కబ్జా చక్రవర్తి లింగమనేని (సీఎంగారికి వెరీక్లోజ్) | Capturing king of lingamaneni | Sakshi
Sakshi News home page

కబ్జా చక్రవర్తి లింగమనేని (సీఎంగారికి వెరీక్లోజ్)

Published Fri, Mar 4 2016 1:55 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

లింగమనేని గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - Sakshi

లింగమనేని గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

‘సాక్షి’ వద్ద పేదలిచ్చిన డాక్యుమెంట్లు..
ఎస్టేట్‌లో పేదల భూములు స్వాహా..
300 ఎకరాల కబ్జా భూములు..
వాటి విలువ రూ. 1,500 కోట్లు పైనే...
సమీకరణ నుంచి ఎస్టేట్‌కు మినహాయింపు
కొద్ది దూరంలో ఆగిపోయిన రాజధాని సరిహద్దు

 
ఎవరీ లింగమనేని?...
జస్ట్ ఎయిర్ కోస్టా విమానాలకు బాస్ మాత్రమేనా..? కాదు. చట్టాన్ని ఎగతాళి చేస్తూ, కృష్ణా నదిని కూడా కబ్జా చేసి ప్యాలెస్ లాంటి భవంతి http://img.sakshi.net/images/cms/2016-03/71457038883_Unknown.jpgకట్టుకున్న ‘పనిమంతుడు’ మాత్రమే కాదు. ఆ భవంతిని తన ఇష్టదైవం లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించుకున్న భక్త ‘హనుమంతుడు’ మాత్రమే కాదు.... కోస్తాంధ్రలోని రెండు ప్రధాన పట్టణాలయిన విజయవాడ - గుంటూరుల నట్టనడుమ మూడు వందల ఎకరాల విలువైన భూమిని అవలీలగా చెరబట్టిన కబ్జా కాలకేయుడు కూడా. కబ్జా చేసుకున్న భూమికి సరిహద్దు గోడను కూడా నిర్మించుకున్న సమర్ధుడు. ఎంత సమర్ధుడంటే.. భూ సమీకరణ చట్టం ఆయన సరిహద్దు గోడదాకా వచ్చి వంగి సలామ్ కొట్టి పక్కకు తిరిగి వెళ్లింది...
 
రాజధాని అమరావతిలో ‘బాబు’ల బినామీ భూ బాగోతాలు కోకొల్లలుగా బైటపడుతున్నాయి. లింగమనేని రమేష్‌కు  ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న బంధాన్ని రుజువుచేసే మరో పక్కా ఆధారం గురువారం ‘సాక్షి’కి లభించింది. ఈ ఆధారం ‘సాక్షి’ తవ్వితీసింది కాదు. పేదలు స్వయంగా వచ్చి ‘సాక్షి’ చేతికి అందించింది. పేదల భూములను లింగమనేని కలిపేసుకున్నారని తెలిపే ఆధారాలవి. భూ సమీకరణ విషయంలో బినా మీలైతే ఒకరకంగా.. బడుగు రైతులైతే మరో రకంగా బాబు వ్యవహరించారనేందుకు అనేక ఆధారాలు న్నాయి. మూడు పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటివారిని మాత్రం ‘దయ’తో వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ను రాజధాని భూ సమీకరణనుంచి తప్పిం చడం... ప్రతిఫలంగా లింగమనేనివారు ముఖ్య మంత్రికి కృష్ణానదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను నజరానాగా సమర్పించడం మనకు తెలిసిన విషయాలే.  ఈ ఎస్టేట్‌లో 300 ఎకరాల పేదల భూములు కలిపేసుకున్న విషయం తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా లింగమనేని విషయంలో చంద్రబాబు ఉదారంగా వ్యవహరిం చారు. ఆ వివరాలు చూద్దామా..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో సుమారు 300 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. వీటిని 1937వ సంవత్సరంలో గుర్తించిన బాంబేకు చెందిన అసోసియేట్స్ సిమెంట్స్ కంపెనీ లిమిటెడ్ (ఏసీసీ) యాజమాన్యం ఈ భూములను రైతుల దగ్గర నుంచి 99 ఏళ్ళ లీజు విధానంలో సేకరించింది. అప్పట్లో ఏసీసీ సిమెంట్స్ ఎండీ డబ్ల్యూహెచ్ బెన్నిట్స్ తరఫున కూర్మరాజు గోపాలస్వామి రైతులందరి భూములు కేవలం విక్రయ కాంట్రాక్ట్ మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులకు అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) రాసిచ్చారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యం సున్నపురాయి నిక్షేపాలు తవ్వడం ఆపివేసిన పక్షంలో..  లీజు కాలం వరకూ ఈ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులకు హక్కు కల్పించారు. లీజు గడువు ముగిసిన తరువాత ఆ భూములు వాటి యజమానులైన రైతుల స్వాధీనంలోకి వచ్చేలా విక్రయ కాంట్రాక్ట్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అసలు మతలబు ఇక్కడే జరిగింది. లీజు గడువుకు ముందే ఏసీసీ లిమిటెడ్ ఈ భూముల్లో తవ్వకాలు నిలిపివేసి సిమెంట్ కంపెనీని తరలిపోయింది.

చంద్రబాబు అధికారంలోకి రాగానే..
పేదల భూములను ఆక్రమించిన లింగమనేని.. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే అనేక చర్యలు తీసుకున్నారు. రైతులను మభ్యపెట్టి, మాయచేసి, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఆ స్టాంప్ పేపర్లలో తమకు నచ్చినట్లు రాసుకుని ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో రూ.1500 కోట్ల విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటనకు కొద్ది రోజుల ముందే లింగమనేని  ఈ 300 ఎకరాల విలువైన భూములను
 
ఓ ఎస్టేట్ మాదిరిగా మార్చారు. భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎస్టేట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.  ఇక్కడ ఎకరం రూ.ఐదు కోట్ల వర కూ పలుకుతోంది. కాజ గ్రామానికి చెందిన కొంత మంది రైతుల వద్ద ఇంకా లీజు అగ్రిమెంట్‌లు ఉండటంతో లింగమనేని కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ భూముల పక్కనే ‘చినబాబు’ కొట్టేసిన అగ్రిగోల్డ్  హాయ్‌ల్యాండ్ కూడా ఉండటం గమనార్హం. లీజుకు ఇచ్చిన తమ భూములు ఎక్కడు న్నాయో తెలుసుకునేందుకు కాజ గ్రామస్తులు ప్రయత్నించగా, లింగమనేని ఎస్టేట్‌లో ఉన్నట్లు తేలింది.
 
పేదల వద్ద పక్కా ఆధారాలు...
లింగమనేని ఎస్టేట్స్ యాజమాన్యం అధీనంలో ఉన్న భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధిత రైతులు తెలిపారు. అయితే తమ భూములను చూసేందుకు కూడా వీలు లేకుండా ప్రై వేట్ సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు అండదండలు ఉండటం వల్లే లింగమనేని ఎస్టేట్స్ వైపు కన్నెత్తి చూసేందుకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు అధికారులు సాహసించడం లేదు.  సర్వే నెంబరు  191, 192, 226 ఇలా అనేక సర్వే నెంబర్‌లలో ఉన్న 300 ఎకరాల భూమిని లింగమనేని యాజమాన్యం కొట్టేసిందని బాధితుల కథనం. రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో బాధితులు తమ వద్ద ఉన్న విక్రయ డాక్యుమెంట్‌ల ఆధారాలతో ‘సాక్షి’ ప్రతినిధులను ఆశ్రయించడంతో లింగమనేని గ‘లీజు’ దందా వెలుగులోకి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement