సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కామ్ నిందితుడు, పరారీలో ఉన్న డైమండ్ జ్యూవెలర్ మెహుల్ చోక్సీకి చెందిన రూ 13 కోట్ల విలువైన ఆస్తిని శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది. థాయ్‌లాండ్‌లోని రూ 13 కోట్లకు పైగా విలువైన గీతాంజలి గ్రూప్‌కు చెందిన ఫ్యాక్టరీని ఈడీ పీఎంఎల్‌ఏ చ్టం కింద అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఫ్యాక్టరీ గీతాంజలి గ్రూప్‌కు చెందిన అభేక్రెస్ట్ (థాయ్‌లాండ్) లిమిటెడ్‌దిగా భావిస్తున్నారు. పీఎన్‌బీని మోసగించడం ద్వారా నకిలీ హామీలతో ఈ సంస్థ రూ 92.3 కోట్ల రుణాలను పొందినట్టు విచారణలో వెల్లడైందని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విదేశీ ఆస్తికి సంబంధించి, దాని యాజమాన్య హక్కులపై కీలక ఆధారాలు రాబట్టిన తర్వాతే అటాచ్ చేశామని తెలిపింది. దీంతో పీఎన్‌బీ స్కామ్‌లో ఇప్పటివరకూ దాదాపు రూ 4765 కోట్ల మేర ఆస్తుల అటాచ్ పూర్తయిందని ఈడీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment