చిలకలూరిపేటలోని మున్సిపల్ స్థలం ఆక్రమించి మాజీ మంత్రి పుల్లారావు నిర్మించిన గెస్ట్‌హోస్
సాక్షి, గుంటూరు: కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి గుంటూరులో నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయం అక్రమం.. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమం.. చిలకలూరిపేట పట్టణంలో నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయం అక్రమం.. ఆఖరికి ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట పట్టణంలో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమే.. దీని కోసం పోరంబోకు స్థలాన్ని ఆక్రమించేశారు. వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేట పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ వెనుక సర్వే నంబర్ 89 బ్లాక్ నంబర్ ఐదులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు 345 చదరపు గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో గత సంవత్సరంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణం ప్రారంభించారు. మూడు అంతస్తుల గెస్ట్ హౌస్ భవన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఇంటీరియల్ వర్క్ జరుగుతోంది. కానీ ఈ భవన నిర్మాణం మాత్రం అక్రమం. కనీసం గెస్ట్ హౌస్ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు కోరుతూ దరఖాస్తు కూడా చేసుకోలేదు. అధికార బలంతో ఆక్రమ నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ అధికారులు సైతం మంత్రికి ఎదురు చెప్పలేక చూసీచూడనట్టు వదిలేశారు.
‘సాక్షి’ కథనంతో వెలుగులోకి..
నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఎస్పీ కెనాల్స్‌లో టీడీపీ కార్యాలయం అక్రమ నిర్మాణంపై శనివారం(10వ తేదీ) సాక్షి దినపత్రికలో ‘కబ్జా స్థలంలో టీడీపీ దర్జా’ అనే శీర్షికతో క£థనం ప్రచురితమైంది. ఈ కథనానికి కదిలిన పేట మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మరో వైపు గెస్ట్ హౌస్ నిర్మాణం గురించి తెలియడంతో దీనికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మాజీ మంత్రి నిర్మించిన అక్రమ కట్టడాన్ని గుట్టుచప్పుడు కాకుండా బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించాలని ప్రయత్నాలు సాగాయి. ఇప్పటి వరకూ మున్సిపల్ అధికారులు ఈ భవనానికి పన్ను వేయకపోవడంతో బీపీఎస్‌కు దరఖాస్తుకు అడ్డంకి పడింది. సర్వే నంబర్ 89 బ్లాక్ ఐదులో ప్రత్తిపాటికి 345 చదరపు గజాల స్థలం ఉంది. గెస్ట్ హౌస్ నిర్మాణం 479 చదరపు గజాల్లో చేపట్టారు. తన స్థలానికి అనుకుని ఉన్న పోరంబోకు స్థలాన్ని ప్రత్తిపాటి కబ్జా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న ప్రాంతంలో గజం స్థలం రూ.25 వేలకుపైగా మాటే. ఈ లెక్కన మంత్రి తన గెస్ట్ హౌస్ నిర్మాణంలో కలుపుకున్న 134 చదరపు గజాల స్థలం విలువ రూ.30 లక్షలకుపైనే ఉంటుందని తెలుస్తోంది.
నోటీసులు ఇచ్చేందుకు వెనుకడుగు
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణానికి నోటీసులిచ్చేందుకు చిలకలూరిపేట మున్సిపాలిటీలోని ఓ టీపీవో వెనకడుగు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించడం కోసం టీడీపీకి చెందిన ఓ ఇంజినీర్, సదరు టీపీవో రూ.లక్షల్లో వసూలు చేసినట్టు సమాచారం. దీంతో కమిషనర్ మాజీ మంత్రికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించినా టీపీవో కార్యాలయానికి రాకుండా కాకమ్మ కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. నోటీసు తయారు చేసినప్పటికీ కనీసం సంతకం చేసేందుకు కూడా టీపీవో అందుబాటులో లేరు. పైపెచ్చు అక్రమ కట్టడంపై చర్చలు తీసుకునేందుకు ముందుకు వస్తున్న మిగిలిన సిబ్బందిని సైతం టీపీవో, ఇంజినీర్ ఇబంది పెడుతున్నారు.
సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాం
ఐదేళ్లుగా నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టులో సాగు నీరు అందలేదు. నేను మాగాణి వదిలేసి మెట్ట పంటలు సాగ చేశాను. కేవలం వర్షాధారం పంటలపై ఆధారపడటంతో ఆర్థికంగా నష్టాల పాలయ్యాను. ప్రస్తుతం సాగర్‌కు భారీగా వరద నీరొస్తోంది. దీంతో మళ్లీ పొలాలకు జల కళ రానుంది.
- డీ శ్రీనివాసరెడ్డి, వి.రెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం
సాగు నీటి కష్టాలకు చెక్
సాగర్ కాలువలకు నీరులేక మాగాణి భూముల్లో మెట్ట పంటలు పండక నష్టాల పాలయ్యా. వ్యవసాయంపై ఆధారపడి పని చేసే కూలీలు సైతం పనుల్లేక వలసలు వెళ్లారు. సాగర్‌కు నీరొస్తే రెండు పంటలు పండుతాయి. ప్రతి సీజన్‌లో కూలీలకు ముమ్మరంగా పని దొరుకుతుంది. ప్రస్తుతం అందరి ఆశలు చిగురిస్తున్నాయి.
-విప్పర్ల బుడే, సంతగుడిపాడు, రొంపిచర్ల మండలం
Comments
Please login to add a commentAdd a comment