
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌నకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సెగ మరో రూపంలో తాకింది. ఊహించినట్టుగానే బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో రేటింగ్ సంస్థ పీఎన్‌బీకి గట్టి షాక్ ఇచ్చింది. రూ.11,400 కోట్ల భారీ కుంభకోణం.. పీఎన్‌బీ అంతర్గత రిస్కు మేనేజ్‌మెంట్ వ్యవస్థ, నియంత్రణ సంస్థ పర్యవేక్షణపై సందేహాలు నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఈ నిర్ణయం తీసుకుంది.
రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ల సర్వీసెస్ పీఎన్‌బీ రేటింగ్‌ను భారీగా తగ్గించింది. బ్యాంకు మూలధనంపై మోదీ కుంభకోణం ప్రభావం ప్రతికూలంగా ఉండనుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే లోకల్, విదేశీ కరెన్సీ డిపాజిట్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్ చేసింది. దీన్ని బీఏ1కు డౌన్‌గ్రేడ్ చేసింది. అలాగే బ్యాంకు ఎన్‌పీని బీఏఏ 3 నుంచి పీ-3కి తగ్గించింది. అంతేకాదు బ్యాంకు క్రెడిట్ అంచనా (బీసీఏ) ను తగ్గించింది. బీసీఏ బీఏ 3నుంచి బీ 1 కు తగ్గించామని మూడీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment