నూతన రాజధాని ప్రాంతంలో బినామీలతో వేల ఎకరాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆ డబ్బుతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి ఆరోపించారు.
ఢిల్లీ: నూతన రాజధాని ప్రాంతంలో బినామీలతో వేల ఎకరాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆ డబ్బుతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి ఆరోపించారు. రాజధాని పేరుతో భారీ అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. భూదందాపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మేకపాటి డిమాండ్ చేశారు.