Gitanjali Gems
-
టాప్50 ఎగవేతదారుల బకాయిలు రూ.87 వేల కోట్లు
న్యూఢిల్లీ: గీతాంజలి జెమ్స్..ఇరా ఇన్ఫ్రా.. ఆర్ఈఐ ఆగ్రో.. ఏబీజీ షిప్‌యార్డు తదితర టాప్–50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు(సంస్థలు) దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సుమారు రూ.87,295 కోట్ల మేర బకాయి పడ్డారు. ఇందులో టాప్–10 మంది ఎగవేతదారులు రూ.40,825 కోట్ల మేర షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు(ఎస్సీబీ)లకు బకాయి ఉన్నారని కేంద్రం తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి ఎస్సీబీలు మొత్తం రూ.10,57,326 కోట్ల మేర రుణాలను మాఫీ చేసినట్లు ఆర్బీఐ తెలిపిందన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి టాప్–50 ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు ఎస్‌సీబీలకు రూ.87,295 కోట్ల బకాయి పడినట్లు ఆర్బీఐ తెలిపిందన్నారు. ఇందులో పరారైన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ సంస్థ అత్యధికంగా రూ.8,738 కోట్లు ఎస్‌సీబీలకు బకాయి పడింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కలి్పంచే నిబంధన 2007 నుంచే ఉందని మంత్రి వివరించారు. మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన..2022–23 సంవత్సరాల్లో నమోదైన 66,069 ఆన్లైన్ మోసాల ఘటనల్లో రూ.85.25 కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పారు. -
మెహుల్ చోక్సీ బ్యాంక్, డీమ్యాట్, ఫండ్ ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: భారత్ నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ చెల్లించాల్సిన రూ.5.35 కోట్ల బకాయిల రికవరీ దిశలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌ల జప్తునకు ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేర్లలో మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడిన కేసులో సెబీ 2022 అక్టోబర్‌లో విధించిన జరిమానాను చెల్లించడంలో చోక్సీ విఫలమైన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ గ్రూప్‌లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చోక్సీ, మరో ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి మామ కావడం గమనార్హం. ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని రూ.14,000 కోట్లకు పైగా మోసగించినట్లు వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీఎన్బీ స్కామ్ వెలుగులోనికి వచ్చిన తర్వాత 2018 తొలి నాళ్లలో వీరు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా లేదా బార్ముడాలో ఉన్నారని వార్తలు వస్తుండగా, మోడీ బ్రిటిష్ జైలులో ఉన్నారు. తనను అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను కోర్టులో ఆయన సవాలు చేశారు. -
మేహుల్ చోక్సీపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త మేహుల్ చోక్సీపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పదేళ్ల నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా 45 రోజుల్లోగా చెల్లించమని ఆదేశిస్తూ రూ. 5 కోట్ల జరిమానా సైతం విధించింది. గీతాంజలి జెమ్స్ కౌంటర్లో అక్రమ లావాదేవీలు చేపట్టిన అభియోగాలపై సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. దీంతో సెక్యూరిటీల మార్కెట్లో చోక్సీ పదేళ్లపాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గీతాంజలి జెమ్స్ షేర్ల ట్రేడింగ్‌లో ఇన్సైడర్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చోక్సీపై సెబీ ఏడాది కాలం నిషేధాన్ని, రూ. 1.5 కోట్ల జరిమానాను విధించింది. ఇక 2020 ఫిబ్రవరిలో లిస్టింగ్ తదితర పలు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ రూ. 5 కోట్ల జరిమానా చెల్లించవలసిందిగా చోక్సీతోపాటు, గీతాంజలి జెమ్స్‌ను సెబీ ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్, చైర్మన్ చోక్సీ నీరవ్ మోడీకి మేనమావకాగా.. వీరిరువురిపైనా పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్లకుపైగా మోసం చేసిన కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2018 మొదట్లో పీఎన్బీ మోసం బయటపడిన తొలినాళ్లలోనే చోక్సీ, మోడీ విదేశాలకు తరలిపోయారు. చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాలలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వెలువడగా.. ఇండియాకు అప్పగించాలన్న ప్రభుత్వ వాదనను బ్రిటిష్ జైల్లో ఉన్న మోడీ వ్యతిరేకిస్తున్నారు. -
నీరవ్ మోదీకి ఈడీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పీఎన్బీని రుణాల పేరుతో రూ 14,000 వేల కోట్ల మేర మోసగించి విదేశాల్లో తలదాచుకున్న నీరవ్ మోదీకి ఈడీ గట్టిషాక్ ఇచ్చింది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల కంపెనీలకు చెందిన రూ 1350 కోట్ల విలువైన వజ్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలను హాంకాంగ్ నుంచి ఈడీ స్వాధీనం చేసుకుంది. వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. నీరవ్‌ను అప్పగించాలని భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత ఏడాది లండన్ కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్బీని మోసగించిన కేసులో నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : నీరవ్ మోడీకి షాకిచ్చిన స్పెషల్ కోర్టు -
పీఎన్బీ స్కామ్ : చోక్సీ ఫ్యాక్టరీని అటాచ్ చేసిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్ నిందితుడు, పరారీలో ఉన్న డైమండ్ జ్యూవెలర్ మెహుల్ చోక్సీకి చెందిన రూ 13 కోట్ల విలువైన ఆస్తిని శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది. థాయ్‌లాండ్‌లోని రూ 13 కోట్లకు పైగా విలువైన గీతాంజలి గ్రూప్‌కు చెందిన ఫ్యాక్టరీని ఈడీ పీఎంఎల్ఏ చ్టం కింద అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫ్యాక్టరీ గీతాంజలి గ్రూప్‌కు చెందిన అభేక్రెస్ట్ (థాయ్‌లాండ్) లిమిటెడ్‌దిగా భావిస్తున్నారు. పీఎన్బీని మోసగించడం ద్వారా నకిలీ హామీలతో ఈ సంస్థ రూ 92.3 కోట్ల రుణాలను పొందినట్టు విచారణలో వెల్లడైందని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విదేశీ ఆస్తికి సంబంధించి, దాని యాజమాన్య హక్కులపై కీలక ఆధారాలు రాబట్టిన తర్వాతే అటాచ్ చేశామని తెలిపింది. దీంతో పీఎన్బీ స్కామ్‌లో ఇప్పటివరకూ దాదాపు రూ 4765 కోట్ల మేర ఆస్తుల అటాచ్ పూర్తయిందని ఈడీ వెల్లడించింది. -
పీఎన్బీ స్కాం: మరో షాకింగ్ న్యూస్
సాక్షి,ముంబై: అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎన్బీ కుంభకోణంలో మరిన్ని షాగింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న మోసాల విలువ మరింత మరింత విస్తరిస్తోంది. తాజాగా పీఎన్బీ స్కాం కీలక నిందితుడుగా ఉన్న గీతాంజలి ప్రమోటర్ మె హుల్ చోక్సీ పై పంజాబ్ నేషనల్బ్యాంక్ సీబీఐ వద్ద మరో ఫిర్యాదును నమోదు చేసింది. అదనంగా మరో రూ.942 కోట్ల మోసాన్ని గుర్తించినట్టు తెలిపింది. దీంతో గీతాంజలి జెమ్స్ మొత్తం అక్రమాల విలువ 7 వేలకోట్లకు పై మాటే. కాగా మొదట్లో 12వేలకోట్లకు పైగా పీఎన్బీని డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ , చోక్సీ ముంచేసినట్టుగా పీఎన్బీ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బ్యాంకు అందించిన సమాచారం ప్రకారం ఈ కుంభకోణం విలువ 13వేలకోట్లను దాటింది. తాజా ఫిర్యాదుతో నీరవ్ మోదీ గేట్ స్కాం మొత్తం మోసం విలువ 20వేల కోట్ల రూపాయలను దాటేసింది. -
సీబీఐ అదుపులో గీతాంజలి కీలక అధికారి
సాక్షి ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు మరో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గీతాంజలి గ్రూప్‌లో బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ చితాలియాను మంగళవారం సీబీఐ ప్రశ్నిస్తోంది. పీఎన్బీ మెగా స్కాంకు సంబంధించి బ్యాంకాక్‌నుంచి ముంబై విమానాశ్రయం చేరుకున్న విపుల్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు నేరుగా సీబీఐ ఆఫీసుకు వెళ్లి అక్కడ ప్రశ్నిస్తున్నారు. దాదాపు రూ.13వేల కోట్ల భారీ మోసంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో పాటు అతడి మామ గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మోదీ, మెహెల్ విదేశాలకుచెక్కేశారు.దీంతో రెండు కంపెనీలకు చెందిన కీలక ఉద్యోగులతో , పీఎన్బీ బ్యాంకు పలువురు సీనియర్ అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇది ఇలా ఉంటే ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు ఎండీ శిఖా శర్మకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. -
మెహుల్ చోక్సీపై ఈడీ కొరడా
సాక్షి, ముంబై: పీఎన్బీ మెగా స్కాంలో నిందితుడు గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీపై ఈడీ కొరడా ఝళిపించింది. దర్యాప్తులో భాగంగా కీలక నిందితుడు మెహుల్, గీతాంజలి గ్రూపునకు చెందిన 12వందలకోట్ల రూపాయలకుపైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఎటాచ్ చేసిన మొత్తం 41 ఆస్తుల్లో విలువైన ఫాంహౌస్ ఇతర ప్లాట్లు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం విచారణలో భాగంగా మొత్తం రూ.1,217.2 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఈడీ ప్రకటించింది. ముఖ్యంగా ముంబైలో 15 ఫ్లాట్లు, 17 కార్యాలయ ప్రాంగణాలు, కోల్‌కతాలోని మాల్, అలిబాగ్‌లో నాలుగు ఎకరాల ఫాం హౌస్, తమిళనాడులోని నాసిక్, నాగపూర్, పన్వేల్, విలుపురం వంటి ప్రాంతాల్లో 231 ఎకరాల భూమి ఉన్నాయి. వీటితోపాటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న 170ఎకరాల పార్కు ను కూడా ఎటాచ్ చేసింది. దీని రూ. 500 కోట్ల రూపాయలని ఈడీ తెలిపింది. అంతేకాదు చోక్సీకి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయలని కూడా ఈడీ ప్రభుత్వాన్ని కోరింది. -
ప్రమాదంలో 10వేల ఉద్యోగాలు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన భారీ కుంభకోణంతో, వేల సంఖ్యలో ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయి. జెమ్స్ అండ్ జువెల్లరీ రంగంలో పనిచేసే దాదాపు 10వేల మంది ఉద్యోగులపై పీఎన్బీ స్కాం ప్రతికూల ప్రభావం చూపనుందని తాజా రిపోర్టు వెల్లడించింది. నీరవ్ మోదీ సంస్థలు, గీతాంజలి గ్రూప్‌కు చెందిన వ్యాపారాల్లో ఆందోళనలు కొనసాగుతుండటంతో, ఈ ప్రభావం జువెల్లరీ రంగంపైనా పడుతోందని పేర్కొంది. అంతేకాక బ్యాంకింగ్ రంగంలో 11 శాతంగా ఉన్న జెమ్స్, జువెల్లరీల నిరర్థక ఆస్తులు, 30 శాతానికి పెరుగనున్నాయని కేర్ రేటింగ్స్ రిపోర్టు వెల్లడించింది. నీరవ్ మోదీ సంస్థలు, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సికి చెందిన సంస్థలు కలిసి తమ బ్యాంకులో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాగానే ఇరువురికి చెందిన సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు కొరడా ఝుళిపించాయి. దీంతో తాము వేతనాలు చెల్లించే పరిస్థితిలో లేమని, వేరేది చూసుకోడంటూ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలు తన ఉద్యోగులకు లేఖ రాశారు. గీతాంజలి గ్రూప్, నీరవ్ మోదీ సంస్థలు మూత ప్రభావం: జువెల్లరీ రంగంలో విదేశీ వాణిజ్యం 2018-19లో 5 శాతం నుంచి 6 శాతం తగ్గనుంది. మొత్తంగా జువెల్లరీ విక్రయాలపై 16 శాతం ప్రభావం పడనుంది ఈ రెండు సంస్థలకు చెందిన 3వేల మంది శాశ్వత ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. మరో 7వేల నుంచి 8వేల మంది తాత్కాలిక ఉద్యోగులపైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం జువెల్లరీ రంగంలో ఎన్పీఏలు 30 శాతం పెరుగనున్నాయి బ్యాంకులపై ఎన్పీఏల ప్రభావం జువెల్లరీ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.21వేల కోట్లకు పైన ఉన్నాయి. వీటిలో ఎక్కువగా గీతాంజలి జెమ్స్, నీరవ్ మోదీ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు ఉన్నట్టు ఆర్బీఐ డేటాలో తెలిసింది. కేవలం ఉద్యోగవకాశాలు, బ్యాంకులపైనే కాక, ఈ స్కాం అంతర్జాతీయ వ్యాపారం, దేశీయ రెవెన్యూలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుబాటులో ఉన్న 22 కంపెనీల డేటా ప్రకారం జువెల్లరీ రంగంలో మొత్తం 22వేల మంది ఉద్యోగులున్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలకు చెందిన కంపెనీల్లోనే 12-15 శాతం మంది ఉద్యోగులున్నారని కేర్ రేటింగ్స్ తెలిపింది. దేశంలో గీతాంజలి జెమ్స్ అతిపెద్ద జువెల్లరీ రిటైలర్స్గా ఉంది. దీని మార్కెట్రూ.3,90,000 కోట్లు. -
3500 ఉద్యోగులపై పిడుగు
సాక్షి,న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడు, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ కూడా చేతులెత్తేశాడు. మీకు జీతాలు చెల్లించలేను, వేరే ఉద్యోగాలు వెతుక్కోడంటూ ఉద్యోగుల నెత్తిన భారీ పిడుగు వేశాడు. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు ఒక లేఖ రాశాడు. దీంతో గీతాంజలి జెమ్స్ లో పనిచేస్తున్న 3500మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయి. విధిని ఎదుర్కొంటా.. ఎలాంటి నేరమూ, తప్పూ చేయలేదు..ఎప్పటికైనా నిజం నిగ్గుతేలుతుందంటూ మెహుల్ రాసిన లేఖను న్యాయవాది సంజయ్ అబోట్ విడుదల చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థల దాడులు, సృష్టించిన ఆందోళన కారణంగా తాను అనేక సమస్యలు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నాడు. అంతేకాదు తన ఉద్యోగుల్లో భయాన్ని, మానసిక ఒత్తిడిని సృష్టిస్తున్నారంటూ మొసలి కన్నీరు కార్చాడు. చోక్సీ లేఖలోని కొన్ని ముఖ్యాంశాలు నా పైన, మన సంస్థపైన జరుగుతున్న అన్యాయమైన దాడి, భయాందోళన నేపథ్యంలో నేను ఈ లేఖ రాస్తున్నారు. నిజమైన భారతీయ గౌరవానికి ప్రతీకగా నిజాయితీగా, సమగ్రతతో, కస్టమర్లకు సేవలందించే లక్ష్యంలో అనేక ఉత్థాన పతనాలను మనం చూశాం. కానీ పీఎన్బీ స్కాంలో అరోపణలు, మీడియా అత్యుత్సాహంతో అంతా తుడిచి పెట్టుకుపోయింది. రోజు రోజుకి పరిస్థితి ఘోరంగా పోతోంది. సంస్థను ఈ స్థితికి తీసుకురావడానికి మీరంతా ఎంత శ్రమించారో నాకు తెలుసు. ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థల దాడులు, సృష్టించిన ఆందోళన కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాను. రాజకీయ ప్రకటనలు నన్ను, నా కుటుంబ సభ్యులను తీవ్ర అభద్రతకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వివిధ బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకొన్న నేపథ్యంలో మీ బకాయిలు తీర్చడం, భవిష్యత్ జీతాలను చెల్లించటం, ఇప్పుడు నాకు చాలా కష్టం. మొదటగా, వేతనాల చెల్లింపు గురించి ఎలాంటి నిర్ధారణ లేదు, రెండోది, విద్యుత్, నిర్వహణ ఛార్జీలు చెల్లించే పరిస్థితి గురించి కూడా చెప్పలేను. మూడవది, దర్యాప్తు సంస్థల అన్యాయమైన దర్యాప్తు కారణంగా నాతో సంబంధం ఉన్న ఎవ్వరూ బాధపడకూదు. అందుకే మరెక్కడైనా ఇతర కెరీర్ అవకాశాలను చూసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆఫీసు నుంచి జారీ చేయబడిన ల్యాప్‌టాప్ / మొబైల్ ఫోన్లకు సంబంధించి గత బకాయిలను క్లియర్ చేసుకోగలిగితే మీరు కొనసాగించవచ్చు. పరిస్థితి చక్కబడిన తరువాత ఉద్యోగుల బకాయిలను తప్పకుండా చెల్లిస్తానని హామీ ఇస్తున్నాను. భవిష్యత్తులో సమస్యలన్నీ తొలిగిపోతాయని ఆశిస్తున్నాను. ఆ సంతోష సమయంలో తిరిగి మనం అందరం కలిసి పనిచేద్దాం. -
పాతాళంలో గీతాంజలి జెమ్స్
పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణం దెబ్బకు గీతాంజలి జెమ్స్ షేర్లు పాతాళానికి పడిపోయాయి. వరుసగా ఏడు సెషన్ల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత వారం నుంచి ఇప్పటి వరకు గీతాంజలి జెమ్స్ షేర్లు దాదాపు 58.5 శాతం కుప్పకూలాయి. దీంతో గీతాంజలి జెమ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా రూ.435.41 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. నేటి ట్రేడింగ్‌లోనే బీఎస్ఈలో ఈ స్టాక్ 4.92 శాతం కిందకి పడిపోయింది. ఎన్ఎస్ఈలో కూడా 4.92 శాతం కిందకి పడిపోయి రూ.26.05 వద్ద ట్రేడవుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన కుటుంబానికి చెందిన ప్రమేయమున్నట్టు తెలిసింది. దీంతో వారికి చెందిన గీతాంజలి జెమ్స్‌పై సీబీఐ, ఈడీ అధికారులు భారీ ఎత్తున్న తనిఖీలు చేస్తున్నారు. కొన్ని షోరూంలను సీజ్ కూడా చేశారు. ఐటీ కూడా గీతాంజలి జెమ్స్‌కు చెందిన కొన్ని ఆస్తులను సీజ్ చేసింది. మరోవైపు గీతాంజలి జెమ్స్ మూతపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు సైతం వార్నింగ్ లేఖలు వెళ్లాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గీతాంజలి జెమ్స్ షేరు విలువ భారీగా పతనమవుతోంది. -
జీతాలు ఇవ్వలేం, వేరేది చూసుకోండి
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,400 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, తన ఉద్యోగులకు లేఖ రాశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఇతర అవకాశాలు చూసుకోవాలంటూ ఉద్యోగులకు సూచించారు. అయితే గతంలో ఉన్న బకాయిలను చెల్లించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ బ్యాంకులను కోరినట్టు కూడా తెలిపారు. స్టాక్స్, బ్యాంకు అకౌంట్లు యాక్సస్ లభిస్తే, గత బకాయిలు చెల్లిస్తానంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతమైతే జీతాలు చెల్లించలేనని పరిస్థితులో ఉన్నానంటూ చేతులు ఎత్తేశారు. అంతేకాక ఉద్యోగులను రిలీవ్ ఆర్డర్లు కూడా తీసుకోవాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణాలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. అయితే తమ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి చట్టపరమైన సహాయం తీసుకుంటామని తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు దాఖలు చేసిన ఫిర్యాదులతో నీరవ్‌మోదీ సంస్థలు తీవ్ర ఆందోళనలో పడిన సంగతి తెలిసిందే. నీరవ్‌మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సికి చెందిన గీతాంజలి జెమ్స్ షోరూంలు మూతపడుతున్నాయని, దీంతో 5000 మంది ఉద్యోగులు రోడ్డున పడబోతున్నారని రిపోర్టులు వచ్చాయి. మరోవైపు నీరవ్, మెహుల్ ప్రాపర్టీలు, షోరూంలపై సీబీఐ, ఈడీ భారీగా తనిఖీలు చేపడుతోంది. పలు దుకాణాలను సైతం సీజ్ చేస్తున్నాయి. నీరవ్ మోదీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ పీఎన్బీ ఆరోపణలను ఖండిస్తున్నారు. -
పీఎన్బీ స్కాం: ఇద్దరు టాప్ హీరోయిన్లు
సాక్షి, ముంబై: పీఎన్బీ మెగా స్కాంకు సంబంధించిన వార్తల్లోకి తాజాగా బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్, బిపాసా వచ్చి చేరారు. ఇప్పటివరకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరు ఈ స్కాంలో మారు మోగితే.. ఇపుడు ఈ కోవలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, బ్యూటీ క్వీన్ బిపాసా నిలిచారు. రూ.11, 400 కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీ మామ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ తమకు సొమ్ము ఎగ్గొట్టాడంటూ ఆరోపించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. గీతాంజలి జెమ్స్ కంపెనీ ఒప్పందంలో భాగంగా తమ రెమ్యునరేషన్ పూర్తిగా చెల్లించలేదని, భారీ ఎత్తున బకాయి పడిందని కంగనా ఆరోపించారు.. గీతాంజలి బ్రాండ్ నక్షత్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంగనా ఒప్పందం ప్రకారం పూర్తి సొమ్ము చెల్లించలేదని ఆరోపించారని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. 2016నుంచి ఈ బకాయిలు చెల్లించలేదని కంగనా తెలిపింది. కాగా కంగనాకంటే ముందు ఈ కంపెనీకి ఐశ్వర్య, కత్రినా కైఫ్ ప్రచారకర్తలుగా ఉన్నారు. మరోవైపు గీతాంజలికే చెందిన మరో బ్రాండ్ గిలికు అంబాసిడర్‌గా ఉన్న బిపాసా కూడా మెహుల్ చోక్సీపై ఆరోపణలు గుప్పించారు. 2008లో కాంట్రాక్టు ముగిసిన తరువాత తన ఫోటోలను వార్తాపత్రికల్లో వాడుకున్నారని బిపాసా ఆరోపించారు. ఈ విషయంలో తన మేనేజర్ కంపెనీని సంప్రదించినప్పటికి ప్రయెజనం లేదన్నారు. దీని మూలంగా అనేక జ్యుయలరీ ఎండార్స్మెంట్లను తాను కోల్పోయానని పేర్కొన్నారు. ప్రస్తుతం గిలి బ్రాండ్‌కు క్రితి సనన్ ప్రచార కర్తగా ఉన్నారు. కాగా కుంభకోణం నేపథ్యంలో గత ఏడాది ప్రారంభంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన ప్రియాంక చోప్రా నీరవ్‌మోదీ డైమండ్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రియాకంతో పాటు ప్రకటనల్లో కనిపించిన మరో నటుడు సిద్దార్థ మల్హోత్రా కంపెనీతో తన కాంట్రాక్టు గత ఏడాదే ముగిసినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పీఎన్బీ స్కాం : రోడ్డున పడబోతున్న ఉద్యోగులు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న భారీ కుంభకోణం గీతాంజలి జెమ్స్ ఉద్యోగులకు ఎసరు తెచ్చి పెట్టింది. నీరవ్ మోదీ అంకుల్ మెహుల్ చౌక్సికి చెందిన ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవింగ్ లెటర్లు తీసుకోవాలంటూ గీతాంజలి జెమ్స్ కోరింది. ఈ నేపథ్యంలో గీతాంజలి జెమ్స్‌ను మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో పాల్పడిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సిలు ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. ఈ స్కాం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, చౌక్సి దేశం విడిచి పారిపోయారు. అయితే పీఎన్బీ మోసంలో చౌక్సి ప్రమేయాన్ని గీతాంజలి జెమ్స్ ఖండిస్తోంది. చౌక్సికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మోదీకి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలు కూడా తప్పుడువేనంటూ నీరవ్ మోదీ న్యాయవాది విజయ్ అగర్వాల్ పేర్కొంటున్నారు. ''ఎవరూ దీన్ని హేతుబద్ధంగా చూడటం లేదు. అన్ని కేసుల్లో ఇదే జరుగుతుంది. బోఫోర్స్ కేసులో, 2జీ కేసులో, బొగ్గు కుంభకోణం కేసులో ఇదే జరిగింది. ఈ కేసులో కూడా ఇదే జరుగుతుంది. ఎవరూ దీన్ని హేతుబద్ధంగా చూడరు'' అని అగర్వాల్ అన్నారు. -
‘గీతాంజలి’కి మరోఅధికారి గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతాంజలి జెమ్స్ సంస్థనుంచి మరో టాప్ ఎగ్జిక్యూటివ్ తప్పుకున్నారు. రూ. 11,400కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ మామ, మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) చంద్రకాంత్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పదవినుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే గీతాంజలినుంచి కంపెనీ సెక్రటరీ ఫంకూరి వారంగీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నీరవ్ మోదీ ఇంటిపైనా, ఆఫీసులపై ఈడీ దాడులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. ముంబైలోని 5 ప్రాంతాల్లో, సూరత్‌లోని 3 ఏరియాల్లో, ఔరంగాబాద్, ఢిల్లీలో సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నీరవ్ కంపెనీకి చెందిన ఉద్యోగులను సీబీఐ ప్రశ్నిస్తోంది. ఈ మెగా స్కాంలో గీతాంజలి జెమ్స్ షేరు వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా భారీగా పతనాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 10శాతానికి పైగా నష్టపోయింది. ఈ మొత్తం నాలుగు సెషన్లలో 50 శాతానికిపై కుప్పకూలి రికార్డ్ కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి 14నుంచి ఇప్పటివరకూ రూ. 344 కోట్ల రూపాయల గీతాంజలి మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది. అటు పంజాబ్ నేషనల్ బ్యాంకు షేరు కూడా 10శాతానికి పైగా నష్టపోయింది. -
పీఎన్బీ స్కాం: న్యూ ట్విస్ట్
సాక్షి, ముంబై: నీరవ్ మోదీ (48) న్యూయార్క్‌లో ఒక హోటల్లో ఉన్నాడని పలు వార్తలు హల్ చల్ చేస్తుండగా... ఆయన ఎక్కడ ఉన్నదీ తమకు స్పష్టంగా తెలియదనీ విదేశాంగ శాఖ ప్రకటించింది. నీరవ్ మోదీ తమ అధికారులు ఎవరితోనూ సన్నిహితంగా లేడని, ఈ దశలో ఎక్కడ ఉన్నదీ చెప్పలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అతని పాస్‌పోర్ట్ నిలిపివేసినందువల్ల ఇక వేరే ఏ దేశానికి వెళ్లలేడని ఆయన పేర్కొన్నారు. ఇపుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడన్నారు. వేలకోట్ల రూపాయల ఎగవేసి లండన్‌కు చెక్కేసిన మాల్యాను ఇండియాకు వెనక్కి రప్పించేందుకు కష్టాలు పడుతున్న కేంద్రప్రభుత్వానికి మోదీని తిరిగి దేశానికి రప్పించడం పెద్ద సవాలేనని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు నీరవ్ మోదీ కేసు మాల్యా మాదిరిగా లోన్ డిఫాల్ట్ కేసు కాదని, నీరవ్ మోదీ వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను బురిడీ కొట్టించాడని, మోస పూరితంగా వ్యవహరించాడని ఇది తీవ్రమైన అంశంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. అయితే బెల్జియన్ పాస్‌పోర్ట్ ఉంటే.. పీఎన్బీకి భారీ ఎత్తున నష్టం కలిగించి దేశం విడిచిన డైమండ్ వ్యాపారిని దేశానికి రప్పించడం అంత సులువు కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు దర్యాప్తు సంస్థ సీబీఐ తాజా ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. గీతాంజలి జెమ్స్ సహా (గిలి ఇండియా, నక్షత్ర బ్రాండ్) మూడు కంపెనీలను ఎఫ్ఐఆర్లో చేర్చింది. గీతాంజలి జెమ్స్ రూ. 4,886కోట్ల మేరకు మోసానికి పాల్పడిందని సీబీఐ వెల్లడించింది. ఈ మూడు కంపెనీలకు 36 అనుబంధ సంస్థలున్నాయి. వీటిల్లో 17 సంస్థలు ముంబైలోను, ఒకటి హైదరాబాద్‌లోను ఉండగా, మిగిలినవి విదేశాల్లో ఉన్నాయని సీబీఐ శుక్రవారం నాటి విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై, పుణే, సూరత్, హైదరాబాద్, కోయంబత్తూర్ తదితర 26 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తోంది. గీతాంజలి గ్రూపునకు చెందిన ఆస్తులు, ఇతర నిందిత కంపెనీ డైరెక్టర్ల నివాసాలతోపాటు ప్లాంట్లు, ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో ఈ దాడులు చేపట్టినట్టు సీబీఐ అధికారి తెలిపారు. అలాగే మోదీ అరెస్ట్‌కు సహకరించాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను సీబీఐ కోరింది. ఇది ఇలా ఉంటే భారీ స్కాం వెలుగులోకి రావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు శుక్రవారం సాయంత్రం ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వహించింది. ఆరునెలల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని హామి ఇచ్చింది. -
మెగా స్కాం: ఢమాలన్న గీతాంజలి
సాక్షి, ముంబై: పీఎన్బీ మోగా స్కాం రేపిన ప్రకంపనలు జ్యుయలరీ షేర్లకు అశనిపాతంలా చుట్టుకున్నాయి. వేలకోట్ల స్కాంలో కీలకు నిందితుడైన మెహుల్ చెక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ శుక్రవారం కూడా ఢమాల్ అంది. వరుసగా మూడో సెషన్లో అమ్మకాల వెల్లువ సాగడంతో 52వారాల కనిష్టాన్ని తాకింది. గీతాంజలి జెమ్స్ 20శాతం కుదేలైంది. ఇతర ఆభరణాల షేర్లలో తంగమైయిల్ జ్యువెలరీ 5 శాతం , త్రిభువన్ దాస్ భీంజీ జవేరి (టీబీజెడ్) 3శాతం, రాజేష్ ఎక్స్పోర్ట్ 1 శాతం నష్టపోయింది. పీసీ జ్యువెలర్స్ మాత్రం పాజిటివ్‌గా ట్రేడ్‌అయింది. కాగా ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ముంబై బ్రాంచీలో జరిగిన 177 కోట్ల డాలర్ల(సుమారు రూ. 11,400 కోట్లు) కుంభకోణంలో గీతాంజలి జెమ్స్‌మై కూడా కేసు నమోదుకావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో మరోసారి భారీ అమ్మకాలకు తెరతీశారు. గీతాంజలి, గిన్ని, నక్షత్ర, నీరవ్‌మోదీ లాంటి అతిపెద్ద జ్యువెలర్స్‌నుపరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. వివిధ బ్యాంకులతో వారి లావాదేవీలను సీబీఐ, ఈడీ పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు ముంబై బ్రాంచీలో కుంభకోణం పీఎన్బీ షేరు సైతం వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిసింది. 2శాతం పతనమైంది. అటు ఈ భారీ స్కాం వెలుగు చూడటంలో మార్కెట్ రెగ్యులేటరీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ విచారణ ప్రారంభించింది. సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇప్పటికే చోక్సీ తో సహా నీరవ్ మోదీకి మోడీకి అన్ని సంస్థల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, తదితర అంశాల విశ్లేషణ మొదలు పెట్టింది. సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని రెగ్యులేటరీ అధికారి తెలిపారు. -
హైదరాబాద్ గీతాంజలికి ఈడీ షాక్
న్యూఢిల్లీ, హైదరాబాద్ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన సెలబ్రిటీ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులు, షోరూంలు, ఆఫీసులపై దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ రావిర్యాలలో ఉన్న జెమ్స్ పార్క్‌పై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. అంతేకాక నీరవ్ మోదీకి చెందిన గీతాంజలి జెమ్స్ షోరూంల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే గీతాంజలి జెమ్స్ యజమాని మెహిల్‌పై ఈడీ పీఎంఎల్ఏ కేసును నమోదుచేసింది. పీఎన్బీ స్కాంలో మెహిల్‌ను నిందితుడిగా ఈడీ పేర్కొంది. ఆయన ఇంట్లీ, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. గత దశాబ్దకాలంగా గీతాంజలి జెమ్స్ పేరుతో నీరవ్ మోదీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సూరత్, ముంబైలలో గీతాంజలి జెమ్స్ షోరూంలు ఉన్నాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్, సూరత్‌లలో నీరవ్ మోదీకి డైమాండ్ తయారీ కేంద్రాలున్నాయి. హైదరాబాద్ రావిర్యాల సెజ్‌లో ఆయనకు అప్పటి ప్రభుత్వం భూకేటాయింపులు చేసింది. అటు దేశవ్యాప్తంగా ఉన్ననీరవ్ మోదీ షోరూంలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఆయన జువెల్లరీ షోరూంలను సైతం సీజ్ చేస్తోంది. కాగ, గీతాంజలి జెమ్స్‌కు దేశవ్యాప్తంగా వీఐపీలు కస్టమర్లుగా ఉన్నారు. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై నీరవ్ మోదీ దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడని సంగతి తెలిసింది. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే కొన్ని రోజుల ముందే ఆయన విదేశాలకు చెక్కేశారు. తమ బ్యాంకులో భారీ మొత్తంలో మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నాయంటూ బుధవారం పీఎన్బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కుంభకోణానికి, నీరవ్ మోదీకి సంబంధమున్నట్టు ఆరోపించింది. దీంతో ఈ అవినీతి తిమింగలాన్ని పట్టుకోవడం కోసం ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. కానీ అప్పటికే ఆయన దేశం విడిచిపారిపోయారు. ప్రస్తుతం నీరవ్‌మోదీ న్యూయార్క్‌లో ఉన్నట్టు అధికారులు ట్రేస్ చేశారు. ఈ కుంభకోణానికి పాల్పడిన ఎవరిన్నీ ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని బ్యాంకు నిన్నటి సమావేశంలో హెచ్చరించింది. కుంభకోణం వెలుగులోకి రాగానే పీఎన్బీ షేరు భారీగా పడిపోయింది. ఈ బ్యాంకు ఇన్వెస్టర్లు దాదాపు రూ.8000 కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. మరోవైపు గీతాంజలి జెమ్స్ షేర్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. మొత్తం 12 జాతీయ బ్యాంకులను నీరవ్ ముంచినట్టు కాంగ్రెస్ ఆరోపించింది. -
