Prathipati Pulla Rao
-
Vidadala Rajini: పత్తిపాటి పుల్లారావు డైరెక్షన్లో తప్పుడు కేసులు..ఇవిగో ఆధారాలు
-
పోసానికి 10 రోజుల రిమాండ్ విధించిన జడ్జి
-
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటికి విడదల రజిని వార్నింగ్
-
మీకు కూడా కుటుంబం ఉంది విడదల రజినీ మాస్ వార్నింగ్
-
సాఫ్ట్వేర్ వ్యక్తి కంటే లారీ డ్రైవర్ ఎక్కువ సంపాదిస్తున్నాడా?
-
MLA ప్రత్తిపాటి భార్య బర్త్ డే వేడుకల్లో పోలీసుల హడావుడి
-
మరో అమరావతి ‘అనకొండ’.. అడ్డంగా దొరికేసింది
అమరావతిని దోచేసిన మరో అనకొండ అడ్డంగా దొరికింది. ప్రజా ధనాన్ని వాటాలేసుకుని మరీ మింగేసిన మరో టీడీపీ నేత దొరికిపోయాడు. అమరావతిలో నిర్మాణాల పేరుతో రచించిన దోపిడీ కథ జైలుకి చేరింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్, జీఎస్టీ ఎగవేత కేసుల్లో అరెస్ట్ అయిన ప్రత్తిపాటి శరత్‌ను రిమాండ్‌కు తరలించారు. బోగస్ ఇన్వాయిస్లు, బోగస్ బిల్లులతో కోట్లు కొల్లగొట్టిన నేరంపై DRI, డైరెక్టరేట్ ఆఫ్ GST అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ అమరావతి అనకొండ కథేంటో చూద్దాం. టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అవెక్సా కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పుల్లారావు భార్య, కొడుకు శరత్ మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి కాంట్రాక్టులు తన భార్య కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న సంస్థకి తీసుకుని, వాటి ద్వారా కోట్ల రూపాయలను అడ్డదారిలో మళ్లించారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులను కొల్లగొట్టి, వాటిని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఆధారాలతో సహా బట్టబయలైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడింది. డీజీజీఐ విచారణలో తేలిన ఆధారాలపై ఏపీ డీఆర్ఐ కూడా విచారించడంతో మొత్తం గుట్టురట్టయ్యింది. ఈ నేపథ్యంలోనే డీఆర్ఐ అధికారులు ప్రత్తిపాటి శరత్ పై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రత్తిపాటి శరత్ ని పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున న్యాయస్థానం ప్రత్తిపాటి శరత్ ని 14 రోజులు రిమాండ్ కి పంపింది. బోగస్ ఇన్వాయిస్ లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని సాక్షాత్తూ అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్రా జగదీష్ అంగీకరించారు. డీజీజీఐ, డీఆర్ఐ విచారణలోనే నేరం అంగీకరించడంతో ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ కుంభకోణం ఎలా జరిగిందో కూడా జగదీష్ పూసగుచ్చినట్టు వెల్లడించడంతో ప్రత్తిపాటి శరత్‌కి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లను బెదిరించి అమరావతి పనులు చేసే కాంట్రాక్టు సంస్థల నుండి ఈ కంపెనీ 2017 నుండి అడ్డగోలుగా సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టు పొందింది. ఆ కంపెనీ నుండి 37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. సీఆర్డీఏ పరిధిలో రోడ్డు, వరద నీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాకులు గ్రీనరీ పనులు చేస్తామని సబ్ కాంట్రాక్టు తీసుకుంది. అయితే వీళ్లు మళ్లీ తానిషా ఇన్ ఫ్రా, రాలాన్ ప్రాజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు 21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టును ఇచ్చినట్టు చూపించారు. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్ లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా మాయ చేసింది. ప్రభుత్వ ఖజానా నుండి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. ఏ పనులు చేయలేదు. ఆ నాలుగు కంపెనీలు షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం 21.93 కోట్లు ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. మరో వైపు అమరావతిలోని ఉద్దండ రాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకుంది ప్రత్తిపాటి పుల్లారావు అవెక్సా కంపెనీ. ఇక్కడైతే అసలు రోడ్డు పనులు చేయకుండానే బిల్లులు పెట్టి ప్రజా ధనాన్ని సొంత ఖాతాల్లోకి మళ్ళించేసుకున్నారు. రోడ్డు నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్ పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఏ పనీ చేయకుండానే 26 కోట్లకు పైగా దోపిడీ చేసింది ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ. పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ కోట్లు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జీ ప్లస్ 3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్ లను సమర్పించి ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీకి చెందిన కంపెనీ. ఈ మేరకు ఆధ్యా ఎంటర్ ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్టు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా 17.85 కోట్లు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ మొత్తం 66.3 కోట్లు కొల్లగొట్టింది. ఈ అవినీతి దందా మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అవెక్సా డైరెక్టర్ అయిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ప్రత్తిపాటి శరత్ కి రిమాండ్ విధించింది. ఇదీ చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం -
ప్రత్తిపాటి శరత్ కు 14 రోజుల రిమాండ్
-
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్
-
టీడీపీలో పరిణామాలపై ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: టీడీపీలో పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది హడావుడేనంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలను ఎంటర్టైన్ చేస్తే ఎలా?. అక్కడో రూ. 10వేలు.. ఇక్కడో రూ.10 వేలు ఇచ్చి టికెట్ కావాలంటే ఇచ్చేస్తారా?. ఇప్పుడేదో రూ.కోటి ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. తర్వాత చేతులెత్తేస్తారు’’ అని ప్రత్తిపాటి అన్నారు. ‘‘ఎన్నికల ముందే ఫౌండేషన్, ట్రస్టుల పేరుతో నేతలు హడావుడి చేస్తారు. నాలుగేళ్ల పాటు ఈ ఫౌండేషన్, ట్రస్ట్ నేతలు ఏమయ్యారు?. ఫౌండేషన్, ట్రస్టుల పేరుతో వచ్చే నేతలు పార్టీ కోసం ఏం చేస్తారు?. ఈ నేతలంతా ఎన్నికల ముందొస్తారు.. తర్వాత వెళ్లిపోతారు. ఎమ్మెల్యేనని చెప్పుకోవడానికో.. విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయడానికో వస్తారు. భాష్యం ప్రవీణ్‌కు.. చిలుకలూరిపేటకు సంబంధమేంటి?. కోడెల కుటుంబానికి న్యాయం చేయాల్సిందే’’ అని ప్రత్తిపాటి పుల్లారావు తేల్చి చెప్పారు. చదవండి: ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా? -
మంత్రి పదవి అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచేసిన పుల్లారావు
-
ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి.. సైకిల్ పోవాలి: టీడీపీ మాజీ మంత్రి
ద్వారకాతిరుమల: సైకిల్ పోవాలి.. సైకిల్ పోవాలి.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, జోన్–2 ఇన్చార్జి ప్రత్తిపాటి పుల్లారావు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మద్దిపాటి వెంకట్రాజు మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని హంగు చేయాలని, జన సమీకరణ భారీ ఎత్తున జరపాలని అనుకున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరడంతో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచర గణం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. జనసమీకరణ లేక ఫ్లాప్ షోగా మారింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సైకిల్ పోవాలి.. సైకిల్ పోవాలని నినాదాలు చేశారు. దాంతో అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాకయ్యారు. అంతలోనే తేరుకున్న ప్రత్తిపాటి సారీ.. సారీ.. అంటూ తన ప్రసంగాన్ని ముందుకు సాగించారు. -
వెంకాయమ్మ చెబితే ఏ అధికారి అయినా మాట వినాల్సిందే! ఎదురు చెబితే..
పార్టీలో ఆయనో సీనియర్ నేత. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగారు. అధికారంలో ఉన్నంత కాలం భార్యాభర్తలు అడ్డంగా దోచుకున్నారు. పార్టీ ఓడిపోయాక మకాం హైదరాబాద్‌కు మార్చాడా మాజీ మంత్రి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ నియోజకవర్గాన్ని వదిలేశాడు. ఇప్పుడు కార్యకర్తలకు టైం వచ్చింది. ఆయనపై రివెంజ్ తీర్చుకునే పనిలో పడ్డారు. ఆ నేత ఎవరో? ఆయన మీద రివెంజ్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. అబ్బో ఘన చరిత్ర ప్రత్తిపాటి పుల్లారావు ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తికాలం మంత్రిగా పనిచేశారు. టీడీపీలో కీలక నేతగా ఉండటంతో మంత్రిగా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్తిపాటి పుల్లారావు తన సంపదలను అడ్డగోలుగా పెంచేసుకున్నారు. మైనింగ్, లిక్కర్, రేషన్ మాఫియాకు రింగ్ మాస్టర్‌గా వ్యవహరించారు. ఇక ఆయన భార్య వెంకాయమ్మ అయితే సెటిల్మెంట్ల వ్యవహారంలో ఆరితేరిపోయారు. జిల్లాలో ఏ అధికారికి పోస్టింగ్ ఇవ్వాలన్నా, ట్రాన్స్ ఫర్ కావాలన్నా రేట్లు నిర్ణయించి వసూలు చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పుల్లారావు భార్య వెంకాయమ్మ చెబితే ఏ అధికారి అయినా మాట వినాల్సిందే. ఎదురు చెబితే ఏమవుతుందో అధికారులకు బాగా తెలుసు. ఇలా ఐదేళ్లపాటు భార్యా భర్తలు జిల్లా మొత్తం ఊడ్చేశారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహనరెడ్డి దెబ్బకు పుల్లారావు అడ్రస్ గల్లంతయ్యింది. దీంతో వెంటనే హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. అప్పటినుంచి టీడీపీ అనే పార్టీ ఉందనే విషయాన్నే పూర్తిగా మర్చిపోయాడు. అసలు చిలకలూరిపేట వైపు చూడడమే మానేశారు ప్రత్తిపాటి పుల్లారావు. ఆయన రూటే సెపరేటు పుల్లారావు తీరుతో టీడీపీ కార్యకర్తలు చిలకలూరిపేటకు పార్టీ ఇన్చార్జి ఉన్నారో లేదో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధినేత కార్యక్రమాలకు పిలుపునిచ్చినా పుల్లారావు మాత్రం పేటవైపు కన్నెత్తి చూడడంలేదు. స్థానిక టీడీపీ నేతలు కొంతమంది పుల్లారావు వ్యవహారశైలిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఓడాక పుల్లారావు చిలకలూరిపేటకు రాకుండా హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేశారని ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదంటూ.. ఆధారాలను చంద్రబాబు ముందు పెట్టారు. దీంతో చంద్రబాబు పుల్లారావుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. అయినా పుల్లారావు తీరు మారలేదు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే గుంటూరుకు వచ్చి హాజరవడమే తప్ప చిలకలూరిపేటకు మాత్రం వెళ్లేవాడు కాదాయన. దీంతో పుల్లారావుకు సీటిస్తే తమ తడాఖా చూపిస్తామని చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు తేల్చి చెప్పేశారు. పుల్లారావుకు బదులు మరో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్ద కొత్త డిమాండ్ లేవనెత్తారు. పార్టీని, కార్యకర్తలను పట్టించుకోని పుల్లారావుకు ఎందుకు సీటివ్వాలని ఏకంగా అధినేతకే ప్రశ్నల వర్షం కురిపించారని ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు కూడా నియోజకవర్గం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకున్నారట. అవకాశం ఇస్తే సై పుల్లారావు తీరుతో విసుగు చెందిన స్థానిక నేతలంతా ఇక ఆయనతో కుదరదని నిర్దారించుకుని... మనమే కొత్తనేతను వెతుక్కుందామని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏగా పనిచేసిన పావులూరి శ్రీనివాస్పేరును తెరపైకి తెచ్చారు. పావులూరి కూడా అధినేత అవకాశం ఇస్తే చిలకలూరిపేటనుంచి పోటీ చేసేందుకు సై అన్నాడట. ఈ విషయం తెలుసుకున్న పుల్లారావు పావులూరి కాళ్లు, గడ్డాలు పట్టుకుని బతిమిలాడాడట. ఇక పావులూరితో కూడా ప్రయోజనం లేదని అర్థం చేసుకున్న చిలకలూరిపేట తెలుగుదేశం నాయకులంతా కలిసి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే కొంతమంది నందమూరి సుహాసిని వద్దకు వెళ్లి పేటనుంచి పోటీ చెయ్యాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. సుహాసిని కూడా పోటీ చెయ్యడానికి సుముఖంగానే ఉన్నారని, పైగా బాలకృష్ణ కూడా సపోర్టు చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు చిలకలూరిపేట తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు, లోకేష్ లకు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. తాను అక్కడ లేకపోవడంతో...పేటలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకుని ప్రత్తిపాటి పుల్లారావు తెగ కంగారు పడిపోతున్నారట. చివరికి పుల్లరావును చిలకలూరిపేట తమ్ముళ్ళు ఏంచేస్తారో చూడాలి. -
పైకి మాత్రం నవ్వుల పువ్వులు.. కడపులో కత్తులు పెట్టుకొని మరీ..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య ఆధిపత్యపోరు పరాకాష్టకు చేరింది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకునే పరిస్థితి కొనసాగుతోంది. పైకి మాత్రం అందరూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని బయటకు మాత్రం నవ్వుతూ పలకరించుకుంటున్నారు. జిల్లాలో ప్రధానంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు మధ్య ఇప్పుడు వార్ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాకు మూడుసార్లు ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ అధ్యక్షుడిగా చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు మంత్రి పదవి అప్పగించాక.. పుల్లారావు స్థానంలో పార్టీ అధ్యక్ష పదవిని అధిష్టానం జీవీ ఆంజనేయులకు కట్టబెట్టింది. జీవీ కూడా రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జీవీ వ్యవహరిస్తున్నారు. సొంతింటి నుంచే వెన్నుపోటు ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది ఎంపిక చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక లబ్ది చేకూర్చారు. తద్వారా గుంటూరు జిల్లా మీడియాలో ఆయన మనుషులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా ప్రతినిధులు చేతిలో ఉన్నందువల్లే పుల్లారావుకు ఎవరిమీద అయినా కోపం ఉంటే పథకం ప్రకారం వారిపై నెగిటివ్ కథనాలు రాయించి డామేజ్ చేస్తుంటారని పార్టీలోనే ఆయన ప్రత్యర్థులు చెబుతారు. కొన్నాళ్లుగా మాజీ మంత్రి పుల్లారావు, జీవీ ఆంజనేయులుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో పుల్లారావు తన పలుకుబడిని ఉపయోగించి జీవీపై మీడియాలో నెగిటివ్ కథనాలు రాయిస్తూ.. వీటిని పార్టీ కార్యాలయానికి కూడా పంపుతున్నారు. ఈ నెగిటివ్ కథనాల వెనుక ఎవరున్నారనేది కొన్నాళ్లపాటు జీవీకి అర్దంకాలేదు. తర్వాత అసలు విషయం తెలుసుకుని జీవీకి మైండ్ బ్లాకయ్యిందట. తనకు టికెట్ రాకుండా చెయ్యడానికి పుల్లారావు కుట్ర పన్నారని జీవీ ఆంజనేయులు అందరి వద్ద చెప్పుకుంటున్నారట. అప్పటినుంచి పుల్లారావును జీవీ టార్గెట్ చేశారు. చదవండి: (Pawan-Chandrababu Meet: రెచ్చిపోయిన చంద్రబాబు) రాజకీయం కాదు రియల్ బిజినెస్ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రత్తిపాటి పుల్లారావు పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. అక్కడే రియల్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఏపీలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడంలేదు. వీటన్నింటినీ పరిశీలించిన జీవీ.. పుల్లారావు ఎక్కడెక్కడ, ఏం చేస్తున్నాడో వివరిస్తూ పార్టీ నాయకత్వానికి పెద్ద లిస్ట్ పంపించారట. ఐదేళ్లు మంత్రి పదవిలో ఉండి అడ్డ దిడ్డంగా సంపాదించి కష్టకాలంలో పార్టీని, కార్యకర్తలను గాలికొదిలేశారంటూ ఒక రిపోర్ట్ ను కూడా అధిష్టానానికి పంపారట. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా పుల్లారావుకు పొగపెడుతూనే ఉన్నారు. పుల్లారావు కూడా మీడియాను అడ్డం పెట్టుకుని జీవిపై కథనాలు రాయించడం కొనసాగిస్తూనే ఉన్నారట. జీవీ మార్కు రాజకీయం కొంతకాలంగా పుల్లారావు అప్పుడప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తున్నారంటే అందుకు కారణం జీవీ ఆంజనేయులేనని పార్టీలో ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే పుల్లారావుపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ..ఆయనకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారట. అంతేకాదు చిలకలూరిపేటలో పుల్లారావు వ్యతిరేకులందరినీ కలుపుకుని వారితో జట్టుకడుతున్నారట ఆంజనేయులు. ప్రత్తిపాటి కూడా వినుకొండలో జీవీ వ్యతిరేకవర్గాన్ని కూడగట్టి జీవీకి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇలా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రూ. 20 కోట్ల లంచం అడిగారు.. అడగలేదని ప్రమాణం చేయగలరా?
అమరావతి: గతంలో గౌతమ బుద్ధ టెక్స్టైల్స్ అనుమతికి టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు లంచం అడిగారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. తాను పార్టీ మారడంతో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేసిన విషయాన్ని బ్రహ్మనాయుడు మీడియాకు తెలిపారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన బ్రహ్మనాయుడు.. ‘వాళ్ల ఒత్తిడికి తలొగ్గనందుకే అనుమతులు రద్దు చేశారు. లంచం అడగలేదని ప్రతిపాటి పుల్లారావు ప్రమాణం చేయగలరా?, చంద్రబాబు హెరిటేజ్ డెయిరీ పెట్టిన నాటి నుంచి తొక్కేయాలని చూశారు. హెరిటేజ్‌ను తిరుమల డెయిరీ క్రాస్ చేసింది. 2012లో గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ కు టెండర్ వేశాను. టెండర్ ప్రకారమే డబ్బులు కట్టాను ...రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా. గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ అనుమతికి ప్రత్తిపాటి పుల్లారావు నన్ను 20 కోట్లు లంచం అడిగారు. ఆ 20 కోట్లు చంద్రబాబు నుంచి లోకేష్ దాకా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు నన్ను రాజకీయ నాయకుడిగా కాకుండా పారిశ్రామికవేత్తగా చూస్తారనుకున్నా . కానీ ప్రత్తిపాటి పుల్లారావు అలా చేయలేదు. నన్ను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. నేను కష్టాన్ని నమ్ముకునే వ్యక్తిని... అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నన్ను దెబ్బకొట్టాలన్నదే చంద్రబాబు ఉద్ధేశం’ అని తెలిపారు. -
అధికారిణిపై దాడి.. టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుపై కేసు..
సాక్షి, పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై కేసు నమోదైంది. మున్సిపల్ అధికారిణిపై దాడి చేసిన కేసులో పత్తిపాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతుల్లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువు వద్ద బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ప్లాంట్ పునఃప్రారంభం పేరుతో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళా అధికారిపై దాడికి తెగబడ్డారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత మంచినీటి చెరువు కట్టపక్కన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరుతో వాటర్ ప్లాంట్‌ను నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ ప్లాంట్ మనుగడలో లేదు. కానీ, దీనిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం మీడియాలో ప్రచారం చేశారు. దీనికితోడు.. పురపాలక సంఘానికి చెందిన స్థలంలో గుట్టుగా రెండు బోర్లు వేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు బోర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి తదుపరి చర్యలు నిర్వహించరాదని గురువారం నోటీసులు జారీచేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, పత్తిపాటి తన అనుచరులు సుమారు 200మందితో ప్లాంటు వద్దకు చేరుకుని నానా రభస సృష్టించారు. ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన పత్తిపాటి పుల్లారావుకు మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) కోడిరెక్క సునీత, రెవెన్యూ అధికారి ఫణికుమార్, ఇతర అధికారులు బోర్లు, ప్లాంట్ నిర్వహణకు అనుమతుల్లేవని స్పష్టంచేశారు. అర్బన్ సీఐ జి. రాజేశ్వరరావు, పట్టణ ఎస్ఐలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. టీడీపీ నాయకులు మునిసిపల్ అధికారులను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగి రభస సృష్టించారు. అంతేకాక.. మహిళ అని కూడా చూడకుండా సునీతను తోసేసి, ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు భుజం, వీపు ప్రాంతంలో గట్టి దెబ్బలు తగిలాయి. -
స్వాతి మిల్లులో ప్రమాదం.. అనుమానాలు
నాదెండ్ల: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన స్వాతి కాటన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం 16వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకుని కాటన్, స్పిన్నింగ్, టెక్స్టైల్స్, అయిల్ మిల్స్ తదితర వ్యాపారాలకు సంబంధించిన కంపెనీలున్నాయి. కంపెనీ డైరెక్టర్ బి.అంకమ్మరావు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారు జామున డీలింట్ కాటన్ (జిన్నింగ్ చేయగా పత్తివిత్తనాలపై మిగిలిన దూది నూగు) బేల్స్‌ఉన్న గోడోన్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో సంస్థ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. మంటలు భారీగా చెలరేగడంతో అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేసేందుకు నరసరావుపేట, చీరాల, గుంటూరు–1 నుంచి అగ్నిమాపక వాహనాలు తెప్పించారు. ఉదయం 10 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాద స్థలానికి గుంటూరు డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. దీనిపై కంపెనీ డైరెక్టర్ అంకమ్మ రావు మాట్లాడుతూ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులకు వివరించారు. రూ. 40లక్షలు నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. స్వాతి కాటన్ మిల్స్‌ను అగ్ని మాపక శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి సందర్శించారు. జరిగిన సంఘటన తీరుపై విచారిస్తున్నామని, నష్టాన్ని అంచానా వేస్తున్నామని వివరించారు. -
మాజీ మంత్రి పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం..
సాక్షి, గుంటూరు: పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. నాదెండ్ల మండలం గణపవరంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గౌడౌన్లో నిల్వ ఉంచిన ప్రత్తి దగ్ధం అయ్యింది. రూ.40 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. విద్యుత్ షార్ట్ సర్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలిపారు. ఫైర్ సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. -
ప్రత్తిపాటి కుమారుడు కంపెనీలో ఐటీ సోదాలు
-
ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ గెస్ట్ హౌస్
సాక్షి, గుంటూరు: కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి గుంటూరులో నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయం అక్రమం.. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమం.. చిలకలూరిపేట పట్టణంలో నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయం అక్రమం.. ఆఖరికి ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట పట్టణంలో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమే.. దీని కోసం పోరంబోకు స్థలాన్ని ఆక్రమించేశారు. వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేట పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ వెనుక సర్వే నంబర్ 89 బ్లాక్ నంబర్ ఐదులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు 345 చదరపు గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో గత సంవత్సరంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణం ప్రారంభించారు. మూడు అంతస్తుల గెస్ట్ హౌస్ భవన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఇంటీరియల్ వర్క్ జరుగుతోంది. కానీ ఈ భవన నిర్మాణం మాత్రం అక్రమం. కనీసం గెస్ట్ హౌస్ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు కోరుతూ దరఖాస్తు కూడా చేసుకోలేదు. అధికార బలంతో ఆక్రమ నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ అధికారులు సైతం మంత్రికి ఎదురు చెప్పలేక చూసీచూడనట్టు వదిలేశారు. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి.. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఎస్పీ కెనాల్స్‌లో టీడీపీ కార్యాలయం అక్రమ నిర్మాణంపై శనివారం(10వ తేదీ) సాక్షి దినపత్రికలో ‘కబ్జా స్థలంలో టీడీపీ దర్జా’ అనే శీర్షికతో క£థనం ప్రచురితమైంది. ఈ కథనానికి కదిలిన పేట మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మరో వైపు గెస్ట్ హౌస్ నిర్మాణం గురించి తెలియడంతో దీనికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మాజీ మంత్రి నిర్మించిన అక్రమ కట్టడాన్ని గుట్టుచప్పుడు కాకుండా బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించాలని ప్రయత్నాలు సాగాయి. ఇప్పటి వరకూ మున్సిపల్ అధికారులు ఈ భవనానికి పన్ను వేయకపోవడంతో బీపీఎస్‌కు దరఖాస్తుకు అడ్డంకి పడింది. సర్వే నంబర్ 89 బ్లాక్ ఐదులో ప్రత్తిపాటికి 345 చదరపు గజాల స్థలం ఉంది. గెస్ట్ హౌస్ నిర్మాణం 479 చదరపు గజాల్లో చేపట్టారు. తన స్థలానికి అనుకుని ఉన్న పోరంబోకు స్థలాన్ని ప్రత్తిపాటి కబ్జా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న ప్రాంతంలో గజం స్థలం రూ.25 వేలకుపైగా మాటే. ఈ లెక్కన మంత్రి తన గెస్ట్ హౌస్ నిర్మాణంలో కలుపుకున్న 134 చదరపు గజాల స్థలం విలువ రూ.30 లక్షలకుపైనే ఉంటుందని తెలుస్తోంది. నోటీసులు ఇచ్చేందుకు వెనుకడుగు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణానికి నోటీసులిచ్చేందుకు చిలకలూరిపేట మున్సిపాలిటీలోని ఓ టీపీవో వెనకడుగు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించడం కోసం టీడీపీకి చెందిన ఓ ఇంజినీర్, సదరు టీపీవో రూ.లక్షల్లో వసూలు చేసినట్టు సమాచారం. దీంతో కమిషనర్ మాజీ మంత్రికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించినా టీపీవో కార్యాలయానికి రాకుండా కాకమ్మ కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. నోటీసు తయారు చేసినప్పటికీ కనీసం సంతకం చేసేందుకు కూడా టీపీవో అందుబాటులో లేరు. పైపెచ్చు అక్రమ కట్టడంపై చర్చలు తీసుకునేందుకు ముందుకు వస్తున్న మిగిలిన సిబ్బందిని సైతం టీపీవో, ఇంజినీర్ ఇబంది పెడుతున్నారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాం ఐదేళ్లుగా నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టులో సాగు నీరు అందలేదు. నేను మాగాణి వదిలేసి మెట్ట పంటలు సాగ చేశాను. కేవలం వర్షాధారం పంటలపై ఆధారపడటంతో ఆర్థికంగా నష్టాల పాలయ్యాను. ప్రస్తుతం సాగర్‌కు భారీగా వరద నీరొస్తోంది. దీంతో మళ్లీ పొలాలకు జల కళ రానుంది. - డీ శ్రీనివాసరెడ్డి, వి.రెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం సాగు నీటి కష్టాలకు చెక్ సాగర్ కాలువలకు నీరులేక మాగాణి భూముల్లో మెట్ట పంటలు పండక నష్టాల పాలయ్యా. వ్యవసాయంపై ఆధారపడి పని చేసే కూలీలు సైతం పనుల్లేక వలసలు వెళ్లారు. సాగర్‌కు నీరొస్తే రెండు పంటలు పండుతాయి. ప్రతి సీజన్లో కూలీలకు ముమ్మరంగా పని దొరుకుతుంది. ప్రస్తుతం అందరి ఆశలు చిగురిస్తున్నాయి. -విప్పర్ల బుడే, సంతగుడిపాడు, రొంపిచర్ల మండలం -
టోల్గేట్ వద్ద మంత్రి భార్య హల్చల్
సాక్షి, మాడ్డులపల్లి : ‘నేను మంత్రి భార్యను. నా కారుకే టోల్ ఫీజు అడుగుతారా’అంటూ ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య హల్చల్ చేశారు. అద్దంకి –నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య, కుటుంబ సభ్యులు శుక్రవారం సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. మంత్రి భార్య తన కారులో హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్నారు. మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లించాలని సిబ్బంది ఆమె కారును ఆపారు. దాంతో ఆమె ‘నేను మంత్రి భార్యను. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది’అని చెప్పారు. కానీ స్టిక్కర్ అనుమతి కాలపరిమితి దాటిందని, టోల్ రుసుము చెల్లించకుంటే కారు వేళ్లేది లేదని టోల్‌ప్లాజా సిబ్బంది తేల్చి చేప్పారు. స్టిక్కర్ గడువు ముగియడం, కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో టోల్‌ప్లాజా సిబ్బంది ఆర్అండ్బీ రూల్స్ ప్రకారం టోల్ రుసుము చెల్లించాలని చెప్పారు. మంత్రి భార్య, కుటుంబ సభ్యులు అరగంట సేపు టోల్‌ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏ ఫోన్ చేసి చెప్పినా వారు అనుమతి ఇవ్వకపోవడంతో టోల్ రుసుము చెల్లించి వెళ్లారు. మంత్రి భార్య నిర్వాకంతో టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామైంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మంత్రి ప్రత్తిపాటి భార్య బెదిరింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ వైపు పోలింగ్ జరుగుతుంటే.. మరోవైపు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పలు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై, సానుభూతిపరులపై దాడులకు దిగుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు. టీడీపీ నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య ఏకంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీకి అనుకులంగా వ్యవహరించాలంటూ పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఆమె హెచ్చరికలు జారీచేశారు. వేలు చూపిస్తూ మరి వార్నింగ్ ఇచ్చారు. ప్రత్తిపాటి భార్య తీరుపై పోలింగ్ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ► విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. ఏజెంట్‌పై కొట్టడమే కాకుండా.. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు. ► చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సొరకాయలపాలెంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. -
రాజధాని పేరుతో లక్షకోట్లు కొట్టేసిన బాబు & కో
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తానని నమ్మించారు.. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో ముందే నిర్ణయించుకున్నారు.. కాని అదిగో అక్కడ రాజధాని.. ఇదిగో ఇక్కడ రాజధాని అంటూ ప్రజలను ఏమార్చారు.. తన బినామీలు, అస్మదీయులు, తన పార్టీ నాయకులకుమాత్రం వాస్తవ ప్రాంతం లీక్ చేశారు.. అంతే.. అప్పటివరకు ఆకలితో ఆవురావురంటున్న క్రూర గద్దకు కోడిపిల్ల కంటబడినట్లు.. పచ్చ దండు కళ్లు... అమాయక రైతుల పచ్చటి పొలాలపై పడ్డాయి. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు... తన బినామీలు, తన సామాజిక వర్గం, తన కోటరీ కలిసి.. అత్తెసరు ధరలకే వేలకు వేల ఎకరాల భూములు కొనేశారు.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని... జేబులోంచి పైసా తీయకుండానే... ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి.. అధికారిక రహస్యాల ప్రమాణాన్ని(ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి... పేద రైతులకు చెందిన లక్షల కోట్లరూపాయల భూములను చెరబట్టారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతకుమించిన బరితెగింపు,నయవంచనకు నిదర్శనం మరొకటి లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు! ఇంటర్నేషనల్ రాజధానిని నిర్మిస్తానని నమ్మబలికి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రూ.లక్ష కోట్లకుపైగా చంద్రబాబు అండ్ కోకాజేసిన ఇంటర్నేషనల్ భూ స్కామ్ ఇదీ!! అదెలాగంటారా...! ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. రాజధానిని నూజివీడు సమీపంలో ఏర్పాటుచేస్తున్నట్లుఒకసారి.. బాపులపాడు, వీరులపాడు పరిసర ప్రాంతాల్లో తేనున్నట్లు మరోసారి.. ముసునూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తామని ఇంకోసారి.. గన్నవరం పరిసర ప్రాంతాల్లో వస్తోందంటూ.. మరోసారి లీకులు ఇచ్చారు. అలా లీకులు ఇవ్వడానికి ముందే ఆయా ప్రాంతాల్లో తక్కువ ధరలకే మంత్రులు, సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, బినామీలు భారీగా భూములు కొనుగోలు చేసి పెట్టుకునేలా చేశారు. రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తోందంటూ.. తన సొంత మీడియాలో లీకులు ఇవ్వడం ద్వారా నూజివీడు, బాపులపాడు, వీరులపాడు, ముసునూరు, గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగేలా చేశారు. ఇక్కడ ధరలు పెరగ్గానే.. తన కోటరీ ఆయా ప్రాంతాల్లో అంతకుముందే కొనుగోలు చేసి పెట్టుకున్న భూములను అగ్రిమెంట్ దశలోనే.. ఎన్ఆర్ఐలు, చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అమాయక మధ్యతరగతి ప్రజలకు అధిక ధరలకు అమ్మేసి వేలాది కోట్ల రూపాయలు దోచేశారు. ఇలా దోచేసిన సొమ్ముతోనే రాజధాని ప్రాంతంలో భారీఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఇదంతా చూస్తే.. మీకు ఏమనిపిస్తుంది..? రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు, మంత్రులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడటం ద్వారా తక్కువ ధరలకే అమాయక రైతుల భూములు కాజేసి.. భారీఎత్తున లబ్ధి పొందారన్నది స్పష్టమవుతోంది కదా...? పచ్చని పొలాలను తన్నుకుపోయిన పచ్చ గద్దలు సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని ఇంద్రుని రాజధాని అమరాతిని తలదన్నే రీతిలో ఆంధ్రులకు అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మిస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.లక్ష కోట్లకు పైగా దోచేసి ఇంటర్నేషనల్ స్కాంకు పాల్పడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కన్నా..సీఈవో(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా చెప్పుకోవడానికే ఇష్టపడే చంద్రబాబు.. రాజధాని పేరుతో అడ్డగోలుగా భూదోపిడీకి తెగబడ్డారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తూ మార్చి1, 2014న ఏపీ పునర్విభజన చట్టంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అపాయింటెడ్ డేను జూన్ 2గా నిర్ణయించారు. మే 16, 2014న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం సాధించగానే... సింగపూర్‌ను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. రాజధానిని గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయా గ్రామాల్లో భూసమీకరణ చేయాలని.. ఆ గ్రామాల సరిహద్దుల్లో భూములు కొనుగోలు చేస్తే భారీగా లబ్ధి పొందవచ్చునని ముందే స్కెచ్ వేసుకున్నారు. ఆ విషయాన్ని తన కోటరీ, తన సామాజిక వర్గం,తన బినామీలు, తన అస్మదీయులు, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంకేతాలు ఇచ్చారు. ప్రజలకు మాత్రం వేరే చోట రాజధాని వస్తోందంటూ మీడియా ద్వారా లీకులు ఇచ్చారు. ఆ తర్వాత జూన్ 8, 2014న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే.. రాజధాని భూ‘మాయ’పైనే దృష్టిసారించారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా.. ‘రాజధాని’ ఏర్పాటుపై ముందే నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. అందుకు సంబంధించి వ్యూహం ప్రకారం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ గందరగోళానికి తెరతీశారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే అంటే జూన్ 9, 2014న కృష్ణా జిల్లా నూజివీడు పరిసర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామని తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారు. జూన్ 12, 2014న విశాఖపట్నంలో తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. రాజధాని ప్రాంతంపై నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఆ విషయం ప్రజలకు వెల్లడించకుండా.. కేవలం చినబాబు, తన కోటరీలోని ప్రధానమైన నేతలకు మాత్రమే లీకులు ఇచ్చారు. ఆ తర్వాత రహస్య అజెండాలో భాగంగా కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, బాపులపాడు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు మంత్రులు ప్రకటించారు. మరికొద్ది రోజులు గడిచాక జూలై 5, 2014న కృష్ణా జిల్లా ముసునూరు పరిసర ప్రాంతాల్లో.. రాజధాని వచ్చే అవకాశముందంటూ.. ఇంకొందరు మంత్రులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే ఆగస్టు 5, 2014న కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాలు రాజధాని ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమంటూ మరికొందరు మంత్రులు చెప్పుకొచ్చారు. చంద్రబాబు అండ్ కో రహస్య అజెండా తెలిసిన కృష్ణా జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి ఈ ప్రాంతాల్లో భారీఎత్తున భూములు కొనుగోలు చేసి.. పది రోజుల్లోనే ఎన్నారైలకు అమ్మేసి రూ.400 కోట్లకుపైగా లబ్ధి పొందారని టీడీపీ ఎంపీ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కొందరు మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇదే రీతిలో బేరం... మారుబేరాలు చేసి కనిష్టంగా రూ.15వేల కోట్లు కొల్లగొట్టారని రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల అంచనా. ఇలా దోచేసిన డబ్బులతోనే మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతాల్లో చంద్రబాబు అండ్ కో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసింది. కానీ.. చంద్రబాబు అండ్ కో అజెండా తెలియని స్థిరాస్తి వ్యాపారులు, ఎన్నారైలు, చిన్న చిన్న వ్యాపారులు నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ముసునూరు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి భారీగా నష్టపోయారు. సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు ఆగస్టు 9, 2014న వేర్వేరు సమావేశాల్లో మాట్లాడుతూ... గుంటూరు–విజయవాడల మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో.. నూజివీడు, గన్నవరం, ముసునూరు ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆ ప్రాంతాల్లో భూములు కొన్న ఎన్నారైలు, చిన్నచిన్న వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. దిక్కుతోచని దుస్థితిలో వందలాది మంది రియల్ వ్యాపారులు నష్టపోయారు. అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. భూ సమీకరణ పెద్ద బూటకం.. మహా నాటకం మట్టిని నమ్ముకుని బ్రతికే రైతులు ముక్కారు పంటలు పండే భూములను రాజధాని భూ సమీకరణకు ఇచ్చేందుకు ససేమిరా అంగీకరించరని గుర్తించిన సీఎం చంద్రబాబు.. రైతులను ఏమార్చేందుకు ముందుగానే పక్కా పథకం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ముందుగానే మంత్రులు, తన సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా.. ఆయా గ్రామాల్లో పలు చోట్ల భూములు కొనుగోలు చేయించి.. ఆ భూములను సమీకరణ కింద ప్రభుత్వానికి అప్పగించేలా చక్రం తిప్పారు. ఇలా 29 గ్రామాల్లో కొనుగోలు చేసిన భూములను సమీకరణ కింద తొలుత సర్కార్‌కు అప్పగించేలా చక్రం తిప్పారు. తద్వారా మిగతా రైతులను ప్రభావితం చేసి సమీకరణ కింద భూములు ఇచ్చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణానికి 53,743.49 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వ భూములు 15,010.03 ఎకరాలు కాగా..38,737.46 ఎకరాలు ప్రయివేటు భూమి. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులపై అక్రమ కేసులు బనాయించి.. పొలాలను దగ్ధం చేయించి.. పోలీసులను ఉసిగొల్పి భయోత్పాతం సృష్టించారు. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి 24 వేల మంది రైతులకు చెందిన 32,400 ఎకరాలను భూసమీకరణ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో 29,450 ఎకరాలకు చెందిన 21,300 మంది రైతులు మాత్రమే అగ్రిమెంట్లు చేసుకుని కౌలు చెక్‌లు తీసుకున్నారు. తక్కిన రైతులు కౌలు చెక్‌లు తీసుకోవడానికి ససేమిరా అనడాన్ని బట్టి చూస్తే భూసమీకరణపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సమీకరించిన భూమి పప్పులూబెల్లాల్లా.. రాజధాని కోసం రైతుల ముక్కుపిండి సమీకరణ పేరుతో లాక్కున్న భూములను అత్తెసరు ధరలకే అస్మదీయులకు కట్టబెట్టిన సీఎం చంద్రబాబు.. భారీఎత్తున ప్రయోజనం పొందారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాజధాని గ్రామాల్లో సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఎకరానికి రూ.నాలుగు కోట్లను ప్రాథమిక ధరగా నిర్ణయించింది. కానీ.. ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరలకే భూములు కేటాయించి, భారీఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఇప్పటివరకూ 1592.77ఎకరాల భూమిని ఇలా అస్మదీయులకు కట్టబెట్టేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ బ్యాంకులకు ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున కేటాయిస్తే.. అస్మదీయులకు మాత్రం ఎకరం కనిష్టంగా రూ.40 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల చొప్పున అమ్మేశారు. తన సన్నిహితుల భాగస్వామ్యం ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్శిటికీ ఎకరం రూ.50 లక్షల చొప్పున 200 ఎకరాలు.. అమృత యూనివర్శిటికీ ఎకరం రూ.50 లక్షల చొప్పున 200 ఎకరాలు.. వీఐటీ యూనివర్శిటికీ ఎకరం రూ.50లక్షల చొప్పున 200 ఎకరాలు.. గ్జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిబ్యూట్కైతే ఎకరం రూ.పది లక్షల చొప్పున 50 ఎకరాలను అమ్మేశారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుపాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు పేరుతో బినామీకి చెందిన సాక్‌ట్రానిక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు రాజధానిలో ఎకరం రూ.50 లక్షల చొప్పున 40 ఎకరాల భూమిని కట్టబెట్టేశారు. చంద్రబాబు అండ్ కో భూ సేకరణ.. సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకుని నేలపాడు నుంచి రహస్య అజెండా అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నేలపాడులో భూ సమీకరణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రియల్ వ్యాపారి, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులకు అప్పగించారు. వారు తమ అనుచరులతో నేలపాడులో మకాం వేసి.. తమ కుటుంబ సభ్యుల పేర్లతో భూములు కొనుగోలు చేయడంతోపాటు సన్నిహితులనూ పురమాయించారు. నేలపాడు నుంచి రహస్య అజెండా నిమ్మకాయల చినరాజప్ప తన కుమారుడు నిమ్మకాయల రంగనాధ్ పేరుతో సర్వే నెంబరు 59లో ఎకరం, తన అనుచరుడు జగతా వెంకట గంగాధర్ పేరుతో ఒక ఎకరం.. ఎకరం రూ.మూడు లక్షల చొప్పున జూన్ 10, 2014న కొనుగోలు చేశారు. ఆ భూమిని అక్టోబరు 31న రిజిష్టర్ చేసుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు సన్నిహితుడైన గొరిజాల పెద్దయ్య సర్వే నెంబరు 46లో 5.16 ఎకరాలు, నన్నపనేని శ్రీనివాసప్రసాద్ 1.5ఎకరాలు కొనుగోలు చేశారు. మంత్రులు చినరాజప్ప, పుల్లారావు, ఎమ్మెల్యేలు జీవీఆర్ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర సన్నిహితులు, బంధువులు, రియల్టర్లు సుమారు 221 ఎకరాలకు పైగా భూమిని రాజధాని ప్రకటనకు ముందే కొనుగోలు చేశారు. అయితే ఈ విషయం ప్రజలకు తెలియకుండా దాచిపెట్టి... భూమి సొంతదారులతోనే భూసమీకరణ కింద ప్రభుత్వానికి అప్పగించేలా చక్రం తిప్పారు. నిజంగా రైతులే భూములు సమీకరణకు ఇస్తున్నారని భావించిన మిగతా రైతులు కూడా తమ భూములను భూసమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చేశారు. అలా భూసమీకరణ కింద ప్రభుత్వానికి భూములు అప్పగించిన తొలి గ్రామంగా నేలపాడు రికార్డుల్లోకి ఎక్కింది. ఇది మిగతా రాజధాని గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపింది. తుళ్లూరులో చినబాబు ప్రధాన రాజధాని(కోర్ కేపిటల్)కి కూతవేటు దూరంలో ఉండే తుళ్లూరులో భూముల కొనుగోళ్లలో నారా లోకేష్ తన బినామీ వేమూరు రవికుమార్ ప్రసాద్‌ను బరిలోకి దించారు. సెవెన్ హిల్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున సర్వే నెంబరు 261లో ఎకరం, 263లో 1.98 మొత్తం 2.98 ఎకరాలను కొనుగోలు చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సర్వే నెంబరు 256–ఏలో 1.41 ఎకరాలు, ఆయన భార్య గోరంట్ల ఝాన్సీ లక్ష్మి పేరుతో సర్వే నెంబరు 256–బీ1ఏలో 0.54, 256–ఏలో 1.00 మొత్తం 1.54 ఎకరాలను కొన్నారు. మందడంలో నారాయణ తంత్రం రాజధాని గ్రామాల్లో ప్రధానమైన మందడంలో భూముల కొనుగోళ్ల బాధ్యతలను చినబాబుతోపాటూ మంత్రి నారాయణకు చంద్రబాబు అప్పగించారు. నాలెడ్జ్ హబ్‌గా మందడంను చేస్తారన్న సమాచారంతో నారాయణ ముందుచూపుతో వ్యవహరించారు. మంత్రి నారాయణ తన సంస్థల్లో ఉద్యోగులు, బంధువుల పేర్లతో మందడంలో 40 ఎకరాలపైగా కొనుగోలు చేశారు. ఆవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొత్తూరు ప్రమీల తదితరుల పేర్లతో భూములు కొనుగోలు చేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు కుమార్తె గోనుగుంట్ల లక్ష్మీ సౌజన్య పేరుతో సర్వే నెంబరు 106–1లో 1.37, 10602లో 0.85 మొత్తం 2.22 ఎకరాలు, ఆయన సమీప బంధువు గోనుగుంట్ల వెంకట రామాంజనేయులు సర్వే నెంబరు 440–బీలో ఎకరా, 440–ఈలో ఎకరా మొత్తం రెండెకరాలను కొనుగోలు చేశారు. మందడంలో చంద్రబాబు అండ్ కో 129 ఎకరాలపైగా భూమిని కొనుగోలు చేసి.. సంబంధిత రైతులతోనే ల్యాండ్ పూలింగ్ కింద ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించేలా చక్రం తిప్పింది. కొండమరాజుపాలెంలోనూ అదే వ్యూహం ధరలు తక్కువగా ఉన్న కొండమరాజుపాలెంలో భూములు కొనుగోలు చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు జీవీఆర్ ఆంజనేయులు, ధూలిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణ తీసుకున్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు కుమార్తె గోనుగుంట్ల లక్ష్మీ సౌజన్య పేరుతో సర్వే నెంబరు 29–బీ1లో ఎకరం, 51–బీలో 1.04 ఎకరాలు మొత్తం 2.04 ఎకరాలు కొన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తన సోదరుడి కుమార్తె పయ్యావుల హారిక పేరుతో 51–బీలో 1.18 ఎకరాలు, ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర తన కుమార్తె వీరవైష్ణవి పేరుతో సర్వే నెంబరు 58–ఏలో 1.21ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తమ్మీద కొండమరాజుపాలెంలో చంద్రబాబు అండ్ కో సుమారు 174 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసి... ఆ రైతులతోనే ల్యాండ్ పూలింగ్ కింద వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. వెలగపూడిలోనూ పాగా ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం నిర్మిస్తోన్న వెలగపూడిలోనూ చంద్రబాబూ అండ్ కో భూదందా కొనసాగించింది. నారా లోకేష్ బినామీ వేమూరు రవికుమార్ ప్రసాద్ సర్వే నెంబరు 226–జీలో 1.64 ఎకరాలను కొనుగోలు చేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు కుమార్తె గోనుగుంట్ల లక్ష్మీ సౌజన్య పేరుతో సర్వే నెంబరు 103–1లో 1.32, 3–2బీలో 1.51, 214–బిలో 1.33, 51–బి1లో 0.55 మొత్తం 4.71 ఎకరాలు కొనుగోలు చేశారు.మంత్రి నారాయణతో సాన్నిహిత్యం ఉన్న గాయత్రీ రియల్టర్స్ తరఫున తల్లం మణికంఠ అనంతసాయి సర్వే నెంబరు 267–2ఏలో 2.20 ఎకరాలను కొన్నారు. అనంతవరంలోనూ బినామీల దూకుడు.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బినామీ గుమ్మడి సురేష్ అనంతవరంలో సర్వే నెంబరు 238–బీ1లో 1.08 ఎకరాల భూమిని ఎకరం రూ.రెండు లక్షల చొప్పున రాజధాని ప్రకటనకు ముందే కొనుగోలు చేసి.. నవంబర్ 19, 2014న రిజిష్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆ భూమిని ముదునూరి వెంకట శివ రామ సోమ వరప్రసాద రాజుకు ఎకరం రూ.కోటికిపైగా విక్రయించి.. డిసెంబర్ 7, 2015న రిజిష్టర్ చేయించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమీప బంధువు దేవినేని శోభారాణి అనంతవరంలో సర్వే నెంబరు 183–6లో 1.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసి డిసెంబర్ 28, 2015న రిజిష్టర్ చేయించుకున్నారు. లింగాయపాలెంలో పచ్చ గద్దల వీరంగం ప్రధాన రాజధాని కేంద్రమై(కోర్ కేపిటల్)న లింగాయపాలెంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు తన తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో సర్వే నెంబరు 149లో 1.25 ఎకరాలను జూన్ 29, 2014న కొనుగోలు చేసి.. నవంబర్ 27, 2014న రిజిష్టర్ చేయించుకున్నారు. నారా లోకేష్ బినామీ వేమూరు రవికుమార్ ప్రసాద్ సమీప బంధువు వేమూరు గోవర్ధన నాయుడు తన కుమార్తెలు నవరత్న, స్వప్నల పేర్లతో లింగాయపాలెంలో సర్వే నెంబర్లు 33/1బీ, 33/2బీ, 34/2, 34/1బీలో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. డిసెంబర్, 2015న రిజిష్టర్ చేయించుకున్నారు. -
మంత్రి సమక్షంలో ప్రత్యక్షమైన కీలక సాక్షి
చిలకలూరిపేట/యడ్లపాడు: రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న అతడి పాలేరు తాతనబోయిన పున్నారావు బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. రైతు కోటేశ్వరరావును పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన 18వ తేదీన కోటయ్యతోపాటు పున్నారావు కూడా పొలానికి తోడుగా వెళ్లాడు. కోటయ్య మరణించిన తర్వాత పున్నారావు కనిపించకుండా పోయాడు. పోలీసులు లేదా టీడీపీ నాయకులే అతడిని నిర్బంధించి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ పున్నారావు మంత్రి పుల్లారావు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన స్థలం కోటయ్యదని నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి అన్నారు. హెలీప్యాడ్‌కు సమీపంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన భూమి కోటయ్య కౌలుకు సాగు చేస్తున్న విషయాన్ని దాటవేసి ఏమార్చే ప్రయత్నం చేశారు. అవాస్తవాలు చెప్పించే ప్రయత్నం... మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ నాయకులు పున్నారావును తీసుకొచ్చి మీడియాతో మాట్లాడించారు. రైతు కోటయ్య పురుగు మందు తాగి మృతి చెందాడని అతడితో చెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, పున్నారావు సమాధానాలు చెప్పలేక తడబడ్డాడు. పోలీసులు తనను అదుపులోకి తీసుకుని వాహనంలో ఎక్కించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. పోలీసులు నీ ఫోన్ తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. పున్నారావుకు సెల్‌ఫోన్ లేదని మంత్రి అనుచరులు చెప్పడంతో అవును నాకు ఫోన్ లేదని వంతపాడాడు. మరి కోటేశ్వరరావు మృతి చెందిన రోజు అతడి కుమారుడు వీరాంజనేయులుకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చానన్నావుగా అని విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఫోన్ ఉందని చెప్పాడు. అసలు ఆరోజు ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నిస్తుండగానే టీడీపీ నాయకులు పున్నారావును బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
మంత్రి ప్రత్తిపాటి భార్యకు భూ నజరానా
సాక్షి, అమరావతి: పరిశ్రమల పేరుతో అస్మదీయులకు రాష్ట్ర ప్రభుత్వం విలువైన భూములను కారుచౌకగా కేటాయిస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన కంపెనీకి దాదాపు 7 ఎకరాల భూమి కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి భార్య వెంకాయమ్మ డైరెక్టర్‌గా ఉన్న గుంటూరు టక్స్‌టైల్ పార్క్ లిమిటెడ్‌కు గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం గోపాలవారిపాలెంలో 6.96 ఎకరాలను కేటాయించింది. ఎకరం కేవలం రూ.5 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య పలుకుతోంది. అంటే రూ.3.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.35 లక్షలకే కట్టబెట్టేశారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఇలా కావాల్సిన వారికి అత్యంత తక్కువ ధరకే కేటాయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ నేతల హెచ్చరికతో ఖంగుతిన్న మంత్రులు
సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న విబేధాలపై చర్చలు జరిపిన మంత్రులకు గట్టిషాక్ తగిలింది. తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు గతకొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విబేధాలపై దృష్టి పెట్టిన టీడీపీ అధిష్టానం.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను మంత్రులు ప్రతిపాటి పుల్లరావు, నక్కా ఆనంద్‌బాబులకు అప్పగించింది. అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో చర్చలు జరిపిన మంత్రులు.. వారి హెచ్చరికతో ఖంగుతిన్నారు. సమస్యల ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రులు కోరగా.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు తీవ్రంగా స్పందించారు. శ్రావణ్‌కుమార్‌కు ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వద్దన్నదే తమ ఏకైక డిమాండ్ అని వారు మంత్రులకు తెల్చిచెప్పారు. గత ఎన్నికల్లో తామే చందాలు వేసుకుని శ్రావణ్‌కుమార్‌ను గెలిపించామని గుర్తుచేశారు. ఈ సారి మళ్లీ శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇస్తే మాత్రం తామే దగ్గరుండి ఓడిస్తామని హెచ్చరించారు. దీంతో ఈ విబేధాలను పరిష్కరించడం మంత్రులకు తలనొప్పిగా మారినట్టు సమాచారం. -
మంత్రి ప్రత్తిపాటి నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా
-
సీఎం పోలవరం పర్యటనలో అపశ్రుతి
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం గ్యాలరీని ప్రారంభించారు. కాగా ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు టీడీపీ నేతలకు స్పల్ప గాయాలయ్యాయి. -
‘లోకేశ్ అడిగితే నా సీటిచ్చేస్తా’
సాక్షి, చిలకలూరిపేట టౌన్: మంత్రి నారా లోకేశ్ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వటానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఆయనకు సీటు సమర్పించుకోవటం తమ అదృష్టంగా భావిస్తామన్నారు. ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని, ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు. బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు నిర్వహించటానికి ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు. -
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చుక్కెదురు
సాక్షి, విజయవాడ : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకునేందుకు పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం సాయంత్రం లబ్బీపేటలోని 237 వ నెంబరు చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఒక మహిళను బియ్యం, కందిపప్పు, పంచదార ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించగా.. ఆమె పెదవి విరిచింది. పంచదార సన్నగా ఉంటోందని, కందిపప్పులో పురుగులున్నాయని మంత్రి దృష్టికి తెచ్చింది. రేషన్ దుకాణంలోని కందిపప్పు, పంచదారను తెప్పించి పరిశీలించారు. పంచదార పరిమాణం తక్కువగా ఉండటంతో ఆయన నీళ్లు నమిలాడు. వెంటనే ఆ పంచదారను ల్యాబ్‌కు పంపాలని అధికారుల్ని ఆదేశించారు. కందిపప్పు పరిశీలించిన అనంతరం తూకంలో తేడా వస్తోందని తెలుసుకున్నారు. కొన్ని చోట్ల డీలర్లు పంపిణీ చేసే కందిపప్పులో తూకంలో కొద్దిగా తేడా వస్తుందని పేర్కొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి డీలరుకు కందిపప్పు సంచితో కలుపుకుని 50 కేజీలు 600 గ్రాములు రావాల్సి ఉండగా కొన్ని చోట్ల 49,600 మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ తేడాను సరిచేసి పంపిణీ చేస్తామన్నారు. మంత్రితో పాటు డీఎస్ఓ జి. నాగేశ్వరరావు, ఎఎస్‌ఓ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ నాయకులకు పార్టీ ఏం చేస్తోంది?
వినుకొండ రూరల్: సీనియర్ నాయకులకు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోంది అంటూ మంత్రి ప్రత్తిపాటిని ఓ కార్యకర్త నిలదీసిన ఘటన వినుకొండ నియోజకవర్గ మినీ మహానాడులో ఆదివారం చోటుచేసుకుంది. వినుకొండలోని గంగినేని కల్యాణ మండపంలో ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు జరిగింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే పట్టణంలోని ఓ సెలూన్లో పనిచేస్తున్న టీడీపీ కార్యకర్త పోతురాజు పుల్లారావు వద్దకు వచ్చి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులకు పార్టీ ఏమి చేసిందంటూ నిలదీశారు. ఇంతలో మంత్రి కలుగజేసుకొని ‘ఇంతమందిలో నీవు ఒక్కడివే హీరో కాదు’ అంటూ సమాధానం ఇచ్చారు. ఆయన మాటలకు పోతురాజు బదులిస్తుండగా పోలీసులు, టీడీపీ కార్యకర్తలు అతడిని బయటకు పంపించేశారు. నూజెండ్ల మండలానికి చెందిన సీనియర్ నాయకుడికి పార్టీలో పదవులు దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నట్లు మినీమహానాడులో విమర్శలు వినిపించాయి. -
ఏపీ మంత్రులకు షాకిచ్చిన మహిళ
-
ఏపీ మంత్రులకు షాకిచ్చిన మహిళ
సాక్షి, ఏలూరు : ఏపీ మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావులకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ సభలో భాగంగా ఓ మహిళ ఇద్దరు మంత్రులకు షాకిచ్చారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి జవహార్ విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేస్తుండగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ ధైర్యంగా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదంటూ సభలో నిలదీశారు. దీంతో అవాక్కవ్వడం వేదిక మీదున్న మంత్రుల వంతయింది. వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఆ మహిళ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ, వైఎస్ జగన్ గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ పరుడు, ఆయన గురించి తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ మంత్రులను సభలోనే కడిగిపారేశారు. వైఎస్ జగన్ ఎలాంటి తప్పు చేయలేదని, జై జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే బుజ్జి సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. -
ఆయన రాష్ట్ర మంత్రి.. భార్య స్థానిక మంత్రి!
సాక్షి, గుంటూరు: ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని, అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే హత్యలకు సైతం వెనుకాడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలుకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగసభలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. మంత్రి పుల్లారావు అక్రమాలను ఎండగట్టారు. పుల్లారావు హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని, తనను ప్రశ్నించిన వారిని హత్య చేయించేందుకు వెనుకాడటం లేదన్నారు. మంత్రి అవినీతి, అక్రమాలపై వార్తలు రాస్తే శంకర్ అనే విలేకరిని హత్యచేయించారని ఆరోపించారు. మరో విలేకరి సురేంద్రపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారని చెప్పారు. పుల్లారావు భార్య స్థానికంగా మంత్రిగా చెలామణి అవుతున్నారని తెలిపారు. చిలుకలూరిపేటలో మంత్రి పుల్లారావు అరాచకాలకు అంతే లేదన్నారు. పుల్లారావుతో పాటు ఆయన భార్య కూడా తానేం మంత్రి హోదాకు తక్కువ కాదన్నట్లుగా వ్యవహరించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. చివరకు ఇక్కడ టపాసులు అమ్మాలన్నా పుల్లారావుకు కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మంత్రి పుల్లారావుకు రోజులు దగ్గర పడ్డాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్థానికల ప్రజలనుద్దేశించి వైఎస్ఆర్ సీపీ నేత మర్రి రాజశేఖర్ ప్రసంగించారు. -
మైనింగ్ సూత్రధారి మంత్రి సోదరుడే ?
సాక్షి, గుంటూరు: గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం వద్ద మట్టి దోపిడీకి నారాయణస్వామి అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నారాయణస్వామి ఎవరు? అనే దానిపై ఆరా తీస్తే ఆయన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు వరుసకు సోదరుడవుతాడంటూ సొంత పార్టీ నేతలే చెవులు కొరక్కుంటున్నారు. మంత్రి కనుసన్నల్లోనే తన బంధువులు, జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు రెండు రోజులుగా టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదంతా కనుసన్నల్లోనే.. అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం మంత్రికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రావెల చేసిన వ్యాఖ్యలతో ఇదంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతుందనే అనుమానాలకు బలం చేకూర్చింది. రావెల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ప్రత్తిపాటి తన పేరు చెప్పుకుని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారుల్లో చలనం ఏదీ? మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పుకొని నారాయణ స్వామి అనే వ్యక్తి మరికొందరితో కలిసి అటవీ భూములు, పోరంబోకు భూములు అనే తేడా లేకుండా మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అధికార టీడీపీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్ వద్దకు వెళ్లి రెండు పొక్లెయిన్లు, రెండు లారీలను అధికారులకు పట్టించినప్పటికీ వారిలో చలనం లేకపోవడం చూస్తుంటే అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిడి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మట్టి దోపిడీకి పాల్పడుతున్న నారాయణస్వామి మంత్రి పుల్లారావుకు వరుసకు సోదరుడు అవుతాడనే దానిపై ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చ నడుస్తుంది. సొంత బంధువుతోపాటు, తన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నప్పటికీ తనకేమీ తెలియదని మంత్రి పుల్లారావు బుకాయిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మంత్రి అండతోనే మట్టి దోపిడీ అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే అడ్డు పడుతున్నా లెక్కచేయకుండా మట్టి దోపిడీ చేస్తున్నారంటే మంత్రి అండలేనిదే ఈ స్థాయిలో రెచ్చిపోతారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎవరూ దీని జోలికి వెళ్లకపోవడం చూస్తుంటే రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనని అర్ధమవుతుంది. నిజంగా మంత్రికి అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేకపోతే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నట్లు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న నారాయణస్వామితోపాటు, మరికొందరు టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిపోయి మాటలకే పరిమితం అవడం అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ సొంతపార్టీ నేతలనే ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రావెల డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. -
అవినీతిపై విచారణకు సిద్ధమా ?
చిలకలూరిపేట టౌన్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి దమ్ముంటే సీబీసీఐడీ విచారణకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ సవాలు విసిరారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీసీఐ కుంభకోణం, యడవల్లి దళిత భూముల అన్యాక్రాంతం, ఇద్దరు విలేకరుల హత్య, ఆత్యహత్యా ఉదంతాలు, నీరు–చెట్టు పథకంలో భాగంగా దళిత భూముల ఆక్రమణ, చెరువుల మట్టి అమ్ముకోవటం, యడ్లపాడులో అక్రమ గ్రావెల్ తవ్వకం, అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లు, మద్యం వ్యాపారులు, బాణాసంచ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున బలవంతపు వసూళ్లు, సిటీ కేబుల్ ఆపరేటర్ల ఆస్తుల స్వాధీనం, సీఆర్ క్లబ్లో పేకాట వ్యవహారం, స్వర్ణాంధ్ర పౌండేషన్‌కు నిధుల మళ్లింపు వంటి వాటిపై సీబీసీఐడీ, లేదా సీబీఐ విచారణకు పుల్లారావు సిద్ధమా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం, అడ్డువచ్చిన వారిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పుల్లారావు సతీమణి రాజ్యాంగేతర శక్తిగా మారారన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, మైత్రి సంఘాలు, బంగారపు దుకాణాల నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసుళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
బెడిసికొడుతున్న బీజేపీ, టీడీపీ సంబంధాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మిత్రపక్షం బీజేపీతో పొత్తుకు నమస్కారం అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడంతో జిల్లాలో తాడేపల్లిగూడెం రాజకీయం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలోనిర్వహించిన జిల్లా సమీక్షా మండలి సమావేశానికి బీజేపీ నుంచి గెలిచిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తాను వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు అయింది. తాడేపల్లిగూడెం కేంద్రంగా తెలుగుదేశం, బీజేపీల మధ్య మూడున్నర సంవత్సరాలుగా జరుగుతున్న వివాదాలు అటు సీఎం చంద్రబాబునాయుడికి కూడా తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటు ఆశించి (పొత్తు కారణంగా బీజేపీ ఇచ్చారు) అది దక్కకపోవడంతో జెడ్పీ చైర్మన్ అయిన ముళ్లపూడి బాపిరాజు ప్రతిక్షణం తాడేపల్లిగూడెం వ్యవహారాల్లో చెయ్యి పెట్టడం, మంత్రికి వ్యతిరేకంగా పనిచేయడంతో విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి వద్ద కూడా అనేక పంచాయితీలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు మంత్రి మాణిక్యాలరావుకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం, దానిపై తెలుగుదేశం నాయకులు స్పందించి సోము వీర్రాజు నాలుక కోస్తామనడం తెలిసిందే. దీంతో మంత్రి మాణిక్యాలరావు పోలీసులపై వత్తిడి తీసుకువచ్చి మున్సిపల్ చైర్మన్‌పై కేసు పెట్టించారు. ఇటీవల జరిగిన జన్మభూమి సభల్లో మంత్రికి సమాచారం ఇవ్వకుండా జెడ్పీ చైర్మన్ పాల్గొనడం మంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, అదే సభకు ఆలస్యంగా వచ్చిన మంత్రి మాణిక్యాలరావు జెడ్పీ చైర్మన్ వ్యాఖ్యలపై స్పందించడంతో ఇరువర్గాలు రోడ్డెక్కాయి. మంత్రిని మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని వ్యాఖ్యానించడం, తనను కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే నిధులు కట్ చేస్తానంటూ మంత్రి రెచ్చిపోవడం తెలిసిందే. జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఈ వివాదం పరిష్కరించమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా జెడ్పీ చైర్మన్ బాపిరాజుతో పుల్లారావు విడిగా భేటీ అయ్యారు. మొదట మంత్రి మాణిక్యాలరావే ఈ వివాదాన్ని మొదలు పెట్టారని, అందువల్ల ఆయనే వెనక్కి తగ్గాలని, తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని బాపిరాజు స్పష్టం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం బలంతో గెలిచిన మంత్రి ఆ విషయాన్ని మర్చిపోయి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని బాపిరాజు ఆరోపించినట్లు సమాచారం. మంత్రి మాణిక్యాలరావు మాత్రం ఉదయం వరకూ తాడేపల్లిగూడెంలోనే ఉన్నా ఉదయమే కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లిపోయారు. చాలా రోజుల తర్వాత జిల్లా అంశాలపై సమీక్షా సమావేశం పెట్టినా మంత్రి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
మంత్రి పీఏనా..మజాకా !
విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు మాతృసంస్థ అయిన విద్యాశాఖకు దశాబ్దాలుగా తీరని అన్యాయం చేస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా మినిస్టర్ కోటరీలో చేరి రాజ్యాంగేతరశక్తిగా కార్యకలాపాలుసాగిస్తున్నాడు. ఏ అర్హత లేకున్నా మంత్రి వ్యక్తిగత సహాయకునిగా కొనసాగుతున్నాడు. బదిలీలు, పదోన్నతుల నుంచి కాంట్రాక్టులు, కార్పొరేషన్ల లోన్ల వరకు ఏదీ కావాలన్నా ఆయన కనుసన్నల్లోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిలకలూరిపేట టౌన్: నిత్యం నిబంధనల గురించి వల్లె వేసే పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓ ఉపాధ్యాయుడు పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోయినా కిమ్మనడం లేదు. విద్యాహక్కు చట్టప్రకారం ఆ శాఖలో పనిచేసేవారిని ప్రజాప్రతినిధులు పీఎలుగా నియమించుకోకూడదనే నిబంధనల్ని తుంగలో తొక్కి మరీ ఎనిమిదేళ్లుగా మంత్రి వ్యక్తిగత సహాయకునిగా కొనసాగించుకుంటున్నారు. నిబంధనలకు నీళ్లు... అడ్డగడ రఘునాథబాబు 1991లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విద్యాశాఖలో నియమితుడయ్యాడు.పదేళ్ల పాటు అక్షర దీప్తిలో పనిచేశాడు. ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు డ్వాక్రా గ్రూపు నిర్వహణాధికారిగా విధులు నిర్వర్తించాడు. కానీ మాతృసంస్థలో చాక్‌పీస్ పట్టి బోర్డుమీద పాఠాలు చెప్పిన దాఖలాలే లేవు.1999లో ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నించాడు. ఒకే సామాజిక వర్గం కావడంతో రఘు ప్రత్యేక సేవల్ని పుల్లారావు గుర్తించి 2009 నుంచి అధికారికంగా తన పీఎగా నియమించుకున్నారు. 20 ఏప్రిల్ 2013లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది జీతం తీసుకుంటున్నాడు. ఈ సమయంలో పుల్లారావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014లో మంత్రి అయ్యాక.. విద్యాశాఖ నిబంధనలు అడ్డుగా మారతాయన్న ముందుచూపుతో వ్యవసాయశాఖకు తన ఉద్యోగాన్ని మార్చుకున్నాడు.స్థానిక పురపాలక ఉన్నత పాఠశాలలో పనిచేయిస్తున్నట్లు తప్పుడు రికార్డులు చూపిస్తూనే మంత్రి పీఎగా కొనసాగుతున్నాడు. అనర్హుడికి మంత్రి అందలం అనర్హుడైన ఉపాధ్యాయుడిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అందలం ఎక్కించారు.మంత్రి పీఎగా కొనసాగేవారు కనీసం గెజిటెడ్ అధికారి అయ్యుండాలనే నిబంధనలకు నీళ్లొదిలారు. ఆశ్రితుడైన రఘుకి చోటు కల్పించారు. దీని వల్ల మరో అధికారికి పీఎగా కొనసాగే ఛాన్స్ చేజారింది.మరోవైపు రఘు స్థానంలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కూడా కరువయ్యాడు. పండరీపురంలోని బీఆర్‌ఐజి పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏటా పదోతరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధిస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరుస్తున్నా..ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయుడు లేక నూరు శాతం జీపీఏ సాధించడంలో వెనుకబడిపోతున్నారు. పోనీ రఘుకు ప్రత్యామ్నాయంగా ఉపాధ్యాయుణ్ణి అయినా నియమిస్తున్నారా అంటే అదీ లేదు. పోస్టు ఖాళీ చూపిస్తే మరొక ఉపాధ్యాయునికి అవకాశం లభిస్తుంది.ఇది విద్యార్థులకు మేలు చేకూ రుస్తుంది. వివాదాలు, ఆరోపణలు ఉపాధ్యాయుడు రఘునాథబాబు..పుల్లారావు పీఎగా నియమితులైనప్పటి నుంచి అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. 2012లో మున్సిపల్ టీచర్ల ప్రమోషన్ల సమయంలో ఉపాధ్యాయుల నుంచి పెద్దఎత్తున డబ్బు వసూలు చేశారు. సీనియార్టీ లిస్ట్ తయారు చేయనివ్వకుండా ఉద్యోగోన్నతులు కల్పించారని అప్పట్లో ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురయ్యారు. వివిధ సామాజికవర్గ కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయాలన్నా ఇతని పెత్తమే పెరిగిందంటూ టీడీపీలోని ఒక వర్గం బహిరంగంగా విమర్శిస్తోంది. తెలిసే తప్పు చేసిన మున్పిపల్ అధికారులు ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్ట్‌ను ఈ నెల 8న విడుదల చేశారు.ఈ మేరకు సంబంధిత ఉత్తర్వుల నకళ్ల మీద సంతకాలు కూడా చేశారు. ప్రజాప్రతినిధుల పీఎలుగా ఉపాధ్యాయులు కొనసాగకూడదని 31 మే 2014లో విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంత తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా సీనియార్టీ లిస్ట్‌లో మున్సిపల్ అధికారులు రఘు పేరు చేర్చడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చర్యలు తీసుకుంటాం రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధుల వద్ద ఉపాధ్యాయులు పీఎలు గా పనిచేయడం లేదు. అలా ఎవరైనా పనిచేస్తున్నట్లు దృష్టికి వస్తే మాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.ప్రజాప్రతినిధుల వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేసే ఉపాధ్యాయులు రిలీవ్ కావాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. మాతృసంస్థలకు తిరిగి వెళ్లాలని మూడేళ్ల కిందటే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. – కె.సంధ్యారాణి,కమిషనర్, పాఠశాల విద్య, ఏపీ -
రాజప్పకు చంద్రబాబు ఝలక్
-
పొరుగు నేతే పవర్ ఫుల్లా
♦ ‘కాకినాడ కదన సారథి’గా మంత్రి ప్రత్తిపాటి ♦ పార్టీ జిల్లానాయకుల్ని పక్కన పెడుతున్న చంద్రబాబు ♦ మొన్న ఎమ్మెల్యే వనమాడి, నేడు డిప్యూటీ సీఎం రాజప్ప ♦ ఆర్థిక మంత్రి యనమలకూ దక్కని ప్రాధాన్యం ♦ జీర్ణించుకోలేకపోతున్న జిల్లా ‘దేశం’ శ్రేణులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీ జిల్లానేతల సమర్థతపై నమ్మకం సడలింది. వారితో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలను గట్టెక్కలేమనుకుంటున్నారు. ఓటమి భయంతో వారిని పక్కన పెట్టేస్తున్నారు. హుటాహుటిన పొరుగు నేతలను రంగంలోకి దించుతున్నారు. నయానో, నజరానాలతోనూ కార్పొరేషన్‌ను దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే.. ఆయన తీరును స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బయటి వారొచ్చి ఇక్కడ ఏం చేస్తారని పెదవి విరుస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరికి కళ్లెం.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎన్నికల బాధ్యతల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా అధిష్టానం చూస్తోంది. ఎన్నికల్లో ఆయన వలన కలిసొచ్చేదేమీ ఉండదనే అభిప్రాయం కేడర్‌లో కూడా ఉంది. ఇక, పార్టీ పరువును మంట గలిపేశారన్న ఆలోచనతో పంపకాల్లోనే సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును వ్యూహాత్మకంగా పక్కన పెట్టేశారు. మంత్రుల ద్వారా ఎమ్మెల్యేకు చెక్ పెట్టారు. ఆ మంత్రుల్లో ఒకరైన డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్పకు తాజాగా షాక్ ఇచ్చారు. అవమానకర రీతిలో ఆయన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది. సీట్ల పంపకాల్లో అనుసరించిన ధోరణి పార్టీని కుదిపేయడంతో చినరాజప్పకు అసమ్మతి సెగ తాకింది. ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేశారంటూ అసంతృప్తివాదులంతా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు కాపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో పార్టీకి ఆశించినంత పట్టులేదు. ఇంకోవైపు సీట్ల పంపకాల్లో సమతూకం లేకపోవడంతో కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో చినరాజప్పను నమ్ముకుంటే కష్టమన్న అభిప్రాయంతో చంద్రబాబు ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలిసింది. ఆయన స్థానంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజప్ప ఇకపై వెనకుండి నడవడం తప్ప ముందుండి నడిపించే పరిస్థితి లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. కాకపోతే, ఎక్కడి నుంచో వచ్చినచ నేతలు ఇక్కడేం చేస్తారని, పార్టీ పరిస్థితి అలా తయారైందని కొందరు పెదవి విరుస్తున్నారు. -
ఉద్యోగులకు ఒక బకాయి డీఏ
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు వ్యతిరేకంగా రూపొందించిన ముసాయిదా జీఓలపై వెల్లువెత్తిన నిరసనను చల్లార్చేందుకు ఏపీ ప్రభుత్వం వారికి బకాయి డీఏల్లో ఒకటి చెల్లించాలని నిర్ణయించింది. సర్వీసు నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా రిటైర్మెంట్ వయసు తగ్గించడంతో పాటు ఉద్యోగులకు వ్యతిరేకంగా రూపొందించిన ముసాయిదా జీఓలను ‘సాక్షి’ బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో దాన్నుంచి తప్పించుకునేందుకు తక్షణం బకాయి పడిన రెండు డీఏల్లో ఒకటి మాత్రమే చెల్లించాలని నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం సీఎం బాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను మంత్రులు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఠి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకూ ఐదు డీఏలు ఇవ్వగా మరో రెండు డీఏలు బకాయి పడ్డాయి. వాటిలో ఒకదాన్ని చెల్లిం చేందుకు ఆమోదం. 2016 జనవరి 1 నుంచి 2017 ఆగస్టు 31 వరకూ బకాయి పడిన 20 నెలల డీఏను ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్లో వేసేందుకు అనుమతి. సెప్టెంబర్ నుంచి ఉద్యోగుల జీతాలతోపాటు ఈ డీఏ చెల్లిం చేందుకు ఆమోదం. ఇందుకు నెలకు రూ. 100 కోట్లు ఖర్చవుతుంది. ఠి అభ్యంతరాలు లేని ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని నిర్ణయం. ఒకటి నుంచి 100 చదరపు గజాల వరకూ బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ. ఏపీఎల్ కుటుంబాలకు 1–100 చదరపు గజాల వరకు 7.5 శాతం, 101–250 చదరపు గజాల వరకు 15 శాతం, 500 చదరపు గజాల వరకూ 30 శాతం ఫీజు వసూలు. 500 గజాలు దాటిన ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం. -
‘భూములిచ్చేయ్..లేకపోతే..’
► తొలకరి నాటికి రైతులకు తిరిగి ఇచ్చేయాలి ► లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం ► ప్రత్తిపాటిని హెచ్చరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చిలకలూరిపేట: ‘దళితుల భూములు కాజేయడానికి నీకెంత ధైర్యం. ఎవరి అండ చూసుకుని రెచ్చిపోతున్నావు. ఆక్రమించుకున్న భూములను తొలకరి సాగునాటికి రైతులకు తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తా’ అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఘాటుగా హెచ్చరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో భూముల అన్యాక్రాంతానికి నిరసనగా గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో మధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భూములు కాజేసేవారిని, ప్రోత్సహించేవారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు అండగా నిలవాల్సిన మంత్రి పుల్లారావు దళితులనే లక్ష్యంగా ఎంచుకుని భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. దర్జాగా కబ్జా చేస్తున్నారు దశాబ్దాల నుంచి సాగుచేసుకుంటున్న పచ్చని పంట పొలాలను గ్రానైట్ నిక్షేపాల పేరుతో దౌర్జన్యంగా, దర్జాగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తనకు సంబధం లేదని బుకాయిస్తున్న ప్రత్తిపాటి.. యడవల్లి దళతులకు చెందిన 416 ఎకరాల ఏకపట్టాను ఎందుకు రద్దు చేయించారని నిలదీశారు. వేలూరు గ్రామంలో 41.50 ఎకరాల దళితుల భూములను నీరు- చెట్టు పేరిట «ధ్వంసం చేసి రూ. 62 లక్షల మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. తూబాడులో 18 ఎకరాలు, అప్పాపురంలో 50ఎకరాలు ఇలా ఎటు చూసినా దళితుల భూములను లాక్కొని వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రమేయంతోనే ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వరుస రాజకీయ హత్యలు జరిగాయని మధు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరడం సబబేనన్నారు. -
ఈ ముఖ్యకార్యదర్శి వద్దు
సాక్షి, అమరావతి: పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిపై సిబ్బంది తిరుగుబాటు ప్రకటించారు. సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన ఆ అధికారి.. అయిన వాళ్లకు ఆకుల్లో, కానివారికి మూకుళ్లలో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై ఇటీవల బాధ్యతలు చేపట్టిన పశుసంవర్ధకశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయన్ని తక్షణమే తమ శాఖ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రమోషన్లు వస్తాయని భావించిన సిబ్బందికి ఆయన పట్టించుకోకపోవడం శాపంగా మారింది. ప్రమోషన్లు ఇవ్వమని ఇచ్చిన జీవో (నంబర్ 126, ఫైనాన్స్ 29/6/2016)ను అమలు చేయకుండా పాలనను కుంటుపరుస్తున్నారన్న విమర్శలున్నాయి. ట్రిబ్యునల్ ఆదేశించినా.. బేఖాతరు రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రమోషన్లపై ఆశతో చాలామంది అందరికంటే ముందే అమరావతి బాట పట్టారు. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రమోషన్లు వస్తాయని భావించారు. అయితే అప్పటి వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పి ఆయన పేషీలోని కొందరు లంచా లు డిమాండ్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఆగిపోయాయి. ఈ వ్యవహారం లో ప్రత్తిపాటికి ఓఎస్డీగా వ్యవహరించిన ఓ వ్యక్తి తన ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈలోపు మంత్రితో పైరవీలు చేయించుకున్న ఒకరిద్దరికి ఈ ఉన్నతాధికారి ప్రమోషన్లు ఇవ్వడం వివాదాస్పదమైంది. వారిలో ఒకరు డాక్టర్ కొండలరావు కాగా మరొకరు జి.సోమశేఖరం. కొండలరావు ఆరోగ్య కారణాల రీత్యా పశుసంవర్ధకశాఖ అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి తనకు సన్నిహితంగా ఉండే సోమశేఖరా న్ని అదనపు డైరెక్టర్‌ను చేసి చక్రం తిప్పుతున్నారు. వాస్తవానికి ఈ ప్రమోషన్ కె.కృష్ణమూర్తికి దక్కాల్సి ఉంది. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కృష్ణమూర్తికి ఇవ్వమని గత డిసెంబర్ 12న ఉత్తర్వులిచ్చింది. ఆ ఉన్నతాధికారి పట్టించుకోకుండా ప్రత్తిపాటిని ప్రసన్నం చేసుకునేందుకు సోమశేఖరానికి ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్లు ఎవరెవరికీ రావాలంటే ప్రమోషన్లు ఆశించి భంగపడిన సిబ్బంది తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ పనుల్ని జాప్యం చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారిలో 90 మంది డాక్ట ర్లు, 80 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 10 మంది డిప్యూటీ డైరెక్టర్లు.. ఎంతోమంది సిబ్బంది ఉన్నారు. ఈ విషయమై ఏపీ పశుసంవర్థకశాఖ అధికారుల సేవాసంఘం నేతలు గతంలో ఈ శాఖ మంత్రి ప్రత్తిపాటికి, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. -
పత్తి కుంభకోణంలో సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే
♦ పత్తి కొనుగోలు కుంభకోణం కేసు పక్కదారి ♦ విచారణ జరగలేదు.. చార్జిషీట్ పెట్టలేదు ♦ తెరవెనుక టీడీపీ పెద్దల మంత్రాంగం ♦ వివాదాస్పద ఫైలుపై మంత్రి ‘ఆది’ సంతకం ♦ నిందితులైన 26 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేత ♦ కాసుల బేరంలో భాగమేనంటున్న ఉద్యోగ వర్గాలు సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వందలాది కోట్ల రూపాయల పత్తి కొనుగోలు కుంభకోణంలో ఎలాంటి విచారణ జరపకుండానే టీడీపీ సర్కారు కేసును పక్కదారి పట్టించింది. సమయం చూసుకుని సర్కారు పెద్దలు పావులు కదిపారు. తెరవెనుక మంత్రాంగంతో చకచకా ఫైలు కొత్త మంత్రి టేబుల్ మీదకు వచ్చింది. సుమారు రూ.650 కోట్ల సీసీఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉన్నతాధికారులు సహా 26 మందిపై విధించిన సస్సెన్షన్ ఎత్తివేశారు. ఈ వివాదాస్పద ఫైలుపై వ్యవసాయ మార్కెటింగ్, పశు సంవర్థక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈనెల 12న తొలి సంతకం చేయడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఇదివరకటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మరెందరో ఉన్నతాధికారులపై ఆరోపణలు, సీబీఐ విచారణ, విజిలెన్స్ విభాగం పరిశీలన వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న ఈ ఫైలుపై కొత్త మంత్రి వచ్చీ రాగానే ఆగమేఘాలపై సంతకం చేయడం వెనుక పెద్ద కసరత్తే జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఫైలుపై మంత్రితో సంతకం చేయించారు. మంత్రి ప్రత్తిపాటిని వివాదం నుంచి బయట పడేసేందుకే ముఖ్యమంత్రి ఇలా చేశారని కొందరంటుండగా, ఇదంతా కాసుల బేరంలో భాగమేనని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదీ కుంభకోణం.. పత్తి కొనుగోళ్లకు సంబంధించి 2014 – 15లో పెద్ద ఎత్తున అవకవతకలు జరిగాయి. కేంద్రం ఆధీనంలోని సీసీఐ నోడల్ ఏజెన్సీగా రాష్ట్రంలోని మార్కెటింగ్ కమిటీలతో కలిసి కొనుగోళ్లను కొనసాగించింది. 2014 నవంబర్ 7న మార్కెటింగ్ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇది జరిగింది. నాసిరకం పత్తిని మంచి పత్తితో కలిపి సీసీఐ నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.4050తో కొనుగోలు చేయడం వల్ల దాదాపు రూ.650 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో తొలుత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ స్థాయిలో, తర్వాత రాష్ట్ర విజిలెన్స్ విభాగం ప్రాథమిక దర్యాప్తు చేశాయి. ఈలోగా సీబీఐ (సీసీఐ కేంద్ర సంస్థ కావడంతో) కూడా రంగంలోకి దిగి రాష్ట్రంలో ఎక్కడెక్కడ కొనుగోళ్లు జరిగాయో అక్కడ విచారణ చేసింది. సీసీఐ బయ్యర్లు, రాష్ట్ర మార్కెటింగ్ కమిటీల్లోని అధికారులు, కింది స్థాయి సిబ్బంది కలిసి రైతులకు దక్కాల్సిన సొమ్మును మింగేసినట్టు ఈ మూడు దర్యాప్తుల్లోనూ తేలింది. స్వతహాగా పత్తి వ్యాపారి అయిన ఆనాటి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా ఈ పాపంలో సింహభాగం ఉన్నట్టు నిఘా సంస్థలు ప్రభుత్వాధిపతికి రహస్య నివేదికలను అందించాయి. ఇందువల్లే ప్రత్తిపాటిని మరో శాఖకు మార్చారని సమాచారం. 96 మందికి చార్జి మోమోలు, 26 మందిపై సస్పెన్షన్ ఈ కుంభకోణంపై డిపార్ట్మెంట్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా మార్కెటింగ్ శాఖ గత ఏడాది 96 మందికి చార్జి మెమోలు జారీ చేసింది. వీరిలో నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు వై.రామమోహన్‌రెడ్డి, ఎస్.వెంకట సుబ్బన్న, కె.నాగవేణి, ఎ.రహమాన్ సహా 26 మందిని గత నవంబర్ 20, 21 తేదీలలో సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో విశాఖలోని సీబీఐ అధికారులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిందితులుగా పేర్కొన్న వారిలో సీసీఐ బయ్యర్లు ముగ్గురు, సీసీఐ బ్రాంచ్ మేనేజర్ ఒకరు, పది మంది మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఉన్నారు. చిత్రమేమిటంటే ఈ పది మందిలో ఇద్దర్ని మాత్రమే మార్కెటింగ్ శాఖ సస్పెండ్ చేసింది. మిగిలిన వారిని పట్టించుకోలేదు. సీబీఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన తర్వాత చార్జిషీట్లు వేయాల్సి ఉన్నా ఇంతవరకు అతీగతి లేదు. పక్కా ప్లాన్‌తో విచారణలో జాప్యం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగికి చార్జ్‌మెమో ఇచ్చిన తర్వాత 3 నెలలలోపు ఆ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలి. ఈ కేసులో చార్జ్‌మెమోలు అందుకున్న వారు తమ వివరణైతే ఇచ్చారు గాని దానిపై తదుపరి చర్య ఏమిటో ఇంతవరకు తేలలేదు. సస్సెండ్ చేసిన తర్వాత ఉద్యోగి ఇచ్చే సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని విచారణాధికారిని నియమించాలి. అభియోగ పత్రాల్ని మోపిన తర్వాత తీవ్రమైన ఆరోపణలు లేవని తేలితేనే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి. విచారణ తర్వాత దోషి అని తేలితే చర్య తీసుకోవాలి. ఇవేవీ జరక్కపోతే 6 నెలల లోపు సమీక్ష చేయాలి. ఈ కేసులో ఇలాంటివేవీ జరగలేదు. ప్రభుత్వం కావాలనే ఇంతవరకు విచారణ అధికారిని నియమించలేదు. లోతుగా దర్యాప్తు జరిపితే మంత్రి ప్రత్తిపాటి పాత్ర బయటపడుతుందనో లేక తమ వర్గానికి చెందిన పత్తి వ్యాపారులను కాపాడాలనో చంద్రబాబు ప్రభుత్వం విచారణ ముందుకు సాగకుండా జాప్యం చేసింది. దర్యాప్తు ఆలస్యం కావడం వల్ల ప్రత్తిపాటి పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలు లేకుండా చేసిందన్న విమర్శలూ ఉన్నాయి. మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 96 మందికి చార్జి మెమోలు ఇస్తే 26 మందినే సస్పెండ్ చేయడం వివక్ష అనేది ఉద్యోగుల వాదన. (ప్రభుత్వ భాషలో సెలక్టివ్ సస్పెన్షన్) వ్యాపారం చేసింది సీసీఐ వాళ్లని, వాళ్లు సంతకాలు చేసినందున రొటీన్‌గా తామూ చేశామని, ఇందులో తమకు దక్కిందేమీ లేదని మార్కెటింగ్ సిబ్బంది విజిలెన్స్ దర్యాప్తు సందర్భంగా రాత పూర్వకంగా చెప్పారు. రెగ్యులర్ విచారణ అధికారిని ఇంతవరకు ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ర్యాండమ్ పద్ధతిన తమను సస్పెండ్ చేసినప్పుడు ఆనాటి మంత్రిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా? అని నిలదీస్తున్నారు. విచారణ జరక్కుండా 6 నెలలకు మించి సస్పెన్షన్‌లో ఉంచడానికి వీలు లేదని, అందువల్లే సస్పెన్షన్లు రద్దయ్యాయని చెబుతున్నారు. సస్పెండ్ అయిన డెప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన ఎస్.వెంకట సుబ్బన్న హైకోర్టు నుంచి తీసుకువచ్చిన ఉత్తర్వులే మిగతా 25 మందిని కాపాడాయని భావిస్తున్నారు. తాను త్వరలో పదవీ విరమణ చేయనున్నందున తనను తిరిగి నియమించాలని కోరుతూ సుబ్బన్న కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులతో పాటు ఆంధ్ర, రాయలసీమ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం ఇచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం 26 మందిపై సస్పెన్షన్ ఉపసంహరించాలని నిర్ణయించిందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వివరించారు. అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నందున వీరు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండదని, పని అప్పగించకుండా సస్పెన్షన్‌లో ఉంచి జీతాలు ఇవ్వడం ఖజానాపై భారం అని భావించి సస్పెన్షన్ ఎత్తివేసిందన్నారు. తప్పు చేసినట్లు తేలితే ఉరితీయండి కడప కార్పొరేషన్: మార్కెటింగ్ శాఖలో సస్పెండ్ అయిన 26 మందికి తిరిగి పోస్టింగులు ఇచ్చిన వ్యవహారంలో తాను తప్పుచేసినట్లు తేలితే ఉరి తీయాలని మార్కెటింగ్, పశు సంవర్థక శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. శనివారం వైఎస్ఆర్ జిల్లా కడపలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సస్పెండ్ అయి తిరిగి పోస్టింగ్స్ తీసుకున్న ఉద్యోగుల ముఖం కూడా తాను చూడలేదన్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ తనతో చర్చించారన్నారు. ఊరికే జీతం ఇవ్వడం సరికాదనే ఉద్దేశంతో వారికి పోస్టింగులు ఇచ్చామన్నారు. అవి జనరల్ పోస్టింగ్స్ కాదని లూప్లైన్లో వేశామని చెప్పుకొచ్చారు. -
ఏపీ వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు
అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2017-18) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. అమరాతిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తమది ఇది రైతు రక్షణ ప్రభుత్వం అని చెప్పారు. రైతుల కోసం తొలిసారిగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించామన్నారు. దేశంలో తొలిసారిగా బయోమెట్రిక్ ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యవసాయ దారుల ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త విత్తన చట్టం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కర్నూలు జిల్లాలో మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు చొరవ తీసుకున్నామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ తమ ప్రభుత్వానికి మరో ప్రాధాన్య అంశమన్నారు. 50 నుంచి 75 శాతం రాయితీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యవసాయంలో రెండు అంకెల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బడ్జెట్ లో ముఖ్యాంశాలు మొత్తం వ్యవసాయ బడ్జెట్ రూ. 18,214 కోట్లు ప్రణాళిక వ్యయం రూ. 11,070 కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ.4,355 కోట్లు వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 9,091 కోట్లు సమగ్ర సాగునీటి, వ్యవసాయ రూపాంతీకరణకు రూ. 1600 కోట్లు కరువు నివారణకు రూ. 1100 కోట్లు పండ్ల తోటల పెంపకానికి రూ. 1015 కోట్లు ఆయిల్ ఫామ్ తోటల విస్తరణకు రూ. 55 కోట్లు సూక్ష్మ సేద్యానికి రూ. 200 కోట్లు రైతులకు విద్యుత్ సబ్సిడీ రూ. 3300 కోట్లు పంటల బీమాకు రూ. 269 కోట్లు వడ్డీలేని రుణాలకు రూ. 172 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 147 రైతుబంధు పథకానికి రూ. 18 కోట్లు పొలం పిలుస్తోంది కార్యక్రమానికి, చంద్రన్న రైతు క్షేత్రాల విస్తరణకు రూ. 17 కోట్లు పావలా వడ్డీకి రూ. 5 కోట్లు సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయానికి రూ. 25 కోట్లు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి రూ. 308 కోట్లు సహకార రంగానికి రూ. 174 కోట్లు సుస్థిర దిగుబడి, నీటి సంరక్షణకు రూ. 10 కోట్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 156.85 లక్షల టన్నులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14 శాతం వృద్ధి పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2.85 శాతం పెరుగుదల బొప్పాయి ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానం చేపల, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానం మొక్కజొన్న, మినుముల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానం మామిడి, టమాటా ఉత్పత్తిలో రెండో స్థానం మాంసం ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానం పాల ఉత్పత్తిలో దేశంలో ఐదో స్థానం ఉద్యాన పంటల నాణ్యత పెంచేందుకు కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం నదుల అనుసంధానం ద్వారా పది లక్షల ఎకరాలకు నీరు కొత్తన విత్తన చట్టానికి రూపకల్పన -
లక్ష్మి అరెస్టుకు ఆదేశించాం: ప్రత్తిపాటి
మెడికల్ స్టూడెంట్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్, డాక్టర్ లక్ష్మిని అరెస్ట్ చేయాలని ఎస్పీని ఆదేశించినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్యారాణి ఆత్మహత్య కేసులో చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య ఘటనతో సమ్మె కొనసాగిస్తున్న మెడికోలో ఆందోళన విరమించి విధుల్లో చేరాలని మంత్రి సూచించారు. లక్ష్మీలావణ్య కోల్డ్ స్టోరేజ్ ప్రమాదంపై ప్రత్యేక కమిటితో విచారణ చేపడతామని పుల్లారావు పేర్కొన్నారు. మూడు నెలల్లో బాధిత రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెడికో సంధ్యారాణి తన డైరీలో రాసి సూసైడ్ చేసుకుంది. కాగా, ప్రొఫెసర్ ఏవీవీ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు మరోసారి స్పష్టంచేశారు. నిన్న (శుక్రవారం) కూడా జూడాలు లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రి చుట్టూ ర్యాలీ నిర్వహించారు. గతంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మి వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. డాక్టర్ లక్ష్మి తన పలుకుబడిని తట్టుకోలేక సదరు ప్రొఫెసర్ బదిలీ చేయించుకొని వెళ్లారని, నేడు లక్ష్మి వేధింపులపై సాక్ష్యం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
కేసు మాఫీ కోసం ఏపీ మంత్రికి రూ. కోటి!
పత్తి కొనుగోళ్ల కుంభకోణంలో 64 మంది అక్రమార్కుల గుర్తింపు ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా నాన్చుతున్న మంత్రి అక్కడ తొక్కిపెట్టేందుకే నిధుల సేకరణ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల కుంభకోణంలో అక్రమార్కులుగా నిర్ధారణ జరిగిన వారు ఆ కేసు నుంచి బయటపడేందుకు కోటి రూపాయలకు పైగా వసూళ్లు చేసి సంబంధిత మంత్రికి సమర్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అక్రమార్కులంతా గుంటూరులోని ఒక హోటల్లో సమావేశమై నిధుల సేకరణ వ్యవహారాన్ని చర్చించినట్టు తెలిసింది. వీరిలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉద్యోగులు, అధికారులు కూడా ఉన్నారు. మార్కెటింగ్ శాఖలో పదవీ విరమణ చేసిన ఇద్దరు అధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పత్తి అక్రమ కొనుగోళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, మార్కెటింగ్ శాఖలు ఇచ్చిన నివేదికలు, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేషీకి చేరుకున్న ఫైళ్లపై చర్చించినట్టు తెలిసింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఎంతైనా ఖర్చు చేయాలని వారంతా ఏకాభిప్రాయానికి వచ్చారని, ముందస్తుగా కోటి రూపాయలను ఒకటి రెండు రోజుల్లో సమీకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రూ. 700 కోట్ల కుంభకోణం 2014–15లో జరిగిన పత్తి కొనుగోళ్లలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలు ప్రాథమికంగా గుర్తించిన విషయం విధితమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి అక్రమ కొనుగోళ్లలో ప్రమేయమున్న పర్చేజింగ్ ఆఫీసర్లు, ఇతర అధికారులను దేశ వ్యాప్తంగా బదిలీ చేసి నష్ట నివారణ చర్యలు తీసుకుంది. అయితే రాష్ట్రంలో 43 మార్కెట్ యార్డుల్లో, 64 మంది అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, మార్కెటింగ్ శాఖలు నివేదికలు ఇచ్చినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అప్పట్లో పత్తి అక్రమ కొనుగోళ్లలో మంత్రి పుల్లారావు అనుచరులు, ఆయన కంపెనీల్లో పనిచేసిన ఉద్యోగులు క్రియాశీలంగా వ్యవహరించారని, వీరందరినీ రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే ఆరోపణలు బాహాటంగా వినపడ్డాయి. ఇవన్నీ వాస్తవాలేనన్నట్టుగా ప్రస్తుతం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికితోడు మంత్రి పుల్లారావును ఈ విషయమై మీడియా ప్రశ్నిస్తే, తనకు ‘ఆ ఫైల్ వస్తే కదా చర్యలు తీసుకునేది’ అంటూ దాటవేత ధోరణిలో సమాధానం ఇస్తున్నారు. ఆ కేసులోని కొందరు అక్రమార్కులు మంత్రి ఇంటి చుట్టూ, కార్యాలయం చుట్టూ తిరుగుతున్న విషయాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. మంత్రి పేషీకి చేరిన ఫైల్‌ను కోల్డ్ స్టోరేజ్‌లో పడేసేలా చేయడానికి ఈ కోటి రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. -
'మంత్రి పుల్లారావుకు దళితులంటే చులకన'
గుంటూరు : గుంటూరు జిల్లా ఎడవల్లిలోని రైతులు భూములు టీడీపీ ప్రభుత్వం లాక్కోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పి.పుల్లారావుకు దళితులంటే చులకన భావం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. అందుకే వారి భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని మంత్రిపై ఆయన మండిపడ్డారు. రూ. 5 వేల కోట్ల మైనింగ్ కోసం వందలాది దళిత కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు కూడా మంత్రికి వత్తాసు పలకడం దుర్మార్గం అని ఆయన పేర్కొన్నారు. దళితులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం ఎంతదాకా నైనా పోరాడతామని మేరుగ నాగార్జున వెల్లడించారు. -
ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంస్థకు రూ. 7 వేల కోట్లు రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పంట తోటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. రుణమాఫీ పెండింగ్ బకాయిలను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చిరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో రూ. 24 వేల కోట్ల రుణాలును మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆయన స్పష్టం చేశారు. -
మంత్రికి ఆహ్వానమే లేదట
టీడీపీలో వర్గ వివక్ష మంత్రి పీతల సుజాతను పట్టించుకోని ఓ వర్గం నేతలు జగ్జీవన్‌రామ్ జయంతి నాడు బట్టబయలైన విభేదాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మాటలనే ఆ పార్టీలోని ఓ వర్గం నేతలు స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దళిత బాంధవుడు, మాజీ ఉపప్రధాని జగ్జీవన్‌రామ్ జయంతి రోజున ఆ పార్టీలోని వర్గ నేతల కుల వివక్షాపూరిత రాజకీయాలు బట్టబయలయ్యాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏకైక మంత్రి, దళిత వర్గానికి చెందిన పీతల సుజాతను ఏమాత్రం పట్టించుకోకుండా, కనీస ఆహ్వానం పంపించకుండా రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ ఈనెల 5న జిల్లాలో పర్యటించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గ పరిధిలో మంగళవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ప్రత్తిపాటి, కామినేని పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ 109వ జయంతి రోజునాడు దెందులూరు మండలం కొవ్వలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, పెదవేగి మండలం లక్ష్మీపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డు భవనాలకు శంకుస్థాపన తదితర కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఆ ఇద్దరు మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మితోపాటు కలెక్టర్, ఆర్డీవో పాల్గొన్నారు. ఇంతమంది ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమాలకు జిల్లాకే చెందిన పీతల సుజాత గైర్హాజరుపై పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పీతల సుజాతకు ఆహ్వానమే లేదట ఆ కార్యక్రమాలకు సంబంధించి మంత్రి పీతల సుజాతకు ఎటువంటి ఆహ్వానాలూ అందలేదని తెలుస్తోంది. అందుకే మంగళవారం ఆమె జిల్లాలోనే ఉన్నప్పటికీ వేర్వేరుచోట్ల జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలకు మాత్రమే పరిమితమైన సుజాత ఆ ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు వెళ్లలేదని అంటున్నారు. ఆ రోజు దెందులూరు మీదుగానే ఆమె చింతలపూడి వెళ్లినా కనీస సమాచారం లేనందువల్లే ఆయా కార్యక్రమాలకు హాజరు కాలేదని తెలుస్తోంది. మంత్రి పీతల ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి.. దెందులూరుకు పొరుగునే ఉన్నప్పటికీ ఆమెను ఆహ్వానించకపోవడంపై పార్టీలోని దళిత వర్గాలు గుర్రుగా ఉన్నాయని సమాచారం. ఇక గోపాన్నపాలెంలో ఓ పీహెచ్సీ ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకంపై మంత్రి సుజాత పేరును అడుగున వేయించడం కూడా వివాదాస్పదమవుతోంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతా మేమే అన్నట్టు హల్చల్ చేస్తున్న ఓ వర్గ నేతలు ఉద్దేశపూర్వకంగానే దళిత సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాతను అవమానిస్తున్నారన్న వాదనలు బయలుదేరాయి. జిల్లాలో ఇటీవల కాలంలో సాగుతున్న వివక్షాపూరిత వర్గ రాజకీయాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని పార్టీలోని దళిత నేతలు నిర్ణయించినట్టు సమాచారం. -
కొన్నవి చూపిస్తే పేదలకు పంచుతాం
♦ సాక్షిలో అవాస్తవాలు రాస్తున్నారు ♦ పత్రిక ఎండీ, ఎడిటర్, ప్రమోటర్లు, విలేకరిపై పరువు నష్టం దావా ♦ భూదురాక్రమణ కథనాలపై మంత్రులు నారాయణ, పుల్లారావు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో తాము భూములు ఎక్కడ కొన్నామో చూపిస్తే వాటిని పేదలకు పంచుతామని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సాక్షి పత్రికలో తమపై కావాలని బురద జల్లుతున్నారని ఆరోపించారు. సాక్షి పత్రికలో బుధవారం ప్రచురితమైన భూదురాక్రమణ కథనాలపై మంత్రులు సీఎం కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ.. రాజధానిలో ఏ లావాదేవీ జరిగినా లోకేశ్‌బాబుకు, తనకు, నారాయణకూ సంబంధం ఉందంటున్నారని, ఇలాగైతే పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లలో జగన్ పాత్ర ఉందని అనాల్సివస్తుందన్నారు. రాసిన వ్యక్తుల్లో ఎవరికి భూములున్నా సాక్షి మేనేజ్మెంట్కు రాసిస్తామని చెప్పారు. ఈ కథనాలు రాసిన సాక్షి ప్రమోటర్, ఎండీ, ఎడిటర్, వార్త పంపిన విలేకరిపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. తప్పుడు వార్తలు రాయడం, దానిపై బొత్స సత్యనారాయణ వంటి నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. పత్రిక, చానల్ ఉంది కదా అని అవాస్తవాలు రాస్తే పత్రికలను ఏంచేస్తున్నారో చూస్తున్నారుగా అంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. నారాయణ మూడు వేల ఎకరాలు కొన్నాడని ఎవరెవరి పేర్లో చెబుతున్నారని, రాజారెడ్డి, పుల్లారెడ్డి తన బినామీలంటున్నారని, ఇంతవరకూ రాజారెడ్డి పేరే తాను వినలేదన్నారు. సూటిగా సమాధానం చెప్పని పుల్లారావు లింగమనేని ఎస్టేట్స్‌తో క్విడ్‌ప్రోకో జరగడం వాస్తవం కాదా అని విలేకరులు ప్రశ్నించగా పుల్లారావు నేరుగా స్పందించకుండా క్విడ్‌ప్రోకో చర్రిత జగన్‌దేనన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఇలా రాస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. బాలకృష్ణ వియ్యంకుడి కోసం సీఆర్డీఏ పరిధిని జగ్గయ్యపేట వరకూ విస్తరించడం వాస్తవం కాదా అని విలేకరుల ప్రశ్నించగా ఒకరి కోసం డిజైన్ మార్చే పరిస్థితి ఉందంటూనే మళ్లీ పాత విషయాలపై మాట్లాడారు. మంత్రి రావెల కిషోర్‌బాబు తన భార్య పేరు మీదే భూములు కొన్న విషయాన్ని ప్రస్తావించగా దానికి సమాధానం చెప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరపత్రిక మంత్రివర్గంపై ఇలా బురద జల్లుతోందని ఆరోపించారు. సాక్షి కథనాలను ఖండించడానికి ఆవేశంగా మీడియా పాయింట్ వద్దకొచ్చిన మంత్రులు నారాయణ, పుల్లారావు తమ భూముల గురించి లోతుగా ప్రశ్నలు అడిగితే నీళ్లు నమిలారు. ఆశ్చర్యం కలిగించాయి: నారాయణ మంత్రి నారాయణ మాట్లాడుతూ సాక్షిలో వచ్చిన కథనాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని, నిజాలు తెలుసుకుని రాయాలని సూచించారు. ఏదో రకంగా రాజధానిని అడ్డంగించాలని ప్రయత్నించి కోర్టులో కేసులు వేయించారని, రైతుల్ని రెచ్చగొట్టారని అయినా రాజధాని నిర్మిస్తుండడంతో ఓర్వలేక ఇలా బురద జల్లుతున్నారని ఆరోపించారు.తాను మూడు వేల ఎకరాలు ఎక్కడ కొన్నానో చూపిస్తే పేదలకు పంచేస్తానన్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇచ్చే విషయంలో అవకతవకల గురించి ప్రశ్నించగా నిబంధనల ప్రకారమే అంతా చేశామన్నారు. -
రైతు నేతలతో ఏపీ మంత్రుల రహస్య చర్చలు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంలో ఏపీ మంత్రులు పర్యటిస్తున్నారు. రైతు నేతలతో రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ రహస్య చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలన్నీ వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినట్టు సమాచారం. జేసీ శ్రీధర్్ను సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా నియమిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాక ఆందోళనలు చేయెద్దని రైతు నేతలకు వారు హితవు పలికినట్టు సమాచారం. -
'రుణమాఫీ వడ్డీతో సహా ఫిబ్రవరిలో చెల్లిస్తాం'
కర్నూలు : రెండో విడత రుణమాఫీ వడ్డీతో సహా ఫిబ్రవరిలో చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం కర్నూలు వచ్చిన పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో సీడ్ హబ్ కోసం 500 ఎకరాలు కేటాయించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 397 కరువు మండలాలు గుర్తించామని పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. -
'అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకగా కొన్న మంత్రి'
-
పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ ఆరోగ్యంపై మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చెవిరెడ్డి సోమవారం తిరుపతిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం దమ్ముంటే రాజీనామా చేయాలని మంత్రులిద్దరికి సవాల్ విసిరారు. సదరు మంత్రులిద్దరికీ మత్రి భ్రమించిందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తమ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు 67 మంది రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నామని చెవిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. సోమవారం ఆయన చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. అయితే వైఎస్ జగన్ ఆరోగ్యంపై చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ సోమవారం ఆరోపణలు చేశారు. దీంతో చెవిరెడ్డి భాస్కరరెడ్డి పైవిధంగా స్పందించారు. -
'అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకగా కొన్న మంత్రి'
గుంటూరు: అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కారుచౌకగా కొన్నారని వైఎస్సార్ సీపీ నేతలు మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా తన భార్య పేరుతో అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రతిపాటి కొనుగోలు చేశారని, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోటప్పకొండ ప్రక్కనే ఉన్న బలిజేపల్లిలో 15 ఎకరాలు, చీమకుర్తిలో 20 ఎకరాలు మంత్రి కొన్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి భూముల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు చేయించకుంటే తామే దస్తావేదులు బయటపెడతామన్నారు. -
'తల్లిదండ్రుల వైఖరి మారాలి'
గుంటూరు : విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు పేరెంట్స్ వైఖరి మారాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఒత్తిడి లేని విద్యావ్యవస్థ, కాలేజీ యాజమాన్యాల తీరుపై మంత్రులు గుంటూరు పట్టణంలో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ యాజమాన్యాల కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టలేమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రత్తిపాటి అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వంతో పాటు కాలేజీ యాజమాన్యాలూ కారణమేనన్నారు. ఒత్తిడిలేని విద్యావ్యవస్థ కోసం అందరూ ప్రయత్నించాలని మంత్రులు పేర్కొన్నారు. విద్యార్థులకు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించడంపై విద్యాసంస్థలు దృష్టిపెట్టాలని మంత్రి ప్రత్తిపాటి సూచించారు. రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత ప్రభుత్వం పూర్తిస్థాయిలో విద్యావ్యవస్థపై దృష్టిసారించిందన్నారు. -
పండగలా జరిపిస్తాం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన పండగలా జరిపిస్తామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. గురువారం విజయవాడలో విలేకర్ల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీతోపాటు లక్ష మంది రాజధాని శంకుస్థాపనలో పాల్గొంటారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూమిలిస్తున్న రైతులకు ఇన్విటేషన్ ఇస్తామన్నారు. అంతేకుండా వారికి పట్టు వస్త్రాలు ఇచ్చి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. -
మంత్రి వ్యాఖ్యలపై దుమారం
మంగళగిరి: సీఆర్డీఏ పరిధిలోని డిప్యూటీ కలెక్టర్లను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు సీఆర్డీఏ అధికారుల్లో దుమారం లేపుతున్నాయి. ఈనెల 26న గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో మంత్రి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు గ్రామకంఠాలపై నిలదీయడంతో మంత్రి.. ప్రభుత్వానికి తెలియకుండా డిప్యూటీ కలెక్టర్లే గ్రామకంఠాల జాబితాలను ప్రకటించారని, మా రైతులు మంచివారు కాబట్టి ఊరుకున్నారని, లేకుంటే డిప్యూటీ కలెక్టర్లను చెట్టుకు కట్టివేసి కొట్టేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఒక డిప్యూటీ కలెక్టర్ కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయనట్టు సమాచారం. మంత్రి వ్యాఖ్యలపై సీఆర్డీఏ అధికారులు తమ సంఘ సమావేశంలో.. మంత్రులు చెప్పినట్లు తాము సహకరిస్తున్నా రైతుల మెప్పుకోసం తమను కించపరచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు మూకుమ్మడి సెలవు పెట్టి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. -
'రాహుల్ గాంధీది ఐరన్ లెగ్'
హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ ది ఐరన్ లెగ్ అని, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఖాళీ అవుతుందని దుయ్యబట్టారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో జరిగిన ఆత్మహత్యలు గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలన్నారు. తమను విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్ధిని చూడలేకే తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. -
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా
కాకినాడ: వలలు, పడవలు నష్టపోయిన మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు వెల్లడించారు. బుధవారం కాకినాడలో సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ప్రతిపాటితోపాటు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, ప్రతిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. వేటకు వెళ్లిన ప్రతి మత్స్యకారుడు తమ బోట్లకు తప్పనిసరిగా డాట్ మిషన్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి సూచించారు. -
డిపాజిట్లు కోల్పోయారు.. మమ్మల్ని ఎలా విమర్శిస్తారు?
కొరిటెపాడు(గుంటూరు) : సాధారణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన రఘువీరారెడ్డికి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శనాస్త్రాలు గుప్పించారు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అభినందించి సలహాలు, సూచనలు అందించాలే కానీ, అడ్డుకోవటం సరికాదన్నారు. గుంటూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 125 ఏళ్ల చరిత్ర అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకూడా గెలవలేదని, దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. స్వార్ధరాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాని నిర్ధాక్షిణంగా విభజించారని, ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధిరాలేదని విమర్శించారు. రాష్ట్రం రూ.16,500 కోట్లు లోటు బడ్జెట్ వున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం పూర్తి చేశామని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్ ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆపరేషన్ నుంచి తప్పించుకోలేవని అన్నారని, అదే ఆపరేషన్ చేశారని పుల్లారావు ఎద్దేవా చేశారు. -
'హైదరాబాద్ లో ఆధార్ ఉన్నా రుణమాఫీ'
హైదరాబాద్: పంట రుణాల మాఫీ వ్యవహారంపై ఇప్పటివరకు 3 లక్షల ఫిర్యాదులు అందాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రుణమాఫీ సమస్యలు, సాంకేతిక లోపాలపై సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ఆధార్ కార్డు ఉంటే ఇక్కడున్న వారికి కూడా రుణమాఫీ వరిస్తుందని చెప్పారు. అయితే ఏపీలో ఓటు హక్కు కలిగి వుండాలని స్పష్టం చేశారు. కాగా, రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. -
ఏం తమాషా చేస్తున్నావా?
-
ఏం తమాషా చేస్తున్నావా?
విజయవాడ: బెజవాడ కనకదుర్గ దేవాలయం ఈవో నర్సింగరావుపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిప్పులు చెరిగారు. దాదాపు రూ. 25 లక్షల విలువైన బంగారు పాదుకలు కనకదుర్గ అమ్మవారికి సమర్పించేందుకు శ్రీ మిత్ర హౌసింగ్ చైర్మన్ ఎం వి చౌదరి ఆదివారం దుర్గమ్మ గుడికి విచ్చేశారు. ఆయనతోపాటు టాలీవుడ్ హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు మంత్రి ప్రతిపాటి పుల్లారావు కూడా వచ్చారు. అయితే అదే సమయానికి ఈవో నర్సింగరావు ఆలయంలో అందుబాటులో లేరు. దాంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీఐపీలు వస్తున్నారని సమాచారం అందించిన ఈవో ఎక్కడికెళ్లాడంటూ మంత్రి పుల్లారావు దేవాలయం సిబ్బందిపై మండిపడ్డారు. మంత్రి దేవాలయానికి వచ్చారన్న వార్త తెలుసుకున్న ఈవో వెంటనే దేవాలయానికి వచ్చారు. ఆయన్ని చూస్తూ పుల్లారావు ఆగ్రహంతో ఊగిపోయారు. వీఐపీలు వస్తున్నారని సమాచరం ఉండి కూడా నీవు బయటకు ఎలా వెళ్లావంటూ ప్రశ్నించారు. ఏం తమాషాలు చేస్తున్నావా అంటూ ఈవో నర్సింగరావుపై మండిపడ్డారు. -
'జూన్ 2 పై విమర్శలు చేయడం తగదు'
హైదరాబాద్: జూన్ 2వ తేదీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ... వైఎస్ఆర్ సీపీ ప్రతిదాన్ని వివాదం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. జూన్ 2న అవతరణ దినం కాదనలేమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన రోజు కాబట్టి ఉత్సవాలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నామన్నారు. నవంబర్ 1, అక్టోబర్ 1 రోజుల్లో ఎం చేయాలన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం మాని నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ప్రత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా ప్రతిపక్షానికి సూచించారు. -
ప్రత్యేక హోదా వస్తే... నవ్యాంధ్రకు వెలుగు వస్తుంది
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం గుంటూరు నగరంలోని స్థానిక స్తంభాలగరువులో ఓ ప్రైవేట్ కార్యక్రమాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90శాతం నిధులు వస్తాయని, దీంతో నవ్యాంధ్రప్రదేశ్‌కు వెలుగు వస్తుందని రాష్ట్రప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. యూపీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ముందు చూపు లేకుండా రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. విభజన చట్టంలో పొందుపరచకుండా నోటి మాటగా హామీ ఇచ్చిందని, దీని వల్ల ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. రాజధానిలో మార్పు లేదు రాజధానిని కృష్ణాజిల్లాకు మారుస్తున్నారా అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ.. భూసేకరణలో భాగంగా రైతుల నుంచి 33వేల ఎకరాలు గుంటూరు జిల్లాలో సేకరించామన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలను మహానగరాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. రాజధాని మార్పు ప్రసక్తే లేదని పుల్లారావు స్పష్టం చేశారు. -
అన్నా వచ్చి ఏంచేస్తారు?
- మీడియాతో మంత్రి ప్రత్తిపాటి, కుటుంబరావు హైదరాబాద్: అంతా అయిపోయాక రాజధాని ప్రాంతంలో సామాజిక ఉద్యమనేత అన్నా హజారే వచ్చినా ఏం లాభం లేదని, రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆయనొచ్చి ఏం చేస్తారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. మేథాపాట్కర్, అన్నా హజారేలు రాజధాని ప్రాంతానికి రావడం వల్ల భూముల రేట్లు పడిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు తమ భూములకు ఏడాదికి కౌలు తీసుకున్నారని, ఇప్పటికి రూ.20 కోట్లు కౌలు కింద చెల్లించామని తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో కలిసి మంత్రి పుల్లారావు గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో రైతులు కూడా తమకు భూ సమీకరణ చేపట్టాలని కోరుతున్నారని, భూ సమీకరణ కృష్ణా జిల్లాలో జరపడం లేదని బాధ పడుతున్నందునే అక్కడ కూడా సమీకరణ చేపడుతున్నామన్నారు. రుణమాఫీపై రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈనెల 27 (సోమవారం) నుంచి మే 15 వరకు అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు చెప్పారు. జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఫిర్యాదులను కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు పంపి పరిష్కారానికి సచివాలయంలోని హెచ్ బ్లాకులో 40 మందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వారు వివరించారు. రుణమాఫీకి సంబంధించి 53 లక్షల ఖాతాల్లో నిధులు జమ చేసినట్టు చెప్పారు. 53 లక్షల రైతులకు రుణమాఫీ లేఖలు పంపుతామని, అలాగే పంచాయతీల్లో ఎంత రుణం మాఫీ అయ్యిందో జాబితాలు, హోర్డింగులు పెడతామన్నారు. రుణమాఫీ బాండ్లను కూడా డిజైన్ చేస్తున్నామని, సీఎం చంద్రబాబు పరిశీలన తర్వాత రైతులకు బాండ్లు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ కోసం 80 వేల ఫిర్యాదులు వచ్చాయని, వీటిల్లో 14వేలకు పైగా ఈ - మెయిల్ రూపంలో వచ్చాయన్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు 13 వేల ఖాతాల్లో నిధులు జమ చేశామని, మరో 8 వేల ఖాతాల పరిశీలన జరుగుతోందని, 16 వందల ఖాతాలకు రేషన్‌కార్డులు లేవన్నారు. అయితే రెండు రోజుల్లోగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. బ్యాంకు మేనేజర్ల సస్పెన్షన్‌కు సిఫారసు : కుటుంబరావు బ్యాంకుల్లో తప్పుల వల్లే చాలా ఖాతాలకు నిధులు వెళ్లడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. బ్యాంకుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రతి రోజూ తమ దృష్టికి వస్తున్నాయని, ఆయా బ్యాంకుల మేనేజర్ల సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తామన్నారు. రాజధాని ప్రాంతం ధాన్యాగారం కాదన్నారు. ఈ వ్యవహారమై శివరామకృష్ణన్ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందన్నారు. రాజధాని ప్రాంత భూముల్లో రకరకాల పంటలు పండిస్తారనడంలో అర్థం లేదని, అంత సారవంతమైన భూములైతే రైతులు ఎందుకిస్తారని ఎదురు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, కడప, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తప్ప మిగిలిన ప్రాంతాల నుంచే రుణమాఫీ ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని కుటుంబరావు వివరించారు. -
రివర్స గేర్ !
ఈ చిత్రం చూశారు కదా.. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ట్రాక్టరుతో పంట పొలాలను దున్నేస్తున్నారు. ఆయన స్టీరింగ్ పట్టింది వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కాదు సుమా.. బంగారం పండే పచ్చని పంట పొలాల్లో కాంక్రీట్ జంగిల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఎక్కడైనా వ్యవసాయ మంత్రి ఖరీఫ్, రబీ పనుల్లో రైతులకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, పవర్స్ప్రేయర్ల వినియోగంతో లాభాలు, యాంత్రీకరణకు నిధుల కేటాయింపు, సబ్సిడీ వంటి వివరాలు వెల్లడి స్తారు. దేశంలో ఏ వ్యవసాయ మంత్రయినా ఆ తరహా చిత్రాల్లో కనిపించిన వారే. అయితే ఇక్కడ మాత్రం వ్యవహారం అందుకు పూర్తి భిన్నం. రాజధాని నిర్మాణంలో తన బాధ్యతలకు భిన్నంగా ప్రత్తిపాటి రివర్స్ గేర్ వేశారు. ఇనుప నాగళ్లతో పంట పొలాల్ని దున్నేశారు. సరిహద్దు గట్లను సైతం తొలగించేశారు. దేశంలో మరే వ్యవసాయ మంత్రికి ఎదురుకాని సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు వెనుకంజ వేసినా తప్పనిసరి పరిస్థితుల్లో స్టీరింగ్ పట్టాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. -సాక్షి ప్రతినిధి, గుంటూరు -
'ఆక్వా కల్చర్ రాజధానిగా విజయవాడ'
హైదరాబాద్: చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మత్య్య పరిశ్రమను వృద్ధికారకంగా గుర్తించామన్నారు. చేపల ఉత్పత్తికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. విజయవాడను ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా చేస్తామని హామీయిచ్చారు. మత్య్సకారుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడతామన్నారు. బడ్జెట్ లో మత్స్యశాఖకు రూ.187 కోట్లు కేటాయించారు. -
రైతు కుటుంబాలకు పరిహారం పెంపు
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. లక్షలోపు రుణాలకు వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల లోపు రుణాలు పావలా వడ్డీ ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. పావలా వడ్డీ రుణాలకు రూ.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మొదటి దశ రుణమాఫీకి 40.50 లక్షల ఖాతాలకు రూ.4,689 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. రెండో దశ కింద 42.16 లక్షల ఖాతాలకు రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. -
ఉచిత విద్యుత్ కు నిధుల కోత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో ఉచిత విద్యుత్ పథకానికి భారీగా నిధులు కోత పెట్టారు. గతేడాది పోలిస్తే కేటాయింపులు భారీగా తగ్గించారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు.ఈసారి బడ్జెట్ లో ఉచిత విద్యుత్ కు రూ. 3,000 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ లో పోలిస్తే ఇది రూ.188 కోట్లు తక్కువ. -
ఉద్యాన శాఖకు రూ. 210 కోట్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో ఉద్యాన శాఖకు రూ. 210 కోట్లు కేటాయించారు. ఉద్యాన అభివృద్ధి మిషన్ కు రూ. 100 కోట్లు కేటాయించినట్టు వ్యవసాయ మంత్రి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. వైఎస్ఆర్ హార్టీకల్చర్ రూ. 53.01 కోట్లు.. బిందు, తుంపర్ల సేద్యానికి రూ.144 కేటాయించారు. ఉద్యావన పంటలను ఎక్కువ విస్తీర్ణంలో పండించేందుకు ప్రోత్సాహం అందిస్తామని మంత్రి హామీయిచ్చారు. శీతల గిడ్డంగులు, గ్రీన్ హౌస్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యావన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. -
పశుసంవర్ధక శాఖకు రూ. 672.73 కోట్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో పశుసంవర్ధక శాఖకు 672.73 కోట్లు కేటాయించారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 124.48 కోట్లు కేటాయించినట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. మత్స్యశాఖకు రూ. 187 కోట్లు కేటాయించారు. -
అన్నదాత సంక్షేమమే లక్ష్యం: ప్రత్తిపాటి
-
ఆత్మహత్య కుటుంబాలకు ఆర్ధిక సాయం
-
అన్నదాత సంక్షేమమే లక్ష్యం: ప్రత్తిపాటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16ను శాసనసభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాటాడుతూ.. లోకానికి వెలుగు నిచ్చేది సూర్యుడయితే.. ప్రజలకు తిండిపెట్టేది పచ్చసూర్యుడు అని వ్యాఖ్యానించారు. అన్నదాత సంక్షేమానాకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతికూల వాతావణం వ్యవసాయం రంగానికి పెద్ద సమస్యగా మారిందన్నారు. తగినంత మౌలికసదుపాయాలు లేనికారణంగా రైతులు తమ ఉత్పత్తులను తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. అవరోధాలను అన్నింటినీ తొలగించి అన్నదాతలకు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్నదాతల ముఖాల్లో వెలుగు చూసేందుకు తమ సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. -
'ప్రకాశం, గుంటూరు రెండు కళ్లులాంటివి'
బొబ్బేపల్లి (మార్టూరు): తనను మంత్రిని చేసిన గుంటూరు, సొంత జిల్లా అయిన ప్రకాశం తనకు రెండు కళ్లులాంటివని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. సంక్రాంతి సందర్భంగా పుల్లారావు స్వగ్రామమైన బొబ్బేపల్లిలో గురువారం నిర్వహించిన ఎద్దుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సంప్రదాయాలు ప్రతిబింబంచేలా పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఇప్పటికే రూ.4200 కోట్లు రుణమాఫీ కింద బ్యాంకుల్లో మొదటి విడత కింద జమ చేశామన్నారు. అనంతరం మార్టూరు తేదేపా నాయకుడు తొండెపు ఆదినారాయణ పుల్లారావుకు నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, జేసీ హరిజవహర్, ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావు,తహశీల్ధార్ సుధాకర్, ఎంపీడీవో సింగయ్య, మార్టూరు వ్యవసాయశాఖాధికారి వెంకటకృష్ణ, పీడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు మస్తానయ్య, యడ్ల పందేల నిర్వాహకుడు పెంట్యాల శరత్‌బాబు, నాయకులు పాల్గొన్నారు. -
అరాచకం
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి అరాచకం రాజ్యమేలింది. కొందరు గుర్తుతెలియని దుండగులు పచ్చని పొలాల్లో నిప్పుపెట్టారు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక, తుళ్లూరు మండలం వెంకటపాలెం, లింగాయపాలెం, మందడం గ్రామాల్లో యథేచ్ఛగా సాగించిన దహనకాండలో మొత్తం 13 చోట్ల సోమవారం తెల్లవారు జాము వరకు అరటి తోటలు, రైతుల షెడ్లు, డ్రిప్ పరికరాలు, ఎరువులు, వెదురు బొంగులు దగ్ధమయ్యాయి. నష్టం అంచనా రూ.లక్షల్లో ఉన్నా దుండగుల దుశ్చర్యతో ఆయా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనతో ఇకపై ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం రైతులను వెంటాడుతోంది. రాజధాని కోసం ప్రతిపాదించిన గ్రామాలు కావడంతో ఇక్కడి భూములు లాక్కునే చర్యల్లో భాగంగానే భయాందోళనలు సృష్టించేందుకే తెలుగుదేశం పార్టీ పంపిన రౌడీమూకలు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాయని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ సంఘటనపై అసందర్భంగా వ్యాఖ్యానించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపైనా పెనుమాకలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు : రాజధాని గ్రామాల్లో యథేచ్ఛగా కొనసాగిన దహనకాండపై ముందు వెనుకా చూసుకోకుండా వ్యాఖ్యానించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతుల కోపాన్ని చూడాల్సి వచ్చింది. తొలుత దగ్ధమైన ప్రాంతాలను పరిశీలించకుండానే ‘‘సంఘటన వెనుక వైసీపీ హస్తం ఉంది’’ అని చిలకలూరిపేటలో మాట్లాడి ఆ తరువాత పెనుమాక గ్రామానికి చేరుకున్న మంత్రి రైతుల ఆగ్రహాన్ని చవి చూశారు. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మధ్యాహ్నం వరకు సంఘటనా స్థలానికి వెళ్లకుండా ఏం చేస్తున్నారని మందలించినట్టు సమాచారం. వెంటనే అక్కడకు వెళ్లి ప్రతి గంటకు సమాచారం తనకు తెలియజేయాలని సీఎం ఆదేశించడంతో మంత్రి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి ఆరా... సంఘటన జరిగిన తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయమే జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ లింగాయపాలెంలో ఉన్న సమయంలో ఫోన్ రావడంతో అక్కడ మధు అనే రైతుతో ముఖ్యమంత్రితో మాట్లాడించారు. అనంతరం పెనుమాకలో ఉన్న మంత్రి పుల్లారావుకు సీఎం ఫోన్ చేశారు. ఈ సందర్భంలో అక్కడి పరిస్థితిని పుల్లారావు, కలెక్టర్, ఎమ్మెల్యేలు వివరించారు. సాయంత్రం లోపు దోషులను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలోఉన్న డీజీపీకి సీఎం ఫోన్ చేసి కేసును స్వయంగా దర్యాప్తు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ నేతల సందర్శన సంఘటన జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కత్తెర క్రిస్టీనా సందర్శించి సంఘటన జరిగిన తీరు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల్లో భయాందోళనలు సృష్టించేందుకు దుండగులు ఓ పక్కా ప్రణాళిక ప్రకారం చేపట్టిన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దుండగుల కోసం పోలీసుల గాలింపు... రాజధాని గ్రామాల్లో పొలాలకు, రైతుల షెడ్లుకు నిప్పుపెట్టిన దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. డీజీపీ స్వీయ పర్యవేక్షణలో అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్, రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలోనే ఉండి నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. పోలీసు జాగిలాలను సైతం రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
'స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కొత్త విషయం కాదు'
హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ యాంత్రీకరణ, పంటల మార్పిడి విధానాలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గిట్టుబాటు ధర కోసం ఈ-మార్కెటింగ్ విధానం తీసుకొస్తామన్నారు. మార్కెటింగ్ కోసం నిపుణులతో కన్సల్టెన్సీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఉద్యోగుల కేలండర్ ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నట్టు చెప్పారు. రుణమాఫీలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నది కొత్త విషయం కాదని, 1973 నుంచి ఆర్ బీఐ అమలు చేస్తోందన్నారు. -
నామినేటెడ్ శిరోభారం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నామినేటెడ్ పోస్టుల భర్తీ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలకు తలనొప్పిగా పరిణమించింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గాల వారీగా ఆశావహుల వివరాలను తీసు కోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుకు సూచించారు. దీనిపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ కూడా చేయడంతో నియోజకవర్గాల్లో ఆశావహుల హడావుడి ప్రారంభమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడప్పుడూ మంత్రులు ప్రత్తిపాటి, రావెల కిషోర్, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీని కలుస్తున్నారు. మంత్రుల కంటే కోడెల, జీవీలను కలిసే ఆశావహుల సంఖ్య అధికంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన నేతల్లో ఎక్కువ మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కోరుతున్నారు. ఆయా కార్పొరేషన్ పదవుల పరిధి, ప్రాధాన్యత, ఆదాయ వ్యయాల వివరాలను సేకరిస్తున్నారు. మరి కొందరు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవసరమైన ఖర్చు పెట్టుకోగలమని చెబుతూ ఎమ్మెల్యేలు, ఇతర నేతల మద్దతు కోరుతున్నారు. ద్వితీయశ్రేణి నాయకులు మార్కెట్ కమిటీ, దేవాలయాల కమిటీ చైర్మన్ పదవులను కోరుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందిన గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం పార్టీలోని పలువురు సీనియర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కంచేటి శివప్రసాద్, మన్నవ సుబ్బారావు, మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాస యాదవ్ తదితరులు ఆశిస్తున్నారు. వీరంతా చిరకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారు. జిల్లాలోని మిగిలిన నామినేటెడ్ పోస్టుల కంటే మార్కెట్‌యార్డు చైర్మన్ పదవికి అత్యధిక ప్రాధాన్యం ఉండటంతో తమ వర్గానికి ఈ పదవి దక్కాలనే ఉద్దేశంలో పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరి కొందరు ఆ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజా మాస్టారు, చందు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ ఈ పదవి కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా వీలైతే కార్పొరేషన్ లేకుంటే ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు. జిల్లా మంత్రులు, శాసన సభ్యుల సహకారం కోరుతూ టచ్‌లో ఉంటున్నారు. మరి కొందరు రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్న ‘క్రీడా’ (సీఆర్డీఏ)లో సభ్యునిగా నామినేట్ అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్న వాతావరణం పార్టీలో కనపడుతోంది. జిల్లాలోని మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ పదవులు, దేవాలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ పదవులను నియోజకవర్గ స్థాయి నాయకులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వీరంతా ముఖ్య భూమిక వహిస్తున్నారు. శాసన సభ్యుల సిఫారసులతోపాటు పార్టీకి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో ప్రస్తుత సభ్యత్వ నమోదులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండటంతో ఈ కమిటీ పదవులను ఆశిస్తున్న నేతలంతా సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొంటున్నారు.ఇప్పటి వరకు జిల్లాలో ఆరు లక్షల వరకు సాధారణ సభ్యత్వ నమోదు జరగడానికి కూడా నామినేటెడ్ పదవుల భర్తీ కూడా ఒక కారణమనే అభిప్రాయం పార్టీలో వినపడుతోంది. -
కౌలు రైతులకే తొలి ప్రాధాన్యత:ప్రత్తిపాటి
-
మంత్రి నియోజకవర్గంలో అరాచకం
చిలకలూరిపేట: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో ఆరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. పార్టీ కార్యాలయం లో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ప్రత్తిపాటి అరాచకాలకు వ్యతిరేకంగా, అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు అందజేయాలని కోరుతూ శుక్ర, శనివారాల్లో నరసరావుపేట సెంటర్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 20వ తేదీ సాయంత్రం ఎన్ఆర్టీ సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వైఎస్సార్ సీపీకి మద్దతు పలికారన్న కోపంతో స్థానిక కేబుల్ నెట్వర్కలో 20ఏళ్లుగా ఉన్న వాటాలను బలవంతంగా లాక్కొని భాగస్వాములను బయటకు నెట్టేశారని విమర్శించారు. ప్రైవేటు వ్యాపారాలు చేసుకొనే వారిపై కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారన్నారు. ఒక్కొక్క కనెక్షన్ విలువ నాలుగు వేల రూపాయలు ఉంటుందని మొత్తం రెండు కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి కల్పించారన్నారు. వీరిని బయటకు నెట్టివేసి, కేబుల్ కనెక్షన్లు పీకివేసి, ప్రసారాలు నిలిపివేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రికి కేబుల్ టీవీలో 50 శాతం వాటా ఇవ్వడానికి, మరెవరూ ఈవిషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి ప్రశ్నించేవారిపై ఆరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రేషన్‌డీలర్లు, మధ్యాహ్నభోజన నిర్వాహకులు, అంగన్వాడీలను తొలగించారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా కేబుల్ విషయంలో గాని, ఇతర ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రెండు రోజుల పాటు జరిగే రిలే దీక్షల్లో పార్టీ శ్రేణులు, బాధితులు తరలిరావాలని కోరారు. కేబుల్ ఆపరేటర్ సాలేహ మాట్లాడుతూ తాను 2002 నుంచి ఐదుగురు మిత్రులతో కలిసి కేబుల్ ఆపరేటర్‌గా కొనసాగుతున్నానని, తనకు హెడ్ఆన్లో ఉన్న 15పైసల వాటాను ఇటీవల తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఆపరేటర్ విడదల కమలేంద్ర మాట్లాడుతూ 2000 సంవత్సరం నుంచి కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, 13ఏళ్లపాటు టీడీపీలో పనిచేసి ఎన్నికలకు ముందుకు వైఎస్సార్ సీపీలో చేరడం వల్లే కేబుల్‌లో తన వాటా లాక్కొన్నారని వివరించారు. సమావేశంలో కేబుల్ ఆపరేటర్ నర్సిరెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ ఏవీఎం సుభాని, నాయకులు బైరావెంకటకృష్ణ, కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
వ్యవసాయ శాఖమంత్రి సొంత జిల్లాలో రైతు ఆత్మహత్య
గుంటూరు: రైతుల మృత్యుఘోష ఆగడం లేదు. తన పేరు రుణమాఫీ జాబితాలో లేదని ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులో గురువారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం పాతగణేశునిపాడుకు చెందిన మురారి అనే రైతు ఆత్మహత్యక పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తన పేరు రుణమాఫీ జాబితాలో లేదని మనస్తాపం చెందిన ఆ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అన్నదాత అభ్యున్నతికి కట్టుబడ్డాం: ప్రత్తిపాటి
అనంతపురం: వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హార్టికల్చర్ ద్వారా వ్యవసాయ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడివుందని స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వ్యవసాయంపై విధానపత్రం తయారు చేశామని చెప్పారు. అనంతపురం జిల్లా గరుడాపురంలో 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. -
వారం, పది రోజుల్లో రుణమాఫీ: ప్రత్తిపాటి
విజయనగరం: వారం, పది రోజుల్లో వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి తొలి విడత నగదు విడుదలచేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విజయనగరం జిల్లా గంటియాడ మండలం పెదవేమని గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. విత్తనశుద్ధి కేంద్రంతో పాటు చీపురుపల్లి వెటర్నరీ కాలేజీ, వెటర్నరీ పాలిక్లినిక్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీయిచ్చారు. -
ఇద్దరు ఏపీ మంత్రులకు తప్పిన ముప్పు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మంత్రులకు ప్రాణాపాయం తప్పింది. మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు.. రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు-ఉప్పలపాడు రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మంత్రులు క్షేమంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డంతా బురదగా ఉండడంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు బురదగా మారాయి. -
మంత్రి పుల్లారావు ఇంటిని ముట్టడించిన రైతులు
-
మంత్రి పుల్లారావు ఇంటిని ముట్టడించిన రైతులు
గుంటూరు : శనగలకు మద్దతు ధర కల్పించాలని ప్రకాశం జిల్లా రైతులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావును డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని పుల్లారావు నివాసాన్ని శనగ రైతులు ముట్టడించారు. జిల్లాలో దాదాపు 17 లక్షల క్వింటాళ్ల శనగలు శీతల గిడ్డంగుల్లో మగ్గిపోతున్నాయని వారు పుల్లారావుకు ఈ సందర్భంగా వివరించారు. 20 రోజుల కిత్రం సీఎం చంద్రబాబును కలసి పరిస్థితి వివరించామని ఆయన ఫలితం లేకపోయిందని వారు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శీతల గిడ్డంగుల్లోని శనగలను వేలం వేస్తామని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి పుల్లారావు... 15 రోజుల వరకు వేలాన్ని నిలిపివేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. -
'ఎవరేమన్నా... రాజధాని అక్కడే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు ఎక్కడ అనే విషయంలో ఎలాంటి గందరగోళం లేదని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం అసెంబ్లీ లాబీలో పుల్లారావు మాట్లాడుతూ... శివరామకృష్ణన్ కమిటీ మరో చోట రాజధాని అని నివేదిక ఇచ్చిన విజయవాడ - గుంటూరు నగరాల మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయం సీఎం చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారన్నారు. నూతన రాజధాని ఏర్పాటుపై విభిన్న ప్రకటనలు చేయొద్దని పుల్లారావు సహాచర మంత్రులకు హితవు పలికారు. రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చూసుకుంటారని పుల్లారావు వెల్లడించారు. ఏపీ రాజధానిని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య వ్యవసాయ భూములు ఉన్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేయవద్దని ప్రొ. శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. నూతన రాజధాని ఏర్పాటుకు మార్టురు - వినుకొండ అత్యంత అనుకూలమని పేర్కొంది. దాంతో ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీ లాబీలో కమిటీ నివేదికపై చర్చించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న యనమల మాట్లాడుతూ... వినుకోండ అయితే ఇబ్బందే అన్నారు. దోనకొండ అయితే ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. నివేదిక వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికే అధిక ప్రాధాన్యత ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. అయితే కమిటీ నివేదికపై గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు ఇప్పటికే విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఏర్పాటవుతుందని ఎప్పటి నుంచో ప్రకటించారు. దీంతో ఆ రెండు నగరాల మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందని ఆ జిల్లాల ప్రజాప్రతినిధులు ఆనందంతో ఉన్నారు. మార్టురు - దొనకోండ వద్ద రాజధానికి అనుకూలమంటూ శివరామకృష్ణకు కమిటీ తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో అసెంబ్లీ లాబీలో ఏపీ రాజధాని ఏర్పాటుపైనే చర్చ సాగుతుంది. -
రుణ మాఫీ ఎప్పుడో చెప్పలేం : ప్రత్తిపాటి
సాక్షి,హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణమాఫీని వీలైనంత త్వరలో అమలు చేస్తామని, అయితే ఎప్పటిలోగా చేస్తామనే విషయం స్పష్టంగా చెప్పలేమని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక వనరుల కమిటీ రెండు నెలల్లో దీనిని ఒక దశకు తెస్తామని సూత్రప్రాయంగా చెబుతోంది. ఈలోగా కట్టగలిగే స్తోమతున్న రైతులు కట్టేస్తే వారికి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ విషయంలో మాకు సాయం చేయాలని కేంద్రానికి ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఒత్తిళ్లవల్ల వెనుకడుగు వేస్తోంది. అంతమాత్రాన వారిని తప్పుపట్టలేం. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఆదుకుంటుందనే నమ్మకం మాకుంది’’ అని మంత్రి చెప్పారు. -
నివేదిక వచ్చిన తర్వాతే రుణమాఫీ: పుల్లారావు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు శనివారం హైదరాబాద్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 55 శాతం భూమి మాత్రమే సాగులోకి వచ్చిందని వెల్లడించారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కోరత లేకుండా చూస్తామన్నారు. నిధుల సేకరణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రుణమాఫీని అమలు చేస్తామని పుల్లారావు స్పష్టం చేశారు. -
సాగర్ జలాలకు దారేది ?
చిలకలూరిపేటరూరల్, న్యూస్‌లైన్: ప్రకృతి ప్రకోపం ఓ వైపు, పాలకుల నిర్లక్ష్యం మరోవైపు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమైన తరుణంలో వరుణుడు ముఖం చాటేయడంతో సాగర్ జలాలపై ఆశలు పెట్టుకున్నారు. పొలాల్లో విత్తనాలు నాటి సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. సాగర్ కుడి కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొంటుంటే చివరి భూములకు నీళ్లు అందుతాయో లేదోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెన్నార్ మేజరు కాలువలో పూడికతీత పనులు పూర్తికాకపోవడమే ఇందుకు కాణమని చెపుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలోనే సాగునీటి కాలువల దుస్థితి ఇలా ఉందంటున్నారు. వివరాల్లోకి వెళితే... ►సాగర్ కాలువల ఆధునికీకరణ పనుల్లో భాగంగా టెన్నార్ మేజర్‌లో కాంట్రాక్టర్ రెండేళ్ల కిందట జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేపట్టారు. అనంతరం పూర్తిస్థాయిలో ►పూడికతీత లేకపోవటంతో తిరిగి కాలువ పరీవాహక ప్రాంతంలో జమ్ము, అడవి తుమ్మచెట్లు విస్తారంగా పెరిగాయి. ఈ తరుణంలో సాగర్ నీటిని విడుదల చేసినా ఆయకట్టు చివరి భూములకు చేరేనా అని రైతులు సంశయిస్తున్నారు. ►టెన్నార్ మేజర్ కాలువ ఆధునికీకరణ పనులను 52వ ప్యాకేజి కింద 21.08 కిలోమీటర్లు నిర్వహించాలని నిర్ణయించారు. ►మండలంలోని కట్టుబడివారిపాలెం, యడవల్లి, మద్దిరాల, పోతవరం, కమ్మవారిపాలెం, పోలిరెడ్డిపాలెం, కోండ్రుపాడు, కావూరు, లింగంగుంట్ల తదితర గ్రామాలకు టెన్నార్ మేజర్ కాలువ ద్వారా 36 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. టెన్నార్ మేజర్‌ను డీసీ-1, డీసీ-2ల పేరుతో రూ.15 కోట్లకు టెండర్లు పిలిచారు. ప్రభు త్వానికి కాంట్రాక్టర్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2015 జూలై లోపు కాలువ పనులు పూర్తిచేయాలి. ►కాలువ పరిధిలోని మైనర్, మేజర్ మరమ్మతులతోపాటు పైప్లైన్ల రీప్లేస్మెంట్ పనులను నిర్వహించాలి. కాలువల్లో పూడిక తీసి ఇరువైపులా కరకట్టలను పటిష్టపరచాలి. ►ఇందుకు విరుద్ధంగా పనులు జరుగుతుండడంతో 2012 జూలై ఆరవ తేదీన అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కమ్మవారిపాలెం గ్రామం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. ►నాటి నుంచి నేటి వరకు పనులు అంగుళం మేర కూడా ముందుకు జరగలేదు. ►రెండేళ్ల క్రితం నామమాత్రంగా జంగిల్ క్లియరెన్స్ చేసి వదిలేశారు. నేడు తిరిగి కాలువ పరీవాహక పరిధిలో విస్తారంగా జమ్ము, అడవి తుమ్మ చెట్లు పెరిగాయి. ►రెండేళ్ల నుంచి జంగిల్ క్లియరెన్స్, లెవలింగ్, సాధారణ పూడికతీత పనులు చేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ►కాలువ పరీవాహక ప్రాంతంలో ఉన్న షట్టర్లు, అప్టేక్లు, డ్రాప్‌లు, కల్వర్టుల్లో పాతవాటిని తొలగించి అదే స్థానంలో నూతన నిర్మాణాలు పూర్తి చేయాలి. ►సంబంధిత కాంట్రాక్టర్ పట్టీపట్టనట్లు వ్యవహరించడం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో కాలువ పరిధిలోని వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఎర్రచందనం అమ్మితే వచ్చేది రూ.2వేల కోట్లే
ఏపీ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం మొత్తం అమ్మితే కేవలం రూ.2వేల కోట్లే వస్తుందని, ఇది రుణమాఫీకి సరిపోదని, వనరుల కోసం ప్రత్యామ్నాయాలపై కమిటీ కసరత్తు చేస్తోందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల రుణమాఫీ అమలు చేసేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందన్నారు. రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా బ్యాంకులు సహకరించడం లేదన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రైతుల రుణమాఫీపై తొలి నుంచీ వ్యతిరేకంగానే ఉందని ఆయన చెప్పారు. -
'అది చంద్రబాబు ఆలోచన'
హైదరాబాద్: ఏపీలో గిడ్డంగుల నిర్మాణానికి రూ. 250 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్రం నుంచి ఎరువుల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. 4.15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వసామర్థ్యాన్ని పెంపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉందన్నారు. 2.59 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు చెప్పారు. రైతులకు ఐపాడ్లు ఇవ్వాలన్నది సీఎం ఆలోచన అని మంత్రి చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులను చైతన్యపరిచేందుకు ఈ ప్రతిపాదన చేశారని వివరించారు. త్వరలో ఉపాధిహామీకి వ్యవసాయరంగాన్ని అనుబంధం చేసి రైతులకు రూ.5 వేల పెట్టుబడి తగ్గిస్తామన్నారు. -
రెండు నెలలకే మాపై విమర్శలా? వైఎస్ జగన్‌పై మంత్రుల వ్యాఖ్యలు
వైఎస్ జగన్‌పై మంత్రుల వ్యాఖ్యలు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా గడవక ముందే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తమపై విమర్శలు చేయడం ఏమిటని పలువురు మంత్రులు దుయ్యబట్టారు. జగన్ రుణమాఫీకి వ్యతిరేకి అని, ఆయనకు దీనిపై విమర్శించే హక్కు లేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ భారం తగ్గించుకోవడం కోసం ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రైతు రుణాలను మాఫీ చేస్తున్న తమ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. రుణమాఫీతో రైతులు పండుగ చేసుకుంటున్న తరుణంలో సీఎం దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని జగన్ అనటం పిల్ల చేష్టలని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. -
'మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పలేదు'
హైదరాబాద్: వ్యవసాయ రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రూ. లక్ష కోట్ల రుణాలు మాఫీ అనలేదని చెప్పారు. 43 లక్షల మందికి రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. బంగారం రుణాల్లో చాలా మంది వ్యాపారం కోసం తీసుకున్నవారున్నారని పేర్కొన్నారు. రూ. 24 వేల కోట్ల టర్మ్ లోన్ల మాఫీ అవసరం లేదని తేల్చిచెప్పారు. రైతులపై పడ్డ 12 శాతం వడ్డీ భారాన్ని తమ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. -
అక్షయపాత్ర, మంత్రదండం లేవు
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 40 రోజుల్లో హామీలన్నీ నెరవేరాలంటే ఎలా? 5 ఎకరాల లోపు రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు భూసార పరీక్షలకు ప్రాధాన్యం గుంటూరు : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 40 రోజుల్లోనే నేరవేర్చాలంటే తమ వద్ద అక్షయపాత్ర, మంత్రదండాలు లేవని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాల మాఫీ అసాధ్యమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారని, సాధ్యమని మేమంటున్నామని, దాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారన్నారు. 40 రోజుల్లోనే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి విఫలమయ్యారన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీకి 168 సీట్లు వస్తాయంటున్నారని, ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న ఎమ్మొల్యేలనే కాపాడుకొనే శక్తి వారికి లేదన్నారు. చంద్రబాబు 40 రోజుల్లోనే పాలనను గాడిలో పెట్టారని, విద్యుత్ కోతలు తగ్గించారని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతు రుణమాఫీపై తగ్గబోమని, త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు. ఐదేళ్లలో అన్ని హామీలను నెరవేరుస్తామని, కాంగ్రెస్, వైస్సార్సీపీలు నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళిక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా పడ్డం దున, ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, రైతుల్లో చైతన్యం కోసం ప్రత్యేక శిక్షణ తరగుతులు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం మరో నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాలను కేటాయించిందన్నారు. పంట దిగుబడి పెరగడానికి ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి ఏ పోషక పదార్థం లోపిస్తే దాన్ని వంద శాతం సబ్సిడీ తో రైతుకు అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్లు ఖర్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తంచేశారన్నారు. భూసార పరీక్షలు, పోషకాలకు కేంద్రాన్ని రూ.500 కోట్లు అడిగామని, కొంత మేర సహాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు వ్యవసాయాధారిత, అనుబంధ పరిశ్రమలు ఎగుమతులను ప్రొత్సహిస్తామన్నారు. వ్యవసాయ యూనివర్సిటీని గుంటూరులోని లాంఫామ్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. దీని కోసం కేంద్రం రూ. 50 కోట్లు కేటాయించిందన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రొత్సహిస్తామన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు సమకూరుస్తామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే ఇందుకోసం కేంద్రం నుంచే రూ. 340 కోట్లు వస్తాయనీ, దీనికి మరికొన్ని నిధులు కలిపి దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. చేపల ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నందున, హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు తరహాలో రాష్ట్రంలో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు. -
బంగారం రుణాలూ మాఫీ: ప్రత్తిపాటి పుల్లారావు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాలతో పాటు బంగా రం రుణాలు కూడా మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూసేందుకు 13 జిల్లాల్లోని వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లతో మం త్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొన్ని జిల్లాల్లో విత్తనాలు, ఎరువులు కొరత ఉన్నట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని ఒకటి రెండు రోజుల్లో ఆ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. పంట రుణాలు ఎప్పటిలోగా మాఫీపై మరో 15 రోజు ల్లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పంట రుణాలతో పాటు బంగారం రుణాలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ సహకారం కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 25న ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోడీని కలుస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేసినా రుణ మాఫీయే అవుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రీ షెడ్యూల్ చేసిన రుణాలను రైతులు చెల్లించాల్సిన అవసరం లేదని సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో చెప్పారు. రీ షెడ్యూల్ చేసిన రుణాలు రైతుల పేరు మీద ఉంటాయా? ప్రభుత్వం పేరు మీద ఉంటాయా? అని అడిగిన ప్రశ్నకు యనమల సమాధానం దాటవేశారు. -
'నివేదిక వచ్చిన తర్వాతే రుణమాఫీ'
హైదరాబాద్: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వ్యవసాయశాఖ జేడీలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయశాఖ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీల ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కోటయ్య కమిటీ ఇంకా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వలేదని, నివేదిక వచ్చిన వెంటనే రైతులకు పంట రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. -
'బంగారం వేలంపాటలను ఆపమని కోరాం'
-
'బంగారం వేలంపాటలను ఆపమని కోరాం'
హైదరాబాద్: పంట రుణాల వసూలు చర్యలు నిలిపేయలేమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు బ్యాంకర్లు తేల్చిచెప్పారు. రైతులకు నోటీసులు, బంగారం వేలంపాటలను ఆపలేమని స్పష్టం చేశారు. పంటల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. రుణమాఫీ ఏ సంవత్సరం నుంచి వర్తిస్తుందో చెప్పలేదని అన్నారు. ఈ మధ్యాహ్నం చంద్రబాబుతో బ్యాంకర్లు సమావేశమయ్యారు. రుణమాఫీపై విస్తృతంగా చర్చించారు. సర్కారు తకరారు ధోరణిని ఈ సమావేశంలో బ్యాంకర్లు ప్రస్తావించారు. రైతులకు నోటీసులు జారీ, బంగారం వేలంపాటలను ఆపమని కోరామని, అది సాధ్యంకాదని బ్యాంకర్లు చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీపై స్పష్టత ఇస్తేనే నోటీసులు ఆపుతామన్నారని వెల్లడించారు. ఈ నెల 22 తరువాత రుణమాఫీపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం రుణమాఫీకి అంగీకరించడంలేదని వాపోయారు. కాని హామీని అమలుచేస్తామని చెప్పారు. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి కూడా న్యాయం చేయాలనే అలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు. -
రుణమాఫీపై అపోహలొద్దు: ప్రత్తిపాటి
వినుకొండ: తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుల రుణమాఫీ జరుగుతుందని, దీనిపై అపోహ పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక ఈ నెల 22న వస్తుందన్నారు. అన్ని రకాల వ్యవసాయ రుణాలు, గోల్డ్ లోన్స్ మాఫీ చేస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు వినుకొండ అనుకూలమైన ప్రాంతమని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కల్పిస్తే నిధులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా రైతుకు మేలు జరుగుతుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తేనే ప్రమోటర్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మార్కెటింగ్ శాఖ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలిపారు. -
ప్రతి కులానికి రూ.10 లక్షల పంపిణీ
గుంటూరు: చిలకలూరిపేటలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి కులానికి రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేశారని ఎన్నికల అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వినుకొండలో టీడీపీ అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలపై విచ్చలవిడిగా కరపత్రాల అంటించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.