పీఎన్‌బీ స్కాం: మరో షాకింగ్‌ న్యూస్‌ | PNB has filed a complaint in CBI, a geetanjali of 942.18 crores of additional fraud | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాం: మరో షాకింగ్‌ న్యూస్‌

Published Tue, Mar 13 2018 6:31 PM | Last Updated on Tue, Mar 13 2018 6:31 PM

PNB has filed a complaint in CBI, a geetanjali of  942.18 crores of additional fraud - Sakshi

సాక్షి,ముంబై:  అతిపెద్ద బ్యాంకింగ్‌ స్కాంగా  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన  పీఎన్‌బీ కుంభకోణంలో మరిన్ని షాగింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న  మోసాల  విలువ మరింత మరింత విస్తరిస్తోంది. తాజాగా పీఎన్‌బీ స్కాం కీలక నిందితుడుగా ఉ‍న్న గీతాంజలి ప్రమోటర్‌ మె హుల్‌ చోక్సీ పై పంజాబ్‌ నేషనల్‌బ్యాంక్‌  సీబీఐ వద్ద  మరో ఫిర్యాదును నమోదు చేసింది.   అదనంగా మరో రూ.942 కోట్ల మోసాన్ని గుర్తించినట్టు తెలిపింది.   దీంతో గీతాంజలి  జెమ్స్‌ మొత్తం అక్రమాల విలువ 7 వేలకోట్లకు పై మాటే.

కాగా  మొదట్లో 12వేలకోట్లకు పైగా పీఎన్‌బీని  డైమండ్‌ వ్యాపారి నీరవ్‌మోదీ ,  చోక్సీ ముంచేసినట్టుగా పీఎన్‌బీ ఫిర్యాదు చేసింది.  ఆ తర్వాత  బ్యాంకు అందించిన సమాచారం ప్రకారం  ఈ  కుంభకోణం విలువ 13వేలకోట్లను దాటింది.  తాజా ఫిర్యాదుతో  నీరవ్‌ మోదీ గేట్‌  స్కాం మొత్తం మోసం విలువ 20వేల కోట్ల  రూపాయలను దాటేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement