illigal
-
ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నేరం.. కారణం ఇదే!
పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరొందింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించేందుకు ఫ్రాన్స్‌కు తరలివస్తుంటారు. 1889లో ఫ్రాన్స్‌లో నిర్వహించిన వరల్డ్ ఎగ్జిబిషన్‌కు ఎంట్రీ గేటుగా ఈ టవర్ నిర్మాణం ప్రారంభమయ్యింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ రూపంలో నిర్మించారు. తరువాత దీనిని కూల్చివేసే ఆలోచన చేశారు. అయితే దీని అందం, ప్రజాదరణలను దృష్టిలో ఉంచుకుని దీనిని కూల్చివేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఈఫిల్ టవర్ నిర్మించేందుకు 2 ఏళ్ల 2 నెలల 5 రోజులు పట్టింది. దీని నిర్మాణం 1887 నుంచి 1889 వరకూ సాగింది. ఈఫిల్ టవర్ నిర్మాణంలో సుమారు 300 మంది కూలీలు పాల్గొన్నారు. ఈ అద్భుత కళాకృతి కారణంగా నేడు పారిస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంటుంది. ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నిషిద్ధం. చట్టరీత్యా ఈ టవర్‌కు రాత్రివేళ పొటోలుతీయడం నేరమని ప్రభుత్వం ప్రకటించింది. ఈఫిల్ టవర్ లైట్లు పారిస్ కాపీరైట్స్ కిందకు వస్తాయి. అందుకే ఎవరైనా రాత్రివేళ ఈఫిల్ టవర్‌కు ఫొటోలు తీయాలనుకుంటే, ముందుగా కాపీరైట్ చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పారిస్‌ను లవ్ సిటీ అని అంటారు. జంటలకు ఈఫిల్ టవర్ లవ్ స్పాట్ అని చెబుతారు. పారిస్‌కు ఇంతటి జనాదరణ ఉన్న కారణంగానే భారత ప్రధాని నరేంద్రమోదీ తన ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశంలో యూపీఐ పేమెంట్లను ప్రారంభించారు. దీని తొలి పేమెంట్‌ను ఈఫిల్ టవర్ వద్ద నిర్వహించారు. త్వరలో పర్యాటకులు ఈఫిల్ టవర్ ఎంట్రీ ఫీజు చెల్లించేందుకు యూపీఐ పేమెంట్‌ను ఉపయోగించవచ్చు. ఈఫిల్ టవర్లోని కొంతభాగం శీతాకాలంలో ముడుచుకుపోతుంటుంది. ఇప్పటిరకూ 6 ఇంచుల భాగం ముడుచుకుపోయిందని చెబుతుంటారు. ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన మెటల్ చలికి ముడుచుకుపోతుంటుంది. వేసవిలో తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన నిర్మాణాలలో ఈఫిల్ టవర్ ముందు వరుసలో ఉంటుంది. అయితే 1930లో నిర్మించిన న్యూయార్క్‌లోని క్రిస్మస్ బిల్డంగ్ ఎత్తు విషయంలో ఈఫిల్ టవర్‌ను అధిగమించింది. నిజానికి ఈఫిల్ టవర్‌ను 20 ఏళ్లపాటు నిలిచివుండేలా నిర్మించారు. అయితే ఈ నిర్మాణం జరిగి 20 ఏళ్లు దాటినా అది చెక్కుచెదరకుండా ఉంది. దీని నిర్మాణం జరిగిన 20 ఏళ్ల అనంతరం దీనికి కొన్ని సాంకేతిక పరీక్షలు చేశారు. ఈ నేపధ్యంలో టవర్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉందని తేలింది. అందుకే ఈరోజుకూ ఈఫిల్ టవర్ మనమంతా తలెత్తుకునేలా నిలిచింది. ఇది కూడా చదవండి: నేపాల్‌లో దాక్కున్న చైనా ‘పెంగ్’.. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూ.. -
ఎన్నారై మాఫియా? అక్రమ రవాణాకు కోట్ల రూపాయల వసూలు
విమానం ఎక్కాలి.. అమెరికాలో వాలిపోవాలి.. డాలర్లలో డబ్బులు సంపాదించాలనే క్రేజ్ గుజరాత్‌లోకి కొన్ని ప్రాంతాలను పట్టి పీడిస్తోంది. ఎన్నారై మోజులో పడి ఎన్నో కుటుంబాలు అప్పుల పాలు అవుతుండగా... ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ట్రావెల్ ఏజెంట్లు మాఫియాలా మారారు. తుపాకులు చేతబడుతున్నారు.. చంపేందుకు సైతం వెనుకాడటం లేదు. ట్రావెల్ ఏజెంట్లు గుజరాత్లో ఎన్నారై కావాలనే ఆశతో కెనాడలో అమెరికా సరిహద్దులో ఓ కుటుంబం బలైపోయిన సంఘటన ఇంకా మది నుంచి చెరిగిపోకముందే మరో ఘటన తెర మీదకి వచ్చింది. గుజరాత్‌లోని కలోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణుభాయ్ మానేక్‌లాల్ పటేల్ అనే వ్యక్తి కలోల్ పట్టణంలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు.అతని మేనల్లుడు విశాల్, అతని భార్య రూపాలిలను అక్రమ పద్దతిలో అమెరికా పంపేందుకు రుత్విక్, దేవమ్ అనే స్థానిక ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందం చేసుకున్నాడు. డీల్ ఇలా ఒప్పందం ప్రకారం భార్య భర్తలను ఇల్లీగల్‌గా అమెరికాకు తీసుకెళ్లినందుకు రూ. 1.10 కోట్ల రూపాయలు చెల్లించాలనే నిర్ణయించారు. ఇందులో రూ. 10 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించగా.. అమెరికా చేరుకున్న తర్వాత రెండో విడతగా రూ. 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో సెటిలైన తర్వాత నెలన్నర రోజులులోగా మూడో విడతగా రూ.50 లక్షలు చెల్లించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ప్లాన్‌లో చేంజ్ ఢిల్లీ మీదుగా విశాల్, రూపాలీలను అమెరికా తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెంట్లు రుత్విక్, దేవమ్‌లు తెలిపారు. మీతో పాటు మరికొంతమంది కూడా ఈ టూర్లో ఉన్నారని చెప్పారు. అన్నట్టుగానే ఫిబ్రవరి 5న విశాల్, రూపాలీ దంపతులు ఢిల్లీ నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కారు. వీరితో పాటు ట్రావెల్ ఏజెంట్లైన రుత్విక్, దేవమ్‌లు కూడా అమెరికా చేరుకోవాలి. అయితే ఈ ప్రయాణం నుంచి రుత్విక్ ఢిల్లీలోనే డ్రాప్ అయ్యాడు. డబ్బులు ఇవ్వమంటూ ఢిల్లీలోనే ఆగిపోయని రుత్విక్ తనతో పాటు అదే సంస్థకు చెందిన మరికొందరు ఏజెంట్లతో అదే రోజు రాత్రి గుజరాత్ చేరుకున్నాడు. కలోల్‌లోని విష్ణుభాయ్ పటేల్ ఇంటికి వెళ్లి ‘ మీ వాళ్లు అమెరికా ఫ్లైట్ ఎక్కారు కాబట్టి మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు’. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెరికాలో మా వాళ్లు దిగిన తర్వాతే మిగిలిన డబ్బులు ఇస్తానంటూ విష్ణుభాయ్ బదులిచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఫైరింగ్ డబ్బులు రాకపోవడంతో రుత్విక్ అతని గ్యాంగ్ విష్ణుభాయ్ పటేల్‌పై తుపాకితో కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ అతని శరీరానికి తాకలేదు. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు గట్టిగా కేకలే వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. మిగిలిన గ్యాంగ్ సభ్యలు పారిపోగా.. రుత్విక్ దొరికాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. కోటిన్నర రూపాయలు ఎలాగైనా ఎన్నారై కావాలనే ఆశతో గుజరాత్లో కొందరు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో భూములు అమ్మడం, లోన్లు తీసుకోవడవం చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులను అమెరికా పంపేందుకు కోటిన్నర రూపాయలను ట్రావెల్ ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. చదవండి: ఎన్నారై అమ్మాయి కావాలెను! రూ.30 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తాం!! -
ఆన్లైన్ రమ్మీ.. అంతా డమ్మీ.. ఆశకు పోతే ప్రాణాలుండవు!
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌కు చెందిన సీపతి అభిలాష్ (25) అనే సీఏ విద్యార్థి.. ఆన్లైన్ రమ్మీకి బానిసయ్యాడు. అప్పులు చేసి మరీ ఆడాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. గత ఏడాది డిసెంబర్ 29న విషం తాగి చనిపోయాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్ ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టాడు. మొదట్లో కొంత లాభం రావడంతో తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులు, అప్పులు చేసినవి కలిపి ఏడు లక్షలు పెట్టి ఆడాడు. సొమ్మంతా పోగొట్టుకున్నాడు. డబ్బు లన్నీ తిరిగి సాధించాలని మళ్లీ 8 లక్షలు అప్పులు చేశాడు. ఈ సొమ్ము కూడా పోవడంతో.. ఆందోళనకు గురై గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధాన్ని తొలగించుకునేందుకు ముంబై గేమ్ మాఫియా రంగంలోకి దిగింది. పేకాట, ఆన్లైన్ గేమింగ్‌లను బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో.. ఆన్లైన్ రమ్మీకి సడలింపు ఇచ్చేలా చేయాలని ఓ కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్‌తో సంప్రదింపులు జరిపింది. దీనికి ఆ ఇద్దరు కీలక వ్యక్తులు అంగీకరించారని.. కొన్నికోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని, అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేసిన సదరు ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారి.. అనుకున్న ‘పని’ సాధించలేకపోయారు. ఈలోగా విషయం పెద్దలకు తెలియడంతో.. చీవాట్లు పెట్టారని తెలిసింది. ఇప్పుడీ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలో పేకాట, ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం టీఆర్ఎస్ సర్కారు 2016లోనే రాష్ట్రంలో పేకాటను నిషేధించింది. దానితోపాటు ఇంటర్నెట్లో ఆడే ‘ఆన్లైన్ రమ్మీ’, ఇతర ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటలపైనా నిషేధం విధించింది. పేకాటతోపాటు యువతను వ్యసనాలకు గురిచేసే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నిర్ణయంపై మహిళలతోపాటు అన్నివర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆన్లైన్ పేకాట వందలు, వేల కోట్ల వ్యాపారం కావడంతో.. ముంబై వేదికగా ఆన్లైన్ వెబ్సైట్లు, యాప్‌లను నిర్వహిస్తున్న మాఫియా సంస్థలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటకు అనుమతి వచ్చేలా చేయాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను సంప్రదించాయి. రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నాలు ఆన్లైన్ రమ్మీ మాఫియా ‘ఆఫర్’కు లొంగిపోయిన ఒక కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్.. ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో సదరు సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఒప్పందం కుదుర్చుకున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అడ్వాన్స్‌గా కొన్నికోట్ల మొత్తాన్ని తీసుకున్నారని వెల్లడించాయి. ఇది జరిగి రెండు, మూడు నెలలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. దీనితో రమ్మీ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి రంగంలోకి దిగి సదరు ప్రజాప్రతినిధిని, సీనియర్ అధికారిని నిలదీశారని.. వారం, పది రోజుల్లో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారని సమాచారం. ఈ పది రోజుల గడువు తీరినా స్పందన లేకపోవడంతో అడ్వాన్స్ తిరిగివ్వాలని ఒత్తిడి పెంచారని.. ఈ క్రమంలో విషయం మరో కీలక ప్రజాప్రతినిధి ద్వారా ప్రభుత్వ పెద్దలకు చేరిపోయిందని తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని, మాఫియాకు డ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. సదరు వ్యక్తులు మధ్యవర్తుల ద్వారా అడ్వాన్స్ సొమ్ము తిరిగి ముంబై మాఫియాకు తిరిగి పంపారని తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా.. స్పందించలేదు. నిషేధమున్నా.. ఏటా వేల కోట్ల దందా రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటపై నిషేధం ఉండటంతో.. గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ స్టోర్ వంటివాటిలో సదరు యాప్స్ అందుబాటులో ఉండవు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్ల ద్వారా సదరు ఆన్లైన్ గేమింగ్ సంస్థలు ప్రచారం చేస్తూ.. లింకులు పెడతాయి. ఆ లింక్స్‌ను షేర్ చేస్తే పాయింట్లో, నగదో రివార్డు ఇస్తామని ఆశపెడ్తాయి. అలా ఒకరి నుంచి ఒకరికి లింకులు షేర్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇలా 12లక్షల మందికి పైగా సదరు యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్నట్టు కేంద్ర నిఘా సంస్థలు గతంలోనే కేంద్ర హోంశాఖకు నివేదికలు ఇచ్చాయి. వీటిద్వారా ఏటా రూ.2 వేల కోట్లకుగా దందా సాగుతోందని అంచనా వేశాయి. 2018లో తెలంగాణ నుంచి రూ.1,200 కోట్ల మేర ఆన్లైన్ యాప్స్‌లో దందా సాగిందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫేక్ లొకేషన్‌తో జిమ్మిక్కులు ఆన్లైన్ రమ్మీ యాప్‌లు మొబైల్ఫోన్ల లొకేషన్ డేటాను తీసుకుంటాయి. రాష్ట్రంలో అధికారికంగా నిషేధం ఉండటంతో ఇక్కడి మొబైల్ లొకేషన్ ఉంటే గేమ్ ఆడటానికి వీలుకాదని చూపిస్తాయి. అయితే ఆన్లైన్ గేమ్ మాఫియా సంస్థలు ఫోన్లలో ఫేక్ జీపీఎస్ లొకేషన్ చూపించే యాప్స్‌ను షేర్ చేస్తున్నాయి. వీటిసాయంతో ఆన్లైన్ రమ్మీ ఆడేవారు ఫోన్లో అసలు జీపీఎస్ లొకేషన్‌ను డిసేబుల్ చేసి.. ఫేక్ జీపీఎస్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నట్టు లొకేషన్ పెడుతూ.. ఆన్లైన్ పేకాట ఆడుతున్నారు. ఏమిటీ ఆన్లైన్ రమ్మీ వ్యవహారం? పేకాట క్లబ్బుల్లో, బయటా ‘మూడు ముక్కలాట, రమ్మీ’ ఆడినట్టుగానే.. ఆన్‌లైన్‌లోనూ డబ్బులు పెట్టి ఆడేందుకు కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొన్ని నియంత్రణలను పెట్టింది. అందుకు అనుగుణంగా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ప్రత్యేక యాప్‌లను రూపొందించి దందా చేస్తున్నాయి. ఆన్లైన్ పేకాట, గ్యాంబ్లింగ్‌ను తమ రాష్ట్రాల్లో అనుమతించాలా, నిషేధించాలా అన్ని నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ పేకాటను నిషేధించాయి. మొదట్లో ‘ఎర’ వేసి.. ఆన్లైన్ పేకాట ఆడేవారు సదరు వెబ్సైట్/యాప్‌లకు బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానించి.. డబ్బులను వాటిలోకి బదిలీ చేసుకుంటారు. ఆ డబ్బులతో పేకాడుతారు. గెలిచినవారికి డబ్బులు ఇవ్వడం, ఓడిపోతే కట్ చేయడం జరుగుతాయి. సర్వీస్చార్జీల పేరిట కొంత మొత్తాన్ని మినహాయించుకుంటాయి. అయితే ఈ ఆన్లైన్ గేమ్స్‌లో చాలా వరకు మోసమే. వీటిలో ఆడటం మొదలుపెట్టినవారికి కొద్దిరోజులు కావాలనే డబ్బులు గెలుచుకున్నట్టు చూపిస్తారని.. వారు ఆన్లైన్ పేకాటకు బానిసలయ్యాక ఉన్న డబ్బంతా ఊడ్చేస్తాయని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో చాలా మంది లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. అవన్నీ పోగొట్టుకుని అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు ఎన్నో నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా హాజిపూర్‌కు చెందిన చిందం పోశెట్టి.. ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డాడు. మొదట్లో కొంత డబ్బులు రావడంతో.. తర్వాత అప్పులు చేసి మరీ ఆడాడు. డబ్బులన్నీ పోవడంతో ఆవేదనలో మునిగిపోయాడు. ఈ ఏడాది జనవరి 27న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
రిమ్స్ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల దందా
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ అస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యొగాల అమ్మకాల దందా బయటపడింది. స్డాప్ నర్సు ఉద్యోగానికి రూ. లక్ష 50 వేలు చెల్లించాలని మద్యవర్తులు నిరుద్యోగులతో బేరసాలకు దిగారు. స్టాప్ నర్సు ఉద్యోగానికి ఎంపికైన సుప్రియను డబ్బులు చెల్లించాలని బ్రోకర్ డిమాండ్ చేశాడు. మద్యవర్తి రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నాడు. ఇలా ఐదుగురు నిరుద్యోగులతో మద్యవర్తులు బెరసారాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల వేలంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనిపై బాదిత కుటుంబ సభ్యులు రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రిమ్స్ డైరెక్టర్ బాధితులకు తెలిపారు. -
ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ గెస్ట్ హౌస్
సాక్షి, గుంటూరు: కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి గుంటూరులో నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయం అక్రమం.. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమం.. చిలకలూరిపేట పట్టణంలో నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయం అక్రమం.. ఆఖరికి ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట పట్టణంలో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమే.. దీని కోసం పోరంబోకు స్థలాన్ని ఆక్రమించేశారు. వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేట పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ వెనుక సర్వే నంబర్ 89 బ్లాక్ నంబర్ ఐదులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు 345 చదరపు గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో గత సంవత్సరంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణం ప్రారంభించారు. మూడు అంతస్తుల గెస్ట్ హౌస్ భవన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఇంటీరియల్ వర్క్ జరుగుతోంది. కానీ ఈ భవన నిర్మాణం మాత్రం అక్రమం. కనీసం గెస్ట్ హౌస్ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు కోరుతూ దరఖాస్తు కూడా చేసుకోలేదు. అధికార బలంతో ఆక్రమ నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ అధికారులు సైతం మంత్రికి ఎదురు చెప్పలేక చూసీచూడనట్టు వదిలేశారు. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి.. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఎస్పీ కెనాల్స్‌లో టీడీపీ కార్యాలయం అక్రమ నిర్మాణంపై శనివారం(10వ తేదీ) సాక్షి దినపత్రికలో ‘కబ్జా స్థలంలో టీడీపీ దర్జా’ అనే శీర్షికతో క£థనం ప్రచురితమైంది. ఈ కథనానికి కదిలిన పేట మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మరో వైపు గెస్ట్ హౌస్ నిర్మాణం గురించి తెలియడంతో దీనికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మాజీ మంత్రి నిర్మించిన అక్రమ కట్టడాన్ని గుట్టుచప్పుడు కాకుండా బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించాలని ప్రయత్నాలు సాగాయి. ఇప్పటి వరకూ మున్సిపల్ అధికారులు ఈ భవనానికి పన్ను వేయకపోవడంతో బీపీఎస్‌కు దరఖాస్తుకు అడ్డంకి పడింది. సర్వే నంబర్ 89 బ్లాక్ ఐదులో ప్రత్తిపాటికి 345 చదరపు గజాల స్థలం ఉంది. గెస్ట్ హౌస్ నిర్మాణం 479 చదరపు గజాల్లో చేపట్టారు. తన స్థలానికి అనుకుని ఉన్న పోరంబోకు స్థలాన్ని ప్రత్తిపాటి కబ్జా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న ప్రాంతంలో గజం స్థలం రూ.25 వేలకుపైగా మాటే. ఈ లెక్కన మంత్రి తన గెస్ట్ హౌస్ నిర్మాణంలో కలుపుకున్న 134 చదరపు గజాల స్థలం విలువ రూ.30 లక్షలకుపైనే ఉంటుందని తెలుస్తోంది. నోటీసులు ఇచ్చేందుకు వెనుకడుగు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణానికి నోటీసులిచ్చేందుకు చిలకలూరిపేట మున్సిపాలిటీలోని ఓ టీపీవో వెనకడుగు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించడం కోసం టీడీపీకి చెందిన ఓ ఇంజినీర్, సదరు టీపీవో రూ.లక్షల్లో వసూలు చేసినట్టు సమాచారం. దీంతో కమిషనర్ మాజీ మంత్రికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించినా టీపీవో కార్యాలయానికి రాకుండా కాకమ్మ కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. నోటీసు తయారు చేసినప్పటికీ కనీసం సంతకం చేసేందుకు కూడా టీపీవో అందుబాటులో లేరు. పైపెచ్చు అక్రమ కట్టడంపై చర్చలు తీసుకునేందుకు ముందుకు వస్తున్న మిగిలిన సిబ్బందిని సైతం టీపీవో, ఇంజినీర్ ఇబంది పెడుతున్నారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాం ఐదేళ్లుగా నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టులో సాగు నీరు అందలేదు. నేను మాగాణి వదిలేసి మెట్ట పంటలు సాగ చేశాను. కేవలం వర్షాధారం పంటలపై ఆధారపడటంతో ఆర్థికంగా నష్టాల పాలయ్యాను. ప్రస్తుతం సాగర్‌కు భారీగా వరద నీరొస్తోంది. దీంతో మళ్లీ పొలాలకు జల కళ రానుంది. - డీ శ్రీనివాసరెడ్డి, వి.రెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం సాగు నీటి కష్టాలకు చెక్ సాగర్ కాలువలకు నీరులేక మాగాణి భూముల్లో మెట్ట పంటలు పండక నష్టాల పాలయ్యా. వ్యవసాయంపై ఆధారపడి పని చేసే కూలీలు సైతం పనుల్లేక వలసలు వెళ్లారు. సాగర్‌కు నీరొస్తే రెండు పంటలు పండుతాయి. ప్రతి సీజన్లో కూలీలకు ముమ్మరంగా పని దొరుకుతుంది. ప్రస్తుతం అందరి ఆశలు చిగురిస్తున్నాయి. -విప్పర్ల బుడే, సంతగుడిపాడు, రొంపిచర్ల మండలం -
‘షరియత్ కోర్టులు చట్ట వ్యతిరేకం’
లక్నో : షరియత్ కోర్టులు (దారుల్ కాజా) ఏర్పాటు చట్ట వ్యతిరేకమని యూపీ షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ వాసిం రిజ్వీ పేర్కొన్నారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాలో షరియత్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వాసిం రిజ్వీ సమస్యలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఉండొచ్చని, షరియత్ కోర్టులు మాత్రం ఏర్పాటు చేయాడానికి వీళ్లేదని వ్యాఖ్యానించారు. కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఖ్వాసి (జడ్జి)లను నియమించడం సరికాదని అన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరించడానికి సొంతంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీనియర్ న్యాయవాది, ముస్లిం లా బోర్డు సభ్యుడు జాఫర్యాబ్ జిలానీ.. ప్రస్తుతం యూపీలో 40 కోర్టులు ఉన్నాయని అవి పూర్తిగా చట్టబద్దమైనవని స్పష్టం చేశారు. షరియత్ కోర్టులు చట్టవ్యతిరేకమైనవని ప్రజలు భావిస్తే సుప్రీంకోర్టు వాటిని తిరస్కరిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కోర్టులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నెల 15 బోర్డు సభ్యులందరూ సమావేశమై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని జిలానీ పేర్కొన్నారు. -
చెరువుకట్టపై అక్రమంగా చెట్లు నరికివేత
అనుమసముద్రంపేట : మండలంలోని శ్రీకొలను చెరువుకట్టపై ఉన్న సుమారు 30 వేప చెట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా కొట్టి తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. విషయం తెలుసుకున్న ఆగ్రామ వైఎస్సార్సీపీ నాయకులు బోయిళ్ల చెంచురెడ్డి సంబందిత డీఈకి ఫోను ద్వారా సమాచారం అందించారు. ఆయన మాట్లాడుతూ చెరువు కట్టపై రూ.50 వేలు విలువ చేసే వేపచెట్లు ఉన్నాయన్నారు. వాటిపై కన్నేసిన కొందరు వ్యక్తులు అక్రమంగా గత మూడురోజులుగా నరుకుతున్నారన్నారు. సంబంధిత అధికారులు ఎందుకు నిమ్మకునీరెత్తినట్లున్నారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా ఈ దీనిపై పీడబ్ల్యూడీ డీఈ రవి మాట్లాడుతూ చెట్లు నరికేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. అక్రమంగా చెట్లు నరికితే చర్యలు తీసుకుంటామన్నారు. నీటి సంఘం అధ్యక్షులు నంది వివేకానందరెడ్డి మాట్లాడుతూ చెరువుకట్ట వద్ద చెట్లు కొన్ని నరికారని తెలిసిందని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రభుత్వ పార్కింగ్ స్థలం వారిదే!
అబిడ్స్: అధికారులు ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలం వారిదే అన్న తీరుగా.. వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అబిడ్స్ పోలీసులు అరెస్టుచేశారు. జీహెచ్ఎంసీ 8వ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబిడ్స్ జగదీష్ మార్కెట్లో కొన్ని నెలలుగా ప్రతిరోజూ వందలాది వాహనాల వద్ద పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న ఫైజుల్, ఎం. మఫీలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే ఈ విషయమై కొంతమంది స్థానిక వ్యాపారస్తులు, సన్నిహితులు వారిని విడిచిపెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. అంతేగాక చార్మినార్ మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రీకి కూడా వారు ఫిర్యాదు చేశారు. అయితే, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అబిడ్స్ ఏసీపీ రాఘవేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లు ఎమ్మెల్యేకు వారిద్దరినీ ఎందుకు అరెస్టు చేశామో వివరించారు. ప్రజలకు ఉచిత పార్కింగ్ జీహెచ్ఎంసీ కల్పిస్తే ఎందుకు పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారని పోలీసు అధికారులు ఈ విషయమై ప్రశ్నించిన ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో తనకేమీ తెలియదంటూ ఆయన వెళ్లిపోయారు. ఇద్దరు నిందితులపై పోలీసులు పలు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆ డబ్బుతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారు: మేకపాటి
ఢిల్లీ: నూతన రాజధాని ప్రాంతంలో బినామీలతో వేల ఎకరాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆ డబ్బుతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని పేరుతో భారీ అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. భూదందాపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మేకపాటి డిమాండ్ చేశారు. -
'ఏపీ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా దిగజార్చారు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా దిగజార్చారని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య విమర్శిచారు. రాజధాని భూదందాపై బుధవారం ఆయన మట్లాడుతూ.. రాజధాని విషయంలో మొదటి నుంచీ అక్రమాలే జరుగుతున్నాయన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని రామచంద్రయ్య దుయ్యబట్టారు. భూదందాకు సంబంధించిన నిజాలను నిగ్గు తేల్చడానికి చంద్రబాబే సీబీఐ విచారణను కోరాలని ఆయన డిమాండ్ చేశారు. -
'జీవోలన్నీ బడా బాబుల లాభం కోసమే'
విశాఖపట్నం: రాజధాని ప్రాంతంలో భూదందాలపై సాక్షిలో వెలువడిన కథనాలపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్.శర్మ స్పందించారు. గత నెలలో ప్రభుత్వానికి తాను రాసిన లేఖలోని అంశాలు, ఈ రోజు సాక్షిలో వెలువడిన కథనాల్లోని అంశాలు ఒకేలా ఉన్నాయని ఈ సందర్భంగా శర్మ వెల్లడించారు. సీఆర్డీఏకు సంబంధించిన ప్రతి జీవో.. బడా బాబులకు లాభం చేకూర్చేలా ఉందని శర్మ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని భూదందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెల 22న ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ.. అజయ్ కలామ్‌కు రాజధాని ప్రాంతంలో భూదందాలపై శర్మ లేఖ రాసిన విషయం తెలిసిందే. -
'భూదందాపై సీబీఐచే విచారణ జరిపించాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూదందాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో భూదందాపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన నిరుపేదలు, రైతులకు న్యాయం చేయాలని కోరారు. రాజధాని పేరుతో చిన్నబాబు, పెద్దబాబుల అక్రమ భూదందాపై సీబీఐచే విచారణ జరిపించాలని శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పరిగి: పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను రంగారెడ్డి జిల్లా పరిగి మండలం శిగుపల్లి సమీపంలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో.. అప్రమత్తమైన స్థానికులు ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 11 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. -
నాటుసారా బట్టీలపై ఆకస్మిక దాడి
కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఎర్రగుంట్ల అడవుల్లో నాటుసారా బట్టీలపై ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 2400 లీటర్ల బెల్లం ఊట, 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాసర గోదావరి తీరంలో ఇసుక దందా
బాసర: వశిష్ట గోదావరి ఎండిపోవడంతో ఇసుక అక్రమార్కులు కళ్లు తెరిచారు. బాసర గోదావరి తీరం నుంచి రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్లను ఇసుకతోపాటు సీజ్ చేశారు. నిజానికి ప్రతి రోజూ అర్ధరాత్రి సమయంలో సుమారు 10 టిప్పర్ల మేర ఇసుక రవాణా జరుగుతోందని సమాచారం. -
'ఇసుక అక్రమాల్లో లోకేష్‌కూ వాటా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడుతున్న ఇసుక అక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు లోకేష్‌కు కూడా వాటా అందుతుందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి 3 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ఇసుక ధరను 17 శాతం పెంచిన ప్రభుత్వం.. తీరా చూస్తే ఖజానాకు 500 కోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతుందన్నారు. ఇసుక అమ్మకాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ఏకాభిప్రాయం కావాలని వెంకయ్యనాయుడు మెలిపెట్టడాన్ని అంబటి తప్పుపట్టారు. రాష్ట్ర విభజన సమయలో ఏకాభిప్రాయం తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ, బీజేపీలు ఉమ్మడిగా విస్మరిస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ కాస్తా సీజేపీ( చంద్రబాబు జనతా పార్టీ)గా మారిందని అంబటి ఎద్దేవా చేశారు. -
అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సీరియస్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాపై శుక్రవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఆదాయమే ధ్యేయంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి అని మండిపడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. ఇసుక తవ్వకాల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, భవిష్యత్ తరాలకు తీవ్రమైన నష్టం కలుగుతుందని పేర్కొంది. అక్రమ ఇసుక తవ్వకాల వలన భూ గర్భ జాలాలు అడుగంటుతాయని తెలిపిన ఎన్జీటీ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక తవ్వకాల విషయంలో స్పష్టమైన విధానాలు పాటించాలని సూచించింది. కాగా ఇసుక దోపిడిని అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా పిటీషనర్ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. -
జోరుగా జీరో దందా
మార్కెట్‌కు రాకుండానే ఇతర జిల్లాలకు తరలింపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు పట్టించుకోని అధికారులు కుల్కచర్ల: మండలంలో జీరో దందా జో రుగా సాగుతోంది. మార్కెట్‌కు రాకుం డా లక్షల రూపాయల విలువైన ధాన్యం గుట్టుచప్పుడు కాకుండా మహబూబ్‌నగర్ జిల్లాకు తరలుతోంది. కుల్కచర్ల మార్కెట్‌కు కమిటీ లేకపోవడం.. పరిగి మార్కెట్‌కు అనుసంధానంగా ఉండడంతో పట్టించుకొనేవారు లేకుండా పోయారు. దీంతో జీరో దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మండల కేంద్రానికి 24 కి.మీ దూరంలో ఉన్న మరికల్లో ఎలాంటి అనుమతి లేకుండా మినీ మార్కెట్ కొనసాగుతోంది. అక్కడ ఉన్న దళారులు, వ్యాపారులు రైతులు పండించిన పంటను కుల్కచర్ల మార్కెట్‌కు రాకుండా అక్కడే అక్కడే కొని మహబూబ్‌నగర్ జిల్లాకు తరలిస్తున్నారు. మండల కేంద్రంలో ప్రతి బుధవారం మార్కెట్ కొనసాగుతుంది. ఈ మార్కెట్‌కు కుల్కచర్ల, గండేడ్ మండలాల నుంచి రైతులు ధ్యానం తీసుకువస్తారు. మండలంలోని మరికల్, ముజాహిద్పూర్, బండవెల్కిచర్ల, పుట్టపహాడ్, చౌడపూర్ గ్రామాల్లో కొందరు వ్యాపారులు అక్కడే మార్కెట్లు ఏర్పాటు చేశారు. రైతులకు మాయమాటలు చెప్పి ధాన్యాన్ని మార్కెట్‌కు రాకుండా చేస్తున్నారు. మార్కెట్‌కు వెళ్తే రవాణా, హమాలీ, దడువాయి ఖర్చులు అవుతాయని చెబుతూ అక్కడే తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కుల్కచర్ల మార్కెట్‌కు తరలించకుండా మార్కెట్ ఫీజు లేకుండా, వే బిల్లులు లేకుండా ఇతర జిల్లాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు 20 నుంచి 25 లారీల వరకు మొక్కజొన్న, వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు. దీంతో ప్రతి వారం మార్కెట్‌కు వేలల్లో నష్టం జరుగుతోంది. తూకాల్లో మోసాలు ధాన్యం తక్కువ ధరకే తీసుకోవడం కాకుండా తూకాల్లో కూడా పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాలుకు 5 కిలోలు తక్కువ అవుతున్నాయని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా అందామంటే అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వరని ఏమి అనలేక పోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు, విజిలెన్స్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
గంజాయి తరలిస్తున్న మహిళలు అరెస్ట్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల పోలీసులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని ఉప్పల్ గ్రామానికి చెందిన ఎండీ షమీం(32), ఆమె తల్లి బిపాషా(60) కొంతకాలంగా మహారాష్ట్రకు రైళ్లలో గంజాయి తరలించి అమ్ముతున్నారు. వీరు వరంగల్ జిల్లా మల్లారెడ్డిపల్లికి చెందిన రాజిరెడ్డి, కొప్పుల గ్రామానికి చెందిన నరిగె రాజయ్యల వద్ద నుంచి కిలో రూ.2 వేల చొప్పున కొనుగోలు చేసి, దాన్ని చిన్న కవర్లలో ప్యాక్ చేసి నాగ్‌పుర్‌కు తరలించి అక్కడ కిలో రూ.10 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి దందాపై సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం షమీం ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 20 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులతో పాటు వారికి గంజాయి సరఫరా చేస్తున్న రాజిరెడ్డి, రాజయ్యలపై కేసు నమోదు చేశారు. షమీం, బిషాషాలను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న రాజిరెడ్డి, రాజయ్యల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.