఆర్థిక సంవత్సరం– అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి’పై విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ భారత్, ఇండోనేషియా వంటి వర్ధమాన దేశాలకు దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు ఉన్నాయి. అయితే సమీప భవిష్యత్తులో భారత్, ఇండోనేషియాలు వృద్ధి బాటనే కొనసాగుతాయి. ఇక భారత్, ఇండోనేషియా, టర్కీ, అర్జెంటీనా వంటి దేశాల్లో వడ్డీరేట్ల పెంపు విధానాలు కొనసాగుతాయి. ♦ క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ ఒత్తిళ్లను అధిగమిస్తూ, 2018, 2019ల్లో భారత ఆర్థిక వృద్ధి దాదాపు 7.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. జనవరి–మార్చి త్రైమాసికంలో 7.7 శాతం వృద్ధి సాధించిన భారత్ ఆర్థిక వ్యవస్థ, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రెండేళ్ల గరిష్టస్థాయి 8.2 శాతం స్థాయిని చూసింది. ♦ 2019లో ‘గ్లోబల్ సావరిన్ క్రెడిట్వర్తీనెస్’ అవుట్‌లుక్ ‘స్థిరం’గా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దేశీయ పరిస్థితులు బాగుండకపోవడం, బౌగోళిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వృద్ధి కొనసాగుతున్న ప్రయోజనం వల్ల ‘సమతౌల్యత’ పాటిస్తూ, ‘స్థిర’ అవుట్‌లుక్ ఇవ్వడం జరిగింది. ♦ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై అనిశ్చితి ఉంది. అలాగే వృద్ధి మందగమనంలోనే కొనసాగే వీలుంది. ♦ జీ–20 దేశాల వృద్ధి 2018లో 3.3 శాతం ఉంటే, 2019లో 2.9 శాతంగానే నమోదవచ్చు. ఈ దేశాల్లో ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి ఇదే కాలంలో 5 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గుతుంది. ♦ అధిక రుణం, వృద్ధి తగ్గడం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలు అంతర్జాతీయ ద్రవ్య పరిస్థితులకు ఇబ్బందులు సృష్టిస్తాయి. అమెరికా వాణిజ్య రక్షణవాదం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం. -
పెట్రో సుంకం తగ్గిస్తే ద్రవ్యలోటు పైపైకే...
న్యూఢిల్లీ: పెరుగుతున్న ముడిచమురు ధరలతో ఒకపక్క ప్రజల జేబుకు చిల్లు పడుతుంటే.. మరోపక్క ప్రభుత్వం కూడా దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోకుండా, పెట్రోలు, డీజిల్‌పై గనుక ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే.. ద్రవ్యలోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి కొంత ఊరట కల్పించాలంటూ అన్నివైపుల నుంచీ ఒత్తిడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, పెట్రోలు, డీజిల్‌పై ప్రతి రూపాయి సుంకం తగ్గింపుతో ఖజానాకు దాదాపు రూ.13,000 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా. ‘బీఏఏ’ రేటింగ్ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే... ఆర్థిక క్రమశిక్షణ విషయంలో భారత్ చాలా వెనుకబడిందని మూడీస్ పేర్కొంది. వ్యయాలను తగ్గించుకుంటేనే... ‘ఒకవేళ పెట్రో ఉత్పత్తులపై సుంకం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తే... దానికి అనుగుణంగా వ్యయాలను కూడా కట్టడి చేయాల్సి ఉంటుంది. లేదంటే ద్రవ్యలోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది’ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్(సావరీన్ రిస్క్ గ్రూప్) విలియమ్ ఫోస్టర్ వ్యాఖ్యానించారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ భారత్ సావరీన్ రేటింగ్‌ను మూడీస్ గతేడాది పెంచిన(బీఏఏ2, స్థిర అవుట్‌లుక్) సంగతి తెలిసిందే. -
మోదీ సర్కార్‌కు మూడీస్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపు, సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ 2018లో భారత వృద్ధి రేటు అంచనాను 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. భారత్‌లో పెట్టుబడులు, వినియోగం ఊపందుకుంటున్నా పెరుగుతున్న పెట్రో ఉత్పుత్తుల ధరలు, సంక్లిష్ట ఆర్థిక పరిస్థితులు వృద్ధి వేగానికి అవరోధాలుగా ముందుకొస్తాయని మూడీస్ విశ్లేషించింది. 2018 సంవత్సరానికి గతంలో తాము అంచనా వేసిన వృద్ధి రేటు అంచనాను 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గిస్తున్నామని మూడీస్ వెలువరించిన గ్లోబల్ మాక్రో అవుట్‌లుక్ 2018-19 నివేదికలో స్పష్టం చేసింది. అయితే 2019లో భారత వృద్ధి రేటు అంచనా 7.5 శాతంలో ఎలాంటి మార్పూ లేదని పేర్కొంది. గ్రామీణ వినియోగం ఊపందుకోవడం, అధిక కనీస మద్దతు ధరలు, సాధారణ వర్షపాతం వృద్ధి రేటు మెరుగ్గా ఉండేదుకు దోహదపడతాయని, అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలు వృద్ధి జోరుకు కళ్లెం వేస్తాయని మూడీస్ అంచనా వేసింది. ప్రైవేటు పెట్టుబడులు క్రమంగా వృద్ధిబాటపడతాయని, దివాలా చట్టంతో బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. జీఎస్టీకి మారతున్న క్రమంలో వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినా కొద్ది క్వార్టర్లలోనే పరిస్థితి మెరుగవుతుందని అంచనా వేసింది. 2017 తరహాలోనే 2018లోనూ ప్రపంచ వృద్ధి రేటు మెరుగ్గా ఉంటుందని అంచనా వేసింది. -
పీఎన్బీ రేటింగ్ డౌన్‌గ్రేడ్: మూడీస్
ముంబై: కుంభకోణం, భారీ నష్టాలతో సతమతమవుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రేటింగ్‌ను మూడీస్ డౌన్‌గ్రేడ్ చేసింది. లాభదాయకతపై తీవ్ర ప్రతికూల ప్రభావాల కారణంగా బీఏ/ఎన్పీ రేటింగ్ నుంచి బీఏఏ3/పీ–3కి డౌన్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొంది. ఇతరత్రా వనరుల మద్దతు లేకుండా నిలదొక్కుకోగలిగే సామర్థ్యానికి సంబంధించిన బేస్‌లైన్ క్రెడిట్ అసెస్మెంట్ను (బీసీఏ) కూడా తగ్గించింది. అయితే, అవుట్‌లుక్ మాత్రం స్థిరంగానే కొనసాగిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి బాసెల్ నిబంధనలకు తగ్గట్లుగా కనీస మూలధనం ఉండాలన్నా... పీఎన్బీ బయటి నుంచి సుమారు రూ. 12,000–13,000 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నుంచి కొంత మొత్తం లభించడంతో పాటు ఇతరత్రా రియల్టీ ఆస్తులు, అనుబంధ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో పాక్షికంగా వాటాలను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్నా.. స్కామ్ బైటపడక పూర్వం ఉన్న స్థాయికి మూలధనం పెరగకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. -
స్కాం సెగ: పీఎన్బీ మూడీస్ రేటింగ్ డౌన్
