ప్రజావిశ్వాసంతోనే ల్యాండ్ పూలింగ్ సాధ్యం
ప్రజావిశ్వాసంతోనే ల్యాండ్ పూలింగ్ సాధ్యం
Published Tue, Oct 18 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
సీఆర్‌డీఏ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు
తుళ్లూరు : ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకం వల్లే ఎంతో కష్టతరమని భావించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను సుసాధ్యం చేయగలిగినట్టు తుళ్లూరు సీఆర్‌డీఏ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు చెప్పారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల బృందం స్థానిక కార్యాలయానికి వచ్చింది. చెన్నకేశవులు వారితో మాట్లాడుతూ.. రాజధాని 29 గ్రామాల్లో ప్రతిచోట ఓ కార్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు 150 మంది సర్వే బృందాలను 13 జిల్లాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చామని తెలిపారు. మూడు నెలల కాలంలో సుమారుగా 34 వేల ఎకరాల భూమిని, 160 సర్వే నంబర్లలో 22,197 మంది భూ యజమానులను గుర్తించామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన ల్యాండ్ పూలింగ్ విధానంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కమిటీ టీం లీడర్ జయశ్రీ కత్తెర నేతృత్వంలో డిప్యూటీ కలెక్టర్లు అశోక్ చౌదరి, రమాకాంత్ ఆస్మర్, సంజయ్ అశ్వల్, ఉత్తమ్ పటేల్, దత్తాత్రేయ కవితక్ రాజధాని ప్రాంతంలోని పలు ప్రదేశాలను సందర్శించి సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించినట్లు వివరించారు.
Advertisement