జిల్ జిగేల్ మంటున్న జువెల్లరీ షేర్స్
బంగారంపై జీఎస్టీ పన్ను రేటుపై గతకొంతకాలంగా సాగుతున్న సస్పెన్షన్ కు తెరదించడంతో జువెల్లరీ షేర్లు జిల్ జిగేల్ మంటున్నాయి.. గోల్డ్ , బంగార ఆభరణాలపై 3 శాతం పన్ను వేయనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో జువెల్లరీ రిటైలర్ షేర్లు సోమవారం మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. జీఎస్టీ బూస్ట్ తో టైటాన్ కంపెనీ, పీసీ జువెల్లరీ, గీతాంజలి జెమ్స్, తారా జువెల్స్ షేర్లు 6 శాతం నుంచి 15 శాతం మధ్యలో ట్రేడవుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించిన పన్ను రేట్లు తమకు ఆహ్వానించదగినగానే ఉన్నాయని జెమ్స్ అండ్ జువెల్లరీ ఇండస్ట్రీ చెబుతోంది. ప్రస్తుతం జువెల్లరీ ఇండస్ట్రీ 2 నుంచి 2.5 శాతం పన్ను చెల్లిస్తోంది. జీఎస్టీ పన్ను 3 శాతం. ఈ పన్ను రేటుతో జువెల్లరీ, బంగారం ఇండస్ట్రిపై ఎలాంటి ప్రభాముండదని డబ్ల్యూహెచ్పీ డైరెక్టర్ ఆదిత్య పేథె చెప్పారు. ఈ పన్ను రేట్లు అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని సక్రమమైన మార్గంలో ట్రేడ్ నిర్వహించడానికి ప్రోత్సహిస్తాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. బంగారంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ప్రోత్సహకరంగా ఉందని, లక్షల మంది పొట్టకూటిగా ఉన్న ఇండస్ట్రిని సుస్థిరంగా ఉంచేలా ఇది దోహదం చేస్తుందని వరల్డ్ గోల్డ్ కైన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరామ్ పీఆర్ చెప్పారు. జువెల్లరీ తయారీదారుల ఇతర షేర్లు పీసీ జువెల్లరీ 8 శాతం జంప్ చేసింది. గీతాంజలి జెమ్స్, టాటా జువెల్స్ షేర్లు కూడా 8 శాతం పైగి ఎగిశాయి. ప్రారంభంలో నిఫ్టీ ఫ్లాట్ గా ఉన్నప్పటికీ, ఈ షేర్లు మంచి ప్రదర్శనను కనబర్చాయి. -
ఫలితాల జోరుతో గీతాంజలి
ముంబై: ఒకవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంటే ఆభరణాల షేర్లు మాత్రం బుధవారం నాటిమార్కెట్లో మెరుపులు మెరిపించాయి. ప్రధానంగా మంగళవారం ఫలితాలను ప్రకటించిన గీతాంజలి జెమ్స్ షేరు భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం భారీ నికర లాభాలను ప్రకటించడంతో ఈ షేర్ 20 శాతం లాభాలతో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ జోరుతో తాజా జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్, త్రిభువన్దాస్(టీబీజెడ్) టైటన్, రాజేష్ ఎక్స్పోర్ట్స్తదితర షేర్లు దూసుకెళ్లాయి. . పెళ్లిళ్లు, పండుగల సీజన్ పుత్తడి ధరలకు పాజిటివ్ సంకేతతమని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. రుణాల ఖర్చు గణనీయంగా తగ్గిందని సంస్థ సలహాదారు అభిషేక్ గుప్త తెలిపారు. , భవిష్యత్తులో మరింత సంస్థ వడ్డీ ఖర్చు తదుపరి త్రైమాసికాల్లో మరింత దిగి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
దూసుకుపోయిన గీతాంజలి
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో ప్రముఖ ఆభరణాల సంస్థ గీతాంజలి జెమ్స్ దూసుకుపోయింది. ఏకీకృత నికర లాభాల్లో దాదాపు మూడు రెట్ల వృద్ధిని నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో రూ 57 కోట్ల నికర లాభాలను గడించినట్టు వెల్లడించింది. గత ఏడాది రూ 19.91 కోట్లుగా ఉంది. దాని నికర ఆదాయం రూ. 3,710 కోట్లకు పెరిగిందని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. 2016-17 సంవత్సరం ఏప్రిల్- జూన్ కాలంలో ఇది రూ.2,845 కోట్లు. ఇక నికర అమ్మకాలపరంగా ఈసారి రూ.2,595 కోట్లను రాబట్టిన సంస్థ..నిరుడు రూ.1,866 కోట్లను అందుకుంది. ఆభరణాల వ్యాపారంలో మంచి వృద్ధిని సాధించింది. రూ. 2,165 నుంచి 2,950 కోట్లకు పెరిగింది. డైమండ్ సెగ్మెంట్లో ఆదాయం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. రూ 848,67 కోట్ల నుంచి రూ 834,82 కోట్లకు తగ్గింది. కాగా దేశీయంలో సుమారు నాలుగువేలకు పైగా విక్రయ కేంద్రాల ద్వారా గీతాంజలి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అలాగే యూరోప్ , పశ్చిమ ఆసియాతోపాటు అమెరికా, చైనా,జపాన్ లలో స్టోర్స్ ఉన్నాయి.