Nirav Modi
-
మోస్ట్ పాపులర్ హౌస్ కొన్న సోనమ్ కపూర్ జంట
ప్రముఖ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా ఇటీవల ముంబైలోని నీరవ్ మోదీకి చెందిన ఐకానిక్ మ్యూజిక్ స్టోర్ 'రిథమ్ హౌస్'ను కొనుగోలు చేశారు. నీరవ్ మోదీ బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లిచకపోవడంతో దీనిని 2018లో మూసివేశారు. కాగా ఇప్పుడు 478.4 మిలియన్లకు (రూ.47.84 కోట్లు) సోనమ్ కపూర్ దంపతులు సొంతం చేసుకున్నారు.సుమారు 3,600 చదరపు అడుగుల రిథమ్ హౌస్ ఒకప్పుడు ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని నీరవ్ మోదీ నిర్వహణలో ఉండేది. దీనిని కొనుగోలు చేసినట్లు భానే ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తి డీల్ విలువను వెల్లడించలేదు.భానే అనేది షాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్‌కు చెందిన ఒక విభాగం. ఇది ఆనంద్ అహూజా తండ్రి హరీష్ అహుజాకు చెందినది. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అతిపెద్ద దుస్తులు తయారీదారులలో ఒకటి. ఈ కంపెనీ అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయిస్తోంది.1940లో ప్రారంభమైన రిథమ్ హౌస్.. ఒకప్పుడు పండిట్ రవిశంకర్, ఇయాన్ ఆండర్సన్ వంటి సంగీత విద్వాంసులకు మాత్రమే కాకుండా ఎంతోమంది బాలీవుడ్ తారల బృందాలకు ఆతిథ్యం ఇచ్చింది.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్కొన్ని వారాల క్రితం సోనమ్ కపూర్, హరీష్ అహూజా లండన్‌లోని నాటింగ్ హిల్ జిల్లాలో 231.47 కోట్ల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ జంటకు ఢిల్లీలో రూ.173 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. అంతే కాకుండా వీరి వద్ద ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే టైకాన్, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్580 వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. -
నీరవ్ మోదీ రూ.29.75 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన తాజా ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. రూ. 6,498 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసు విచారణలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ జప్తు చేసిన వాటిల్లో స్థిరాస్తులు, ఇండియాలో బ్యాంకు బ్యాలెన్స్‌లు ఉన్నట్టు తెలిపారు.మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)-2002 కింద ముంబై జోనల్ కార్యాలయం ఈ జప్తులు చేపట్టింది. కాగా ఇంతకు ముందు భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీకి చెందిన రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇవే గాక పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం (ఎఫ్ఈఓఏ)-2018 కింద ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మరో రూ.692.90 కోట్ల ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైలులో ఉన్నారు -
ప్రధానిని కించపరచలేదు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై లోక్‌సభలో మాట్లాడనందుకే నీరవ్ అనే మాటను వాడాను తప్ప, ఆయన్ను కించపరచడానికి కాదని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రధాని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయే సరికి ‘నీరవ్’అనే మాటను వాడానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. నీరవ్‌కు నిశ్శబ్దం అనే అర్థం ఉందన్నారు. పార్లమెంట్లో ఎవరినైనా అగౌరవపరచాలనే ఆలోచన తనకు లేశ మాత్రమైనా లేదని చెప్పారు. ఏదైనా మాట అన్ పార్లమెంటరీగా అనిపిస్తే తొలగించేందుకు నిబంధనల ప్రకారం స్పీకర్‌కు అధికారముందని చౌదరి తెలిపారు. ఒకరి ప్రతీకార, అహంకార వైఖరికి తానెందుకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రతిపక్షం గళం వినిపించకుండా చేసేందుకే బీజేపీ నేతలు పథకం ప్రకారం అనుచిత విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. తన సస్పెన్షన్‌ను తిరోగమన చర్యగా ఆయన అభివర్ణించారు. ఉరితీసిన తర్వాత విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో తనను ఉంచారంటూ వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌పై చట్టపరంగా ముందుకెళ్లేందుకు గల అవకాశాలను పరిశీలిస్తానన్నారు. అనుచిత ప్రవర్తన కారణంతో అధిర్ రంజన్ చౌదరిని గురువారం లోకసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సభా హక్కుల కమిటీ నివేదిక ఇచ్చేవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. భారత్, ఇండియా ఒక్కటే అయినప్పుడు ప్రధాని మోదీ మాత్రం ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి పేరును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ఆధిర్ రంజన్ చౌదరి అన్నారు. ‘అంత శక్తిమంతుడైన మోదీకి ఇండియా పదంతో వచ్చిన ఇబ్బందేమిటి? భారత్, ఇండియా రెండూ ఒక్కటేనని రాజ్యాంగం కూడా చెప్పింది. అయినా బీజేపీ నేతలు రెండింటి మధ్య తేడాలు చూపిస్తున్నారు’అని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఘర్షణలకు మణిపూర్ పరిణామాలకు పోలిక లేదని, అక్కడ మానవీయ సంక్షోభం నెలకొని ఉందని చెప్పారు. మణిపూర్‌లో పరిస్థితులు దేశంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్రం భావిస్తే పరిష్కరించేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు. -
మెహుల్ చోక్సీ బ్యాంక్, డీమ్యాట్, ఫండ్ ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: భారత్ నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ చెల్లించాల్సిన రూ.5.35 కోట్ల బకాయిల రికవరీ దిశలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌ల జప్తునకు ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేర్లలో మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడిన కేసులో సెబీ 2022 అక్టోబర్‌లో విధించిన జరిమానాను చెల్లించడంలో చోక్సీ విఫలమైన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ గ్రూప్‌లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చోక్సీ, మరో ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి మామ కావడం గమనార్హం. ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని రూ.14,000 కోట్లకు పైగా మోసగించినట్లు వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీఎన్బీ స్కామ్ వెలుగులోనికి వచ్చిన తర్వాత 2018 తొలి నాళ్లలో వీరు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా లేదా బార్ముడాలో ఉన్నారని వార్తలు వస్తుండగా, మోడీ బ్రిటిష్ జైలులో ఉన్నారు. తనను అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను కోర్టులో ఆయన సవాలు చేశారు. -
పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం
సాక్షి,ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13వేల కోట్ల రుణం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి సంబంధించికీలక పరిణామంకలకలం రేపింది. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్‌నుంచి చోక్సీ పేరును తొలగించింది. దీంతో అతనిని స్వదేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బేనని విమర్శలు వెల్లువెత్తాయి. 2018 డిసెంబర్లో జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ ఇపుడు ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే మెహుల్ చోక్సీ విదేశీ గడ్డపై దొరికితే అరెస్ట్ చేసే అధికారాన్ని భారత ప్రభుత్వం కోల్పోయినట్టే. అయితే తాజా పరిణామంపై సీబీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నమెహుల్ చోక్సీ పేరు ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుండి తొలగించారు. లియోన్-హెడ్‌క్వార్టర్డ్ ఏజెన్సీకి చోక్సి అప్పీల్ మేరకే చోక్సీ పేరును రెడ్ లిస్ట్‌లో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఇంటర్‌పోల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అయిదేళ్లనుంచి పరారీలో ఉన్న చోక్సీని ఇండియాకు ఎపుడు రప్పిస్తారంటూ కాంగ్రెస్ ట్విటర్ ద్వారా మోదీ సర్కార్‌ను ప్రశ్నించింది. PM मोदी का चहेता मेहुल 'भाई' चोकसी अब वांटेड नहीं रहा। भगोड़े मेहुल चोकसी के खिलाफ इंटरपोल ने रेड कॉर्नर नोटिस हटा लिया है। PM मोदी जवाब दें कि आपके 'मेहुल भाई' को देश वापस कब लाया जाएगा। 5 साल से फरार है, अब और कितना वक्त चाहिए? — Congress (@INCIndia) March 20, 2023 రెడ్ నోటీసు (లేదా రెడ్ కార్నర్ నోటీసు) 2018లో డిసెంబరు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. నాలుగేళ్ల తరువాత మెహుల్ చోక్సీని రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ తొలగించింది. తాజా నివేదికల ప్రకారం ఆ నోటీసు ఇప్పుడు ఇంటర్‌పోల్ వెబ్సైట్లో అందుబాటులో లేదు. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి, మొత్తం రెడ్ నోటీసుల సంఖ్య 7023కి చేరింది. ఇంటర్‌పోల్‌లో 195 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు అనేది అప్పగించడం, లొంగిపోవడం లేదా ఇలాంటి చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాన్ని అమలు చేసేవారికి చేసే అభ్యర్థన. రెడ్ నోటీసు అరెస్ట్ వారెంట్‌తో సమానం కాదు. అయితే సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనేదానిపై సభ్యదేశాలు తమ స్వంత చట్టాలను వర్తింపజేయాలి. అనేక సందర్భాల్లో నిందితుడిని కోరుకున్న దేశానికి అప్పగిస్తారు. కాగా పీఎన్బీ స్కాం ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీకి దగ్గరి బంధువు మెహుల్ చోక్సీ. దేశంలో అతిపెద్ద స్కాం వెలుగులోకి రావడంతో ఆంటిగ్వా , బార్బుడా పారిపోయి, అక్కడి పౌరసత్వం పొందాడు. ఈడీ, సీబీఐ దర్యాప్తు, ఫుజిటివ్ నేరస్తుడుగా కేంద్రం ప్రకటించింది. సీబీఐ అభ్యర్థన మేరకు పది నెలల తర్వాత ఇంటర్‌పోల్ అతడి రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే సీబీఐ ఛార్జిషీట్‌పై చోక్సీ అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు,పలు సందర్భాల్లో భారతీయ జైళ్లు, ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ కీలక పరిణామాల మధ్య మే 2021లో చోక్సీ ఆంటిగ్వా నుండి అదృశ్యమైనాడు. ఆ తరువాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడన్న ఆరోపణలపై డొమినికాలో అరెస్ట్ కావడంతో 51 రోజులు డొమినికా జైలులో గడిపాడు. అనంతరం అక్రమంగా ప్రవేశించిన చోక్సీపై ఉన్న అన్ని అభియోగాలను కూడా డొమినికా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంక్ అకౌంట్లో రూ.236, జైలులో దుర్భర జీవితం గడుపుతున్న నీరవ్ మోదీ
నీరవ్ మోదీ! ఒకప్పుడు ప్రముఖ బిలియనీర్. కానీ ఇప్పుడు చేసిన తప్పులకు మూల్యం చెల్లిస్తూ జైల్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టిన కేసులో కోర్టుకు చెల్లించేందుకు డబ్బులు లేక అప్పు కావాలని అర్రులు చాస్తున్నాడు. ఈ నేపథ్యంలో నీరవ్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.236 ఉన్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2019లో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి వేల కోట్ల ఎగనామం పెట్టి యూకేకి పారిపోయాడు. అక్కడ భారత్‌లో భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అ తర్వాత నీరవ్ పతనం ప్రారంభమైంది. తాజా నివేదికల ప్రకారం.. నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌డిఐపిఎల్) వద్ద రూ. 236 బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐకి రూ. 2.46 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.236 ఉన్నట్లు తెలుస్తోంది. మరి బ్యాంక్‌లకు నీరవ్ చెల్లించాల్సిన మొత్తాన్ని దర్యాప్తు సంస్థలు ఏ విధంగా వసూలు చేస్తాయో చూడాల్సి ఉంది. అప్పు కావాలి! కాగా, గత వారం భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు నీరవ్‌ను ఆదేశించింది. కానీ నీరవ్ మోదీ తన వద్ద అంత డబ్బు లేదని కోర్టుకు మొరపెట్టుకున్నాడు. దీంతో మరి విచారణ నిమిత్తం చెల్లించాల్సిన చట్టపరమైన ఖర్చుల్ని ఎలా చెల్లిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. అందుకు అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్ తన ఆస్తులను స్వాధీనం చేసుకున్నందున, తనకు తగిన వనరులు లేవని, కోర్టుకు చెల్లించే మొత్తాన్ని ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటానని, రుణ దాత కోసం అన్వేషిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు. -
వేల కోట్లు ఎగొట్టి.. ఇప్పుడేమో డబ్బులు లేవు, అప్పు తీసుకోవాలంటున్న ఘనుడు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.11వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని వేల కోట్లు స్కాంలో కీలక నిందితుడు అయిన నీరవ్ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని చెబుతున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా స్వయంగా అతనే ఈ వ్యాఖ్యలు చేశాడు. నీరవ్ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేసే పనిలో పడింది. పైసలు లేవు.. అప్పు తీసుకుంటా ప్రస్తుతం నీరవ్ నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. అతడిని భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపులకు సంబంధించి నీరవ్ అక్కడి నుంచే వర్చువల్ ద్వారా తూర్పు లండన్‌లోని బార్కింగ్‌సైడ్ మేజిస్ట్రేట్ కోర్టులో ముందు హాజరయ్యాడు. చెల్లింపులపై వజ్రాల వ్యాపారి న్యాయస్థానానికి ఈ రకంగా విన్నవించుకున్నాడు.. తాను కోర్టు తీర్పు ప్రకారం డబ్బులను ఒకేసారి చెల్లించలేనని, నెలకు 10 వేల పౌండ్ల చొప్పున కడతానని అభ్యర్థించాడు. ఎందుకంటే భారత ప్రభుత్వం తన ఆస్తులన్నీ సీజ్ చేయడంతో డబ్బులు పరంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ 10 వేల పౌండ్లను ఎక్కడి నుంచి తెస్తావని అడగగా.. కోర్టుకు చెల్లించాల్సిన మొత్తం కోసం రుణం తీసుకుంటున్నానని చెప్పాడు. కాగా ఈ వ్యాపారవేత్తపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగాల ఆధారంగా నేరవ్ మోదీని 2019 మార్చిలో అరెస్టు చేసిన మూడేళ్ల తర్వాత అప్పీల్‌ను తిరస్కరించడం జరిగింది. -
ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి కేంద్రం భారీ షాక్!
బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. కేంద్రం ఓ వైపు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తుంది. కటకటాల్లోకి మార్చి 2019లో భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనల మేరకు లండన్‌లో ఉన్న నీరవ్‌ని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం స్థానిక వాండ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆస్తుల వేలం ఈ నేపథ్యంలో పూణేలో ఉన్న నీరవ్ ప్రాపర్టీలను వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో ఆక్షన్ పక్రియ ప్రారంభం కానుందని, ముంబైకి చెందిన డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్-ఐ (డీఆర్టీ-ఐ) విభాగం ఈ వేలం చేపట్టనుంది. రికవరీ అధికారి అషుకుమార్ ఆదేశాలతో నీరవ్‌కు చెందిన రెండు ప్రాపర్టీలపై ఈ- ఆక్షన్ జరగనుంది. అధికారుల దర్యాప్తు ముమ్మరం పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం పేరుతో వేలకోట్ల ఆర్ధిక మోసాలకు పాల్పడ్డ నీరవ్ మోడీ, మోహిల్ చోక్సీలు ప్రధాన నిందితులు. ఇద్దరు బ్యాంకుల్లో వేల కోట్లను అప్పుగా తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో భారత ప్రభుత్వం నిందితులకు ఇచ్చిన రుణాల్ని తిరిగి రాబట్టేందుకు దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులతో దర్యాప్తు చేయిస్తుంది. ప్రాప్టరీ విలువ ఎంతంటే విచారణ కొనసాగుతుండగానే పూణేలోని హదప్సర్లో ఉన్న యో పూణే హౌసింగ్ స్కీమ్‌లోని 398 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఎఫ్ 1 భవనంలోని 16వ అంతస్తు... ఆ పక్కనే 396 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మరో ప్లాట్ ధరల్ని రూ. 8.99కోట్లు, రూ. 8.93 కోట్లుగా నిర్ణయించారు. వాటినే వేలం వేయనున్నారు. నోటీసులు జారీ వేలంపై అధికారులు ఇప్పటికే నీరవ్‌కు చెందిన స్టెల్లార్ డైమండ్స్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్ డైమండ్ ఆర్ యూఎస్, ఏఎన్ఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్డీఎం ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేశారు. -
బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత!
లండన్: రూ.11వేల కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో షాక్ తగిలింది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై అక్కడి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు చట్టపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లు అయింది. ఫలితంగా ఆయనను త్వరలోనే భారత్‌కు తీసుకువచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేర మోసం చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో 2018లో దేశం వీడి పారిపోయాడు. 2019లో లండన్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉంటున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని గతనెలలోనూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన అప్పీల్‌ను రిజెక్ట్ చేసింది. దీంతో చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరుతూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాను భారత్‌కు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని, మానసికంగా సమస్యలున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు. న్యాయస్థానం వీటిని తోసిపుచ్చి అప్పీల్‌ను రిజెక్ట్ చేసంది. అయితే నీరవ్‌కు ఇంకా ఓ అవకాశం ఉంది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై ఐరోపా సమాఖ్య మానవ హక్కుల కోర్టును ఆయన ఆశ్రయించవచ్చు. చదవండి: రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే -
నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన యూకే హైకోర్టు.. త్వరలో భారత్‌కు..
చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొనేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హైకోర్టులో చుక్కెదురైంది. దేశం నుంచి పరారీలో ఉన్న నీరవ్ మోదీని భారత్‌కి తిరిగి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పిటీషన్ దాఖలైంది. అయితే నీరవ్ మోదీని అప్పగించడం అన్యాయం లేదా అణచివేత కాదని కోర్టు పేర్కొంటూ అతని పిటీషన్‌ను తిరస్కరించింది. దీంతో త్వరలో నీరవ్ భారత్‌కు రానున్నారు. ఈ అప్పీల్ విచారణకు అధ్యక్షత వహించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు. ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో కటకటాల వెనుక ఉన్న 51 ఏళ్ల వ్యాపారవేత్త, గత ఫిబ్రవరిలో భారత్‌కు అప్పగింతకు అనుకూలంగా జిల్లా జడ్జి సామ్ గూజీ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. కాగా నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని రూ. 13,500 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటినుంచి భారత్‌కు తిరిగి రాకుండా తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తున్నాడు. చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! -
మేహుల్ చోక్సీపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త మేహుల్ చోక్సీపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పదేళ్ల నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా 45 రోజుల్లోగా చెల్లించమని ఆదేశిస్తూ రూ. 5 కోట్ల జరిమానా సైతం విధించింది. గీతాంజలి జెమ్స్ కౌంటర్లో అక్రమ లావాదేవీలు చేపట్టిన అభియోగాలపై సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. దీంతో సెక్యూరిటీల మార్కెట్లో చోక్సీ పదేళ్లపాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గీతాంజలి జెమ్స్ షేర్ల ట్రేడింగ్‌లో ఇన్సైడర్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చోక్సీపై సెబీ ఏడాది కాలం నిషేధాన్ని, రూ. 1.5 కోట్ల జరిమానాను విధించింది. ఇక 2020 ఫిబ్రవరిలో లిస్టింగ్ తదితర పలు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ రూ. 5 కోట్ల జరిమానా చెల్లించవలసిందిగా చోక్సీతోపాటు, గీతాంజలి జెమ్స్‌ను సెబీ ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్, చైర్మన్ చోక్సీ నీరవ్ మోడీకి మేనమావకాగా.. వీరిరువురిపైనా పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్లకుపైగా మోసం చేసిన కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2018 మొదట్లో పీఎన్బీ మోసం బయటపడిన తొలినాళ్లలోనే చోక్సీ, మోడీ విదేశాలకు తరలిపోయారు. చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాలలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వెలువడగా.. ఇండియాకు అప్పగించాలన్న ప్రభుత్వ వాదనను బ్రిటిష్ జైల్లో ఉన్న మోడీ వ్యతిరేకిస్తున్నారు. -
నీరవ్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.253.62 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నీరవ్ కంపెనీలకు చెందిన రత్నాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసినట్లు తెలిపింది. సుమారు రూ.16వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ప్రస్తుతం యూకేలో జైలు శిక్ష అనుభవిస్తున్న నీరవ్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు తుదిదశలో ఉన్నట్లు పేర్కొంది. తాజా జప్తుతో కలిపి నీరవ్‌కు చెందిన మొత్తం రూ.2,650 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లయిందని వివరించింది. -
ఆర్బీఐ కొత్త టెక్నాలజీ, వేల కోట్ల బ్యాంక్ స్కాంలు జరగవట!
దేశంలో ఆర్ధిక నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు కేంద్రం తీసుకోని నిర్ణయం లేదు. అయినా సరే ఎక్కడో ఓ చోటా రుణాల పేరిట జరుగుతున్న స్కాంలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఫిర్యాదుతో రూ.42,871 కోట్ల కుంభ కోణం బ్యాంకింగ్ రంగ వ్యవస్థని అతలా కుతులం చేసింది. చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ధిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసింది. వ్యాపారాల నిర్వహణ పేరుతో బ్యాంకుల వద్ద వేలకోట్లు రుణాలు తీసుకొని.. వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోతున్న ఆర్ధిక నేరగాళ్లపై ఆర్బీఐ ఉక్కుపాదం మోపనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేలకోట్ల రూపాయలు (ఆర్టీఐలో తేలింది రూ.15,423.39 కోట్లు) మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అతని మామ (బంధువు)మెహుల్ చోక్సీల తరహా మోసాలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఆర్బీఐ బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇందులో పలు బ్యాంకుల్ని సైతం ఆర్బీఐ జత చేసింది. 12 బ్యాంక్‌లు హెచ్డీఎఫ్సీ,ఐసీఐసీఐ ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 12కు పైగా బ్యాంకులు సమిష్టిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రికృతమై జాతీయ, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ (ట్రేడ్ ఫైనాన్సింగ్) నిర్వహిస్తున్నాయి. ఆ ట్రాన్సాక్షన్ల నిర్వహణలో సత్ఫలితాలు రాబడితే నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల్లాంటి ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకుల్ని మోసం చేయాలన్న ఆలోచనే రాదని ఆర్బీఐ భావిస్తున్నట్లు పలు వెలుగులోకి నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా బెంగళూరు కేంద్రంగా ఈ పైలెట్ ప్రాజెక్ట్‌లో యూరప్ దేశమైన బెల్జియంకు చెందిన బ్లాక్ చైన్ డెవలప్మెంట్ ఫ్లాట్ ఫామ్ సెటిల్ మింట్, అమెరికాకు చెందిన క్రోడా టెక్నాలజీస్, ఐబీఎంలు టెక్నాలజీ సపోర్ట్‌ను అందిస్తుండగా..యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే? ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పేరుతో ఆర్బీఐ నేతృత్వంలో డెవలప్ చేస్తున్న ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ..దాని పరిభాషలో చెప్పాలంటే.. ఉదాహారణకు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు బ్యాంకుల వద్ద రుణం తీసుకొని వాటిని అక్రమ మార్గంలో మళ్లించేందుకు జరిపే ట్రాన్సాక్షన్లపై ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కన్నేస్తుంది. అనుమానం వచ్చిందా వెంటనే ఈ టెక్నాలజీ అనుసందానమైన సెంట్రల్ డేటాతో సంబంధం లేకుండా బ్లాక్ చేస్తుంది. ఇన్ పుట్ డివైజ్, ఔట్పుట్ డివైజ్, స్టోరేజ్ డివైజ్ ఇలా మూడు పద్దతుల్లో ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేసి సంబంధిత బ్యాంకుల సంబంధించిన కంప్యూటర్లకు లేదా, సంబంధిత శాఖలకు అలెర్ట్ ఇస్తుంది. తద్వారా లోన్ ఫ్రాడ్‌లను గుర్తించవచ్చు. ప్రస్తుతం ఆర్బీఐ ఈ టెక్నాలజీ విధి విధానాల్ని పరిశీలిస్తుండగా.. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని సరి చేయాలని చూస్తోంది. నిపుణులు ఏం అంటున్నారంటే! రుణాలు పొందే విషయంలో ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎటువంటి అడ్డకట్ట వేయలేదు. అయితే రుణాలు తీసుకున్న వ్యక్తులు ఆ నిధులను పక్క దారి పట్టిస్తుంటే మాత్రం ఇట్టే పసిగడుతుంది. వాళ్ల కుతంత్రాలకు చెక్ పెడుతుంది. తద్వారా భారీ స్థాయిలో జరిగే మోసాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ టెక్నాలజీ సాయంతో లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) పేరుతో జరిగే మోసాల్ని సైతం అరికట్టవచ్చు. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యా గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్‌కు భారత్ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని భారత పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు తమ న్యాయవ్యవస్థను వాడుకోవాలనుకునే నేరగాళ్లను ఎన్నటికీ స్వాగతించబోమని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని చాలారోజులుగా భారత్ ఒత్తిడి తెస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో జాన్సన్ మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు. మోదీ, జాన్సన్ చర్చల్లో ఆర్థిక నేరగాళ్ల అప్పగింత అంశం ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. ఈ విషయంలో భారత్ వైఖరిని జాన్సన్‌కు మోదీ వివరించారని చెప్పారు. దీనిపై జాన్సన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉగ్ర మూకలను సహించం ఇంగ్లండ్ వేదికగా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర మూకలను సహించబోమని బోరిస్ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్ ఆందోళనను బోరిస్ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై నేతలు చర్చించారన్నారు. అక్కడ సత్వరమే శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారని చెప్పారు. రష్యాపై ఆంక్షల విషయంలో భారత్‌పై యూకే ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కీవ్‌లో వచ్చేవారం తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తామని బోరిస్ వెల్లడించారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన జరగాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్–ఇంగ్లండ్ బంధం.. అత్యంత పటిష్టం భారత్, ఇంగ్లండ్ మధ్య అన్ని విషయాల్లోనూ బంధం ముందెన్నడూ లేనంత బలోపేతంగా మారిందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఎఫ్‌టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు. ఇండియాకు ఒజీఈఎల్ (ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్ చెప్పారు. భూ, జల, వాయు, సైబర్ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. నూతన ఫైటర్ జెట్ టెక్నాలజీని భారత్‌తో పంచుకుంటామన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపించిందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి యూకే సాయం చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని స్వాగతించారు. విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. సచిన్, అమితాబ్‌లా ఫీలవుతున్నా: జాన్సన్ భారత్‌లో తనకు అత్యంత ఆదరణపూర్వక స్వాగతం లభించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఖాస్ దోస్త్ (బెస్ట్ ఫ్రెండ్)గా అభివర్ణించారు. పలుమార్లు నరేంద్ర అని ప్రస్తావిస్తూ తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. బ్రిటీష్ ఇండియన్లలో దాదాపు సగంమందికి పుట్టిల్లైన గుజరాత్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ తనకు లభించిన ఆదరణ చూస్తే సచిన్ టెండూల్కర్‌లాగా ఫీలవుతున్నానని, ఎక్కడచూసినా అమితాబ్ బచ్చన్ లాగా తన పోస్టర్లే కనిపిస్తున్నా యని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధం ఎంతో కీలకమన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద జాన్సన్‌కు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వాగతం లభించింది. నా భుజానికున్నది భారతీయ టీకానే! తనతో సహా వందకోట్లమందికి పైగా ప్రజలకు భారత్ కోవిడ్ టీకా అందించిందని బోరిస్ ప్రశంసించారు. ‘ నా భుజానికున్నది ఇండియన్ టీకా, అది నాకు ఎంతో మేలు చేసింది. భారత్‌కు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఆశించినట్లు ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ మారిందని కొనియాడారు. ఆస్ట్రాజెనెకా, సీరమ్ సహకారంతో కోవిడ్ టీకా రూపొందించడాన్ని ప్రస్తావించారు. -
సీబీఐ బిగ్ ఆపరేషన్..నీరవ్‌మోదీ ప్రధాన అనుచరుడు అరెస్ట్..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాం కేసులో సీబీఐ కీలక పురోగతిని సాధించింది. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన అనుచరుడు సుభాష్ శంకర్‌ను ఈజిప్టు రాజధాని కైరోలో సీబీఐ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుభాష్‌ను ఈజిప్టు నుంచి భారత్‌కు తీసికొచ్చినట్లుగా సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 13 వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత ఆరోపణలను నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నారు. ఈ స్కామ్‌లో సుభాష్ శంకర్ కీలక నిందితుడు. పీఎన్బీ స్కాంకు సంబంధించి సీబీఐ అభ్యర్థన మేరకు.. నీరవ్, అతని సోదరుడు నిషాల్ మోదీ , అతని ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్‌లపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. 2018లో కేసు నమోదైనప్పటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. అతడు కైరోలో అజ్ఞాతంలో దాక్కున్నాడు. తమకు అందిన ఇన్పుట్ల ఆధారంగా సీబీఐ ఆపరేషన్ నిర్వహించి శంకర్‌ని పట్టుకుంది. అతడిని ప్రత్యేక విమానంలో సీబీఐ అధికారులు.. ముంబైకి తీసుకొచ్చినట్లు సమాచారం. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని సీబీఐ కోర్టులో శంకర్‌ను హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. ఇక కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకుగాను సుభాష్‌ను విచారణ నిమిత్తం కస్టడీకి సీబీఐ కోరనుంది. చదవండి: భారత ఆర్థిక వ్యవస్థపై మూడీస్ ఆసక్తికర వ్యాఖ్యలు..! -
ఆ ముగ్గురి 19వేల కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేశాం
న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన రూ.19వేల కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రూ.22,500 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన ఈ ముగ్గురు నేరగాళ్లపై సకాలంలో చర్యలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. మనీ ల్యాండరింగ్ చట్టంలోని కొన్ని నిబంధనలకు వక్రభాష్యాలు చెబుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సకాలంలో తీసుకున్న చట్టపరమైన చర్యల ఫలితంగా ఈ ముగ్గురికి చెందిన రూ.15,113 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి అప్పగించినట్లు చెప్పారు. ఈ కేసుపై వాదనలు వచ్చే వారం కూడా కొనసాగనున్నాయి. -
విజయ్‌మాల్యా, తదితరుల నుంచి బ్యాంకులకు రూ. 18 వేల కోట్లు రికవరీ: కేంద్రం
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల వంటి కుబేరుల నుంచి దాదాపు రూ.18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్రం మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కి ఇచ్చిన విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకి బుధవారం కేంద్రం వెల్లడించింది. అంతేకాదు విదేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే భారతదేశంలో పీఎంఎల్ఏ కింద చాలా తక్కువ సంఖ్యలో కేసులను దర్యాప్తు చేస్తున్నామని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో కేంద్రం సుప్రీం కోర్టులో యూకేని ఉదహరించింది, ఇక్కడ మనీలాండరింగ్ చట్టం కింద ఒక ఏడాదిలో 7,900 కేసులు నమోదయ్యాయని, యూఎస్ (1,532), చైనా (4,691), ఆస్ట్రియా (1,036), హాంకాంగ్ (1,823), బెల్జియం (1,862), రష్యా (2,764) నమోదవుతున్నాయని వివరించింది. భారత్‌లో 4 వేల పీఎంఎల్ఏ కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోందని తెలిపింది. అయితే సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేరాల మొత్తం ఆదాయం రూ. 67,000 కోట్లు అని పేర్కొంది. గత 5 ఏళ్లలో ప్రతి ఏడాది విచారణకు తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 కేసుల ఉండగా.. 2020-21 నాటికి 981గా మారుతుందని కేంద్రం తెలిపింది. అంతేకాదు ఇటువంటి నేరాలకు సంబంధించి 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, కానీ 2 వేల కేసులను మాత్రమే విచారణకు స్వీకరించినట్లు కేంద్రం వెల్లడించింది. (చదవండి: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్!... కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంటుంది!) -
ఎగవేతదారుల నుంచి రికవరీ చేసింది ఎంతంటే..
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా బ్యాంకింగ్‌ను కోట్లాది రూపాయలు మోసం చేసి, దేశం నుంచి పారిపోయిన వాళ్ల నుంచి వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంతత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీసహా ఈ తరహా వ్యక్తుల ఆస్తుల అమ్మకం ద్వారా బ్యాంకులు రూ.13,100 కోట్ల రికవరీ చేసినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. జులై 2021 నాటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అందించిన సమాచారం మేరకు ఈ వివరాల్ని వెల్లడించారు ఆర్థిక మంత్రి. కాగా, గడచిన ఏడు సంవత్సరాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యతల (సీఎస్ఆర్) కింద కంపెనీలు రూ.1.09 లక్షల కోట్లు వెచ్చించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బొగ్గు గణనీయమైన నిల్వలతో సరసమైన ఇంధన వనరుగా ఉన్నందున భవిష్యత్‌లో బొగ్గు ప్రధాన ఇంధన వనరుగా నిలవనుందని బొగ్గు వ్యవహారాల శాఖ ప్రహ్లాద్ జోషి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఆర్థిక నేరస్థులను భారత్‌కు తీసుకొస్తాం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరస్థులను స్వదేశానికి రప్పించేందుకు దౌత్యపరమైన, అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో భారత్‌కు తిరిగి రావడం మినహా వారికి మరో మార్గం అంటూ ఉండదన్నారు. రుణ వితరణ, ఆర్థిక వృద్ధిపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులను తీసుకొచ్చే విషయంలో విధానాలు, చట్టపరంగా నడుచుకుంటున్నాం. మేమిచ్చే సందేశం సుస్పష్టం. మీ దేశానికి తిరిగి రండి. ఇందుకోసం మా చర్యలు కొనసాగుతూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రధాని ప్రస్తావించలేదు. విజయ్ మాల్యా, నీరవ్‌మోదీలను తీసుకొచ్చేందుకు భారత్ ఇటీవలి కాలంలో చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులు వినూత్నంగా పనిచేయాలి.. దేశంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపడినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి తమ సర్కారు గడిచిన ఏడేళ్లలో ఎన్నో సంస్కరణలను అమలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు గత ఐదేళ్లలోనే కనిష్ట స్థాయిలకు చేరినట్టు చెప్పారు. చురుకైన చర్యల ద్వారా రూ.5 లక్షల కోట్ల మొండి రుణాలను వసూలు చేసినట్టు పేర్కొన్నారు. ‘‘సంపద సృష్టి కర్తలకు, ఉపాధి కల్పించే వారికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది. వారికి రుణ వితరణ అందేలా చూడాలి. నిజాయితీ నిర్ణయాల్లో మీకు రక్షణగా నేను ఉంటాను’ అంటూ బ్యాంకులకు మార్గదర్శనం చేశారు. 2022 ఆగస్ట్ 15 నాటికి ప్రతీ బ్యాంకు శాఖ.. పూర్తి డిజిటల్‌గా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కనీసం 100 క్లయింట్లను అయినా కలిగి ఉండాలన్న లక్ష్యాన్ని ప్రధాని నిర్ధేశించారు. సొంతంగా 5జీ, 6జీ సామర్థ్యాలు టెలికం రంగానికి సంబంధించి 5జీ, 6జీ టెక్నాలజీల్లో స్వీయ సామర్థ్యాల అభివృద్ధిపై భారత్ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనికితోడు సెమీ కండక్టర్ల తయారీపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. గురువారం ‘సిడ్నీ డైలాగ్’ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని వర్చువల్(ఆన్లైన్ మాధ్యమంలో)గా మాట్లాడారు. నూతన తరం టెలికం టెక్నాలజీల అభివృద్ధిలో జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కలసి భారత్ పనిచేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీకి సంబంధించి గొప్ప ఉత్పత్తి డేటాయేనన్నారు. డేటాను కాపాడడం, గోప్యత, భద్రతకు సంబంధించి పటిష్ట కార్యాచరణను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజా సార్వభౌమాధికారం కోసం డేటాను ఉపయోగించుకుంటామన్నారు. డిజిటల్ డొమైన్లో భారత్ సాధించిన ఘతనను ప్రస్తావించారు. ‘‘క్లౌడ్ ప్లాట్ఫామ్లో సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాం. డిజిటల్ సార్వభౌమాధికారానికి ఇది కీలకం. క్వాంటమ్ కంప్యూటింగ్‌లోనూ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లకు సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలు, సేవలను అందించడంలో భారత్ ఇప్పటికే ప్రముఖ కేంద్రంగా ఉంది. సైబర్ సెక్యూరిటీకి సైతం భారత్‌ను కేంద్రంగా మార్చేందుకు పరిశ్రమతో కలసి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహకాల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు. -
దేశంలో మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన సీబీఐ
వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో సంబంధం ఉన్న గార్విట్ ఇన్నోవేటివ్ ప్రమోటర్స్ లిమిటెడ్(జీఐపీఎల్), ఆ కంపెనీ యజమాని సంజయ్ భాటిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన బైక్ బాట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి, మరో 14 మంది కలిసి దేశవ్యాప్తంగా సుమారు రూ.15,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులను మోసం చేశారని ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సంజయ్ భాటి బైక్ బాట్ పేరుతో బైక్-టాక్సీ సర్వీసులను ప్రారంభించాడు. ఈ బైక్ సర్విస్ ముసుగులో లాభదాయకమైన మోసపూరిత ఆర్థిక పథకాలను రూపొందించాడు. ఈ బైక్ టాక్సీ సర్వీసుల్లో బైక్ బాట్ వాహనాన్ని ఎవరైనా కొనుగోలుదారుడు తమ వద్ద ఉన్న డబ్బుతో ఒకటి, మూడు, ఐడు లేదా ఏడు బైక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బైక్‌లను తమ కార్పొరేట్ కార్యాలయమే నడుపుతుందని నమ్మించారు. ఇలా పెట్టుబడి పెట్టినవారికి నెలవారీ అద్దె, ఈఎంఐతో పాటు ఎక్కువ బైక్‌లపై పెట్టుబడి పెడితే బోనస్ కూడా ఇస్తామంటూ ఆసక్తికరమైన ప్రోత్సాహకాలతో ఆకట్టుకున్నారు. కంపెనీ వివిధ నగరాల్లో ఫ్రాంచైజీలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ నగరాల్లో బైక్‌లు టాక్సీలు పెద్దగా పనిచేయడం లేదని సీబీఐ పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా బైక్ టాక్సీల్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారులు మోసపోయినట్టు సీబీఐ గుర్తించింది. (చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్!) 2017లో ఈ పథకాలను ప్రారంభించిన ఈ సంస్థ.. పెట్టుబడిదారుల నుంచి డబ్బు వసూలు చేయడం, వేరేవారికి తిరిగి చెల్లించడం వంటివి చేస్తూ 2019 జనవరి వరకు చేసింది. నవంబర్ 2018లో పెట్రోల్ బైక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ ఎలక్ట్రిక్-బైక్ కోసం కంపెనీ ఇదే విధమైన ప్రణాళికను ప్రవేశపెట్టింది. సాధారణ పెట్రోల్ బైక్ లతో పోలిస్తే ఈ-బైక్‌ల సబ్ స్క్రిప్షన్ మొత్తం దాదాపు రెట్టింపు అని ఎఫ్ఐఆర్లో తెలిపింది. పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించడానికి 'బైక్ బాట్ - జీఐపీఎల్ పథకం ద్వారా నడిచే బైక్ టాక్సీ అతి త్వరలో వేయనున్నాము. ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలనే వ్యక్తులు త్వరగా డబ్బును డిపాజిట్ చేయాలి' అని కంపెనీ ప్రచారం చేసింది. కేవలం రూ.62,200 పెట్టుబడి పెట్టి అద్దె పొందవచ్చునని, ఏడాదిలోగా బైక్ ఓనర్‌గా మారవచ్చు అని అందరినీ నమ్మించింది. ఇలా రూ.62,000 పెట్టుబడి పెట్టిన వారికి 12 నెలలపాటు నెలకు రూ.9,765 చొప్పున అందిస్తామని ఆశపెట్టింది. ఇలా ఏడాదికి రూ.1,17,000 సంపాదించవచ్చు అని తెలిపింది. ఈ ప్రకటన చూసి సుమారు 2,25,000 మంది ఇందులో పెట్టుబడి పెట్టారు. అయితే, కొన్నాళ్ల తర్వాత నెలలు గడుస్తున్నా అద్దెతో పాటు ఈఎంఐ చెల్లింపులు, బోనసులు రాకపోవడంతో పెట్టుబడిదారుల్లో అనుమానాలు వచ్చాయి. అప్పుడిస్తాం, ఇప్పుడిస్తాం అని భారీ మొత్తం లాగేసుకున్నాక బోర్డు తిప్పేశారు. అయితే, ఈ కంపెనీ నోయిడా జిల్లా అథారిటీ, పోలీసు అధికారుల పరిధిలో ఉంది. (చదవండి: రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లు) ఇంత జరుగుతున్న అక్కడి పోలీసు అధికారులు ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. "బదులుగా, ఎస్ఎస్ పి, ఎస్ పీ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదుదారుల ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు" సీబీఐ తెలిపింది. సంజయ్ భాటి, అతని సహచరులు పెట్టుబడిదారులను నుంచి ముందస్తు కుట్రలో భాగంగా దేశవ్యాప్తంగా కనీసం 15,000 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించింది. అయితే, ఇంతకు ముందు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జీఐపీఎల్, దాని ప్రమోటర్ భాటి, ఇతరులకు వ్యతిరేకంగా గౌతమ్ బుద్ధనగర్ లోని దాద్రీ పోలీస్ స్టేషన్ లో నమోదైన వివిధ ఎఫ్ఐఆర్ల ఆధారంగా బైక్ బాట్ కుంభకోణం మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో ఆర్థిక దర్యాప్తు సంస్థ 216 కోట్లకు పైగా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. -
అప్పగింతపై నీరవ్ సవాల్‌కు లండన్ కోర్టు ఓకే
లండన్: మనీల్యాండరింగ్ ఆరోపణలపై భారత్‌కు తనను అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసే మరో అవకాశం వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి దక్కింది. తాను నిరాశ నిస్పృహలో ఉన్నానని, మానసిక ఆరోగ్యం సరిగాలేదని, ఆత్మహత్య చేసుకోవాలనేంతగా కుంగిపోయానని ఆయన పెట్టుకున్న అభ్యర్థనను లండన్‌లోని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. నీరవ్ తరఫు లాయర్లు తమ వాదనలను జడ్జికి వినిపించారు. ‘ బ్రిటన్‌లోని క్రిమినల్ జస్టిస్ యాక్ట్–2003,యూరప్‌లోని మానవ హక్కుల పరిరక్షణ, జీవించే హక్కులను పరిగణనలోకి తీసుకుని అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నా’ అని జడ్జి వ్యాఖ్యానించారు. -
భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యం..
లండన్: బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. లండన్ కోర్టులో అప్పీల్‌కు వెళ్లిన అతను సంచలన వ్యాఖ్యలతో మరో డ్రామాకు తెరలేపాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని కోర్టుకు మెరపెట్టిన నీరవ్.. భారత్‌కు అప్పగిస్తే తనకు ఆత్మహత్యే శరణ్యమని వ్యాఖ్యానించాడు. కాగా, ఇదే కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే నీరవ్‌కు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్‌కు లండన్ కోర్టు తిరస్కరించింది. ఫలితంగా అతన్ని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇదిలా ఉంటే, బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర ఎగనామం పెట్టి విదేశాల్లో తల దాచుకుంటున్న నీరవ్ మోదీ.. ఆర్థిక నేరాల్లో నిందితుడు కావడంతో అతన్ని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. భారత్‌లో మనీల్యాండరింగ్, నమ్మకద్రోహం వంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కానీ, ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోదీ.. సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
Nirav Modi: నీరవ్‌మోదీ కేసులో కీలక మలుపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ నిందితుడు నీరవ్‌మోదీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ మనీ లాండరింగ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. నీరవ్‌మోదీ చెల్లెలు పూర్వి మోడీ ఈడీకి అప్రూవర్‌గా మారింది. పూర్వి మోడీ యుకె బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి ₹17 కోట్లకు పైగా నగదును భారత ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. "పూర్వి మోడీ(నీరవ్ మోడీ సోదరి) యుకె బ్యాంక్ ఖాతా నుంచి భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యాంకు ఖాతాకు 2316889.03 డాలర్లు బదిలిచేశారు. దీంతో నీరవ్‌మోదీ లండన్ అకౌంట్స్ నుంచి రూ.17.25 కోట్లు రికవరీ చేసినట్లు" దర్యాప్తు సంస్థ పేర్కొంది. జూన్ 24న పూర్వి మోడీ తన పేరిట యునైటెడ్ కింగ్ డమ్ లోని లండన్‌లో ఒక బ్యాంకు ఖాతా ఓపెన్ చేసినట్లు, తన సోదరుడు నీరవ్‌మోదీ ఆదేశాల మేరకు ఖాతా ఓపెన్ చేసినట్లు, అందులో ఉన్న నిధులు తనకు చెందినవి కాదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు తెలియజేసింది. కొన్ని షరతులతో ఈడీ ఆమెకు క్షమబిక్ష పెట్టింది. ఈడీకి అప్రూవర్‌గా మారిన పూర్వి మోడీ తన యుకె బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యాంకు ఖాతాకు 2316889.03 డాలర్లు బదిలీ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నీరవ్ మోడీ ప్రస్తుతం యుకె జైలులో ఉన్నారు. ముంబైలోని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) నుంచి వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ రూ.13,000 కోట్లు తీసుకొని బ్రిటన్ కు పారిపోయాడు. కొద్ది రోజుల క్రితం భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ నీరవ్ లండన్‌లోని హైకోర్టులో చేసుకున్న అప్పీల్ ను కోర్టు తిరస్కరించింది. చదవండి: State Bank Day: పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం -
మాల్యా షేర్లతో స్టేట్ బ్యాంక్ కన్సార్టియంకు రూ. 5824 కోట్లు
ముంబై: లిక్కర్ కింగ్, రుణ ఎగవేత దారుడు విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రేవరీస్ షేర్లను ఎస్బీఐ నేతృత్వంలో గల బ్యాంకుల కన్సార్షియం జూన్ 23న విక్రయించింది. ఈ విక్రయం ద్వారా రూ. 5,824.5 కోట్లు వచ్చినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలియజేసింది. భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసుల్లో బ్యాంకులకు మొత్తం రూ. 22,583.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ తెలిపింది. ఈడి ప్రకారం.. పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు చేసిన మోసాలలో బ్యాంకులు నష్టపోయిన మొత్తంలో 40 శాతం (రూ.9,041.5 కోట్లు) ఇప్పటివరకు రికవరీ చేశారు. ముంబైలోని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీ కలిసి రూ.13,000 కోట్లు మోసం చేశారని, అలాగే విజయ్ మాల్య సుమారు రూ.9,000 కోట్లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో మోసం చేసినట్లు ఈడీ తెలిపింది. మాల్య కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసులో ఇదే విధమైన వాటాల అమ్మకాల ద్వారా బ్యాంకులు ఇంతకు ముందు రూ.1,357 కోట్లు పొందినట్లు ఈడీ తెలిపింది. నీరవ్ మోడీ కేసులో మరో రూ.1,060 కోట్ల విలువైన ఆస్తులు బ్యాంకులకు జప్తు చేసినట్లు పేర్కొంది. చదవండి: ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం -
నీరవ్‌కు లండన్ హైకోర్టులో చుక్కెదురు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్‌లోని హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ నీరవ్ లండన్‌లోని హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతించాలంటూ సంబంధిత పత్రాలను సమర్పించారు. ఈ పత్రాలను పరిశీలించిన కోర్టు మంగళవారం తిరస్కరించింది. అయితే, మరో ఐదు రోజుల్లోపు నీరవ్ హైకోర్టులో మరోసారి అప్పీల్‌చేసుకునే అవకాశముంది. భారత్‌లో ఆర్థికనేరాల్లో నిందితుడైన కారణంగా నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలంటూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. నీరవ్ భారత్‌లో మనీ ల్యాండరింగ్, నమ్మకద్రోహం తదితర నేరాభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్.. నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు సమ్మతి తెలుపుతూ ఏప్రిల్ 15న ఆదేశాలు జారీచేశారు. హోం మంత్రి నిర్ణయాన్ని, వెస్ట్‌మినిస్టర్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అవకాశమివ్వాలంటూ నీరవ్ హైకోర్టులో దాఖలుచేసిన ‘అప్పీల్’ అనుమతి పత్రాలను కోర్టు మంగళవారం తిరస్కరించిందని హైకోర్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 50ఏళ్ల నీరవ్‌ను 2019 మార్చి 19న అరెస్ట్‌చేసిన యూకే పోలీసులు అతడిని నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంచారు.