
'ఏపీ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా దిగజార్చారు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా దిగజార్చారని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య విమర్శిచారు. రాజధాని భూదందాపై బుధవారం ఆయన మట్లాడుతూ.. రాజధాని విషయంలో మొదటి నుంచీ అక్రమాలే జరుగుతున్నాయన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని రామచంద్రయ్య దుయ్యబట్టారు. భూదందాకు సంబంధించిన నిజాలను నిగ్గు తేల్చడానికి చంద్రబాబే సీబీఐ విచారణను కోరాలని ఆయన డిమాండ్ చేశారు.