Benami
-
హైదరాబాద్‌లో 11 చోట్ల ఈడీ సోదాలు
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆపరేషన్ మోబిలైజేషన్ గ్రూప్ పై 11చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని మోబిలైజేషన్ గ్రూప్ విదేశాల నుంచి రూ.300 కోట్ల విరాళాలు సేకరించింది. ఆ నిధుల్ని ఓం ఫౌండేషన్ పేరుతో దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణ, కేరళ మహారాష్ట్ర,కర్ణాటకలో ఈడీ సోదాలు జరిపారు.ఈ సోదాల్లో బినామీ పేర్లతో నిధుల్ని స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. -
గ్యాంగ్ ఆఫ్ పెత్తందార్స్
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు.అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు. -
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు. -
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య పోటీ.. ఆర్థిక నేరగాళ్లతో నిండిన టీడీపీ కూటమికి.. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జైత్రయాత్ర చేస్తున్న ఈ ప్రభుత్వానికి మధ్య పోటీ.. ఈ ఎన్నికల్లో ఆర్థిక నేరగాళ్లకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడమే కాకుండా..తన బినామీలను పక్క పార్టీలోకి పంపి అక్కడ కూడా వారిని బరిలో నిలిపారు. వ్యాపార వేత్తల ముసుగులో బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఈ వైట్‌కాలర్ ఆర్థిక నేరగాళ్లు సూచించిన వారికీ చంద్రబాబు టికెట్లిచ్చారు. రుణాల పేరుతో బ్యాంకులకు కన్నం పెట్టిన ఈ కేటుగాళ్లలో భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉండి నుంచి రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా.. 2019 వరకు టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సీఎం రమేశ్, సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపిన చంద్రబాబు.. వారికి టికెట్లు దక్కేలా ప్లాన్ చేశారు. అనకాపల్లి పార్లమెంటు నుంచి సీఎం రమేశ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ నలుగురు బ్యాంకుల నుంచి సుమారు రూ.4,563 కోట్ల రుణాలు ఎగ్గొట్టి, సీబీఐ ఈడీ, బ్యాంకు జప్తు కేసులు ఎదుర్కొంటున్నారు. మోసాల్లో దిట్ట రఘురామకృష్ణరాజు రుణాల ఎగవేతలో విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ సరసన నిలిచే కేటుగాడు రఘురామ కృష్ణరాజు. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో రఘురామకృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్ల రుణాలు తీసుకున్నాడు. వీటిని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కదారి పట్టించాడు. వడ్డీ కూడా చెల్లించలేదు. దీంతో బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేశాడని, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 2020 అక్టోబర్‌లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వా«దీనం చేసుకున్నాయి. కంపెనీకి చైర్మన్‌గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఇండ్–భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల్లో తీసుకున్న రుణాల్ని భారత్‌కు అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 2011లో మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ.202 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులు అందిన మరుసటి రోజే రూ.200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్(ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మైయింటెనెన్స్ యాక్ట్(ఫెమా) దృష్టిలో పడింది. ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రూ.202 కోట్లు ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి అందినట్లు గుర్తించారు. మరుసటి రోజే బదిలీ చేసినట్లు నిర్ధారించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రఘురామ కంపెనీకి రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. సుజనా చౌదరి.. ఎగవేతలో నంబర్ వన్ బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకుని మోసగించిన ఘనుడు సుజనా చౌదరి. ఈ కేసులో ఈడీ దర్యాప్తుతో అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.1,289 కోట్ల జీఎస్టీ ఎగవేతతో పాటు రూ.700 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే రూ.1,289 కోట్ల ఇన్వాయిస్లు సుజనా కంపెనీలు తయారుచేశాయి.ఈ మొత్తంపై రూ.224 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నా్చ్ఠరు. దొంగ ఇన్వాయిస్లు చూపి బ్యాంకుల నుంచి రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. జీఎస్టీ విభాగం దర్యాప్తులో ఈ మోసం బయటపడటంతో గ్రూపునకు చెందిన డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. బ్యాంకు రుణాలు తీర్చడం లేదని నల్లగొండ జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంటును బ్యాంకులు సీజ్ చేశాయి. విదేశీ బ్యాంకులకు కూడా సుజనా టోపీ పెట్టారు. మారిషస్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకొని చెల్లించకపోవడంతో ఆ బ్యాంక్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కోర్టు ఏకంగా అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు ఎగ్గొట్టిన వారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇవ్వడానికి ప్రధాని మోదీ నిరాకరించినా చంద్రబాబు అతనికే ఇవ్వాలని పట్టుబట్టారు.బీజేపీ తీర్థం పుచ్చుకొని విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నారు. రూ. 500 కోట్లు ఎగవేతకు సంబంధించి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో ఎస్బీఐ 2021లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన ఎన్సీఎల్టీ ఆ పిటిషన్‌కు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులిచి్చంది.బినామీ ‘బాబు’..సీఎం రమేశ్చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, బినామీ సీఎం రమే‹శ్.. అతని అక్రమ లావాదేవీలను ఆదాయపన్ను శాఖ వెలికి తీసింది. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.800 కోట్ల నిధులు సొంత ఖాతాల్లోకి మళ్లించారు. పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు తీసుకుని వాటిని చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి ఆ కంపెనీల నుంచి సీఎం రమే‹శ్ సంస్థ నగదును వెనక్కి తీసుకుంది. అతనికి చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.800 కోట్ల నిధులను వివిధ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. గత ఆరేళ్లలో ఎడ్కో(ఇండియా) అనే సబ్‌కాంట్రాక్టర్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్లు పుస్తకాల్లో చూపారు. రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. రిత్విక్ ప్రాజెక్టులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా వద్ద ఎడ్కో కంపెనీకి చెందిన స్టాంపులు, సీల్ దొరకడంతో గుట్టు రట్టయ్యింది. దొంగ వ్యాపారాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పార్టీకి ఇచ్చి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సీటు దక్కించుకున్నారనేది అందరికీ తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరి.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు.. రూ.390.7 కోట్ల ఎగవేత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.390.7 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో అతని ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు సంబంధించిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు వివిధ బ్యాంకులకు వడ్డీతో కలిపి రూ.390.7 కోట్లకుపైగా రుణం తీసుకొని ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఆస్తుల స్వాధీనానికి ఇండియన్ బ్యాంకు రంగంలోకి దిగింది. ఈ రుణానికి గంటా హామీ ఉండడంతో ఆయనకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలు జారీ చేసింది. గత నెలలో ఇండియన్ బ్యాంకు విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని గంటా స్థలాన్ని వేలం వేసేందుకు పత్రికా ప్రకటన ఇచ్చింది. -
మాజీ ఎమ్మెల్యే బినామీకి రూ.61 కోట్ల జరిమానా
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీలను బినామీల పేరిట లీజుకు పొందారు. అక్రమంగా ఖనిజ రవాణా చేస్తున్న ఆయన ఇన్నేళ్లు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి క్వారీల వైపు రాకుండా తన చీకటి వ్యాపారాన్ని సాగించారు. ఇటీవలే గనులశాఖ అధికారులు ఆ మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌ను తనిఖీ చేసి రోడ్డు మెటల్ నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించి రూ.1.60 కోట్ల జరిమానా విధించిన విషయం విదితమే. తాజాగా మాజీ ఎమ్మెల్యే బినామీ పేరిట ఉన్న రోడ్డు మెటల్ క్వారీని గనుల శాఖ అధికారుల బృందం తనిఖీ చేసి.. అక్రమ తవ్వకాలను గుర్తించింది. అనంతపురం టౌన్: క్వారీల మాటున ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సాగిస్తున్న అక్రమ ఖనిజ రవాణా దందాలో కొండలను సైతం పిండి చేసేశారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా రోడ్డు మెటల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు పొలం సర్వే నంబర్ 231లో 4.6 హెక్టార్ల రోడ్డు మెటల్ కొండకు ఆ మాజీ ఎమ్మెల్యే బినామీగా పేరున్న కె.సాంబశివుడు లీజు పొందారు. లీజు పొందిన ప్రాంతంలో రోడ్డు మెటల్ తవ్వకాలను చేపట్టి.. మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలించారు. లీజు పొందిన ప్రాంతంలో ఖనిజ నిల్వలు తగ్గిపోవడంతో పక్కనే ఉన్న మరో 1.5హెక్టార్లలో లీజు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి భారీగా రోడ్డు మెటల్ తరలించారు. ఏడాది కాలంగా ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా రోడ్డు మెటల్‌ను తన క్రషర్కు తరలించి భారీగా సోమ్ము చేసుకున్నట్లు గనులశాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. రూ.61.35 కోట్ల జరిమానా.. మాజీ ఎమ్మెల్యే బినామీ సాంబశివుడు క్వారీలో అక్రమ తవ్వకాలు చేసి రోడ్డు మెటల్ తరలించారు. దీంతో గనులశాఖ అధికారులు లీజు తీసుకున్న ప్రాంతానికి వెళ్లి కొలతలు తీశారు. లీజు ప్రాంతంతోపాటు పక్కనే ఉన్న మరో ప్రాంతంలో 1.5 హెక్టార్లలో అంటే 3.75 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తరలించినట్లు గుర్తించి క్వారీ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందనా లేకపోవడంతో రూ.61.35 కోట్ల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేయడంతో పాటు రోడ్డు మెటల్ క్వారీని సీజ్ చేశారు. సీజ్ చేసినా ఆగని ఖనిజ రవాణా జరిమానా చెల్లించే వరకు ఖనిజం తవ్వకాలు చేపట్టరాదని గనులశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, క్వారీని సీజ్ చేసినా నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. క్వారీలో రాత్రి పూట అక్రమ తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్‌ను మాజీ ఎమ్మెల్యే స్టోన్ క్రషర్ యూనిట్‌కు తరలిస్తున్నారు. సీజ్ చేసిన తర్వాత గనుల శాఖ అధికారులు క్వారీ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదనుగా భావించిన క్వారీ నిర్వాహకులు తవ్వకాలు చేపట్టి ఖనిజాన్ని తరలిస్తున్నారు. గనులశాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. పరిమితికి మించి తవ్వకాలు క్వారీ లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి రోడ్డు మెటల్‌ను తరలించినట్లు గుర్తించాం. దాదాపు 6.35 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మెటల్ తరలించారు. దీంతో క్వారీ నిర్వాహకుడు సాంబశివుడికి రూ.61.35 కోట్ల జరిమానా విధించి క్వారీని సీజ్ చేశాం. సీజ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్న విషయం మాకు తెలియదు. మరోమారు క్వారీని పరిశీలిస్తాం. అక్రమంగా తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసుకు సిఫార్సు చేస్తాం. – నాగయ్య, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
టెండర్లకే టెండర్ పెట్టారు
ఎక్కడైనా ఏవైనా పనులు చేపట్టాలంటే ముందుగా ఎంత ఖర్చవుతుందని అంచనా (ఎస్టిమేషన్) వేసుకోవాలి... ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలి. ♦ అటు తర్వాత అంచనాకు అనుగుణంగా టెండర్లను ఆహ్వానించాలి. ♦ ఈ మేరకు నిర్దేశిత తేదీతో టెండర్ నోటిఫికేషన్ వేయాలి. ♦ దాఖలైన టెండర్లను పరిశీలించి కాంట్రాక్ట్ సంస్థను ఖరారు చేయాలి. ♦ అనంతరం వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి. అప్పుడు పనులు మొదలెట్టాలి ♦ ఆ తర్వాత దశల వారీగా బిల్లులు చెల్లించుకుంటూ పోవాలి. ఏమిటీ నమ్మశక్యంగా లేదా.... అయితే ఒక్కసారి ఈ ఫొటో చూడండి.. ఇది వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని మర్రికుంట చెరువు. పైన చెప్పిన నిబంధనలేవీ పాటించకుండానే,టెండర్లు పిలవకుండానే దీన్ని ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయడంతోపాటు సుందరీకరణ పనులు కొనసాగించేస్తున్నారు. ఇలా అభివృద్ధి పనుల పేరిట నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఎక్కడైనా.. ఏ ఊళ్లో అయినా ఇదే లెక్క.. అయితే వనపర్తి జిల్లాలోని మంత్రి ఇలాకాలో మాత్రం లెక్క వేరేగా ఉంటుంది. ♦ ముందుగానే పనులు చేపడతారు. ♦ పనులు పూర్తయ్యే దశలో అంచనాలు రూపొందిస్తారు. ♦ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులుపొందుతారు. పోటీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండాటెండర్ ప్రక్రియ ముగిస్తారు. ♦ బిల్లులు చేయించి.. డబ్బులు తీసేసుకుంటారు. ‘బినామీ’ కాంట్రాక్టర్లు..? నిబంధనల ప్రకారం ఒక్కోవర్క్ రూ.5 లక్షల వరకు అయితే నామినేషన్ పద్ధతిన కేటాయింపులు చేయాలి. అంతకంటే మించి అయితే టెండర్ పద్ధతిన కాంట్రాక్ట్‌లు అప్పగించాలి. కానీ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన నాలుగు చెరువుల సుందరీకరణకు సంబంధించి ఒక్కో దానికి సుమారు రూ.30 లక్షలకు పైబడి వ్యయమవుతుందని అంచనా. ఈ మేరకు టెండర్ తప్పనిసరి కాగా.. పిలిస్తే పోటీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చినట్లు తెలుస్తోంది. లోలోపల టెండర్ దక్కించుకున్న ప్రముఖ కాంట్రాక్టర్లు అధికార పారీ్టకి చెందిన నాయకులేనని తెలుస్తోంది. వీరంతా ఓ ముఖ్య నేతకు ప్రధాన అనుచరులుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నోరు మెదపని అధికారులు.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించడం.. పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీ, మున్సిపల్ అధికారులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యనేత ఆదేశాల నేపథ్యంలో వారు నిబంధనలకు నీళ్లు వదిలినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పనులు పూర్తయి న క్రమంలో వ్యయానికి మించి అంచనాలు రూపొందించి.. ఎక్కువ మొత్తంలో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది లక్షి్మకుంట. 20వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కూడిన ఈ చెరువు సుందరీకరణ పనులు 2021లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలల అనంతరం రూ.31.75 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2022 సెప్టెంబర్‌లో పరిపాలనా అనుమతులు రాగా.. గత నెల 14న రూ.29.59 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పనులు కొనసాగగా.. అటవీ శాఖ కు సంబంధించి కంపా నిధులు వెచ్చించారు. ఇది రాజనగరం చెరువు. ట్యాంక్ బండ్ నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు గత ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. సుమారు రూ.49 లక్షల వ్యయంతో అదే ఏడాది ఫిబ్రవరిలో ఎస్టిమేషన్ (అంచనా) వేయగా.. అదే నెలలో పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. మార్చిలో కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా.. జూన్‌లో కొంత మేర బిల్లులు మంజూరయ్యాయి. 2021 ఆగస్టులో తాళ్లచెరువు సుందరీకరణ పనులు ప్రారంభం కాగా..గత ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేసి ప్రభుత్వానికి పంపించారు.అనుమతులు రాగా.. మార్చిలో టెండర్ ప్రక్రియ పూర్తయి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత జూన్‌లో బిల్లులు మంజూరయ్యాయి. -
శశికళకు షాక్
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు చెందిన సుమారు రూ.15 కోట్లను ఆదాయ పన్నుల శాఖ జప్తు చేసింది. చెన్నై టీ నగర్లో ఆమె బినామీకి చెందిన ఆంజనేయ ప్రింటర్స్ బిల్డింగ్‌ను శుక్రవారం మనీల్యాండరింగ్ చట్టం కింద సీజ్ చేసింది. 2017-21 మధ్య దివంగత జయలలిత, శశికళలకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 150 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఐటీ రైడ్లు జరిగాయి. ఆ సమయంలో ఆమె బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2020లో ఐటీ శాఖ.. శశికళ, ఆమె బంధువులకు చెందిన 84 ప్రాపర్టీలను రెండు ఫేజ్‌ల రైడ్లలో జప్తు చేసింది.నిందులో సిరుసతవూర్ ఫామ్ హౌజ్‌తో పాటు కొడనాడు ఎస్టేట్‌లోని ఆమె వాటా సైతం ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసై, సుధాగరన్ పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. -
Putin: ఇక పుతిన్ ఆస్తుల మీద వేట షురూ!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్ పరిణామాల తర్వాత ప్రపంచం మొత్తం ఆయన గురించి తెలుసుకోవాలనే ఆరాటపడుతోంది. అయితే Putin రాజకీయనేత మాత్రమే కాదు.. ఈ భూమ్మీద అత్యంత సంపద ఉన్న వ్యక్తుల్లో ఒకడు కూడా. ఆ విలువ కొన్ని ప్రపంచదేశాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువనే ప్రచారం నడుస్తుంటుంది. తాజాగా డెయిలీ మెయిల్ వెబ్సైట్ మెయిల్ ఆన్లైన్ తాజాగా.. పుతిన్ ఆస్తుల మీద ఓ కథనం ఆసక్తికర ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇప్పుడు పుతిన్ ఆస్తులపై కన్నేసినట్లు ఆ కథనం పేర్కొంది. పుతిన్ ఆస్తుల విలువపై స్పష్టత కొరవడినప్పటికీ.. ఆయన ఆ ఆస్తుల్ని మొత్తం బినామీల రూపంలో భద్రపరుస్తున్నాడట. కుటుంబ సభ్యుల మొదలు.. చిన్ననాటి స్నేహితులు, కొందరు కేజీబీ సహచరుల పేరిట భద్రపరిచారని ఆ సంచలన కథనం వివరించింది. అంతేకాదు రష్యాలో ప్రతి ఒక్క రూబుల్(రష్యా కరెన్సీ)లో.. 50 శాతం వాటాను ఆయన తన బినామీల పేర బదలాయిస్తున్నారని పేర్కొంది. పుతిన్ మేనల్లుడు, అంతెందుకు పుతిన్ స్నేహితుడి కొడుకు సైతం 500 మిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉండడం మాత్రమే కాదు.. రష్యా ధనికుల లిస్ట్‌లో వాళ్ల పేర్లు ఉండడం గమనార్హం. పుతిన్ మొత్తం ఆస్తుల విలువ రూ.15 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది మెయిల్ ఆన్ లైన్ కథనం. బినామీల పేరిట విలాసవంతమైన భవనాలు, 700కి పైగా లగ్జరీ కార్లు, 58 విమానాలు ఉన్నట్టు వివరించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా పుతిన్ కు భవంతులు, కంపెనీలు, వ్యాపారాలు ఉన్నట్టు తెలిపింది. రష్యాలోని అతిపెద్ద చమురు, సహజవాయువు కంపెనీలను వాడుకుని... పుతిన్ తన బినామీ సంస్థల ద్వారా పెద్దఎత్తున ఆస్తులు పోగేసినట్టు మెయిల్ ఆన్ లైన్ ఆరోపించింది. పుతిన్ అక్రమాస్తులపై ప్రశ్నించినందుకే.. రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని జైలుపాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి కూడా. అంతేకాదు పన్నుల ఎగవేత, రష్యా చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఈ భారీ బినామీ వ్యవహారానికి తెర తీసినట్లు ప్రచురించింది. ఇంగ్లండ్ లోని సర్రే ప్రాంతంలో పుతిన్ కుమార్తెలు నివసిస్తుండగా, వారి పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు ఎన్సీఏ భావిస్తోందని మెయిల్ ఆన్ లైన్ పేర్కొంది. అమెరికా.. మిత్ర దేశాలు పుతిన్ బినామీ ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నాయని మెయిల్ ఆన్ లైన్ తన కథనంలో పేర్కొంది. ఈ బినామీ ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని, స్తంభింపజేసేందుకు వేట మొదలైందని వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్ లోని పుతిన్ బినామీ ఆస్తులపై ఆ దేశ జాతీయ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ) దర్యాప్తు ప్రారంభించిందని వెల్లడించింది. -
సర్దుకుంటున్న బినామీ డీలర్లు!
సాక్షి, అమరావతి: అధికారం అండతో పేదల నోళ్లుకొట్టి ఇన్నాళ్లూ దోచుకున్న పౌరసరఫరాల శాఖలోని కొందరు బినామీ డీలర్లు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటివరకు చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. కొత్త ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయోననే భయంతో ఒక్కొక్కరు స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం, కృష్ణా, గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో దాదాపు 200 మంది బినామీ డీలర్లు ఇప్పటికే సర్దుకున్నట్లు సమాచారం. బ్లాక్మార్కెటింగ్లో నిష్ణాతులు పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యం పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి జేబులు నింపుకోవడంలో ఈ బినామీలు సిద్ధహస్తులు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనేకసార్లు చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చినా అలాంటివి ఎక్కడా జరగలేదని మంత్రులే అడ్డుపడేవారు. దీంతో వారి ఆగడాలకు అంతులేకుండాపోయింది. పలువురు ప్రజాప్రతినిధులకు కూడా వీరి దందాలో భాగం ఉండటంతో బినామీలు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. విజిలెన్స్ విభాగం సైతం చోద్యం చూసినట్లు వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్కదారి ఎలా పట్టించారంటే.. ఈ–పోస్ మిషన్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను మార్పులుచేసి రాష్ట్రవ్యాప్తంగా ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఇందులో దాదాపు 260మంది రేషన్ డీలర్లతోపాటు పలువురు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని తేల్చినా వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు సబ్సిడీ సరుకులు పంపిణీ చేస్తారు. ఈ–పోస్ టెక్నీషియన్ల సహాయంతో పంపిణీకి ఆఖరి రెండ్రోజుల్లో అంటే 13, 14 తేదీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఆధార్ నంబర్లను ఈ–పోస్ యంత్రాలకు అనుసంధానం చేసి గుట్టుచప్పుడు కాకుండా ఆ రేషన్‌ను పక్కదారి పట్టించారు. ఇందులో అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన నాయకులు, రేషన్ డీలర్ల ప్రమేయం ఉందని గతంలో గుర్తించారు. రూ.8కి కొనుగోలు చేసి.. ఇదిలా ఉంటే.. బినామీ డీలర్లపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో వారు మరింత చెలరేగిపోయారు. సబ్సిడీ బియ్యాన్ని కార్డుదారుల నుంచే ఏకంగా కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి వాటిని నేరుగా మిల్లర్లకు రూ.15కు విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. పేదల బియ్యాన్ని కొనుగోలు చేసే రేషన్ డీలర్, బియ్యం విక్రయించిన లబ్ధిదారుడిపై కేసులు నమోదు చేస్తామని సర్కారు జారీచేసిన జీఓ కాగితాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడుతుండడంతో మున్ముందు చర్యలు ఎలా ఉంటాయోనన్న అనుమానంతో బినామీ డీలర్లు ఒకొక్కరుగా తప్పుకుంటున్నారు. 805 షాపులకు బినామీ డీలర్లు రాష్ట్రం మొత్తం మీద 29 వేల మంది రేషన్ డీలర్లు ఉంటే ఇందులో 805 రేషన్ షాపులకు బినామీ డీలర్లు ఉన్నారు. ఈ షాపులకు వెంటనే రెగ్యులర్ డీలర్లను నియమిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు ఎన్నిసార్లు మొత్తుకున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో నాలుగేళ్లుగా బినామీ డీలర్లు సబ్సిడీ బియ్యాన్ని బొక్కేస్తూ వచ్చారు. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులోనే అత్యధికంగా 302 మంది బినామీ డీలర్లు ఉన్నారు. ఆ జిల్లాలో విచ్చలవిడిగా సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోందనే ఆరోపణలు ఉన్నా అధికారులు చేసేదిలేక మిన్నకుండిపోయారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే.. రేషన్ మాఫియాను నడుపుతున్న టీడీపీ నాయకుడు బాబూరావును గతంలో పోలీసులు అరెస్టుచేసినా ఫలితంలేదు. -
బినామీ పేరుతో ఎమ్మెల్యే సబ్సిడీ వాహనాలు
-
ఉప్పులేటి కల్పనా.. మజాకానా !
సాక్షి, అమరావతి బ్యూరో : పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పలు పథకాలను అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చేజిక్కించుకుని లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన రాయితీ వాహనాన్ని బినామీ పేరుతో తీసుకుని దర్జాగా వాడుకుంటున్న వైనం వెలుగుచూసింది. నిబంధనలకు పాతర.. కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా సబ్బిడీతో వాహనాలను అందజేస్తోంది. మొవ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతికిరణ్ ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు.అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపితే ఎల్లో ప్లేట్ ఉండాలి. కానీ కారు యజమానిగా చూపి వైట్ ప్లేట్ వేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పామర్రు ఎమ్మెల్యే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇన్నోవా వాహనంపై పామర్రు ఎమ్మెల్యేగా స్టిక్కర్ వేయించుకుని తిరుగుతున్నారు. దగాని క్రాంతికిరణ్ ఎమ్మెల్యే బినామీ మాత్రమేనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అతని పేరుతో రాయితీతో కూడిన భూమి కొనుగోలు పథకం, వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెబ్సైట్లో కారు రిజిష్ట్రేషన్ వివరాలు. ఇందులోనే కారు యజమాని దగాని క్రాంతి కిరణ్ పేర్కొన్న దృశ్యం సొమ్మొకరిది సోకు మరొకరిది కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలలో పేదవర్గాలకు ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద అందించే వాహనాలకు నిధులు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పధకం ద్వారా మంజూరైన వాహనానికి 35% సబ్సిడీ ఉంటుంది. 2% మాత్రం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగిలిన 63% రుణ సౌకర్యం కల్పిస్తారు. వాహనాన్ని ట్రావెల్స్‌లో తిప్పి రుణం చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఈ వాహనాలను తామే ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేలా వాహనంపై థ్యాంక్యూ సీఎం సార్ పేరుతో స్టిక్కర్లు వేసి పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గతంలో వాహనంపై సీఎం స్టిక్కర్ తొలగిస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం వివాదమైంది. గతంలోనూ నెల్లూరు జిల్లాలో టీడీపీ మాజీ మంత్రి తన డ్రైవర్ పేరుతో ఇన్నోవా వాహనం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పేదవర్గాల పేరుతో రాయితీ పథకాలను టీడీపీ నేతలు బొక్కేయడంపై దళితులు మండిపడుతున్నారు. పేదలకు పంపిణీ చేశాం కృష్ణా జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వాహనాలు పంపిణీచేశాం. నిబంధనల మేరకే వాహనాలను మంజూరు చేశాం. లబ్ధిదారుల్లో ప్రజాప్రతినిధుల బినామీలు ఉన్నారన్న విషయం మాకు తెలియదు. – సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, కృష్ణాజిల్లా -
ఆ అనుబంధానికి సాక్ష్యం ఇదే..
దేవరపల్లి: గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కాంట్రాక్టర్ రాజేష్ బినామీగా వ్యవహరిస్తున్నట్టు ఇటీవల అధికారపార్టీ నాయకులు బాహాటంగా ఆరోపించారు. రాజేష్ ఎవరో తనకు తెలియదని, అతను తన బంధువు కాదని ఇటీవల ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రకటించారు. ‘అభివృద్ధి ముసుగులో అవినీతి దందా’ శీర్షికన ‘సాక్షి’లో గత వారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తనకు రాజేష్‌తో ఎటువంటి అనుంబంధం లేదని విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. అయితే ఎమ్మెల్యే ముప్పిడితో రాజేష్‌కు గల అనుబం«ధానికి నిదర్శనంగా ఈ చిత్రం చూడవచ్చు. మరి ఇదే రకమైన అనుబంధమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
‘సీఎం’ల బినామీ శేఖర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో సాగుతున్న ఇసుక అమ్మకాలు అక్రమాల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలకు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి బినామీ కథనాయకుడని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆరోపించారు. శేఖర్రెడ్డికున్న రాజకీయ అండదండల వల్లనే రూ.33.6 కోట్ల విలువైన కొత్త కరెన్సీ ఆయనకు ఎలా దక్కిందనే విషయం బయటకు రావడం లేదని స్టాలిన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఎస్ఆర్ఎస్ కంపెనీ పేరున రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక క్వారీలు నడిపే కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు గత ఏడాది డిసెంబరు 8వ తేదీన దాడులు నిర్వహించి రూ.170 కోట్ల నగదు, రూ.178 కిలోల బంగారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 నోట్ల కొత్త కరెన్సీ ఉండడం కేసు తీవ్రతను పెంచింది. శేఖర్‌రెడ్డి చేతికి ఇంత భారీ మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందో తమకు తెలియదని సీబీఐకి ఆర్బీఐ సమాధానం చెప్పడం మరింత కలకలం రేపింది. ఈ కేసు విచారణపై స్టాలిన్ స్పందిస్తూ, ఆర్బీఐ అదుపాజ్ఞల్లో పనిచేసే కరెన్సీ ముద్రణాలయాలు, బ్యాంకుల ద్వారా మాత్రమే శేఖర్‌రెడ్డి భారీ మొత్తంలో సొమ్ము ముట్టే అవకాశం ఉంది, అయితే ఆ సొమ్ము ఎలా చేరిందో తమకు తెలియదని ఆర్బీఐ చెప్పడం ఆశ్చర్యమే కాదు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కరెన్సీ ముద్రణాలయాలు కేంద్రప్రభుత్వం, కర్ణాటక, పశ్చిమబెంగాల్లోని ముద్రణాలయాలు ఆర్బీ ఐ అదుపాజ్ఞల్లో పనిచేస్తాయని ఆయన అన్నారు. రూ. 33.6 కోట్లు ఏ ప్రెస్, బ్యాంకు నుంచి శేఖర్‌రెడ్డికి చేరా యో సీబీఐ కనుగొనలేక పోవడం నమ్మశక్యంగా లేదని అన్నారు. శేఖర్‌రెడ్డి కేసులో ఆధారాలు దొరకలేదు, రాష్ట్రంలో గుట్కా అక్రమ అమ్మకాల విచారణలో ఐటీ అధికారులు అందజేసిన ప్రకటన కనపడటం లేదు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటైనర్ ద్వా రా రూ.570 కోట్ల రవాణా అయిన సంగతి ఎన్నికల కమిషన్‌కు,ఆర్బీఐకి తెలియకపోవడం విచిత్రమన్నారు. ఐటీ అధికారుల దాడులన్నీ అంతరంగికం తమిళనాడుకు సంబంధించి ఐటీ అధికారులు జరిపిన దాడులన్నీ అంతరంగికంగా మారడం గమనార్హమని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలోని అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ పథకం ప్రకారం అటకెక్కడంపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదని, ఈ పరిస్థితుల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంల అక్రమార్జనకు శేఖర్‌రెడ్డి బినామీ కథానాయకుడన్న సంగతిని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆర్థిక అవకతవకలపై తమ పార్టీ వచ్చేనెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌డే అనుసరిస్తుండగా, తమకు పోటీగా అదే రోజున దేశవ్యాప్తంగా నల్లధన నిర్మూల దినం పాటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికేనని విమర్శించారు. శేఖర్‌రెడ్డికి రూ.33.6 కోట్లు ఎలా వచ్చాయా తెలియని స్థితిలో ఆర్బీఐ ఉన్నపుడు కేంద్రప్రభుత్వ నల్లధన నిర్మూలన ఏ రీతిలో సాగుతోందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. శేఖర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమార్జనలపై జరిపిన ఐటీ దాడులపై వెంటనే చర్య తీసుకునేలా నల్లధన నిర్మూలనం రోజున కేంద్రం ఒక ప్రకటన చేయాలని ఆయన కోరారు. అలాగే, శేఖర్‌రెడ్డికి రూ.2000 కొత్త నోట్లు ఎలా వచ్చాయనే వివరాలను ఆర్బీఐ అధికారులు వెంటనే సీబీఐకి అందజేసి చార్జీషీటు దాఖలుకు సహకరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. -
భూమంత్రకాళీ
♦ చూడు జాగ..వేసెయ్ పాగా ♦ చిరమనలో 55 ఎకరాలకు పైగా భూమి హాంఫట్ ♦ మార్కెట్ విలువ రూ.3 కోట్లకు పైనే ♦ రెవెన్యూ అధికారులు, నాయకుల నిర్వాకం రెవెన్యూ అధికారులు.. నాయకులు ఏకమయ్యారు. 55 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో కట్టబెట్టేశారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు సైతం జారీ చేశారు. ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. ఆత్మకూరు రూరల్ : సెంటు భూమి కోసం పేదోళ్లు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోరు. ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉందని.. అప్పటివరకు ఆగాలని కుంటిసాకులు చెబుతారు. నాయకులకు మాత్రం ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేస్తున్నారు. ఏఎస్ పేట మండలంలోనూ ఇలాంటి కుంభకోణం వెలుగు చేసింది. ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడొకరు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో 40ఎకరాలకు పైగా భూమిని.. అతడి శిష్యుడు చిరమన మజరా కన్నెదారి వారిపల్లెలో 14.73 ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు. బినామీ పేర్లతో భూములు పొందిన నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. చిరమన గ్రామంలోని సర్వే నంబర్ 878/3, 881లలో లేబూరు పరమేశ్వర్లు పేరుతో 4.69 ఎకరాలు, సర్వే నంబర్ 882లో వాయిలేటి వీరయ్య పేరుతో 4.36 ఎకరాలు, 883/1లో జులుమూడి రాధయ్య పేరుతో 5 ఎకరాలు, 882/2, 884లో నలగండ్ల సుందరయ్య పేరుతో 4.85 ఎకరాలు, 885/1లో వాయిలేటి రమణయ్య పేరుతో 4.16 ఎకరాలు, 885/2లో లేబూరి ప్రభాకర్ పేరుతో 4.76 ఎకరాలు, 879లో నాటకరాని వెంకటయ్య పేరుతో 4.32 ఎకరాలు, సర్వే నంబర్ 886/2లో 4 ఎకరాలు కలిపి 36.13 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమిని టీడీపీ నేత పొందారు. ఇదే గ్రా మంలో మరికొంత భూమిని కూడా కబ్జా చేశాడు. సర్వే నంబర్ 882లోని భూమిని తన కోడలు, సర్వే నంబర్ 885/1లో భూమిని తన కుమార్తె పేరిట ఇటీవల మార్పించుకున్నాడు. సదరు నాయకుడికి గ్రామంలో 50 ఎకరాలకు పైగా భూమి ఉండగా.. ప్రభుత్వ భూమిని సైతం హస్తగతం చేసుకున్నాడు. వాళ్లెవరో.. భూములు పొందిన బినామీదారులకు చిరమన గ్రామంతో అసలు సంబంధమే లేదు. వారికి గ్రామంలో ఓట్లు, రేషన్‌కార్డులు గాని లేవు. వారు ఏ గ్రామానికి చెందిన వారో కూడా ఎవరికీ తెలియదు. అయితే సదరు నేత తనకున్న రాజకీయ, ఆర్థిక బలంతో రెవెన్యూ అధికారులను లోబరుచుకుని ప్రభుత్వ భూములను కాజేశాడు. వాటికి హక్కులు పొంది అనుభవిస్తున్నాడు. ఐదేళ్లుగా ఆ భూములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. అదే బాటలో శిష్యుడు ఆ నాయకుడికి శిష్యుడైన మరో టీడీపీ నేత ఆయన అండదండలతో చిరమన పంచాయతీ పరిధిలోని కన్నెదారివారిపల్లెలో 14.73 ఎకరాలను కబ్జా చేశాడు. సర్వే నంబర్ 1028/1లో దాసరి శ్రీరాములు పేరుతో 3.28 ఎకరాలు, 1028/2లో 11.45 ఎకరాల ప్రభుత్వ భూమిని మరో పేరుతో కాజేశాడు. అయితే దాసరి శ్రీరాములు అనే వ్యక్తి ఆ గ్రామంలోనే లేడు. ఈ భూమిలో బోరు వేసుకున్న ఆయనకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు అధికారులు సిఫార్సు చేయడం గమనార్హం. వివిధ పేర్లతో అనుభవదారులుగా సృష్టించుకుని సుమారు రూ.3 కోట్ల విలువ గల ఆ భూములను టీడీపీ నాయకులిద్దరూ హస్తగతం చేసుకున్న వైనంపై జిల్లా కలెక్టర్‌కు, భూ పరిపాలన శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. -
బినామీ లావాదేవీలు చేస్తే భారీ జరిమానా
న్యూఢిల్లీ: బినామీ లావాదేవీలు నిర్వహిస్తే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని ఆదాయ పన్నుల (ఐటీ) శాఖ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీ చేసింది. బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చట్టం- 1988 ప్రకారం ఎవరూ బినామీ లావాదేవీలు జరపడానికి వీల్లేదని, ఈ చట్టం 2016 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. దీని ప్రకారం బినామీగా వ్యవహరించిన వ్యక్తి, వాస్తవ ఆస్తిపరుడు, సాయం చేసిన వారు అందరూ శిక్షార్హులే. అటువంటి వారికి 7 ఏళ్ల వరకు జైలు, బినామీ ఆస్తి మార్కెట్ ధరలో 25 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఒకవేళ అధికారులకు బినామీ ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి మార్కెట్ ధరలో 10 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, సంబంధిత బినామీ ఆస్తిని గుర్తిస్తే ప్రభుత్వం దాన్ని జప్తు చేస్తుందని వెల్లడించింది. ఈ చట్టం గతేడాది అమల్లోకి వచ్చినప్పుటి నుంచి దేశవ్యాప్తంగా 230 కేసులు రిజిస్ట్రర్ కాగా, రూ. 55 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయ్యాయి. అలాగే రూ. 200 కోట్ల ఆస్తులకు సంబంధించి ఐటీ శాఖ 140 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 124 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు రూ. 55 కోట్ల విలువైన బినామీ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అటాచ్ అయిన ఆస్తుల్లో బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ, ఇతర భూములు, ప్లాట్లు, జ్యువెలరీ మొదలైనవి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. -
అధికారి.. అడ్డదారి
⇒ బినామీ పేర్లతో భూకబ్జాకు పాల్పడుతున్న రెవెన్యూ యంత్రాంగం ⇒ ఇటీవల పుల్లంపేటలో బయటపడిన వ్యవహారమే నిదర్శనం ⇒ మరి కొన్నిచోట్ల భూఆక్రమణల్లో వీఆర్వోలు, ఇతర అధికారులు ⇒ వివాదాస్పదమవుతున్న ఆక్రమణల వ్యవహారం ⇒ పలుచోట్ల భూములు, స్థలాలు లాగేసుకుంటున్న తమ్ముళ్లు ⇒ ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తేనే ఫలితం సాక్షి, కడప/ పుల్లంపేట: ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఒకపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భూకబ్జాలకు పా ల్పడుతుండగా, వారికి తామేమీ తక్కువ కాదన్నట్లు జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఏకంగా కొంతమంది అధికారులు బినామీ పేర్లతో భూములను పోగుచేసుకోవడం వివాదాస్పదమవుతోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇలాంటి వ్యవహారాలు అక్కడక్కడా వెలుగుచూస్తున్నా ఉన్నతాధికారులు కొరఢా ఝళిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బినామీల పేరుతో అక్రమణలు జిల్లాలో ఒకప్పుడు ఎక్కడచూసినా బంజరు భూమి కనిపించేది. పెరిగిపోయిన ప్రజావసరాల దృష్ట్యా రానురాను భూమి తరిగిపోయింది. అయితే ఇదే అదునుగా కొంతమంది అక్రమాలకు తెరలేపారు. బినామీలుగా బంధువులను, అనుకూలమైన వారిని ఎంపిక చేసుకుని ఏదో ఒకచోట పాగా వేస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి ఇలా చేస్తుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పుల్లంపేట, పోరుమామిళ్ల, కాశినాయన, మైలవరం ఇలా అనేకచోట్ల రెవెన్యూ యంత్రాంగం అందినకాడికి ఆక్రమించుకునే పనిలో పడినట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. ఆన్లైన్ పేరుతో దోపిడీ జిల్లాలో విలువైన భూములున్న ప్రాంతాల్లో తహసీల్దార్లు ఆన్లైన్ దోపిడీకి తెరలేపుతున్నారు. ఎంతోకొంత ముట్టజెప్పందే భూములను ఆన్లైన్లో ఎక్కించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బద్వేలు నియోజకవర్గంతోపాటు కమలాపురం, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఆన్లైన్ పేరుతో దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏది ఏమైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే తప్ప అనేక అంశాలు బయటపడవు. కొత్తగా వచ్చిన డీఆర్వోనైనా ఆక్రమణలు, భూకబ్జాలాంటి వ్యవహారాలపై ప్రత్యేక పరిశీలన జరిపితే కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
230 కేసులు.. 55 కోట్ల జప్తు
బినామీ లావాదేవీల చట్టం కింద నమోదు చేసిన ఆదాయ పన్ను శాఖ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం తీసుకున్న చర్యల్లో భాగంగా బినామీ లావా దేవీల చట్టం కింద దేశవ్యాప్తంగా 230 కేసులను ఆదాయ పన్ను శాఖ నమోదు చేసింది. సుమారు రూ.55 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ‘ఫిబ్రవరి రెండో వారం నాటికి సుమారు 230కి పైగా కేసు లు నమోదు చేశాం. అందులో 140 కేసుల కు సంబంధించి రూ.200 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ఇప్పటివరకు 124 కేసుల్లో రూ.55 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశాం’ అని ఆదాయ పన్ను శాఖ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకు ఖాతాలు, వ్యవసాయ, ఇతర భూములు, ఇళ్లు, ఆభరణాలు తదితరాలు జప్తు చేసిన ఆస్తుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. గత నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చేలా బినామీ లావాదేవీల చట్టాన్ని కేంద్రం రూపొందిం చింది. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి భారీ జరిమానాతోపాటు, ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. -
బినామీలే!
సగం రేషన్ షాపులు బినామీల చేతుల్లోనే.. ఏళ్లుగా ఇదే వ్యవహారం కామారెడ్డి :జిల్లాలో 575 రేషన్ షాపుల పరిధిలో 2,28,260 ఆహారభద్రత కార్డులు, 16,419 అంత్యోదయ కార్డులు, 1,090 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. నెలలో పక్షం రోజుల పాటు రేషన్ సరకులు సరఫరా చేయాల్సిన డీలర్లు.. కొన్ని చోట్ల రెండు, మూడు రోజులు మాత్రమే దుకాణాలను తెరుస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో 575 రేషన్ షాపుల్లో దాదాపు సగం దుకాణాలు బినామీల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో సగానికిపైగా షాపులను బినామీలే నిర్వహిస్తున్నారు. రేషన్ డీలర్లుగా స్థిరపడిన కొందరు.. అధికారులతో కుమ్మక్కై ఒక్కొక్కరు నాలుగైదు రేషన్ షాపుల బాధ్యతలు చూస్తున్నారు. వీరు అసలు డీలర్లకు ఎంతోకొంత కమీషన్ ఇచ్చి ఆయా షాప్‌లను తమ గుత్తాధిపత్యంలోకి తీసుకుంటున్నారు. ఏదైనా కేసుల్లో ఇరుక్కుని డీలర్లు సస్పెండ్ అయితే.. వాటిని కూడా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులతో పాటు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని తమ బినామీ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. చాలా రేషన్ షాపులు మహిళల పేరిట ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ కూతుళ్ల పేరిట రేషన్ షాప్ అనుమతులు పొందినవారు.. కూతుళ్ల వివాహమయ్యాక కూడా ఆ షాప్‌లను తమ అధీనంలోనే ఉంచుకుని బినామీ డీలర్లుగా కొనసాగుతున్నారు. దారిమళ్లుతున్న సరకులు బినామీ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదలకు అందాల్సిన రేషన్ సరకులను నల్లబజారుకు తరలిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో బినామీ డీలర్ల హవా కొనసాగుతోంది. ఒక్కొక్కరు రెండు, మూడు షాపులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సరకులను రవాణా చేస్తున్నారు. బినామీ డీలర్లు అసలు డీలర్లకు నెలనెలా రూ. 3 వేల నుంచి రూ. 6 వేల దాకా కమీషన్ ఇస్తున్నారని తెలిసింది. అలాగే అధికారులకు మామూళ్లు ఇస్తూ బినామీ డీలర్లుగా తమ అక్రమాలు కొనసాగిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం రేషన్ షాప్ ఎవరి పేరిట ఉందో వారే నిర్వహించాలి. బినామీలతో నిర్వహిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని షాపులపై చర్యలు తీసుకున్నాం. రేషన్ సరకులను లబ్ధిదారులకు అందించకుండా నల్లబజారుకు తరలిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం. బినామీ షాపుల గురించి వివరాలు సేకరిస్తున్నాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, కామారెడ్డి -
ఇక బినామీల భరతం!
• ఆ ఆస్తులపై త్వరలోనే కఠినచట్టం తీసుకొస్తాం: మోదీ • నోట్లరద్దు నియమాల మార్పుల్లో మేం చేస్తోంది కరెక్టే! • అవినీతి, నల్లధనాన్ని సమర్థిస్తున్నవారే ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు • యుద్ధం నుంచి వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని స్పష్టీకరణ • ప్రజల సాయంతోనే అక్రమార్కుల ఆట కట్టిస్తున్నామన్న ప్రధాని అవినీతిపై పోరాటంలో ఇది మొదటి అడుగు మాత్రమే. మనం ఈ యుద్ధాన్ని గెలిచి తీరాల్సిందే. దీన్ని ఆపడం, పలాయనం చిత్తగించడం వంటి ప్రశ్నలకు చోటే లేదు. మేం బినామీ చట్టాన్ని పలు మార్పులతో మళ్లీ తీసుకురానున్నాం. త్వరలోనే ఈ చట్టం అమలు మొదలవుతుంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం చేయాల్సిన, జరగాల్సిన పనులన్నీ ప్రాధాన్యతతో పూర్తి చేస్తాం. – ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: నోట్ల రద్దు పథకం అమలు తర్వాత పరిస్థితిని బట్టి నియమ నిబంధనల్లో తీసుకొస్తున్న మార్పులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థించుకున్నారు. అవినీతి, నల్లధనాన్ని సమర్థిస్తున్నవారే నిరంతరం ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారన్నారు. మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి చేసిన రేడియో ప్రసంగంలో.. నోట్లరద్దు, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను మోదీ వెల్లడించారు. బినామీ ఆస్తులపై కఠినచట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలుచేస్తామని స్పష్టం చేశారు. ‘అవినీతిపై పోరాటంలో ఇది మొదటి అడుగు మాత్రమే. మనం ఈ యుద్ధాన్ని గెలిచి తీరాల్సిందే. దీన్ని ఆపటం, పలాయనం చిత్తగించటం వంటి ప్రశ్నలకు చోటే లేదు’ అని మోదీ వెల్లడించారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా నోట్లరద్దు నిర్ణయం తర్వాత డిపాజిట్లు, విత్డ్రాయల్స్పై తరచూ నిబంధనలు మార్చటం సరైనదేనన్నారు. ప్రజల సమస్యలను తగ్గించి.. నోట్లరద్దును వ్యతిరేకిస్తున్న శక్తుల ఆటకట్టించేందుకే నిబంధనలు మార్చాల్సి వచ్చిందన్నారు. ప్రజలే పట్టిస్తున్నారు ‘సున్నితమైన ప్రభుత్వంగా.. ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు వీటికి పరిష్కారం సూచిస్తూ ముందుకెళ్లటం మా కర్తవ్యం. అదే సమయంలో అవినీతికి పాల్పడుతున్నవారు, విశ్వాసఘాతకుల కుట్రలనూ భగ్నం చేస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. అవినీతిపై చేస్తున్న యుద్ధంలో ప్రజలంతా సహకరించాలని మోదీ కోరారు. నోట్ల రద్దు తర్వాత కొందరు అక్రమార్కుల గురించి ప్రజలే సమాచారం ఇచ్చారని ప్రశంసించారు. తమను తప్పుదోవ పట్టిస్తున్న వారికీ సరైన బుద్ధి చెబుతున్నారన్నారు. రాజకీయ పార్టీలు అన్ని రకాల మినహాయింపులను పొందుతున్నాయంటూ వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని.. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. నోట్లరద్దుపై రకరకాల కుట్రలు పన్నుతున్నారని చివరకు మతం రంగు కూడా పులిమారన్నారు. ఇలాంటి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవినీతి, అక్రమ వ్యాపారాలు, నల్లధనం వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాల తీరు బాధాకరం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు ప్రజలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందన్నారు. ప్రభుత్వం నోట్లరద్దుతోపాటు రాజకీయ పార్టీలకు నిధులపైనా చర్చజరగాలని కోరుకుందని మోదీ తెలిపారు. 1988లోనే కాంగ్రెస్ పార్టీ బినామీ చట్టం తీసుకొచ్చినప్పటికీ ఇంతవరకు దీని అమలుకు సంబంధించిన నిబంధనలను సిద్ధం చేయలేదన్నారు. ‘మేం బినామీ చట్టాన్ని పలు మార్పులతో మళ్లీ తీసుకురానున్నాం. త్వరలోనే ఈ చట్టం అమలు మొదలవుతుంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం చేయాల్సిన, జరగాల్సిన పనులన్నీ ప్రాధాన్యతతో పూర్తి చేస్తాం’ అని మోదీ స్పష్టం చేశారు. -
జన్‌ధన్ ఎంత?
నవంబర్ 8న ప్రధాని నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాక... పేదలకు చెందిన జన్‌ధన్ బ్యాంకు ఖాతాలకు బినామీలను ఉపయోగించుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. దానికి బలం చేకూర్చేటట్లుగా తొలి వారంలోనే (నవంబరు 8-15) ఈ అకౌంట్లలో ఏకంగా రూ. 20,206 కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చారుు. దీంతో ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టింది. జన్‌ధన్ ఖాతాలను దుర్వినియోగపర్చే వారికి శిక్ష తప్పదని ఓ సభలో ప్రధాని మోదీ స్వయంగా హెచ్చరించారు. ఈ ఖాతాల నుంచి నెలకు రూ. 10 వేలు మించి ఉపసంహరణకు అనుమతించబోమని పరిమితి కూడా విధించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న జన్‌ధన్ ఖాతాలు, వాటిల్లోని డిపాజిట్ల వివరాలు చూద్దాం.. - సాక్షి నాలెడ్‌జ సెంటర్ -
బినామీలుగా మారితే సమస్యలే!
• ఎవరి ఆస్తులకు, డబ్బులకు వారే లెక్కచెప్పాల్సుంటుంది • ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్ ఓంకారేశ్వర్ సాక్షి, కరీంనగర్: ఎవరి ఆస్తులు, డబ్బులు వాళ్ల ఖాతాలోనే వేసుకోవాలని, ఇతరుల ఆస్తులకు, లావాదేవీలకు బినామీగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్.ఓంకారేశ్వర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో రూ. 500, 1000 నోట్ల రద్దు గురించి మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. నల్లడబ్బు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మనదేశంలో కరెన్సీ మొత్తం రూ.17 లక్షల కోట్లు ఉండగా, ఇందులో రూ. 14.5 లక్షల కోట్లు 500, 1000 రూపాయల నోట్ల రూపంలో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రూ. 6 లక్షల కోట్లు డిపాజిట్ కాగా రూ. 1.5 లక్షల కోట్లు మళ్లీ విత్‌డ్రా రూపంలో ప్రజలకు చేరుకున్నాయన్నారు. ఇంకా 9.5 లక్షల కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డిపాజిట్ అరుున డబ్బులకు వారే లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన అన్ని లావాదేవీలు జరిపినట్లు రుజువుచేసుకోవాలని వాటి ద్వారా వచ్చే లాభాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విదేశాల్లో ఉన్న బ్లాక్‌మనీ నిల్వలున్న వారు వారంతట వారే రూ. 7 వేల కోట్లు చెల్లించారని, సెప్టెంబర్, 2016 వరకు ఇన్‌కం డిక్లరేషన్ స్కీం ద్వారా 70 వేల కోట్లు వచ్చిందని తెలిపారు. 25 లక్షల కోట్ల జనధన్ అకౌంట్లుండగా వాటిలో రూ. 21 వేల కోట్లు వచ్చి పడ్డాయన్నారు. జనధన్ ఖాతాల ద్వారా రూ. 50 వేలు మాత్రమే వేసుకోవచ్చని అంతకు మించి డబ్బులుంటే వాటికి లెక్కచూపించాలన్నారు. -
కరెన్సీకి కమీషన్
► రూ.4వేలకు రూ.500' ► పేదలే పెద్దలకు బినామీలు ► వేలిపై గుర్తుతో చెక్ ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చోరీకి వల్ల కాక మరొకడు ఏడ్చాడు’ అనేది ప్రజల నోళ్లలో తరచూ నానుతుండే సామెత. ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలు ఆ సామెతను తలపిస్తున్నారుు. చెల్లని నోట్లను మార్చుకోలేక పేదలు అల్లాడుతుంటే బినామీలుగా మారిన వారికి కమీషన్లు అంటూ పెద్దలు ప్రలోభపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలి వరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఈనెల 8వ తేదీన కేం ద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్యాంకుల ద్వారా 10వ తేదీ నుంచి పాత నోట్ల స్థానంలో కొత్త నోట్ల ను మార్చుకోవచ్చంటూ చేసిన ప్రకటనతో ప్రజలు ఉరకలెత్తారు. పరిమితమైన నోట్లను కలిగి ఉన్న ప్ర జలు బ్యాంకుల వద్ద బారులు తీరగా భారీ మొత్తం లో నగదును దాచిపెట్టిన ధనికులు బావురుమన్నా రు. రూ.2.5లక్షలకు పైగా బ్యాంకుల్లో జమ చేస్తే లెక్కలు చూపాల్సి ఉంటుంది. అంతేగాక 200 శాతం ఆదాయపు పన్ను కట్టక తప్పదు. బ్యాంకుల్లో జమ చేస్తే ఆదాయపు పన్నుశాఖ తంటా కావడంతో అక్రమార్కులంతా వక్రమార్గం వైపు కదులుతున్నారు. తమకు నమ్మకమై పేదలను, సన్నిహితులను బినామీలుగా మార్చుకుని వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమచేరుుస్తున్నారు. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ధనికులు తాము ఎంచుకున్న పేదలను ఉదయాన్నే ఇంటికి పిలిపించుకుంటున్నారు. వారి చేతిలో రూ. 4,500 పెట్టి మార్చుకుని రమ్మని చెబుతున్నారు. ఈ పని పూర్తి చేసిన వారికి రూ.300 నుంచి రూ. 500 వరకు కమిషన్ ఇస్తున్నారు. సాయంత్రానికి నాలుగుసార్లు వెళితే రూ.2వేలు కమీషన్‌గా గిట్టుతోంది. ఇలా ఎన్నిసార్లరుునా బ్యాంకులకు వెళ్లేందుకు పేదలు సిద్ధం కావడంతో గట్టిపోటీ ఏర్పడింది. కరెన్సీ మార్పిడి చేసే పేదలు, కూలీలకు గిరాకీ ఏర్పడడంతో వారిని సరఫరా చేసేందుకు సహజంగానే బ్రోకర్లు తయారయ్యారు. ’ఎదావదు ఇరుందాల్ సొల్లుంగ...సత్తమిల్లామల్ ముడిచ్చిడలాం’ (ఏదైనా ఉంటే చెప్పండి గుట్టుగా పూర్తిచేసుకువస్తా) అనే కోడ్ భాష చెలామణిలోకి వచ్చింది. నేటి నుంచి వేలిపై గుర్తు: నల్లధనాన్ని వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బినామీలతో గండికొట్టకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తపడింది. ఒకే వ్యక్తి పదేపదే బ్యాంకులకు వస్తూ కరెన్సీని మార్చడాన్ని నిరోధించనుంది. ఓటు హక్కును వినియోగించుకునే తరహాలో బ్యాంకులో నగదును జమ చేసిన వ్యక్తి వేలిపై ముద్ర వేసే విధానాన్ని బుధవారం నుంచి ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మంగళవారమే కొన్ని బాంకుల్లో వేలిముద్ర విధానం అమలులోకి వచ్చినట్లు సమాచారం. అలాగే ఇతరుల ఖాతాలో డబ్బును జమ చేయాలంటే ఖాతాదారుడు నేరుగా రావడమో లేదా అతని స్వదస్తూరితో ఉత్తరం జమ చేయడమో తప్పనిసరి చేశారు. తప్పని తిప్పలు: కరెన్సీ నోట్లు రద్దరుు ఆరు రోజులు దాటుతున్నా బ్యాంకుల వద్ద ప్రజల తిప్పలు తప్పడం లేదు. చాంతాడంత క్యూలో నిల్చుని కౌంటర్ వద్దకు చేరుకునేసరికి క్యాష్ అరుుపోందని కొన్ని బ్యాంకుల్లో వెనక్కుపంపుతున్నారు. ఇక ఏటీఎంలో పెట్టిన లక్షలాది రూపాయలు నిమిషాల వ్యవధిలో ఖాళీ అరుుపోతున్నారుు. ప్రస్తుతం ఏటీఎంలలో రూ.2 వేలనోట్లు మాత్రమే లభ్యమవుతుండగా, రూ.500ల కొత్త నోట్లు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని బ్యాంకు వర్గాలు చెబుతున్నారుు. చిల్లర కోరేవారికి కొన్ని చోట్ల రూ.5, రూ.10ల నాణేలను అందజేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్లో ఆస్తిపన్ను చెల్లింపునకు పాత నోట్లు స్వీకరించడంతో సోమవారం ఒకే రోజు రూ.8 కోట్లు వసూలైంది. -
పుష్కర పనుల టెండ‘రింగ్’
ప్రజారోగ్యశాఖలో రూ.21.71 కోట్లతో టెండర్లు బినామీ పేర్లతో టీడీపీ ప్రజాప్రతినిధుల మాయాజాలం చక్రం తిప్పిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, బ్రోకర్ అధికారి చాంబర్లోనే బేరసారాలు కృష్ణా పుష్కరాల్లో పారిశుధ్య పనులకు టీడీపీ ప్రజాప్రతినిధులు టెండ ‘రింగ్’ పెట్టారు. రూ.21.71 కోట్ల రూపాయల పనుల్ని బినామీ పేర్లతో ఎగరేసు పోయేందుకు పక్కా స్కెచ్ వేశారు. బయటి కాంట్రాక్టర్లకు చాన్స్ ఇవ్వకుండా రింగ్ చేశారు.ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, ఒక బ్రోకర్ చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ముఖ్య అధికారి వారి కనుసన్నల్లో పాలన సాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ సెంట్రల్ : పుష్కర పనులు టీడీపీ ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అధికార దర్పంతో అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, ఒక బ్రోకర్ కలిసి ప్రజారోగ్య శాఖలో దందా చలాయిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోట్ల విలువైన టెండర్లను బినామీ పేర్లతో దక్కించుకున్నారని సమాచారం. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పకడ్బందీగా శానిటేషన్ పనుల్ని చేపట్టేందుకు ప్రజారోగ్య శాఖ కు రూ.21.70 కోట్లు కేటాయించారు. ఫినాయిల్, కర్రలు, చీపుర్లు, మందులు కొనుగోలు చేయడంతోపాటు 15 వేల మంది తాత్కాలిక సిబ్బంది నియామకం, మలేరియా నివారణ చర్యలు, కోతులు, కుక్కలు, పందుల్ని పట్టడం తదితర పనులు చేపట్టాలని నిర్ణయించారు. 61 ప్యాకేజీలుగా విభజించి ఈ మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన టెండర్లు పిలిచారు. 37 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు దాఖలయ్యాయి. పదో తేదీన వీటిని పరిశీలించిన ప్రజారోగ్యశాఖ అధికారులు తుది ఆమోదం కోసం కమిషనర్ టేబుల్‌పైకి పంపారు. టెండ‘రింగ్’ టెండర్లను దక్కించుకొనేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు బ్రోకర్‌తో కలిసి హైడ్రామా నడిపారు. టెండర్ల నిర్వహణకు సంబంధించి ప్రజారోగ్యశాఖ అధికారి ముందుగా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. అందులో 80 శాతం మంది బ్రోకర్ మనుషులే అని తెలుస్తోంది. టెండర్లు దాఖలు చేసే సమయంలో సైతం బ్రోకర్ హల్చల్ చేశాడని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. టెండర్లు వేయకుండా తమను అడ్డుకున్నారని, తమ మాట విన్న వారిని రింగ్ చేసి టెండర్లు దాఖలు చేయించారని బాధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. గతంలో బ్రోకర్ ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో హవా చలాయించేవాడని, అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళ వద్ద రూ.10 వేలు వసూలు చేయడంపై వివాదమూ ఉందని తెలిసింది. ఈ ఘటన తరువాత ఎంపీ దూరంగా పెట్టడంతో ఇద్దరు మహిళా కార్పొరేటర్లతో కలిసి ప్రజారోగ్య శాఖలో దందా చలాయిస్తున్నట్లు సమాచారం. శానిటరీ ఇన్స్పెక్టర్ల డివిజన్ల మార్పులు, చేర్పులతో భారీ డీల్స్ చేస్తున్నాడని భోగట్టా. ముఖ్య అధికారి చాంబర్లో మహిళా కార్పొరేటర్లతో కలిసి తిష్ట వేసి బేరసారాలు సాగించడం కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరితో అధికారి సుదీర్ఘ సమావేశం కారణంగా వివిధ పనులపై లోనికి వెళ్లలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. అధికారి బర్త్‌డే వేడుకల్ని ఇటీవల బ్రోకర్ ఘనంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. లెస్ టెండర్ల మాయాజాలం పుష్కరాల్లో పారిశుధ్య విధులు నిర్వహించేందుకు 15 వేల మంది తాత్కాలిక కార్మికుల్ని నియమించాలని నిర్ణయించారు. వీరికి రోజుకు రూ.425 చొప్పున ఇచ్చే విధంగా టెండర్లో అధికారులు పొందుపరిచారు. రింగ్ అయిన కాంట్రాక్టర్లు రూ.403 నుంచి రూ.424 వరకు ధరను కోట్ చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. లెస్ టెండర్లుగా బయటకు కనిపిస్తున్న వీటి వెనుక పెద్ద మాయాజాలమే దాగుంది. ప్రజారోగ్య శాఖలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రోజుకు రూ.365 చొప్పున చెల్లిస్తున్నారు. తాత్కాలిక కార్మికులకు మాత్రం రూ.425 ధర నిర్ణయించారు. ఇందుకు ఒక రూపాయి అటు ఇటుగా టెండర్లను ఓకే చేస్తారు. తాత్కాలిక కార్మికులకు కాంట్రాక్టర్ నిర్ణయించిన ధర మాత్రమే చెల్లిస్తాడు. అదనపు ధర కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే అన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం 7,500 మంది కార్మికుల్ని సరఫరా చేసేందుకు టీడీపీ అండ్ కో టెండరేసింది. ఇవి ఓకే అయితే భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. ప్రజారోగ్యశాఖలో అవినీతి కంపుపై కమిషనర్ దృష్టి సారిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశముంది. బయటి విషయాలు అనవసరం పుష్కర పనులకు సంబంధించి లెస్ టెండర్లే వచ్చాయి. కాంట్రాక్టర్లు రింగ్ అయిన విషయం నాకు తెలియదు. బయట జరిగే విషయాలు నాకు అనవసరం. మొత్తం 61 ప్యాకేజీల్లో 19 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు దాఖలు కాలేదు. మరోసారి పిలిచాం. గోదావరి పుష్కరాల్లో అప్సెట్ వ్యాల్యూ ఆధారంగానే టెండర్లు పిలిచాం. ప్రస్తుతం కమిషనర్ పరిశీలనలో ఉన్నాయి. - ఎం.గోపీనాయక్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, నగరపాలక సంస్థ -
నా కుమారుడి పేరిట భూములు కొన్నా..
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలోఉండాలనే ఉద్దేశంతో మగాడిలా భూములను కొనుక్కున్నానని ఎమ్మెల్సీ, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు. తాను తన కొడుకు పేరిట ఆ భూములను కొన్నానని, బినామీల పేరుతో కొనలేదని అన్నారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దమ్ముంటే, ఆయనలో రాయలసీమ రక్తం ఉంటే ఆయన తన మూడుతరాల ఆస్తులపై ప్రకాశం బ్యారేజీ మీద చర్చకు రావాలని సవాల్ చేశారు. తన పేరిట ఉన్న ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో, అసెంబ్లీకి సమర్పించే ఆస్తుల వివరాల్లో పేర్కొనలేని దౌర్భాగ్య స్థితి జగన్‌దని అన్నారు. తనతో పాటు మంత్రులు పుల్లారావు, నారాయణ తదితరులపై సాక్షిలో వచ్చిన వార్తలపై శుక్రవారం నుంచి సమగ్ర వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. -
గ్రీన్‌జోన్ పేరుతో మాయాజాలం
చంద్రబాబు, బినామీలు ఆడిన (భూ) మాయా నాటకంలో జోన్ల వర్గీకరణ మరో కీలక అంకం. రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ జోన్ ఉండాలో.. ఏ జోన్లో ఏం ఉండాలో ముందే నిర్ణయించారు.. . అగ్రికల్చర్ (గ్రీన్) జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జోన్ ఇలా.. ఏడు జోన్లుగా వర్గీకరించారు. ఈ జోన్ల వర్గీకరణలోనే భారీ కుంభకోణం దాగి ఉంది. పెదబాబు, చినబాబు, వారి బినామీలు, తెలుగుదేశంలో కీలక నాయకులు భూములు కొనుగోలు చేసిన ప్రాంతాలలోనే భూముల విలువ పెరిగేందుకు గాను కమర్షియల్, ఇండస్ట్రీస్ జోన్లు వచ్చేలా చూశారు. ఏ జోన్ ఎక్కడ వస్తుందో వారికి ముందే తెలుసు కాబట్టి ఆ ప్రాంతాలలోనే పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వారికి భూములు లేని ప్రాంతాలన్నీ కలిపి అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించారు. అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో అనేక షరతులు విధించారు. కొనుగోలు అమ్మకాలపైనా నిషేధాజ్ఞలున్నాయి. పంటలు పండినా పండకపోయినా ఆ భూముల్లో వ్యవసాయం మాత్రమే చేయాలి. దాంతో భూముల విలువ దారుణంగా పడిపోయింది. రాజధాని పేరుతో చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న ఈ దుర్మార్గాలపై రైతులంతా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదీ గ్రీన్‌జోన్ .. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 58 మండలాల్లో 8,603.32 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్డీఏ విస్తరించింది. ఇందులో 5,940.26(63.23 శాతం) చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని ముసాయిదా ప్రణాళికలో వ్యవసాయ పరిరక్షణ మండలాలుగా పేర్కొం ది. ఇది 15 లక్షల ఎకరాలకు సమానం. ఈ మం డలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తరించాయి. వ్యూహాత్మకంగా భూములు కొన్న నేతలు.. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోని అనేక ప్రాంతాలతో పాటు వ్యవసాయ పరిరక్షణ జోన్-2, 3లోని మండలాల పరిధిలోనూ టీడీపీ ముఖ్య నేతలు, వారి అస్మదీయులు బినామీ పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.ఇవి దాదాపు 10,000 ఎకరాలు ఉండవచ్చని అంచనా. కారణం ఆ ప్రాంతంలో రాజధాని రాబోతోందని వారికి ముందుగానే ఉప్పందింది. అంతేకాదు ఏ ప్రాంతంలో ఏ జోన్ రాబోతుందన్న విషయమూ వారికి ప్రభుత్వ బహిరంగ ప్రకటనకన్నా ముందే తెలుసు. వారికి అనుకూలంగానే రాజధాని పర్స్పెక్టివ్ ప్లాన్ రూపుదిద్దుకుంది. ఆ జోన్లలో ఏయే అభివృద్ధి ప్రాజెక్టులు రావాలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే ప్రణాళికాకర్తలు సిద్ధం చేశారు. జోన్- 2, 3లో భవిష్యత్తులో పట్టణ అభివృద్ధి ప్రాంతం (ఫ్యూచర్ అర్బనైజ్డ్ డెవలపబుల్ ఏరియా)గా నిర్ధేశించారు. రాజధాని నగర పరిధి (క్యాపిటల్ సిటి) అభివృద్ధి తరువాత పై ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక. తద్వారా టీడీపీ అనుయాయులకు అయాచిత లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అంటే.. టీడీపీ నేతలు కొనుగోలు చేసిన ప్రాంతాల్లో భవనాలను నిర్మించవచ్చు. ఇది టీడీపీ నేతలకు రియల్ ఎస్టేట్ బూమ్‌ను అందివ్వడమేనని చెబుతున్నారు. జోన్-1లో కేవలం వ్యవసాయమే.. వ్యవసాయ పరిరక్షణ జోన్-1లో వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పాడిపరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమలకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మేరకు పర్స్పెక్టివ్ ప్లాన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. జోన్- 1 ప్రాంతం సారవంతమైన భూములు కనుకే వ్యవసాయ పరిరక్షణ జోన్లో చేర్చినట్లు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ గతంలో ప్రకటించారు. అయితే వాటికన్నా అన్నివిధాలుగా మెరుగైన భూమి జోన్-2, జోన్-3లో ఉండటం పరిశీలనాంశం. ఏపీసీఆర్డీఏ చట్టంలోని సెక్షన్- 38 ప్రకారం పర్స్పెక్టివ్ ప్లాన్‌ను ప్రతి పది సంవత్సరాలకు, మాస్టర్‌ప్లాన్‌ను ప్రతి అయిదు సంవత్సరాలకు మాత్రమే మార్పులు జరిగేందుకు వీలుండేలా నిబంధన పెట్టడం కూడా టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చడానికేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జోన్- 2, జోన్-3లో అధిక భాగం గుంటూరు జిల్లా పరిధిలో ఉంది. జోన్-1ను ఎక్కువగా కృష్ణా జిల్లాలో చూపడం ఆ జిల్లా వాసులకు ఆవేదన మిగుల్చుతోంది. అక్కడ వృద్ధి నామమాత్రమే... వ్యవసాయ పరిరక్షణ జోన్-1లో కేవలం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు మాత్రమే ఉండాలని పర్స్పెక్టివ్ ప్లాన్‌లో పేర్కొన్నారు. ఆర్థిక, వ్యాపార, సేవా రంగాలకు సంబంధించిన అంశాలు ఈ ప్రాంతంలో రావు. ఇందువల్ల ఈ ప్రాంతం ఆర్థికాభివృద్ధికి అవకాశాలు నామమాత్రం కానున్నాయి. క్యాపిటల్ సిటీలో రైతులకు కేటాయించనున్న ప్లాట్లకు డిమాండ్ పెరగాలనే ఉద్ధేశంతో రీజియన్ పరిధిలోని మిగతా మండలాలను వ్యవసాయ పరిరక్షణ జోన్లలో చేర్చడం వల్ల ఆయా ప్రాంతాల రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. క్యాపిటల్ సిటీ పరిధిలోని భూములు కొనుగోలు చేసిన వారికి, కొందరు రైతుల కోసం తాము బలికావలసి వస్తోందని వ్యవసాయ పరిరక్షణ పరిధిలోకి చేరిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడిపోయిన ధరలు.. నిలిచిన క్రయవిక్రయాలు.. అగ్రికల్చర్జోన్గా ప్రకటించక ముందు జోన్ - 1 ప్రాంత గ్రామాలలో ఎకరా భూమి మూడు కోట్లు పలికింది. రాజధాని ప్రాంతంలో కూడా ఇదే ధర పలికింది. నావల్లనే ఈ భూముల ధరలు ఈ స్థాయిలో పెరిగాయని సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు గ్రీన్‌జోన్ ప్రాంతాలలో భూముల విలువ పూర్తిస్థాయిలో పడిపోయింది. ఎకరా రూ. 50 లక్షలకు మించి కొనేవారు కనిపించడం లేదు. గ్రామాలకు దూరంగా ఉంటే ఎకరా 20 నుంచి 30 లక్షల లోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది అసలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. పచ్చని పంట పొలాలు లాక్కొని విదేశీయులతో ప్రభుత్వ పెద్దలు ‘రియల్’ వ్యాపారాలు చేస్తున్నారు. సింగపూర్, జపాన్ కంపెనీలకు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో రైతుల భూములను మాత్రం గ్రీన్‌జోన్ పేరుతో క్రయ విక్రయాలు స్తంభించిపోయేలా చేశారు. భూముల ధరలు పూర్తిస్థాయిలో పడిపోయిన తరువాత వేల ఎకరాలు టీడీపీ నేతలు కొనుగోలు చేసి పరిశ్రమల పేరుతో విదేశీయులకు అమ్ముకునే వ్యూహాన్ని రూపొందించారు. కంకిపాడు, ఉయ్యూరు, పెగంచిప్రోలు, జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు తదితర మండలాల్లోని గ్రామాల్లో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు వేల ఎకరాల్లో బినామీ భూములు ఉన్నాయి. ఆందోళనబాటలో రైతులు.... గ్రీన్ జోన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు చూసి రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మూడుపంటలు పండే భూములను బలవంతంగా లాక్కుని కమర్షియల్ జోన్‌గా ప్రకటించడం, వర్షం పడితే తప్ప పండే పరిస్థితి లేని మెట్టభూములను గ్రీన్‌జోన్‌గా ప్రకటించడం వెనక దారుణమైన కుట్ర దాగి ఉందని రైతులు అంటున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో రైతులు ఆందోళనలు చేపట్టారు. కంకిపాడు, ఉయ్యూరు, నందిగామ, జగ్గయ్యపేట, జి కొండూరు, కంచికచర్ల మండలాల పరిధిలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. పలువురు రైతులు సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. జోన్ ప్రకటన వల్ల కలగనున్న నష్టాలను వ్యవసాయరంగ నిపుణులు, రైతు సంఘాల నాయకులు రైతులకు వివరిస్తూ సీఆర్డీఏ అధికారులకు అభ్యంతరాల లేఖలు పంపాలని సూచిస్తున్నారు. ఒక నెల రోజుల వ్యవధిలోనే రెండు వేల అభ్యంతరాలు వచ్చాయంటే వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతుంది. రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీలు తీర్మానం చేస్తూ ప్రభుత్వానికి పంపుతున్నాయి. దీనిపై పునరాలోచన చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పరిరక్షణ మండలం-1 కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు, కంకిపాడు, పెదపా రుపూడి, గుడివాడ రూరల్, నందివాడ, వీరులపాడు, వత్సవాయి, పెనుగంచిప్రోలు, మైలవరం, జి.కొండూరు, నూజివీడు పూర్తిగా, పామర్రు, ఉంగుటూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, నూజివీడు, ఇబ్రహీం పట్నం పాక్షికంగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు, చేబ్రోలు, చుండూరు, అమృతలూరు, కొల్లూరు, తెనాలి రూరల్, కొల్లిపర, వేమూరు, చేబ్రోలు, భట్టిప్రోలు పూర్తిగా, పొన్నూరు, పెదకాకాని, దుగ్గిరాల మండలాలు ఈ జోన్ కిందకు తెచ్చారు. వ్యవసాయ పరిరక్షణ మండలం-2 కృష్ణా జిల్లాలోని చందర్లపాడు పూర్తిగా, కంచికచర్ల, జగ్గయ్యపేట మండలాలను పాక్షికంగా తెచ్చారు. ఇక గుంటూరు జిల్లాలోని యడ్లపాడు, ఫిరంగిపురం, క్రోసూరు, అచ్చంపేట మండలాలు పూర్తిగానూ, మేడికొండూరు, పెదకూరపాడు పాక్షికంగానూ ఈ జోన్ కిందకు తెచ్చారు. వ్యవసాయ పరిరక్షణ మండలం-3 కృష్ణా జిల్లాలో కంచికచర్ల మండలం పాక్షికంగానూ, గుంటూరు జిల్లాలో తాడికొండ, మేడికొండూరు మండలాలు పూర్తిగానూ, పెదకూరపాడు, అమరావతి మండలాలు పాక్షికంగానూ ఈ జోన్ కిందకు తెచ్చారు. ఈ ప్రాంతమంతా రాజధాని నగరానికి దక్షిణం, పశ్చిమ దిక్కున ఉన్నాయి. భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిన ‘గ్రీన్‌జోన్’ విజయవాడ ఆటోనగర్‌లో ఓ ఫౌండ్రీలో పనిచేస్తున్నాను. అద్దె ఇంట్లో ఉంటున్నాం. ముత్యాలంపాడు గ్రామంలో 2006లో 80 సెంట్లు పొలం కొన్నాం. పిల్లల చదువుతో పాటు సొంత ఇల్లు, ఫౌండ్రీ షెడ్డు కోసం పొలం అమ్మాను. ఎకరం రూ.80 లక్షలకు కోనుగోలు చేసిన వారు రూ 15 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నారు. వచ్చిన డబ్బులతో నిడమానురులో కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాం. ఇప్పుడు గ్రీన్ జోన్ రావటంతో పొలాల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అగ్రిమెంట్ రాయించుకున్న వారు ఇపుడు ఎకరం రూ. 40 లక్షలకు మించి ఇవ్వమంటున్నారు. లేకపోతే అడ్వాన్సు వెనక్కు ఇవ్వాలంటూ మెలిక పెడుతున్నారు. డబ్బులు వస్తున్నాయి కదా అని అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాం. ఏం చేయాలో అర్థం కావటం లేదు. భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎస్. రాంబాబు, ఫౌండ్రీ కార్మికుడు, విజయవాడ రైతు పరిస్థితి అగమ్యగోచరం.. గతంలో రూ 2. కోట్లు ఉన్న భూమి ప్రస్తుతం రూ కోటికి చేరింది. మాకు భూమి ఒక్కటే ఆధారం. అమ్ముకునేందుకు, వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు అవకాశం లేకపోతే భూమి ఉండి కూడా ఏం ఉపయోగం? విజయవాడకు దగ్గరలోనే ఉన్నాం. కానీ గ్రీన్‌జోన్ పేరుతో షరతులు పెట్టడం సరైంది కాదు. నిబంధనలు సడలించకపోతే రైతు పరిస్థితి అగమ్యగోచరమే. బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, చలివేంద్రపాలెం అమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నా మాకు ఆత్మహత్యే శరణ్యం. గుర్రాజుపాలెం గ్రామానికి గత రెండు పర్యాయాలుగా సర్పంచ్‌గా కొనసాగుతున్నాను. ఉన్న ఎకరం పొలంలోనే మిరప, పత్తి పండిస్తుంటాను. గ్రీన్ జోన్ రాకముందు పొలాల ధరలు బాగా ఉండటంతో పొలం అమ్మి అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్నా. ఎకరం రూ. 60 లక్షల వరకు అడిగారు. రూ 75 లక్షలు అయితే ఇస్తానని బేరం పెట్టా. జి.కొండూరు మండలం గ్రీన్ జోన్లోకి చేర్చడంతో రేట్లు దారుణంగా పడిపోయాయి. రెండు రోజుల క్రితం ఎకరా రూ. 18 లక్షలకు అడిగారు. తమటం వెంకట్రామయ్య, సర్పంచ్ గుర్రాజుపాలెం (కృష్ణాజిల్లా) ఇబ్బంది పెట్టేందుకే.. 2050 సంవత్సరం దాకా గ్రీన్ బెల్ట్‌లో ఉన్న భూములలో పంటలు మాత్రమే పండించాలం టున్నారు. రైతు వారీగా కోట్ల రూపాయలు పెట్టి కొనే వాళ్లు ముందుకు రావడం లేదు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం అమ్ముకోవాలంటే రేట్లు పూర్తిగా దిగజారిపోయాయి. ఏడాదిలోనే పొలాల రేట్లు సగానికి సగం పడిపోయాయి. ఎక్కువ రేటుకు కొనేవారు రావడం లేదు. పడిపోయిన రేటుకు అమ్ముకోలేకపోతున్నాం. -మందాళ వీరారెడ్డి, రైతు, నంబూరు