పీఎన్‌బీ స్కాం: ఇద్దరు టాప్‌ హీరోయిన్లు | Kangana Ranaut, Bipasha Basu accuses Mehul Choksi Gitanjali of unpaid dues, breach of contract | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాం: ఇద్దరు టాప్‌ హీరోయిన్లు

Published Wed, Feb 21 2018 2:31 PM | Last Updated on Wed, Feb 21 2018 6:27 PM

Kangana Ranaut, Bipasha Basu accuses Mehul Choksi Gitanjali of unpaid dues, breach of contract - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై: పీఎన్‌బీ మెగా స్కాంకు సంబంధించిన వార్తల్లోకి  తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్లు కంగనా రనౌత్‌, బిపాసా వచ్చి చేరారు.  ఇప్పటివరకు  బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ ప్రియాంక  చోప్రా  పేరు  ఈ స్కాంలో  మారు మోగితే.. ఇపుడు  ఈ కోవలో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌, బ్యూటీ క్వీన్‌ బిపాసా నిలిచారు. రూ.11, 400 కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీ  మామ, గీతాంజలి జెమ్స్‌ అధిపతి మెహుల్‌ చోక్సీ​  తమకు సొమ్ము  ఎగ్గొట్టాడంటూ ఆరోపించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

గీతాంజలి జెమ్స్‌ కంపెనీ ఒప్పందంలో భాగంగా  తమ రెమ్యునరేషన్‌  పూర్తిగా చెల్లించలేదని, భారీ ఎత్తున బకాయి పడిందని కంగనా  ఆరోపించారు.. గీతాంజలి బ్రాండ్‌ నక్షత్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న  కంగనా ఒప్పందం ప్రకారం పూర్తి సొమ్ము చెల్లించలేదని ఆరోపించారని ఎకనామిక్స్‌ టైమ్స్‌ నివేదించింది.  2016నుంచి ఈ  బకాయిలు చెల్లించలేదని కంగనా  తెలిపింది. కాగా కంగనాకంటే ముందు ఈ కంపెనీకి  ఐశ్వర్య,  కత్రినా కైఫ్‌   ప్రచారకర్తలుగా ఉన్నారు.

మరోవైపు  గీతాంజలికే చెందిన మరో బ్రాండ్‌ గిలికు  అంబాసిడర్‌గా ఉన్న బిపాసా కూడా మెహుల్‌  చోక్సీపై ఆరోపణలు గుప్పించారు. 2008లో కాంట్రాక్టు  ముగిసిన తరువాత తన  ఫోటోలను వార్తాపత్రికల్లో వాడుకున్నారని బిపాసా ఆరోపించారు. ఈ విషయంలో తన మేనేజర్‌ కంపెనీని  సంప్రదించినప్పటికి ప్రయెజనం లేదన్నారు. దీని మూలంగా అనేక జ్యుయలరీ ఎండార్స్‌మెంట్లను తాను కోల్పోయానని పేర్కొన్నారు.  ప్రస్తుతం గిలి బ్రాండ్‌కు క్రితి సనన్‌ ప్రచార కర్తగా ఉన్నారు. 

కాగా కుంభకోణం నేపథ్యంలో గత ఏడాది ప్రారంభంలో బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన  ప్రియాంక  చోప్రా నీరవ్‌మోదీ డైమండ్‌ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్టు ఇప్పటికే  ప్రకటించారు.  ప్రియాకంతో పాటు  ప్రకటనల్లో  కనిపించిన మరో నటుడు సిద్దార్థ మల్హోత్రా  కంపెనీతో తన కాంట్రాక్టు గత ఏడాదే ముగిసినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement