సాక్షి, ముంబై: పీఎన్‌బీ మెగా స్కాంలో నిందితుడు గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీపై ఈడీ కొరడా ఝళిపించింది. దర్యాప్తులో భాగంగా కీలక నిందితుడు మెహుల్, గీతాంజలి గ్రూపునకు చెందిన 12వందలకోట్ల రూపాయలకుపైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఎటాచ్ చేసిన మొత్తం 41 ఆస్తుల్లో విలువైన ఫాంహౌస్ ఇతర ప్లాట్లు ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం విచారణలో భాగంగా మొత్తం రూ.1,217.2 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఈడీ ప్రకటించింది. ముఖ్యంగా ముంబైలో 15 ఫ్లాట్లు, 17 కార్యాలయ ప్రాంగణాలు, కోల్‌కతాలోని మాల్, అలిబాగ్‌లో నాలుగు ఎకరాల ఫాం హౌస్, తమిళనాడులోని నాసిక్, నాగపూర్, పన్వేల్, విలుపురం వంటి ప్రాంతాల్లో 231 ఎకరాల భూమి ఉన్నాయి. వీటితోపాటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న 170ఎకరాల పార్కు ను కూడా ఎటాచ్ చేసింది. దీని రూ. 500 కోట్ల రూపాయలని ఈడీ తెలిపింది. అంతేకాదు చోక్సీకి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయలని కూడా ఈడీ ప్రభుత్వాన్ని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment