
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కు రూ 13,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ భార్య ప్రీతి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మూడో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో మెహుల్ చొక్సీతో పాటు అతని భార్య ప్రతీని మరికొందరి పేర్లు చేర్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన రుణాల ఎగవేత కేసులో మెహుల్ చోక్సీకి సహాకరించారనే అభియోగాలను ఆమెపై ఈడీ మోపింది.
పీఎన్‌బీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే 2018, 2020లలో రెండు ఛార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది. కాగా మూడో ఛార్జ్‌షీట్ ఇప్పుడు వేసింది. ఇందులో మెహుల్ చోక్సీ దంపతులతో పాటు గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, గిలి ఇండియా లిమిటెడ్, నక్షత్ర బ్రాండ్ లిమిటెడ్ కంపెనీల పేర్లతో పాటు పీఎన్‌బీ బ్రాండీ హౌజ్ శాఖ మేనేజర్ గోకుల్‌నాథ్‌షెట్టిల పేర్లు చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment