
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు చెందిన సుమారు రూ.15 కోట్లను ఆదాయ పన్నుల శాఖ జప్తు చేసింది. చెన్నై టీ నగర్‌లో ఆమె బినామీకి చెందిన ఆంజనేయ ప్రింటర్స్ బిల్డింగ్‌ను శుక్రవారం మనీల్యాండరింగ్ చట్టం కింద సీజ్ చేసింది.
2017-21 మధ్య దివంగత జయలలిత, శశికళలకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 150 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఐటీ రైడ్లు జరిగాయి. ఆ సమయంలో ఆమె బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
2020లో ఐటీ శాఖ.. శశికళ, ఆమె బంధువులకు చెందిన 84 ప్రాపర్టీలను రెండు ఫేజ్‌ల రైడ్లలో జప్తు చేసింది.నిందులో సిరుసతవూర్ ఫామ్ హౌజ్‌తో పాటు కొడనాడు ఎస్టేట్‌లోని ఆమె వాటా సైతం ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసై, సుధాగరన్ పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment