
పరిశ్రమల పేరుతో అస్మదీయులకు రాష్ట్ర ప్రభుత్వం విలువైన భూములను కారుచౌకగా కేటాయిస్తోంది.
సాక్షి, అమరావతి: పరిశ్రమల పేరుతో అస్మదీయులకు రాష్ట్ర ప్రభుత్వం విలువైన భూములను కారుచౌకగా కేటాయిస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన కంపెనీకి దాదాపు 7 ఎకరాల భూమి కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి భార్య వెంకాయమ్మ డైరెక్టర్‌గా ఉన్న గుంటూరు టక్స్‌టైల్ పార్క్ లిమిటెడ్‌కు గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం గోపాలవారిపాలెంలో 6.96 ఎకరాలను కేటాయించింది.
ఎకరం కేవలం రూ.5 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య పలుకుతోంది. అంటే రూ.3.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.35 లక్షలకే కట్టబెట్టేశారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఇలా కావాల్సిన వారికి అత్యంత తక్కువ ధరకే కేటాయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.