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌నకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సెగ మరో రూపంలో తాకింది. ఊహించినట్టుగానే బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాం నేపథ్యంలో రేటింగ్ సంస్థ పీఎన్బీకి గట్టి షాక్ ఇచ్చింది. రూ.11,400 కోట్ల భారీ కుంభకోణం.. పీఎన్బీ అంతర్గత రిస్కు మేనేజ్మెంట్ వ్యవస్థ, నియంత్రణ సంస్థ పర్యవేక్షణపై సందేహాలు నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఈ నిర్ణయం తీసుకుంది. రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ల సర్వీసెస్ పీఎన్బీ రేటింగ్‌ను భారీగా తగ్గించింది. బ్యాంకు మూలధనంపై మోదీ కుంభకోణం ప్రభావం ప్రతికూలంగా ఉండనుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే లోకల్, విదేశీ కరెన్సీ డిపాజిట్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్ చేసింది. దీన్ని బీఏ1కు డౌన్‌గ్రేడ్ చేసింది. అలాగే బ్యాంకు ఎన్‌పీని బీఏఏ 3 నుంచి పీ-3కి తగ్గించింది. అంతేకాదు బ్యాంకు క్రెడిట్ అంచనా (బీసీఏ) ను తగ్గించింది. బీసీఏ బీఏ 3నుంచి బీ 1 కు తగ్గించామని మూడీస్ ఒక ప్రకటనలో తెలిపింది. -
భారత వృద్ధి 7.6 శాతం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత్ వృద్ధి రేటును 2018 సంవత్సరానికి 7.6 శాతంగా అంచనా వేసింది. 2016 నాటి డీమోనిటైజేషన్, 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రతికూల ప్రభావాల నుంచి కోలుకుంటుందని చెప్పటానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది. 2018 సంవత్సరానికి సంబంధించిన వృద్ధి అంచనాలను మార్పు చేయకుండా గతంలో వెల్లడించిన మేరకు 7.6 శాతం నమోదవుతుందని స్పష్టంచేసింది. 2019లో 7.5 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రముఖ వర్ధమాన దేశాల్లో భారత్, ఇండోనేషియా దేశాల వృద్ధి అంచనాలను మాత్రమే మార్పు చేయడం లేదని పేర్కొంది. అంతర్జాతీయంగానూ వృద్ధి మెరుగే 2018, 2019 సంవత్సరాలకు సంబంధించి అంతర్జాతీయ వృద్ధి అంచనాలను సైతం మూడీస్ పెంచింది. అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, దక్షిణ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. -
స్కాం అనంతరం పీఎన్బీకి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రభుత్వ రంగ రెండో అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు మరో షాక్ ఎదురైంది. రూ.11,400 కోట్ల కుంభకోణ నేపథ్యంలో పీఎన్బీ రేటింగ్‌ను నెగిటివ్‌లోకి మారుస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్, రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్టు మరో ఏజెన్సీ మూడీస్ ప్రకటించాయి. బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం పీఎన్బీలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల డైమాండ్ కింగ్ నీరవ్‌మోదీ ఈ మోసానికి పాల్పడ్డారు. అంతర్గతంగా, బహిర్గతంగా బ్యాంకు రిస్క్ కంట్రోల్స్‌పై ఈ మోసం పలు అనుమానాలకు తావిస్తుందని, గత కొన్నేళ్లుగా ఈ కుంభకోణం జరుగుతున్నప్పటికీ, ఎవరూ గుర్తించకపోవడం నిర్వహణ పర్యవేక్షణ నాణ్యతా లోపాన్ని ఎత్తిచూపుతుందని ఫిచ్ తెలిపింది. పీఎన్బీకి ప్రతికూల పరిశీలనలో 'బీబీ' వైబిలిటీ రేటింగ్‌ను ఇస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. వైబిలిటీ రేటింగ్ ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్ క్రెడిట్ విలువను అంచనావేస్తుందని, ఇది సంస్థ విఫలమైనట్టు సూచిస్తుందని ఫిచ్ తెలిపింది. రేటింగ్ డౌన్‌గ్రేడ్‌లో ఉంచుతున్నట్టు తెలిపిన మూడీస్ కూడా... మోసపూరిత లావాదేవీలు చూపుతున్న ఆర్థిక ప్రభావం, బ్యాంకు క్యాపిటలైజేషన్ ప్రొఫైల్ మెరుగుపరచడానికి మేనేజ్మెంట్ తీసుకుంటున్న చర్యలు, బ్యాంకుపై రెగ్యులేటరీ తీసుకునే చర్యలు వంటి వాటిపై ఫోకస్ చేసినట్టు పేర్కొంది. ఈ మోసపూరిత లావాదేవీల ఫలితంగా బ్యాంకు లాభాలు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాయని ఏజెన్సీ తెలిపింది. అయితే అసలైన ప్రభావం సమయం, అవసరాలకు అనుగుణంగా వుంటుందని ఏజెన్సీ చెప్పింది. బ్యాంకు బేస్‌లైన్ క్రెడిట్ అసెస్మెంట్(బీసీఏ), అడ్జస్టెడ్ బీసీఏ బీఏ3గా, కౌంటర్పార్టీ రిస్క్ అసెస్మెంట్ రేటింగ్ బీఏఏ3(సీఆర్)/పీ-3(సీఆర్)ను డౌన్‌గ్రేడ్ రివ్యూలో ఉంచుతున్నట్టు మూడీస్ తెలిపింది. -
ఇకపై ‘చౌక గృహ’ రుణాల భారం!
ముంబై: చౌక గృహ నిర్మాణాలు, వీటికి రుణాలు సంబంధిత అంశాలకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో... ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్, ఆ సంస్థ దేశీయ అనుబంధ సంస్థ ఇక్రాలు తాజాగా ఈ ధోరణికి ‘రెడ్ ఫ్లాగ్’ ఊపాయి. చౌక గృహ రుణాలే బ్యాంకులకు తదుపరి ముప్పుగా వాటిల్లే అవకాశం ఉందని మూడీస్–ఇక్రా తాజా నివేదిక అంచనా వేసింది. ఈ విభాగంలో కొన్ని ప్రతికూల అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని, ఇవే అంశాలు 2018లోనూ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ♦ చౌక గృహ నిర్మాణ రుణ మంజూరీలో నెలకొన్న పోటీ– రుణ ప్రమాణాలు తగ్గిపోవడానికి కారణమవుతోంది. ఇక స్వయం ఉపాధిలో ఉన్న వారికి చౌక గృహ రుణ సదుపాయం వల్ల బకాయిల పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ♦ సాంప్రదాయక గృహ విభాగంలో రుణనాణ్యత స్థిరంగా కొనసాగేవీలుంది. అయితే చౌక గృహరుణ విభాగంలో మాత్రం ఇందుకు సంబంధించి కొంత ఆందోళన పరిస్థితి కొనసాగవచ్చని ఇక్రా హెడ్ (స్ట్రక్చర్డ్ ఫైనాన్సెస్) మిట్టల్ పేర్కొన్నారు. ♦ చౌక గృహ రుణ విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు 2017 సెప్టెంబర్ నాటికి 1.8 శాతానికి చేరాయి. సాంప్రదాయక గృహ రుణ విభాగంతో పోల్చిచూస్తే 90 రోజులు పైబడిన రుణ బకాయిల సగటు స్థాయి చౌక గృహ రుణాల విషయంలో దాదాపు ఏడు రెట్లు అధికంగా ఉంది. ♦ 2020 నాటికి అందరికీ గృహం లక్ష్యం నెరవేరాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం, ఇందుకు సంబంధించి చౌక గృహ నిర్మాణ రంగంలో భారీ ప్రోత్సాహకాలు, దీని ప్రాధాన్యతా విభాగంగా బ్యాంకింగ్ పరిగణించడం, వడ్డీ రాయితీలు, ప్రత్యక్ష నగదు సబ్సిడీ వంటి అంశాలను నివేదిక ప్రస్తావిస్తూ, రుణ నాణ్య తాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది. ♦ అయితే మొత్తంగా హౌసింగ్ రుణ విభాగం రిటైల్ రుణాలకు సంబంధించి అత్యుత్తమమైనదిగా కొనసాగుతోంది. రుణ హామీలు పటిష్టంగా ఉండడం, రుణం తీసుకునే వ్యక్తి సొంత ఆస్తిగా రుణ హామీ ఉండడం, ఆస్తి ధరల్లో భారీ తగ్గుదల లేకపోవడం, రుణానికి తగిన ఆస్తి విలువల వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావనార్హం. ♦ ఇక 2017 జూలై ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అంతక్రితం డీమోనిటైజేషన్ చిన్న తరహా పరిశ్రమలపై భారాన్ని మోపాయని ఇక్రా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రస్తోగీ పేర్కొన్నారు. -
తమ్ముడు ఆస్తులు కొనుగోలు : రేటింగ్‌పై ప్రభావమెంత?
తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తుల కొనుగోలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపదని గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. రూ.25వేల కోట్ల కంటే తక్కువకే జరిగే ఈ డీల్, రిలయన్స్ రేటింగ్‌ను పెంచదని పేర్కొంది. ఇప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద నగదు, నగదుతో సమానమైనవి రూ.77వేల కోట్ల వరకు ఉన్నాయని, ఈ ఫండ్లను వాడుతూ ఈ కొనుగోలు చేపడుతుందని గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్, వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలాన్ చెప్పారు. ప్రస్తుతం స్టేబుల్ అవుట్‌లుక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్ 'బీఏఏ2'గా కొనసాగుతోందని తెలిపారు. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్ రేటింగ్‌ను గత నవంబర్‌లో మూడీస్ ఉపసంహరించింది. కంపెనీ డాలర్ బాండ్హోల్డర్స్కు చెల్లింపులు చేయడంలో ఆలస్యం చేసిన కారణంగా రేటింగ్‌ను ఉపసంహరించినట్టు తెలిపింది. ఆర్‌కామ్‌కు చెందిన టవర్లు, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్స్, స్పెక్ట్రమ్, మీడియా కన్వర్జెన్సీ నోడ్స్ వంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ముందుకొచ్చింది. దీని కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.25వేల కోట్ల కంటే తక్కువగానే ఖర్చు చేస్తుందని ఏజెన్సీ అంచనావేస్తోంది. అయితే మున్ముందు కొనుగోళ్లను పెంచితే రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్ కింద కంపెనీ పరిపుష్టిని తగ్గిస్తామని, ముఖ్యంగా టెలికాం వ్యాపారాల్లో తను ప్రణాళిక బద్ధమైన మూలధన ఖర్చులను తగ్గించకపోతే, ఈ చర్యలు చేపడతామని ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. ఆర్‌కామ్ ఆస్తులను తాము కొనుగోలు చేయబోతున్నామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మార్చి వరకు ఈ డీల్‌ను ముగించవచ్చని తెలిపింది. ఈ కొనుగోలు, ఆర్‌కామ్‌కు చెందిన టెలికాం మౌలిక సదుపాయాల ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోవడానికి సాయపడుతుందని, అయితే ఆర్‌కామ్ 4జీ స్పెక్ట్రమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రత్యర్థుల చేతుల్లోకి పోదని మూడీస్ తెలిపింది. -
రేటింగుల మత్తులో మోదీ
దేశాల ఆర్థిక ప్రగతి విషయంలో ప్రకటించే మదింపు (రేటింగ్) ప్రమాణాల్ని, అభిప్రాయాల్ని చూసి బయట రుణాలు మంజూరవుతాయన్న గ్యారంటీ లేదని కూడా ఈ ఏజెన్సీలు ప్రకటించాయి. ఎందుకంటే, ఎవరి గుట్టు మట్టులు వారికే ఎరుక. నోట్ల రద్దు చర్యవల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్న మోదీ ఆశ ‘దింపుడుకళ్లం ఆశ’. నోట్ల రద్దుపైన ఖర్చు దీర్ఘకాలంలో వచ్చే లాభాలని మించిపోతుంది కాబట్టి రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రాజన్ వ్యంగ్యంగా ఆ విధంగా వ్యాఖ్యానించాల్సి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు–సేవల పేరిట ప్రత్యక్ష, పరోక్ష పన్నులను మోపడంవల్ల సంఘటిత ఆర్థిక రంగంతో ముడిపడి ఉన్న అసంఘటిత రంగానికి అపారమైన నష్టం వాటిల్లింది. ఫలితంగా ఆర్థికరంగ అభివృద్ధి దెబ్బతిన్నది. నల్లధనం మీద జరుపుతానని మోదీ ప్రభుత్వం చెప్పిన దాడి వెనుకడుగు పట్టి, నోట్ల రద్దు నిర్ణయం కాస్తా, అసంఘటిత ఆర్థిక రంగాన్ని సర్వ విధ్వంసం (కార్పెట్ బాంబింగ్) చేసే దిశగా సాగింది. ఫలితంగా సువిశాల ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు వంటి అసంఘటిత రంగాన్ని, కోట్లాదిమంది భారత ప్రజల జీవితాలకు ఆయువుపట్టయిన రంగాన్ని చావు దెబ్బ తీసింది. భారత శ్రమజీవులలో నూటికి 80–90 శాతం మందికి జీవనాధారం అసంఘటిత రంగమే. మొత్తం దేశ జాతీయోత్పత్తులు 40–50 శాతం ఈ శ్రామికుల భాగస్వామ్యంతోనే జరుగుతాయని మరవరాదు. కానీ మోదీ ఆయన అనుయాయుల మాటలు వింటుంటే అసంఘటిత రంగం పరాన్నభుక్కులతో నిండి ఉందనిపిస్తుంది. ఈ రంగమంతా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ పన్నులు ఎగవేస్తూంటుంది కాబట్టి ఈ అసంఘటిత శ్రామిక వర్గాన్ని పన్నుల పరిధిలోకి లాక్కురావాలి. – సల్మాన్ అనీజ్ సోజ్(9–11–17), ప్రపంచ బ్యాంక్ మాజీ ఉన్నతాధికారి ఇంత బాగోతం నేపథ్యంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఏ ‘అండ’ చూసుకుని ఈరోజు దాకా కూడా నోట్ల రద్దునూ, జీఎస్టీ భారాన్నీ సమర్ధిస్తున్నారు? ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆర్థికాభివృద్ధి రేట్లను ‘సవరించ’డానికి అలవాటుపడిన అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు బతికి ఉన్నంత కాలం అవి పాలకులకు రక్షణకవచాలుగానే ఉంటాయి. ప్రపంచ కార్పొరేట్ వర్గాల ‘ఎత్తు బిడ్డల’మాదిరిగా దేశాల వృద్ధి రేట్ల విషయంలో తిమ్మిని బ్రహ్మిని చేసి చూపడం కూడా ఈ ఏజెన్సీలకు అలవాటే. ఈ అండతోనే నరేంద్ర మోదీ సైబర్ స్పేస్‌కు సంబంధించిన ప్రపంచ సభలో(23–11–17) కొన్ని చిత్రమైన ఆణిముత్యాలను వల్లించారు, ‘సాంకేతిక పరిజ్ఞానాన్నీ, ఈ పరిజ్ఞానం సాయంతో నడుస్తున్న పద్దులను, బయో మెట్రిక్, ఆధార్ సాధనాల సాయంతో నేరుగానే సౌకర్యాలు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వాటి ఫలితంగానే సౌకర్యాల బదలాయింపులో లోటుపాట్లను సరిచేయడం వల్ల సబ్సిడీలలో 10 బిలియన్ డాలర్లు ఆదా అయ్యా’యని ప్రకటించారాయన. కానీ మోదీ ఉపన్యాసం ముగిసిన కొద్దిగంటలకే పేదసాదలకు అందించే రాయితీలకు కోతపెట్టి, 10,15 బడా కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన రూ. 6 లక్షల కోట్ల బకాయిలను రద్దు చేయనున్నట్టు (ఈ నెల 25న) వార్తలు వెలువడినాయి. ఈ సమయంలోనే దూసుకువచ్చాయి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు మూడీస్, స్టాండర్డ్ అండ్ పూర్స్, ఫిట్జ్. ఇవి అమెరికాకు డూడూ బసవన్నలుగా వ్యవహరిస్తూ ఉంటాయి. తమ గుత్త పెట్టుబడివర్గాల పెట్టుబడులను భారతదేశంలోకి మరింతగా గుప్పించడానికి వాతావరణాన్ని సానుకూలం చేశాయి. ఆ మాటల వెనుక... నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేసిన తరువాత జరిపిన తొలి విదేశీ పర్యటన, అక్కడ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి. తన విదేశీ పర్యటనలో భాగంగానే అమెరికా తదితర పెట్టుబడిదారీ దేశాలను సందర్శించి ఆయన ఈ మాటలు అన్నారు. ‘మీరంతా వాస్కోడిగామాలై తరలివచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టమ’ని ఆహ్వానించారాయన. సులభంగా వ్యాపారాలు చేసుకోవడానికి ఇండియా తలుపులు తెరిచి ఉంచుతుందని కూడా భరోసా ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియా అంటే ఇక నుంచి విదేశాల మీద ఆధారపడకుండా భారతదేశంలోనే వస్తూత్పత్తి అంతా జరుగుతుందని భ్రమ కల్పించారు. కానీ ఆచరణలో దాని అర్థం మారిపోయింది. మేక్ ఇన్ ఇండియా అంటే విదేశీ కంపెనీలే ఇండియాలో వస్తూత్పత్తి చేసి పెట్టడమే దాని అర్థంగా మారిపోయింది. వీటి తరువాత మన పాలకుల ఆలోచన ఏ దశకు చేరుకుంది? నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో దేశ జాతీయోత్పత్తి కాస్తా రెండు శాతానికి పడిపోయింది. కోట్ల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు. పరపతి వినియోగం గత 65 ఏళ్లుగా ఎన్నడూ లేనంత స్థాయికి దిగజారింది. సరుకుల ఉత్పత్తి కునారిల్లింది. వాణిజ్య లోటు పెరిగింది. దేశంలో ఇన్ని విష పరిణామాలు జరుగుతుండగా పైన పేర్కొన్న రేటింగ్ ఏజెన్సీల ప్రకటనలు ఏ ప్రలోభమూ లేకుండా వచ్చాయని ఎలా నమ్మేది? ఆంగ్లో, అమెరికన్ గుత్త పెట్టుబడులు అనుకున్న స్థాయిలో భారతదేశంలోకి ప్రవేశించేం దుకు ఇంతకు ముందులేని రేటింగ్‌ను ఈ సంస్థలు పెంచుతూ ఉంటాయి. లేదా తగ్గిస్తూ ఉంటాయి. ఇంకా సిగ్గుచేటైన విషయం కూడా ఉంది. అమెరికాలోని గుత్త సంస్థ లెహ్మాన్ బ్రదర్స్ దారుణంగా పతనమైంది. అక్కడితో ఆగలేదు. అది 2008 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభానికి దోహదం చేసింది. నాటి అమెరికా సంక్షోభ ఛాయలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం చూపాయన్న విషయాన్ని మరచిపోకూడదు. పరస్పర విరుద్ధ రేటింగ్‌లు అమెరికా ప్రజలలో భ్రమలు కల్పించడం ద్వారా, సానుకూలమైనప్పుడు పతనమయ్యే సంస్థలకు కూడా రేటింగ్స్ పెంచడమూ, ప్రతికూలత ఉంటే కోత పెట్టడమూ ఆ మూడు రేటింగ్ సంస్థలకూ (మూడీస్, స్టాండర్డ్ అండ్ పూర్స్, ఫిట్జ్) కూసువిద్యేనని గ్రహించాలి. ప్రభుత్వ అధికారులతో సమావేశాల తర్వాతనే ‘మూడీస్’ మన ఆర్థిక ప్రగతి రేటింగ్‌ను నవంబర్ రెండో వారంలో ఆకస్మికంగా పెంచింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ కూడా రంగంలోకి దిగి, మోదీ ఆర్థిక రంగ సంస్కరణలకు అనుకూలత ప్రకటించింది. అయినా పెట్టుబడులు పెట్టడానికి నేడున్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను మదింపు వేయడంలో అత్యంత అథమ స్థాయి రేటింగ్‌ను (బీబీబీ) మాత్రం పెంచడానికి అది నిరాకరించడం గమనార్హం. ఈ రేటింగ్స్‌ను ఎలా నమ్మగలం? కాబట్టి ఇలాంటి పాక్షిక దృష్టితో, స్వలాభాపేక్షే ధ్యేయంగా బడుగు దేశాల ఆర్థిక వ్యవస్థలను మదింపు చేసే అంతర్జాతీయ పెట్టుబడి రేటింగ్ ఏజెన్సీలను ఎలా నమ్మగలం? ఈ విషయంలో జరిగిన పెద్ద నాటకాన్ని ‘ది హిందూ’ నివేదిక (23.11.17) బయట పెట్టింది: ‘గత 20 ఏళ్లుగా ఇటు భారత ప్రభుత్వమూ, అటు మూడీస్ ఏజెన్సీ ఈ రేటింగ్స్ నిర్ణయించే అంశం మీద సిగపట్లు పడుతున్నాయి. కానీ గత 13 ఏళ్లలో మూడీస్ భారత ఆర్థిక ప్రగతి రేటును అనుకూలంగా పెంచి చూపడం ఇదే మొదటిసారి’. అది కూడా ఎప్పుడు? మన ఆర్థిక రంగం బీజేపీ పాలనా పద్ధతులవల్ల నిలకడను కోల్పోతున్న దశలో, ముఖ్యంగా నోట్ల రద్దు, భారీ ప్రత్యక్ష పన్నులకు దారి తీసిన జీఎస్టీ వ్యవస్థ మూలంగా! ఈ సందర్భంగా, ఈ ‘రేటింగ్ ఏజెన్సీలను మీరు ఎందుకు నమ్మకూడదు’ అని సుప్రసిద్ధ విశ్లేషకుడు రియాన్ సి. ఫర్మాన్ (5.10.17) ఒక అంచనా ఇచ్చారు: ‘ఈ రేటింగ్ ఏజెన్సీలు కార్పొరేషన్లకూ, ప్రభుత్వ సంస్థలకూ అనుకూలంగా ఇచ్చే రేటింగ్స్ పైన ఒకటి కాదు, తీవ్రమైన ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శ ఈమధ్య కాలంలో మరింత పెరిగింది. పైగా ఇటీవల సంవత్సరాలలో ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ రేటింగ్ ఏజెన్సీ అమెరికా వృద్ధి రేటును అత్యున్నత రేటింగ్ స్థాయి నుంచి దిగజార్చిన తర్వాత విమర్శ మరింత పెరిగింది’ అని రాశాడు. అంతేకాదు, రేటింగ్ ఏజెన్సీల మదింపు పద్ధతిని పెట్టుబడులు పెట్టే సంస్థలు నమ్మరాదని మరొక వాదన. ఎందుకంటే పెట్టుబడిదారులు రేటిం గ్స్‌ను తమకు అనుకూలంగా తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని విమర్శకుల విశ్వాసం. ఇందుకు ఉదాహరణగా ప్రపంచస్థాయి ఇంధన పారిశ్రామిక సంస్థ ‘ఎన్రాన్’ను పేర్కొంటారు. అది భారీ రుణగ్రస్థ సంస్థగా మారి దివాలా ఎత్తింది. మరో గమ్మత్తు లేదా మోసం ఏమంటే– తాము దేశాల ఆర్థిక ప్రగతి విషయంలో ప్రకటించే మదింపు (రేటింగ్) ప్రమాణాల్ని, అభిప్రాయాల్ని చూసి బయట రుణాలు మంజూరవుతాయన్న గ్యారంటీ లేదని కూడా ఈ రేటింగ్ ఏజెన్సీలు ప్రకటించాయి. ఎందుకంటే, ఎవరి గుట్టు మట్టులు వారికే ఎరుక. నోట్ల రద్దు చర్యవల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్న మోదీ ఆశ ‘దింపుడుకళ్లం ఆశ’. నోట్ల రద్దుపైన ఖర్చు దీర్ఘకాలంలో వచ్చే లాభాలని మించిపోతుంది కాబట్టి రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రాజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాల్సి వచ్చింది. గుప్తధనం... అంతే సంగతులు అన్నట్టు, స్విస్ బ్యాంక్‌లోని వందలాదిమంది భారత కుబేర వర్గాల ఖాతాలు గానీ, పనామా పేపర్స్, ప్యారడైజ్ పేపర్స్‌లో దాక్కున్న గుప్తధనాన్ని గానీ మోదీ ప్రభుత్వం రాబట్టగలదన్న విశ్వాసమూ భారత ప్రజలకు లేదు. ఎందుకని? అటు మాజీ కాంగ్రెస్ పాలకులుగానీ, ఇటు నేటి బీజేపీ పాలకులుగానీ, కుబేర వర్గాలుగానీ ఇంటా బయటా గుట్టుగా దాచుకుని పొదుగుతున్న నల్లధనాన్ని స్వచ్ఛందంగా ప్రజలపరం చేస్తారని కలలోకూడా ఊహించరాదు. ఎక్కడో ఖండాంతరాలలో ఉన్న ‘దేశవాళీ పెద్దల’ గుప్తధనం మాట అటుంచి, కనీసం దేశీయ బ్యాంకులకు బడా కార్పొరేట్లు చెల్లించకుండా ఎగ్గొట్టిన రూ. 9.24 లక్షల కోట్లను వసూలు చేసుకుని బ్యాంకులకు తిరిగి జమకట్టగల దమ్ములున్న నాయకుల కోసం దేశ ప్రజలింకా ఎదురుచూడవలసే ఉంది. ట్రంప్‌తోనూ నానా ‘కంపు’తోనూ చెట్టపట్టాలు కట్టే నాయకులున్నంతకాలం, అందుకోసం ఇరుగుపొరుగు దేశాలతో మైత్రీ సంబంధాల ద్వారా పటుతరమైన వర్తక, వాణిజ్య వార«థులు నిర్మించుకోనంత కాలం, శాంతియుత సహజీవనాన్ని, సెక్యులర్ వ్యవస్థ పటిష్టతను కాపాడుకోనంతవరకూ– ఈ రాజ్యం అంబానీలదీ, ‘ఆదానీ’లదీ, అమెరికన్ వలస సామ్రాజ్య పాలకుల రేటింగ్ వ్యవస్థలదిగానే ఉండిపోతుంది! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రభుత్వ బ్యాంక్‌ల నిధుల వేట..
బ్యాంక్‌లకు కలసివచ్చే కాలం అంటే మొత్తం మొండి బకాయిలు వసూళ్లైనట్లేనని విశ్లేషకులు అంటూ వుంటారు. ఆ స్థాయి లో కాకపోయినా, ఇప్పుడు బ్యాంక్‌లకు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కొంచెం కాలం కలసివస్తోందని చెప్పవచ్చు. మొండి బకాయిలతో కుదేలవుతున్న బ్యాంక్‌లను గట్టెక్కించడానికి ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా 2.11 లక్షల కోట్ల మేర మూలధన నిధులు అందించనున్నామని ప్రకటించింది. ఇక తాజాగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. దీంతో బ్యాంక్ షేర్లపై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌లు స్టాక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌తో ఇన్వెస్టర్ల ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిన నేపథ్యంలో వివిధ బ్యాంక్‌లు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్(క్విప్) ద్వారా నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. రూ.13,500 కోట్ల నిధులు.. ప్రభుత్వం రూ.2.11 లక్షల కోట్ల మూలధన నిధుల ప్రణాళికను వెల్లడించిన తర్వాత బ్యాంక్‌లు కూడా క్విప్ విధానంలో నిధులు సమీకరిస్తామని వెల్లడించాయి. గత నాలుగేళ్లలో క్విప్ విధానంలో రూ.8,419 కోట్లు మాత్రమే బ్యాంక్‌లు సమీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు క్విప్ విధానంలో రూ.16,000 కోట్లు సమీకరించాయి. వీటిల్లో ఒక్క ఎస్బీఐ వాటానే రూ.15,000 కోట్లుగా ఉంది. ఇప్పుడు మరిన్ని బ్యాంక్‌లు ఈ బాట పడుతున్నాయి. గత నెల 24 నుంచి బ్యాంక్‌లు వెల్లడించిన ప్రకటనలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.13,500 కోట్ల మేర నిధుల సమీకరణకు బ్యాంక్‌లు సిద్ధమవుతున్నాయని అర్థమవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా.. రూ.6,000 కోట్లు తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా.. క్విప్ ద్వారా గానీ, రైట్స్ ఇష్యూ ద్వారా గానీ రూ.6,000 కోట్లు సమీకరించనున్నామని పేర్కొంది. ఇక యూనియన్ బ్యాంక్ రూ.2,000 కోట్ల నిధుల సమీకరణ కోసం ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్, లండన్, న్యూయార్క్‌ల్లో రోడ్‌షోలు మొదలు పెట్టేసింది. క్విప్ విధానంలో రూ.5,000కోట్ల సమీకరణ కోసం తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఈ వారం మొదట్లోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ సునీల్ మెహతా చెప్పారు. మరికొన్ని నెలల్లో ఈ నిధుల సమీకరణ కోసం మార్కెట్‌కు వస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.500 కోట్లు సమీకరించనున్నామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్‌ల ధీమా.. మొత్తం రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్రణాళికలో భాగంగా రూ.1.35 లక్షల కోట్లను రీక్యాపిటలైజేషన్ బాండ్ల ద్వారా బ్యాంక్‌లకు అందిస్తారు. బడ్జెట్ కేటాయింపులు, మార్కెట్ల నుంచి సమీకరించడం ద్వారా మిగిలిన రూ.76,000 కోట్లు వస్తాయి. అయితే మార్కెట్ ద్వారా ముఖ్యంగా క్విప్ ద్వారా నిధులు సమీకరించే విషయంలో బ్యాంక్‌లు ధీమాగా ఉన్నాయి. రూ.2,000 కోట్లు ఎల్ఐసీ వంటి సంస్థలపై ఆధారపడకుండానే పూర్తిగా ఇతర ఇన్వెస్టర్ల నుంచే సమీకరించగలమని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లలో ముఖ్యంగా సింగపూర్ ఇన్వెస్టర్లలో తమ క్విప్పై మంచి ఆసక్తి ఉందని బ్యాంక్ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. కాగా బ్యాంక్‌లకు మూలధన నిధులందించాలని ప్రభుత్వం నిర్ణయించడం, మూడీస్ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం అతి పెద్ద సానుకూలాంశమని ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు రాజీవ్ వర్మ వ్యాఖ్యానించారు. టాప్ 4 బ్యాంక్‌లపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి గతంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక్క స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభ్రజిత్ రాయ్ పేర్కొన్నారు. ప్రభుత్వ రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక కారణంగా పెద్ద బ్యాంక్‌లకు భారీగా ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న ఇతర బ్యాంక్‌ల (బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి) పట్ల కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. క్విప్ అంటే.. క్విప్ (క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్)..నిధులు సమీకరించడానికి ఇదొక మార్గం. దీనిద్వారా ఏదైనా లిస్టెడ్ కంపెనీ ఈక్విటీ షేర్లు/ పూర్తిగా లేదా పాక్షికంగా ఈక్విటీగా మార్చుకునే డిబెంచర్లు/వారంట్లు మినహా ఈక్విటీ షేర్లుగా మార్చుకునే ఏ ఇతర సెక్యూరిటీలనైనా జారీ చేయడం ద్వారా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)ల ద్వారా నిధులు సమీకరిస్తుంది. సెబీ వద్ద నమోదైన విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ వంటి బీమా కంపెనీలు, కనీసం రూ.25 కోట్ల మూలధనం ఉన్న పెన్షన్ ఫండ్స్.. తదితర సంస్థలు/వ్యక్తులను క్విబ్లుగా వ్యవహరిస్తారు. బ్యాంక్‌ల క్విప్ బాట బ్యాంక్ మొత్తం (రూ.కోట్లలో) బ్యాంక్ ఆఫ్ బరోడా 6,000 యూనియన్ బ్యాంక్ 2,000 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,000 బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 -
మూడీస్‌తో మోదీకి ఒరిగేదేంటి..?
సాక్షి,న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంపై మోదీ సర్కార్, బీజేపీ సంబరాల్లో మునిగితేలాయి. అయితే మూడీస్ రేటింగ్ మార్పు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందా..? గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి కలిసివస్తుందా..? అనే కోణంలో నిపుణుల మాట భిన్నంగా ఉంది. మూడీస్ రేటింగ్ సవరణ చిన్న అంశమని, దీనికి ఓటర్లు,ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేదన్నది వారి అంచనాగా ముందుకొస్తోంది. మూడీస్ చర్య అటు కార్పొరేట్లకూ, ఇటు ఆర్థిక వృద్ధికీ దీర్ఘకాలంలో ఉపకరించేంది కాదనే విశ్లేషణలు సాగుతున్నాయి. భారత రేటింగ్ అప్‌గ్రేడ్‌తో కంపెనీలకు రుణ పరపతి కొంత మేర పెరిగి మార్కెట్లకు స్వల్పకాలంలో ఊతమిచ్చే చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది దీర్ఘకాలంలో దేశానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పనికొస్తుందనే దానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో మూడీస్ ఏ ప్రాతిపదికన రేటింగ్ అప్‌గ్రేడ్ చేసిందనే చర్చకు తెరలేచింది. అయితే స్వల్ప కాలిక ప్రభావాలను రేటింగ్ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకోవని నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న రుణ భారాన్ని సమర్థంగా మోదీ సర్కార్ ఎదుర్కోగలదనే విశ్వాసం మూడీస్ కనబరచడం మరో విశేషాంశంగా చెబుతున్నారు. సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేయడం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన కేటాయింపులు పెంచి రుణ వితరణకు ఊతం కల్పించడం, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల పెంపు వంటి కేంద్ర నిర్ణయాలు కొంత మేర రేటింగ్ ఏజెన్సీని ప్రభావితం చేశాయని నిపుణులు చెబుతున్నారు. అన్నీ బాగున్నా... భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నా మోదీ ఎన్నికల వాగ్ధానాల్లో ప్రధానమైన ఉపాథి కల్పన దిశగా ఇప్పటికీ అడుగులు పడలేదు. అవసరమైన నైపుణ్యాలతో కూడిన సిబ్బంది కంపెనీలకు అందుబాటులో లేదు. ఏటా లక్షలాది గ్రాడ్యుయేట్లు జాబ్ మార్కెట్లోకి వస్తున్నా నైపుణ్యాల లేమితో కొలువులు దక్కే పరిస్థితి లేదు. ప్రభుత్వ శాఖలన్నింటిలో అవినీతిని నియంత్రించే వ్యవస్థ సమర్థంగా లేకపోవడంతో పాటు పాలనా సంస్కరణలు కొరవడ్డాయి. భారీ మౌలిక ప్రాజెక్టులు పట్టాలెక్కి దశాబ్దాలు గడుస్తున్నా పూర్తికాని పరిస్థితి. రద్దుల పద్దు.. బ్యాంకుల మొండిబకాయిలు రూ పదిలక్షల కోట్లు దాటి పరుగులు పెడుతున్నా రికవరీ ఆశించిన మేర సాగడం లేదు. దివాలా చట్టాలకు పదును పెట్టినా రుణ వసూళ్లు మందకొడిగానే ఉన్నాయి. జీఎస్టీ, నోట్ల రద్దుతో చిన్న పరిశ్రమలు మూత పడి ఉపాథి రంగం దెబ్బతింది. ఇన్ని ప్రతికూలతలున్నా సంస్కరణల వేగం, ప్రభుత్వ సానుకూల ధోరణితో మూడీస్ రేటింగ్ మెరుగుదలకు మొగ్గుచూపింది. పటిష్ట ఆర్థిక వృద్ధి దిశగా మూడీస్ నిర్ణయం స్వాగతించదగినదే అయినా అసమానతలు,అవినీతిని రూపుమాపే దూకుడు చర్యలతో ముందుకెళ్లకుంటే మున్ముందు అధిక వృద్ధి అసాధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
అంబానీకి మూడీస్ షాక్
ముంబై : రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీకి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ షాకిచ్చింది. రిలయన్స్ కమ్యూనికేషన్ క్రెడిట్ రేటింగ్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు మూడీస్ శుక్రవారం ప్రకటించింది. తన బాండ్లపై వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ఈ టెలికాం ఆపరేటర్ డిఫాల్ట్ అయిందనే కారణంతో మూడీస్ క్రెడిట్ రేటింగ్‌ను విత్‌డ్రా చేసింది. ''రిలయన్స్ కమ్యూనికేషన్స్ కా కార్పొరేట్ రేటింగ్‌ను విత్‌డ్రా చేస్తున్నాం. ఇది ప్రస్తుతం నెగిటివ్ అవుట్‌లుక్‌లో ఉంది. అదేవిధంగా ఆర్‌కామ్ సీనియర్ సెక్యుర్డ్ నోట్స్ కా రేటింగ్‌ను విత్‌డ్రా చేస్తున్నాం'' అని మూడీస్ ప్రకటించింది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ వరుసగా నాలుగో క్వార్టర్లోనూ భారీ నష్టాలను నమోదుచేసింది. కొన్ని డెబెంచర్లపై ఈ సంస్థ వడ్డీలు చెల్లించలేకపోతుంది. నిర్దారించిన సమయానికి వడ్డీలను చెల్లించకలేకపోవడంతో రేటింగ్స్‌ను ఉపసంహరిస్తున్నట్టు మూడీస్ తెలిపింది. సరియైన సమయంలో వడ్డీలు చెల్లించకపోవడాన్ని మూడీస్ అర్థంలో డిఫాల్ట్‌గా పరిగణనలోకి తీసుకుంటామని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. మార్చి ముగింపు వరకు ఆర్‌కామ్ నికర అప్పు రూ. 44,300 కోట్లు ఉంది. తన అన్న ముఖేష్ అంబానీ, రిలయన్స్ జియో పేరుతో టెలికాం మార్కెట్లోకి ప్రవేశించడంతో ఆర్‌కామ్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. జియో నుంచి వస్తున్న తీవ్రమైన ధరల యుద్ధాన్ని ఈ సంస్థ తట్టుకోలేకపోతుంది. -
రూపాయికి ‘రేటింగ్’ బూస్ట్!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువకు ‘మూడీస్ రేటింగ్’ బలాన్నిచ్చింది. సాయంత్రం ఐదు గంటలతో ముగిసే ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 31 పైసలు బలపడి 65.01 వద్ద ముగిసింది. గడిచిన వారం రోజుల్లో రూపాయికి ఇదే గరిష్ట స్థాయి. ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో బలపడటం ఆరు వారాల తరువాత ఇదే తొలిసారి. గురువారం రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 65.32. శుక్రవారం ఒక దశలో రూపాయి 64.60 స్థాయిని సైతం చూసింది. ఈ వారం మొత్తంలో రూపాయి విలువ 15 పైసలు బలపడింది. -
ఆలస్యంగా గుర్తించారు
న్యూఢిల్లీ: దేశ సౌర్వభౌమ రేటింగ్‌ను పెంచుతూ మూడీస్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర సర్కారు స్వాగతించింది. ఆలస్యంగా దక్కిన గుర్తింపుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని అభివర్ణించారు. ‘‘మూడీస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గత కొన్నేళ్లుగా తీసుకున్న భారీ ఆర్థిక, సంస్థాగత సంస్కరణలను ఆలస్యంగా గుర్తించినట్టు మేం భావిస్తున్నాం’’ అని జైట్లీ శుక్రవారమిక్కడ మీడియాతో చెప్పారు. జీఎస్టీ, పటిష్టమైన మానిటరీ పాలసీ వ్యవస్థ ఏర్పాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, డీమోనిటైజేషన్, ఆధార్ అనుసంధానం వంటి వాటిని జైట్లీ ఉదహరించారు. గ్రామాల్లో, మౌలిక సదుపాయాలపై అధిక నిధులు వెచ్చించే దిశగా సంస్కరణల అజెండా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మధ్య కాలానికి ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉండాలన్న విధానాన్ని కొనసాగిస్తామన్నారు. 2013–14లో ద్రవ్యలోటు 4.5 శాతంకాగా... 2016–17లో అది 3.5 శాతానికి తగ్గడాన్ని తాజా రేటింగ్ ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు. ‘‘ఇది పూర్తిగా ప్రోత్సాహాన్నిచ్చేది. సంస్కరణలకు అంతర్జాతీయంగా దక్కిన గుర్తింపు. ఇప్పటి వరకు మేం సాధించినదాన్ని కొనసాగించాలన్న ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళుతుంది’’అని జైట్లీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే విదేశీ పెట్టుబడుల రాక సానుకూలంగా ఉండగా, రేటింగ్ మెరుగుపడడంతో అవి కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీలో పన్ను రేట్ల స్థిరీకరణ కొనసాగుతుందని చెప్పారు. దేశ ప్రగతికి గుర్తింపు: మూడిస్ రేటింగ్ పెంపు దేశంలో మెరుగైన పరిపాలన, నిర్ణయాల్లో పారదర్శకత, పెట్టుబడిదారీ అనుకూల విధానాలకు లభించిన గుర్తింపు అని ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభివర్ణించారు. ‘‘ఇది స్వాగతించతగిన పరిణామం. కానీ చాలా ఆలస్యమయింది. జీఎస్టీ, దివాలా చట్టం తదితర సంస్కరణలకు లభించిన గుర్తింపు. ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తుంది’’ అని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు. -
'పరపతి' పైపైకి!
న్యూఢిల్లీ: భారత సర్కారు చేపడుతున్న వరుస సంస్కరణలను అమెరికా రేటింగ్స్ సంస్థ మూడీస్ ఎట్టకేలకు గుర్తించింది. భారత సౌర్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచుతూ మోదీ సర్కారుకు ఊరట కల్పించింది. రేటింగ్ సంస్థలు ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల్ని పట్టించుకోవడం లేదంటూ ప్రధాని మోదీ సహా పలువురు చేసిన విమర్శలకు మూడీస్ తన తాజా నిర్ణయంతో జవాబు ఇచ్చినట్టయింది. భారత్ విషయంలో తన దృక్పథాన్ని సానుకూలం నుంచి స్థిరత్వానికి సవరించింది. ఆర్థిక, సంస్థాగత సంస్కరణల విషయంలో క్రమానుగత పురోగతి వల్ల వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని మూడీస్ పేర్కొంది. పెరిగిపోతున్న రుణ భారాన్ని నిలకడగా ఉంచేందుకు ఈ సంస్కరణలు తోడ్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. జీఎస్టీ అమలు, ద్రవ్యపరపతి విధాన కార్యాచరణ మెరుగుపరచడం, మొండి బకాయిల ప్రక్షాళనకు తీసుకున్న చర్యలను మూడీస్ ప్రస్తావించింది. బీఏఏ2 అంటే పెట్టుబడులకు సంబంధించి మోస్తరు క్రెడిట్ రిస్క్‌కు సూచిక. బీఏఏ3 అంటే పెట్టుబడులకు సంబంధించి అతి తక్కువ గ్రేడ్. చెత్త గ్రేడ్ కంటే ఓ మెట్టు పైన. మూడీస్ చివరిసారిగా 2004లో భారత సౌర్వభౌమ రేటింగ్‌ను సవరించింది. ఆ తర్వాత మార్పు చేయడం మళ్లీ ఇదే. గతేడాది మాత్రం భారత్ పట్ల తన వైఖరిని స్థిరత్వం నుంచి సానుకూలానికి మార్చింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన వ్యాపార సులభతర దేశాల సూచికలో భారత్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపరుచుకుని 100వ స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మూడీస్ భారత రేటింగ్‌ను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. మూడీస్ తాజా నిర్ణయం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని పెంచుతుందని, విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేస్తుందని, కంపెనీలు, కేంద్ర సర్కారు సులభంగా రుణాల్ని సమీకరించుకోగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. రుణ భారం అవరోధమే... భారత రేటింగ్‌ను పెంచు తూ మూడీస్ పలు అంశాలపై వ్యాఖ్యానించింది. ‘‘ఆర్థిక, సంస్థాగత సంస్కరణలతో భారత్‌కు వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇవి ప్రభుత్వ రుణ భారాన్ని మధ్య కాలానికి క్రమంగా తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. భారతదేశ అధిక రుణ భారం ఇప్పటికీ ఆ దేశ క్రెడిట్ ప్రొఫైల్‌కు అవరోధమే. అయితే, ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు రుణభారం వేగంగా పెరిగిపోకుండా అడ్డుకుంటాయి. తగ్గముఖం పట్టేందుకూ అవకాశం లేకపోలేదు’’ అని మూడీస్ పేర్కొంది. వచ్చే ఏడాది జీడీపీ 7.5 శాతం దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉండొచ్చని మూడీస్ అంచనా వేసింది. 2016–17లో జీడీపీ 7.1 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. డీమోనిటైజేషన్, జీఎస్టీ స్వల్ప కాలంలో వృద్ధిని అడ్డుకున్నప్పటికీ 2018–19 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ రేటు 7.5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ‘‘చాలా ముఖ్యమైన సంస్కరణలు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు అమలు చేసిన సంస్కరణలు వ్యాపార వాతావరణం మెరుగుపడాలన్న ప్రభుత్వ దృక్పథాన్ని ముందుకు తీసుకెళతాయి. అలాగే, ఉత్పాదకతను, దేశ, విదేశీ పెట్టుబడులను పెంచుతాయి. అంతిమంగా బలమైన, స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది’’ అని ఈ అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అకౌంటింగ్ విధానం, లబ్దిదారులకు నేరుగా ప్రయోజనం బదిలీతో వ్యవస్థలో అక్రమాలకు చెక్ పడుతుందని అభిప్రాయపడింది. డీమోనిటైజేషన్, జీఎస్టీ చర్యల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను అధికారికం చేయడం, అవినీతిని తగ్గించడం, పన్ను వసూళ్లను పెంచడం వంటి ప్రభుత్వ నిర్ణయాలు దేశ వ్యవస్థలను బలోపేతం చేస్తాయని పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడులు బలహీనంగా కొనసాగుతూ ఉండటం, జీఎస్టీ అమలు, బ్యాంకింగ్ రంగ ఆస్తుల నాణ్యత మెరుగుపరచడం, కార్మిక, భూ సంస్కరణల్లో పురోగతి లేకపోవడం వంటివి సవాళ్లుగా మూడీస్ పేర్కొంది. పెట్టుబడులకు హితోధికం! మూడీస్ భారత దేశ సౌర్వభౌమ రేటింగ్‌ను పెంచడం ద్వారా ఇటలీ, స్పెయిన్, బల్గేరియా, ఫిలిప్పీన్స్ దేశాల సరసన భారత్‌ను నిలబెట్టింది. చైనాకు మూడు స్థానాల దగ్గరకు చేరుకోగలిగింది. బ్రిక్స్ దేశాల్లో చైనా తర్వాత రెండో స్థానం భారత్‌దే. బీఏఏ2 రేటింగ్ కలిగిన దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని మూడీస్ తెలిపింది. రేటింగ్ పెంపుతో కంపెనీల విస్తరణ ప్రణాళికలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్టాక్స్, బాండ్లు, కరెన్సీ మార్కెట్లలోకి మరిన్ని నిధులు వచ్చిపడతాయి. మూడీస్ నిర్ణయం దరిమిలా మరో రెండు ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా మన రేటింగ్‌ను సవరించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం భారత సౌర్వభౌమ రేటింగ్‌ను ఈ రెండు సంస్థలు కూడా బీబీబీ(మైనస్) గానే కొనసాగిస్తున్నాయి. ఓఎన్జీసీకి టాప్ రేటింగ్ మన దేశానికి చెందిన నాలుగు ఆర్థిక సంస్థలతోపాటు, ప్రభుత్వరంగ కంపెనీల రేటింగ్‌ను మూడీస్ పెంచింది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ల దీర్ఘకాలిక రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు మార్చింది. భారత సార్వభౌమ రేటింగ్‌ను మించి ఓఎన్జీసీ బీఏఏ1 రేటింగ్‌ను దక్కించుకుంది. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీల విదేశీ కరెన్సీ జారీ రేటింగ్‌ను బీఏఏ2కు పెంచింది. అలాగే, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్హెచ్ఏఐ, గెయిల్లకూ ఇదే రేటింగ్ దక్కింది. ఇతర ఏజెన్సీలు ఇదే బాటలో: నీతి ఆయోగ్ మూడీస్ నిర్ణయం దేశ ఆర్థిక వృద్ధిని ప్రతిఫలిస్తోందని, ఇతర ఏజెన్సీలు మూడీస్ బాటలో నడిచి రేట్లను పెంపు చేస్తాయన్న ఆశాభావాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. శుభ పరిణామం ఇది: కార్పొరేట్లు, బ్యాంకర్లు రేటింగ్ పెంపు నిర్ణయాన్ని బ్యాంకర్లు, కార్పొరేట్లు శుభసూచికంగా పేర్కొన్నాయి. రుణ సమీకరణ వ్యయాలను ఇది తగ్గిస్తుందని, విదేశీ నిధుల రాకను పెంచుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది సానుకూలం. ఫైనాన్షియల్ మార్కెట్లకు మేలు చేస్తుంది. బాండ్ల రాబడులు, రూపాయి, స్టాక్ మార్కెట్లు ఇప్పటికే సానుకూలంగా స్పందించాయి. ప్రభుత్వం, ఆర్థిక సంస్థల రుణాల సమీకరణ వ్యయాల్ని తగ్గిస్తుంది. దేశ వృద్ధి, సంస్కరణలపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. – రజనీష్‌కుమార్, ఎస్బీఐ చైర్మన్ మోదీ సర్కారు అమలు చేసిన నిర్మాణాత్మక సంస్కరణలకు తగిన గుర్తింపు ఇది. కేంద్ర ప్రభుత్వానికి, దేశ కార్పొరేట్ రంగానికి ఇది చాలా సానుకూలమైన చర్య. రుణ సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. కార్పొరేట్లకు తక్కువ వ్యయాలకే నిధులు లభిస్తాయి. – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో రేటింగ్ ఏజెన్సీలు విశ్లేషించడానికి సమయం తీసుకుంటుంటాయి. కనుక ఇది ఆలస్యం అయింది. అయితే, రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో న్యాయబద్ధంగా ఉండడం లేదన్నది నా భావన. ఎందుకంటే ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో విప్లవాత్మక, భారీ సంస్కరణలను ప్రభుత్వం అమలు చేసింది. ఈ కోణంలోంచి చూస్తే రేటింగ్ పెంపు ముందే చేయాల్సి ఉం – దీపక్ పరేఖ్, హెచ్డీఎఫ్సీ చైర్మన్ రేటింగ్‌ను బీఏఏ2కు పెంచడం వల్ల విదేశీ నిధులు రాక సహా పెట్టుబడులు పుంజుకుంటాయి. ప్రభుత్వ సంస్కరణలకు ఆమోదం. ఇది ఎప్పుడో చేయాల్సింది. – అజయ్ త్యాగి, సెబీ చైర్మన్ రేటింగ్‌ను పెంపొదించడం, వ్యాపార సులభతర సూచీలో స్థానం మెరుగపడడం అన్నవి మనం సరైన దిశలోనే వెళుతున్నామనేదానికి నిదర్శనం. దేశ వృద్ధి అన్నది ఇంతకుముందు ఎన్నడూ లేనంత ఆశావహంగా ఉందిప్పుడు. – పంకజ్ పటేల్, ఫిక్కి ప్రెసిడెంట్ మూడీస్ చర్య విదేశీ మార్కెట్లో మరింత పోటీ రేట్లకే రుణాల సమీకరణకు వీలు కల్పిస్తుంది. దీంతో దేశీ కంపెనీలు మరిన్ని విదేశీ నిధులను ఆకర్షించగలవు. ఇతర ఏజెన్సీలూ రేటింగ్‌ను పెంచుతాయని భావిస్తున్నాం. – చంద్రజిత్బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ -
మూడీస్ భేష్...ఎస్అండ్పీ పూర్
సాక్షి,న్యూఢిల్లీ: భారత రేటింగ్‌ను మూడీస్ అప్‌గ్రేడ్ చేసిన కొద్దిసేపటికే మరో రేటింగ్ ఏజెన్సీ ప్రతికూలంగా స్పందించింది. భారత ద్రవ్య పరిస్థితి బలహీనంగా ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ) వ్యాఖ్యానించింది. మూడీ రేటింగ్‌పై స్పందించేందుకు ఎస్అండ్పీ నిరాకరించింది.మరోవైపు మూడీస్ భారత రేటింగ్‌ను పెంచడాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా స్వాగతించారు. మోదీ ప్రభుత్వ సంస్కరణలు వాణిజ్య వాతావరణాన్ని మెరుగపరిచి, ఉత్పాదకతను పెంచాయని, ఫలితంగా విదేశీ పెట్టుబడుల వెల్లువతో దేశం వృద్ధి బాటలో పయనిస్తోందని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇటీవల ప్రపంచ బ్యాంక్ సులభతర వాణిజ్యం ర్యాంక్, పీఈడబ్లూ్య అథ్యయనం, తాజాగా మూడీస్ రేటింగ్ నిదర్శనాలని అన్నారు. జీఎస్టీ అమలునూ మూడీస్ ప్రశంసించడాన్ని ఈ సందర్భంగా అమిత్ షా ప్రస్తావించారు. ఇక మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్ మంచి నిర్ణయమని, ఇది ఎప్పుడో వెలువడాల్సిందని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. -
మూడేళ్ల కృషికి దక్కిన ఫలితం
సాక్షి, న్యూడిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గుర్తింపు దక్కడం తమ సంస్కరణలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ వ్యాఖ్యానించారు. మూడీస్ అప్‌గ్రేడ్ అనంతరం కేంద్రమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడీస్ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను స్వాగతించిన జైట్లీ ఈ అప్‌గ్రేడ్ లేట్‌గా ఇచ్చిందన్నారు. అయినా 13సంవతర్సాల తర్వాత ఇండియాకు బీఏఏ 2 ర్యాంక్ అప్ గ్రేడ్ రావడం సంతోషాన్నిస్తోందన్నారు. జీఎస్టీ అమలును ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల అడుగుగా అందరూ గుర్తిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణలో భారతదేశం పురోగమిస్తోంది.ఇక తమ దృష్టి అంతా ఇన్ఫ్రా సంస్కరణలపై ఉండనుందన్నారు. గత మూడేళ్లుగా నిర్మాణ రంగం కీలక రంగంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ మార్గంలో నడుస్తోంది..భారతదేశం సంస్కరణల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తున్న పలువురు ఇప్పుడు వారి అభిప్రాయాలను మార్చుకోవాలన్నారు. మూడు సంవత్సరాల్లో తాము చేపట్టిన సంస్కరణలు వేగవంతమైన పథం పెరుగుదలకు దారితీశాయని.. అయితే మూడీ గుర్తింపు ఆలస్యంగా లభించిందని పేర్కొన్నారు. అలాగే రేటింగ్స్‌కు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని జైట్లీ స్పష్టం చేశారు.