సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పీఎన్‌బీని రుణాల పేరుతో రూ 14,000 వేల కోట్ల మేర మోసగించి విదేశాల్లో తలదాచుకున్న నీరవ్ మోదీకి ఈడీ గట్టిషాక్ ఇచ్చింది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల కంపెనీలకు చెందిన రూ 1350 కోట్ల విలువైన వజ్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలను హాంకాంగ్ నుంచి ఈడీ స్వాధీనం చేసుకుంది. వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. నీరవ్‌ను అప్పగించాలని భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత ఏడాది లండన్ కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్‌బీని మోసగించిన కేసులో నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment