రాజధాని ప్రాంతంలో భూదందాలపై సాక్షిలో వెలువడిన కథనాలపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్.శర్మ స్పందించారు.
విశాఖపట్నం: రాజధాని ప్రాంతంలో భూదందాలపై సాక్షిలో వెలువడిన కథనాలపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్.శర్మ స్పందించారు. గత నెలలో ప్రభుత్వానికి తాను రాసిన లేఖలోని అంశాలు, ఈ రోజు సాక్షిలో వెలువడిన కథనాల్లోని అంశాలు ఒకేలా ఉన్నాయని ఈ సందర్భంగా శర్మ వెల్లడించారు. సీఆర్డీఏకు సంబంధించిన ప్రతి జీవో.. బడా బాబులకు లాభం చేకూర్చేలా ఉందని శర్మ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని భూదందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెల 22న ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ.. అజయ్ కలామ్కు రాజధాని ప్రాంతంలో భూదందాలపై శర్మ లేఖ రాసిన విషయం తెలిసిందే.