land allotted
-
స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి
అమరావతి: శారదా పీఠంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడే పీఠం అడిగినప్పుడు స్థలం ఇవ్వడంలో తప్పేంటని టీడీపీ నేతలను ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్, చంద్రబాబు ప్రభుత్వాలలో కూడా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. కొన్నెళ్ల క్రితం చిన్నజీయర్ సంస్థ కి భూములు కేటాయించాం.. ఇప్పుడు శారదా పీఠంతో పాటు గణపతి సచ్చిదానంద స్వామి ట్రస్ట్ కి కూడా ఇస్తున్నామని తెలిపారు. కాగా, చంద్రబాబు హయాంలో మాత్రం.. రాయపాటి, నారా లోకేష్ లకు అప్పనంగా భూములు ఇచ్చారని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మం కాపాడే పీఠానికి భూములు ఇస్తుంటే టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి మీడియా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని అన్నారు. ఇలానే వ్యవహరిస్తే హిందువులు ఆంధ్రజ్యోతి ని బహిష్కరిస్తారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. చదవండి: అమిత్ షాను కలిసిన ఎంపీ గోరంట్ల మాధవ్ -
మంత్రి ప్రత్తిపాటి భార్యకు భూ నజరానా
సాక్షి, అమరావతి: పరిశ్రమల పేరుతో అస్మదీయులకు రాష్ట్ర ప్రభుత్వం విలువైన భూములను కారుచౌకగా కేటాయిస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన కంపెనీకి దాదాపు 7 ఎకరాల భూమి కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి భార్య వెంకాయమ్మ డైరెక్టర్‌గా ఉన్న గుంటూరు టక్స్‌టైల్ పార్క్ లిమిటెడ్‌కు గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం గోపాలవారిపాలెంలో 6.96 ఎకరాలను కేటాయించింది. ఎకరం కేవలం రూ.5 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య పలుకుతోంది. అంటే రూ.3.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.35 లక్షలకే కట్టబెట్టేశారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఇలా కావాల్సిన వారికి అత్యంత తక్కువ ధరకే కేటాయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ కుటుంబాల గుప్పిట్లోనే 'తెలుగు సినీ పరిశ్రమ'
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. తెలంగాణ నిర్మాతలు, కళాకారులకు సీని పరిశ్రమలో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు రెండు వేల ఎకరాలు కేటాయిస్తామన్న.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫిలింనగర్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో చిత్ర పరిశ్రమకు చెందిన వారి నిర్మాణాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఐటీసీకి భూముల కేటాయింపు రద్దు చేయాలి
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: ఐటీసీ విస్తరణ కోసం బూర్గంపాడు మండలంలో 1/70 చట్టానికి విరుద్ధంగా చేసిన భూ కేటాయింపులను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం సుంవరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ పరిశ్రమ నెలకొల్పాలని కోరారు. భూముల కేటాయింపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకుంటే ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీసీకి 837 ఎకరాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గతంలో ఇచ్చిన భూమి కంటే ఐటీసీ అదనంగా భూమి కబ్జాచేసి వినిమోగించుకుంటోందని ఆరోపించారు. కనీసం పంచాయతీకి పన్ను కూడా చెల్లించడం లేదన్నారు. ఒప్పందం ప్రకారం స్థానికులకు, గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని చెప్పారు. 1500 మంది కార్మికులుంటే అందులో గిరిజనులు 1 శాతం కుడా లేరన్నారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారికి కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం అమలు చేయాలని కోరితే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఐటీసీ నుంచి వెలువడే కాలుష్యంతో బూర్గంపాడు, కుక్కునూరు, భద్రాచలం మండలాల్లో అత్యధిక మంది మహిళలు గర్భకోశ, క్యాన్సర్ వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పారు. కాలుష్య నివారణ విషయంలో ఐటీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.