attaches assets
-
హైదరాబాద్: కార్వీ స్కాంలో భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
శశికళకు షాక్
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు చెందిన సుమారు రూ.15 కోట్లను ఆదాయ పన్నుల శాఖ జప్తు చేసింది. చెన్నై టీ నగర్లో ఆమె బినామీకి చెందిన ఆంజనేయ ప్రింటర్స్ బిల్డింగ్‌ను శుక్రవారం మనీల్యాండరింగ్ చట్టం కింద సీజ్ చేసింది. 2017-21 మధ్య దివంగత జయలలిత, శశికళలకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 150 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఐటీ రైడ్లు జరిగాయి. ఆ సమయంలో ఆమె బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2020లో ఐటీ శాఖ.. శశికళ, ఆమె బంధువులకు చెందిన 84 ప్రాపర్టీలను రెండు ఫేజ్‌ల రైడ్లలో జప్తు చేసింది.నిందులో సిరుసతవూర్ ఫామ్ హౌజ్‌తో పాటు కొడనాడు ఎస్టేట్‌లోని ఆమె వాటా సైతం ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసై, సుధాగరన్ పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. -
ఆమ్వేకు భారీ షాక్ ! రూ.757 కోట్ల ఆస్తులు ఎటాచ్
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వేకు భారీ షాక్ తగిలింది, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ కంపెనికి చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసింది. ఇందులో స్థిర, చర ఆస్తుల విలువ రూ.411 కోట్లు ఉండగా మిగిలిన రూ.346 కోట్ల నగదును ఎటాచ్ చేసింది. ఆమ్మేకు చెందిన దుండిగల్‌లో ఉన్న ఫ్యాక్టరీ, ఫర్నీచర్, మెషినరీలతో పాటు ఈ కంపెనీకి చెందిన 36 బ్యాంకు ఖాతాలను ఈడీ ఎటాచ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబరులో ఈ కంపెనీలకు కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు అందిస్తున్న పొడక్టులన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, ఈ వ్యాపారంలో భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎంలో అతి పెద్ద సంస్థ అయిన ఆమ్వేకు భారీ షాక్ ఇచ్చింది ఈడీ. ED has provisionally attached assets worth Rs. 757.77 Crore belonging to M/s. Amway India Enterprises Private Limited, a company accused of running a multi-level marketing scam. — ED (@dir_ed) April 18, 2022 చదవండి: ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్‌వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ ! -
వీనస్ ఆక్వా ఫుడ్స్ డైరెక్టర్ల ఆస్తులు అటాచ్
సాక్షి, హైదరాబాద్ : వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎస్‌కే విశ్వనాథ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్, విజయవాడలో రూ 33.39 కోట్ల విలువైన (మార్కెట్ విలువ) ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. వీరు గుడివాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ19.44 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని ఈడీ అభియోగాలు మోపింది. చేపల చెరువుల కోసమని రుణం తీసుకుని ఆ నిధులను ఇతర వ్యాపారాలకు మళ్లించినట్టు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ పేర్కొంది. రుణాలను దారిమళ్లించడం, రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో మొత్తం రూ 36.97 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. నిందితులు బ్యాంకు రుణంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల నుంచి చేపల చెరువు పేరుతో రూ 22.64 కోట్ల రుణాలు తీసుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. రుణాల్లో కొంతమొత్తాన్ని నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎన్‌కే విశ్వనాథ్‌లు తమ పేరిట, తమ కుటుంబ సభ్యుల పేరిట స్ధిరాస్తులను కొనుగోలు చేసేందుకు వాడుకున్నారు. మరోవైపు రూ 1.72 కోట్లను ఆకాశమే హద్దు అనే సినిమా నిర్మాణానికి మళ్లించారని ఈడీ గుర్తించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీల్యాండరింగ్ నిబంధనల కింద ఈడీ వీనస్ ఆక్వా ఫుడ్స్ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. చదవండి : మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట ఫరూఖ్ -
డీసీహెచ్ఎల్ ఆస్తుల అటాచ్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్)కు చెందిన రూ.122.15 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)– 2002 ప్రకారం బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, గుర్గావ్, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉన్న 14 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇవి డీసీహెచ్ఎల్ ప్రమోటర్లు టి.వెంకటరాం రెడ్డి, టి.వినాయక్ రవిరెడ్డి వారి బినామీ కంపెనీకి చెందినవని ఈడీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఇది రెండో అటాచ్మెంట్ కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.264.56 కోట్లకు చేరింది. -
రాణా కపూర్‌కు ఈడీ భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: యస్ బ్యాంకు కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్, డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్ , ధీరజ్ వాధవన్ లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసింది. వీటి విలువ 2,203 కోట్ల రూపాయలని గురువారం అధికారులు ప్రకటించారు. ఇందులో రాణా కపూర్ విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని తెలిపారు. (యస్ బ్యాంక్ కేసు : వాధవాన్ సోదరుల అరెస్ట్) మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్ఏ)చట్టం ప్రకారం ముంబైలోని పెద్దార్ రోడ్లో ఉన్న ఒక బంగ్లా, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, ఢిల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్ వద్ద ఉన్న 48 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటితోపాటు న్యూయార్క్‌లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, లండన్‌లో రెండు కమర్షియల్ ప్రాపర్టీస్‌తోపాటు ఐదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. కాగా యస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి రాణా కపూర్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటికే క్రిమినల్ కేసులను నమోదు చేశాయి. కపూర్, అతని కుటుంబ సభ్యులు, ఇతరులు 4,300 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపించింది. రాణా కపూర్ క్విడ్‌ప్రోకో కింద డీహెచ్ఎఫ్ఎల్ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. మార్చిలో అరెస్టు అయిన కపూర్, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. -
చందా కొచర్ ఖరీదైన ఫ్లాట్ గోవిందా!
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వీడియోకాన్ రుణాల జారీ విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్య తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) చందాకొచర్‌కు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఎటాచ్ చేసింది. ఇందులో ముంబైలోని ఖరీదైన ఆమె ఫ్లాట్‌తోపాటు, ఆమె భర్త దీపక్ కొచర్ కంపెనీకి సంబంధించిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఐసీఐసీఐ- వీడియోకాన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్ తనపదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. వీడియోకాన్ గ్రూపునకు సుమారు 3,250 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. అయితే తనను పదవినుంచి తొలగించడంపై చందా కొచర్ న్యాయ పోరాటం చేస్తున్నారు. -
మాజీ ఐఏఎస్ 225 కోట్ల ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేత్రామ్, ఆయన సన్నిహితులకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తుల్ని ఆదాయ పన్ను శాఖ అటాచ్ చేసింది. ఇందులో ఢిల్లీ, ముంబై, నోయిడా, కోల్‌కతాలోని స్థిరాస్తులు ఉన్నాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బూటకపు కంపెనీల్లో నేత్రామ్, ఆయన సన్నిహితులు కొందరు రూ.98.82 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ విభాగానికి సమాచారం అందడంతో గతంలో ఢిల్లీ, లక్నో, ముంబై, కోల్‌కతా, బరేలిలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు చేసింది. 1979 బ్యాచ్‌కు చెందిన నేత్రామ్ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు ఉన్నత స్థానాల్లో పనిచేశారు. -
రొటోమాక్‌కు షాక్ : ఆస్తులు జప్తు
సాక్షి, ముంబై : పీఎన్బీ స్కాం తరువాత రెండవ అతిపెద్ద బ్యాంకు కుంభకోణంగా నిలిచిన రొటోమాక్ వేల కోట్ల రూపాయల స్కాంలో రొటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, దాని ప్రమోటర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో భారీ షాక్ ఇచ్చింది. కాన్పూర్‌కు చెందిన రోటోమక్ గ్రూపుకు చెందిన భారీ ఆస్తులను దర్యాప్తు సంస్థ అటాచ్ చేసింది. సుమారు 177 కోట్ల రూపాయలను ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు మంగళవారం ఈడీ తెలిపింది. కన్సార్టియం ఏడు బ్యాంకుల వద్ద రొటోమాక్ ప్రమోటర్లు రూ.3,690 కోట్ల కుంభకోణం నేపథ్యంలో సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఎ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా చర్యకు దిగింది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడాను రూ.456 కోట్లు మోసం చేసిన కేసులో రొటోమాక్ సంస్థ ఛైర్మన్, ఎండీ విక్రమ్ కొఠారి, డైరెక్టర్ రాహుల్ కొఠారితోపాటు, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ అధికారులపైనా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తన తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వేలకోట్లను బ్యాంకును ముంచేసిన కేసుపై గతమూడు నెలలుగా విచారించిన సీబీఐ..లక్నోలోని ప్రత్యేక కోర్టుకు ఇటీవల తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అలాగే ఇది కేవలం బీవోబీని మోసం చేసిన దానిపై మాత్రమే చార్జిషీట్ దాఖలు చేసినట్లు..మిగతా సొమ్ముపై విచారణ కొనసాగుతున్నదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాన్పూర్ కేంద్రగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రొటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు, సంస్థ డైరెక్టర్ రాహుల్ కొఠారి, బీవోబీ ఏజీఎం ఎస్కే ఉపాధ్యాయ, సీనియర్ బ్యాంక్ మేనేజర్ ప్రకాశ్ కపూర్, బ్యాంక్ మేనేజర్ శశి బిశ్వాస్‌లు ఈ తొలి చార్జిషీట్లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే దర్యాప్తుతో సహకరించడం లేదన్న ఆరోపణలతో ఢిల్లీలో సీబీఐ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడిని అరెస్టు చేయగా, వారు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
మెహుల్ చోక్సీపై ఈడీ కొరడా
సాక్షి, ముంబై: పీఎన్బీ మెగా స్కాంలో నిందితుడు గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీపై ఈడీ కొరడా ఝళిపించింది. దర్యాప్తులో భాగంగా కీలక నిందితుడు మెహుల్, గీతాంజలి గ్రూపునకు చెందిన 12వందలకోట్ల రూపాయలకుపైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఎటాచ్ చేసిన మొత్తం 41 ఆస్తుల్లో విలువైన ఫాంహౌస్ ఇతర ప్లాట్లు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం విచారణలో భాగంగా మొత్తం రూ.1,217.2 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఈడీ ప్రకటించింది. ముఖ్యంగా ముంబైలో 15 ఫ్లాట్లు, 17 కార్యాలయ ప్రాంగణాలు, కోల్‌కతాలోని మాల్, అలిబాగ్‌లో నాలుగు ఎకరాల ఫాం హౌస్, తమిళనాడులోని నాసిక్, నాగపూర్, పన్వేల్, విలుపురం వంటి ప్రాంతాల్లో 231 ఎకరాల భూమి ఉన్నాయి. వీటితోపాటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న 170ఎకరాల పార్కు ను కూడా ఎటాచ్ చేసింది. దీని రూ. 500 కోట్ల రూపాయలని ఈడీ తెలిపింది. అంతేకాదు చోక్సీకి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయలని కూడా ఈడీ ప్రభుత్వాన్ని కోరింది. -
రెండు కోట్ల దాసరి ఆస్తులు జప్తు!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు సంబంధించిన రూ. రెండు కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూపీఏ హయాంలో 2004 నుంచి 2008 దాకా బొగ్గుశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి బొగ్గుగనుల కేటాయింపులో జిందాల్ గ్రూపునకు అనుచిత లబ్ధి చేకూర్చారని సీబీఐ కేసు పెట్టడం తెలిసిందే. ఈ సాయానికి ప్రతిగా ఆయనకు చెందిన సౌభాగ్య మీడియాలోకి జిందాల్ సంస్థ రూ. 2.25 కోట్లను మళ్లించిందనేది అభియోగం. అయితే సౌభాగ్య లో 2008-11 మధ్య మాత్రమే డెరైక్టర్‌గా ఉన్నానని, జిందాల్ నుంచి సొమ్ము 2011 తర్వాత వచ్చింది కాబట్టి అది అవినీతి కాదని దాసరి వాదన. ఈడీ అటాచ్ చేసిన వాటిలో రెండు వాహనాలు, 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, దాసరి ఇల్లు ఉన్నాయి. అటాచ్ చేసినప్పటికీ ఇవన్నీ దాసరి స్వాధీనంలోనే ఉంటాయి... అయితే వీటిపై ఎలాంటి క్రయవిక్రయాలకు అవకాశం ఉండదు. ఈడీ అటాచ్మెంట్ ఆర్డర్‌ను 180 రోజుల్లోగా పీఎంఎల్ఏ ప్రాధికార సంస్థ ముందు ఆయన సవాల్ చేయవచ్చు.